రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) మరోసారి , ఫ్యాషన్ లుక్స్ విషయంలో తన శైలిని మరోసారి నిరూపించుకున్నారు. సందర్భాన్ని బట్టి తగ్గట్టు దుస్తులను ఎంపిక చేసుకోవడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. ధరిస్తుంటారు. ఐపీఎల్, బిజినెస్ ఈవెంట్స్‌లో అటు మోడ్రన్‌గానూ, ఇటు తనకు ఎంతో ఇష్టమైన చీర కట్టునే (traditional sarees) ఎంచుకుంటారు. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి జరిగిన ప్రత్యేక విందులో నీతా అంబానీ అందమైన 'జామేవర్' చీరలో అంతర్జాతీయంగా అందర్నీ ఆకర్షించారు. ప్రస్తుతం ఆమె ధరించిన చీర విశేషాలపై భారీ ఆసక్తి నెలకొంది.
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వ్యాపారవేత్తగా, దాతగా తనను తాను అనేక సందర్భాల్లో నిరూపించుకుంటూనే ఉన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుతూనే ఫ్యాషన్ ఐకాన్‌గా నిలుస్తున్నారు. ఖరీదైన చీరలు, విలువైన డైమండ్ ఆభరణాలు, లగ్జరీ యాక్ససరీస్‌కు ఆమె వార్డ్ రోబ్ పెట్టింది పేరు. ముఖ్యంగా చీరల ఎంపికలో ఆమె తర్వాతే ఎవరైనా. స్టార్-స్టడెడ్ డిన్నర్‌లో ఈ విషయాన్నే మరోసారి నిరూపించుకున్నారు.
ఈ చీరకు 1,900 గంటలు పట్టింది
డొనాల్డ్ ట్రంప్ విందులో, నీతా అంబానీ తరుణ్ తహిలియాని కలెక్షన్‌లోని అందమైన జామేవర్ చీరను ధరించారు. ఇంత ప్రత్యేకమైన చీరను నేయడానికి దాదాపు 1,900 గంటలు పట్టిందట. ఈ విషయాన్ని స్వయంగా డిజైనర్ ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీని ప్రకారం క్లాసిక్ ఆరి వర్క్ , ఫ్రెంచ్ నాట్స్‌తో కలబోతగా దీన్ని రూపొందించారు. ఈ చీరకు కాలర్డ్ బ్లౌజ్‌తో జత చేసి 60 ఏళ్ల నీతా తన రూపానికి మరింత అందాన్ని తెచ్చుకున్నారు.
నీతా అంబానీ ధరించిన ఈ బ్లౌజ్ మధ్యలో వజ్రం పొదిగిన బ్రూచ్ మరింత ఆకర్షణీయంగా నిలిచింది. ఇంకా డైమండ్ స్టడ్స్, హెయిర్ స్టయిల్, మేకప్ అన్నీ సమానంగా, అందంగా అమిరాయి అంటున్నారు ఫ్యాషన్ ప్రియులు.
మరోవైపు డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో కూడా నీతా అంబానీ చాలా స్పెషల్‌గా కనిపించారు. ప్రత్యేకంగా తయారు చేసిన స్వదేశీ కాంచీపురం చీరలోహుందాగా కనిపించారు. అలాగే 200 ఏళ్ల పురాతనమైన అరుదైన భారతీయ లాకెట్టును ధరించడం విశేషంగా నిలిచింది. పింక్, గ్రీన్ బోర్డర్‌తో కూడిన నలుపు రంగు పట్టుచీరను తమిళనాడులోని దేవాలయాల శిల్ప కళను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. దీనికి జతగా ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర డిజైన్ చేసిన మోడ్రన్ బ్లౌజ్‌ను ధరించారు. దీంతోపాటు 18వ శతాబ్దపు వారసత్వ భారతీయ ఆభరణాలతో ముస్తాబయ్యారు. దక్షిణ భారతదేశంలో తయారు చేసిన 200 సంవత్సరాల పురాతన, అరుదైన స్టేట్మెంట్ నెక్ పీస్ లో పచ్చలు, భారతీయ లాకెట్టు హైలైట్‌గా నిలిచింది. చిలుక ఆకారపు ఈ లాకెట్టులో పచ్చలు, మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలు వంటి విలువైన రత్నాలను పొదిగి తయారు చేశారట.
Comments
Please login to add a commentAdd a comment