Special Look
-
తిరా ఈవెంట్ : ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ, ఇషా: ఇక బ్యాగ్స్ అయితే!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ఆరు పదుల వయసులోనూ స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని సైతం మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అంతేనా ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ కూడా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ఉంటుంది. తాజాగాముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో జరిగిన ఈహై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో అంబానీ లేడీస్ తమ ప్రత్యేక నిలుపుకున్నారు. రిలయన్స్ బ్యూటీ వెంచర్ తిరా తన కొత్త స్టోర్‌ను ముంబైలో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఇషా అంబానీపిరామిల్ మెరిసే లావెండర్ పవర్ ప్యాంట్‌సూట్ అందన్నీ ఆకట్టుకోగా, నీతా అంబానీ, లూజ్ ప్యాంట్, చెకర్డ్ బ్లేజర్‌తో ప్రత్యేకంగా దర్శనమిచ్చింది. ముఖ్యంగా వారి బ్యాగ్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.నీతా అంబానీ పాప్‌కార్న్ బ్యాగ్నీతా అంబానీ పాప్‌కార్న్ పర్స్ స్పెషల్ ఎట్రాక్షన్.. రెసిన్, ఎనామెల్, ఇమిటేషన్ ముత్యాలు, గోల్డ్-టోన్ మెటల్‌తో తయారు చేశారట.ఇషా అంబానీ బో క్లచ్ఫ్యాషన్ గేమ్‌లో తగ్గేదే లేదు అన్నట్టుంది ఇషా అంబానీ చేతిలోని పర్స్. చిన్న వెండి విల్లు ఆకారపు క్లచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యూటీ రిటైల్ చైన్ అయిన తీరా ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో ప్రారంభించింది. భారతదేశంలో ప్రీమియం బ్యూటీ షాపింగ్ డెస్టినేషన్ అని కంపెనీ ప్రకటించింది. ఈ విస్తారమైన 6,200 చదరపు అడుగుల స్టోర్‌లో టాప్ గ్లోబల్ బ్యూటీ బ్రాండ్లతో హై-ఎండ్ రిటైల్ అనుభవాన్ని అందించనుంది. ఈ హై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో ఫ్యాషన్ క్రిటిక్ ఇన్ఫ్లుయెన్సర్, సూఫీ మోతీవాలా, పలువురు బాలీవుడ్ క్వీన్లు మెరిసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Limelight Nova (@limelightnova) ఇదీ చదవండి : పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
HBD ‘మహానటి’ : చీరకే వన్నె తెచ్చే దసరా బ్యూటీ (ఫోటోలు)
-
సెలక్షన్ స్టైల్
ఈ స్టైల్‌కి ప్రత్యేక ఎంపికలు అవసరం లేదు. మిక్స్ అండ్ మ్యాచ్‌కే మొదటిప్రా ధాన్యత.ఆభరణాల ఎంపికకు అసలు పో టీ అక్కర్లేదు.పూసలు, సిల్వర్, ఉడ్ జ్యువెల్రీ ఏదైనా సెలక్షన్ మహా ఈజీ. ఎవరికి వారు తమకంటూ ఓ స్పెషల్ లుక్‌ను క్రియేట్ చేసుకునే సౌలభ్యం ఈ స్టైల్ సొంతం. అందుకే, కాలాలతో పనిలేకుండా యూత్‌ని అమితంగా ఆకట్టుకుంటున్న మోడర్న్ బోహో–చిక్ స్టైల్ ఇది. యువతను అమితంగా ఆకట్టుకునే వాటిలో బోహేమియన్ స్టైల్ ఎప్పుడూ ముందుంటుంది. ఇది ఫ్రెంచ్ నుంచి వచ్చిన శైలిగా చెబుతుంటారు. ఇది గిరిజన జీవన శైలి కి దగ్గరగా ఉండటం, మనసులను ఉల్లాసంగా ఉంచడంతోపా టు చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంటుంది. గతంలో పా ప్, ర్యాప్ ఈవెంట్లలో బోహో–చిక్ ఫ్యాషన్ శైలి దుస్తులను ధరించేవారు. ఇప్పుడు మోడర్న్ స్టైల్‌ను అనుసరిస్తూ జీన్స్‌తో, పలాజోలతో ఇక్కత్ పైస్లీ బ్లౌజులు, బటన్ డౌన్ టాప్స్, ఖఫ్తా న్స్ ఆకట్టుకుంటున్నాయి. వీటి మీదకు ట్రైబల్ జ్యువెలరీ లేదా ఫ్యాషన్ జ్యువెలరీ మరింత ఆధునిక హంగులతో మది దోచుకుంటున్నాయి. -
నకల కళా వల్లభులు
రోల్ మోడల్ అనుకుంటే, ఉన్నదాన్నే రీ మోడల్ చేసి గుట్టు చప్పుడు కాకుండా వదిలాడని ఫేస్బుక్, ట్విట్టర్లు నోళ్లు నొక్కుకుంటున్నాయి ఆమిర్‌ఖాన్ గురించి. ‘సత్యమేవ జయతే’ లాంటి సత్యమైన ప్రోగ్రాములు ఓ పక్క చేస్తూ, ఇంకో పక్క పరదేశీ పోస్టర్లని కాపీ కొట్టడమేంటని ఆమిర్‌ఖాన్ నగ్న ప్రయత్నం భగ్నం అవడం చూసి ఆశ్చర్యపోయింది బాలీవుడ్. ఆమిర్‌ఖాన్ ‘పీకే’ కాపీనా? కాదా? అనే విషయం సినిమా విడుదలయ్యేంతవరకూ తెలియదు కానీ... పోస్టర్లు కాపీ కొట్టడం అనే సబ్జెక్టు ఇండియన్ సినిమా సిలబస్‌కి కొత్తేం కాదు. సినిమా అయినా, పోస్టర్ అయినా ఒక ఆలోచన నుంచి పుట్టాల్సిందే. ఒక సూపర్ ఆలోచనను చూడగానే, మనం కూడా ఇలాంటిదే ఒకటి చెయ్యాలి అని ఆలోచించడం సినీమానవుల నైజం. దాని నుండి ఇన్స్పైర్ అయ్యి పోస్టర్ చేద్దామనుకుంటారు కానీ, చివరకు కాపీలు అయిపోతుంటాయి. ఒకరు పరభాషలోని సినిమా పోస్టర్ని చూసి కాపీ కొడితే, ఇంకొకరు దాన్నిచూసి కాపీ కొట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఒకప్పుడైతే బయటపడడం కష్టం కానీ, ఇప్పుడు అంతా ఇంటర్నెట్ జమానా అవడంతో... వరల్డ్ సినిమా అందరి హార్ట్డిస్క్ల్లో ఉంటుంది. కాపీ రాయుళ్ల కళా విలాసాలు తెల్లారేసరికి బట్టబయలైపోతాయి. అలా ఇంటర్నెంట్ తవ్వకాల్లో బయటపడ్డ కొన్ని కళాత్మక పోస్టర్లు, వాటి నుంచి చేయబడిన ‘నకలా’త్మక పోస్టర్లపై స్పెషల్ లుక్.