జిల్లా కేంద్రాల్లో బడా ప్రాజెక్ట్లు!
సాక్షి, హైదరాబాద్ : కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాల్లోనూ గేటెడ్ కమ్యూనిటీ, విల్లాల సంస్కృతి విస్తరించింది. అందుకే సూర్యాపేటలో ఓ అపార్ట్‌మెంట్‌ను నిర్మించాలని నిర్ణయించామని.. స్థల సేకరణ కోసం చూస్తున్నామని రాంరెడ్డి పేర్కొన్నారు.
♦ టెర్మినల్స్ ఇన్‌ఫ్రాతో కలిసి కొండాపూర్‌లో జాయింట్ వెంచర్ చేస్తున్నాం. ఎకరం విస్తీర్ణంలో హ్యాంటన్స్ పేరిట ఎక్స్‌క్లూజివ్ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. 9 అంతస్తుల్లో మొత్తం 68 ఫ్లాట్లొస్తాయి. ధర చ.అ.కు రూ.4,500. టై స్విమ్మింగ్ పూల్, గార్డెన్, క్లబ్ హౌజ్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులూ ఉంటాయి. 2018 మార్చిలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం.
♦ కూకట్‌పల్లి నుంచి గాజులరామారం వెళ్లే మార్గంలో ఎకరన్నర విస్తీర్ణంలో ఏఆర్కే హేమ ప్రాజెక్ట్ రానుంది. జనవరిలో ప్రారంభించనున్న ఈ అపార్ట్‌మెంట్‌లో మొత్తం 108 ఫ్లాట్లుంటాయి. 1,050-1,700 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి.
♦ ఎల్బీనగర్‌లో ఎకరం విస్తీర్ణంలో మరో ప్రాజెక్ట్ రానుంది. దీన్ని మార్చిలో ప్రారంభించనున్నాం. ఇందులో మొత్తం 80 ఫ్లాట్లు. 1,075-1,700 మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. భువనగిరిలో 1,200 గజాల్లో కమర్షియల్ కాంప్లెక్స్‌ను ప్రారంభించనున్నాం.
♦ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్‌లో రెండున్నర ఎకరాల్లో క్లౌడ్ సిటీ పేరిట ఆటోమేటెడ్ హోమ్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. ఇందులో మొత్తం 165 ఫ్లాట్లొస్తాయి. ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతి ఫ్లాట్‌లోని లైట్లు, తలుపులు, గేట్లు అన్నీ ఆటోమేటెడ్‌గానే ఉంటాయి. ధర చ.అ.కు రూ.4 వేలు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 5 వింగ్స్‌లో పూర్తి చేస్తాం. తొలి 3 వింగ్స్‌ను వచ్చే ఏప్రిల్ నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు ఇంటి తాళాలందిస్తాం.