తిరా ఈవెంట్‌ : ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ, ఇషా: ఇక బ్యాగ్స్‌ అయితే! | Tira Beauty launch Nita and Isha Ambani quirky bags steal the spotlight | Sakshi
Sakshi News home page

తిరా ఈవెంట్‌ : ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ, ఇషా: ఇక బ్యాగ్స్‌ అయితే!

Nov 14 2024 3:31 PM | Updated on Nov 14 2024 3:52 PM

Tira Beauty launch Nita and Isha Ambani quirky bags steal the spotlight

రిలయన్స్‌ అధినేత ముఖేష్‌ అంబానీ భార్య,  రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ఆరు పదుల వయసులోనూ  స్టైలిష్‌ లుక్స్‌తో  ఫ్యాషన్‌ ప్రపంచాన్ని సైతం మెస్మరైజ్‌ చేస్తూ ఉంటుంది.  అంతేనా ముఖేష్‌, నీతా అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ కూడా ఫ్యాషన్‌ ఐకాన్‌గా  పేరు తెచ్చుకుంది. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ఉంటుంది. తాజాగాముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో జరిగిన ఈహై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్‌లో అంబానీ లేడీస్  తమ ప్రత్యేక నిలుపుకున్నారు. 

రిలయన్స్‌ బ్యూటీ వెంచర్‌ తిరా తన కొత్త స్టోర్‌ను ముంబైలో లాంచ్‌ చేసింది. ఈ సందర్భంగా  ఇషా అంబానీపిరామిల్‌ మెరిసే లావెండర్ పవర్ ప్యాంట్‌సూట్‌ అందన్నీ ఆకట్టుకోగా,  నీతా అంబానీ, లూజ్ ప్యాంట్‌, చెకర్డ్ బ్లేజర్‌తో ప్రత్యేకంగా దర్శనమిచ్చింది. ముఖ్యంగా వారి  బ్యాగ్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.


నీతా అంబానీ పాప్‌కార్న్ బ్యాగ్
నీతా అంబానీ పాప్‌కార్న్ పర్స్ స్పెషల్‌  ఎట్రాక్షన్‌.. రెసిన్, ఎనామెల్, ఇమిటేషన్‌ ముత్యాలు, గోల్డ్‌-టోన్ మెటల్‌తో తయారు చేశారట.

ఇషా అంబానీ బో క్లచ్
ఫ్యాషన్ గేమ్‌లో తగ్గేదే లేదు అన్నట్టుంది ఇషా అంబానీ చేతిలోని పర్స్‌.  చిన్న వెండి విల్లు ఆకారపు క్లచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. 

కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్  బ్యూటీ  రిటైల్ చైన్ అయిన తీరా  ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో ప్రారంభించింది. భారతదేశంలో ప్రీమియం బ్యూటీ షాపింగ్ డెస్టినేషన్ అని  కంపెనీ ప్రకటించింది. ఈ విస్తారమైన 6,200 చదరపు అడుగుల స్టోర్‌లో టాప్ గ్లోబల్ బ్యూటీ బ్రాండ్‌లతో హై-ఎండ్ రిటైల్ అనుభవాన్ని అందించనుంది. ఈ హై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్‌లో ఫ్యాషన్ క్రిటిక్ ఇన్‌ఫ్లుయెన్సర్, సూఫీ మోతీవాలా, పలువురు బాలీవుడ్‌ క్వీన్‌లు మెరిసిన సంగతి తెలిసిందే.

 

ఇదీ చదవండి : పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...!



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement