అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ప్రమాణ స్వీకారోత్సవం మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఏర్పాటు చేసిన విందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, రిలయన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్(Reliance Foundation chairperson) నీతా అంబానీ హాజరయ్యారు. ఈ వేడుకలో ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామికవేత్తలు, ప్రపంచ వ్యాపార ప్రముఖులు, ట్రంప్ మంత్రివర్గంలోని నామినేటెడ్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ ప్రైవేట్ డిన్నర్‌లో నీతా అంబానీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా నలుపురంగు కాంచీపురం(Kanchipuram) చీరకట్టులో కనిపించారు. ఈ ప్రపంచ వేదికపై భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని నీతా తన ఆహార్యంతో అందంగా ప్రతిబింబించారు. నీతా ధరించిన ఈ చీరకు, మెడలోని హారానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..!.
ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ నలుపు రంగు కాంచీపురం చీరను డిజైన్ చేశారు. భారతీయ సాంప్రదాయ కళా నైపుణ్యానికి నివాళిగా నిలిచే ఈ అందమైన చీరను నేసింది జాతీయ అవార్డు గ్రహీత బి. కృష్ణమూర్తి. ఆయన సహకారంతోనే మనీష్ మల్హోత్రా అందంగా డిజైన్ చేశారు. ఈ చీర కాంచీపురం దేవలయాల వివరాలు, వాటి కథను ప్రతిబింబిస్తుంది.
భారతదేశ ఆధ్యాత్మికతకు, సాంస్కృతికి నిలువెత్తు నిదర్శనం ఈ చీర. ఇక ఈ చీరకు సరిపోయేలా పూర్తినెక్‌ని కవర్ చేసేలా ఫుల్ హ్యండ్స్ ఉన్న వెల్వెట్ బ్లౌజ్‌ని ఎంచుకంది. ఇది నీతాకి అక్కడ చలిని తట్టుకునేందుకు ఉపకరిస్తుంది. అతిరథ మహరథులు విచ్చేసే ఈ వేదికను నీతా ఆధునికతతో కూడిన సంప్రదాయన్ని మిళితం చేసి ఫ్యాషన్‌కి సరికొత్త అర్థం ఇచ్చారు.
హైలెట్‌గా 200 ఏళ్ల నాటి లాకెట్టు..
ఈ అందమైన సంప్రదాయ చీరకు తగ్గట్టుగా చిలుక ఆకారంలో ఉండే అరుదైన 200 ఏళ్ల నాటి పురాతన లాకెట్టు(Pendant)ని ధరించింది. ఈ పురాతన కుందన టెక్కిక్‌తో తీర్చిదిద్దిన హారం రాయల్టీని హైలెట్ చేసింది. ఈ నెక్లెస్‌ని పచ్చలు, మాణిక్యాలు, వజ్రాలు, ముత్యాలతో రూపొందించారు.
(చదవండి: ట్రంప్ క్యాండిల్ లైట్ డిన్నర్‌లో స్టైలిష్‌గా ఉషా వాన్స్ దంపతులు..!)
Comments
Please login to add a commentAdd a comment