luxury
-
ఒక్క వీడియోతో ఓవర్ నైట్ స్టార్‌గా 11 ఏళ్ల చిన్నారి..!
చిన్నపిల్లలు వయసుకు మించి అసాధారణ ప్రతిభను ప్రదర్శిస్తే ఏ తల్లిదండ్రులైన గర్వంగా ఫీలవ్వుతారు. అలాంటి ప్రతిభతోనే అందర్ని ఆకర్షించి ఆశ్చర్యపరుస్తోంది ది బిలియనీర్స్ డాటర్' మూ అబ్రహం. జస్ట్ 11 ఏళ్లకే ఒక్క వీడియోతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. తల్లిదండ్రుల వ్యాపారంలో చేదుడువాదుగా ఉండి లాభాల బాట పట్టిస్తోంది.లవ్ లగ్జరీ స్టోర్(Love Luxury store) వ్యవస్థాపకులు ఆడమ్(Adam), ఎమిలీ అబ్రహం(Emily Abraham) దంపతులు కుమార్తె మూ అబ్రహం(Moo Abraham). సోషల్ మీడియోలో కొన్ని వీడియోలు కట్టిపడేస్తుంటాయి. అలాంటి ఓ వీడియోతో ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్‌గా మారింది మూ అబ్రహం అనే పదకొండేళ్ల చిన్నారి. వాళ్లకు ఉన్న లగ్జరీ స్టోర్‌లోని అత్యంత ఖరీదైన బ్రాండెడ్ హెర్మ్స్ బ్యాగులు, రోలెక్స్ , పాటెక్ ఫిలిప్ వాచీలు వంటి యాక్సెసరీల ధరల, వాటి నాణ్యత గురించి అలవొకగా చెప్పే ఓ వీడియోని ది బిలియనీర్స్ డాటర్(The Billionaire's Daughter) పేరుతో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆమె తల్లి ఎమిలీ. ఆ వీడియోకి విశేష స్పందన వచ్చి.. మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. నిజానికి తమ బిజినెస్ ఊపందుకునేలా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలనుకున్నారు ఆ దంపతులు. అందులో భాగంగా ఆ దంపతులు తమ కుమార్తెతో సరదాగా తమ బ్రాండ్ల వివరాలను చెప్పిస్తూ వీడియో చేశారు. ఆ ఒక్క వీడియో ఆమెను ఏ రేంజ్ స్టార్‌గా మార్చిందంటే..ఏకంగా సోషల్ మీడియా మేనేజర్ వచ్చి ఆ చిన్నారి చేత వీడియో చేయించుకునే స్థాయికి ఇమేజ్ పెరిగింది. నిజానికి అంతకు మందు ఆ దంపతులు తమ వ్యాపారానికి సంబంధించిన వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో పోస్ట్ చేవారు. కానీ అవేమి వీక్షకులను ఆకర్షించలేకపోయాయి. కానీ మూ చెప్పే విధానం.. మార్కెటింగ్ స్ట్రాటజీ పట్టినట్టుగా ప్రతి యాక్సెసరీల ధరను అలవోకగా చెప్పేస్తుంది. ఏది మన్నికగా ఉంటుంది. మనకున్న బడ్జెట్‌కి అనుగుణంగా ఏది ఎంచుకుంటే మంచిది అనేవి అద్భుతంగా చెబుతుంది. ఫ్యాషన్‌కి సంబంధించిన వీడియోలో ఈ చిన్నారి వీడియోలకే విశేష ఆదరణ ఉంది. ఈ చిన్నారి కేవలం హైఎండ్ బ్రాండ్ల వీడియోలనే కాదు తనకంటూ సొంతంగా సోషల్ మీడియా ఖాతాను మెయింటైన్ చేస్తుంది. దాన్ని ఆమె తల్లిందండ్రులు హ్యాండిల్ చేస్తారు. అందులో కూడా ఏ ధరకు ఎలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్ దొరకుతుందనే అవగాహనను కూడా కల్పిస్తోంది. ధరకు తగ్గ లగ్జరీ ప్రొడక్ట్ ఎలా ఐడింటిఫై చేయాలో కూడా టక్కున చెప్పేస్తుంది ఈ చిన్నారి మూ. నిజానికి పెద్ద సేల్స్ మేనేజర్ల కూడా ఒక ప్రొడక్ట్‌ని అమ్మేందుకు, దాని వివరాలు చెప్పేందుకు ఎంతో ప్రయాసపడుతుంటారు. అదేం పెద్ద కష్టం కాదంటూ ఇంత చిన్న వయసులో అలవొకగా చెప్పేస్తున్న మూ అబ్రహంని చూస్తుంటే అబ్బురపడకుండా ఉండలేం కదూ..!. View this post on Instagram A post shared by Love PreLove (@lovepreloveuk) (చదవండి: చుట్టుముట్టిన ఆరోగ్య సమస్యలు..దెబ్బకు 60 కిలోలు తగ్గింది..!) -
అతిలోకసుందరి వారసురాలు జాన్వీకపూర్ లగ్జరీ ఇల్లు : ఎంత వైభోగమో!
సెలబ్రిటీల లైష్స్టైల్, వారుండే విలాసవంతమైన భవనాలు, వాడే కార్లపై ఉండే అసక్తి ఇంతా అంతా కాదు. అతిలోకి సుందరి వారసురాలు, టాలీవుడ్లో దేవర మూవీతో దుమ్మురేపిన బాలీవుడ్ గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ ఇల్లు అంటే క్రేజ్ మామూలుగా ఉండదుగా. సోదరి ఖుషీ కపూర్‌తో కలిసి ముంబైలోని విలాసవంతమైన డూప్లెక్స్‌లో నివసిస్తుంది. పాలి హిల్‌లోని విలాసవంతమైన ఈ భవనం విలువ రూ. 65 కోట్లు. తెలుపు రంగు థీమ్‌తో నిర్మించిన లేటెస్ట్, క్లాసిక్ ఇంటీరియర్‌కు నిదర్శనంగా, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కొరియోగ్రాఫర్ , ఫిల్మ్ మేకర్, ఫరా ఖాన్ ఇటీవల తన తాజా వ్లాగ్‌లో బోనీ కపూర్ అద్భుతమైన ముంబై భవనాన్ని సందర్శించింది. ఈ సందర్బంగా ఈ ఇంటి విశేషాలు సందడిగామారాయి పదండి అంత అదమైన భవనం, సౌకర్యాల గురించితెలుసుకుందాం. ఫరాఖాన్ అందించిన వివరాల ప్రకారం తొలి చూపులోనే పాలి హిల్‌లోని కుబెలిస్క్ భవనం(Kubelisque Building) పాలరాయితో, లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటుంది. పెయింటింగ్‌లు, ఫోటోలు, ఇతర కళాఖండాలతో అలంకరించడం మరో ప్రత్యేకత. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలోని ఈ అపార్ట్‌మెంట్‌ను 2022లో కొనుగోలు చేసిందట జాన్వి. తన జుహు అపార్ట్‌మెంట్‌ని రాజ్‌కుమార్ రావ్‌కి విక్రయించి మరీ ఆ ఇల్లును ఇంటిని 65 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దీనికి స్టాంప్ డ్యూటీ 3 లక్షల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తుంది. రణబీర్ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్రా,సంజయ్ దత్ లాంటి స్టార్లు జాన్వీ ఇంటికి పక్కనే నివస్తుండటం విశేషం. ఇల్లు మొత్తం 8,669 చదరపు అడుగులతో నిర్మించారు. రెండు అంతస్తుల్లో అంతస్తులలో నిర్మించిన ఈ గృహంలో ఓపెన్ కిచెన్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్,పెద్ద ఓపెన్ గార్డెన్ ఉన్నాయి. బార్ ఏరియా కూడా ఉంది, ఇక్కడ కపూర్ పార్టీలు జరుగుతాయట.ఐదు కార్ల పార్కింగ్ సదుపాయం కూడా ఉంది.శ్రీదేవి పెయింటింగ్ అలనాటి అందాల తారు శ్రీదేవి వేసిన పెయింటింగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు ఇంట్లో బెడ్రూమ్లు ,ఇతర లివింగ్ రూంకు దారతీసే మెట్లు , పక్కనే భారీ అద్దం అందంగా అమర్చారు. అలాగే మరొక గోడ కుటుంబ ఫ్రేమ్ , దివంగత భార్య శ్రీదేవికి బోనీ కపూర్ కుమార్తెలు ఖుషీ . జాన్వీ నివాళులర్పించే ఫోటో, ఇతర మెమరీస్ ఫోటోలుగా అమరాయి. పొడవైన చెక్క డైనింగ్ టేబుల్‌పై వేలాడుతున్న భారీ క్రిస్టల్ షాన్డిలియర్తో డైనింగ్ మరింత సొగసుగా ఉంటుంది. అలాగే ఈ ఇంట్లోని ఆర్ట్‌వర్క్ అంతా తన తల్లి శ్రీదేవే సెలెక్ట్ చేసినట్టు గతంలో ఒక సందర్బంగా స్వయగా జాన్వీనే తెలిపింది. తన తల్లి ఎంచుకున్న ఈ పెయింటింగ్స్, ఆర్ట్వర్క్లేనని ఆమె గుర్తు చేసుకుంది. అందుకే ఈ ఇంట్లో ఉంటే అమ్మతో ఉన్నటే, అమ్మ ఎనర్జీ ఉన్నట్టు ఉంటుందని చెప్పింది. -
ఢిల్లీలోని మురికివాడల కంటే.. శీష్ మహల్లో టాయిలెట్ల ఖరీదే ఎక్కువ: అమిత్ షా
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ఆప్ జాతీయ కన్వినర్ అరవింద్ కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్ మహల్’ను అత్యంత విలాసవంతంగా నిర్మించారని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. ఢిల్లీలోని అన్ని మురికివాడల కంటే శీష్ మహల్‌లోని టాయిలెట్లే అత్యంత ఖరీదైనవని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలోని పేదల కోసం ప్రధాని మోదీ 3.58 కోట్ల ఇళ్లు నిర్మించి ఇస్తే..కేజ్రీవాల్ మాత్రం ప్రజల సొమ్ముతో ఆర్భాటంగా ఖరీదైన నివాసాన్ని నిర్మించారని విమర్శించారు. మంత్రి అమిత్ షా శనివారం జేఎల్ఎన్ స్టేడియంలో మురికివాడల నివాసితులతో ఏర్పాటైన సమావేశంలో మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వస్తే మురికివాడల్లోని ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తుందని భరోసా ఇచ్చారు. ఢిల్లీలో మౌలిక వనరుల కల్పనకు మోదీ ప్రభుత్వం రూ.68వేల కోట్లను వెచ్చించిందన్నారు. మురికివాడల్లో సమస్యలు, వాటి పరిష్కారంపై ఇప్పటికే ప్రధాని మోదీకి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాకు వివరాలను అందజేశామన్నారు. అధికారం చేపట్టిన వెంటనే వీటన్నిటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను పట్టించుకోకుండా, ఢిల్లీ అభివృద్ధికి కేజ్రీవాల్ ‘ఆపద’ప్రభుత్వం అడ్డంకిగా మారిందన్నారు. గత పదేళ్లుగా ఢిల్లీ ఎలాంటి అభివృద్ధికీ నోచుకోలేదని చెప్పారు. కనీసం తాగునీరు, రోడ్లు, డ్రెయినేజీ వసతులు కూడా లేని మురికివాడలు చెత్తకుప్పల్లా మారాయని చెప్పారు. సుమారు 5.25 లక్షల మంది ఢిల్లీ విద్యార్థులకు పాఠశాల విద్య అందడం లేదంటూ కేజ్రీవాల్‌ను నిలదీశారు. -
New Year 2025 : నీతా అంబానీ న్యూ ఇయర్ లుక్, ధర ఎంతో తెలుసా?
అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్యగానే కాదు, రిలయన్స్ ఫౌండేషన్ చైర్మన్ నీతా అంబానీ వ్యాపారవేత్తగా, పరోపకారిగా అందరికి సుపరిచితమే. నీతా అంబానీ ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్ ఓనర్ కూడా. అలాగే నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సొసైటి ఆధ్వర్యంలో ప్రాచీన కళలకు, సంస్కృతులకు పెద్ద పీట వేస్తున్నారు. అనేక మంది కళాకారులను ఎన్ఎంఏసీసీ ద్వారా ఆదరిస్తున్నారు. అయితే నీతా అంబానీ ఫ్యాషన్ ఐకాన్ కూడా. చేనేత చీరలు, ఖరీదైన పట్టుచీరలు, విలువైన డైమండ్ ఆభరణాలు, లగ్జరీ బ్యాగులు, లగ్జరీ పాదరక్షలు, ఇలా ఒకటనేమిటి ప్రతీ విషయంలోనూ తనదైన శైలితో అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటారు. తాజాగా నూతన సంవత్సర వేడుకల్లో మరోసారి ప్రత్యేకంగా నిలిచారు. గోల్డెన్ కఫ్తాన్ గౌనులో నీతా అంబానీ గ్లామ్ న్యూ ఇయర్ లుక్ అభిమానులు, ఫ్యాషన్ ప్రియుల దృష్టిలో పడ్డారు. దాని ధర ఎంత అనేది కూడా హాట్ టాపిక్‌గా మారింది. View this post on Instagram A post shared by Ritika kadam (@ritikahairstylist)సన్నిహితులు ,కుటుంబ సభ్యుల మధ్య 2025 ఏడాదికి స్వాగతం పలికారు నీతా అంబానీ. కొత్త కోడలు అనంత్ అంబానీ భార్య రాధిక మర్చెంట్‌కు ఇది మొదటి న్యూఇయర్ కావడం మరో విశేషం. న్యూ ఇయర్ సందర్భంగా అనంత్, ఆకాష్ అంబానీ జంట అందంగా కనిపించారు. ఇక నీతా అంబానీ 60 ఏళ్ల వయసులో కూడా డిజైనర్ ఆస్కార్ డి లా రెంటా కలెక్షన్, మౌస్లైన్ ఫాబ్రిక్‌తో రూపొందించిన ముదురు బంగారు కఫ్తాన్ గౌనులో అప్పరసలా మెరిసిపోయారు. నెక్లైన్ క్రిస్టల్ లీవ్స్, లాంగ్ కేప్ స్లీవ్స్, అందమైన కఫ్తాన్ సిల్హౌట్, వీటన్నింటికీ మించి ఫ్లోర్-స్వీపింగ్ హెమ్‌లైన్ మరింత ఆకర్షణీయంగా నిలిచారు. ఇంతకీ ఈ లగ్జరీ గౌన్ ధర ఎంతో తెలుసా? దీని ధర సుమారు రూ. 1.54 లక్షలు. -
రూ.1.43 కోట్ల డ్రెస్‌లో అదరగొట్టిన వ్యాపారవేత్త, మోడల్ మోనా పటేల్
ప్రముఖ మోడల్, వ్యాపారవేత్త మోనా పటేల్ మరోసారి తన ఫ్యాషన్ లుక్‌తో అందర్నీ మెస్మరైజ్ చేసింది. బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డ్స్ 2024కి హాజరైన మోలా పటేల్ వింటేజ్ సిల్వర్ కలర్ కార్సెట్‌ను ధరించింది. అంతేకాదు ఈ డ్రెస్ ధర నెట్టింట హాట్ టాపిక్‌గా నిలిచింది.బ్రిటీష్ ఫ్యాషన్ అవార్డ్స్‌లో రెడ్ కార్పెట్‌పై పోజులిచ్చింది మోనా పటేల్. ఈ సందర్బంగా తనదైన ఐకానిక్ స్టైల్లో, వింటేజ్ స్కర్ట్‌లో దర్శనమివ్వడం విశేషంగా నిలిచింది. క్రిస్టియన్ లాక్రోయిక్స్ హాట్ కోచర్ కలెక్షన్లోనిది ఈ డ్రెస్. దీన్ని వేలంలో సుమారు రూ. 1.43కోట్లు (169,828.65డాలర్లు) మోనాగానీ, ఆమె స్టైలిస్ట్ గానీ కార్సెట్‌ను కొనుగోలు చేసి ఉంటారని అంచనా. దీన్ని చేతితో దయారు చేశారు. దీనికి చక్కని ఎంబ్రాయిడరీని కూడా జతచేశారు. వేలకొద్దీ చేతితో కుట్టిన స్ఫటికాలు, భుజంపై ఉన్న సున్నితమైన సిల్క్ ఆర్గాన్జా పూసల సీతాకోకచిలుక, స్వరోవ్స్కీ పూసలు, స్ఫటికాలుతో తీర్చి దిద్దారు.మోనా 3డీ సీతాకోక చిలుకలను కైనెటిక్ మోషన్ ఆర్టిస్ట్ కేసీ కుర్రాన్ సహాయంతో స్వయంగా డిజైన్ చేసిందట. ఈ ఏడాది ప్రారంభంలో మెట్ గాలాలో తొలిసారి పాల్గొన్న మోనా పటేల్ ఐరిస్ వాన్ హెర్పెన్ కోచర్ బటర్ ఫ్లై మోడల్ డ్రెస్‌లో అందర్నీ కట్టిపడేసిన సంగతి తెలిసిందే. -
దుబాయ్‌లో ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ ఇల్లు: దిమ్మతిరిగే ఫీచర్లు
దుబాయ్‌లో బ్రెజిలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్ అత్యంత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశాడు. దుబాయ్‌లోని బుగాట్టి రెసిడెన్స్‌లో ఉన్న ఈ పెంట్‌హౌస్ విలాసవంతమైన జీవన కళాఖండ మంటున్నారు నిపుణులు.తాజా కొనుగోలుతో ఈ ఫుట్‌బాల్ సూపర్‌స్టార్ తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోలో లగ్జరీ పెంట్‌హౌస్‌ను కూడా జోడించాడు. దీని ధర రూ.456 కోట్లు. అంతేకాదు దుబాయ్‌లోని బిజినెస్ బే ప్రాంతంలో నిర్మిత మవుతున్న ఇది ప్రపంచంలోని తొలి బుగాట్టి బ్రాండెడ్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్‌లలో భాగం. ఫ్రెంచ్ రివేరా- ఆధారిత ప్రైవేట్ బీచ్‌తో పాటు ఇందులో నివసించేందుకు వీలుగా లగ్జరీ ఫీచర్లను అందించారు. ఈ ఆకాశహర్మ్యం (స్కై మాన్షన్) 44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇక్కడి నుంచి దుబాయ్ అందాలను వీక్షించడమే కాదు, మార్బుల్ బార్ కౌంటర్, కుషన్డ్ కుర్చీలతో కూడిన హై-ఎండ్ బార్, ప్రైవేట్ పూల్‌తోపాటు లగ్జరీ కార్లను నేరుగా అతని పెంట్ హౌస్‌లో పార్క్ చేయడానికి వీలుగా ప్రత్యేక కార్ లిఫ్ట్ లాంటి అత్యాధునిక సౌకర్యాలున్నాయి. ఐవరీ అండ్ బ్లాక్-థీమ్‌తో బెడ్రూమ్స్, గ్రిల్స్, కర్టెన్లు, కుషన్లు సోఫా మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. View this post on Instagram A post shared by AZR (@azrorganization) -
తిరా ఈవెంట్ : ప్రత్యేక ఆకర్షణగా నీతా అంబానీ, ఇషా: ఇక బ్యాగ్స్ అయితే!
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భార్య, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ఫ్యాషన్‌కు పెట్టింది పేరు. ఆరు పదుల వయసులోనూ స్టైలిష్ లుక్స్‌తో ఫ్యాషన్ ప్రపంచాన్ని సైతం మెస్మరైజ్ చేస్తూ ఉంటుంది. అంతేనా ముఖేష్, నీతా అంబానీ ముద్దుల తనయ ఇషా అంబానీ కూడా ఫ్యాషన్ ఐకాన్‌గా పేరు తెచ్చుకుంది. తల్లికి తగ్గ తనయ అనిపించుకుంటూ ఉంటుంది. తాజాగాముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో జరిగిన ఈహై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో అంబానీ లేడీస్ తమ ప్రత్యేక నిలుపుకున్నారు. రిలయన్స్ బ్యూటీ వెంచర్ తిరా తన కొత్త స్టోర్‌ను ముంబైలో లాంచ్ చేసింది. ఈ సందర్భంగా ఇషా అంబానీపిరామిల్ మెరిసే లావెండర్ పవర్ ప్యాంట్‌సూట్ అందన్నీ ఆకట్టుకోగా, నీతా అంబానీ, లూజ్ ప్యాంట్, చెకర్డ్ బ్లేజర్‌తో ప్రత్యేకంగా దర్శనమిచ్చింది. ముఖ్యంగా వారి బ్యాగ్స్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.నీతా అంబానీ పాప్‌కార్న్ బ్యాగ్నీతా అంబానీ పాప్‌కార్న్ పర్స్ స్పెషల్ ఎట్రాక్షన్.. రెసిన్, ఎనామెల్, ఇమిటేషన్ ముత్యాలు, గోల్డ్-టోన్ మెటల్‌తో తయారు చేశారట.ఇషా అంబానీ బో క్లచ్ఫ్యాషన్ గేమ్‌లో తగ్గేదే లేదు అన్నట్టుంది ఇషా అంబానీ చేతిలోని పర్స్. చిన్న వెండి విల్లు ఆకారపు క్లచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యూటీ రిటైల్ చైన్ అయిన తీరా ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ముంబైలోని జియో వరల్డ్ ప్లాజాలో ప్రారంభించింది. భారతదేశంలో ప్రీమియం బ్యూటీ షాపింగ్ డెస్టినేషన్ అని కంపెనీ ప్రకటించింది. ఈ విస్తారమైన 6,200 చదరపు అడుగుల స్టోర్‌లో టాప్ గ్లోబల్ బ్యూటీ బ్రాండ్లతో హై-ఎండ్ రిటైల్ అనుభవాన్ని అందించనుంది. ఈ హై-ప్రొఫైల్ లాంచ్ ఈవెంట్లో ఫ్యాషన్ క్రిటిక్ ఇన్ఫ్లుయెన్సర్, సూఫీ మోతీవాలా, పలువురు బాలీవుడ్ క్వీన్లు మెరిసిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Limelight Nova (@limelightnova) ఇదీ చదవండి : పేరు మార్చుకున్న అంబానీ కోడలు : ఇకపై అధికారికంగా...! -
ఎలిగెంట్లుక్, స్టైలిష్ బ్యాగ్ : ఇషా అంబానీ లెవలే వేరు!
యువ మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వ్యాపార రంగంలో రాణిస్తూనే, ఫ్యాషన్ ఐకానిక్‌లా కూడా తనదైన శైలిని ప్రదర్శిస్తుంది. తాజాగా ఒక ఫ్యాషన్ ఈవెంట్లో ఇషా స్పెషల్లుక్లో ఆకట్టుకుంది. ఈ విషయంలో తల్లి నీతా అంబానీకి తగ్గ తనయ అనిపించుకుంటోంది. సోమవారం జరిగిన లగ్జరీ స్కిన్‌కేర్ అండ్ హెయిర్‌కేర్ బ్రాండ్ అగస్టినస్ బాడర్ నిర్వహించిన స్టార్-స్టడెడ్ లాంచింగ్ కార్యక్రమంలో ఇషా అంబానీ బ్లాక్ డ్రెస్‌లో తళుక్కున మెరిసారు. అనైతా ష్రాఫ్ అడ్జానియా డిజైన్ చేసిన స్ట్రాప్‌లెస్ బ్లౌజ్, నెక్లైన్ కార్సెట్ టాప్ ,మ్యాచింగ్ స్కర్ట్ ధరించింది. అంతేకాదు లగ్జరీ చిట్టి బ్యాగ్ హీర్మేస్ కెల్లీ బ్యాగ్ ఆకర్షణగా నిలిచింది. తన కవల పిల్లలు ఆదియా,కృష్ణ పేర్లతో ప్రత్యేకంగా తీర్చిదిద్దడం హైలైట్. గ్లామరస్ అవతార్‌లో శిరస్సునుంచి పాదం వరకు ఆసాంతంగా పర్ఫెక్ట్గా కనిపించింది.కాగా ఇషా అంబానీ 2018లోవ్యాపారవేత్త ఆనంద్ పిరమల్‌ను పెళ్లి చేసుకున్నారు. 2022, నవంబరులో వీరికి కవల పిల్లలు పుట్టారు. -
Fashion: లైట్ కలర్స్‌తో.. లగ్జరీ లుక్!
తమ క్రియేటివ్ డిజైన్స్‌తో ఇతరులను అందంగా చూపే ఫ్యాషన్ డిజైనర్లు తమ కోసం వార్డ్ రోబ్‌ను ఎంత ఘనంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ విషయమై హైదరాబాద్‌లో మోడల్స్‌కి, ఫ్యాషన్ షోల కోసం డిజైన్స్ క్రియేట్ చేసే హేమంత్ సిరి ‘లెస్ ఈజ్ క్లాసీ’ అంటూ సింపుల్‌గా ఉండే తన వార్డ్ రోబ్‌ను పరిచయం చేస్తున్నారు. ‘‘చిన్నప్పటి నుంచి చేనేతలు అంటే బాగా ఇష్టం ఉండేది. దీంతో మా అమ్మ, అమ్మమ్మల చీరలను నాకు అనువుగా డిజైన్ చేసుకునేదాన్ని. నేను డిజైన్ చేసిన దుస్తులను వేసుకున్నవారు అందంగా కనిపించాలనే తపన ఎప్పుడూ ఉంటుంది. అయితే, నన్ను నేను కూడా బెస్ట్‌గా చూసుకోవాలి. నా విషయానికి వచ్చేసరికి కొన్ని ఎక్స్పర్మెంట్స్తో ΄ాటు సౌకర్యంగా ఉండేలా చూసుకుంటాను. మోడల్స్‌కి, ఫ్యాషన్ షోస్ కోసం డిజైన్ చేయడంలో ఫ్యాబ్రిక్, కలర్స్ మీద ప్రత్యేక దృష్టి పెడతాను. నాకోసం అయితే ఇండోవెస్ట్రన్ లుక్ ఉండేలా చూసుకుంటాను. కొంచెం ్ర΄÷ఫెషనల్గా ఉండాలి అనుకుంటే హ్యాండ్లూమ్ శారీస్ ఎంచుకుంటాను.లెస్ ఈజ్ క్లాసీ..ఏదైనా ఈవెంట్‌కి వెళ్లాలి అనుకుంటే ముందు నన్ను నేను తెలుపు, క్రీమ్ కలర్ డ్రెస్‌లో ఊహించుకుంటాను. అంతేకాదు, ఆర్గానిక్ కలర్స్, ఆర్గానిక్ ఫ్యాబిక్స్ర్తో సింపుల్‌గా ఫార్మల్ లుక్‌ని ఇష్టపడతాను. హెవీ శారీస్ అయినా సరే సింపుల్‌గా ఉండే బ్లౌజ్‌నే ఉపయోగిస్తుంటాను. లెస్ ఈజ్ క్లాసీ అనిపించేలా ఉంటాను.లగ్జరీ కలర్స్..పేస్టల్ కలర్స్‌లో లైట్ క్రీమ్, పింక్, గోల్డ్.. ఇష్టపడతాను. ఈ రంగులు ఒక లగ్జరీ లుక్‌తో ఆకట్టుకుంటాయి. క్రీమ్ లేదా ఐవరీ అంటేనే లగ్జరీ కలర్స్. లైట్ బ్లూ, లైట్ గ్రీన్.. వంటివి డే ఫంక్షన్స్‌కి, లైట్ సిల్వర్, లైట్ క్రీమ్ డ్రెస్సులు, శారీస్ నైట్ ఈవెంట్స్‌కి వాడతాను.ప్రయాణాల్లో సౌకర్యం..ఖ΄్తాన్స్ ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. పలాజోలు, జీన్స్, లైట్, ఫ్లోరల్ కలర్ నీ లెంగ్త్ ఫ్రాక్స్ని ఉపయోగిస్తాను.బొట్టుతో గుర్తింపు..నా పర్సనల్ స్టైలింగ్‌లో బొట్టు సిగ్నేచర్ అయిపోయింది. ముందు స్టికర్స్ వాడేదాన్ని. ఆర్గానిక్ కలర్స్పైన గ్రిప్ వచ్చాక కుంకుమ తయారు చేసుకుని, వాడుతున్నాను. వివాహవేడుకల వంటి ఎంత పెద్ద ఈవెంట్ అయినా సింపుల్ జ్యువెలరీనే ఉపయోగిస్తాను’’ అని వివరించారు ఈ డిజైనర్. – నిర్మలారెడ్డి, ‘సాక్షి’ ఫీచర్స్ ప్రతినిధిఇవి చదవండి: డ్యాన్సింగ్ సిటీ.. హిప్హాప్ స్టెప్స్.. -
అత్యంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌లు..కోట్లలోనే..! (ఫొటోలు)
-
అంబానీ పెళ్లి సందడి : జెఫ్ బెజోస్, ఇతర దిగ్గజాల కళ్లు చెదిరే కానుకలు
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుక ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆకాశమంతపందిరి, భూదేవి అంత పీట అనే మాట వినడమే గానీ ఎపుడూ చూడని చాలామందికి ఇలా ఉంటుందా అనేట్టుగా కనీవినీ ఎరుగని రీతిలో మూడు రోజుల పాటు వేడుక జరిగింది. జూలై 12, 2024న గ్రాండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌కు ప్రపంచ వ్యాప్తంగా పద్నాలుగు వేల మంది హాజరయ్యారు. సుమారు రూ. 5వేల కోట్లు ఖర్చు చేసినట్టు పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. అలాగే దేశ, విదేశాలనుంచి విచ్చేసిన అతిథులకు బహుమతులను అంతే ఘనంగా అందించారు. అయితే ఇపుడు తాజాగా అనంత్-రాధిక గ్రాండ్ వెడ్డింగ్‌కు విచ్చేసిన గ్గోబల్ దిగ్గజాలు నూతన వధూవరులకు ఇచ్చిన కానుకలపై తాజా చర్చ నడుస్తోంది.కొత్త జంట అనంత్ అంబానీ-రాధిక మర్చంట్లకు కొందరు హై-ప్రొఫైల్ అతిథులు ఖరీదైన విగ్రహాలు , పెయింటింగ్‌లను అందించారు. ఇంటర్నేషన్ గెస్ట్‌లు మాత్రం వీటన్నింటికీ మించిన కోట్ల విలువ చేసే కార్లను గిప్ట్‌లుగా అందించారట. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ప్రకారం, అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వారికి బుగాట్టి కారును బహుమతిగా ఇచ్చారు. దీని రూ. 11.50 కోట్లు.అమెరికన్ నటుడు , ప్రొఫెషనల్ రెజ్లర్, జాన్ సెనా వారికి రూ. 3 కోట్ల విలువైన లంబోర్ఘిని బహుమతిగా ఇచ్చాడు. ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ వారికి రూ. రూ. 300 కోట్లు విలువైన కానుక ఇచ్చారట. ఇక బిల్ గేట్స్ రూ. 9 కోట్ల విలువైన డైమండ్ రింగ్ ఇచ్చారని తెలుస్తోంది. 9 కోట్లు. అంతేకాదు బిల్ గేట్స్ రూ. రూ. 180 కోట్ల విలువైన లగ్జరీ యాచ్‌ను ఇచ్చినట్టు మరో వీడియో ద్వారా తెలుస్తోంది. గూగుల్ , అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ 100 కోట్ల రూపాయల విలువైన హెలికాప్టర్‌ను బహుమతిగా ఇచ్చారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కొత్తగా పెళ్లయిన జంటకు అమెరికాలోని రూ. 80 కోట్ల విలువ జేసే లగ్జరీ భవనాన్ని కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది. -
లగ్జరీ కంటైనర్ ఇల్లు ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
Cannes 2024 రూ. 105 కోట్ల విలువైన డ్రెస్‌లు : ఈ భామ ఎవరో గుర్తుపట్టండి!
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినీ, ఫ్యాషన్ ప్రముఖులు సందడి చేస్తున్నారు. ప్రతీ ఏడాది 12-రోజుల ఈ వేడుకులో ఫ్యాషన్ స్టయిల్, బ్యూటిఫుల్ ఫ్యాషన్ గేమ్, లుక్స్‌తో అదరగొట్టేస్తున్నారు. 77వ కేన్స్ ఫెస్టివల్లో రెడ్ కార్పెట్‌పై ఐశ్వర్యారాయ్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కియారా అద్వానీ, ప్రీతి జింటా, దీప్తి సాధ్వానీ, శోభితా ధూళిపాళ, అదితి రావ్ హైదరీ తళుక్కున మెరిసారు. అంతేకాదు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నాన్సీ త్యాగికూడా అందరి చూపును తన వైపు తిప్పుకుంది. అయితే వీరిలో మరింత స్పెషల్‌గా నిలుస్తోంది నటి, మోడల్ ఊర్వశి రౌతేలా.ఊర్వశీ రౌతేలా ఖరీదైన ఫ్యాషన్ దుస్తులతో టాక్ ఆఫ్ ది వరల్డ్‌గా నిలిచింది. ఈ బ్యూటీ కేన్స్ వేదికపై ధరించిన డ్రెస్ ధరలు ఏకంగా రూ.105 కోట్లు. ముఖ్యంగా ఫస్ట్ డే ధరించిన పూల పింక్ గౌన్ స్పెషల్‌గా నిలిచింది. దీని ధర ఏకంగా రూ.47 కోట్లు అని తెలుస్తోంది. అలాగే, కేన్స్ నాలుగవ రోజు వేసుకున్న బ్లాక్ అండ్ వైట్ కస్టమ్ మేడ్ డ్రెస్ ధర ఏకంగా రూ.58 కోట్లు. సో.. మొత్తంగా ఈ రెండు డ్రెస్సులు కలిపి రూ.105 కోట్లు వరకు ఉంటుందనేది హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఐశ్వర్య, కియారా అద్వానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ప్రీతి జింటా లాంటి తారలు ధరించిన డ్రెస్‌ల ధరలు లక్షల్లో ఉంటుందిట. తరువాత రోజుల్లో కూడా తనదైన స్టయిల్లో అదర గొడుతోంది ఈ భామ.👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్‌లో లగ్జరీ ప్రాపర్టీలు కొన్న నీలిమా దివి..
హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సంపన్నుల పెట్టుబడులు కొనసాగుతున్నాయి. దేశంలో ప్రముఖ ఫార్మాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన దివీస్ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు మురళి దివి కుమార్తె నీలిమా ప్రసాద్ దివి ఇటీవల హైదరాబాద్‌లో రూ .80 కోట్లకు రెండు లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేశారు.జూబ్లీహిల్స్ పరిసరాల్లో ఆమె కొన్న మొదటి ప్రాపర్టీ 12 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 200 చదరపు అడుగుల బిల్టప్ ఏరియాని కలిగి ఉంది. ఈ ప్రాపర్టీని ఆమె రూ.40 కోట్లకు కొనుగోలు చేశారు. జాప్కీ షేర్ చేసిన సేల్ డీడ్ డాక్యుమెంట్ల ప్రకారం.. 12,000 చదరపు అడుగుల రెండో ప్రాపర్టీని కూడా అంతే మొత్తానికి నీలిమా దివి కొనుగోలు చేశారు.సంపన్నులకు పేరుగాంచిన జూబ్లీహిల్స్ ప్రాంతంలో చదరపు అడుగుకు రూ.25 వేల నుంచి రూ.35 వేల వరకు ప్రాపర్టీ ధరలు ఉంటుంన్నాయి. వాణిజ్య పరంగా, రెసిడెన్షియల్ ప్రాపర్టీలకు హైదరాబాద్ దేశంలోనే అత్యంత ఖరీదైన ప్రదేశాలలో ఒకటిగా నిలిచింది. ఇటీవలి సంవత్సరాలలో హైదరాబాద్ హై-ఎండ్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై వ్యాపార ప్రముఖులు, నటులు, పరిశ్రమ ప్రమోటర్లతో సహా సూపర్-రిచ్ వ్యక్తులు గణనీయమైన ఆసక్తిని చూపుతున్నారు. -
ఖరీదైన ఫ్లాట్ కొన్న క్రికెటర్.. ‘డ్రీమ్ హౌజ్’ చూశారా? (ఫోటోలు)
-
శ్లోకా మెహతా వాచ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నీతా అంబానీల పెద్ద కోడలు శ్లోకా మెహతా సైతం వారి రేంజ్ తగ్గట్టుగానే లగ్జరీయస్‌గా ఉంటారు. ఇటీవలే ముంఖేశ్ నీతా అంబానీల చిన్న కొడుకు అనంత్-రాధికల ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకల్లో శ్లోకా మెహతా అంబానీల లెవల్‌కి తగ్గట్టు తనదైన ఫ్యాషన్ బ్రాండ్స్‌తో తళుక్కుమన్నారు. ఇంతfరకు అంబానీల కుటుంబంలోని మగవాళ్లు అత్యంత లగ్జరీయస్ వాచ్‌లు ధరించడం గురించి విని ఉన్నాం. ఆ కుటుంబంలోని మహిళలు కూడా అలాంటివి ధరిస్తారని శ్లోకా మెహతా ప్రూవ్ చేశారు. నిజానికి ఈ ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అంబానీ కుటుంబం తొమ్మిది పేజీల మెనులో ఏయే రోజులు సెలబ్రెటీలు, అతిథులు ఎలాంటి డ్రెస్ కోడ్ ధరించాలనే రూల్స్ పెట్టిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సినీ సెలబ్రెటీలు, ప్రముఖులు, విదేశీ ప్రముఖులు వరకు అందరూ ఈ వేడుకలకు తగ్గ వస్త్రధారణతో సందడి చేశారు. అయితే ఈ వేడుకల్లో శ్లోకా మెహతా డైమండ్స్‌తో పొదిగిన నెక్లెస్, జూకాలతో అందర్నీ ఆకర్షించారు. ఈ వేడుకల్లో ఆమె ఎరుపురంగు వేలెంటినో డ్రస్‌తో అంబానీ కోడలు అంటే ఇది అనేంత రేంజ్లో గ్లామరస్ లుక్‌లో కనిపించారు. డైమండ్స్ అంటే ఇష్టపడే శ్లోకా ఈ వేడుకల్లో చేతికి పటేక్ ఫిలిప్ నాటిలస్ బ్రాండ్ డైమండ్ వాచ్‌ని ధరించింది. మొత్తం వాచ్ అంతా ట్రాన్స్పరెంట్ వజ్రాలతో పొదగబడి ఉంటుంది. ఎంత దూరాన ఉన్న చేతికి ఉన్న వాచ్ ఆకర్షణ కనిపించడమే దీని ప్రత్యేకత. అయితే ఈ వాచ్ ఖరీదు వింటే కళ్లు బైర్లుకమ్మడం గ్యారంటీ. ఇంతకీ ఈ వాచ్ ధర ఎంతంటే అక్షరాల రూ. 4.8 కోట్లు. అమ్మ బాబోయే! జస్ట్ వాచ్కే అన్ని కోట్లా..! అని నోరెళ్లబెట్టకండి. అందులోనూ అంబానీ పెద్ద కోడలు ఆ మాత్రం రేంజ్ మెయింటెయిన్ చేయాల్సిందే కదూ. View this post on Instagram A post shared by Shloka Akash Ambani (@shloka_ambani) (చదవండి: అనంత్-రాధికా ప్రీ వెడ్డింగ్: ఇవాంకా ట్రంప్ డ్రస్ స్టయిల్ అదిరిందిగా!) -
రూ. 8 కోట్ల వెడ్డింగ్ కేక్..ముత్యాలు, డైమండ్లు.. ఇంకా..!
వెడ్డింగ్ కేక్‌లు ఇపుడు పెళ్లిళ్లలో చాలా కామన్. ఈ ట్రెండ్ ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సాధించింది. బర్త్‌డే కేక్, ఎంగేజ్మెంట్ కేక్- వెడ్డింగ్ కేక్‌ల నోరూరించే రుచితో సందర్భానికి తగ్గట్టుగా అనేక డిజైన్లలో కేక్‌లు తయారు చేయడం ఆనవాయితీ. అలాగే దాని డిజైన్, వెయిట్, ఫ్లేవర్ఆధారంగా ధర ఉంటుంది. మరి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వెడ్డింగ్ కేక్ చూశారా. దీనికి ఖరీదు 8 కోట్ల రూపాయలకంటే ఎక్కువే. అరబ్ వధువు ఆకారంలో ఉన్న కేక్ హాట్‌టాపిక్‌గా నిలిచింది. లైఫ్ సైజ్ అరబ్ బ్రైడల్ కేక్ దుబాయ్‌కి చెందిన డెబ్బీ వింగ్‌హామ్, బృందం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కేక్‌ను తయారు చేశారు. దుబాయ్ వధువు ఆకారంలో దీన్ని రూపొందించడం ఒక ఎత్తయితే ఎడిబుల్ ముత్యాలు, డైమండ్స్‌తో తయారు చేయడం మరో ఎత్తు. అరబ్ బ్రైడల్ కేక్ 182 సెం.మీ ఎత్తు, 120 కిలోల బరువు కలిగి ఉంది. కేక్ తయారీకి పది రోజుల సమయం పట్టింది. దుబాయ్‌లోని రాఫెల్స్ హోటల్లో 1,000 గుడ్లు , 20 కిలోల చాక్లెట్‌తో కేక్‌ను తయారు చేశారు. కేక్‌లో 50 కిలోల లాసీ మిఠాయి వివరాలు, తినదగిన 3-క్యారెట్ వజ్రాలు ,ముత్యాలు కూడా ఉన్నాయి. కేక్‌లో పొదిగిన ప్రతి వజ్రం మిలియన్ల కంటే ఎక్కువ విలువైనదట అందుకే ఈ కేక్ ధర అంత పలికింది. రైస్ క్రిస్పీ ,మోడలింగ్ చాక్లెట్‌తో దీన్ని రూపొందించారు.దీనికి అదనంగా20 కిలోల బెల్జియన్ చాక్లెట్లను కూడా ఉపయోగించారు. 50 కిలోల కేక్ ఫాండెంట్, 5వేల హ్యాండ్‌మేడ్ ఫాండెంట్ పువ్వులతోఘీ వెడ్డింగ్ గౌన్‌ను ప్రత్యేకంగా తయారు చేయడం విశేషం. View this post on Instagram A post shared by Couture Sugarpaste (@couturesugarpaste) -
కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!
శరీరంలో కొవ్వును కరిగించుకునే ప్రక్రియలో అనేకమంది చాలా చేదు అనుభవాలున్నాయి. కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా కొవ్వును కరిగించే ఇంజెక్షన్లు తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలన్న ఒక మహిళ కల పీడకలగా మిగిలిపోయింది. స్వయంగా శరీరాన్ని తినేసే అరుదైన బాక్టీరియాతో జీవన్మరణ పోరాటం చేస్తున్న మాజీ స్విమ్‌సూట్ మోడల్, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ గాథ ఒకటి వైరల్ అవుతోంది. ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ బీట్రిజ్ అమ్మ ఫాట్‌ను కరిగించుకునే క్రమంలో లాస్ ఏంజెల్స్ లోని ఒక లగ్జరీ స్పాను సంప్రదించింది. విటమిన్ ఇంజెక్షన్లు భారీ తీసుకునేది. విటమిన్ బీ1, సీ మిశ్రమంగా "వేగంగా కరిగిపోయే" డియోక్సికోలిక్ యాసిడ్‌తో కలిపి 60 ఇంజక్షన్లు తీసుకుంది. చేతులు, పిరుదులు, కడుపులోకి వీటిని తీసుకుంది. దాదాపు 66వేల కంటే ఎక్కువే ఖర్చుపెట్టింది. కొవ్వు కరగడం సంగతి ఏమోగానీ ఇపుడు అరుదైన మైకోబాక్టీరియం అబ్సెసస్ అనే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ సోకి నరక యాతన అనుభవిస్తోంది. ఇంజెక్షన్ తీసుకున్న ప్రతీ చోట భయంకరమైన పుండ్లతో భరించలేని భాధ పడుతోంది. దాదాపు మంకీ పాక్స్ లాంటి గాయాలతో ఆ బాక్టీరియా శరీరం మొత్తాన్ని తినేస్తోంది. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) డియోక్సికోలిక్ యాసిడ్ సరిగ్గా ఇంజెక్ట్ చేయకపోవడం వల్లే ఇది జరిగిందని వైద్యులు నిర్ధారించారు. దీంతో బాక్టీరియా బారిన పడి కుళ్ళిపోయిన చర్మాన్ని తొలగించేందుకు పలు శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ప్రతీ రోజూ ఆరు గంటల ఇంట్రావీనస్ యాంటీ బయాటిక్స్‌ను భరిస్తోంది. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) మంచానికే పరిమితమై ప్రాణం నిలుపుకునేందుకు ఆరాటపడుతోంది. ఒకరి సాయం లేకుండా రెస్ట్‌రూమ్‌కి వెళ్లలేక..కనీసం లేచి నిలబలేక ఇలా అన్నింటికి మరొకరి మీద ఆధారపడి బతుకేదాన్ని..శరీరం మంచం మీదే కుళ్ళిపోతోంది అంటూ తన అనుభవాన్ని పంచుకుంది బీట్రిజ్. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ, జీవితంలో సాధించాలని కలగన్నదో, ఇపుడు ఏమి కోల్పోయిందో గుర్తు చేసుకుని బోరున విలపించింది. అటు వైద్యులు కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలనే కలను వదులుకోండి ఇది జీవితాంతం మిమ్మల్ని వదలదని తెగేసి చెప్పారు. అంతేకాదు ఇతరులను భయపెట్టకుండా బహిరంగ ప్రదేశాల్లో బికినీలు ధరించ వద్దని కూడా సలహా ఇచ్చారు. కానీ ఇక్కడే బీట్రీజ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఇక నా శరీరం పోరాడలేదు ఓడిపోయింది..ఇక చనిపోతాను అనుకున్న క్షణంలో ధైర్యాన్ని కూడ దీసుకుంది. మాంసాన్ని తినేసే వికృతమైన, భయంకరమైన ఈ బాక్టీరియా గురించి అవగాహన పెంచేందుకు తన శాయశక్తులా కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే బాడీ పాజిటివిటీ మూవ్‌మెంట్‌ను మొదలు పెట్టింది. మన శరీరంలో ఎన్ని వైరుధ్యాలు, ప్రతికూలతలు, మచ్చలున్నా భయపడకుండా, ఆత్మన్యూనతతో దాచు కోకుండా శరీర ఆకృతితో సంబంధం లేకుండా అంతర్గతంగా, బాహ్యంగా అందంగా ఉండాలని పిలుపు నిస్తోంది. -
వోల్వో కార్ల పరుగు
న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న వోల్వో కార్ ఇండియా 2023 జనవరి–సెపె్టంబర్ మధ్య రిటైల్‌లో 1,751 యూనిట్లను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 40 శాతం అధికం అని కంపెనీ శుక్రవారం ప్రకటించింది. ఎక్స్‌సీ60 మోడల్ ఈ వృద్ధిని నడిపించిందని వెల్లడించింది. మొత్తం అమ్మకాల్లో ఈ మోడల్ వాటా ఏకంగా 35 శాతం ఉందని వివరించింది. దేశీయంగా అసెంబుల్ అవుతున్న పూర్తి ఎలక్ట్రిక్ కారు ఎక్స్‌సీ40 రిచార్జ్ మోడల్లో 419 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయని వోల్వో ప్రకటించింది. ఎక్స్‌సీ40 రిచార్జ్ వాటా 24 శాతం ఉందని తెలిపింది. సంస్థ మొత్తం విక్రయాల్లో ఎలక్ట్రిక్ కార్ల నుంచి 27 శాతం సమకూరుతోంది. ఈ విజయం కస్టమర్ల విశ్వాసాన్ని, భారత మార్కెట్‌కు ప్రీమియం, స్థిర వాహనాలను అందించడంలో కంపెనీ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని వోల్వో కార్ ఇండియా ఎండీ జ్యోతి మల్హోత్రా ఈ సందర్భంగా తెలిపారు. కంపెనీకి భారత్‌లో 25 డీలర్షిప్ కేంద్రాలు ఉన్నాయి. -
సైనికులు ప్రాణాలు పోతుంటే..పుతిన్ పట్టనట్లు చేస్తున్న పని చూస్తే..షాకవ్వతారు
ఇది రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేకంగా ఉపయోగించే నౌక. దీని పేరు ‘కొసాత్కా’– అంటే ‘కిల్లర్ వేల్’ జాతి తిమింగలం అని అర్థం. పుతిన్ దాదాపుగా మూడేళ్ల కిందటే ఈ భారీ నౌకను సొంతం చేసుకున్నా, ఇటీవలే దీనికి కళ్లుచెదిరే ఖర్చుతో అదనపు హంగులు సమకూర్చడంతో తాజాగా వార్తల్లోకెక్కింది. ఈ నౌకలోని అదనపు హంగుల కోసం 100 మిలియన్ పౌండ్లు (రూ.1.05 లక్షల కోట్లు) ఖర్చు చేయడం విశేషం. ఒకవైపు యుక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో దాదాపు మూడు లక్షల మందికి పైగా రష్యన్ సైనికులు ప్రాణాలు పోగొట్టుకున్నా, ఏమీ పట్టకుండా పుతిన్ తన నౌకను రాజసంగా తీర్చిదిద్దుకోవడానికి భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. ఈ నౌక అసలు పేరు ‘ది గ్రేస్‌ఫుల్’. జర్మనీ రేవు నుంచి పుతిన్ దీనిని 750 మిలియన్ పౌండ్లకు (రూ.7.92 లక్షల కోట్లు) సొంతం చేసుకున్నాక, దీని పేరును ‘కొసాత్కా’గా మార్చుకున్నాడు. యుక్రెయిన్‌పై సైనిక దాడిని ప్రకటించడానికి కొద్దిరోజుల ముందే ఈ నౌకను రష్యాకు పంపాల్సిందిగా, నౌకా సంస్థను ఆదేశించాడు. ఈ నౌక రష్యా తీరానికి చేరుకున్న 23 రోజుల్లోనే యుద్ధం మొదలైంది. ఒకవైపు యుద్ధం కొనసాగుతుంటే, పుతిన్ మాత్రం ఈ నౌకను తాను కోరుకున్న రీతిలో తీర్చిదిద్దుకునే పనిలోనే నిమగ్నమయ్యాడు. ఇందులో ఖరీదైన క్రిస్టల్ షాండ్లియర్లు, కార్పెట్లు, సోఫాలు, కాఫీ టేబుళ్లు ఏర్పాటు చేయడమే కాకుండా డ్రాయింగ్ రూమ్‌లలో బంగారు తాపడం చేయించాడు. ఖరీదైన కళాఖండాలను ఏర్పాటు చేయించుకున్నాడు. ఇన్ని హంగులు చేయించుకున్న ఈ నౌక పొడవు దాదాపు అరకిలోమీటరు ఉంటుంది. ఇందులో స్విమింగ్ పూల్స్, పైకప్పు మీద హెలిపాడ్, బంగారు ఫ్రేముల అద్దాలు, బంగారు తాపడం చేయించిన సింక్ పైపులు వంటి ఏర్పాట్లు చాలానే ఉన్నాయి. రష్యన్ అధికార వ్యతిరేక సంస్థ అయిన ‘అలెక్సీ నవాల్నీ’ ఈ నౌక లోపలి హంగుల ఫొటోలను, వాటి ఏర్పాట్లకు అయిన ఖర్చుల వివరాలను ఇటీవల వెలుగులోకి తెచ్చింది. (చదవండి: ఈ పడవ నడవాలంటే ఎండ ఉంటే చాలు! పొద్దుగూకినా ప్రాబ్లం లేదు!) -
దుబాయ్‌లో అదరిపోయే సూపర్ లగ్జరీ రిసార్ట్, మతిపోయే ఫీచర్లు, ఫోటోలు
-
హైదరాబాద్‌కి ఫుడ్లింక్.. సెలబ్రిటీల పెళ్లిళ్ల క్యాటరింగ్ కంపెనీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ క్యాటరింగ్ కంపెనీ ఫుడ్లింక్ ఎఫ్అండ్బీ హోల్డింగ్స్ ఇండియా తాజాగా దక్షిణాదిన అడుగుపెట్టింది. హైదరాబాద్‌లో 15,000 చదరపు అడుగుల్లో అంతర్జాతీయ స్థాయి అత్యాధునిక కిచెన్‌తోపాటు గిడ్డంగిని ఏర్పాటు చేసింది. అంబానీ–పిరమల్, దీపిక–రణ్వీర్, కేఎల్ రాహుల్–అథియా శెట్టి, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీవీ, రెడ్డి ల్యాబ్స్ కుటుంబ సభ్యుల వివాహ వేడుకల క్యాటరర్‌గా వ్యవహరించిన ఫుడ్లింక్కు రోజుకు 10 లక్షలకుపైగా అతిథులకు ఆహారం అందించే సామర్థ్యం ఉంది. ఫోర్బ్స్ ఇండియా టాప్–100లోని 75% వ్యాపార సంస్థలు, వారి కుటుంబ సభ్యులకు సేవలు అందించినట్టు ఫుడ్లింక్ సీఈవో సంజయ్ వజిరాణి మీడియాకు తెలిపారు. ‘లగ్జరీ క్యాటరింగ్, రెస్టారెంట్ల వ్యాపార విస్తరణకు హైదరాబాద్‌లో మూడేళ్లలో రూ.100 కోట్లు వెచ్చిస్తాం. ఇండియా బిస్ట్రో, చైనా బిస్ట్రో, గ్లోకల్ జంక్షన్, ఆర్ట్ ఆఫ్ దమ్ రెస్టారెంట్ల సంఖ్యను ఇప్పుడున్న 35 నుంచి 100కు చేరుస్తాం. ఈ ఆర్థిక సంవత్సరం రూ.450 కోట్ల టర్నోవర్ దాటు తాం. మూడేళ్లలో రూ.1,000 కోట్ల ఆదాయం ఆశిస్తున్నాం. అప్పుడు ఐపీవోకు వెళ్తాం’ అని చెప్పారు. -
లండన్‌లో లగ్జరీ భవనాన్ని దక్కించుకున్న భారత బిలియనీర్
యూకే రాజధాని నగరంలో అతిపెద్ద రెసిడెన్షియల్ డీల్‌ను భారత దేశానికి చెందిన వ్యాపారవేత్త, బిలియనీర్ సొంతం చేసుకున్నారు.ఎస్సార్ గ్రూప్‌కు సహ-యజమాని రవి రుయా ఇంద్ర భవనం లాంటి ఇంటిని కొనుగోలు చేశారు. రష్యన్ ప్రాపర్టీ ఇన్వెస్టర్ ఆండ్రీ గోంచరెంకోకు సంబంధించిన ఈ ప్రాపర్టీ విలువ దాదాపు రూ. 1200 కోట్లు. (145 మిలియన్ డాలర్లు) . 150 పార్క్ రోడ్‌లోని రీజెంట్స్ పార్క్‌కి ఎదురుగా ఉన్న హనోవర్ లాడ్జ్ మాన్షన్‌ను ఇంటిలోని జిబ్రాల్టర్-ఇన్కార్పొరేటెడ్ హోల్డింగ్ కంపెనీ విక్రయం ద్వారా కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ భవనం ఇటీవలి రెండేళ్ల క్రితం రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంధన సంస్థ అనుబంధ సంస్థ గాజ్ప్రోమ్ ఇన్వెస్ట్ యుగ్ మాజీ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోంచరెంకో యాజమాన్యంలో ఉంది. 2012లో కన్జర్వేటివ్ పార్టీ పీర్ రాజ్‌కుమార్ బగ్రీ లీజుకు తీసుకున్నారు. ఈ ప్రాపర్టీ నిర్మాణంలో ఉందనీ, ఇది కుటుంబ కార్యాలయానికి ఆకర్షణీయమైన పెట్టుబడిగా చేసే ధరకు అందుబాటులోకి వచ్చింద ని రుయా ఫ్యామిలీ ఆఫీస్ ప్రతినిధి విలియం రెగో ఒక ప్రకటనలో తెలిపారని పలు మీడియా సంస్థలు నివేదించాయి. గత ఏడాది లండన్‌లో విదేశీ సంస్థల రిజిస్టర్ విధానంలో పారదర్శకతను తీసుకు రావడానికి ప్రయత్నించిన తర్వాత కూడా లండన్ అల్ట్రా-ప్రైమ్ ప్రాపర్టీ మార్కెట్లో ఇప్పటికీ గోప్యంగానే ఉండటం విశేషం. అయితే ఈ ఆంక్షల ఫలితంగా ఇప్పటిదాకా చాలా రహస్యంగా జరిగే విలాస వంత గృహాలు క్రయ విక్రయాల్లో కాస్త మార్పు వచ్చింది. బ్రోకర్ హాంప్టన్స్ ఇంటర్నేషనల్ ప్రకారం, గత ఏడాది చివరి మూడు నెలల్లో లండన్ ఇళ్ల విక్రయాలు భారీగానే నమోదైనాయి. -
యూట్యూబర్..కమెడియన్ ఎల్విష్ యాదవ్ కళ్లు చెదిరే లగ్జరీ కార్ కలెక్షన్ (ఫొటోలు)
-
10000 కోట్లతో సుందర్ పిచ్చాయి ఇల్లు.. దాని ప్రత్యేకతలు ఇవే
-
ఈ సైకిల్ కొనే డబ్బుతో కారు కొనేయొచ్చు! ధర తెలిస్తే షాక్ అవుతారు!
ఇటాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ 'లంబోర్ఘిని' (Lamborghini) అనగానే మొదట గుర్తొచ్చేది లగ్జరీ కార్లు. అయితే ఈ సంస్థ ఖరీదైన కార్లను మాత్రమే కాకుండా సైకిల్స్ కూడా విడుదల చేస్తుందని చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ ఇప్పుడు మార్కెట్లో ఒక సైకిల్ విడుదల చేసింది. దీని ధర, ఇతర వివరాలను క్షుణ్ణంగా ఈ కథనంలో తెలుసుకుందాం. లంబోర్ఘిని విడుదల చేసిన ఈ సైకిల్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని, స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని. వీటి ధరలు వరుసగా 9,899 డాలర్లు (రూ. 8,15,365), 8,999 డాలర్లు (రూ. 7,41,226). కంపెనీ ఈ సైకిల్స్ విడుదల చేయడానికి ప్రత్యేకంగా 3టి అనే సంస్థతో జత కట్టింది. (ఇదీ చదవండి: ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు విడుదల చేసిన రోల్స్ రాయిస్ - ధర ఎంతో తెలుసా?) ఈ లేటెస్ట్ లంబోర్ఘిని సైకిల్స్ 51, 54, 58 సెంటీమీటర్ల లిమిటెడ్ సైజుల్లో మాత్రమే లభిస్తాయి. ఈ సైకిల్స్ డెలివరీకి సుమారు 16 వారాల సమయం పట్టే అవకాశం ఉంది. రేస్మ్యాక్స్ ఎక్స్ ఆటోమొబిలి లంబోర్ఘిని అనేది ఒక లైట్‌వెయిట్ మోడల్. దీనిని 3టీ కార్బన్ పరికరాలతో తయారు చేశారు. ఈ సైకిల్ ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఎక్స్ప్లోరో రేస్మ్యాక్స్ ఎక్స్ హరికెన్ స్టెరెట్టో సైకిల్‌ను పోలి ఉంటుంది. రెండవ మోడల్ స్ట్రాడా ఎక్స్ ఆటోమొబిలిని ప్రత్యేకంగా కంఫర్ట్, ఎయిరోడైనమిక్స్ కోసం రూపొందించారు. ఇందులో ఎస్ఆర్ఏఎం ఫోర్స్ పరికరాలు ఉంటాయి. 3టీతో జతకట్టి లంబోర్ఘిని విడుదల చేసిన మూడవ సైకిల్ ఇది కావడం గమనార్హం. ఇప్పటికే సంస్థ 2018లో ఆర్5 ఆటోమొబిలి లంబోర్ఘిని ఎడిషన్ రూపొందించింది. అప్పట్లో ఇది కేవలం 63 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. -
మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్ల చరిత్రకు ఇదే నిదర్శనం (ఫోటోలు)
-
ఆ నిర్మాత ఇంటి పక్కనే బంగ్లా కొన్న ఊర్వశి రేటెంతో తెలుసా..!
-
కరోనా ఎఫెక్ట్.. హాట్‌కేక్‌లా సేల్స్, కోట్లు పెట్టి ఆ ఇళ్లనే కొంటున్న జనం!
సాక్షి, హైదరాబాద్: దేశీయ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులకు హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (హెచ్ఎన్ఐ), అల్ట్రా హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ (యూహెచ్‌ఎన్‌ఐ)లు ఆసక్తిగా ఉన్నారు. ఫలితంగా లగ్జరీ, అల్ట్రా ప్రీమియం ప్రాపర్టీలకు డిమాండ్ పెరిగింది. 65 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు రూ.4–10 కోట్లు ధర ఉన్న లగ్జరీ ప్రాపర్టీ కొనుగోలుకు మొగ్గుచూపుతుండగా.. 13 శాతం మంది రూ.25 కోట్లకు పైన ధర ఉన్న స్థిరాస్తుల కోసం ఆసక్తిగా ఉన్నారని ఇండియా సోత్‌బైస్ ఇంటర్నేషనల్ రియల్టీ (ఐఎస్‌ఐఆర్) వార్షిక సర్వే వెల్లడించింది. కరోనాతో స్థిరాస్తి రంగానికి జరిగిన ప్రధాన మేలు.. సొంతింటి అవసరం తెలిసిరావటమే. మరీ ముఖ్యంగా గృహ విభాగంలో యువతరం భాగస్వామ్యం పెరగడం. 74 శాతం సంపన్న కొనుగోలుదారులు ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రియల్ ఎస్టేట్ ఒక ప్రధాన ఆస్తిగా పరిగణిస్తారు. 61 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు 2023–24లో లగ్జరీ ప్రాపర్టీలను కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. 34 శాతం మంది హైరైజ్ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తిగా ఉండగా.. 30 శాతం మంది ఫామ్‌హౌస్‌లు, హాలిడే హోమ్స్‌లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే 23 శాతం మంది వాణిజ్య సముదాయాలలో పెట్టుబడులకు, 15 శాతం మంది స్థలాలపై ఆసక్తిగా ఉన్నారు. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 34 శాతం మంది హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు విలాసవంతమైన ప్రాపర్టీలను కొనుగోలు చేశారు. ఇప్పటికీ చాలా మంది కొనుగోలుదారులు లగ్జరీ గృహాల కోసం శోధిస్తున్నారు. వచ్చే రెండు మూడేళ్లు దేశీయ రియల్టీ రంగం సరికొత్త రికార్డులను చేరుకుంటుందని విశ్వసిస్తున్నారు. గత 16 నెలలుగా లగ్జరీ గృహాల ధరలు పెరిగాయి. అయి తే 2015లోని గరిష్ట ధరలతో పోలిస్తే స్వల్ప పెరుగుదలేనని తెలిపారు. విశాలవంతమైన గృహాలు, గ్రీనరీ ఎక్కువగా ఉండే ప్రాపర్టీలకే లగ్జరీ కొనుగోలుదారులు మొగ్గుచూపిస్తున్నారు. సంపన్న భారతీయుల ప్రాపర్టీ ఎంపికలో తొలి ప్రాధామ్యాలు మెరుగైన ఫిజికల్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలకే. ఈ నగరాలే హాట్‌స్పాట్స్.. సంపన్న కొనుగోలుదారులు ప్రాపర్టీ కొనుగోళ్లకు ప్రధాన కారణం మెరుగైన జీవ నశైలి. మూలధన వృద్ధి, భవిష్యత్తు తరాలకు ఆస్తి వంటివి ఆ తర్వాతి అంశాలు. ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, గోవా, బెంగళూరు నగరాలలో గృహాల కొనుగోళ్లకు హెచ్ఎన్ఐ, యూహెచ్‌ఎన్‌ఐలు ఆసక్తిగా ఉన్నారు. 11% మంది సంపన్నులు విదేశాలలో ప్రాపర్టీ లకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా భయాలు తగ్గుముఖం పట్టడంతో విలాసవంతమైన భారతీయులు న్యూయార్క్, లండన్, దుబాయ్, లిస్బన్ దేశాలలో లగ్జరీ అపార్ట్మెంట్ల కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. చదవండి: Union Budget 2023-24: కొత్త ఇన్‌కం టాక్స్ ప్రశ్నలేంటీ? సమాధానాలేంటీ? -
అక్కడ ఉల్లి ధర వింటే..కళ్లల్లో నీళ్లు తిరగడం ఖాయం!
మన దేశంలో ఎప్పుడైన పెట్రోల్ ధరలు పెరిగినప్పుడో లేక అనావృష్టి సమయాల్లోనో ధరలు అధికమవుతాయి. అప్పుడే మనకు ఉల్లి ధర ఆకాశన్నంటుతుంది. పైగా అది కూడా మహా అయితే కేజి 30 నుంచి 70 మధ్యలో పెరుగుతుంది. దానికే మనవాళ్లు చేసే హడావిడి అంతా ఇంతకాదు. ఇదే అదనుగా రెస్టారెంట్ నుంచి చిన్న కాక హోటల్ వరకు రేట్లు పెంచేయడం, ఉల్లి లేని వంటకాలు అందించడం వంటివి చేస్తారు. కానీ ఇక్కడ ఈ దేశంలోని ఉల్లి పాయాల ధర వింటే అమ్మ బాబోయ్ అంటారు. కచ్చితంగా కొనేందుకు ముందుకు రావడానికి కూడా జంకుతారు. అందులో ఏ మాత్రం సందేహం లేదు. వివరాల్లోకెళ్తే...ఫిలిప్పీన్స్‌లో ఉల్లిపాయాల ధర చాలా ఘోరంగా ఉంటుంది. ఏకంగా కేజీ ఉల్లిపాయాలు సుమారు వెయ్యి రూపాయాలు వరకు పలుకుతోంది. అక్కడ ప్రస్తుతం ఉల్లి చాలా విలాసవంతమైన వస్తువుగా మారింది. ఇంతకు మునుపు అక్కడ ప్రజలు మూడు నుంచి నాలుగు కేజీల ఉల్లిపాయాలు కొనేవారు. ప్రస్తుతం అక్కడ ఎంతో అవసరం అనుకుంటే గానీ, అదికూడా కేవలం అరకేజీనే కొనుగోలు చేస్తున్నారు ప్రజలు. గత మూడు నెలల నుంచే ఈ దారుణమైన ధర పలుకుతోందని చెబుతున్నారు. వాస్తవానికి ఫిలిప్పీన్స్ వాసులు ఆహారంలో ప్రధానంగా ఉల్లిని విరివిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు వారంతా దాని ప్లేస్‌లో మరోదాన్ని జోడించి తినాల్సి వస్తోందని వాపోయారు. ఈ మేరకు అక్కడ వ్యవసాయ కార్యదర్శి ప్రెసిడెంట్ ఫెర్డినాండ్ మార్కోస్ జూనియర్ ఈ పెరుగతున్న ఆహార ధరల పరిస్థితిని అత్యవసర పరిస్థితిగా పేర్కొన్నారు. ఆయన ఉత్పత్తిని పెంచే దిశగా పలు ప్రత్యామ్నాయ పద్ధతుల కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. కొన్ని నెలల క్రితం ఫిలిప్పీన్స్ రెండు భారీ తుపాన్లను ఎదుర్కొంది. దీంతో అక్కడ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింది. అక్కడ ప్రజలు పెళ్లిళ్లకు ఉపయోగించే డెకరేషన్లో ఉల్లిని ఉపయోగించాలని చూస్తున్నారు కొందరూ. ఎందుకంటే ఆ తతంగం తర్వాత ఆ ఉల్లిపాయాలు కొందరూ పేద ప్రజలకు ఉపయోగపడతాయని, అదే పూలు అయితే వాడిపోతాయి ఉపయోగం ఉండదు అనేది వారి ఆలోచన. దీనిని బట్టి అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. పాపం అక్కడి ప్రభుత్వం సైతం ప్రజలకు భారం తగ్గించేలా...ధరల పెరుగుదలను నియంత్రించటానికి నానా అగచాట్లు పడుతోంది. (చదవండి: పాక్‌లో భూకంపం) -
భారత్‌లో గ్యాలెరీ లాఫయేట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: డిపార్ట్మెంట్ స్టోర్స్ కంపెనీ, ఫ్రాన్స్‌కు చెందిన గ్యాలెరీ లాఫయేట్ భారత్‌లో అడుగుపెడుతోంది. లగ్జరీ డిపార్ట్మెంట్ స్టోర్లతోపాటు ఈ–కామర్స్ వేదిక ద్వారా దేశీయంగా ఉత్పత్తులను విక్రయించనుంది. ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఈ మేరకు గ్యాలెరీ లఫయట్తో వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకుంది. తొలి ఔట్లెట్ 90,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ముంబైలో 2024లో, రెండవ స్టోర్ 65,000 చదరపు అడుగుల్లో ఢిల్లీలో 2025లో ప్రారంభం కానుంది. 200లకుపైగా బ్రాండ్స్‌కు చెందిన ఖరీదైన ఫ్యాషన్, యాక్సెసరీస్, ఫుడ్, అలంకరణ, కళాఖండాలను ఇక్కడ విక్రయిస్తారు. భవిష్యత్‌లో లగ్జరీ బ్రాండ్ల వృద్ధి కేంద్రంగా, ప్రపంచ విలాసవంతమైన మార్కెట్‌గా భారత్‌కు ఉన్న ప్రాముఖ్యతకు ఈ భాగస్వామ్యం నిదర్శనమని ఆదిత్య బిర్లా ఫ్యాషన్, రిటైల్ ఎండీ ఆశిష్ దీక్షిత్ తెలిపారు. ‘భారత్ వంటి ప్రతిష్టాత్మక, పరిణతి చెందిన మార్కెట్లో విస్తరించడం గర్వకారణం. ఇక్కడ మా బ్రాండ్ ప్రయోజ నం పొందగలదని బలంగా విశ్వసిస్తున్నాము. 2025 నాటికి విదేశాల్లో 20 స్టోర్లను చేరుకోవాలనే మా ఆశయానికి ఇది నాంది’ అని గ్యాలెరీ లాఫ యేట్ సీఈవో నికోలస్ హౌజ్ వివరించారు. 125 ఏళ్ల చరిత్ర కలిగిన గ్యాలెరీ లాఫయేట్ ఫ్రాన్స్‌తోపాటు పలు దేశాల్లో 65 కేంద్రాలను నిర్వహిస్తోంది. చదవండి: అమలులోకి కొత్త రూల్.. ఆ సమయంలో ఎస్ఎంఎస్ సేవలు బంద్! -
Majestic Princess: విలాస నౌకలో 800 మందికి కరోనా
సిడ్నీ: న్యూజిలాండ్ నుంచి వస్తున్న విలాసవంత పర్యాటక నౌక ‘మేజిస్టిక్ ప్రిన్సెస్’లోని 3,300 మంది ప్రయాణికులు, 1,300 మంది సిబ్బందిలో శనివారం మొత్తంగా 800 మందికి కోవిడ్ సోకింది. మెల్బోర్న్కు వెళ్లాల్సిన ఈ నౌక ప్రస్తుతం సిడ్నీలోని సర్క్యులర్ క్వేలో ఆగింది. కోవిడ్ తొలినాళ్లలో ఇదే తరహాలో రూబీ ప్రిన్సెస్ భారీ విలాసవంత పర్యాటక నౌకలో 900 మందికి కోవిడ్సోకి 28 మంది మహమ్మారికి బలయ్యారు. ఆస్ట్రేలియాలో కోవిడ్ కేసులు విజృంభిస్తున్న వేళ మేజిస్టిక్ నౌకలో కోవిడ్ ఉధృతిపై ఆందోళనలు పెరిగాయి. అయితే, ‘ పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారికి కోవిడ్ లక్షణాలు లేవు. కొద్ది మందికి స్వల్ప లక్షణాలు ఉన్నాయి. పరిస్థితి అదుపులోనే ఉంది. వారిని ఐసొలేషన్‌లో ఉంచాం’ అని క్రూయిజ్ ఆపరేటర్ అయిన కార్నివాల్ ఆస్ట్రేలియా అధ్యక్షురాలు మార్గరేట్ ఫిట్జ్‌గెరాల్డ్ చెప్పారు. -
కొట్టేశానోచ్! అని పరిగెత్తి... బొక్క బోర్లాపడ్డ దొంగ!
ఒక దొంగ మంచి ఖరీదైన వస్తువు కొట్టేశానన్న ఆనందంలో ముందు వెనుక చూడకుండా పారిపోయేందుకు యత్నించి బొక్క బోర్లాపడి అడ్డంగా దొరికి పోయాడు. ఈ ఘటన యూఎస్‌లోని వాషింగ్టన్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....వాషింగ్టన్‌లోని బెల్లేవ్‌లో లూయిస్ విట్టన్ స్టోర్ అనే లగ్జరీ షాపుకి ఒక దొంగ వచ్చాడు. అతను ఆ షాపులో సుమారు రూ. 14 లక్షలు ఖరీదు చేసే వస్తువుని దొంగలించి పారిపోయేందుకు యత్నించాడు. ఐతే ఆ షాపుకి బయటవైపుగా క్లీన్‌గా ఉన్న అద్దాన్ని గమనించకుండా బయటకు దారి అదే అనుకుని ఆ అద్దం గుండా వెళ్లిపోవాలనుకున్నాడు. అంతే ఆ దొంగ ఆ అద్దానికి గుద్దుకుని ఒక్కసారిగా కింద పడిపోయాడు. ఇంతలో సెక్యూరిటీ గార్డు వెంటనే అప్రమత్తమై అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించాడు. అతను 17 ఏళ్ల యువకుడని పోలీసులు చెప్పారు. ఈ బెల్లేవ్ నగరంలో ఇటీవల 50కి పైగా ఇలాంటి రిటైల్ దోపిడి, షాప్ చోరి కేసులు జరిగాయని పోలీసులు చెబుతున్నారు. వారంతా తమను గుర్తుపట్టరన్న ధైర్యంతో చేస్తున్నారని అన్నారు. ఈ మేరకు పోలీసులు బెల్లేవ్ నగరానికి వచ్చి ఎవరైనా ఇలాంటి నేరాలకు పాల్పడితే మరిన్ని కేసులు పెట్టి అరెస్టు చేస్తామని హెచ్చరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. (చదవండి: ఆవకాయబద్ద గొంతులో ఇరుక్కుని మహిళ పాట్లు! ఆశ్చర్యపోయిన వైద్యులు) -
కరోనా ఎఫెక్ట్: ఆ కేటగిరి అద్దె ఇళ్లకు ఫుల్ డిమాండ్.. టూ కాస్ట్లీ గురూ!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు పెద్ద పట్టణాల్లో ఖరీదైన ఇళ్ల అద్దెలు గడిచిన రెండేళ్లలో 8–18 శాతం మేర పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై మెట్రో పాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్), హైదరాబాద్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, పుణె పట్టనాల్లో లగ్జరీ ఇళ్ల కొనుగోలు, అద్దెకు డిమాండ్ పెరిగినట్టు వెల్లడించింది. అత్యధికంగా ముంబైలోని వర్లి ప్రాంతంలో అద్దె 18 శాతం పెరిగింది. 2000 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఖరీదైన భవంతి అద్దె 2020లో నెలవారీగా రూ.2 లక్షలు ఉంటే, అది రూ.2.35 లక్షలు అయింది. బెంగళూరు జేపీ నగర్లో అద్దె రెండేళ్లలో 13 శాతం పెరిగి రూ.52,000 అయింది. రాజాజీ నగర్లో కిరాయి 16 శాతం పెరిగి రూ.65,000కు చేరింది. ప్రముఖ లగ్జరీ హౌసింగ్ మార్కెట్లలో అద్దెలు గత రెండేళ్లలో రెండంకెల్లో పెరిగినట్టు అనరాక్ చైర్మన్ అనుజ్‌పురి తెలిపారు. కరోనా రెండో విడత తర్వాత పెద్ద సైజు ఇళ్లకు ప్రాధాన్యాత పెరిగినట్టు చెప్పారు. చెన్నైలోని అన్నా నగర్లో సగటు నెలవారీ అద్దె 13 శాతం పెరిగి రూ.63,000 అయింది. కొట్టు పురంలో 14 శాతం పెరిగి రూ.84,000కు చేరింది. హైదరాబాద్‌లో 15 శాతం భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో 2,000 చదరపు అడుగుల ఇంటి నెలవారీ అద్దె రెండేళ్లలో 15 శాతం పెరిగి రూ.62,000 అయింది. ఇదే సమయంలో చదరపు అడుగు ధర 6 శాతం పెరిగి రూ.7,400కు చేరింది. హైటెక్ సిటీ ప్రాంతంలో సగటు నెలవారీ అద్దె 11 శాతం పెరిగి రూ.59,000 అయింది. చదవండి: భారీ నౌక, రూ.8,318 కోట్ల ఖర్చు.. తొలి ప్రయాణం కూడా కాకముందే తునాతునకలు! -
చందమామే దిగి వచ్చిందా!
దుబాయ్: డబ్బుంటే ఆ అంతరిక్షాన్నే ఎంచక్కా కిందకి దింపేసుకోవచ్చేమో కదా! లగ్జరీ లైఫ్‌కు పెట్టింది పేరైన దుబాయ్‌లో పర్యాటకుల్ని ఆకర్షించడానికి చంద్రుడి ఆకృతిలో రిసార్ట్ నిర్మిస్తున్నారు. ఇది రెండేళ్లలో పూర్తవుతుందట. అచ్చు చంద్రుడి ఉపరితలం మాదిరిగా డిజైన్ ఆకర్షణీయంగా ఉంది. 735 అడుగుల ఎత్తైన ఈ మూన్ రిసార్ట్ దుబాయ్‌కి మరో ప్రధాన ఆకర్షణగా మారనుంది. ఇందులో స్పా, వెల్నెస్ సెక్షన్, నైట్‌క్లబ్, ఈవెంట్ సెంటర్ ఉంటాయి. వ్యోమగాములకు, అంతరిక్షంలోకి వెళ్లాలనుకునే సాధారణ పర్యాటకులకి శిక్షణ కూడా ఇస్తారట. దీనికి నిర్మాణానికి 500 కోట్ల డాలర్లు అవుతుందట. దీనిపై ఏటా 180 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని నిర్మాణ కంపెనీ అంచనా. ఈ రిసార్ట్స్‌లో ఏడాదికి కోటి మంది పర్యాటకులు ఎంజాయ్ చేసే వీలుంటుంది. (క్లిక్ చేయండి: సీఎన్జీ వినియోగదారులకు చేదు వార్త) -
2023 స్కోడా కొడియాక్ లాంచ్: ఆ లగ్జరీ కార్లకు షాక్!
ముంబై: లగ్జరీ కార్ల తయారీ సంస్థ స్కోడా తన ఫ్టాగ్‌షిప్ కొడియాక్ 2023 వెర్షన్ కారును లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 37,49,000 (ఎక్స్-షోరూమ్). ఎంట్రీ-లెవల్ లగ్జరీ 4×4 SUV స్టైల్, స్పోర్ట్‌లైన్ , ఎల్ అండ్ కే మూడు వేరియంట్లు అందుబాటులో ఉంటాయి. అయితే 2023 స్కోడా కొడియాక్ ధర రూ. టాప్-ఎండ్ ఎల్ అండ్ కే వేరియంట్ ధర 39.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా కంపెనీ ప్రకటించింది. అయితే ఇవి ఆఫర్ ధరలు మాత్రమే. 2023, మార్చి వరకు మాత్రమే ఈ ఆఫర్ ధరలు అందుబాటులో ఉంటాయి స్కోడా వెల్లడించింది. ప్రస్తుతం బుకింగ్‌లు అందుబాటులో ఉన్నాయి. 50వేలు చెల్లించి అన్ని స్కోడా డీలర్‌షిప్‌లలో ఈ కారును బుక్ చేసుకోవచ్చు. వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య డెలివరీలు అవుతాయి. గత జనవరిలో లాంచ్ చేసిన స్కోడా మోడల్ 2022 ఎస్యూవీ 48 గంటల్లో మొత్తం 1,200 యూనిట్లు రికార్డ్ స్థాయి సేల్స్‌ను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది మోడల్‌తో పోలిస్తే దాదాపు లక్షన్నన్నర రూపాయల రేటు పెంచింది. 2023 స్కోడా కొడియాక్ ఇంజన్, ఫీచర్లు వోక్స్వ్యాగన్ గ్రూప్ 2-లీటర్ TSI పెట్రోల్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 187.7 HP , 320 Nm టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రామాణిక 7 స్పీడ్ DSG ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందించింది. ఇది 7.8 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగం పుంజుకుంటుంది. 6 డ్రైవింగ్ మోడ్లలో ఇది లభ్యం. డైనమిక్ ఛాసిస్ కంట్రోల్ (డీసీసీ) CANTON 12-స్పీకర్ 625W సరౌండ్ సౌండ్ సిస్టమ్ వంటి కొన్ని కూల్ సెగ్మెంట్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. బ్లైండ్లు, బ్లాంకెట్స్,అంబరిల్లా, హోల్డర్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి అనేక సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి. 2023 స్కోడా కొడియాక్ జీప్ కంపాస్, మెరిడియన్, సిట్రోయెన్ సీ5 ఎయిర్‌క్రాస్, వోక్స్వ్యాగన్ టిగువాన్,2023 హ్యుందాయ్ టక్సన్ వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. -
ఏ అండ్ టీలో రిలయన్స్ రిటైల్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: రిలయన్స్ రిటైల్ (ఆర్ఆర్వీఎల్) తాజాగా లగ్జరీ ఫ్యాషన్ సంస్థ అబ్రహం అండ్ ఠాకూర్‌లో (ఏ అండ్ టీ) మెజారిటీ వాటాలు కొనుగోలు చేసింది. అయితే, ఇందుకోసం ఎంత వెచ్చించినదీ వెల్లడించలేదు. అబ్రహం అండ్ ఠాకూర్‌లో మెజారిటీ వాటాల కోసం ఇన్వెస్ట్ చేసినట్లు రిలయన్స్ రిటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. డేవిడ్ అబ్రహం, రాకేష్ ఠాకూర్ 1992లో ఏ అండ్ టీని ప్రారంభించారు. ఇందు లో కెవిన్ నిగ్లి తర్వాత భాగస్వామి గా చేరారు. లిబర్టీ, బ్రౌన్స్, హరోడ్స్, సెల్ఫ్రిజెస్ వంటి అంతర్జాతీయ స్టోర్స్‌లో కూడా భారతీయ చేనేత వస్త్రాల కలెక్షన్లను ఏ అండ్ టీ అందుబాటులోకి తెచ్చింది. ఏ అండ్ టీ వినూత్న డిజైన్లకు దేశీ లగ్జరీ కస్టమర్లలో మంచి ఆదరణ ఉంటోందని ఆర్ఆర్వీఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఆర్ఆర్వీఎల్తో భా గస్వామ్యం ద్వారా హోమ్ ఫర్నిషింగ్స్, లాంజ్‌వేర్ సహా పలు ఫ్యాషన్స్, లైఫ్ స్టయిల్ కలెక్షన్లను మరింత విస్తృతంగా అందుబాటులోకి తేగలమని డేవిడ్ అబ్రహం తెలిపారు. -
అమ్మకానికి ఒంటరి మేడ.. ధర తెలిస్తే కళ్లు చెదరాల్సిందే..
ఎక్కడో దూరంగా కొండకోనల్లో ఉన్న గ్రామంలో ఉంటున్నారా? అయినా కూడా ఏకాంతంగా ఉన్నట్టు అనిపించడం లేదా! అయితే ఈ సముద్రం మధ్యలోని బిల్డింగ్ మీకోసమే. పేరు స్పిట్బాంక్ ఫోర్ట్. ఇప్పుడు దీన్ని అమ్మకానికి పెట్టారు. పోర్టులు, ఓడల రక్షణ కోసం ఇంగ్లండ్‌లో 1870ల్లో కట్టిన కొన్ని పోర్టుల్లో ఇదీ ఒకటి. ఇందులో 9 బెడ్రూమ్లు, బాత్రూమ్లు, ఓ సినిమా రూమ్, ఓ గేమ్ రూమ్, ఓ వైన్ సెల్లార్ ఉన్నాయి. బిల్డింగ్ పైన ఒక వేడి టబ్, మంట కాచుకునే గదులున్నాయి. అద్భుతమైన సముద్రం వ్యూ కనబడుతుంది. దీని వ్యాసం 50 మీటర్లు. లండన్ నుంచి దాదాపు 125 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధర దాదాపు రూ. 35 కోట్ల నుంచి రూ. 40 కోట్లు. చదవండి: తెలుసా..! ‘పేరు’తో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించొచ్చు! -
నీ ఇల్లు బంగారం గానూ!
సాక్షి, సిటీబ్యూరో: ఇల్లు నిజంగానే బంగారమైపోయింది. లగ్జరీ ఇంటీరియర్‌కు 24 క్యారెట్ గోల్డ్ లీఫింగ్తో (పైన పూత) ఇంటిని తీర్చిదిద్దుతున్నారు నగరవాసులు. ప్రధాన ద్వారం మొదలు కార్పెట్లు, కర్టెన్లు, వాల్ పేపర్స్, లైట్లు, సీలింగ్, ఫర్నిచర్ వరకూ ప్రతీది బంగార వర్ణంతో మెరిసిపోతుంది. టర్కీ, ఇటలీ వంటి దేశాల నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్‌ను దిగుమతి చేసుకొని మరీ ఇంటిని బంగారుమయం చేసేస్తున్నారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో ఏడాదిన్నర కాలంగా ఇంటి పట్టునే ఉంటున్నారు. హోటల్స్, రెస్టారెంట్లకు వెళ్లడం లేదు. వీకెండ్స్, హాలీడే ట్రిప్స్ లేవు. గతంలో రోజులో 8–10 గంటలు మాత్రమే ఇంట్లో గడిపేవాళ్లు. మిగిలిన సమయం ఆఫీసులో, ప్రయాణంలో, ఇతరత్రా అవసరాలకు పోయేవి. కానీ ఇప్పుడు కరోనా, వర్క్ ఫ్రం హోమ్ ఇతరత్రా కారణాలతో ఇంట్లో గడిపే సమయం పెరిగింది. దీంతో వినోదం, ఆనందం కోసం బయట చేసే ప్రతి పనినీ ఇంట్లో ఉంటూనే ఆస్వాదించాలనే అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఇంటిని, ఇంట్లోని ప్రతి వసతులను ఆధునికంగా ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నారు. గతంలో ఆరోగ్యం, ఫిట్నెస్ కోసం బయట జిమ్, స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లే వారు ఇప్పుడు అవే వసతులు, ఔట్‌డోర్ జిమ్‌లను కల్పించే గేటెడ్ కమ్యూనిటీలను వెతుకుంటున్నారు. వీకెండ్స్‌లో సినిమాకు వెళ్లే బదులు.. ఓవర్ ది టాప్ (ఓటీటీ), నెట్‌ఫ్లిక్స్ వంటి వాటిల్లో ఇంట్లోనే థియేటర్ అనుభూతి కల్పించే హోమ్ థియేటర్ ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనాకు ముందు కంటే హైఎండ్ నగరవాసుల వినియోగ వ్యయం తగ్గింది. దీనిని లగ్జరీ ఇంటీరియర్ కోసం వెచ్చిస్తున్నారు. విదేశాల నుంచి దిగుమతి... ఇటలీ, టర్కీ, ఈజిప్ట్ దేశాల నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్ దిగుమతి అవుతున్నాయి. ఇంటీరియల్లో వినియోగించే ఉత్పత్తుల్లో 60 శాతం ఆయా దేశాల నుంచే దిగుమతి అవుతుంటాయని గిరిధారి కన్స్ట్రక్షన్స్ ఎండీ కే ఇంద్రసేనారెడ్డి తెలిపారు. తలుపులు, డైనింగ్ టేబుల్స్, బెడ్స్, వాల్ పేపర్స్, కర్టెన్స్, మ్యాట్స్, లైట్లు, మార్బుల్స్, టైల్స్, ఫర్నిచర్, శాండిలియర్స్, బాత్ ఫిట్టింగ్స్, ల్యాండ్ స్కేపింగ్, పెయింటింగ్స్, శిల్పాలు.. ఇలా ప్రతి ఒక్కటీ దిగుమతి చేసుకుంటునన్నారు. విభిన్న డిజైన్స్, లిమిటెడ్ ఎడిషన్ ఉత్పత్తులు దొరకడమే దిగుమతి చేసుకోవటానికి ప్రధాన కారణం. గతంలో హోమ్ డిజైనింగ్‌లో ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ మాత్రమే భాగస్వామ్యమయ్యే వారు. కానీ, ఇప్పుడు శిల్పులు, చిత్రకారులు కూడా వీరితో జతకట్టి నివాసితులకు ఆధునిక అనుభూతిని కల్పించేలా గృహాలను తీర్చిదిద్దుతున్నారు. లిమిటెడ్ ఎడిషన్స్లలో కొన్ని బ్రాండ్లు... పలు లగ్జరీ కార్ల కంపెనీలు బెంట్లీ, పోర్షే వంటివి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నాయి. ఇటలీకి చెందిన ఫెండి కాసా, జియోర్జెట్టి, రోబర్టో కావల్లీ, ట్రుసార్జీ కాసా, ఎట్రో హోమ్, జంబో, జియాన్ఫ్రాంకో ఫెర్రే హోమ్, న్యూయార్క్‌కు చెందిన రాల్ఫ్ లారెన్ హోమ్, యూకేకు చెందిన బెంట్లీ హోమ్, ప్యారిస్‌కు చెందిన బకారట్ లా మైసన్, ఫ్రాన్స్‌కు చెందిన రిట్జ్ పారిస్, బుగట్టీ హోమ్.. ఇవన్నీ అంతర్జాతీయ ఇంటీరియర్ బ్రాండ్లు. క్లాసిక్ స్టయిల్లో చేతితో తయారు చేస్తారు. నాణ్యత, డిజైనింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయి. నగరంలో లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్.. మైహోమ్, అపర్ణా, రాజపుష్ప, ముప్పా వంటి ప్రాజెక్ట్‌లతో నాలుగైదుగురితో పాటు జూబ్లిహిల్స్ రోడ్ నం.45, గచ్చిబౌలిలోని ఇద్దరు వ్యక్తిగత కస్టమర్లు పూర్తిగా టర్కీ నుంచి దిగుమతి చేసుకున్న 24 క్యారెట్ల గోల్డ్ లీఫింగ్తో ఇంటీరియర్ చేయించుకున్నారు. గిరిధారి, ప్రణీత్, ఎస్ఎంఆర్ తదితర సంస్థలు క్లబ్‌హౌస్‌లను విదేశీ ఇంటీరియర్ ఉత్పత్తులతో ఆధునికంగా తీర్చిదిద్దుతున్నాయి. సెలబ్రిటీలు, బడా వ్యాపారవేత్తలు, బ్యూరోక్రాట్స్, రాజకీయ నేతలు తమ గృహాలను లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్‌తో రాజభవనాల లాగా తీర్చిదిద్దుతున్నారు. కార్మికులూ విదేశాల నుంచే.. ఈ తరహా ఇంటీరియర్స్‌ను ఇక్కడి కార్మికులు చేయలేరు. అందుకే ఈజిప్ట్ నుంచి ఇంటీరియర్ నిపుణులు వచ్చి డిజైనింగ్ చేస్తుంటారని తాయబా తెలిపారు. 10 వేల చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న గృహాలకు మాత్రమే ఈ తరహా లగ్జరీ ఇంటీరియర్స్ బాగుంటాయి. వీటి ధరలు చదరపు అడుగుకు రూ.800 నుంచి 4,500 వరకు ఉంటాయి. ప్రాజెక్ట్ మొత్తానికి రూ.5–10 కోట్ల వరకు ఖర్చవుతుంది. ఇంటీరియర్ డిజైన్ పూర్తి చేసేందుకు 30–90 రోజుల సమయం పడుతుంది. కళ్లు తిరిగే ధరలు.. ►బెంట్లీ సోఫా. వీటి ప్రారంభ ధర రూ.30 లక్షల నుంచి ఉంటుంది. పోర్షే కిచెన్ సెట్స్ ప్రారంభ ధర రూ.కోటి నుంచి మొదలవుతుంది. ►అర్మానీ కాసా ఫర్నీచర్, టైల్స్. వీటిని ఆఫ్రికాలో పెరిగే కొన్ని అరుదైన రకాల వృక్షాల నుంచి ఈ ఫర్నీచర్‌ను తయారు చేస్తారు. వీటి ప్రారంభ ధర రూ.50 లక్షల పైమాటే. ►‘ట్రీ ఆఫ్ లైఫ్’ అనే 30–40 ఏళ్ల నాటి అరుదైన వృక్షాలను ఆఫ్రికా దేశం నుంచి దిగుమతి చేసుకొని ల్యాండ్స్కేపింగ్గా వినియోగిస్తుంటారు. ►జపాన్‌కు చెందిన టోటో, జర్మనీకి చెందిన నోకెన్ బాత్రూమ్ అండ్ శానిటైజ్ ఫిట్టింగ్స్‌లో గ్లోబల్ బ్రాండ్లు. ఆయా ఉత్పత్తుల ప్రారంభ ధరలు రూ.5 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఆటోమెటెడ్ టాయిలెట్, షవర్స్, బాడీ జెట్స్ ఉత్పత్తులు వీటి ప్రత్యేకత. టాయిలెట్ పైన కూర్చుంటే చాలు వాతావరణాన్ని బట్టి ఆటోమెటిక్‌గా అదే నీటిని పంపింగ్ చేస్తుంది. శరీర ఉష్ణోగత్రను బట్టి మారుతూ ఉంటుంది. షవర్స్, బాడీజెట్స్ శ్రావ్యమైన మ్యూజిక్, లైటింగ్స్‌తో పైనుంచి వర్షం పడినట్లుగా వస్తుంటుంది. ►డెఫా లైటింగ్ సొల్యూషన్స్ మనిషి మూడ్‌ను, ఉష్ణోగ్రతను బట్టి గదిలో వెలుతురును ఇవ్వటం దీని ప్రత్యేకత. ప్రముఖ జువెల్లరీ బ్రాండ్ స్వరోస్క్వీ.. శాండిలియర్స్ను కూడా విక్రయిస్తుంది. వీటి ప్రారంభ ధర రూ.10 లక్షలు. ►అమెరికాకు చెందిన జేబీఎల్, డెన్మార్క్‌కు చెందిన డాలీ, డైనడియా, జపాన్‌కు చెందిన డినాన్, ఫ్రాన్స్‌కు చెందిన డెవిలెట్, ఫోకల్ వంటివి థియేటర్ అనుభూతిని కల్పించే హోమ్ థియేటర్స్ గ్లోబల్ బ్రాండ్లు. కరోనా కారణంగా ప్రయాణాలు కుదరడం లేదు రెసిడెన్షియల్, కమర్షియల్, ఇనిస్టిట్యూషనల్ ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైన్స్ చేస్తాం. ప్రస్తుతం హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు నగరాలలో 50–60 ప్రాజెక్ట్స్ ఆర్డర్లు ఉన్నాయి. కరోనా కారణంగా విదేశాలకు వెళ్లి ఇంటీరియర్స్‌ను ఎంపిక చేయడం కుదరటం లేదు. – జీ రామ్మోహన్, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైనర్ ప్యాలెస్‌లు తీర్చిదిద్దడం మా ప్రత్యేకత హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, అహ్మదాబాద్ నగరాల్లో 55 వేల చదరపు అడుగులలో పలు ప్రాజెక్ట్‌ల ఆర్డర్లు ఉన్నాయి. టర్కీ, ఇటలీ రాయల్ ఫర్నిచర్‌తో లండన్, దుబాయ్, సౌదీ ప్యాలెస్ వంటి కాన్సెప్ట్‌లతో ఇంటీరియర్‌ను డిజైన్ చేయడం మా ప్రత్యేకత. పదేళ్ల వారంటీ కూడా ఉంటుంది. – తాయ్యబా, ఎండీ, బెనోయిట్ ఫర్నీచర్ -
పన్ను ఎగవేసి విదేశాల నుంచి లగ్జరీ కార్ల దిగుమతి
-
నాలుగు నెలల్లో రెట్టింపు నగదు.. లగ్జరీ కారు.. కట్ చేస్తే..
సాక్షి, టీ.నగర్(తమిళనాడు): డిపాజిటర్లకు నాలుగు నెలల్లో రెట్టింపు నగదు ఇస్తామని ఆశచూపి పలువురి వద్ద రూ.60 కోట్ల వరకు మోసగించిన ప్రైవేటు సంస్థపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మదురై కాలవాసల్ బెతేల్ నగర్లో ఒక ప్రైవేటు ట్రేడింగ్ సంస్థ పని చేస్తోంది. దాన్ని దిండుక్కల్‌కు చెందిన ఆనంది, మనోజ్‌కుమార్, మదురైకి చెందిన ఫారూక్ నిర్వహిస్తున్నారు. ఇందులో నగదు పెట్టుబడులు పెడితే 120 రోజుల్లో రెట్టింపు అవుతుందని, అంతేకాకుండా లగ్జరీ కారు ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. దీన్ని నమ్మి వేలాదిమంది ఈ సంస్థలో రూ.2,500 నుంచి రూ.లక్షలు వరకు పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. మొదట్లో కొంతమందికి రెట్టింపు నగదు ఇచ్చారు. తర్వాత ఇవ్వలేదు. అనుమానించిన డిపాజిటర్లు నిర్వాహకులను ఫోన్లో సంప్రదించగా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో 48 మంది బుధవారం మదురై పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వేలాదిమంది నుంచి రూ.60 కోట్ల మేరకు మోసగించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి నగదు ఇప్పించాలని కోరారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. చదవండి: వివాహేతర సంబంధం: చేతులు, కాళ్లు కట్టేసి.. -
తగ్గనున్న లగ్జరీ వాహనాల ధరలు
సాక్షి, హైదరాబాద్ : కోవిడ్ కారణంగా ఆర్థిక రంగంలో నెలకొన్న స్తబ్ధతను తొలగించేలా కేంద్రం వివిధ రంగాలకు వెన్నుదన్నుగా నిలిచింది. ఆటోమొబైల్ రంగానికి ఊతమిచ్చేందుకు పలు చర్యలు చేపట్టింది. కోవిడ్ కాలంలో చిన్న కార్లు, ద్విచక్ర వాహనాల అమ్మకాలు సంతృప్తికరంగానే ఉన్నప్పటికీ హై ఎండ్ వాహనాల అమ్మకాలకు మాత్రం బ్రేక్ పడింది. లగ్జరీ బైక్‌లపైనా వాహన వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని రూ.10 లక్షల ఖరీదు చేసే బైక్‌లపై సుమారు రూ.30 వేల వరకు, రూ.50 లక్షలు దాటిన కార్లపై రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ధరలు తగ్గనున్నట్లు అంచనా. కోవిడ్ కారణంగా ప్రజా రవాణా స్తంభించడం, కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకొని చాలామంది సొంత వాహనాలకు ప్రాధాన్యమిచ్చారు. కానీ చిన్న కార్లు, బైక్‌లకే ఎక్కువ డిమాండ్ కనిపించింది. గత ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు సుమారు 50 వేల వరకు వాహన విక్రయాలు జరిగాయి. కానీ హై ఎండ్ వాహనాలకు మాత్రం పెద్దగా ఆదరణ లభించలేదు. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో హై ఎండ్ వాహనాల విక్రయాలను ప్రోత్సహించేందుకు వాహనాల ధరలను తగ్గించనున్నట్లు ప్రకటించారు. హై ఎండ్‌పై ఆసక్తి.. గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు లక్షన్నర వరకు హై ఎండ్ వాహనాలు ఉన్నాయి. వీటిలో రూ.10 లక్షలు దాటిన బైక్‌లు లక్షకు పైగా ఉన్నట్లు అంచనా. రూ.50 లక్షలు దాటిన కార్లు సుమారు 50 వేల వరకు ఉంటాయి. ప్రతి సంవత్సరం 10 వేల నుంచి 15 వేల వరకు విక్రయిస్తున్నారు. ఆడి, బీఎండబ్ల్యూ, రేంజ్‌రోవర్, ఓల్వో, రోల్స్‌రాయిస్, లాంబోర్గ్ వంటి అధునాతన వాహనాలు హైదరాబాద్ రహదారులపై పరుగులు తీస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ధరల తగ్గింపుతో వినియోగదారులు హై ఎండ్ పట్ల ఆసక్తి చూపవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈవీలకు ఊతం.. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా మరిన్ని ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఇప్పటికే పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని ఎలక్ట్రిక్ వాహనాలకు జీవితకాల పన్ను నుంచి మినహాయింపునిచ్చిన సంగతి తెలిసిందే. వాహనాల ధరల్లోనూ ఈ ఆర్థిక సంవత్సరం కొంత వరకు తగ్గింపు ఉంటుంది. ఎలక్ట్రిక్ బస్సులకు రైట్ రైట్.. సిటీ రోడ్లపై మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి 40 ఏసీ ఓల్వో ఎలక్ట్రిక్ బస్సులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుండగా.. తాజా బడ్జెట్ ప్రతిపాదనల మేరకు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. వాహన కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్రం విద్యుత్ ఆధారిత వాహనాలకు ప్రోత్సాహాన్ని అందజేయనున్నట్లు స్పష్టం చేసింది. దేశంలో 20 వేల ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా నగరంలో కొన్ని సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రిక్ బస్సుల కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గతంలోనే ప్రణాళికలను సిద్ధం చేసింది. కేంద్రం ఇచ్చే రాయితీలపైన ఈ బస్సులను ప్రవేశపెట్టడం వల్ల గ్రేటర్ ఆర్టీసీ సేవలను బలోపేతం చేసేందుకు అవకాశం లభించనుంది. ఆహ్వానించదగిన పరిణామం కోవిడ్‌తో లగ్జరీ వాహనాల అమ్మకాలు బాగా తగ్గిపోవడంతో ఆ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వాహనాల ధరలను కొంత మేరకు తగ్గించాలని నిర్ణయించడం ఆహ్వానించదగిన మార్పు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. – రామ్కోటేశ్వర్రావు, తెలంగాణ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు -
కాలు మీద కాలు
ఒక చెట్టు మీద ఒక కాకి రోజంతా అలాగే కూర్చొని ఉంది. కాలి నొప్పో, కంటి నొప్పో అయి కూర్చోవడం కాదు. ఉల్లాసంగా, విలాసంగా కాలు మీద కాలు వేసుకుని కూర్చొని ఉంది! కిందికి, పైకి, పక్కలకు ముక్కు కదపడం ఒక్కటే అది చేస్తున్న పని. ఓ కుందేలు ఉదయాన్నే ఆహారం వెతుక్కుంటూ చెట్టు కిందికి గెంతుకుంటూ వచ్చి, చెట్టు పైన కూర్చొని ఉన్న ఆ కాకిని చూసింది. మళ్లొకసారి అటు గెంతుతూ, ఇటు గెంతుతూ చెట్టు పైకి చూసింది. కాకి ఆ కొమ్మ మీద అలాగే కూర్చొని ఉంది. మధ్యాహ్నం అయినా అలాగే కూర్చొని ఉంది. సాయంత్రం కావస్తున్నా అలాగే కూర్చొని ఉంది. ‘ఆహా.. తిండి తిప్పల్లేకుండా, చీకూచింతా లేకుండా ఎంత హాయిగా బతుకుతోంది ఈ కాకి’ అనుకుంది. ఇక ఉండబట్టలేక, ‘‘కాకిగారూ.. నేను కూడా మీలాగే రోజంతా పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని విశ్రాంతిగా కూర్చొవచ్చా?’’ అని అడిగింది. ‘ఓ.. ఎందుక్కూర్చోకూడదూ? తప్పకుండా కూర్చోవచ్చు కుందేలు పిల్లా’’ అంది కాకి. కుందేలుకు సంతోషం వేసింది. ఆ చెట్టు కిందే తీరిగ్గా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంది. కొద్దిసేపటికే అటుగా వచ్చిన నక్క.. కుందేలును నోట కరుచుకుని వెళ్లింది. ఇందులో నీతి ఏమిటంటే.. పనీపాటా లేకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడానికి ఎవరికీ అందనంత ఎత్తులో ఉండాలని! -
హైదరాబాద్‌లో ఫర్నిచర్ హబ్!
ఒకటి, రెండు.. కాదండోయ్ ఏకంగా 20 దేశాలకు చెందిన లగ్జరీ ఫర్నిచర్.. అందులోనూ 100కు పైగా బ్రాండ్లతో ఫర్నిచర్ ప్రియులను రా..రమ్మంటోంది ఎలివేట్ ఎక్స్! హైదరాబాద్‌లో లగ్జరీ ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్స్‌కు డిమాండ్ పెరగడంతో ఖజానా గ్రూప్ ఎలివేట్ ఎక్స్ పేరిట ఎక్స్‌క్లూజివ్ షోరూమ్‌ను ఏర్పాటు చేసింది. ఏడు అంతస్తుల్లోని ఈ షోరూమ్‌లో ప్రతి ఫ్లోర్నూ ప్రత్యేక కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దారు. సాక్షి, హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నంబరు 12లో 50 వేల చ.అ.ల్లో ఎలివేట్ ఎక్స్ షోరూమ్ ఉంది. జర్మనీ, ఇటలీ, ఇండోనేషియా, వియత్నాం, స్పెయిన్, ఫిలిప్పీన్స్, ఆస్ట్రేలియా వంటి 20 దేశాలకు చెందిన సుమారు 100కు పైగా బ్రాండ్లున్నాయి. ఇందులో 12 బ్రాండ్లు ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్స్. పసిఫిక్ గ్రీన్, ఇండిస్ట్రియా ఎడిషన్, కోంటే, గెయిన్స్విల్లీ, డొమెటాలియా, శాంతా లుకియా, ఆర్చ్బోన్ వంటి నేషనల్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్స్‌తో పాటూ నటుజ్సీ ఇటాలియా, జైపూర్ రగ్స్, లా ఫార్మా, పాపాడాటోస్ వంటి రీజినల్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్స్ ఉన్నాయి. ఫ్యాబ్రిక్ సోఫా, బెడ్స్, డైనింగ్ టేబుల్ వంటి ఫిక్స్డ్ ఫర్నిచర్‌తో పాటూ మాడ్యులర్ కిచెన్స్, వార్డ్రోబ్స్, టీవీ సెట్స్ వంటి మాడ్యులర్ ఫర్నీచర్ ఉంటాయి. సెలబ్రిటీలే కస్టమర్లు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు ఎలివేట్ ఎక్స్ స్టోర్లున్నాయి. ఇప్పటివరకు సుమారు 10 వేలకు పైగా కస్టమర్లకు లగ్జరీ ఫర్నిచర్, ఇంటీరియర్స్‌ను అందించామని ఎలివేట్ ఎక్స్ డైరెక్టర్ శివానీ ఆనంద్ తెలిపారు. మహేశ్ బాబు, రకుల్ ప్రీత్‌సింగ్, అల్లు అర్జున్, మోహన్ బాబు, రాఘవేంద్ర రావు వంటి సెలబ్రిటీలెందరో మాకు కస్టమర్లున్నారు. ఫార్చూన్ ఎస్మెరాల్డ్, అర్బన్ విల్లా, శ్రీనివాస కన్స్ట్రక్షన్స్, అపర్ణా, ఊర్జితా, డీఎస్ఆర్, ల్యాంకో వంటి నిర్మాణ సంస్థలకు విల్లా ప్రాజెక్ట్‌లకు ఫర్నిచర్ అందించాం. బెడ్ ధర రూ.10 లక్షలు.. హైదరాబాద్‌లో రియల్టీ మార్కెట్‌తో పాటూ లగ్జరీ ఫర్నిచర్‌కు డిమాండ్ పెరిగింది. విదేశాల్లో లభించే ఫర్నిచర్, ఇంటీరియర్ డిజైన్స్ కావాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. కస్టమర్లకు ఫర్నిచర్ గురించి సులువుగా అర్థమయ్యేందుకు వీలుగా ఒక్కో అంతస్తులో ఒక్కో రకమైన కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దాం. బ్లో, ఇండస్ట్రియల్ ఎడిషన్, ఫ్యూజన్ స్టయిల్, క్లాసికల్ స్టయిల్, ఔట్‌డోర్ ఫర్నిచర్ ఇలా ప్రతి ఫ్లోర్లో 30 వరకు ఉత్పత్తులుంటాయి. ధరలు ఫ్యాబ్రిక్ సోఫా రూ.2.5– రూ.6 లక్షలు, లెదర్ సోఫా రూ.6–17 లక్షలు, బెడ్స్ రూ.2–10 లక్షలు, డైనింగ్ టేబుల్ లక్ష నుంచి రూ.8 లక్షలు, కుర్చీలు ఒక్కదానికి రూ.15 వేలు నుంచి రూ.2.5 లక్షలు వరకున్నాయి. -
పన్ను బాదుడుకు నోటిఫికేషన్
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దకార్లు, లగ్జరీ కార్లపై జీఎస్టీ పెంపునకు ఉద్దేశించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీచేసింది. మిడ్-సైజ్ నుండి హైబ్రీడ్ వేరియంట్లపై గరిష్టంగా 25 శాతం వరకు సెస్ పెంపునకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. లగ్జరీ కార్ల ధరలు మోత మోగనున్నాయి. వస్తువులు, సేవల పన్ను (రాష్ట్రాలకు పరిహారం) ఆర్డినెన్స్, 2017 సవరణ నోటిఫికేషన్ ప్రభుత్వం జారీ చేసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదం తర్వాత ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం సెప్టెంబరు 2వతేదీ నుంచి ఈ పెంపు అమలులోకి వచ్చింది. దీనికి పార్లమెంట్ అమోదం లభించాల్సి ఉంటుంది. అయితే ఏయే కార్లపై గరిష్టంగా ఎంతపన్ను బాదుడు ఉంటుంది అనేది కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన ఈనెల (సెప్టెంబరు) 9న హైదరాబాద్‌లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో తేలనుంది. ఈ ఏడాది జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రావడంతో కార్ల ఉత్పత్తి సంస్థలు ధరలను రూ.లక్ష నుంచి 3లక్షల మధ్య తగ్గించాయి. ప్రస్తుతం అమలవుతున్న సెస్ 15 నుంచి గరిష్టంగా 25 శాతానికి పెరగడంతో ఈ ప్రీమియం సెగ్మెంట్ కార్ల ధరలు మోత మోగనున్నాయి. స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్స్(ఎస్‌యూవీలు), లగ్జరీ కార్లన్నింటిపైనా పెరిగిన సెస్ అమలు కానుంది. పెద్ద మోటార్ వాహనాలు, ఎస్‌యూవీలు, మిడ్ సెగ్మెంట్ కార్లు, పెద్ద కార్లు, హైబ్రిడ్ కార్లు, హైబ్రిడ్ మోటార్ వాహనాలపై సెజ్ 25 శాతంగా ఉండనుంది. గతంలో ఇది 15శాతం. జీఎస్టీ పరిధిలో లగ్జరీ, ఎస్యూవీ, మరియు ఇతర వాహనాలపై పన్ను పెంపు ప్రతిపాదనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గత వారం ఆమోదించిన సంగతి తెలిసిందే. -
ఈ నోకియా ఫోన్ ధర ఎంతో తెలిస్తే...
నోకియా ఫీచర్ ఫోన్‌ను తిరిగి లాంచ్ చేసి ఫోన్ లవర్స్‌ను ఇంప్రెస్ చేసిన నోకియాసంస్థ ఇపుడు మరోసారి తన ప్రత్యేకతను చాటుకుది. 'పుతిన్-ట్రంప్ సమ్మిట్' స్పెషల్ ఎడిషన్ గా నోకియా 3310 (2017)ను లాంచ్ చేసింది. ఈ సంవత్సరం అత్యంత ప్రజాదరణ ఫోన్లలో ఒకటిగా నిలిచిన ఈ ఫీచర్ ఫోన్ ఇపుడు అతి విలాసవంతమైన ఫోన్‌గా అవతరించింది. జీ20 అంతర్జాతీయ సమ్మిట్ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సమావేశానికి గౌరవంగా దీన్ని రూపొందించింది. రష్యన్ ఫోన్ కస్టమైజర్ కావియర్ నోకియా 3310 పుతిన్-ట్రంప్ సమ్మిట్ ఎడిషన్‌ను సృష్టించింది. నోకియా 3310 'పుతిన్-ట్రంప్ సమ్మిట్' ఎడిషన్ ధర 2,468డాలర్ల (రూ. 1.6 లక్షలు) ప్రీమియం ధరలో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఇక ఈ స్పెషల్ నోకియా 3310 ఫీచర్ల విషయానికిస్తే మిగితా ఫీచర్లన్నీ రెగ్యులర్ వేరియంట్ ఫీచర్లే ఉన్నాయి. అయితే బంగారం పూత పూసిన పుతిన్-ట్రంప్ ఫోటో, 'బ్లాక్ వెల్వెట్' విలాసవంతమైన కవరే దీని ప్రత్యేకత. వీటి-23 గ్రేడ్ స్వచ్చమైన టైటానియంతో డమస్క్ స్టీల్ పూత తో ఈ కవర్‌ను ప్రత్యేకంగా రూపొందించారట. ప్రపంచ నాయకులిద్దరూ ఒక దేశగా చూస్తూ ఉన్న చిహ్నంలో ట్రంప్, పుతిన్ రష్యా-అమెరికా సంబంధాల పురోగతి కాంక్షను సూచిస్తోందని కావియార్ ప్రకటించింది. దీంతోపాటు ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ ల పుతిన్-ట్రంప్ సమ్మిట్ ఎడిషన్లను అందిస్తున్నప్పటికీ, నోకియా 3310 (2017) తో పోలిస్తే వినియోగదారులు ఎక్కువ ధర చెల్లించాలి. -
కలర్ఫుల్గా హైలైఫ్ లక్జరీ డిజైనర్ ఫ్యాషన్ షో
-
జీఎస్టీ విధానం ధరల్ని పెంచేది కాదు
న్యూఢిల్లీ: కొత్తగా అమల్లోకి రాబోతున్న వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ద్రవ్యోల్బణాన్ని పెంచేది కాదని సిటీగ్రూపు అంచనా వేసింది. ఎందుకంటే వినియోగ ధరల సూచీలోని చాలా వరకు ఉత్పత్తులపై కొత్త విధానంలో పన్ను రేటు దాదాపుగా ప్రస్తుత రేట్లకు దరిదాపుల్లోనే ఉండనున్నట్టు తన నివేదికలో తెలిపింది. 5, 12, 18, 28% పన్ను రేట్లను జీఎస్టీ కౌన్సిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. తక్కువ పన్ను రేటు నిత్యావసర వస్తువులపై, గరిష్ట పన్ను రేటు విలాసవంత, సిగరెట్వంటి ఉత్పత్తులపై విధించాలని కౌన్సిల్లో అంగీకారం కుదిరింది. వినియోగ ధరల సూచీ లోని సగం ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు పన్ను పరిధిలోకి రావని, పొగాకు, పాన్‌మసాలా, ఏరేటెడ్ డ్రింక్స్, లగ్జరీ కార్లపై పన్ను ప్రస్తుతం 28% కంటే ఎక్కువే పన్ను ఉందని, జీఎస్టీలోనూ ఇంతే ఉండనుందని సిటీగ్రూపు పేర్కొంది. -
కార్లలో ‘లగ్జరీ’ వాటా పెరగాలి..
-
కార్లలో ‘లగ్జరీ’ వాటా పెరగాలి..
ఆడి ఇండియా హెడ్ జో కింగ్ • దేశీయంగా వృద్ధికి అపార అవకాశాలు • తృతీయ శ్రేణి పట్టణాలపైనా దృష్టి • స్వల్పకాలిక నిర్ణయాలతో పరిశ్రమలో అనిశ్చితి • విధానాల్లో స్పష్టత ఉంటే ప్రయోజనకరం హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రపంచవ్యాప్తంగా ప్యాసింజర్ కార్ల మార్కెట్లో లగ్జరీ కార్ల మార్కెట్ 15 శాతం దాకా ఉంటుండగా.. ఇండియాలో మాత్రం ఇది కేవలం ఒక్క శాతంగానే ఉంది. అందుకే దేశీ మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా మొబైల్ టెర్మినల్ తదితర ప్రయోగాలతో కస్టమర్లకు చేరువయ్యేందుకు జర్మనీ కార్ల దిగ్గజం ‘ఆడి’ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలపైనా మరింతగా దృష్టి సారిస్తోంది. దేశీ లగ్జరీ కార్ల మార్కెట్లో స్థానం పటిష్టం చేసుకునే క్రమంలో ఎదురవుతున్న సవాళ్లు, అనుసరిస్తున్న వ్యూహాలపై ‘ఆడి’ ఇండియా హెడ్ జో కింగ్.. సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ప్రత్యేక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ... దేశీ లగ్జరీ కార్ల మార్కెట్ ఎలా ఉంది? దేశీయంగా మొత్తం కార్ల మార్కెట్లో లగ్జరీ కార్ల విక్రయాలు దాదాపు 35,000 యూనిట్ల మేర .. అంటే సుమారు 1.3 శాతం స్థాయిలో ఉన్నాయి. మిగిలిన దేశాల్లో ఇవి 10-15% మధ్య ఉన్నాయి. కాబట్టి మున్ముందు ఈ సెగ్మెంట్ బాగా పెరుగుతుంది. సరైన ఉత్పత్తులు, పటిష్టమైన డీలర్ నెట్వర్క్, బ్రాండ్‌తో కస్టమర్లకు అనుబంధాన్ని పెంచడం వంటి వ్యూహాలను పాటిస్తే విక్రయాలు పెంచుకోవచ్చు. నియంత్రణలు, డిమాండ్ పరమైన సవాళ్లు ఎక్కువే ఉన్నట్టున్నాయి!! అవును! విధానాలపరంగా స్వల్పకాలిక నిర్ణయాల వల్ల తయారీ సంస్థలు, డీలర్లు, కొనుగోలుదారులు అనిశ్చితి ఎదుర్కొంటున్నారు. విధానాల్లో స్పష్టత ఉంటే కస్టమర్ల డిమాండ్‌కి తగినట్లుగా మా వ్యూహాలను సవరించుకునే వీలుంటుంది. వ్యాపార వాతావరణం దెబ్బతినకుండా పర్యావరణ సమస్యల పరిష్కారంపై బహుళవిధాన వ్యూహం అమలు చేయాల్సిన అవసరముంది. బడ్జెట్లో ఇన్ఫ్రా సెస్సు విధించడం పరిశ్రమకు కాస్త ప్రతికూలమే. అయితే జీఎస్టీ అమల్లోకి వస్తే ఎకానమీకి మంచి జరుగుతుంది. ఢిల్లీలో డీజిల్ కార ్లను నిషేధించారు కదా? ఆ ప్రభావం మీపై ఉంటుందా? ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో దాదాపు ఏడాది పాటు డీజిల్ కార్లపై నిషేధం కొనసాగినపుడు మార్కెట్ గణనీయంగా క్షీణించి 10-15 శాతం మేర తగ్గింది. ఇది అనిశ్చితికి దారి తీసింది. నిజం చెప్పాలంటే ఒక్కసారిగా ఈ మార్పును ఎదుర్కొనడం మాకూ కష్టమే. అప్పటికప్పుడు అన్ని మోడల్స్‌లోనూ పెట్రోల్ వెర్షన్లను ప్రవేశపెట్టడానికి మా ఉత్పత్తి షెడ్యూల్స్ సహకరించే పరిస్థితి లేదు. ఈ విధంగా .. ఏడాదంతా సవాలుగానే గడిచింది. కాకపోతే మా మెజారిటీ మోడల్స్‌లో పెట్రోల్ ఇంజిన్లుండటం మాకు కలిసొచ్చే అంశం. పెట్రోల్ కార్ల డిమాండ్‌ను అందుకునేలా మా ఉత్పత్తిని సవరించుకుంటున్నాం. బీఎస్4 కాలుష్య ప్రమాణాలను స్వాగతిస్తున్నాం. దీనివల్ల సంక్లిష్టత.. అలాగే ఖరీదు గణనీయంగా తగ్గుతుంది కాబట్టి ఇది మాకు ప్రయోజనకరమే. దేశంలో తయారీ, అసెంబ్లింగ్‌ను పెంచుకునే అవకాశాలున్నాయా? గతేడాది భారత్‌లో విక్రయించిన కార్లలో దాదాపు 95% పైగా ఇక్కడ నిర్మించినవే. ప్రస్తుతం ఔరంగాబాద్ ప్లాంటులో ఆడి ఏ3 సెడాన్, ఏ4, ఏ6, క్యూ3, క్యూ5, క్యూ7 మోడల్స్‌ను అసెంబుల్ చేస్తున్నాం. సింగిల్ షిఫ్టులో ఏటా 14,000 యూనిట్ల సామర్ధ్యంతో పనిచేస్తున్నాం. స్థానికంగా తయారీ పరిమాణాన్ని పటిష్టంగా, లాభదాయకంగా పెంచే దిశగా మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పండుగల సీజన్లో కొత్త కార్లేమైనా తెస్తున్నారా? ఆఫర్లు లాంటివి... ఈ సీజన్లో మా పాపులర్ మోడల్ ఆడి క్యూ3పై వివిధ నగరాల్లో ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాం. కొత్త కార్ల విషయానికొస్తే.. అత్యంత శక్తిమంతమైన నెక్ట్స్ జనరేషన్ ఆడి ఆర్8 వీ10 ప్లస్‌ను, అత్యంత సురక్షితమైన ఏ8 ఎల్ సెక్యూరిటీ మోడల్స్‌ను ఆటో ఎక్స్పో 2016లో ఆవిష్కరించాం. అటుపైన ఏ6 35 మేట్రిక్స్ టీఎఫ్ఎస్ఐ, సరికొత్త ఆడి ఏ4ను ఇటీవలే ప్రవేశపెట్టాం. త్వరలో మరిన్ని ఆకర్షణీయమైన కార్లను తేబోతున్నాం. ద్వితీయ శ్రేణి పట్టణాల్లో లగ్జరీ కార్లకు డిమాండ్ ఎలా ఉంది? ప్రస్తుతం చిన్న పట్టణాల్లోనూ ఆడి వంటి లగ్జరీ కార్లను కొనే వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో మెట్రో నగరాలపైనే కాకుండా ద్వితీయ.. తృతీయ శ్రేణి పట్టణాల్లోని డీలర్షిప్లపైనా దృష్టి పెడుతున్నాం. హైదరాబాద్ మాకు కీలక మార్కెట్. ఇక్కడ పుష్కలంగా వ్యాపార అవకాశాలున్నాయి కనక అధిక ప్రాధాన్యమిస్తున్నాం. సర్టిఫైడ్ కార్ల విభాగం ఎలా నడుస్తోంది? ప్రీ-ఓన్డ్ లగ్జరీ కార్ల మార్కెట్ వేగంగా పెరుగుతోంది. 2012లోనే మేం ‘ఆడి అప్రూవ్డ్:ప్లస్’ పేరిట గుర్గావ్లో ప్రీ-ఓన్డ్ కార్ల షోరూమ్‌ను ప్రారంభించాం. ఇటీవలే బైబ్యాక్ స్కీమ్ ప్రవేశపెట్టాం. కస్టమర్ తన పాత కారునిచ్చేసి కొత్త కారు ఈజీగా కొనుక్కునేలా ఈ స్కీమ్‌ను రూపొందించాం. మార్కెట్ వాటా పెంచుకోవటానికి మీ వ్యూహమేంటి? వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేటువంటి లగ్జరీ కార్లను సొంతం చేసుకోవాలని భారత్‌లో కార్ల కొనుగోలుదారులు భావిస్తున్నారు. వారికి కావాల్సిన వాహనాలివ్వటానికి ప్రయత్నిస్తున్నాం. పారిశ్రామికవేత్తలే కాదు... వారి పిల్లలూ మా కార్లు కొంటున్నారు. మా బ్రాండ్‌పై ఆసక్తి ఉన్న ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కస్టమర్ల ముంగిటకే షోరూమ్‌ను అందుబాటులోకి తెచ్చేలా ఆడి మొబైల్ టెర్మినల్‌ను ప్రవేశపెట్టాం. అంతర్జాతీయ మోటార్ స్పోర్ట్ ఈవెంట్స్‌లో పాలుపంచుకునే అవకాశం కల్పించే ఆడి క్లబ్ ఇండియాను ప్రారంభించాం. మా కార్లలో డ్రైవింగ్ అనుభూతిని తెలియజేసేటువంటి క్యూ డ్రైవ్, ఆర్డ్రైవ్ వంటి ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తున్నాం. -
కొనేవారే కరువయ్యారు!
వేలకోట్ల రుణాలను ఉద్దేశ్యపూర్వకంగా ఎగ్గొట్టి, విదేశాలకు పారిపోయిన వ్యాపార వేత్త.. విజయ్ మాల్యాకు చెందిన ఆస్తుల అమ్మకానికి సైతం నానా తిప్పలూ పడాల్సివస్తోంది. భారత బ్యాంకులను సుమారు 9000 కోట్ల రుణం తీసుకొని మోసగించి, మాల్యా విదేశాలకు పారిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సంబంధించి ఆస్తులను కొనేందుకూ ఎవ్వరూ ముందుకు రావడం లేదు. తాజాగా ఆయన కంపెనీకి చెందిన జెట్ విమానం వేలానికి పెట్టగా కనీస ధర కూడ పలకకపోవడంతో వేలం నిలిపివేయాల్సి వచ్చింది. లిక్కర్ కింగ్ విజయమాల్యా ఆస్తుల వేలంలో మరోసారి నిరాశ ఎదురైంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఏవియేషన్ సపోర్ట్ కంపెనీ.. అల్నా ఏరో డిస్ట్రిబ్యూషన్ వేసిన బిడ్ ను సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్ రిజెక్ట్ చేసింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ లిమిటెడ్ ఛైర్మన్ విజయమాల్యాకు చెందిన లగ్జరీ జెట్ విమానం.. వేలానికి పెడితే కనీస ధర 150 కోట్లు వస్తుందని అంచనా వేసిన కంపెనీకి నిరాశే మిగింలింది. బిడ్ కేవలం 1.09 కోట్ల రూపాయల అతి తక్కువ ధర రావడంతో ట్యాక్స్ అధికారులు అమ్మకానికి నిరాకరించారు. కనీస ధర కూడ పలకకపోవడంతో వేలాన్ని నిలిపివేశారు. -
లగ్జరీ కార్లలో పోలీసు పెట్రోలింగ్!
దుబాయ్: పోలీసులు అనగానే జీపులు గుర్తుకు వస్తాయి. నిన్న మొన్నటి దాకా సినిమాల్లో కూడ పోలీసులు జీపుల్లో రావడమే చూపించారు. అలాంటిది ఇటీవల కొన్ని ప్రభుత్వాలు నగరాల్లో పోలీస్ పెట్రోలింగ్ పెంచడమే కాక, వారికి ప్రత్యేకంగా కార్లను సమకూర్చాయి. ప్రస్తుతం దుబాయ్ ప్రభుత్వం కూడా పోలీసులు గస్తీ తిరిగేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ లగ్జరీ కార్లను, ఎస్ యూవీలను అందించింది. దీంతో ఇప్పుడు పోలీసులు ఆ ఖరీదైన కార్లలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. అత్యంత హార్స్ పవర్ కలిగిన లగ్జరీ కార్లను దుబాయ్ ప్రభుత్వం మెట్రో పోలీసులు గస్తీ తిరిగేందుకు ఇవ్వడంతో ఇప్పుడు గ్యారేజీలన్నీ అత్యాధునిక లగ్జరీ కార్లతో ఆకట్టుకుంటున్నాయి. ఆడి ఆర్8, బెంట్లీ కాంటినెంటల్ జీటీ, ఆస్టాన్ మార్టిన్ వన్ 77, బీఎం డబ్ల్యూ ఐ8, బీఎం డబ్ల్యూ ఎం6, బ్రాబస్ మెర్సిడెస్ బెంజ్ జీ63 ఏఎంజీ, బుగట్టి వేరాన్, చెవ్రోలెట్ కేమెరో, ఫెరారీ ఎఫ్ ఎఫ్, ఫోర్డ్ ముస్టాంగ్ కస్టమైజ్డ్ బై రష్ పెర్భార్మెన్స్, లంబోర్గిని ఎవెంటేడర్, లెక్సస్ ఆర్సీ ఎఫ్, మెక్ లారెన్ ఎంపీ4 12సీ, మెర్సిడెస్ బెంజ్ ఎస్ ఎల్ ఎస్ ఏఎంజీ, నిస్సాన్ జీటీఆర్, పోర్స్ ఖె పనామెరా ఎస్ ఈ హైబ్రిడ్ వంటి అన్ని మోడల్స్ లోనూ ఖరీదైన కార్టు.. ఇప్పుడు దుబాయ్ పోలీసుల పెట్రోలింగ్ లో భాగం పంచుకుంటున్నాయి. -
మీకు తక్షణ శక్తినిచ్చేది - విలాస విద్య
విద్య - విలువలు లోకంలో లౌకిక విద్య అని, విలాస విద్య అని రెండుంటాయి. లౌకిక విద్య కడుపునింపడానికి పనికొస్తుంది. మీరు చదువుకున్న బీటెక్, ఎంటెక్, ఎంబీబీఎస్... ఇవన్నీ మీ సామాజికహోదాను నిర్ణయిస్తాయి. మీరు చదువుకున్న చదువుకు మీకో ఉద్యోగం, ఉపాధి లభిస్తాయి. దాన్నిబట్టి మీకు కొంత సంపాదన వస్తుంది. ఇది మీకు సామాజిక భద్రతను కల్పిస్తుంది. మీకు పాలుపోసేవాడు కావచ్చు, మరొకడు కావచ్చు మిమ్మల్ని నమ్మడానికి ఈ సామాజిక భద్రత, హోదా పనికొస్తాయి. విలాస విద్య అని మరొకటుంది. ఇది ప్రతివాళ్లకూ కావాలి. ఇది లేదు- అంటే వ్యక్తిలోనో, స్వభావంలోనో ఏదో లోటు ఉందని గుర్తు. ఇది ఆత్మపోషణ కోసం, ఆత్మ సంతృప్తికోసం పనికొస్తుంది. పూర్వం ఉన్న గురుకుల విద్యాభ్యాసానికీ, ప్రస్తుత విద్యావిధానానికీ ప్రధాన వ్యత్యాసం ఇక్కడే ఉంది. విలాసవిద్య అంటే హాబీ. నేను కేంద్ర ప్రభుత్వంలో ఒక ఉద్యోగిని. అది నేను లౌకికంగా చదువుకున్న చదువు ద్వారా లభించింది. నా ఆత్మ సంతృప్తిపొందడానికి, ఆత్మపోషణకు అది కారణం కాలేదు. కానీ నాకు ఆర్ష వాఙ్మయం అంటే చాలా ఇష్టం. రామాయణ, భారత, భాగవతాలు చదవడం, పదిమందికీ చెప్పడమంటే బాగా ఇష్టం. నాకు ఉద్యోగంలో ఇంక్రిమెంట్ వచ్చినా, ప్రమోషన్ వచ్చినా అవి నా దృష్టిలో పెద్ద విషయాలు కావు. నా పనితీరును బట్టి, నా సర్వీసు రికార్డును బట్టి అవి మామూలుగా వచ్చాయనిపిస్తుంది తప్ప అవి నా మనసును ఉల్లాసపరచలేవు. అదే నేను మహాభారతం మీద ప్రసంగం చేస్తున్నప్పుడు, భీష్మస్తుతి చెప్తున్నప్పుడు భీష్మాచార్యులవారి భక్తికి మనసు పులకించిపోయిందనుకోండి. పద్యాలు అనర్గళంగా చెప్పి, భీష్ములవారిని తలచుకుని పొంగిపోతూ రాత్రి పడుకుని నిద్రపోయేటప్పుడు కూడా ఆ పద్యాలే దొర్లుతూండగా ఆనందపడే పరిస్థితి ఉంటుంది. ఆ సంతోషం మరేదీ నాకివ్వదు. అయితే విలాసవిద్య మనిషిని ఎప్పుడు కూడా సంస్కరించేది అయి ఉండాలి. పాడుచేసేదిగా ఉండకూడదు. మంచి ఉద్యోగం ఉంది కానీండి జేబుదొంగతనాలుచేస్తే ఆత్మతృప్తిగా ఉంటుందని అన్నారనుకోండి. అలా ఉండకూడదు. విలాస విద్య మనిషి ఉన్నతికి పనికిరావాలి తప్ప వినాశనానికి కాదు. పూర్వం భవాన్స్వాళ్ళు ’భారతీయ సాంస్కృతిక వారసత్వం’ అని ఒక పరీక్ష పెట్టి అందులో కూడా కనీస ఉత్తీర్ణత సాధిస్తేనే డిగ్రీ ప్రదానం చేసేవారు. అలా విలాసవిద్యను ప్రోత్సహించేవారు. విలాసవిద్య ఒక సంగీతం కావచ్చు, ఒక నృత్యం కావచ్చు. 20 త్యాగరాజ కీర్తనలు నోటికి వచ్చనుకోండి. మీ మనసు బాగా లేనప్పుడు ‘నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సుఖమా’ అని పాడుకున్నారనుకోండి. మీ మనసు ప్రశాంతత సంతరించుకుంటుంది. మా అమ్మంటే నాకు ప్రాణం. ఎంతో కష్టపడి మమ్మల్ని పెంచిపెద్దచేసింది. మా అమ్మ చనిపోయిన రోజున నేను విచలితుడినయిపోయాను. తట్టుకోలేకపోయాను. అంత బాధలో నన్ను నిలబెట్టినవి రామాయణ, భారతాది గ్రంథాలే. మీకు మంచి పుస్తకాలు చదవడం ఇష్టమనుకోండి. స్వామి వివేకానంద ప్రవచనాలు, జవహర్లాల్ నెహ్రూ రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ మీ ఆల్మరాలో ఉన్నాయనుకోండి. మహాత్ములు రాసిన పుస్తకాలు మీ గదిలో ఉంటే మీరు మహాత్ముల మధ్యలో కూర్చుని ఉన్నారని గుర్తు. వివేకానంద ప్రవచనాలు చదువుతున్నారంటే... ఆ స్వామి మాట్లాడుతుంటే మీరు ఎదురుగా కూర్చుని వింటున్నారని అర్థం. మంచి పుస్తకాలు ఎంపికచేసి తెచ్చుకోండి. రోజుకో 10 పేజీలు చదవండి. మీలో శక్తి పెరగడాన్ని, మీలో మార్పును మీరే గమనిస్తారు. ఇవి మానసికంగా మిమ్మల్ని ఎలా తయారుచేస్తాయంటే... జీవితంలో ఎదురయ్యే సంఘటనలకు, దుర్ఘటనలకు ఎలా, ఎంతవరకు ప్రతిస్పందించాలో, ఏది ఎంత మోతాదులో స్వీకరించాలో నేర్పుతాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క విలాసవిద్య ఇష్టం. నాకు ప్రకృతిని పరిశీలించడం ఇష్టం. రవీంద్రనాథ్ ఠాగూర్ పాడయిపోయిన పాత పడకమంచం గిరికీల శబ్దాల నుంచి, పక్షుల కిలకి రావాల వరకు చూసి పరవశిస్తూ ప్రకృతి కవిగా మారి ప్రపంచం మొత్తం మీద సాహిత్యానికి నోబెల్ బహుమతి పొందిన ఏకైక భారతీయుడయ్యాడు. ఎవరిలో ఏ విస్ఫోటం దాగుందో తెలియదు. మనసు శాంతిపొందడానికి కావలసింది ఏదో ఉంటుంది మన లోపల. విలాసవిద్య దాన్ని వెలికి తీస్తుంది. కాకినాడలో ప్రఖ్యాత గైనకాలజిస్టు ఒకామె ఉన్నారు. మహిళా మందిరంలో ఆమె తంబూర పట్టుకుని కీర్తనలు పాడుతూంటే మైమరిచిపోతాం. అలాగే హైదరాబాద్‌లో ఇప్పటికీ బ్రెస్ట్ కాన్సర్ కేంద్రానికి అధిపతిగా ఉన్న ఒక డాక్టర్ చాలా బిజీగా ఉండికూడా ప్రతిరోజూ అరగంట నృత్యం ప్రాక్టీస్ చేస్తుంది. ఆమె కాకినాడలో జరిగే శారద నవరాత్రులకు వచ్చి ప్రదర్శన ఇస్తే కొన్ని వేలమంది నిలబడి చప్పట్లుకొడుతూ (స్టాండింగ్ ఓవేషన్) ఆమెను ఘనంగా అభినందిస్తారు. ఒకప్పుడు ప్రధానమంత్రికి కార్యదర్శిగా, రాష్ర్ట ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసి కూడా ధైర్యంగా పిలకబెట్టుకుని, పంచెకట్టుకుని, పైన నామం పెట్టుకుని తాను నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడి పీవీఆర్కే ప్రసాద్‌గారు కృషి చేస్తున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి డిజిపిగా ఎంతో తీరికలేకుండా ఉండికూడా అరవింద్రావుగారు గురువు దగ్గరకూర్చుని సంస్కృతం నేర్చుకున్నారు. పీహెచ్డీ చేశారు. అబ్దుల్ కలాంగారు రాష్ర్టపతి పదవిలో ఉండికూడా చాలా పుస్తకాలు రాశారు. జవహర్లాల్ నెహ్రూ జైల్లో కూర్చుని కూతురికి ఉత్తరాలు రాస్తే అవి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే గ్రంథాలయ్యాయి. అందువల్ల టైం లేదనే సాకులు చెప్పకండి. ఇప్పుడు నేను చెప్పిన వారంతా పురాణాల్లోని వారుకారు, సమకాలీకులు, వీరిని ఉదహరిస్తే మీరు బాగా గుర్తుపెట్టుకుంటారు, త్వరగా స్ఫూర్తిపొందుతారని చెబుతున్నా. వీరికంటే మనం ఎక్కువ బిజీగా ఉన్నామా ? ఒక్కసారి ఆలోచించండి. ఉత్సాహం ఉండాలి కానీ టైం లేకపోవడమన్నది ఉండదు. మీలో అంతర్గతంగా ఉన్న శక్తిని వెలికితీయగలిగేది విలాసవిద్య. దానివల్ల శాంతి పొందుతారు. ఈ విద్యను మీరే వెతుక్కోవాలి. అయితే అది పాడుచేసేది మాత్రం అయి ఉండకూడదు. -
భారత్ లో లగ్జరీ రైళ్ళకు కష్టకాలం!
భారత్ లో లగ్జరీ, సూపర్ లగ్జరీ ట్రైన్లకు కష్టకాలం ఏర్పడింది. రాజభోగాల్లాంటి అత్యంత విలాసవంతమైన సౌకర్యాలతో పలు రాష్ట్రాల్లో తిరుగుతున్న నాలుగు ట్రైన్లకు ఇక కాలం చెల్లనుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. పర్యాటక ప్రియులకోసం ఇండియన్ రైల్వే, టూరిజం కార్పొరేషన్ ప్రారంభించిన ప్రఖ్యాత ట్రైన్లలో ప్రముఖమైన 'ప్యాలస్ ఆన్ వీల్స్' గతవారం తొలిసారిగా చక్రాలు నిలిచిపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ప్రారంభించిన 34 ఏళ్ళలో ఎప్పుడూ ఆగని ఈ ట్రైన్.. ప్రయాణీకులు లేని కారణంతో నిలిచిపోవడం ఇప్పుడు లగ్జరీ ట్రైన్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విలాసవంతమైన సౌకర్యాలకు అనుగుణంగానే లగ్జరీ ట్రైన్లలో ఉండే ఛార్జీలు కూడ సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రస్తుతం దేశంలో తిరుగుతున్న నాలుగు లగ్జరీ, సూపర్ లగ్జరీ ట్రైన్లు ప్రయాణికుల్లేక బోసిపోతున్నాయి. ఈ పరిస్థితిపై ఆయా రాష్ట్రాల పర్యాటక శాఖలు తలలు పట్టుకుంటున్నాయి. భవిష్యత్తు ఏమిటోనన్న అయోమయ స్థితిలో పడ్డాయి. ఇండియన్ రైల్వే మొదటిసారి ప్రవేశ పెట్టిన ప్రఖ్యాత లగ్జరీ ట్రైన్ 'ప్యాలెస్ ఆన్ వీల్స్' సహా మరో మూడు లగ్జరీ ట్రైన్లు... ప్రస్తుతం తక్కువ ఆక్యుపెన్సీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నాయి. కేవలం 18 బుకింగ్స్ మాత్రమే జరగడంతో గతవారం ప్యాలెస్ ఆన్ వీల్స్ ను మొదటిసారి నిలిపివేశారు. అలాగే రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ కూడ పీక్ టూరిస్టు సీజన్ అయిన గత డిసెంబర్ లో బుకింగ్స్ లేక రెండు ట్రిప్ లు నిలిపివేసినట్లు తెలుస్తోంది. 2014-15 లో 35 నుంచి 40 శాతం, అంతకు ముందు 2011-12 లో ఇంకా 60 శాతం వరకూ ప్రయాణీకుల సంఖ్య తగ్గి, ఆక్యుపెన్సీ సమస్య ఏర్పడటంతో అప్పట్లో కొన్ని ట్రిప్పులను కూడ కుదించేశారు. వాయువ్య, మధ్య భారతదేశంలోని 12 ప్రాంతాలను కవర్ చేసే అత్యంత విలాసవంతమైన మహారాజా ఎక్స్ ప్రెస్ లో మాత్రమే గత ఐదేళ్ళలో 15 శాతం వరకూ ప్రయాణీకుల స్థిరమైన పెరుగుదల కనిపించింది. 2011 నుంచి ఇప్పటివరకూ ఈ మహారాజా ఎక్స్ ప్రెస్ అనేక ట్రావెల్ అవార్డులను కూడా గెలుచుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ, సూపర్ రిచ్ ప్రాధాన్యతలున్న జాబితాలో మాహారాజా ఎక్స్ ప్రెస్ నాల్గవ స్థానంలో కూడ నిలిచింది. అలాగే లాటిన్ అమెరికాలో ఈ ఎక్స్ ప్రెస్ ను నడపాలంటూ మెక్సికో కూడ అభ్యర్థించింది. అత్యంత సంపన్నులైన వారికి అనువుగా.. ఖరీదైన, విలాసవంతమైన ఐదు రైళ్ళను అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టారు. ఒక్కరాత్రి ప్రయాణానికి ఒక్కో వ్యక్తికి ఈ లగ్జరీ ట్రైన్లలో మార్గం, సీజన్, రైలును బట్టి ఒక్కో వ్యక్తికి సుమారు 500 డాలర్లు, అంటే సుమారు 30 వేల రూపాయల నుంచి 1800 డాలర్లు అంటే సుమారు లక్ష రూపాలకు పైగా ఛార్జీలు ఉంటాయి. దేశంలోని మొత్తం ఐదు లగ్జరీ ట్రైన్లలో తొలి లగ్జరీ ట్రైన్... ప్యాలెస్ అన్ ది వీల్స్ ను మూడు దశాబ్దాలక్రితం రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఆర్టీడీసీ) ప్రారంభించింది. తర్వాత రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ ను కూడ ప్రారంభించిన ఆర్టీడీసీ.. ఇంచుమించు రెండు రైళ్ళనూ ఢిల్లీ నుంచి ప్రారంభమై రాజస్థాన్, ఆగ్రాలను కవర్ చేసేట్లు ఒకే మార్గంలో నడుపుతోంది. ఆ తర్వాత మహరాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ బోర్డ్ ప్రారంభించిన డెక్కన్ ఒడిస్సీ... మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ లను కవర్ చేస్తుంది. కర్నాటక స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కర్నాటక నుంచి గోవా వరకూ నడిపే 'గోల్డెన్ ఛరియట్'.. దక్షిణ ప్రాంతంలో నడిచే ఒకేఒక్క లగ్జరీ ట్రైన్ గా చెప్పాలి. ఈ మొత్తం అన్ని లగ్జరీ ట్రైన్లలోనూ సెంట్రల్ ఎయిర్ కండిషన్, ఇంటర్ కమ్, టీవీ, వైఫై, కాన్ఫరెన్సింగ్ సౌకర్యాలతోపాటు... పాంట్రీ, లాంజ్, మ్యూజిక్, మనీ ఎక్సేంజ్ క్రెడిట్ కార్డ్ సౌకర్యాలు కూడా ఉంటాయి. అంతేకాక పర్యాటకులకు అనువుగా కాన్ఫరెన్సింగ్ సౌకర్యం, దేశీయ ప్రత్యేక వంటకాలను వడ్డించే ప్ర్తత్యేక రెస్టారెంట్లు, బార్లు తో పాటు ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు అందుబాటులో అటెండెంట్స్ కూడ ఉంటారు. ప్రత్యేక అలంకరణతో ఆకట్టుకునే ఈ లగ్జరీ రైళ్ళు.. సుమారు 14 నుంచి 19 బోగీలను కలిగి ప్రయాణీకులకు భారత రాచరిక మర్యాదలతో ఎర్రతివాచీ స్వాగతం పలుకుతాయి. అయితే తాజాగా విదేశీయులు, ఎన్నారైలు వారి దేశాలనుంచే క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఆర్ సీటీసీ ద్వారా టికెట్లను కొనుగోలు చేసే సౌకర్యాన్ని కల్పించిన భారత రైల్వే... లగ్జరీ ట్రైన్ల ఆక్యుపెన్సీ సమస్య తీర్చేందుకు ఇకపై ఎటువంటి చర్యలు చేపడుతుందో వేచి చూడాలి. -
అమ్మకానికి చర్చిల్ నౌక!
బ్రిటన్ మాజీ ప్రధాని, రాజనీతిజ్ఞుడు, చరిత్రకారుడు సర్ విన్ స్టన్ చర్చిల్ కు చెందిన విహారనౌకను అమ్మకానికి పెట్టారు. అత్యంత విలాసవంతమైన, రాజభోగాలు కలిగిన ఆ నౌక ఖరీదును 1.5 మిలియన్ యూరోలుగా నిర్ణయించారు. విన్ స్టన్ చర్చిల్ తో పాటు ఆయన వినియోగించిన ఆ నౌకకూ ఎంతో చరిత్ర ఉంది. అందుకే ఇప్పుడా నౌక మార్కెట్లో అంత రేటు పలుకుతోంది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో ఉన్న 127 అడుగుల పొడవైన ఆ నౌక... ఆన్ బోర్డ్ బార్ తో పాటు.. పై భాగంలో సుమారు అరవైమంది కూర్చో గలిగే జుకౌజీ డెక్ ను కూడ కలిగి ఇప్పటికీ రాజసాన్ని ఒలికిస్తోంది. 1936 లో నిర్మించిన ఈ నౌక.. అనంతరం యుద్ధకాలంలో ప్రధాని ఏర్పాటు తర్వాత 4,000 నాటికన్ మైళ్ళు ప్రయాణించింది. అయితే 1990, 2005 సమయంలో ఇది తీవ్ర మరమ్మత్తులకు లోనైంది. ఈ నౌకను మొదట్లో అమెజాన్ అని పిలిచేవారు. ఆ తర్వాత వెల్ష్ లిబర్టీ దీనికి 'మై అవెంజిలిన్' అని పేరు పెట్టుకున్నారు. ఏడువందల హార్స్ పవర్ కలిగిన రెండు ఇంజన్లతోపాటు... 2 మిలియన్ యూరోల ఖరీదు చేసే ఓ మీటింగ్ హాలు, ఓ కార్యాలయం, పెద్ద లాంజ్ ఏరియా, కెప్టెన్ రూమ్, సన్ బాత్ ఏరియాలు ఈ నౌకలో నెలకొని ఉన్నాయి. ఇవి చూపరులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. చర్చిల్ క్యూబాలో నివశించే సమయంలో ఆయన అలవాట్లైన హవానా సిగార్లు, సన్ బాత్ లాంజ్ లు ఈ నౌకలో ఆయన చిరకాల జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. 1940 లో ప్రధానమంత్రి అయిన చర్చిల్... ఆ తర్వాత... అపురూప అందాల అమెజాన్ నౌకను వీడి.. క్రిస్టినా అనే మరో కొత్త మోడల్ నౌకను ఎంచుకున్నారు. -
ప్రశాంతతే అతిపెద్ద లగ్జరీ..!
కార్లు, గాడ్జెట్లను లగ్జరీ వస్తువులుగా చూసే కాలం చెల్లి పోయింది. పరుగుల బతుకుల్లో ప్రశాతను కోరుకునే వారే ఎక్కువైపోయారు. సెలవుల్లోనూ, ఖాళీ సమయాల్లోనూ కారులో షికారుకెడదామన్న ఆలోచననూ వదిలేశారు. ఒంటరిగా ఓ గంట గడపడమే ఎంతో అపురూపంగా ఫీలవుతున్నారు. ఇప్పుడు భారతీయుల్లో సగానికిపైగా జనం ప్రశాంతతనే కోరుకుంటున్నారని సర్వేలు సైతం చెప్తున్నాయి. ఈ కాలంలో ఒంటరితనమే అత్యంత లగ్జరీ వస్తువు అని ఇటీవల జరిపిన ఓ సర్వే తేల్చి చెప్పింది. నేటితరం వ్యక్తిగత సమయం, స్వేచ్ఛ కోరుకుంటోందని ఓ సంస్థ చేపట్టిన గ్లోబల్ సర్వే చెప్తోంది. తైవాన్‌ల ప్రధాన టెక్ సంస్థ ఆసస్ (ASUS) నిర్వహించిన సర్వేలో భారతదేశంలో నలభై శాతం మంతి ప్రజలు స్వేచ్ఛగా, వారికి ఇష్టమైనట్లుగా సమయాన్ని గడపడం లగ్జరీగా భావిస్తున్నారని తెలుసుకున్నారు. మిలీనియల్ కన్జూమర్ గ్లోబల్ సర్వే లో భారతదేశం, అమెరికా, బ్రిటన్, రష్యా, ఇండోనేషియా సహా అయిదు ప్రాంతాల్లోని సుమారు 19 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసున్నవినియోగదారులు పాల్గొన్నారు. వీరిలో భారతదేశ ప్రజలు ఎక్కువగా ఒంటరితనాన్ని, స్వేచ్ఛగా గడపడాన్ని లగ్జరీగా భావిస్తున్నట్లుగా తెలుసుకున్నారు. ప్రజల జీవితాల్లో 'టాబ్లెట్ల' పాత్ర గురించి తెలుసుకునేందుకు ఆసస్ (ASUS) సంస్థ సర్వే నిర్వహించింది. ఎటువంటివారు తమ టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు అన్న విషయంపై ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో... వ్యక్తుల స్వభావాలగురించి వెల్లడైంది. నేటితరం ప్రజలు కొత్త పంథాలో ఆలోచిస్తున్నారనీ, సమూహంలో ఉండేకంటే... తమకిష్టమైనట్లుగానూ, స్వేచ్ఛగానూ ఉండేందుకే ఇష్టపడుతున్నారని మొబైల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఎరిక్ హెర్మాన్సన్ తెలిపారు. ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు వ్యక్తిగత స్వేచ్ఛను, ఒంటరి సమయాన్ని లగ్జరీగా భావిస్తున్నట్లు తెలిపారు. రోజువారీ జీవితాన్ని ఆస్వాదించడంలో మొబైల్స్, టాబ్లెట్స్ వంటి వస్తువులు సహకరిస్తున్నాయని అరవై శాతం మంది చెప్తున్నట్లు సర్వే ద్వారా తెలుసుకున్నారు. టెక్నాలజీ కూడ రొటీన్ నుంచి ప్రశాంతతను అందిస్తున్నట్లుగా జనం భావిస్తున్నారంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి కుటుంబాలు, స్నేహ సంబంధాలకు దూరంగా ఉంటున్న స్పీడు యుగంలో... ఒంటరిగా, స్వేచ్ఛగా బతకడమే సౌఖ్యంగా భావించే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా మరోమారు వెల్లడైంది. -
అంతరాత్మ మాట వినండి
31 అక్టోబర్ 2015 నుంచి నవంబర్ 6 వరకు టారో బాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) విలాసంగా జీవించేందుకు కావలసిన ధన సమృద్ధికి పుష్కలంగా అవకాశాలు దొరుకుతాయి. మీరు ఉద్యోగి అయితే ప్రమోషన్ కోసం ఎదురు చూడవచ్చు. ఆర్థికంగా లోటుండదు. అయితే మీకు అయిన వారి నుంచే తిరస్కరణలు, నిరాశ, వంచన ఎదురు కావచ్చు. అయితే జీవితంలో ఇదొక దశ మాత్రమే. శాశ్వతం కాదని గ్రహించండి. కలిసొచ్చే రంగు: ముదురు నీలం టారస్ (ఏప్రిల్ 21-మే 20) అన్నింటా సమతుల్యతను పాటించడం మంచిది. అవిశ్రాంతంగా గడుపుతారు. పనికీ, సమయానికీ మధ్య సమతూకాన్ని పాటిస్తారు. మీ ప్రేమ సఫలమవుతుంది. మీరేదైనా బంధంలో ఉంటే మాత్రం దానిని దృఢపరచుకో. మీ తప్పులేమిటో తెలుసుకుని, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. చురుగ్గా, హుషారుగా ఉండండి. కలిసొచ్చే రంగు: గోధుమ రంగు జెమిని (మే 21-జూన్ 21) మీ జీవన గమనంలో కీలక మార్పు సంభవించవచ్చు. ఓ విషయంలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇతరుల విషయంలో అనవసర జోక్యం వద్దు. అతిగా పని చేయకుండా అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకుంటూ ఉండండి. మీరు పురుషులయితే ప్రేమ విషయంలో మీరే చొరవ చూపడం మంచిది. కలిసొచ్చే రంగు: దొండపండు ఎరుపు (పీచ్) క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీరు చాలా మొండివారిగా, బలవంతులుగా మిమ్మల్ని ఎవరూ మార్చలేరన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. సమతుల్యత పాటించడం మంచిది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఏదో అద్భుతం జరిగినట్లుగా మీరు కోరిన కోరికలన్నీ నెరవేరతాయి. కొత్త వ్యాపారం ఆరంభమవుతుంది. విజయసోపానాలను అధిరోహిస్తారు. కలిసొచ్చేరంగు: లేత నారింజ రంగు లియో (జూలై 24-ఆగస్టు 23) నిజమేదో, ఊహ ఏదో తెలుసుకోవలసిన వారమిది. అలాగే ప్రేమ విషయంలో మీరు అత్యవసర నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అప్పుడప్పుడు స్వల్ప అభద్రతాభావం, కొద్దిపాటి ఒడుదొడుకులు ఉన్నా, వారమంతా సంతోషంగా గడిచిపోతుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అవసరం. మీ పద్ధతి ప్రకారం మీరు నడచుకుంటూ ఉండండి. కలిసొచ్చే రంగు: తెలుపు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఇంటిని ఆధునీకరించుకోవ డానికి తగిన సమయమిది. మీరు తలపెట్టిన కార్యం సజావుగా పూర్తవుతుంది. గత నెలలో కలిగిన చిక్కులు, చికాకుల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితమనే ఓడ ఎటు తీసుకెళితే అటు నడవండి. మీకు మీరు అనవసర నిర్ణయాలు తీసుకోవద్దు, అపోహలకు, భ్రమలకు గురి కావద్దు. కలిసొచ్చే రంగు: ఊదా లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఈ వారం ఆనందం, అదృష్టం మీ వెంటే ఉంటాయి. వ్యాపారం లాభాలబాటలో నడుస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. పొదుపు చేయడానికి ఇది తగిన సమయం. అయితే పెట్టుబడులకు మాత్రం కాదు. ఆహార జాగ్రత్త తీసుకోకపోతే ఆరోగ్యం విషయంలో అవస్థలు తప్పవు. మీ మనసుకీ, శరీరానికీ మధ్య సమన్వయం ఉండేలా చూసుకోండి. కలిసొచ్చే రంగు: గ్రీన్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీ ఆశలు, ఆశయాలకు, మీకున్న వనరులు, సమస్యలు సవాళ్లకు మధ్య వైరుధ్యం ఏర్పడవచ్చు. పని... ఆరోగ్యం... కెరీర్- వీటన్నింటిపరంగా సంతోషం కలుగుతుంది. అంతా సవ్యంగా ఉన్నాయన్న భావన మీ మనసును ఆనందంతో నింపుతుంది. మీ ప్రేయసి లేదా ప్రేమికుడితో బంధాన్ని సరి చేసుకోవలసిన అవసరం ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: పసుపు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ కలల సౌధాన్ని కూలగొట్టుకోవద్దు. వాటిని నెరవేర్చుకునే మార్గ్గాన్ని అన్వేషించండి. రోజువారీ పనులతో జీవితం బోర్‌గా అనిపించకుండా విహార యాత్రలు చేయండి. మీ బంధాలను పునరుద్ధరించుకోండి. బంధుమిత్రుల నుంచి అనూహ్యమైన బహుమతులు రావచ్చు. సామాజిక జీవనం మరింత ప్రకాశ వంతంగా మారుతుంది. కలిసొచ్చే రంగు: సిల్వర్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) రానున్న నెలంతా మీకు ఆనందమే ఆనందం. అందుకు ఈ వారమే పునాది. ఆర్థికపరమైన అభివృద్ధి కనిపిస్తోంది. మీ వ్యాపార భాగస్వామి విషయంలో మీ అంచనాలు ఫలిస్తాయి. విజయాన్ని అందుకుంటారు. ఎదురు చూడని వ్యక్తుల నుంచి విలువైన బహుమతులు అందుకుంటారు. ప్రేమికులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) రానున్న నెల మీకు ఒడిదొడుకులతో కూడుకున్న నెల అని చెప్పవచ్చు. మీరు చేస్తున్న పనికి, పెట్టిన పెట్టుబడికి, వచ్చే రాబడికి మధ్య పొత్తు కుదరని విధంగా ఫలితం ఉంటుంది. అయితే రాత్రి తరవాత పగలు, చీకటి తర్వాత వెలుగు ఉంటుందని గ్రహించి, రిలాక్స్ అవండి. రొమాన్స్‌లో ఉంటే ఈ వారం దానికి ముగింపు పలకవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) మీ కోరికలు నెరవేరతాయి. ఇంటిలో శుభకార్యాలు జరగవచ్చు. అనేక సమస్యలు, సవాళ్లు ఎదురైనప్పటికీ, మీ తెలివితేటలు, సమయస్ఫూర్తితో అవలీలగాా అధిగమించగలుగుతారు. ఎంతోకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కొన్ని మానసిక సమస్యలను ఒక పెద్ద మనిషి సహకారంతో పరిష్కరించుకుని, ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: మెరిసే పసుప్పచ్చ రంగు ఇన్సియా కె. టారో అండ్ ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌరవాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) నిరుద్యోగులు గట్టి ప్రయత్నం మీద విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్థులు మీదైన ఉద్యోగానికి సంబంధించిన అభివృద్ధికోసం ఏమైనా పరీక్షలుంటే వాటికి సిద్ధమైతే తప్పక సత్పలితాలు ఉండగలవు. వ్యాపారస్థులయితే కొత్త మెళకువలని తోటి వ్యాపారుల నుండి తెలుసుకోవడం మంచిది. ఏమైనా ఒక నెలలోగా ఓ నిర్ణయానికి వచ్చి ఆ దిశగా ప్రయాణించాల్సి ఉంది. టారస్(ఏప్రిల్ 21-మే 20) ఎవరినో చూసి లేదా ఎవరి ప్రోత్సాహం వల్లనో కొత్తవస్తువాహనాల్ని కొనుగోలు చేయడం ప్రస్తుతం సరికాదు. త్వరలో రానున్న ఓ అవసరం కోసం ఇప్పటినుంచే వ్యయం విషయంలో తగినంత ప్రణాళిక, శ్రద్ధ అవసరం. ప్రభుత్వపరమైన చెల్లింపులువెంటనే చేయండి. అలాగే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పోరాటం సాగిస్తుంటే దాన్ని వెంటనే విరమించుకోండి. జెమిని (మే 21-జూన్ 21) ప్రస్తుత ఉద్యోగం నుంచి బయటపడి మరో మంచి ఉద్యోగాన్ని చేయదలచిన మీ ప్రణాళిక అమలు కావడం కష్టమే. అదే విధంగా మీరుంటున్న ఇల్లు లేదా లేదా ఊరి మార్పు కూడా అంత సులభ సాధ్యం కాకపోవచ్చు. ఆర్థికపరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటూ రావలసిన సొమ్ముల కోసం ఎదురు చూడడంతో ఈ వారం ముగిసిపోవచ్చు. అయితే ప్రయత్నాన్ని మానకండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) దీర్ఘకాలంపాటు శ్రమిస్తేనే గాని పరిష్కరింపబడని సమస్యలు అలాగే కొనసాగవచ్చు. వాటివల్ల ఆర్థిక లోటు తప్ప మరే నష్టమూ ఉండదు. మీకు తగినంత సమయం లేకపోవడమే దీనికి కారణం. ఆదాయానికి లోటుండదు కాని అన్ని పనుల్ని సకాలంలో చేయలేకపోతున్నామనే దిగులు ఉంటుంది. బంధుమిత్రుల వల్ల ఈ వారంలో పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు. లియో (జూలై 24-ఆగస్టు 23) మీరు ఆరంభించిన ప్రయత్నాలకి అనుగుణంగా మీ ప్రణాళిక ఫలించి చక్కని ఆదాయ మార్గం ఏర్పడుతుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే ఒకప్పటి అపనింద తొలగే అవకాశం ఉంది. కొత్తవ్యాపారాన్ని లేదా గతంలో చేసి మానేసిన వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించవచ్చు. అయితే మీకు మీరుగా వ్యాపారాన్ని నిర్వహించుకునే సమయం ఉండదని గమనించి దిగండి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఆర్థికంగా అసంతృప్తితో ఉంటారు. వ్యాపారంలో పెద్దగా రాణింపు ఉండకపోవచ్చు. గతాన్ని గురించిన ఆలోచనని మాని, భవిష్యత్ ప్రణాళికని వేసుకోండి. కార్యాల్లో వ్యతిరేకత ఉండదు అలాగని అనుకూలతా ఉండదు. మిత్రుల మాటల్ని నమ్మి వ్యాపారంలోకి దిగకండి. సలహాలనీ సూచనలనీ వినండి కాని, ఆచరణలోకి తేవాలనుకోవడం సరికాదు ఈ వారానికి. లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. తగినంత విద్యార్హత ఉన్నా ఉద్యోగం లేదా వ్యాపారాన్ని చేసే వీలు సాధ్యం కాకపోవచ్చు. మీ అనవసర పట్టుదల మాని, రాజీ యత్నం చేస్తే ఫలితం అనుకూలంగానే ఉంటుంది. మీ కుటుంబం మీకు ముఖ్యం తప్ప మీ సహాయం వల్ల మరో కుటుంబం ఉన్నతిని పొందుతుందని మీ కుటుంబాన్ని వెనక్కి పెట్టుకోవడం సరి కాదు. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ప్రస్తుతం మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి వచ్చే ప్రమాదం ఏమీ లేదు. అయితే మానసిక స్థితి ఊగులాట ధోరణిలో ఉంటూ దాంపత్య అన్యోన్యత విషయంలో తీవ్ర వ్యగ్రతతో ఉండవచ్చు. మానసిక అనారోగ్యం వల్ల శరీరారోగ్యమూ దెబ్బతిన వచ్చు కాబట్టి వ్యాయామాల్ని చేస్తూ తగిన ఆరోగ్య పద్ధతుల్ని అవలంబిస్తూ ఆధ్యాత్మికతవైపు దృష్టి మళ్లించడం మంచిది. శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) మొహమాటం వల్ల లేదా నోటిమాటగా చెప్తే ఏమౌతుందో అనే ఆలోచన వల్ల మీ అభిప్రాయాన్ని మీ పనుల ద్వారా తెలియజేయడం సరికాదు. మీరు అజాత శత్రువు కాబట్టి మీ అసౌకర్యం గురించి వివరించి చెప్పడం ఉత్తమం. మీరే ఉద్యోగాన్ని లేదా ఆరోగ్యాన్ని వంకగా పెట్టుకుని ఇష్టం లేని పనుల్ని వాయిదా వేస్తున్నారేమో గమనించుకోండి. దోషిగా దొరికి పోకండి. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఆశలు ఆకాశంలో, ఆచరణ పాతాళంలో ఉండటం వల్ల ప్రయోజనం ఏముంది? బంధువుల పట్ల ప్రేమాభిమానాలుండవచ్చునేమో కాని అతి కాకూడదని గమనించండి. మాట కరుకుదనం వల్ల, పట్టువిడుపులు లేని కారణంగా వ్యాపారంలో మీకు పేరు రాకపోవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్యం దృష్ట్యా కొంతమొత్తం సొమ్ముని ఓ పక్కన దాచి ఉంచండి. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) అన్నీ సవ్యంగా ఉన్నప్పటికీ ఏదో ఆందోళనతో గడుపుతారు ఈ వారాన్ని. దానిక్కారణం అనవసరమైన వాగ్వివాదాన్ని పెట్టుకుని ఏం జరుగుతుందోననే ఒక లో భయంతో ఉండడమే. పట్టుదలకి పోకండి. వాగ్వివాదాలూ హామీలూ మంచిది కాదు. మీరూ మీ కుటుంబం అనే ధ్యాసతో గడపండి కాలాన్ని. వినోదయాత్రగాని విహార యాత్రగాని చేసే అవకాశం ఉంది. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) సంతానానికి సంబంధించిన చదువులు చక్కగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యాలు బాగుంటాయి. ఆర్థిక సంతృప్తి ఉంటుంది. వ్యాపారంలో పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టాలంటే జంకుగా అనిపించవచ్చు. అదీ ఒకందుకు మంచిదే. నిలకడగానే వ్యాపారాన్ని చేయండి. బంధుమిత్రులతో ఆర్థిక లావాదేవీలు వద్దు. సంతృప్తితో గడపండి. ఆందోళనకి దూరంగా ఉండండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
ఇవి పాటిస్తే.. గేటెడ్‌లో నిశ్చింతే!
హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీ అయినా లగ్జరీ విల్లా అయినా నివాసితులంతా రోజువారి పనుల్లో ఒత్తిడితో ఉంటారు. పక్కవారి గురించి ఆలోచించే తీరికే ఎవరికీ ఉండదు. ఈ నేపథ్యంలో నివాసితుల సంక్షేమం కోసం సమయాన్ని వెచ్చించడానికి ముందుకొచ్చేవారిని అభినందించాలి. మంచి పనులు చేస్తే మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి సలహాలివ్వాలి. అంతేతప్ప చిన్న పొరపాటునూ భూతద్దంలో చూసిపెద్దగా చేయకూడదు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆయా సంఘం బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు. ఒక అపార్ట్మెంట్లోని వ్యవహారాలన్నీ సమర్థంగా నడిపించాల్సిన విధివిధానాల గురించి ‘బైలాస్’లో స్పష్టంగా రాసుకోవాలి. ఏయే సందర్భాల్లో నివాసితులెలా స్పందించాలో ముందే పేర్కొనాలి. కాబట్టి ఇందులో పొందుపరిచే నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అలా చేసినవారి మీద తీసుకోవాల్సిన చర్యల గురించి రాసుకుంటే ఉత్తమం. సంఘం సభ్యులుగా ఎన్నికయ్యేవారు తోటి సభ్యులతో కలిసిమెలిసి పనిచేయాలి. వ్యక్తిగత వివాదాల జోలికి వెళ్లకుండా రాగద్వేషాలకు తావివ్వకుండా నివాసితులందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాలి. నివాసితుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ ్నంగా తెలుసుకున్నాకే ఎన్నుకోవాలి. ఆయా అభ్యర్థుల ప్రత్యేకతలు, వివిధ సందర్భాల్లో స్పందించే తీరు, సంఘం మేలు కోసం సమయాన్ని వెచ్చించగలరా? అందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోగలరా? లేక వ్యక్తిగత లాభాపేక్షను దృష్టిలో పెట్టుకుంటారా? ఇలా పలు అంశాల్ని గమనించాకే నిర్ణయం తీసుకోవాలి. -
చిన్నపర్స్...ఖరీదు ఘనం!
విలాసం అమ్మాయిలకు ప్రియనేస్తం హ్యాండ్ బ్యాగ్. చిన్న హ్యాండ్‌బ్యాగ్ నుంచి క్లచ్‌గా మారిన ఈ రూపానికి ఎన్నో మెరుగుల అద్దారు డిజైనర్లు. అతివల ముంజేతిలో అందంగా మెరిసిపోయే క్లచ్‌లెన్నో చూస్తుంటాం. ఇప్పటి వరకు ఖరీదైన క్లచ్‌లెన్నో కొనుగోలు చేసి ఉంటారు. కానీ, బ్రిటన్ ఆభరణాల నిపుణులు క్రిస్టోఫర్ షెలిస్ తయారు చేసిన క్లచ్‌ను కొనుక్కోవాలంటే మాత్రం అక్షరాలా కోటీ పది లక్షల రూపాయలు చెల్లించాలి. బార్గేజీ బ్రాండెడ్ కంపెనీకి చెందిన ఈ రాయల్ క్లచ్ తయారీకి 100 పనిగంటల సమయం పట్టిందట. వెయ్యేళ్ల గ్యారెంటీ గల ఈ క్లచ్ లండన్‌లోని బకింగ్ హామ్ ప్యాలెస్ గేట్‌ను పోలిన డిజైన్ ఉంటుంది. ఈ ఏడాది అత్యంత ఖరీదైనదిగా పేరొందిన ఈ క్లచ్ తయారీలో 18 క్యారెట్ల బంగారం, 345 వజ్రాలతో రూపుదిద్దారు. అయితే 2010లో మొవాద్ కంపెనీ 1001 వజ్రాలతో రూపొందించిన చిన్న పర్స్ నేటికీ అత్యంత ఖరీదైన పర్స్‌ల జాబితాలో ముందుంది. -
లగ్జరీని వదల్లేకే బాబు సీమాంధ్రకు రావట్లేదా?
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక కార్యదర్శి కత్తి పద్మారావు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. సీఎంగా బాబు హైదరాబాద్ నుంచి పాలన సాగించడమేంటని ఆయన ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నంబూరులో ఆయన నిన్న మాట్లాడుతూ హైదరాబాద్‌లో అలవాటైన లగ్జరీని వదిలి ముఖ్యమంత్రి సీమాంధ్రకు రాలేకపోతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తినే సీఎంగా ఎన్నుకోవాలన్నారు. 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే సీమాంధ్రలో ఉన్నారని వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత మహాసభ తీర్మానించిందని, విగ్రహం ఏర్పాటుకు వర్సిటీలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
కారు కొంటున్నారా..
భారీ జీతాలందుకునే ఫ్రెండ్స్ ముందు తానూ ఆర్భాటంగానే ఉండాలనే కాన్సెప్టుతో తనకు ప్రత్యేకంగా అవసరం లేకపోయినా ఈఎంఐల మీద లగ్జరీ కారు కొనేశాడు ఆనంద్. మొదట కొన్నాళ్లు బాగానే నడిచినా.. ఆ తర్వాత అర్థమయింది కారు కొనుక్కోవడం ఒకెత్తు.. దాన్ని భరించడం మరో ఎత్తు అని. బైటికి తీస్తేనేమో పెట్రోల్ వాత.. పోనీ తియ్యకుండా అలా ఉంచేసినా.. ఎలుకలు వగైరాలు దూరేసి మెయింటెనెన్స్ మోత మోగిపోతోంది. ఇటు ఈఎంఐలు, అటు ఇంధనం ఖర్చులు, మరోవైపు రెండు మూడు నెలలకోసారి మెయింటెనెన్స్ బాదుడు కలిపి ఆనంద్కి తడిసిమోపెడవుతోంది. ఇలాంటి తలనొప్పులు లేకుండా ముందస్తుగా కొద్ది పాటి జాగ్రత్తలు తీసుకుంటే.. కారులో జోరుగా హుషారుగా షికారు చేయొచ్చు. సరైన కారే కొంటున్నామా.. కారు తీసుకోవడం అన్న ఆలోచన వచ్చిన తర్వాత.. మన అవసరాలకు తగినట్లుగా ఉండేది ఎంచుకోవాలి. అంటే ఎంత మంది కుటుంబసభ్యులు ఉన్నారు, ఎంత ఎక్కువ లగేజి ఉంటుంది లాంటివి చూసుకోవాలి. ఆరేడు మంది కుటుంబసభ్యులు ఉన్నప్పుడు చిన్న కారు తీసుకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. పెట్రోల్.. డీజిల్.. ఏది బెస్టు? కారన్నాక.. మైలేజీ మొదలుకుని మెయింటెనెన్స్ వ్యయాలు దాకా అన్నీ చూసుకోవాల్సిందే. పెట్రోల్ ఖరీదైనప్పటికీ.. పెట్రోల్ కార్ల రేట్లు తక్కువగానే ఉంటాయి. మిగతా వాటితో పోలిస్తే మెయింటెనెన్సూ తక్కువే. డీజిల్ రేటు తక్కువ అయినా పెట్రోల్ కార్లతో పోలిస్తే డీజిల్ కార్ల రేట్ల మధ్య వ్యత్యాసం దాదాపు రూ.1 లక్ష పైగానే ఉంటోంది. పైగా మెయింటెనెన్సూ ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు, మారుతీ సుజుకీ స్విఫ్ట్ పెట్రోల్ వేరియంట్ సుమారు రూ. 4.57 లక్షల రేంజిలో ఉంటే.. డీజిల్ వెర్షన్ రూ. 5.66 లక్షల శ్రేణిలో ఉంది. రోజుకి కనీసం 80 కిలోమీటర్లయినా తిరిగేవారయితే డీజిల్ ఫర్వాలేదు. అయితే, ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ రేట్లకి మధ్య వ్యత్యాసం భారీగా తగ్గిపోతోంది కాబట్టి ఆ కోణంలోనూ ఒకసారి ఆలోచించుకోవడం మంచిది. ఇక సీఎన్జీ కార్లు ఉన్నప్పటికీ.. అన్ని చోట్ల సీఎన్జీ దొరకడం ప్రస్తుతం సమస్యగా ఉంటోంది. కొన్ని కార్లు సీఎన్జీ- పెట్రోల్ కాంబినేషన్స్‌లో కూడా లభిస్తున్నాయి. కొత్తదా.. పాతదా.. కాస్త ఎక్కువ డబ్బు పెట్టి కొత్తది తీసుకోవడం లేదా చవకగా పాత కారును తీసుకోవడం అన్నది మన అవసరం, డబ్బు లభ్యతను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇందుకోసం ముందుగా అసలు ఏ కారు రేటు ఎంత ఉంది, కొత్తది ఎంతకు లభిస్తోంది.. కొంత పాతబడినది ఎంతకు రావొచ్చు, మనం ఎంత బడ్జెట్ అనుకుంటున్నాము లాంటి అంశాలు చూసుకోవాలి. వివిధ కార్ల రేట్ల గురించి తెలుసుకోవడానికి, పోల్చి చూసుకోవడానికి కార్‌దేఖోడాట్‌కామ్ వంటి వెబ్సైట్లు ఉపయోగపడతాయి. ఇక, కార్ల తయారీ కంపెనీలు కూడా సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకం కోసం ప్రత్యేక షోరూమ్‌లు ఏర్పాటు చేశాయి. మారుతీ సుజుకీ ట్రూ వేల్యూ పేరిట, మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఫస్ట్ చాయిస్ పేరిట యూజ్డ్ కార్లను కూడా విక్రయిస్తున్నాయి. ముందుగా డబ్బుల షాపింగ్.. ఒకవేళ లోన్ తీసుకుని కారు తీసుకోవాలనుకుంటున్న పక్షంలో ముందుగా ఎంత రుణం లభించే అవకాశం ఉంది, డౌన్‌పేమెంటు ఎంత చేయాల్సి ఉంటుంది అన్నవి చూసుకోవాలి. ఏ బ్యాంకు తక్కువ వడ్డీ రేటు కు ఎక్కువ రుణం ఇస్తోందో తెలుసుకోవాలి. రుణ దరఖాస్తుకు బ్యాంకుల నుంచి ముందుగానే అప్రూవల్ దక్కించుకోగలిగితే.. బేరమాడేందుకు మరింత వీలు దొరుకుతుంది. ఏదైనా.. బడ్జెట్ దాటకుండా చూసుకోవాలి. కారు సైజు పెరిగే కొద్దీ భారీ డిస్కౌంట్లంటూ కంపెనీలు ఊదరగొడతాయి. ఆ మాయలో పడి బడ్జెట్‌ను దాటిపోకుండా జాగ్రత్తపడాలి. మీరు కట్టే ఈఎంఐ.. మీ ఇంటి ఖర్చులు, ఇతరత్రా కట్టాల్సిన బాకీలు అన్నీ పోయాక ఇన్వెస్ట్ చేసేందుకు మిగిలే డబ్బులో 40% మించకుండా ఉండాలి. -
లగ్జరీ కార్లు దిగొస్తున్నాయ్!
-
ఆకట్టుకుంటున్న లక్జరీ ఎక్స్‌షో