ఇవి పాటిస్తే.. గేటెడ్‌లో నిశ్చింతే! | Geted niscinte in the follow | Sakshi
Sakshi News home page

ఇవి పాటిస్తే.. గేటెడ్‌లో నిశ్చింతే!

Published Fri, Mar 20 2015 11:24 PM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

ఇవి పాటిస్తే.. గేటెడ్‌లో నిశ్చింతే! - Sakshi

ఇవి పాటిస్తే.. గేటెడ్‌లో నిశ్చింతే!

హైదరాబాద్: గేటెడ్ కమ్యూనిటీ అయినా లగ్జరీ విల్లా అయినా నివాసితులంతా రోజువారి పనుల్లో ఒత్తిడితో ఉంటారు. పక్కవారి గురించి ఆలోచించే తీరికే ఎవరికీ ఉండదు. ఈ నేపథ్యంలో నివాసితుల సంక్షేమం కోసం సమయాన్ని వెచ్చించడానికి ముందుకొచ్చేవారిని అభినందించాలి. మంచి పనులు చేస్తే మనస్ఫూర్తిగా ప్రోత్సహించాలి. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దుకోవడానికి సలహాలివ్వాలి. అంతేతప్ప చిన్న పొరపాటునూ భూతద్దంలో చూసిపెద్దగా చేయకూడదు. ఇలా చేస్తే భవిష్యత్తులో ఆయా సంఘం బాధ్యతల్ని నిర్వర్తించడానికి ఎవరూ ముందుకు రాకపోవచ్చు.

ఒక అపార్ట్‌మెంట్‌లోని వ్యవహారాలన్నీ సమర్థంగా నడిపించాల్సిన విధివిధానాల గురించి ‘బైలాస్’లో స్పష్టంగా రాసుకోవాలి. ఏయే సందర్భాల్లో నివాసితులెలా స్పందించాలో ముందే పేర్కొనాలి. కాబట్టి ఇందులో పొందుపరిచే నిబంధనల్ని ప్రతి ఒక్కరూ పాటించాలి. అలా చేసినవారి మీద తీసుకోవాల్సిన చర్యల గురించి రాసుకుంటే ఉత్తమం.

సంఘం సభ్యులుగా ఎన్నికయ్యేవారు తోటి సభ్యులతో కలిసిమెలిసి పనిచేయాలి. వ్యక్తిగత వివాదాల జోలికి వెళ్లకుండా రాగద్వేషాలకు తావివ్వకుండా నివాసితులందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోవాలి.  నివాసితుల సంఘం ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులకు సంబంధించి ప్రతి అంశాన్ని క్షుణ ్నంగా తెలుసుకున్నాకే ఎన్నుకోవాలి. ఆయా అభ్యర్థుల ప్రత్యేకతలు, వివిధ సందర్భాల్లో స్పందించే తీరు, సంఘం మేలు కోసం సమయాన్ని వెచ్చించగలరా? అందరికీ ఉపయోగపడేలా నిర్ణయాలు తీసుకోగలరా? లేక వ్యక్తిగత లాభాపేక్షను దృష్టిలో పెట్టుకుంటారా? ఇలా పలు అంశాల్ని గమనించాకే నిర్ణయం తీసుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement