Apartments Construction
-
Hyderabad : లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడి పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు ఆర్నవ్ (6) పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నీలోఫర్ వైద్యులు బాలుడిని ఐసీయూలో ఉంచి చికిత్సనందిస్తున్నారు.పోలీసులు వివరాల మేరకు.. శుక్రవారం మాసబ్ ట్యాంక్‌కు చెందిన ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో అర్నవ్ ఇరుక్కుపోయాడు. మూడో ఫ్లోర్ నుంచి కిందకు దిగే క్రమంలో లిఫ్ట్ ఆగిపోయింది. దీంతో లిఫ్ట్- స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడు కేకలు వేశాడు. కేకలు విన్న అపార్ట్మెంట్ వాసులు పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక, డీఆర్ఎఫ్ సిబ్బంది సైతం ఘటనా స్థలికి చేరుకున్నారు. లిఫ్ట్-స్లాబ్‌ల మధ్య ఇరుక్కున్న బాలుడిని నాలుగు గంటల పాటు శ్రమించి వెల్డింగ్ మిషన్ల సాయంతో లిఫ్ట్ డోర్లు తొలగించి బయటకు తీశారు. అనంతరం, అత్యవసర చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం, బాలుడి పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నట్లు నీలోఫర్ వైద్యులు తెలిపారు. -
అపార్ట్మెంట్, విల్లా కలిస్తే..
అవునూ.. హైదరాబాద్ నిర్మాణ రంగం (Hyderabad realty) ట్రెండ్ మారింది. అపార్ట్మెంట్, విల్లా రెండింటినీ మిక్స్ చేస్తూ స్కై విల్లాస్ (Sky villa) హాట్ కేక్‌లుగా అవతరించాయి. ఒక అపార్ట్మెంట్లో ఫ్లోర్‌కు ఒక్క ఫ్లాట్ మాత్రమే, అది కూడా 6 వేల నుంచి 16 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో.. పైగా విలాసవంతమైన వసతులు, భద్రత, ప్రైవసీలతో కట్టిపడేస్తున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్(హెచ్ఎన్ఐ), ప్రవాసులు స్కై విల్లాస్ కొనుగోలుకు ఆసక్తి చూపిస్తుండటంతో నగరంలో వీటి నిర్మాణాలు జోరందుకున్నాయి.గతంలో విలాసవంతమైన ఇళ్లలో నివసించాలనుకునేవారి కోసం విల్లాలు, బంగ్లాలు నిర్మించేవారు. వీటికి కొంత పరిమితులున్నాయి. భూమి ధర విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో డెవలపర్లకు ప్రధాన నగరంలో విల్లాలు, బంగ్లాలు నిర్మించడం సాధ్యం కాదు. దీంతో ఎత్తయిన అపార్ట్మెంట్లలో స్కై విల్లాలను నిర్మిస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పచ్చదనం, సిటీ వ్యూ అనుభూతిని కలిగిస్తుండటంతో ఎత్తయిన భవనాల్లో నివసించాలనే కోరిక పెరిగింది. దీంతో మల్టీ లెవల్ స్కై విల్లాలు నివాస సముదాయ విభాగంలో హాటెస్ట్ ట్రెండ్‌గా మారింది. జీవనశైలి పట్టణ వినియోగదారుల్లో ప్రజాదరణ పొందుతోంది. – సాక్షి, సిటీబ్యూరోస్కై విల్లాస్ అంటే? విల్లాలు, అపార్ట్మెంట్ల డిజైన్, వసతులు ఒకే భవనంలో కలిపి ఉండేవే స్కై విల్లాలు లేదా విల్లామెంట్‌లు. సాధారణంగా విల్లాలు పెద్ద ఫ్లోర్ ప్లాన్, ఎక్కువ స్థలం కలిగి ఉండే స్వతంత్ర గృహాలు. వీటిల్లో లగ్జరీ వసతులు, ఔట్‌డోర్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది. ఇక, అపార్ట్మెంట్లు చిన్నగా, సమూహంగా ఉంటాయి. వీటిల్లో నివాసితులు కామన్ ఏరియాలను షేరింగ్ చేసుకుంటారు. ఈ రెండు కాన్సెప్ట్‌లు కలిపి.. విల్లాలోని విశాలమైన స్థలం, లగ్జరీ, ప్రైవసీ, అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని సౌకర్యాలు, భద్రత కలిపి డిజైన్ చేసేవే స్కై విల్లాస్. సరళభాషలో చెప్పాలంటే ఇదొక డూప్లెక్స్ అపార్ట్మెంట్.ప్రైవసీ, ఆధునిక వసతులు.. ఒక స్వతంత్ర బంగ్లా మాదిరి కాకుండా స్కై విల్లాలు భవనం మొత్తం అంతస్తులో విస్తరించి ఉంటాయి. రెండు లేదా అంతకంటే ఎక్కువ అంతస్తులో విస్తరించి ఉండే విశాలమైన బహుళ స్థాయి గృహాలే స్కై విల్లాలు. ఈ ప్రాజెక్ట్‌లలో జన సాంద్రత తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రైవసీ, భద్రత ఎక్కువ. ఇంటి పరిమాణాన్ని బట్టి స్కై విల్లాలను ఇంటిగ్రేటెడ్ బిల్డింగ్ ఆటోమేషన్, టెక్నాలజీతో విలాసవంతంగా తీర్చిదిద్దవచ్చు.స్కై విల్లాల్లో చాలా వరకు నాలుగు వైపులా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. దీంతో సూర్యరశ్మి, గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. స్కై విల్లాలలో ప్రైవేట్ లాన్, సన్డెక్తో కూడిన ప్రైవేట్ పూల్, ప్రత్యేక లిఫ్ట్, సెంట్రల్ ఎయిర్ కండీషనర్, హోమ్ థియేటర్, లగ్జరీ బెడ్ రూమ్స్, కిచెన్, స్టాఫ్ క్వార్టర్స్ వంటివి ఉంటాయి. అలాగే బ్యాడ్మింటన్ కోర్ట్, గోల్ఫ్ కోర్స్‌లు, విశాలమైన పిల్లల ఆట స్థలాలు, విలాసవంతమైన క్లబ్‌హౌస్, కాఫీ షాప్, స్విమ్మింగ్ పూల్తో పాటు ల్యాండ్ స్కేప్ గార్డెన్, వాకింగ్ ట్రాక్స్ వంటి వాటితో ప్రశాంత వాతావరణం ఉంటుంది.ఎక్కడ వస్తున్నాయంటే? స్కై విల్లాస్ ధరలు అపార్ట్మెంట్ల కంటే 30–40 శాతం ఎక్కువగా, విల్లా కంటే 20–30 శాతం తక్కువగా ఉంటాయి. ఈ ప్రాజెక్ట్‌ల్లోని ఫ్లాట్లు భారీ విస్తీర్ణంతో పాటు సకల సౌకర్యాలు ఉండటంతో వీటి ప్రారంభ ధర రూ.6 కోట్ల నుంచి ఉంటాయి. కొల్లూరు, ఉప్పల్, కోకాపేట, కొండాపూర్, నార్సింగి, పుప్పాలగూడ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఈ తరహా ప్రాజెక్ట్‌లు వస్తున్నాయి. 30–50 అంతస్తుల భవనాల్లో ఇలాంటి స్కై విల్లాలు నిర్మిస్తున్నారు. ఆకాశహర్మ్యల్లో ఎత్తుకు వెళ్లే కొద్దీ నిర్మాణ వ్యయం పెరుగుతుంది.అందుకే ఖర్చును తగ్గించుకునేందుకు 6 వేల నుంచి 16 వేల చ.అ. విస్తీర్ణంలో ఒకటే ఫ్లాట్ ఉండేలా ప్రత్యేకంగా డిజైనింగ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్లోని పైఅంతస్తులో ఈ తరహా స్కై విల్లాలను కడుతున్నారు. సౌకర్యాలకు లోటు లేకుండా ఆకాశహరమ్యల్లో ప్రతీ గేటెడ్ కమ్యూనిటీల్లో ఉన్నట్లే క్లబ్‌హౌస్‌తో పాటు అన్ని రకాల ఆధునిక వసతులను కల్పిస్తున్నారు. ఒక్కో క్లబ్‌హౌస్ 50 వేల చ.అ.విస్తీర్ణంలో ఉంటుంది.ప్రయోజనాలివీ..» విల్లామెంట్ ప్రయోజనాల్లో ప్రధానమైనది విల్లాలాంటి అనుభూతి. నివాసితులు విడిగా ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో ఉండే వసతులు, సౌలభ్యాలను ఆస్వాదించవచ్చు. ఇందులో స్విమ్మింగ్ పూల్, జిమ్, పార్క్‌లు వంటి భాగస్వామ్య సౌకర్యాలతో పాటు భద్రత, నిర్వహణ సేవలు ఉంటాయి.» డూప్లెక్స్ డిజైన్ బెడ్ రూమ్‌లు, బాత్రూమ్లు, లివింగ్, డైనింగ్ ఏరియాలతో పాటు ప్రైవేట్ టెర్రస్ లేదా గార్డెన్ ఉంటాయి. అదనంగా విల్లామెంట్లలో ప్రైవేట్ లిఫ్ట్, విశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యాలుంటాయి.» స్కై విల్లాస్ సాంప్రదాయ అపార్ట్మెంట్ కంటే ఎక్కువ స్థలం, ప్రైవసీని అందిస్తాయి.» విల్లామెంట్ కాంప్లెక్స్‌లు సెక్యూరిటీ గార్డులు, సీసీటీవీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. నివాసితులకు సురక్షితమైన జీవనం, మనశ్శాంతిని అందిస్తాయి.» విల్లాలాగే ప్రాపర్టీ మొత్తం నిర్వహణ వ్యయం యజమాని భరించాల్సిన అవసరం లేదు. విల్లామెంట్‌ల నిర్వహణ కమ్యూనిటీలోని అందరూ పాలుపంచుకుంటారు. దీంతో నివాసితులకు వ్యయం, సమయం ఆదా అవుతుంది. -
రంగారెడ్డి జిల్లా కోకాపేట్ లో బ్లాస్టింగ్స్ కలకలం
-
సెల్లార్ తవ్వుతుండగా కూలిన అపార్ట్మెంట్ ప్రహరీ
మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి భరత్పురి కాలనీ సెవెన్‌హిల్స్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ పక్కన ఆదివారం ఉదయం సెల్లార్ తవ్వుతుండగా ప్రహరీ కూలిపోయిన ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. త్రుటిలో పెను ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అపార్ట్మెంట్ పక్కనే సెల్లార్ కోవసం తవ్వుతున్నారని మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందించినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. మున్సిపల్ అనుమతి లేకుండానే సెల్లార్లు జరుగుతున్నా అధికారులు మొద్దు నిద్ర పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై మున్సిపల్ అధికారులకు వినతిపత్రం అందించినా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని దుయ్యబట్టారు. వెంటనే సెల్లార్ తవ్వకం పనులను నిలిపివేయించాలని అధికారులను అపార్ట్మెంట్ వాసులు డిమాండ్ చేశారు. -
పుప్పాలగూడలోని ఓ అపార్ట్మెంట్లో చెలరేగిన మంటలు
-
వరద రావచ్చేమో..
సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూ ప్రగతినగర్‌కు చెందిన ఓ నిర్మాణ సంస్థ నెల రోజుల క్రితం అయిదంతస్తుల భవన నిర్మాణానికి అనుమతుల కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)కు దరఖాస్తు చేసుకుంది. నెల రోజుల పాటు దరఖాస్తు పరిశీలన దశలోనే ఉంది. వివిధ స్థాయిలకు చెందిన అధికారులు పరిశీలించి చివరకు ఆ ప్రాంతంలో వరద నీరు రావచ్చేమోననే సందేహాన్ని చల్లగా వ్యక్తం చేశారు. ఈ సందేహాన్ని నివృత్తి చేసేందుకు ఇరిగేషన్, రెవెన్యూ విభాగాల నుంచి టోపోమ్యాప్తో కూడిన నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) కావాలంటూ కొర్రీలు పెట్టారు. నెలరోజుల పాటు ఎటూ తేల్చకుండా చివరకు ఎన్ఓసీలు కావాలంటూ షరతులు పెట్టడంతో సదరు నిర్మాణ సంస్థకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. నిజానికి అదే ప్రాంతంలో దశాబ్దాలుగా ఎంతో మంది నివాసం ఉంటున్నారు. దరఖాస్తు చేసుకున్న స్థలానికి చుట్టుపక్కల అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి. పైగా హెచ్ఎండీఏ గతంలో ఇచ్చిన దరఖాస్తులతోనే ఆ భవనాలను కట్టారు. నిర్మాణానికి అన్ని విధాలా అర్హత ఉన్న ఆ స్థలానికి కొత్తగా టోపో మ్యాప్‌తో పాటు ఎన్ఓసీ కావాలని ఆంక్షలు విధించారు. ఒక్క ప్రగతినగర్‌లోనే కాదు. హెచ్ఎండీఏ పరిధిలో ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలన్నా బిల్డర్లు, మధ్యతరగతి వర్గాలు హడలెత్తుతున్నాయి. టీజీబీపాస్ ద్వారా హెచ్ఎండీఏ నుంచి అనుమతి పొందడమే ఇప్పుడు అతిపెద్ద సవాల్‌గా మారింది. ఎండమావుల్లా ఎన్ఓసీలు... ⇒ భవన నిర్మాణాలు, లే అవుట్లు, ఎల్ఆర్ఎస్లు, ఆక్యుపెన్సీ సరి్టఫికెట్లు వంటి వివిధ రకాల పనులపై సాధారణంగానే నెలలు గడిచినా అనుమతులు లభించడం దుర్లభంగా మారింది. కేవలం 15 రోజుల్లో దరఖాస్తులను పరిశీలించి అనుమతులను జారీ చేయాల్సి ఉండగా నెలలు గడిచినా అనుమతులు లభించడం లేదంటూ దరఖాస్తుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఫైళ్లు పెండింగ్ జాబితాలో పేరుకుపోతున్నాయి. ఇదే సమయంలో కొత్తగా రెండంచెల విధానాన్ని ప్రవేశపెట్టారు. హెచ్ఎండీఏ అనుమతుల్లో ఇరిగేషన్, రెవిన్యూ శాఖలను కూడా చేర్చారు. దీంతో ఫైళ్ల కదలికలో మరింత జాప్యం ఏర్పడుతోంది. ⇒ ఇదంతా ఒకవైపైతే.. మరోవైపు హెచ్ఎండీఏ ఆంక్షల మేరకు ఇరిగేషన్, రెవిన్యూ విభాగాల నుంచి ఎన్ఓసీలు జారీ కావడం లేదు. తుర్కయంజాల్‌కు చెందిన ఓ దరఖాస్తుదారు ఏడాది క్రితం భవన నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. దశాబ్దాల క్రితం అక్కడ పంట కాల్వ ఉన్నట్లు పరిగణించి ఎన్ఓసీ కోరారు. ఈ మేరకు ఆరు నెలల పాటు ఇరిగేషన్ అధికారుల చుట్టూ తిరిగి ఎన్ఓసీ సంపాదించారాయన. కానీ.. అదొక్కటే చాలదు. రెవెన్యూ ఎన్ఓసీ కూడా అవసరమన్నారు. ఇప్పటి వరకు రెవెన్యూ నుంచి ఎన్ఓసీ లభించలేదు. దీంతో భవన నిర్మాణాన్ని ఆయన వాయిదా వేసుకున్నారు. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు ఎన్ఓసీలు ఇచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు.రెవెన్యూ అవసరం లేకపోయినా.. సాధారణంగా వర్షం కురిసినప్పుడు ఎత్తు నుంచి పల్లానికి వరద నీళ్లు ప్రవహిస్తాయి. టోపో మ్యాప్‌ల ఆధారంగా ఇలాంటి వరద కాల్వలను గుర్తిస్తారు. భవన నిర్మాణం చేపట్టనున్న స్థలానికి చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఎలాంటి వరదలు రావని నిర్ధారిస్తూ ఎన్ఓసీలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ నీటిపారుదల అధికారులు ఎన్ఓసీ ఇచ్చేందుకు నిరాకరిస్తే అది వరద ముప్పు ఉన్న ప్రాంతంగానే పరిగణించాలి. ఇందులో రెవెన్యూ శాఖ భాగస్వామ్యం అవసరం లేదు. వర్షపు నీరు ప్రవహించే ప్రాంతాలుగా అనుమానించి కొర్రీలు విధిస్తున్న హెచ్ఎండీఏ అధికారులు ఇరిగేషన్‌తో పాటు రెవెన్యూ ఎన్ఓసీలను కూడా తప్పనిసరి చేయడం గమనార్హం. కాగా.. హైడ్రా రాకతోనే తాము ఇలాంటి ఎన్ఓసీలను కోరుతున్నామని హెచ్ఎండీఏ అధికారులు చెబుతున్నారు. -
సొసైటీలో ‘సభ్యత్వ’ బేరం!
సాక్షి, హైదరాబాద్: ‘‘రండి బాబు.. రండి.. అపార్ట్మెంట్ ఫ్లాట్లు కొనండి.. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో భాగస్వాములు కండి.. ఇక్కడ కొనండి.. అక్కడ సభ్యత్వం పొందండి..’’ ఎన్నో అక్రమాలకు కేరాఫ్‌గా మారిన జూబ్లీహిల్స్ సొసైటీ పాలకవర్గం చేస్తున్న ప్రచారమిది. సొసైటీకి ఏ మాత్రం సంబంధం లేని, ఇంకా కట్టని, అసలు ఎలాంటి అనుమతుల్లేని వెంచర్లో ఫ్లాట్లను అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. 13.713 ఎకరాలు.. 1,900 ఫ్లాట్లు.. 40 ఫ్లోర్లు.. రివర్ వ్యూ, హైరైజ్ అంటూ జూబ్లీహిల్స్–4 పేరిట విక్రయాలు చేస్తోంది. ఇదంతా నమ్మి రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తే.. ఏదో ఒకరోజు ‘హైడ్రా’ ఎటాక్ తప్పని పరిస్థితి. ఈ వెంచర్‌కు సంబంధించి స్థానికులు, కొందరు సభ్యులు పలు కీలక వివరాలు వెల్లడించారు. జూబ్లీహిల్స్–4 వెంచర్స్ పేరుతో.. ‘జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ బిల్డింగ్ సొసైటీ (జేహెచ్‌సీహెచ్‌బీఎస్)’ పాలకవర్గం కొత్త దందాకు తెర తీసింది. ఓ ప్రైవేట్ వెంచర్లో ప్రపోజ్డ్ డెవలపర్‌గా ప్రవేశించి.. ఫ్లాట్లు విక్రయించే పని చేపట్టింది. ఫ్లాట్లు అమ్మేందుకు భారీ స్కెచ్ వేసింది. ఎంతో డిమాండ్ ఉన్న ‘జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ’లో కొత్తగా సభ్యత్వాలను మొదలుపెట్టింది. సభ్యత్వం కావాలంటే.. ప్రైవేట్ వెంచర్లో ఫ్లాట్ కొనాలని కొర్రీపెట్టి, అంటగడుతోంది. సొసైటీ నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించడం లేదని పాలకవర్గం చెప్తున్నా.. ఇక్కడ సభ్యత్వాలు ఇచ్చే సమయంలోనే వెంచర్ తెరపైకి ఎలా వచ్చింది? అది ప్రైవేట్ వెంచర్ అయినప్పుడు సొసైటీ ఎందుకు విక్రయిస్తోంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీని వెనుక వందల కోట్ల స్కామ్ ఉందంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఫ్లాట్ల అమ్మకాలకు సంబంధించి చదరపు అడుగు (ఎస్ఎఫ్టీ)కు ఇంత అన్న లెక్కన కొందరి జేబుల్లోకి సొమ్ము చేరేలా తతంగం నడిపిస్తున్నారనే చర్చ సాగుతోంది. అందుకే కొత్తగా సభ్యత్వం కోసం వస్తున్నవారికి ‘‘దాదాపు 15 వేల కోట్ల ఆస్తులపై మీకు హక్కులు వస్తాయి. క్లబ్‌కు వెళ్లొచ్చు. స్కూల్లో మీ పిల్లలను చదివించొచ్చు. కమ్యూనిటీ సెంటర్ వంటివి వినియోగించుకోవచ్చు..’’ అంటూ ప్రచారం చేస్తున్నారని సభ్యులు చెప్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఫేజ్–4లో ఫ్లాట్ కొనుగోలు చేయాల నే షరతు పెట్టారని, భవిష్యత్‌లో అన్ని అనుమతులు రా కుంటే పరిస్థితి ఏమిటనేది ఎక్కడా పేర్కొనలేదని అంటున్నారు. ఇదంతా తెలియని కొందరు మాత్రం సిటీ మధ్య లోని ఆస్తుల్లో భాగస్వాములం కాబోతున్నామనే ఆశతో సొసైటీ పాలకవర్గం బుట్టలో పడుతున్నారని చెప్తున్నారు. మాకే ఇంకా స్థలాలు ఇవ్వలేదంటూ.. మరోవైపు దశాబ్దాలుగా సొసైటీలో సభ్యులుగా ఉన్న తమకే స్థలాలు ఇవ్వలేదని.. ప్రైవేట్ వెంచర్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇక్కడ రూ.5 లక్షలు తీసుకుని సభ్యత్వం ఇవ్వడమేంటని కొందరు సభ్యులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు కూడా తమ సొసైటీ సభ్యులుగా ఉన్నా.. ఈ అక్రమాలపై స్పందించడం లేదేమని ప్రశ్నిస్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫేజ్–4 బ్రోచర్‌ను నేరుగా మంత్రి తుమ్మలతోనే ఆవిష్కరింపజేశారు. దీనివల్ల ఇబ్బందులు, అనుమానాలు ఉండవనే ఎత్తుగడ ఉన్నట్టు స్పష్టమవుతోందని సొసైటీ సభ్యులు చెప్తున్నారు. జనం ఫ్లాట్ల కొనుగోలుకు ముందుకొస్తారని, అధికారులు జోక్యం చేసుకోకుండా ఓ సంకేతం ఉంటుందని అంటున్నారు. నిజానికి ఇక్కడి మోసాలు, అక్రమాలు మంత్రికి తెలియకుండా తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ సొసైటీని రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సొసైటీ మార్చారని వాపోతున్నారు. ఒక్కో షేర్‌కు రూ.300 చొప్పున వసూలు చేసి.. రూ.15,000 కోట్ల ఆస్తులపై హక్కులు ఎలా కలి్పస్తారని కొందరు సభ్యులు ప్రశి్నస్తున్నారు. సొసైటీ మొత్తం సభ్యులు 5,000 మంది అనుకున్నా.. ఒక షేర్ కొన్న కొత్త సభ్యుడి వాటా సుమారు రూ.30 లక్షలు అవుతుందని... ఇలా ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏమిటా వెంచర్.. ఎక్కడ? నార్సింగి పరిధిలోని మంచిరేవుల వద్ద టింబర్ చెరువును ఆనుకుని జూబ్లీహిల్స్ ఫేజ్–4 పేరుతో చేపడుతున్న ఈ వెంచర్‌కు రహదారి వివాదం ఉంది. దేవాదాయ శాఖ భూముల్లోంచి దారితీసే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. వెంచర్‌కు అనుమతి రావాలంటే దారి చూపించాలి. అది సాధ్యం కాదు గనుక వెంచర్ ఏర్పాటు కలేనని స్థానికులు అంటున్నారు. ఎవరైనా వాస్తవాలు తెలుసుకున్నాకే కొనుగోలు చేయాలని స్పష్టం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఇదంతా తెలిసినా.. వెంచర్ బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారని సమాచారం. అలాగే వదిలేస్తే భవిష్యత్‌లో హైడ్రా దృష్టిలో పడితే ఎలాగని, తమ ఉద్యోగానికి ఎసరొచ్చే పరిస్థితి వస్తుందేమోనని కలవరపడుతున్నారు.జవాబు లేని ప్రశ్నలెన్నో.. » రహదారే లేకుండా హెచ్ఎండీఏ నుంచి వెంచర్‌కు అనుమతి ఎలా వస్తుంది? » అనుమతి లేని వెంచర్లో ప్లాట్లు తీసుకోవాలని సభ్యులపై ఒత్తిడి ఎందుకు? » షరతు విధిస్తూ సభ్యత్వ నమోదు ఫారం ఇస్తున్నా సహకార శాఖ అధికారులెక్కడ? » ఇలా అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నా సహకార శాఖ అధి కారులు కళ్లు మూసుకుని కూర్చోవడం వెనుక ఏం జరుగుతోంది?మా భూమిలో నుంచి రోడ్డు లేదు మంచిరేవుల రెవెన్యూ పరిధిలో జూబ్లీహిల్స్ ఫేజ్–4 పేరుతో వస్తున్న వెంచర్‌కు ఉత్తరం వైపు నుంచి 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. ఆ రోడ్డుతో అనుమతులు రావనే ఉద్దేశంతో.. 70ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సర్వే నంబర్ 293లోని దేవాదాయ శాఖ భూమిలో నుంచి వంద అడుగుల రోడ్డు ఉన్నట్టు చూపుతూ హెచ్ఎండీఏ, ఇతర అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇప్పటికే రోడ్డు వేసేందుకు ప్రయతి్నస్తే అడ్డుకున్నాం. వారికి అనుమతులు రాకుండా హెచ్ఎండీఏలో ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి అనుమతులు లేని వెంచర్లలో ఫ్లాట్లు కొని మోసపోవద్దు. – పి.సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్, మంచిరేవులప్రైవేటు కేసులు, రోడ్డు డాక్యుమెంట్లు చూసుకోవాలి మంచిరేవులలో సర్వే నంబర్ 234, 236, 237, 263, 264, 265, 266, 267లలో ఉన్న భూమి పట్టాభూమి. దానికి ఉత్తరం వైపు గ్రీన్‌ఫీల్డ్ లే–అవుట్లో నుంచి రోడ్డు ఉంది. రెవెన్యూపరంగా కేసులు లేవు. ప్రైవేటుగా ఉన్న కేసులు, రోడ్డు సౌకర్యం, ఇతర వివరాల డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలి. కొంత మేర ఇటికిన్ చెరువు బఫర్ ఈ భూమికి తగిలి ఉంటుంది. ఇటీవల దేవా దాయ శాఖ భూమిలో నుంచి రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రయతి్నస్తే స్థానికులు అడ్డుకున్నారు. కోర్టుల్లో కేసులు ఉన్నాయనే విషయం ప్రచారంలో ఉంది. – నర్రా శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, గండిపేట మండలం -
ఈ కిక్కిరిసిన అపార్ట్మెంట్ ఎక్కడుందో తెలుసా!?
ప్రపంచంలోనే అత్యధిక జనాభా నివాసం ఉండే అపార్ట్మెంట్ భవన సముదాయం ఇది. ఈ భవన సముదాయం రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ సమీపంలో ఉంది. ఇందులో ఏకంగా ఇరవైవేల మందికి పైగా జనాలు నివాసం ఉంటున్నారు. మనుషులతో కిక్కిరిసిన ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ను పాశ్చాత్య మీడియా ‘హ్యూమన్ యాంట్‌హిల్’గా అభివర్ణిస్తోంది. అంటే, మనుషులు ఉండే చీమలపుట్ట అన్నమాట!ఈ భారీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో 25 అంతస్తుల్లో 3,708 అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ అపార్ట్మెంట్ కాంప్లెక్స్ నిర్మాణం 2015లో పూర్తయింది. అప్పటి నుంచి జనాలు ఇందులోకి చేరడం మొదలుపెట్టారు. స్వల్పకాలంలోనే ఇది పూర్తిగా జనాలతో కిక్కిరిసిపోయే పరిస్థితికి చేరుకుంది. ఉచిత పార్కింగ్, కాంప్లెక్స్ లోపలే సెలూన్లు, కాఫీ షాపులు, నర్సరీ, పోస్టాఫీసు, సూపర్‌మార్కెట్ వంటి సమస్త సౌకర్యాలూ ఉండటంతో జనాలు ఇక్కడ ఉండటానికి ఇష్టపడుతున్నారు.ఇవి చదవండి: మీ ముఖాన్ని.. మెరిపించే మంత్రదండం! -
పేమెంట్ ఆలస్యమైతే ఎక్కువ వడ్డీ చెల్లిస్తున్నారా?
కొత్త అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొంటున్నారా..ఇంకా నిర్మాణం పూర్తవ్వకముందే బుక్ చేసుకుంటున్నారా..అయితే మీకు ఈ విషయం తెలియాల్సిందే. ఒప్పందం ప్రకారమే నిర్మాణం పూర్తవుతుందని బిల్డర్ హామీ ఇస్తాడు. ఒకవేళ ఇచ్చిన హామీ ప్రకారం ఇంటి తాళాలు ఇవ్వకపోతే, జాప్యం జరిగిన సమయానికి అదనంగా 6 శాతం వడ్డీతో సహా డబ్బు చెల్లిస్తానని చెబుతుంటాడు. అయితే అనుకున్న సమయానికి మీరే ఫ్లాట్ ధర చెల్లించడంలో ఆలస్యం చేస్తే మాత్రం సుమారు 18 శాతం వడ్డీ కట్టాలని ఒప్పందం చేసుకుంటాడు.రియల్ ఎస్టేట్ రిగ్యులేటరీ అథారిటీ(రెరా) చట్టంలోని క్లాజ్ 31 ప్రకారం..ముందే చేసుకున్న ఒప్పందం ఆధారంగా నిర్మాణం పూర్తి చేయడంలో బిల్డర్లు విఫలమైతే వినియోగదారులకు ఏమేరకు వడ్డీ చెల్లిస్తారో అదే మొత్తం వినియోగదారుల చెల్లింపులకు వర్తిస్తుంది. పైన తెలిపిన విధంగా చూస్తే, అనుకున్న సమయానికి నిర్మాణం పూర్తి చేయకపోతే 6 శాతం వడ్డీతో డబ్బు చెల్లిస్తానని బిల్డర్ చెబుతాడు. ఒకవేళ ఫ్లాట్ కొనుగోలుదారుడు కూడా ఏదైనా అనివార్య కారణాల వల్ల చెల్లింపులు జాప్యం చేస్తే అదే వడ్డీని లెక్కగట్టి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. రెరా చట్టం ప్రకారం ఎక్కువ వడ్డీ చెల్లించకూడదు.ఇదీ చదవండి: భారీ పెట్టుబడులకు చర్చలు -
హైదరాబాద్: అపార్ట్మెంట్లోకి దూసుకెళ్లిన బులెట్
సాక్షి, హైదరాబాద్: నార్సింగి బైరాగిగూడలో బులెట్ కలకలం రేపింది. ఓ అపార్ట్మెంట్లోకి బులెట్ దూసుకొచ్చింది. ఐదో అంతస్తులో ఉన్న ప్లాట్ కిటికీ అద్దాలు పగిలి.. బెడ్ రూమ్‌లో బులెట్ పడింది.ఫ్లాట్ యజమాని ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఎవ్వరికీ ఏమి కాకపోవడంతో యజమాని ఊపిరి పీల్చుకున్నారు. ఆర్మీ ఫైరింగ్ రేంజ్లో ఆర్మీ జవాన్లు ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా, గన్ మిస్ ఫైర్ కావడంతో అపార్ట్మెంట్ ఐదో అంతస్తులోకి బులెట్ దూసుకొచ్చింది. -
4 BHK ఫ్లాట్ ధర రూ. 15 కోట్లు.. నోయిడా టెక్కీ పోస్టు వైరల్
నోయిడా: రోజులు గడుస్తున్న కొద్దీ రియల్ ఎస్టేట్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇళ్లు, ఫ్లాట్లు, ప్లాట్ల ధరలు పెరుగుతున్నాయి. ఏ ప్రాంతంలో అయినా చిన్నచిన్న ఇళ్ల నిర్మాణం నుంచి లగ్జరీ ప్రాజెక్టుల వరకు రేట్లు ఆకాశంలోనే ఉన్నాయి. సొంతింటిలో జీవించడం ప్రతి ఒక్కరి కల కావడంతో ఎంత డబ్బులు వెచ్చించినా ఒక ఇంటిని సొంతం చేసుకునేందుకు అందరూ తాపత్రయ పడుతుంటారు.ఇక లగ్జరీ విల్లాలు, గేటెడ్ కమ్యూనిటీ, అపార్ట్మెంట్లలో ఫ్లాట్ కొనడమంటే కోట్లు వెచ్చించాల్సిందే. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఓ ఇంటి ధర తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అక్కడ నోయిడాలో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్ ధర ఏకంగా రూ. 15 కోట్ల ధరగా నిర్ణయించారు. ఈ విషయాన్ని ఢిల్లీ ఎన్సీఆర్కు చెందిన ఓ ఇంజనీర్ తన సోషల్ మీడియా పోస్ట్ చేశాడు. దీంతో ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్‌గా మారింది.కాశిష్ అనే వ్యక్తి విట్టీ ఇంజనీర్ అనే ఇన్‌స్టా అకౌంట్లోని పోస్టు ప్రకారం.. నోయిడా సెక్టార్ 124 కు వర్చువల్ టూర్‌కు వెళ్లాడు. అక్కడ ఏటీఎస్ నైట్స్ బ్రిడ్స్ ప్రాజెక్ట్‌లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో ఓ ఫ్లాట్ ధరను చూశారు. 4 BHK ఫ్లాట్ ధరను రూ. 15 కోట్లకు అమ్ముతున్నట్లు బోర్డు ఉంది. అలాగే 6 BHK ఫ్లాట్ ధర 25 కోట్లు అని ఉంది. ఇది చూసిన కాశిష్.. ఏ ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, పెట్టుబడులు పెట్టినా సొంత ఇంటిని కొనుగోలు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఈ అపార్ట్మెంట్లు ఎవరు కొంటున్నారో ఆశ్యర్యం వేస్తుంది.. వారు ఏ పని చేస్తారని ప్రశ్నించారు. నేను అయితే ఎన్ని ఉద్యోగాలు మార్చుకున్నా, ఎంత వ్యాపారం చేసినా లేదా పెట్టుబడి పెట్టినా ఈ సమాజంలో 4BHKను కొనుగోలు చేయగలనా?" అని పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Witty Engineer (@wittyengineer_) ఈ వీడీయో వైరల్‌గా మారింది. దాదాపు 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అపార్ట్మెంట్ల అధిక ధరలపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అనేక మంది కామెంట్లు పెట్టారు. నోయిడా రియల్ ఎస్టేట్ మధ్యతరగతి భారతీయులకు అందుబాటులో లేకుండా పోతుందని కొందరు పేర్కొన్నగా.. 15 కోట్లతో యూరప్ లేదా యూఎస్‌లో పౌరసత్వంతోపాటు ఎక్కడైన ఒక అపార్ట్‌మెంటే కొనవచ్చని చెబుతున్నారు. మరికొందరు ఇది ల్గజరీ ప్రాజెక్ట్ అని, విశాలమైన ప్రదేశం, విలాసవంతమైన సౌకర్యాల వల్ల అంత ధర ఉందని వివరిస్తున్నారు. -
1051 అపార్ట్మెంట్ల కోసం రూ.2000 కోట్లు: ప్రముఖ కంపెనీ కీలక నిర్ణయం
రియల్ ఎస్టేట్ రంగం రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ రియల్టీ సంస్థ 'క్రిసుమి కార్పొరేషన్' తన విస్తరణ ప్రణాళికలో భాగంగా గురుగ్రామ్‌లో 1,051 లగ్జరీ అపార్ట్మెంట్లను నిర్మించడానికి రూ. 2,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.క్రిసుమి కార్పొరేషన్ అనేది కృష్ణా గ్రూప్ అండ్ జపాన్‌కు చెందిన సుమిటోమో కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్. ఇది ఇప్పటికే సెక్టార్ 36A, గురుగ్రామ్‌లో పెద్ద లగ్జరీ టౌన్షిప్ 'క్రిసుమి సిటీ'ని అభివృద్ధి చేస్తోంది. ఇందులో మొదటి దశ 433 యూనిట్లతో కూడిన 'వాటర్‌ఫాల్ రెసిడెన్సెస్' పూర్తికాగా, రెండవ దశ 320 యూనిట్లతో కూడిన 'వాటర్‌ఫాల్ సూట్లు' 2028లో డెలివరీ చేయడానికి షెడ్యూల్ చేసింది.ఇవి కాకుండా.. మరో 1,051 లగ్జరీ యూనిట్లతో కూడిన తమ టౌన్షిప్లో ఫేజ్ 3, ఫేజ్ 4లో రూ. 2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు సోమవారం క్రిసుమి ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్ట్ మొత్తం 2.3 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో అభివృద్ధి చెందుతుంది. అదనంగా.. 350 కోట్ల రూపాయల పెట్టుబడితో టౌన్షిప్లో సుమారు 1,60,000 చదరపు అడుగుల నిర్మాణ విస్తీర్ణంతో 2 ఎకరాలలో అత్యాధునిక క్లబ్‌ను సంస్థ అభివృద్ధి చేయనుంది. దీనికి సంబంధించిన నిర్మాణ కార్యకలాపాలు గత నెలలో ప్రారంభమయ్యాయి, డిసెంబర్ 2029 నాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయనున్నట్లు సమాచారం. -
అపార్ట్మెంట్ కట్టలేదు..స్థలం అమ్మేశారు!
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరో ప్రీ లాంచ్ దందా వెలుగులోకి వచ్చింది. కొంపల్లిలో భారీ అపార్ట్మెంట్ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని ప్రచారం చేసి, కస్టమర్ల నుంచి పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి చేతులెత్తేసిన భారతి బిల్డర్స్ కు చెందిన ముగ్గురు యజమానులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం (ఈఓ డబ్ల్యూ) పోలీసులు అరెస్టు చేసి, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. వివరాలను డీసీసీ కె.ప్రసాద్ వెల్లడించారు. నగరానికి చెందిన దూపాటి నాగరాజు, మల్పూరి శివరామకృష్ణలు 2021 లో మాదాపూర్‌లో భారతి బిల్డర్స్ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ క్రమంలో మేడ్చల్ మల్కా జిగిరి జిల్లా కొంపల్లిలో 6.23 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భారతి లేక్ వ్యూ పేరుతో అపార్ట్మెంట్లను నిర్మిస్తామని ప్రకటించారు. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రీ లాంచ్ ఆఫర్‌కు తెరలేపారు. చదరపు అడుగు రూ.3,200కే విక్రయిస్తు న్నామని ప్రచారం చేశారు. ఈ మేరకు కొంపల్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రత్యేకంగా సమావేశాలు సైతం నిర్వహించారు.రూ.60 కోట్లు వసూలు..: తమ ప్రణాళికను అమలు చేసేందుకు తొడ్డాకుల నర్సింహారావు అలియాస్ పొన్నారిని కంపెనీ సీఈఓగా నియమించారు. భారీ కమీషన్ ఇస్తామని ఆశ చూపించారు. ఈ నేపథ్యంలో దాదాపు 350 మంది కస్టమ ర్ల నుంచి రూ.60 కోట్లు వసూలు చేశారు. కానీ నిర్మాణాన్ని ప్రారంభించలేదు. మరోవైపు రూ.100 కోట్ల విలువైన 6.23 ఎకరాల స్థలాన్ని సంస్థ యజమానులు రెట్టింపు ధరకు ఇతర వ్యక్తులకు విక్రయించేశారు. అటు అపార్ట్మెంట్ నిర్మాణం ప్రారంభం కాక, వాటా స్థలమైనా దక్కే అవకాశం లేక కస్టమర్లు రోడ్డున పడ్డారు. బాధితుల్లో ఒకరైన బీవీఎస్ ప్రసాద్ సైబరాబాద్ ఈఓడబ్ల్యూ ఠాణాలో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్–1999 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురు నిందితులు నాగరాజు, శివరామకృష్ణ, నర్సింహారావులను అరెస్టు చేశారు. -
భారీగా పెరిగిన అపార్ట్మెంట్ సేల్స్ - హయ్యెస్ట్ ఈ నగరాల్లోనే..
ఈ ఏడాది ఆటోమొబైల్ రంగం మాత్రమే కాకుండా రియర్ ఎస్టేట్ రంగం కూడా బాగా ఊపందుకుంది. 2023వ సంవత్సరంలో అపార్ట్మెంట్లకు గిరాకీ భారీగా పెరిగిందని 'జేఎల్ఎల్ ఇండియా' (JLL India) వెల్లడించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం దేశంలోని ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్లకు డిమాండ్ బాగా పెరిగిందని ఢిల్లీ-NCR, ముంబై, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, పూణేలలో మొత్తం రెండు లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలు జరిగినట్లు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. గతం కంటే ఈ ఏడాది 20 శాతం అమ్మకాలు పెరుగుతాయని, 2023 మొదటి తొమ్మిది నెలల్లో అమ్మకాలు 1,96,227 యూనిట్లు అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది. 2022 ఇదే సమయంలో మొత్తం విక్రయాన్ని 1,61,575 యూనిట్లు మాత్రమే అని కూడా నివేదికలో వెల్లడైంది. వచ్చే ఏడాదికి అపార్ట్మెంట్ అమ్మకాలు 2.9 లక్షల నుంచి 3 లక్షల యూనిట్లకు చేరుకునే అవకాశం ఉందని జేఎల్ఎల్ ఇండియా భావిస్తోంది. మార్కెట్లో అపార్ట్మెంట్స్ కొనుగోలు చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో 2024లో కూడా సేల్స్ తారా స్థాయికి చేరనున్నట్లు స్పష్టమవుతోంది. ఇదీ చదవండి: 2023లో బెస్ట్ సీఎన్జీ కార్లు.. ఇవే! అపార్ట్మెంట్స్ ధరలు, హోమ్ లోన్ వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ కొనుగోలుదారులు మాత్రం వెనుకడుగు వేయడం లేదు. దీంతో దేశంలో హోసింగ్ మార్కెట్ సజావుగా ముందుకు సాగుతుందని జేఎల్ఎల్ ఇండియా చీఫ్ ఎకనామిస్ట్ అండ్ రీసెర్చ్ హెడ్ 'సమంతక్ దాస్' తెలిపారు. రానున్న రోజుల్లో ఇండియన్ రియల్ ఎస్టేట్ రంగం మరింత వేగం పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. -
లగ్జరీ అపార్ట్మెంట్లు, అదిరిపోయే విల్లాలు: ఫేవరెట్‌గా హైదరాబాద్ రికార్డ్
తెలంగాణ రాష్ట్ర రాజధాని రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దూసుకుపోతోంది. విలాసవంతమైన గృహాల సరఫరాలో ముందంజలో ఉండటమే 2023 క్యూ3లో రికార్డు సృష్టించింది. తాజా నివేదికల ప్రకారం దేశంలోని అన్ని నగరాలను అధిగమించి భారతదేశంలో లగ్జరీ హౌసింగ్‌కు ఫేవరెట్‌గా హైదరాబాద్ నిలిచింది. విలాసవంతమైన గృహాల సరఫరాలో అసాధారణమైన పెరుగుదలను సాధించింది. 2023 మూడో త్రైమాసికంలో దాదాపు 14,340 యూనిట్లతో లగ్జరీ హౌసింగ్‌కు గో-టు డెస్టినేషన్‌గా హైదరాబాద్ నిలిచింది. హై-ఎండ్ లివింగ్‌కు హైదరాబాద్ బలమైన డిమాండ్‌ను నమోదు చేసిందని అనారాక్ నివేదిక తాజాగా వెల్లడించింది. లగ్జరీ హౌసింగ్ జనాదరణ పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ, బెంగళూరు లాంటి ప్రధాన నగరాలను కూడా దాటేసింది హైదరాబాద్. అలాగే గృహ కొనుగోలుదారులలో ప్రాధాన్యతలలో గణనీయమైన మార్పును ఈ రిపోర్ట్ హైలైట్ చేసింది. అలాగే పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా కొత్త లగ్జరీ ప్రాజెక్ట్‌లతో డెవలపర్లు ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారని పేర్కొంది. (రూ.100 కోట్ల అపార్ట్మెంట్ డీల్: షాక్ అవుతున్న మార్కెట్ నిపుణులు ) Q3 2018లో, ఇక్కడ కేవలం 210 లగ్జరీ యూనిట్లు లాంచ్ అయాయ్యి. 2023 క్యూ3 నాటికి హైదరాబాద్ 14,340 లగ్జరీ యూనిట్లకు చేరింది. ఈ త్రైమాసికంలో మొత్తం కొత్త లగ్జరీ హౌసింగ్ సరఫరాలో దాదాపు 46 శాతం వాటాను కలిగి ఉంది. కోవిడ్ తర్వాత దాని అసాధారణ పనితీరు కారణంగా డెవలపర్లు లగ్జరీ గృహాల విభాగంలో బలమైన విశ్వాసంతో ఉన్నారు. పాండమిక్ తరువాత టాప్ నాచ్ సౌకర్యాలు, బిగ్ గృహాల కోసం కొనుగోలుదారుల డిమాండ్‌తో దేశంలోని టాప్ ఏడు నగరాల్లో అమ్మకాలు పెరిగాయనిఅనరాక్ గ్రూప్ రీజినల్ డైరెక్టర్ అండ్ హెడ్ (పరిశోధన), ప్రశాంత్ ఠాకూర్వ్యాఖ్యానించారు, అనరాక్ ఇటీవలి వినియోగదారుల సెంటిమెంట్ సర్వే ప్రకారం మహమ్మారికి ముందు (H1 2019) నుండి 9 శాతం మంది మాత్రమే రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన విలాసవంతమైన గృహాలను ఇష్ట పడ్డారు. అయితే, H1 2023లో ఇటీవలి సర్వేలో, ఈ సంఖ్య 16 శాతానికి పెరిగింది. హౌసింగ్ మార్కెట్లో హైదరాబాద్, ముంబై (MMR), ఢిల్లీ-NCR, పూణే, బెంగళూరు, కోల్‌కతా ,చెన్నైలతో సహా ఏడు ప్రధాన నగరాల్లో రూ. 40 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధర ఉన్న ఇళ్ల డిమాండ్ కేవలం 18 శాతం మాత్రమే కావడం గమనార్హం.అయితే హైదరాబాద్‌లో లగ్జరీ హౌసింగ్ విజృంభిస్తున్నప్పటికీ, సరసమైన గృహాల పరిస్థితి భిన్నంగా ఉందని కూడా అనరాక్ నివేదించింది. -
అపార్ట్మెంట్ విండోలో భారీ కొండచిలువ..చూస్తే హడలిపోతారు!
ఇళ్లలోకి కొడచిలువలు రావడం అనేది ఆస్ట్రేలియాలోనే ఎక్కువగా జరుగతుంది. అక్కడ గ్రామాలు, పట్టణాల్లోని అపార్టమెంట్లోకి కూడా కొండ చిలువలు వస్తాయి. ఎందుకంటే ఈ కొడచిలువలను పెంపుడు జంతువులుగా పెంచుకుంటుంటారు. దీంతో పొరపాటున జొరబడటం లేదా అటాక్ చేయడం వంటి సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటి ఘటన తొలిసారిగా భారత్‌లో చోటు చేసుకుంది. భారత్‌లో గ్రామాల్లోని ఇళ్ల మద్య కొండచిలువ కనపడటం అరుదు. అందులోనూ అపార్టమెంట్లోకి చొరబడటం అనేది అస్సలు జరగుదు. అలాంటిది భారత్‌లోనే ఓ అపార్ట్మెంట్లో ఈ అరుదైన ఘటన జరగడం అదర్నీ ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకెళ్తే.ఈ అనూహ్య ఘటన మహారాష్ట్రాలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. ఓ భవనంలోని అపార్టమెంట్ విండోలోకి భారీ కొండచిలువ చొరబడింది. పాపం అది ఆ విండోకి ఉండే గ్రిల్స్ మధ్య ఇరుక్కుపోయింది. దీంతో ఇద్దరు వ్యక్తులు రంగంలోకి దిగిన దాన్ని రక్షించే యత్నం చేశారు. ఒకరు కిటికిలోంచి దాన్ని బయటకు తీసే ప్రయత్నం చేయగా మరొకరు కిటికి బయటకు వచ్చి దాన్ని ఆ గ్రిల్ నుంచి విడిపించే యత్నం చేశారు. ఐతే చివరికి ఆ కొండచిలువ ఆప్రయత్రంలో అంత ఎత్తున్న ఉన్న అపార్ట్మెంట్ నుంచి కిందకు పడిపోయింది. అయితే ఆ తర్వాత ఆ కొండచిలువ అక్కడ నుంచి నెమ్మదిగా వెళ్లిపోయింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అయితే నెటిజన్లు మాత్రం ఆ పామును రక్షించే యత్నం చేసిన ఆ వ్యక్తులను ప్రశంసిస్తున్నారు కానీ ఆ భారీ కొండచిలువ అంత ఎత్తు నుంచి పడిపోయింది కాబట్టి ఎన్నో రోజులు అది బతకదు అంటూ ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరూ అస్సలు అది ఎలా అపార్ట్మెంట్లోకి చొరబడిందని ప్రశ్నిస్తూ మరొకరు కామెంట్లు చేస్తూ ట్వీట్లు పెట్టారు. A huge snake was spotted at a Thane Building, it was rescued by two brave persons, rescue video. 👇. #thane #mumbai pic.twitter.com/j2ZWrs9mR9 — Sneha (@QueenofThane) September 25, 2023 (చదవండి: కొత్తగా.. ఎనిమిదో ఖండం! 375 ఏళ్లుగా !..వెలుగులోకి షాకింగ్ విషయాలు) -
10 అడుగుల పైథాన్‌తో పోరు..!
ముంబయి: మహారాష్ట్రాలోని థాణె జిల్లాలో భయానక ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 10 అడుగుల పైథాన్ ఓ ఇంటి బెడ్రూంలోకి ప్రవేశించే ప్రయత్నం చేసింది. అపార్ట్మెంట్ బిల్డింగ్‌లో కిటికి గుండా ఏకంగా బెడ్రూంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇద్దరు యువకులు పైథాన్‌తో ఫైట్ చేసి చివరికి దానిని కిటికీ నుంచి కిందికి పడేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇంత పెద్ద పైథాన్ ఏకంగా బెడ్రూంలోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. Imagine a massive python hanging from your bedroom window. It happened in Mumbai's Thane.#Thane #Python pic.twitter.com/dbL1IIbasZ — IndiaToday (@IndiaToday) September 26, 2023 ఇదీ చదవండి: బుల్లెట్ నడిపిన సీఎం ఖట్టర్ -
మొక్కలు పెంచాలనుకుంటే చాలు.. అపార్ట్మెంట్లో కూడా పెంచొచ్చు!
పట్టణాల్లోని చిన్న అపార్ట్‌మెంట్‌వాసుల నోటి నుంచి తరచుగా వినిపించే మాట ‘మొక్కలు అంటే మాకు చాలా ఇష్టం. కాని స్థలం ఎక్కడిది?’ ‘స్థలం పెద్దగా అక్కర్లేదు. పెంచాలనే సంకల్పం ఉంటే చాలు’ అంటుంది బిహార్‌కు చెందిన కమల్‌సింగ్. ఉద్యోగ నిమిత్తం బెంగళూరులో ఉంటున్న కమల్‌సింగ్ తన చిన్న అపార్ట్మెంట్ బాల్కనీలో రకరకాల మొక్కలు పెంచుతుంది. ‘వంటగది వ్యర్థాలతో కంపోస్ట్‌ను ఎలా తయారుచేయాలి?’ అనే విషయం నుంచి ఏ మొక్కలను ఎలా పెంచాలి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వరకు... ఎన్నో విషయాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పేజీ ‘అర్బన్ హోమ్ వైబ్స్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘స్టార్ట్ వేర్ యూ ఆర్ విత్ వాటెవర్ యూ హ్యావ్’ అంటున్న కమల్‌సింగ్ స్ఫూర్తితో ఎంతో మంది పట్టణ వాసులు తమ బాల్కనీలో మొక్కల పెంపకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ‘మేము సైతం’ అంటున్నారు. (చదవండి: వెరైటీగా బనానా ఆమ్లెట్ ట్రై చేయండిలా!) -
అపార్ట్మెంట్లో కొండచిలువ కలకలం..!
హైదరాబాద్: ఓ అపార్ట్మెంట్లోకి కొండ చిలువ ప్రవేశించడంతో స్థానికంగా కలకలం రేపింది. నిజాంపేట్ కార్పొరేషన్ ప్రగతినగర్‌లోని సాయి ఎలైట్ అపార్ట్‌లోని పార్కింగ్ ప్రదేశంలోకి కొండ చిలువ ప్రవేశించడంతో అపార్ట్మెంట్ వాసులు భయబ్రాంతులకు లోనయ్యారు. ఫ్రెండ్స్ స్నేక్ సొసైటీ సభ్యుడు అంకిత్ శర్మకు ఫోన్ చేయడంతో వెంటనే అపార్ట్మెంట్ వద్దకు చేరుకుని చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నాడు. తన వెంట తెచ్చిన బ్యాగ్‌లో కొండ చిలువను తీసుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో వదిలి పెట్టాడు. ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరద నీటితో కొండ చిలువ కొట్టుకుని వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. -
ప్రకృతి ప్రేమకు నిదర్శనం
నగర జీవనంలో ప్రతిదీ యూజ్ అండ్ త్రోగా మారుతోంది.‘ఈ కాంక్రీట్ వనంలో ప్రకృతి గురించి అర్థం చేసుకుంటున్నదెవరు’.అని ప్రశ్నిస్తారు. హైదరాబాద్ నల్లగండ్లలో ఉంటున్న నిదర్శన.అపార్ట్మెంట్ సంస్కృతిలో వ్యర్థాలను ఎలా వేరు చేయాలి,ప్లాస్టిక్ వాడకాన్ని ఎలా తగ్గించాలనే విషయాల మీద నెలకు ఒకసారి నాలుగేళ్లుగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తోంది. కార్పోరేట్ కంపెనీలో మార్కెటింగ్ కమ్యూనికేషన్స్‌లో మేనేజర్‌గా వర్క్ చేసిన నిదర్శన సస్టెయినబుల్ లివింగ్ పట్ల ఆసక్తి పెరిగి, పర్యావరణ హిత వస్తువుల వాడకాన్ని ప్రోత్సహిస్తూ,హస్తకళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే పని ఏ కొంచెమైనా ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతోంది. ‘‘ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా అది ప్రకృతికి మేలు చేసేదై ఉండాలి. ఈ ఆలోచన నాకు నాలుగేళ్ల క్రితం కలిగింది. దీనికి కారణం మన దగ్గర చేస్తున్న పెళ్లిళ్లు, పార్టీలు. ఫంక్షన్లకు వెళ్లినప్పుడు అక్కడ యూజ్ అండ్ త్రో ఏరియా చూస్తే మనసు వికలమయ్యేది. దీంతో చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి, సస్టైనబుల్ లివింగ్ మార్గం పట్టాను. ఈవెంట్స్‌కి స్టీల్ గిన్నెల రెంట్ మాటీ పేరతో ఫౌండేషన్ ఏర్పాటు చేశాను. నాలాగే ఆలోచించే మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఫంక్షన్లకు స్టీల్ పాత్రలు నామమాత్రపు రెంట్‌తో ఇచ్చే బ్యాంక్ ఏర్పాటు చేశాను. ఆ తర్వాత ఇదే థీమ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాను. ఎవరింట్లో పెళ్లి, పండగ, పుట్టిన రోజులు జరిగినా మా దగ్గర నుంచి స్టీల్ పాత్రలు రెంట్‌కు తీసుకోవచ్చు. అలాగే, అపార్ట్మెంట్స్ వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తాను. ఈ వర్క్‌షాప్స్‌లో కిచెన్ గార్డెనింగ్, కంప్రోస్ట్, ఎకో ఫ్రెండ్లీ గిఫ్ట్ థీమ్స్.. వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. హస్తకళాకారుల నుంచి.. నెలకు ఒకసారి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలను చూసుకొని పర్యావరణ స్పృహ కలిగించడానికి ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేయడం మొదలుపెట్టాను. ఇందుకు ఇతర స్వచ్ఛంద సంస్థలు, గేటెడ్ కమ్యూనిటీ సభ్యులు, ఐటీ ఉద్యోగులు తమ మద్దతును తెలియజేస్తున్నారు. నా టీమ్‌లో స్వచ్ఛందంగా పనిచేసే పది మంది బృందంగా ఉన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలలోని నగరాలలోనూ ఈ ఎకో ఫెస్ట్ ఏర్పాటు చేస్తాను. ఇందులో హస్తకళాకారులు తయారుచేసిన రకరకాల కళాకృతులు, జ్యువెలరీ బాక్సులు, ఇత్తిడి, రాగి వస్తువులు, జ్యూట్ కాటన్ పర్సులు, ఇంటీరియర్ వస్తువులు .. వంటివన్నీ ఉంటాయి. హస్తకళాకారులే నేరుగా వచ్చి తమ వస్తువులు అమ్ముకోవచ్చు. ఒక్కొక్క కళాకారుడి నుంచి సేకరించిన వస్తువులను కూడా ప్రదర్శనలో ఉంచుతాను. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆ కళాకారులకు అందజేస్తుంటాను. గ్రామీణ కళాకారులకు తమ హస్తకళలను ఎక్కడ అమ్మితే తగినంత ఆదాయం వస్తుందనే విషయంలో అంతగా అవగాహన ఉండదు. అందుకే, ఈ ఏర్పాట్లు చేస్తుంటాను. దీని ద్వారా కళకు, కొనుగోలుదారుకు ఇద్దరికీ తగిన న్యాయం చేయగలుగుతున్నాను అనే సంతృప్తి లభిస్తుంది. ‘ది బాంటిక్ కంపెనీ( పేరుతో ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా హస్తకళాకృతులను అందుబాటులో ఉంచుతున్నాను. ఎకో ఫ్రెండ్లీ గిఫ్టింగ్ కార్పోరేట్ కంపెనీలలో పండగల సందర్భాలలో ఇచ్చే కానుకలకు కన్‌స్టలెన్సీ వర్క్ కూడా చేస్తాను. ఇక్కడ కూడా ఎకో థీమ్‌తో కస్టమైజ్డ్ గిఫ్ట్ బాక్స్‌లు తయారుచేసి అందిస్తుంటాను. ఇక ఇళ్లలో జిరగే చిన్న చిన్న వేడుకలకూ ఎలాంటి కానుకలు కావాలో తెలుసుకొని, వాటిని తయారుచేయించి సప్లయ్ చేయిస్తుంటాను. కార్పోరేట్ కంపెనీలలో వర్క్‌షాప్స్ కార్పోరేట్ కంపెనీలలో సస్టెయినబులిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేస్తాను. అక్కడ ఉద్యోగులు పర్యావరణ హిత వస్తువులతో తమ జీవన విధానాన్ని ఎలా అందంగా తీర్చిదిద్దుకోవచ్చో, ఆరోగ్యకరంగా మార్చుకోవచ్చో కార్యక్రమాల ద్వారా తెలియజేస్తుంటాను. అంతేకాదు, కిచెన్ వ్యర్థాలను ఎలా వేరు చేయాలి, కిచెన్ గార్డెన్‌ను తమకు తాముగా ఎలా డెవలప్ చేసుకోవచ్చు అనే విషయాల మీద వర్క్‌షాప్స్ ఉంటాయి. అంతేకాదు, రోజువారీ జీవన విధానంలో ప్రతీది పర్యావరణ హితంగా మార్చుకుంటే కలిగే లాభాలనే వివరిస్తుంటాను. ఇదేమంత కష్టమైన పని కాదని వారే స్వయంగా తెలుసుకోవడం, తాము ఆచరిస్తున్న పనులు గురించి ఆనందంగా తెలియజేస్తుంటారు. మంచి జీవనశైలిని నలుగురికి పంచడంలోనే కాదు ప్రకృతికి మేలు చేస్తున్నాన్న సంతృప్తి కలుగుతుంది. అదే విధంగా గ్రామీణ కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నానన్న ఆనందమూ కలుగుతుంది’ అని తెలియజేస్తారు నిదర్శన. – నిర్మలారెడ్డి ఫొటోలు: మోహనాచారి -
Hyderabad: పక్కకు ఒరిగిన నిర్మాణంలో ఉన్న భవనం
బహుదూర్‌పురా: హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనం పక్కకు ఒరిగిపోయింది. నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో ఆ బహుళ అంతస్తుల భవనం ఓ వైపునకు ఒరిగింది. దాంతో భయాందోళన చెందిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దాంతో సంఘటనా స్థలికి చేరుకుని భవనాన్ని పరిశీలించారు అధికారులు. ఆ భవనం యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. భవనం పక్కకు ఒరిగిపోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో చుట్టుపక్కల వారిని ఖాళీ చేయించే ప్రయత్నాలను ముమ్మరం చేశారు అధికారులు. -
సీసీటీవీ కెమెరాలతో మెరుగైన భద్రత
సాక్షి, అమరావతి : నేరాల నియంత్రణ, మెరుగైన భద్రతకు సీసీటీవీ కెమెరాలు అత్యావశ్యకమని దేశంలోని పట్టణ ప్రాంత ప్రజలు గాఢంగా విశ్వసిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో వీటి ఏర్పాటుకు మొగ్గుచూపుతున్నారు. కాలనీలు, అపార్ట్మెంట్లు, ఇతర నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవడం ఐదేళ్లుగా భారీగా పెరుగుతోందని ఫోర్బ్స్ సంస్థ ‘పోలీసింగ్ ఇన్ ఇండియా–2023’ నివేదిక వెల్లడించింది. ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానం విస్తతితో భద్రత, వ్యక్తిగత ప్రైవసీ అనే రెండింటిలో ఎటువైపు మొగ్గుచూపాలి అనే అంశంపై ఐదేళ్ల క్రితం వరకు దేశ ప్రజల్లో ఓ సందిగ్థత ఉండేదని ఆ నివేదిక పేర్కొంది. కాలనీలు, నివాస ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేయడం తమ వ్యక్తిగత గోప్యతకు భంగకరమని భావించేవారు. బహిరంగ ప్రదేశాల్లో పోలీసు, మున్సిపల్ శాఖలు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేస్తున్నారు. కాబట్టి తమ నివాస ప్రాంతాల్లో ఇవి వద్దనే భావన ఉండేది. కానీ, నగర, పట్టణ ప్రాంత ప్రజల్లో ఆలోచనా దృక్పథం ఐదేళ్లలో మారిందని ఆ నివేదిక వెల్లడించింది. ప్రజలు తమ నివాసాలకు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటుచేసుకుంటున్నారని తెలిపింది. నివేదికలోని ప్రధాన అంశాలు ఇవీ.. దేశంలో నగరాలు, ప్రధాన పట్టణ ప్రాంతాల్లో 51 శాతం మంది ప్రజలు తమ నివాస ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేసుకున్నారు. నగరాల్లో 61 శాతం, ప్రధాన పట్టణాల్లో 46 శాతం ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి. నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో కర్ణాటక మొదటిస్థానంలో ఉండగా రెండు, మూడు స్థానాల్లో హరియాణా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కర్ణాటకలో 68శాతం, హరియాణాలో 67శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 33శాతం ప్రాంతాల్లో వీటిని ఏర్పాటుచేసుకున్నారు. ప్రభుత్వం అత్యధికంగా ఈ కెమెరాలు ఏర్పాటుచేసిన వాటిలో ఢిల్లీ మొదటిస్థానంలో ఉంది. ఇక్కడ 54 శాతం ప్రాంతాల్లో ప్రభుత్వమే వీటిని ఏర్పాటుచేసింది. అలాగే, అత్యధిక ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 73 శాతం, ఎగువ మధ్యతరగతి వర్గాల ప్రాంతాల్లో 63 శాతం, మధ్య తరగతి వర్గాలుండే చోట 45 శాతం, అంతకంటే తక్కువ ఆదాయ వర్గాల ప్రాంతాల్లో 28శాతం వరకు ఈ కెమెరాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలతో ‘ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీ (ఎఫ్‌ఆర్‌టీ) పోలీసులకు అందుబాటులోకి వస్తోంది. దాంతో నేరాల నియంత్రణ, కేసుల దర్యాప్తు మరింత సమర్థంగా నిర్వర్తించేందుకు ఆ శాఖకు ఇది ఉపయోగపడుతోంది. ఈ కెమెరాలు లేని ప్రాంతాల్లో కంటే ఉన్న ప్రాంతాల్లో నేరాలు 30 శాతం తగ్గినట్లు.. కేసుల ఛేదన 28 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. -
లిఫ్ట్‌లో ఇరుక్కుంటున్నారు.. సర్వేలో ఆసక్తికర విషయాలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల కాలంలో బహుళ అంతస్తుల భవనాలు పెరిగాయి. గేటెడ్ కమ్యూనిటీల్లో 20 ఫోర్లకు పైనే నిర్మిస్తున్నారు. అపార్ట్మెంట్లలోనే కాకుండా ఇల్లు, కార్యాలయం, షాపింగ్ మాల్స్, ఫ్యాక్టరీలు ఇలా ఎక్కడయినా.. మెట్లపైనుంచి నడిచివెళ్లే వారికంటే.. లిఫ్ట్ ఎక్కడుందా అని వెతికేవారే ఎక్కువ. బహుళ అంతస్తుల భవనాల్లో ఇళ్లలో ఉండేవారు, కార్యాలయాల్లో పనిచేసేవారు వయసుతో సంబంధం లేకుండా దాదాపు ప్రతినిత్యం లిఫ్ట్‌లు వాడుతూనే ఉన్నారు. అయితే ఇటీవల లిఫ్ట్‌లు పనిచేయక అందులో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. ఆగస్టు 3న ఢిల్లీలోని నోయిడా సెక్టార్ 137లో జరిగిన ఓ ఘటనలో 70 ఏళ్ల వృద్ధురాలు 45 నిమిషాలపాటు లిఫ్ట్‌లో ఇరుక్కుని తీవ్ర ఆందోళనకు గురయ్యారు. చివరకు ప్రాణాలు కోల్పోయారు. లిఫ్ట్ వాడకం అన్నది నిత్య జీవితంలో భాగమైంది. అయితే లిఫ్ట్ వాడకం, దాని నిర్వహణ తదితర అంశాలపై లోకల్ సర్కిల్స్ సంస్థ దేశవ్యాప్తంగా 329 జిల్లాల్లో 42 వేల మందిని సర్వే చేసింది. ఇందులో 61 శాతం మంది పురుషులు, 39 శాతం మంది మహిళలు పాల్గొని వారి అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సర్వేలో పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. గత మూడేళ్లలో తమ గృహ సముదాయంలో లేదా కార్యాలయంలో తాము కానీ, తమ కుటుంబ సభ్యులు కానీ లిఫ్ట్‌లో ఇరుక్కుని ఇబ్బందిపడ్డారని 58 శాతం మంది అభిప్రాయం వెల్లడించారు. లిఫ్ట్‌ల నిర్వహణపై ప్రభుత్వం కచ్చితమైన నిబంధనలు నిర్ణయించాలా? కచ్చితమైన నిబంధనలు రూపొందించాలి 76 శాతం మంది అలా చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయి... అమలు కూడా సాధ్యం కాదు 24 శాతం మంది -
రూ.1 కోటికి మించి ధర ఉన్న ఫ్లాట్లకు భలే గిరాకీ..ఎక్కడంటే
న్యూఢిల్లీ: ఖరీదైన అపార్ట్మెంట్ల అమ్మకాలు దేశంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో జోరుగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో రూ.కోటికి పైన విలువ చేసే ఫ్లాట్ అమ్మకాలు 50,132 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది తొలి ఆరు నెలల కాలంలో అమ్మకాలు 33,477 యూనిట్లతో పోలిస్తే 50 శాతం పెరిగినట్లు పీటీఐ నివేదించింది. అంతేకాదు 15 ఏళ్లలో తొలిసారి విలాసవంత ప్రాపర్టీలకు మంచి డిమాండ్ కనిపిస్తున్నట్టు జెల్ఎల్ ఇండియా ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. విల్లా, ప్లాట్ల అమ్మకాలను ఇందులో జేఎల్ఎల్ ఇండియా కలపలేదు. కేవలం అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల అమ్మకాలనే పరిగణనలోకి తీసుకుంది. ►ఏడు పట్టణాల్లో మొత్తం మీద అన్ని రకాల ఫ్లాట్ల అమ్మకాలు 2023 జనవరి–జూన్ కాలంలో 21 శాతం పెరిగి 1,26,500 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 1,04,926 యూనిట్లుగా ఉన్నాయి. జనవరి - జూన్ అమ్మకాలు 15 ఏళ్లలో అత్యధికంగా ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో జరిగినట్లు స్పష్టం చేసింది. ►రూ.50 లక్షల ధరలోపు ఉన్న ఫ్లాట్ల అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చినప్పుడు, 2 శాతం క్షీణించి 24,482 యూనిట్లుగా ఉన్నాయి. మొత్తం అమ్మకాల్లో అఫర్డబుల్ విభాగం (అందుబాటు ధరల) ఫ్లాట్ల వాటా 24 శాతం నుంచి 17 శాతానికి పరిమితమైంది. ►రూ.50–75 లక్షల విభాగంలో అమ్మకాలు 4 శాతం పెరిగి 30,125 యూనిట్లుగా ఉన్నాయి. మిడ్ సెగ్మెంట్ అమ్మకాల వాటా మొత్తం అమ్మకాల్లో 28 శాతం నుంచి 24 శాతానికి తగ్గింది. ►రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు విలువ కలిగిన ఫ్లాట్ల అమ్మకాలు 25 శాతం వృద్ధితో 21,848 యూనిట్లకు చేరాయి. ఈ విభాగం వాటా 17 శాతంగా ఉంది. ►రూ.1–1.5 కోట్ల ధరల విభాగంలో అమ్మకాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 67 శాతం పెరిగి 24,121 యూనిట్లుగా ఉన్నాయి. ►ఇక రూ.1.5 పైన ధర కలిగిన ఫ్లాట్లు 26,011 యూనిట్లు అమ్ముడుపోయాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 18,993 యూనిట్లతో పోలిస్తే 21 శాతం పెరిగాయి. ద్వితీయ భాగంలోనూ బలమైన అమ్మకాలు ప్రస్తుత ఏడాది ద్వితీయ ఆరు నెలల కాలంలో పండుగలు ఉండడంతో బలమైన అమ్మకాలు నమోదు అవుతాయని భావిస్తున్నట్టు జేఎల్ఎల్ ఇండియా ఎండీ శివకృష్ణన్ తెలిపారు. ‘‘ప్రభుత్వం వైపు నుంచి బలమైన ప్రోత్సాహం, వడ్డీ రేట్లను గత రెండు సమీక్షల నుంచి ఆర్బీఐ యథాతథంగా కొనసాగించడం, ద్రవ్యోల్బణం మోస్తరు స్థాయికి దిగిరావడం ఇళ్ల మార్కెట్ పుంజుకునేందుకు మద్దతుగా నిలిచాయి. మధ్య కాలానికి ఇళ్లకు డిమాండ్ వృద్ధి బాటలోనే ఉంటుంది’’అని శివకృష్ణన్ తెలిపారు. చదవండి👉 అతి తక్కువ ధరకే ప్రభుత్వ డబుల్ బెడ్రూం ఫ్లాట్లు -
HYD: కూకట్‌పల్లిలో ఒక్కసారిగా కుంగిన భూమి..
సాక్షి, హైదరాబాద్: కూకట్‌పల్లిలోని గౌతమ్ నగర్ కాలనీలో ఓ నిర్మాణ సంస్థ పనులు చేస్తుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. దీనితో స్థానికంగా ఉండే కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సరైన అనుమతులు భారీ ఎత్తున నిర్మాణం చేపడుతున్నారు. దీనికి సంబంధించి సెల్లార్ కోసం తవ్వడంతో పక్కనే ఉన్న రోడ్డు సైతం కుంగిపోయింది. కనీసం కాలనీ వాసులు బయటికి కూడా వెళ్లలేని పరిస్థితి ఉండటంతో ఆందోళన చేపట్టారు. అర్ధరాత్రి సమయంలో అక్రమంగా బ్లాస్టింగ్‌కి పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులకు కార్పొరేటర్ కి సైతం ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డింగ్ కట్టేటప్పుడు అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేస్తే కూలగొట్టే జీహెచ్ఎంసీ అధికారులకు ఇంత పెద్ద నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంటే కనిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వారిపైన చర్యలు చేపట్టి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. చదవండి: ఎమ్మెల్యే రాజయ్య, సర్పంచ్ నవ్య వివాదంలో కీలక పరిణామం -
ఆ నలభై నిమిషాల్లో ఏం జరిగింది..?
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలో శనివారం రాత్రి వెలుగులోకి వచ్చిన యువతి అనుమానాస్పద మృతి మిస్టరీ వీడలేదు. పట్టణంలోని సుందర్‌నర్‌కు చెందిన దండగల వెంకన్న అలివేలు దంపతుల కుమార్తె దండగల శోభ(18) డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రిసెప్సనిస్టుగా పనిచేసిన శోభ పరీక్షలు ఉండటంతో ఇంటి వద్దనే ఉండి చదువుకుంటోంది. ఈ క్రమంలో ఏమైందో ఏమో గాని శనివారం రాత్రి 7:40 గంటల సమయంలో బైపాస్‌రోడ్డు వెంట ఉన్న వైష్ణవి అపార్ట్మెంట్ వద్దకు ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లింది. ఈ దృశ్యం బైపాస్‌రోడ్డు వెంట ఉన్న ఖలీల్ దాబా ఎదురుగా ఉన్న సీసీ కెమరాల్లో రికార్డు కాగా ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వైష్ణవి అపార్ట్మెంట్లోని రెండవ అంతస్తు వరకు శోభ చేరుకున్నట్లుగా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. కూపీ లాగుతున్న పోలీసులు కాగా, వైష్ణవి అపార్ట్మెంట్లోకి శనివారం రాత్రి 7.40 గంటలకు చేరుకున్న శోభ మరో 40నిమిషాల అనంతరం రెండో అంతస్తు నుంచి కిందపడింది. అయితే, అపార్ట్‌మెంట్‌కు శోభ ఎందుకు వెళ్లింది? ఎవరితో మాట్లాడింది.? 40నిమిషాల్లో ఏం జరిగింది. అనే అంశాలపై పోలీసులు కూపీ లాగుతున్నారు. కాగా, శోభ తన సెల్‌ఫోన్ ఇంట్లోనే వదిలి వెళ్లింది. ఘటన తర్వాత పోలీసులు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఐదు నెలల కాల్‌డేటా సేకరించే పనిలో ఉన్నారు. కాగా, కూతురు మృతిపై అనుమానాలున్నాయని శోభ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అపార్ట్మెంట్లో తమకు తెలిసిన వారు ఎవరూ లేరని పేర్కొన్నారు. కాగా, ఆది వారం మధ్యాహ్నం శోభ మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించగా అంత్యక్రియలు పూర్తిచేశారు. శోభ మృతి విషయం తెలుసుకున్న వారి బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్ ఎస్ఐ శ్రీనునాయక్ తెలిపారు. -
ప్రకృతి ఒడి.. ప్రశాంత లోగిలి!
కరోనా మహమ్మారి జీవనాన్ని కొత్త దారిలో తీసుకెళ్తోంది. పట్టణాల్లో చిన్న పని దొరికితే చాలు.. అపార్ట్మెంట్ ఎన్నో అంతస్తు అయినా పరవాలేదు.. సర్దుకుపోదాం అనే ధోరణి ఇప్పుడు తగ్గుతోంది. కాస్తంత రెంటు ఎక్కువైనా.. వ్యక్తిగత ఇల్లు మేలు అనే భావన ఇప్పుడు అధికమవుతోంది. వాతావరణంలో మార్పుల కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం.. కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నేపథ్యంలో పట్టణానికి కాస్త దూరమైనా ప్రశాంతమైన వాతావరణంలో నివసించేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మొక్కలు నాటేందుకు ఇష్టపడని వారు కూడా.. ఇప్పుడు ప్రకృతితో మమేకమై జీవించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. – సాక్షి, కర్నూలు డెస్క్ నంద్యాల పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో ఓ వెంచర్ రూపుదిద్దుకుంటోంది. మహానంది మండలం బుక్కాపురం వద్ద 25 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ వెంచర్లో 12 విల్లాలను ఒక్కొక్కటి 25 సెంట్ల స్థలంలో నిర్మించనున్నారు. మిగిలిన స్థలం అంతా పచ్చదనానికి కేటాయిస్తున్నారు. అంటే.. ప్రశాంత జీవనానికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో ఈ వెంచర్‌ను చూస్తే అర్థమవుతోంది. జిల్లాలోని ప్రధాన పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. పిల్లల చదువులు, ఉద్యోగం, ఇతరత్రా అవసరాల దృష్ట్యా చాలా మంది పల్లెల నుంచి పట్టణాలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శివారు ప్రాంతాలు పట్టణాల్లో కలిసిపోతున్నాయి. జనాభా పెరుగుతున్న కొద్దీ ఎక్కడా ఖాళీ స్థలం కనిపించని పరిస్థితి. అంతో ఇంతో స్థలం ఉందంటే అపార్ట్మెంట్, లేక షాపింగ్ కాంప్లెక్స్ కడదామనే ఆలోచన వస్తోంది. ఈ కారణంగా కనుచూపు మేరలో కాంక్రీటు వనాలే కనిపిస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు ఏడాదికేడాది విపరీతంగా పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి . అపార్ట్మెంట్ సంస్కృతి ఇటీవల కాలంలో అధికమైంది. ఉపాధి, ఉద్యోగంలో భాగంగా పట్టణాల్లో ఉండాల్సి రావడంతో ఎక్కడికక్కడ అపార్ల్మెంట్లు పుట్టుకొచ్చాయి. ఐదు అంతస్తులతో, వందలాది నివాసాలతో కూడిన ఈ కాంక్రీటు వనాలు మనుషులను దగ్గర చేస్తున్నా, మనసులను దూరంగా ఉంచుతున్నాయి. పక్కపక్కనే ఉంటున్నా ఎవరికి వారుగా బతికేస్తున్నారు. ఇక ఇటీవల కరోనా సృష్టించిన విలయం నేపథ్యంలో ఇలా ఇరుకిరుకు ప్లాట్లలో కాకుండా ఊరికి దూరంగా విశాలమైన వ్యక్తిగత ఇళ్లలో ఉండేందుకు ఆసక్తి చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. పచ్చని చెట్లు కనుమరుగు పట్టణాల పరిధి పెరుగుతున్న కొద్దీ చుట్టుపక్క గ్రామాలు అందులో విలీనం అవుతున్నాయి. ఈ కారణంగా అభివృద్ధి విస్తరిస్తుండటంతో గ్రామీణ వాతావరణం కనుమరుగవుతోంది. శివారు కాలనీల్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు పుట్టుకొస్తుండగా.. ఆ ప్రాంతంలోని చెట్లు తొలగించక తప్పని పరిస్థితి. కొంత స్థలం ఉందంటే చాలు.. రెండు ఇల్లు కట్టుకొని, ఒకటి బాడుగకు ఇచ్చుకోవడమో.. లేదంటే అపార్ట్మెంట్ కడితే జీవనానికి కాస్త ఊరట కలిగిస్తుందనే ఆశ పచ్చని చెట్లకు శాపమవుతోంది. పల్లెకు పోదాం.. పట్టణాల్లో వాతావరణం రోజురోజుకూ కాలుష్యంతో నిండుకుంటోంది. ఇంటి నుంచి బయటకు వచ్చి ఎక్కడన్నా సేదతీరుదామంటే చెట్టు నీడను వెతుక్కోవాల్సిందే. సెంటు స్థలం ఉందంటే చాలు రోడ్డు పక్కనైతే దుకాణం కడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో అయితే ఇంటి ఆలోచన చేస్తున్నారు. ఈ కారణంగా మధ్య తరగతి ప్రజలు తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని నగరానికి దూరంగా, పల్లెలకు సమీపంలోని వెంచర్లలో ప్లాట్లు కొంటున్నారు. పదవీ విరమణ వయస్సు తర్వాత పల్లె వాతావరణంలో సేద తీరేందుకు ఇష్టపడుతున్నారు. అభిరుచికి అనుగుణంగా వెంచర్లు కొనుగోలుదారుల అభిరుచికి అనుగుణంగా రియల్ ఎస్టేట్ కూడా తన స్వరూపాన్ని మార్చుకుంటోంది. ఇప్పటి వరకు 3 నుంచి 5 సెంట్ల స్థలాలతో వెంచర్లు ఉండగా.. ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 25 సెంట్ల స్థలాలతో వెంచర్లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారులు, అధికారులు, వైద్యులు ఈవిధమైన వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేస్తున్నారు. రియల్టర్లు ఇలాంటి వాళ్లను ఎంపిక చేసుకొని అందుకు అనుగుణంగా వెంచర్లలో సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇలాంటి వెంచర్లలో ప్లాట్లు కూడా పరిమితంగా ఉంటుండటం విశేషం. ఇంటిల్లిపాది ఆహ్లాదంగా గడుపుతాం పట్టణాల్లో వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. అందుకే ఎమ్మిగనూరుకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మా సొంత పొలంలోనే ఫాంహౌస్ కట్టుకున్నాం. ఉన్న ఇద్దరు కుమారులు మెట్రో నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయినప్పటికీ అక్కడ ప్రశాంతత లేదని చెబుతుంటారు. చిన్నబ్బాయి హర్ష ఉద్యోగం వదిలేసి ఇక్కడికొచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. యాంత్రిక జీవనం నుంచి బయటపడేందుకు, ఇంటిల్లి పాది సంతోషంగా గడిపేందుకు ఈ ప్రాంతం మాకు ఎంతో అనువుగా ఉంది. ప్రకృతి ఒడిలో సేదతీరితే ఎంతో ఆరోగ్యం. – మాచాని నాగరాజు ప్రశాంతత కోసం నగరానికి దూరంగా ఇల్లు కరోనా నేర్పిన పాఠం ఎప్పటికీ మర్చిపోలేం. నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. జనాభా అధికం కావడంతో ఇరుకు ప్రాంతాల్లో సర్దుకుపోయి జీవించాల్సిన పరిస్థితి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఊరి బయట ప్రశాంత వాతావరణంలో ఇటీవల వ్యక్తిగత ఇల్లు నిర్మించుకున్నాం. గాలి, వెలుతురు బాగా వచ్చే ప్రాంతంలో నివాసం ఉంటే వ్యాధుల బారి నుంచి కొంతవరకైనా బయటపడొచ్చు. – హరగోపాల్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, కర్నూలు -
దేశంలో అత్యంత ఖరీదైన అపార్ట్మెంట్ అమ్మకం.. కొన్నది ఎవరంటే?
గగనమే హద్దుగా రియల్ ఎస్టేట్‌లో ఆకాశహర్మ్యాల కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఒకదాన్ని మించి మరోటి పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భూతల స్వర్గాన్ని తలపించే ముంబై మహానగరంలో లగ్జరీ ఫ్లాట్లను సొంతం చేసుకునేందుకు కొనుగోలు దారులు మక్కువ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అత్యంత ఖరీదైన సౌత్ ముంబై మలబార్ హిల్స్ రెసిడెన్షియల్ టవర్స్‌లోని ఫ్లాట్లను ఫ్యామీకేర్ అధినేత జేపీ తపారియా రూ.369 కోట్లకు కొనుగోలు చేశారు. మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా గ్రూప్) నుంచి సూపర్ లగర్జీ ట్రిపుల్ ఎక్స్ అపార్ట్మెంట్లోని 26, 27, 28 ఈ మూడు ఫ్లోర్లను తపారియా సొంతం చేసుకున్నారు. 1.08 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఇల్లు అరేబియా సముద్రం, హాంగింగ్ గార్డెన్స్ రెండింటినీ తాకుతుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ట్రిపుల్ ఎక్స్ ఏరియా 27,160స్కైర్ ఫీట్లతో ఉండగా.. ఒక్కో స్కైర్ ఫీట్‌ను రూ1.36 లక్షలకు కొనుగోలు చేశారు. ఇక స్టాంప్ డ్యూటీ కింద తపారియా కుటుంబం రూ.19.07 కోట్లు చెల్లించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. నీరజ్ బజాజ్ సైతం బజాజ్ ఆటో ఛైర్మన్ నీరజ్ బజాజ్, మలబార్ హిల్ ప్రాంతంలో మూడంతస్తుల (ట్రిప్లెక్స్) అపార్ట్‌మెంట్‌ని రూ.252.5 కోట్లతో కొనుగోలు చేశారు. సముద్రపు దిక్కుగా 18,008 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని మ్యాక్రోటెక్ డెవలపర్స్ (లోధా గ్రూప్) నుంచి సొంతం చేసుకున్నారు. 31 అంతస్తులుగా నిర్మిస్తున్న లోధా మలబార్ ప్యాలెసెస్‌లో 29, 30, 31 అంతస్తుల్లో నీరజ్ బజాజ్ బుక్ చేసుకున్న ఈ ట్రిప్లెక్స్‌కు 8 కార్ల పార్కింగ్ సదుపాయం ఉంది. ఈ ఇంటికి స్టాంప్ డ్యూటీగానే రూ.15.15 కోట్లు చెల్లించినట్లు సమాచారం. -
భర్త క్రూరత్వం! భార్య అనారోగ్యంతో ఉందని..
యశవంతపుర: అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన భార్యను భర్త అతి క్రూరంగా చంపిన ఘటన సోమవారం బెంగళూరు తలఘట్టపుర పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు...శివమ్మ (50), శంకరప్ప భార్యభర్తలు. శంకరప్ప తుహళ్లి రోడ్డు సమీపంలో నిర్మాణంలో ఉన్న అపార్టుమెంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఇదిలా ఉంటే రెండేళ్ల నుంచి శివమ్మ పక్షవాతంతో మంచానికే పరిమితమైంది. వీరికి ఒక కొడుకు, కుమార్తె ఉన్నాడు. శివమ్మను ఎలాగైన అడ్డు తొలగించుకోవాలని శంకరప్ప పథకం వేశాడు. పిల్లలు పనికి వెళ్లిన సమయంలో మధ్యాహ్నం సెల్లార్‌లోని నీటి ట్యాంకులోకి ఆమెను తీసుకువచ్చి పడేశాడు. దీంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన కొడుకు, కుమార్తె తల్లి కనిపించకపోవడంతో తండ్రిని నిలదీశారు. తనకు తెలియదని శంకరప్ప చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. కొడుకు అనుమానంతో సెల్లార్‌లోని నీటి ట్యాంకులో చూడగా శివమ్మ శవమై కనిపించింది. తలఘట్టపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. (చదవండి: కొడుకు హత్యకు తండ్రి సుపారీ) -
Hyderabad: ఫ్లాట్ నుంచి 'ఇంటి' వైపు!.. ఆ గృహాలకు భారీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అపార్ట్మెంట్ల కొనుగోళ్లు భారీగా తగ్గిపోతున్నాయి. అదే సమయంలో వ్యక్తిగత (ఇండివిడ్యువల్) గృహాలకు మాత్రం డిమాండ్ పెరిగింది. కరోనా అనంతర పరిణామాలు, ఆర్థిక పరిస్థితులే దీనికి కారణమని రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు అంటున్నారు. అప్పట్లో అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లకు ఆసక్తిచూపిన కొనుగోలుదారులు.. ఇప్పుడు వ్యక్తిగత గృహాలకే మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా కాస్త పచ్చదనంతో, రణగొణధ్వనులకు దూరంగా, ఆహ్లాద వాతావరణం ఉండే ప్రాంతాలవైపు కొనుగోలుదారులు దృష్టిసారిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కరోనాతో మారిన అభిరుచులు కరోనా వ్యాప్తి, తదనంతర పరిణామాలతో ప్రజల జీవన విధానంలో, గృహ కొనుగోలుదారుల తీరులో మార్పులు వచ్చాయి. గతంలో ప్రధాన నగరంలో, ప్రజా రవాణా వ్యవస్థ మెరుగ్గా ఉన్న ప్రాంతాల్లోనే గృహాలను కొనుగోలు చేసేవారు. కోవిడ్ తర్వాత ఒకేచోట ఎక్కువ కుటుంబాలు నివాసం ఉండే అపార్ట్మెంట్లలో ఫ్లాట్ల కొనుగోళ్లపై ఆసక్తి తగ్గిపోయింది. దానికితోడు ఆన్లైన్ క్లాసులు, వర్క్ ఫ్రం హోమ్‌తో ఇంట్లో ప్రత్యేకంగా గది, ఓపెన్ జిమ్ వంటివి అవసరమయ్యాయి. దీనివల్ల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న వ్యక్తిగత గృహాలు, విల్లాలపై కొనుగోలుదారులు ఆసక్తి చూపుతున్నారని స్పేస్ విజన్ గ్రూప్ సీఎండీ టీవీ నరసింహారెడ్డి తెలిపారు. ఔటర్ రింగ్ రోడ్డు, కొత్త రోడ్లు, మెట్రో కనెక్టివిటీలతో శివారు ప్రాంతాల నుంచి ప్రధాన నగరానికి ప్రయాణం సులువు కావడం దీనికి మరింత ఊతమిచ్చిందని చెప్పారు. హైదరాబాద్ నలువైపులా.. గతంలో పటాన్చెరు, బెంగళూరు జాతీయ రహదారుల మార్గంలో అభివృద్ధి ఉండేది. ఆయా ప్రాంతాల్లోనే వ్యక్తి గత గృహాలకు డిమాండ్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నలువైపులా కొత్త రోడ్లు వచ్చాయి. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ లింక్ రోడ్లు ఏర్పడ్డాయి. విద్యుత్, నీరు వంటి మౌలిక వసతులు మెరుగయ్యాయి. దీంతో మెట్రో, 100 ఫీట్ల రోడ్లు ఉన్న మార్గాల్లో 10 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఇండిపెండెంట్ గృహాలకు డిమాండ్ పెరిగింది. శ్రీశైలం హైవే, ముంబై రహదారి, బీజాపూర్ రోడ్, నాగ్‌పూర్ రోడ్డు, వరంగల్ హైవేలో ఘట్ కేసర్ వరకు కూడా వ్యక్తిగత గృహాలు, విల్లాలను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా కొత్త ప్రాంతాల్లో ముందుగా ఇండిపెండెంట్ ఇళ్లు, విల్లాలు వచ్చి.. రద్దీ పెరిగాక అపార్ట్మెంట్ కల్చర్ ప్రారంభమవుతుందని యార్డ్స్ అండ్ ఫీట్స్ కన్సల్టెన్సీ ఎండీ కళిశెట్టి నాయుడు తెలిపారు. మారిన పరిస్థితులతో.. ఐటీ మినహా ఇతర రంగాల్లో కొత్త ఉద్యోగ నియామకాలు లేకపోవటం, పలు రంగాల్లో వర్క్ ఫ్రం హోమ్ విధానం అమలవుతుండటంతో హైదరాబాద్‌లో ఇళ్ల కొనుగోళ్లు తగ్గాయని రియాల్టీ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు బ్యాంకులు కూడా గతంలో తరహాలో గృహ రుణాలను మంజూరు చేయడం లేదు. గతేడాది 7.30 శాతం దాకా తగ్గిన వడ్డీ రేట్లు ప్రస్తుతం 8.25 శాతానికి పెరిగాయి. దీనికితోడు నిర్మాణ వ్యయాలూ పెరగడంతో.. ప్రజల ఇళ్ల కొనుగోలు శక్తి తగ్గిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ (మూడో త్రైమాసికం) ముగింపు నాటికి బెంగళూరు, చెన్నై వంటి దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అత్యధిక గృహాల ఇన్వెంటరీ (అమ్ముడుపోకుండా ఉన్న ఇళ్లు) ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన నగరాల్లో 7.85 లక్షల అపార్ట్మెంట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయని ప్రాప్ టైగర్ నివేదిక వెల్లడించింది. హైదరాబాద్‌లోని ఇళ్లే లక్షకుపైగా ఉన్నాయని తెలిపింది. దక్షిణాదిలో ఇన్వెంటరీ ఎక్కువగా ఉన్నది హైదరాబాద్‌లోనేనని తెలిపింది. ఇక మొత్తం దేశవ్యాప్తంగా చూస్తే.. 2,72,960 ఇళ్ల ఇన్వెంటరీతో ముంబై తొలిస్థానంలో ఉందని పేర్కొంది. -
ఏడు పట్టణాల్లో 1.61 లక్షల ఫ్లాట్స్ విక్రయాలు
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్ మధ్య 1,61,604 ఫ్లాట్స్ అమ్ముడుపోయినట్టు జేఎల్ఎల్ ఇండియా వెల్లడించింది. ఏడేళ్ల కాలంలో వార్షిక విక్రయాల రేటును ఈ ఏడాది తొమ్మిది నెలల్లోనే అధిగమించినట్టు తెలిపింది. హైదరాబాద్, పుణె, కోల్‌కతా, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై పట్టణాల గణాంకాలు జేఎల్ఎల్ తాజా నివేదికలో ఉన్నాయి. ఇందులో కేవలం ఫ్లాట్స్ విక్రయాలనే పొందుపరిచింది. 2014లో 1,65,791, 2015లో 1,57,794, 2016లో 1,46,852, 2017లో 95,774, 2018లో 1,36,082, 2019లో 1,43,302 యూనిట్లు చొప్పున ఫ్లాట్స్ విక్రయమయ్యాయి. 2020లో కరోనా కారణంగా విక్రయాలు 74,211 యూనిట్లకు పడిపోయాయి. గతేడాది 1,28,064 ఫ్లాట్స్ అమ్ముడుపోయాయి. ఈ విధంగా చూసుకుంటే 2015 తర్వాత ఈ ఏడాది తొమ్మిది నెలల్లో ఎక్కువ ఫ్లాట్స్ అమ్మడైనట్టు తెలుస్తోంది. 2 లక్షలు దాటొచ్చు.. త్రైమాసికం వారీ విక్రయాలు 2021 క్యూ3 నుంచి పుంజుకున్నాయి. ఈ ఏడాది ఇవి మరింత పెరిగాయి. ప్రతి త్రైమాసికంలోనూ 50,000 కంటే ఎక్కువ ఫ్లాట్స్ అమ్ముడయ్యాయి. ఇక పండుగుల సీజన్ కావడంతో ప్రస్తుత త్రైమాసికంలోనూ విక్రయాలు బలంగా నమోదు కావచ్చు. దీంతో వార్షిక అమ్మకాలు 2 లక్షల యూనిట్లను దాటిపోవచ్చు. ఆర్థిక కార్యకలాపాలు బలపడడంతో వినియోగదారుల్లో విశ్వాసం మెరుగుపడింది. ప్రముఖ ప్రాపర్టీ డెవలపర్లు చేపట్టిన ప్రాజెక్టులకు మంచి డిమాండ్ ఉంది’’అని జేఎల్ఎల్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. -
ఆకాశానికి భవంతులు
ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా పుట్టపర్తి పట్టణంలో భవనాలు ఆకాశానికి లేచాయి. నిబంధనలకు విరుద్ధంగా గత టీడీపీ హయాంలో పది అంతస్తుల వరకు ఆ పార్టీ నేతలు నిర్మించారు. అందులో కొన్ని పూర్తి కాగా.. ఇంకొన్ని ఇప్పటికీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అత్యంత ఎత్తైన భవనాల్లో ఏ ఒక్కదానికీ అనుమతులు లేవు. అయినా మున్సిపల్ అధికారులు, పుడా (పుట్టపర్తి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ) అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. సాక్షి, పుట్టపర్తి: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో అపార్ట్మెంట్ కల్చర్ అధికంగా ఉంది. అయితే తీసుకున్న అనుమతులుకు.. నిర్మిస్తున్న భవనాలకు ఏమాత్రం పొంతన ఉండటం లేదు. అడిగేవారు లేరని అత్యంత ఎత్తయిన భవనాలు నిర్మించేస్తున్నారు. పుట్టపర్తి మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం ‘జీ ప్లస్ టూ’ అంటే మొదటిది కాకుండా మరో రెండు అంతస్తులు నిర్మించుకోవచ్చు. అంతకంటే ఎక్కువ అంతస్తులు నిర్మించాలంటే పుడా (పుట్టపర్తి అర్బన్ డెవపల్‌మెంట్ అథారిటీ) నుంచి అనుమతులు తీసుకోవాలి. ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతులు జారీ అయిన తర్వాతనే భవనాలు నిర్మించాలి. అయితే పుట్టపర్తిలో వందకు పైగా భవనాలు 10 అంతస్తుల వరకు ఉన్నాయి. వాటికి మున్సిపాలిటీ అనుమతులు మాత్రమే ఉన్నాయి. రెండు అంతస్తులకు అనుమతులు తీసుకుని.. మూడు నాలుగు రెట్లు ఎక్కువ అంతస్తులు నిర్మించారు. అయినా ఇంతవరకు యజమానులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. నిబంధనలు ఇవే.. పుట్టపర్తి పట్టణ అభివృద్ధి సంస్థ (పుడా) నిబంధనల ప్రకారం రెండంతస్తుల కంటే ఎక్కువ ఎత్తు నిర్మించాలంటే ముందుగా అనుమతులు తీసుకోవాలి. లే అవుట్ అయితే 10 శాతం స్థలాన్ని ముందుగా పుడాకు అప్పజెప్పాలి. ఆ తర్వాతే నిర్మాణాలు మొదలుపెట్టాలి. భవనాల చుట్టూ ఎత్తు ఆధారంగా పుడా నిర్ణయించిన మేరకు స్థలం వదలాల్సి ఉంటుంది. కనీసం 7.5 సెంట్ల కంటే ఎక్కువ స్థలం అయితేనే పుడా పరిధిలోకి వస్తుంది. లేదంటే రెండు కంటే ఎక్కువ అంతస్తులు అయి ఉండాలి. అంతకంటే తక్కువ అయితే మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరి. అయితే ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కి భారీ భవనాలు వెలిశాయి. టీడీపీ హయాంలో చేపట్టిన నిర్మాణాల్లో కొన్ని... కమ్మవారిపల్లికి చెందిన నారాయణప్ప మున్సిపల్ కార్యాలయం ఎదురుగా తొమ్మిది అంతస్తుల భవనం నిర్మించారు. దీనికి ఎలాంటి అనుమతులూ తీసుకోలేదు. కమ్మవారిపల్లికి చెందిన మోర్ ఆదెప్ప గ్రౌండ్ ఏరియాలో 10 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. కొన్ని అంతస్తులు పూర్తయి నివాసం ఉంటున్నారు. పైన ఇంకొన్ని నిర్మాణంలో ఉన్నాయి. డ్వాక్రా బజారు వెనుక రోడ్డులో కొందరు ఉపాధ్యాయులు సంయుక్తంగా 8 అంతస్తుల భవనం నిర్మించారు. గోకులంలో టీచర్ వెంకటేశ్.. 9 అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. అందులో మొత్తం 80 ఫ్లాట్లు ఉన్నాయి. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. నోటీసులు ఇచ్చాం నిబంధనలను ఉల్లంఘించి భవనాలు నిర్మించిన వారికి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశాం. మరోసారి సర్వే నిర్వహించి.. ఇంకెంత మంది ఉన్నారో అందరికీ నోటీసులు ఇస్తాం. మున్సిపాలిటీ పరిధి జీ ప్లస్ టూ వరకు మాత్రమే. ఆ పై అంతస్తులకు పుడా ముందస్తు అనుమతులు తప్పనిసరి. నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా చట్టరీత్యా చర్యలకు ఆదేశిస్తాం. అనుమతులు లేకుండా ఇప్పటికే పూర్తి చేసిన భవనాలకు దాని విలువలో 20 శాతం మేర జరిమానా విధిస్తాం.. లేదంటే మూడేళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. – కేఎన్ నరేశ్ కృష్ణ, పుడా వైస్ చైర్మన్ -
మీరు అపార్ట్మెంట్లో నివసిస్తున్నారా? ఇలాంటి చీడ పురుగులతో జాగ్రత్త!
హైదరాబాద్‌లో తొలి హైరైజ్ అపార్ట్మెంటది. పదేళ్ల క్రితం నిర్మాణం పూర్తి చేసి.. నివాసిత సంఘానికి అప్పగించేసింది నిర్మాణ సంస్థ. మొదట్లో రెండుమూడేళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాతే ఒకరిద్దరు ప్రతికూల సభ్యులతో నివాసిత సంఘం సర్వనాశనమైంది. పదేళ్ల క్రితం డెవలపర్ వసూలు చేసిన రూ.3.2 కోట్ల కార్పస్ ఫండ్.. ప్రస్తుతం వడ్డీతో సహా కలిపి రూ.4–5 కోట్ల వరకుంది. కానీ, ఏం లాభం ప్రాజెక్ట్ నిర్వహణ చేసుకునే స్థితిలో అసోసియేషన్ లేదు. మధ్యలో ఓసారి కమ్యూనిటీ బాధ్యతలు చేపట్టేందుకు మహిళా సభ్యులు దైర్యంగా ముందుకొస్తే.. వాళ్ల మీద లేనిపోని పోలీసు కేసులు పెట్టడంతో మనకొచ్చిన గొడవెందుకులే అని వాళ్లూ వెనుదిరిగారు. ఫలితంగా నగరంలోనే తొలి హైరైజ్ అపార్ట్మెంట్ రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి బోసిపోయింది. దీంతో ప్రస్తుతం అక్కడ అపార్ట్మెంట్ ధర చ.అ.కు రూ.5 వేలు ఉంటే.. ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం రూ.3,500లకు మించి పలకట్లేదు. సాక్షి, హైదరాబాద్: రెసిడెన్షియల్ అసోసియేషన్లలో ఒకరిద్దరు చీడపురుగుల్లాంటి సభ్యులతో కలిగే నష్టాలకు ఇదొక ఉదాహరణ మాత్రమే. నగరంలోని కమ్యూనిటీ అసోసియేషన్లలో 50 శాతం వరకు ఇలాంటివే ఉంటాయంటే ఆశ్చర్యం లేదు. వార్షిక నిర్వహణ బాధ్యత నివాసిత సంఘాలదే అన్న ప్రాథమిక సూత్రాన్ని విస్మరిస్తే.. తగ్గేది మనం ఉండే ఇంటి విలువే. ప్రతీది బిల్డరే చేయాలంటే ఎలా? ప్రతి ఒక్కరూ కష్టపడిన సొమ్ముతోనే ఇల్లు కొనుక్కుంటారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాలలో ఇంటిని అందంగా తీర్చిదిద్దుకోమా? నాలుగైదేండ్లకు ఒకసారి రంగులు వేసుకోవటం, పగుళ్లు వచ్చినా, డ్రైనేజీ, బోర్, లిఫ్ట్ వంటి వాటిల్లో సమస్యలొస్తే రిపేరు చేసుకోమా? అలాగే అపార్ట్మెంట్లలో ఉండే వాళ్లూ అంతే అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి చేసుకోవాలే తప్ప.. ప్రాజెక్ట్‌లో ఏ నిర్వహణ పనులైనా బిల్డరే చేపించాలని పట్టుబడుతూ కూర్చుంటే పాడైపోయేది మీరు ఉండే ఇళ్లేనని గుర్తుంచుకోండి. చెట్లు నాటుతారు కానీ ప్రతి రోజూ దగ్గరుండి నీళ్లు పోయరు కదా.. అలాగే డెవలపర్ ప్రాజెక్ట్ నిర్మించి, నివాసిత సంఘాన్ని ఏర్పాటు చేసి కార్పస్ ఫండ్‌ను అందిస్తారు. నిర్వహణ వ్యయాన్ని కార్పస్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టుకోవాలే గానీ అన్నింటికీ బిల్డరే చేయాలని కూర్చుంటే మూర్ఖత్వమే అవుతుంది. ఎవరి ప్రాపర్టీని వాళ్లే కాపాడుకోవాలి. నిర్వహణ బాగుంటేనే ప్రాజెక్ట్ బాగుంటుంది. ఇంటి విలువ కూడా పెరుగుతుంది. ( ఫైల్ ఫోటో ) పైన పటారం.. లోన లొటారం.. ‘పైన పటారం లోన లొటారం’ అన్న చందంగా.. భవనం బయట నుంచి చూస్తే రంగులు వెలిసి, రోడ్లు పాడైపోయి వికారంగా కనిపిస్తుంటుంది గానీ అదే అపార్ట్మెంట్ లోపలికి వెళ్లి చూస్తే మాత్రం అందమైన ఇంటీరియర్‌తో లగ్జరీగా బాగుంటుంది. అయినా ఏం లాభం బయటి నిర్మాణం అందవిహీనంగా కనిపిస్తుంటే ఇంటి విలువ తగ్గక ఏమవుతుంది మరి? అపార్ట్మెంట్లకు వెళితే వసతులు బాగుంటాయని కొనుగోలు చేస్తుంటారు. మీ ఇంటి కోసం మీరే ఖర్చుపెడుతున్నారని ఎందుకు భావించరు? నివాసిత సంఘాల దృక్పథం మారాలి. పాజిటివ్ మైండ్‌సెట్ ఉన్న సభ్యులనే ఎన్నుకొని ప్రాజెక్ట్‌ను అభివృద్ధి పరుచుకోవాలని సాకేత్ గ్రూప్ డైరెక్టర్ రవి కుమార్ సూచించారు. - పాజిటివ్ మైండ్ ఉన్న వాళ్లనే అధ్యక్షులుగా ఎన్నుకోవాలి. నిర్వహణ చేయడానికి ముందుకొచ్చే వారిని ప్రోత్సహించాలి. వాళ్ల పనులకు అడ్డుపడుతూ, లోపాలను ఎంచకూడదు. పంతాలు, పట్టింపులకు పోవద్దు. - ఇదేమీ వేతనం వచ్చే పదవి కాదు. సామాజిక సేవ లాంటిదే. అలాంటప్పుడు వాళ్ల పనులు వదిలేసి మన ప్రాజెక్ట్ బాగుండాలని, అభివృద్ధి చేయాలనే సదుద్దేశంతో ముందుకొస్తే లేనిపోని మాటలతో, అభాండాలను వేయకూడదు. - ప్రతి అసోసియేషన్‌లో 2 శాతం నెగెటివ్ మైండ్‌సెట్ ఉన్న సభ్యులుంటారు. వాళ్లను వదిలేసి మెజారిటీ సభ్యుల ఆమోదం మేరకు నిర్ణయాలను తీసుకోవాలి. ఒకరిద్దరు సభ్యుల చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. - కమ్యూనిటీ అంతా ఒక కుటుంబంలా ఉంటే.. ఆనందం, ఆరోగ్యంతో పాటు బయటి వాళ్లలో కమ్యూనిటీ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. దీంతో ప్రాజెక్ట్ విలువ పెరుగుతుంది. - పిల్లలు ఉంటే వీకెండ్స్, సెలవు రోజుల్లో ఆటలు, సాంస్కృతిక పోటీల వంటివి నిర్వహించాలి. పెద్దల కోసం తీర్థయాత్రలు, వన భోజనాల వంటివి ఏర్పాటు చేయాలి. - రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలను క్రమం తప్పకుండా చెక్ చేపించాలి. పార్క్, గ్రీనరీ, లిఫ్ట్, జనరేటర్ వంటి వసతులను నిర్వహణ చేసుకోవాలి. ఇందుకు అయ్యే వ్యయాలను సభ్యులు అందరూ పంచుకోవాలి. - అవసరాలకు తగ్గట్టు ప్రాజెక్ట్‌లో వసతులను కల్పించుకోవాలి. ఉదాహరణకు.. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్ పాయింట్లు, సోలార్ వ్యవస్థ వంటివి ఏర్పాటు చేసుకోవాలి. అవి కూడా డెవలపరే చేపించాలని పట్టుబడుతూ కూర్చోవద్దు. చదవండి: పెరుగుతున్న హైరైజ్ ప్రాజెక్ట్‌లు -
కట్టినోళ్ల కష్టం గుర్తుండేలా!
సాక్షి, అమరావతి: తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీల పేర్లు ఎవరికీ తెలియదు. కానీ.. తన కలల సౌధాన్ని నిర్మించిన శ్రామికుల వివరాలన్నీ ఆ యజమానికి తెలుసు. వారి పేర్లు పది కాలాలపాటు పదిలంగా ఉండేలా శిలాఫలకంపై చెక్కించాడు ఆ అపార్ట్మెంట్ యజమాని కొత్తపల్లి మురళీమోహనరావు (అబ్బులు). ఆయన విలక్షణ శైలి గురించి తెలిసినోళ్లంతా ‘వావ్.. సమ్‌థింగ్ స్పెషల్ అబ్బులు’ అంటుంటారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు రైల్వే స్టేషన్ సమీపంలో 2012లో నిర్మించిన ఐదంతస్తుల ‘అలిపిరి అపార్ట్స్’లోకి వెళ్లగానే సెల్లార్లో నిలువెత్తు శిలాఫలకం కనిపిస్తుంది. అందులో ఆ భవన నిర్మాణం కోసం శ్రమించిన తాపీమేస్త్రి, ప్లంబర్, కరెంటు వర్కర్, పెయింటర్, ఐరన్ మేస్త్రి, టైల్స్ మేస్త్రి, వాచ్‌మేన్ పేర్లు, వారి ఊరు, ఫోన్ నంబర్లు ఆ శిలాఫలకంపై దర్శనమిస్తాయి. ఆ అపార్ట్మెంట్ గృహప్రవేశం జరిగి ఫిబ్రవరి 3వ తేదీ నాటికి పదేళ్లు పూర్తయ్యింది. శ్రామికుల పేర్లతో అమర్చిన శిలాఫలకాన్ని చూసిన ప్రతి ఒక్కరు అబ్బురపడుతున్నారు. శ్రామికులకు గుర్తించిన అబ్బులును అభినందిస్తున్నారు. వైఎస్ గెలుపుతో పాదయాత్రగా తిరుపతికి.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2004 ఎన్నికల్లో గెలిస్తే తిరుపతికి కాలినడకన వస్తానని మొక్కుకున్న అబ్బులు అప్పట్లోనే మొక్కు చెల్లించుకున్నారు. తణుకు నుంచి పాదయాత్ర చేపట్టి ద్వారకా తిరుమల వెళ్లి వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి తిరుమల తిరుపతి వెళ్లారు. 15 రోజుల పాదయాత్ర చేసి 2004 ఆగస్టు 5న తిరుమలలో మొక్కు చెల్లించుకున్నారు. దారి పొడవునా జోలెపట్టి ప్రజల నుంచి సేకరించిన రూ.32 వేల విరాళంలో రూ.16 వేలు తిరుపతి వెంకటేశ్వరుడి హుండీలోను, మరో రూ.16 వేలు తణుకులోని నాలుగు ఆలయాల్లోను సమర్పించి దేవుడిపైన, ఇటు వైఎస్‌పైన తన భక్తిని చాటుకున్నాడు. శ్రామికుల పేర్లతో ఏర్పాటు చేసిన శిలాఫలకం పురాతన నాణేల సేకరణ అబ్బులుకు పురాతన నాణేలు సేకరించే మరో హాబీ కూడా ఉంది. కాలక్రమంలో కనుమరుగైన అనేక నాణేలను ఆయన సేకరించి భద్రపరిచారు. కాణీలు, అణాలు, పైసలు వంటివి సేకరించడం గమనార్హం. సంతృప్తినిచ్చే పనులు చేస్తాను విలక్షణంగా ఆలోచించి అమలు చేయడం సంతృప్తినిస్తుంది. శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు ప్రముఖుల పేర్లతో శిలాఫలకాలు వేస్తారు. అలాకాకుండా శ్రామికుల పేర్లు శిలాఫలకంపై వేస్తే వారికెంతో సంతృప్తిగా ఉంటుంది. అందుకే నా భవన నిర్మాణంలో శ్రమించిన వారి పేర్లతో శిలాఫలకం వేయించాను. అది చూసి వారి ముఖంలో అప్పట్లో కనిపించిన ఆనందం.. పదేళ్లయినా ఇప్పటికీ కళ్ల ముందు కదలాడుతుంది. నాకు వైఎస్ అంటే చాలా ఇష్టం. 2004లో వైఎస్ గెలుపుతో పాదయాత్రగా తిరుపతి వెళ్లాను. కనుమరుగవుతున్న పురాతన నాణేలను భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో వాటి సేకరణను హాబీగా పెట్టుకున్నాను. – కొత్తపల్లి మురళీ మోహనరావు (అబ్బులు), తణుకు -
High Rise Apartments Hyderabad: హైదరాబాద్‌లో ఆకాశాన్ని తాకే అపార్ట్మెంట్లు.. కానీ?!
‘హైదరాబాద్ నగరానికి చెందిన ఓ నిర్మాణ సంస్థ పదేళ్ల క్రితం ఏఎస్రావు నగర్లో మూడున్నర ఎకరాల్లో 25 అంతస్తుల్లో హైరైజ్ అపార్ట్మెంట్లను నిర్మించింది. అప్పట్లో నగరంలోని ఆకాశహర్మ్యాలలో టాప్– 5లో ఇదొకటి. నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేసి ఫ్లాట్లన్నీ అమ్మేసి సొమ్ము చేసుకుంది. కార్పస్ ఫండ్ కింద ఫ్లాట్ రూ.లక్ష చొప్పున వసూలు చేసి రెండేళ్ల పాటు నిర్వహణ కంపెనీయే చేపట్టింది. ఇక్కడిదాకా బాగానే ఉంది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. నివాసితుల సంఘం ప్రాజెక్ట్‌లోని వసతులను వార్షిక నిర్వహణ చేపట్టలేకపోయింది. అపార్ట్మెంట్లు రంగులు, అంతర్గత రోడ్లు పాడైపోయాయి. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతంలో చ.అ.కు రూ.4 వేల ధర పలుకుతుంటే.. ఈ ప్రాజెక్ట్‌లో మాత్రం రూ.3 వేలకు మించి రీసేల్ కావటం లేదు’ సాక్షి, హైదరాబాద్: ఇదీ ఓ హైరైజ్ అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి. కొనేటప్పుడు బాగానే ఉన్నా.. భవిష్యత్తు హైరైజ్ రిస్క్‌లను అంచనా వేయటంలో నిర్మాణ సంస్థ, కొనుగోలుదారూ విఫలం చెందిన ఘటనకు ఇదో మచ్చుతునక. అంటే.. ఆకాశహర్మ్యాలు నిర్మించొద్దని కాదు.. నిర్వహణ సరిగా చేయలేకపోయినా, దీర్ఘకాలంలో తలెత్తే సమస్యలకు ముందస్తు పరిష్కారం చూపించలేకపోయినా నష్టపోయేది కొనుగోలుదారులే. నిర్మాణ సంస్థదేముంది కట్టేసి, అమ్మేసి చేతులు దులుపుకొంటుంది అంతే. ఆ తర్వాత కష్టాలు షరామామూలే. 41 శాతం ఎక్కువ.. భాగ్యనగరంలో ఆకాశహర్మ్యాల సంస్కృతి భారీగా పెరిగింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాలకే పరిమితమైన హైరైజ్ భవనాలు క్రమంగా ఇక్కడా పెరిగిపోతున్నాయి. గతేడాది జీహెచ్ఎంసీ పరిధిలో 140 ప్రాజెక్ట్‌లకు అనుమతి రాగా.. ఇందులో 57 హైరైజ్ భవనాలే. 2020తో పోలిస్తే 41 శాతం ఎక్కువ. తొందరపడితే నష్టాలే.. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు.. ఒకర్ని చూసి మరొకరు హైరైజ్ నిర్మాణాలను చేపడుతున్నారు. గచ్చిబౌలి, గండిపేట, కొండాపూర్, నానక్‌రాంగూడ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, ఖాజాగూడ, పుప్పాలగూడ, కొత్తగూడ, గచ్చిబౌలి, రాయదుర్గం నార్సింగి, శంకర్పల్లి, తెల్లాపూర్, నల్లగండ్ల వంటి పశ్చిమ హైదరాబాద్‌లోనే ఎక్కువగా హైరైజ్ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాలలో 25 నుంచి 30 వేల ఫ్లాట్లు నిర్మాణంలో ఉన్నట్లు అంచనా. వచ్చే నాలుగైదు ఏళ్లలో అదనంగా 70 వేల ఫ్లాట్లు అందుబాటులోకి వస్తాయంటున్నారు నిపుణులు. ఇంత భారీ స్థాయిలో సరఫరాను అందుకునే డిమాండ్ ఉందా? డిమాండ్‌కు మించి సరఫరా జరిగితే ఇన్వెంటరీ పెరిగి రియల్టీ మార్కెట్ దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం ఇలా చేయాలి.. భవిష్యత్తులో పశ్చిమ హైదరాబాద్‌లోని నివాసితులు, వాహనాల సంఖ్య, జనసాంద్రతకు తగ్గట్టుగా రహదారులు, పారిశుద్ధ్యం, నీరు, విద్యుత్ వంటి మౌలిక వసతులను కల్పించాలి. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 20 శాతం లోపు మాత్రమే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. మిగిలిన స్థలాన్ని గ్రీనరీకి, మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. ప్రతి అంతస్తునూ ప్రత్యక్షంగా పర్యవేక్షించాలి. పార్కింగ్, డ్రైనేజీ, అగ్ని ప్రమాద నివారణ ఏర్పాట్లు వంటి అంశాలను తనిఖీ చేయాలి. ఆ స్థోమత బిల్డర్‌కు ఉందా? హైరైజ్ ప్రాజెక్ట్‌లను నిర్మించే ఆర్థిక స్థోమత డెవలపర్లకు ఉందా? లేదా? అనేది చూడాలి. లేకపోతే ప్రాజెక్ట్ మధ్యలో బిల్డర్ చేతులెత్తేస్తే కొనుగోలుదారులు నిలువెల్లా నష్టపోతారు. అనుమతుల జారీలో ప్రభుత్వం, కొనుగోలు సమయంలో కస్టమర్లు ఇద్దరూ.. డెవలపర్ గత చరిత్ర, ప్రమోటర్ల ఆర్థిక స్థోమత, ఇతరత్రా అంశాల గురించి ఆరా తీయాలి. - నరేంద్ర కుమార్ కామరాజు, డైరెక్టర్, ప్రణీత్ గ్రూప్ ఇంపాక్ట్ ఫీజు పెంచాలి.. హైరైజ్ నిర్మాణాలను నియంత్రించాలంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (ఎఫ్ఎస్ఐ)కు క్యాప్ పెట్టడం సరైన నిర్ణయం కాదు. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బ తింటుంది. అపరిమిత ఎఫ్ఎస్ఐ కారణంగానే ఇతర నగరాల నిర్మాణ సంస్థలు హైదరాబాద్‌లో నిర్మాణాలు చేపడుతున్నాయి. హైరైజ్ భవనాలను నియంత్రించాలంటే చేయాల్సింది ఇంపాక్ట్ ఫీజును పెంచాల్సిందే. – సి.శేఖర్ రెడ్డి, జాతీయ మాజీ అధ్యక్షుడు, క్రెడాయ్ -
ఫ్లాట్ కొంటున్నారా? అదనపు వసూళ్లు తప్పడం లేదా? ఏం చేస్తే బెటర్!
సాక్షి, హైదరాబాద్: అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుగోలు ఎంత వ్యయమవుతోందో.. అదే స్థాయిలో వసతుల చార్జీలూ తడిసిమోపెడవుతున్నాయి. క్లబ్‌హౌస్, పార్కింగ్, సెలబ్రిటీ జిమ్, స్విమ్మింగ్ పూల్, స్వా్కష్ కోర్ట్, టేబుల్ టెన్నిస్, క్రికెట్ పిచ్, బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ పార్క్, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్, యోగా, మెడిటేషన్ హాల్, గెస్ట్ రూమ్స్, 7 స్టార్ రెస్టారెంట్.. ఇలా బోలెడన్నీ వసతులను ప్రకటిస్తున్నారు. అన్నింటికీ రూ.లక్షల్లోనే చార్జీలను వసూలు చేస్తున్నారు. రెరా నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్ ధరలోనే వసతుల చార్జీలు కూడా కలిపి ఉండాలి. కానీ, నిర్మాణ సంస్థలు వేర్వేరుగా వసూలు చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్స్, గ్రీనరీ, పైప్డ్ గ్యాస్, విద్యుత్, తాగునీరు ఇలా కనీస మౌలిక వసతులకు కూడా రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. రెండేళ్ల పాటు క్లబ్‌హౌస్ నిర్వహణ బాధ్యత నిర్మాణ సంస్థదేనని ప్రకటిస్తూనే.. మరోవైపు సభ్వత్య రుసుము పేరిట రూ.2– 3 లక్షల వరకూ బాదుతున్నారు. చదవండి: గీతం పూర్వ విద్యార్థిని శివాలి మరో గిన్నిస్ రికార్డు ఓసీ రాకముందే వసూళ్లు.. ► ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) రాకముందు వసతుల ఏర్పాటు, నిర్వహణకు చార్జీలు వసూలు చేయకూడదనేది నిబంధన. నిర్మాణ సంస్థలు మాత్రం దీన్ని పట్టించుకోవటం లేదు. ప్రభుత్వ విభాగాలు సైతం నియంత్రించడంలేదు. ► మౌలిక వసతులను కల్పించిన తర్వాతే మున్సిపల్ విభాగం ఓసీని విడుదల చేయాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ గేమ్స్, జాగింగ్, వాకింగ్ ట్రాక్స్.. అంటూ కొనుగోలుదారుకు ఇచ్చిన హామీ ప్రకారం అన్ని రకాల వసతులను పర్యవేక్షించే వారే కరువయ్యారు. ► భౌతికంగా ఆయా వసతులను డెవలపర్ కల్పించాడా లేదా అని క్షేత్రస్థాయిలో పర్యవేక్షించే వారే లేరు. ఒక్కసారి ఓసీ రిలీజ్ అయ్యాక ఇక ఆ అపార్ట్‌మెంట్‌కు డెవలపర్‌కు సంబంధం ఉండదు. వెంచర్లలో రిసార్ట్ అంటూ.. ► ఓపెన్ ప్లాట్లు చేసే బిల్డర్లు అపార్ట్మెంట్లలో కల్పించే వసతులను వెంచర్లలోనూ కల్పిస్తామంటూ భారీగా వసూలు చేస్తున్నారు. మున్సిపల్ నిబంధనల ప్రకారం వెంచర్లలో రహదా రులు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ వ్యవస్థ వంటివి కల్పించాల్సిన బాధ్యత డెవలపర్లదే. కానీ.. బిల్డర్లు వీటికి కూడా వసతుల ఏర్పాటు పేరిట చార్జీలు వసూలు చేస్తున్నారు. ► వీకెండ్ రిసార్ట్, ఫార్మింగ్, గోల్ఫ్ కోర్స్, క్లబ్‌హౌస్ సభ్యత్వం అని రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. శామీర్‌పేట, షాద్‌నగర్, తుక్కుగూడ, యాదాద్రి, చేవెళ్ల, శ్రీశైలం జాతీయ రహదారి వంటి పలు ప్రాంతాల్లోని వెంచర్లలో ఆధునిక వసతులు కల్పిస్తున్నామని ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఇలా చేయొచ్చు. ► అపార్ట్మెంట్ నిర్మాణం పూర్తయ్యాక ఎలాంటి చార్జీలు వసూలు చేయకుండా రెండేళ్ల పాటు వసతుల నిర్వహణ నిర్మాణ సంస్థే భరించాలి. ఒకే ఏరియాలో ఉండే 3– 4 ప్రాజెక్ట్‌లకు ఒకే క్లబ్‌హౌస్ కట్టుకోవటం ఉత్తమం. ► అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చులు చ.అ.ల చొప్పున కాకుండా నివాసితుందరికీ ఒకేలా ఉండాలి. ఫ్లాట్ల సంఖ్యను బట్టి చార్జీలను విభజించాలి. ►హౌసింగ్ సొసైటీల్లోని క్లబ్‌హౌస్‌లను థర్డ్ పార్టీకి అప్పగించాలి. రెస్టారెంట్, సూపర్‌మార్కెట్, మెడికల్ వంటి ఇతరత్రా వాటికి అప్పగించాలి. ఆ అద్దెతో కమ్యూనిటీలో ఇతరత్రా ఖర్చులను వినియోగించుకోవచ్చు. ప్రచారంగా మారిన వసతులు కొనుగోలుదారులను ఆకర్షించాలంటే ఆధునిక వసతులనేవి అనివార్యం. పిల్లలు, యువత, పెద్దల కోసం వేర్వేరుగా వసతులకు ఎక్కువ స్థలం వదలాల్సి ఉంటుంది. ఆ స్థలం ధర, వసతుల కల్పనకు అయ్యే ఖర్చు అన్నింటినీ కొనుగోలుదారుల నుంచే వసూలు చేయాల్సి వస్తోంది. సౌకర్యాలతో పాటు ఇంటి విలువ కూడా పెరుగుతోంది. దీంతో అపార్ట్మెంట్ ధరలో 10– 15 శాతం వరకు వసతుల చార్జీలు ఉంటాయి. అంతకంటే ఎక్కువ వసూలు చేయడం సరికాదు. – ప్రేమ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, నరెడ్కో తెలంగాణ కార్పడ్ ఫండ్ లెక్కించడంలేదు.. పదేళ్ల క్రితం కాప్రాలో అపార్ట్మెంట్ కొనుగోలు చేశాను. చ.అ.కు రూ.3 వేల చొప్పున 1,100 చ.అ.లకు రూ.33 లక్షలు అయింది. ఆ సమయంలో కార్పస్ ఫండ్, వసతుల నిర్వహణ కోసమని రూ.5 లక్షలు వసూలు చేశారు. ప్రతి నెలా అపార్ట్మెంట్ నిర్వహణ ఖర్చు కోసం నెలకు రూ.2 వేలు చెల్లిస్తున్నా. ప్రస్తుతం వ్యక్తిగత అవసరాల కోసం ఆ ఫ్లాట్‌ను అమ్మేద్దామని నిర్ణయించుకున్నా. కొనడానికి ఎవరొచ్చినా సరే అపార్ట్మెంట్ ధరనే లెక్కిస్తున్నారే తప్ప.. నేను చెల్లించిన కార్పస్ ఫండ్ పరిగణనలోకి తీసుకోవటం లేదు. – అజయ్, రిటైర్డ్ ప్రభుత్వోద్యోగి అదనంగా రూ.10లక్షలు చెల్లించా స్విమ్మింగ్ పూల్, జిమ్, పిల్లలకు క్రచ్, ప్లే ఏరియా వంటివి ఉన్నాయని కూకట్‌పల్లిలో ఓ గేటెడ్ కమ్యూనిటీలో రూ.80 లక్షలకు ఫ్లాట్ కొన్నా. వీటి కోసం డెవలపర్‌కు అదనంగా రూ.10 లక్షలు చెల్లించాను. ప్రస్తుతం బెంగళూరుకు బదిలీ అయింది. అపార్ట్మెంట్ సొసైటీకి అప్పగించిన రెండేళ్ల తర్వాత సరైన నిర్వహణ లేక స్విమ్మింగ్ పూల్ పాడైపోయింది. – ఉజ్వల్, ఐటీ ఉద్యోగి -
షిప్లో ఇల్లు కావాలా? 24 ఏళ్ల వరకు అద్దెకు అపార్ట్మెంట్లు .. ప్రారంభ ధరెంతో తెలుసా?
నేల మీద ఉండీ ఉండీ బోర్ కొట్టిందా. కాస్త వెరైటీగా సముద్రంలో ఇల్లు కట్టుకొని ఉంటే భలే ఉంటుందని అనుకుంటున్నారా. అయితే మీ కోసం ఓ గుడ్ న్యూస్! సముద్రంలో ఉండటమే కాదు. బోర్ కొడితే నీళ్లలో అలా ఓ చుట్టు చుట్టేసి కూడా వచ్చేలా ఇళ్లు సిద్ధమవుతున్నాయి. అదెలా.. అనుకుంటున్నారా. ఓ లగ్జరీ క్రూయిజ్ షిప్లో ఫ్లాట్లను అమ్మకానికి పెట్టారు. – సాక్షి, సెంట్రల్‌డెస్క్ రూ. 2.7 కోట్ల నుంచి మొదలు ఫ్లోరిడాకు చెందిన స్టోరీ లైన్స్ కంపెనీ ‘ఎంవీ నరేటివ్’పేరుతో లగ్జరీ క్రూయిజ్ షిప్‌ను నిర్మిస్తోంది. 2024 కల్లా ఇది అందుబాటులోకి రానుంది. షిప్లో ఒకటి నుంచి నాలుగు బెడ్రూమ్ల అపార్ట్మెంట్లు, స్టూడియోలు కలిపి మొత్తం 547 నిర్మిస్తోంది. వీటినే తాజాగా అమ్మకానికి పెట్టింది. వీటి ధర రూ.2.7 కోట్ల నుంచి మొదలవుతుంది. ఇంటి పరిమాణం, ఇంట్లోని వస్తువులను బట్టి ధర పెరుగుతుంటుంది. ఇళ్లను 12, 24 ఏళ్లకు అద్దెకు కూడా ఇస్తారు. వీలైనంత తక్కువ ధరకు ప్రజలకు ఇళ్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామని కంపెనీ చెబుతోంది. (చదవండి: కేసులు పెరుగుతున్నా.. మరణాలు తక్కువే!) ఇంటికి కావాల్సినవన్నీ అందుబాటులో.. ప్రతి అపార్ట్మెంట్లో ఇంట్లో ఉండటానికి కావాల్సిన ఫర్నిచరంతా ఉంటుంది. ఇటాలియన్ ఇంటీరియర్ డిజైన్లతో అద్భుతంగా కనిపిస్తుంది. కిచెన్, టీవీలు, ఇంట్లో వేడి, చలి నియంత్రణ వ్యవస్థలు, మూడ్‌కు తగ్గట్టు కాంతి రంగులను మార్చుకునే వెసులుబాటు ఉంది. షిప్లో మొత్తం 20 బార్లు, రెస్టారెంట్లు ఉన్నాయి. వీటిలో ఎప్పుడైనా ఆర్డర్ చేసుకునేలా 24 గంటల హోమ్ డెలివరీ వెసులుబాటు ఉంది. వినోదం కోసం ఓ సినిమా హాలు, బీర్లు అమ్మే చిన్న మైక్రో బ్రూవరీ, 3 స్విమ్మింగ్ పూల్స్, 10 వేల పుస్తకాలున్న లైబ్రరీ, స్పా, వెల్నెస్ సెంటర్, యోగా స్టూడియో కూడా ఉన్నాయి. అలాగే గోల్ఫ్ సిములేటర్, డ్యాన్స్ ఫ్లోర్ కూడా ఉన్నాయి. షిప్లో ఉండే వాళ్లు చెస్, ఫొటోగ్రఫీలాంటి క్లబ్‌లుగా ఏర్పడి ఆడుకోవచ్చు. ఈ షిప్ ప్రపంచంలో ఎక్కడికెళ్లినా అక్కడి పోర్టుల్లో దాదాపు 5 రోజుల వరకు ఉంటుంది. కాబట్టి అక్కడి ప్రదేశాలను తిరిగి రావొచ్చు. షిప్ ఎక్కడికెళ్లాలి, ఎక్కడ ఆగాలో షిప్‌లోని వాళ్లు ముందే నిర్ణయించుకోవచ్చు కూడా. (చదవండి: వారిని విడుదల చేయండి!) -
పని మనుషులు లిఫ్ట్ ఉపయోగిస్తే రూ.300 ఫైన్! నెట్టింట దుమారం రేపుతున్న హైదరాబాద్ ఘటన
హైదరాబాద్‌లో ఓ ఆపార్ట్మెంట్ తీసుకున్న నిర్ణయం వివాస్పదంగా మారింది. అపార్ట్మెంట్ నిర్మాణాలు, మెయింటనెన్స్లపై సరికొత్త ప్రశ్నలను ఈ ఘటన లేవనెత్తింది. ప్రస్తుతం ఇంటర్నెట్ వేదికగా వందల కొద్ది వ్యక్తులు ఈ విషయంపై స్పందిస్తున్నారు. వివాదానికి కారణం హర్షవడ్లమాని అనే ట్విట్టర్ యూజర్ జనవరి 12న నగరంలో ఓ అపార్ట్మెంట్ లిఫ్టు దగ్గర అంటించి నోటీస్ పోస్టర్ని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ నోటీసులో ఇంటి పని చేసేవాళ్లు, డెలివరీ బాయ్స్, డ్రైవర్లు మెయిన్ లిఫ్టు ఉపయోగిస్తే రూ.300 జరిమానా విధిస్తామని పేర్కొన్నారు. Cyberabad, 2022. pic.twitter.com/4XrldTlEel — Harsha Vadlamani (@Hrsha) January 12, 2022 ఇది సరికాదు.. కేటీఆర్ స్పందించాలి ఇంట్లో పని చేసేవాళ్లు, డ్రైవర్లు, డెలివరి బాయ్స్ పట్ల సదరు అపార్ట్మెంట్ వాసులు వివక్ష చూపిస్తున్నారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. మనుషులందరు ఒకటే అని కానీ ఇలాంటి నిర్ణయాలు ఈ రోజుల్లో కూడా అమలు చేస్తున్నారా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాటి మనుషుల పట్ల ఇలా వ్యవహరించిన వారిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. పని వాళ్లు వండిన తిండి తింటూ వారిని ఇలా అవమానించడం సరికాదంటున్నారు. వెంటనే ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు. మరికొందరైతే ఏకంగా ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా మంత్రి కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేస్తున్నారు. @cyberabadpolice @cpcybd should take action against the society, this is discrimination. — Bhushan (@kakollu_bhushan) January 12, 2022 @KTRTRS Sir pls take action. — Tejaaaa (@iamteja_8) January 12, 2022 మేము ఇలాగే చేస్తున్నాం పని మనుషులు లిఫ్ట్ ఉపయోగిస్తే రూ.300 ఫైన్ విధించే నిర్ణయంపై నెటిజన్లు దుమ్మెత్తి పోస్తుంటే.. మరికొందరు ఆ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలను వివరిస్తున్నారు. కరోనా వైరస్ భయం కారణంగా అపార్ట్మెంట్లో రాకపోకలు, కదలికపై ఆంక్షలు అమలు చేస్తున్నట్టు చెబుతున్నారు. మెయిన్ లిఫ్టు వాడకంపై ఆంక్షలు ఉండటం సరైనదే అని.. ఎక్కువగా ఫోకస్ అయ్యే పని వాళ్లు, డెలివరీ పర్సన్స్, డ్రైవర్లు తదితరుల కోసం సర్వీసు లిఫ్టు అందుబాటులో ఉంటుందని బదులిస్తున్నారు. మరికొందరు తమ అపార్ట్మెంట్లో రెండు లిఫ్టులు ఉంటే ఒకటి కోవిడ్ రిస్క్ ఎక్కువగా ఉండే వృద్ధులకు, మరొకటి మిగిలిన వాళ్లు ఉపయోగిస్తున్నామని వివరిస్తున్నారు. రిస్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కఠిన నిర్ణయాలు తప్పడం లేదన్నట్టుగా మాట్లాడుతున్నారు. @cyberabadpolice @cpcybd should take action against the society, this is discrimination. — Bhushan (@kakollu_bhushan) January 12, 2022 భవిష్యత్తులో ఇవి తప్పవా? కోవిడ్ మహమ్మారి వచ్చిన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకున్నాయి. మాస్క్, శానిటైజర్, ఫిజికల్ డిస్టెన్స్ వంటివి నిత్య జీవితంలో భాగమయ్యాయి. వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ వర్క్లాంటి పని విధానాలు వచ్చాయి. కోవిడ్ ఎండెమిక్‌గా ఉండిపోయే అవకాశం ఉందని ఇప్పుడే శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో కరోనా ఉన్నంత కాలం అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీ, హౌసింగ్ సొసైటీల్లో ఈ సమస్య పదే పదే ఉత్పన్నం అవుతుందంటున్నారు. ఇరు వర్గాల వాదనల్లో వాస్తవం ఉందంటున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా అపార్ట్మెంట్ల నిర్మాణంలోనే సర్వీస్ లిఫ్టులు, శానిటైజర్ ఛాంబర్స్, డెలివరీ గేట్‌వే తదితర ఏర్పాట్లు తప్పవా ? అనే చర్చ రియల్టీ వర్గాల్లో నడుస్తోంది. చదవండి: గృహ విక్రయాలు, లాంచింగ్స్‌లో హైదరాబాద్ రికార్డ్ -
‘ప్రీలాంచ్’ దందాకు చెక్!
సాక్షి, హైదరాబాద్: ఎవరికైనా సొంతిల్లు లేదా కొంత సొంత స్థలం ఉండాలనేది ఓ కల. కొన్ని నిర్మాణ సంస్థల నిర్వాహకులు, డెవలపర్లు ఈ ఆశలకు గాలం వేస్తున్నారు. చేతిలో డబ్బుల్లేకున్నా, అనుమతులు రాకున్నా ఏదో ఓ ప్రాజెక్టు మొదలుపెడ్తున్నారు. రంగురంగుల డిజైన్లు, పోస్టర్లతో ‘గాల్లో మేడలు’ కడుతున్నారు. కానీ ఏళ్లకేళ్లు గడుస్తున్నా ప్రాజెక్టులు పూర్తిగాకపోవడం, కొన్ని ప్రాజెక్టులైతే మొత్తంగా ఆగిపోవడంతో కొనుగోలుదారులు లబోదిబోమంటున్నారు. ఈ సమస్య నుంచి తప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు/ఫ్లాట్లు విక్రయించాలంటే.. తప్పనిసరిగా స్థానిక మున్సిపల్ అథారిటీల నుంచి అనుమతి తీసుకుని ఉండాలని ఆదేశించింది. అంతా పేపర్ల మీదనే.. గ్రేటర్ హైదరాబాద్ శివార్లతోపాటు పలు జిల్లా కేంద్రాల్లో ప్రీలాంచ్/ప్రీసేల్ పేరిట రియల్ వెంచర్ల దందా సాగుతోంది. వాయిదా పద్ధతిలో భూమిని కొనుగోలు చేస్తున్న కొందరు రియల్టర్లు, బిల్డర్లు.. సదరు భూమికి సొమ్ము చెల్లించడం నుంచి స్థానిక సంస్థల అనుమతులు, రిజిస్ట్రేషన్ దాకా జనం సొమ్ముతోనే పని పూర్తి చేసుకుంటున్నారు. ప్రాజెక్టు పూర్తయ్యే నాటి ధరతో పోలిస్తే 30 శాతం వరకు తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తామంటూ జనానికి వల వేస్తున్నారు. చాలా వరకు ప్రీలాంచ్, యూడీఎస్ ప్రాజెక్టులన్నీ పేపర్లు, బ్రోచర్ల మీదనే ఉంటున్నాయి. ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులుగానీ, రెరాలో నమోదై ఉండటంగానీ తక్కువ. భూమి పూజ కూడా చేయకుండానే.. ప్రాజెక్టు మొదలైపోయినట్టు ప్రచారం ఊదరగొడుతున్నారు. కొద్దిరోజుల్లోనే సొంతిల్లు అందుతుందన్న ఆశలు కల్పిస్తున్నారు. మామూలు రియల్టర్లు, డెవలపర్లే కాకుండా పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా ఇలాగే వ్యవహరిస్తుండటం గమనార్హం. చాలా వరకు ప్రాజెక్టులు ఏళ్లకేళ్లు సాగుతూనే ఉంటున్నాయి. కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొనుగోలుదారులు నష్టపోతున్నారు. ఫిర్యాదులు రావడంతో.. కరోనా పరిస్థితి చక్కబడిన తర్వాత రియల్ బూమ్ మరోసారి ఊపందుకోవడంతో ప్రీలాంచ్/ప్రీసేల్ ఆఫర్లు కూడా పెరిగాయి. హైదరాబాద్ నగర శివార్లలోనే వందల సంఖ్యలో రియల్ ఎస్టేట్ సంస్థలు ముందస్తు విక్రయాలు చేస్తున్నాయి. దీనిపై ఫిర్యాదులు అందడంతో మున్సిపల్ శాఖ దృష్టి పెట్టింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, సీడీఎంఏతోపాటు ఇతర జిల్లాల్లోని స్థానిక అథారిటీల నుంచి నివేదిక తెప్పించుకుంది. రెరా, హెచ్ఎండీఏ, జీహచ్ఎంసీ, ఇతర మున్సిపాలిటీల అనుమతులు లేకుండానే వెంచర్లలో ప్లాట్లు, అపార్ట్మెంట్లలో ఫ్లాట్లు విక్రయిస్తున్నట్లు గుర్తించింది. దీనికి సంబంధించి శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేని ప్రాజెక్టుల్లో కొనుగోళ్లు/బుకింగ్‌లు చేయవద్దని సూచించింది. ఏదైనా ఫ్లాటును, బిల్డప్ ఏరియాను కొనే ముందు జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రెరా అనుమతుల వివరాలను ఆయా కార్యాలయాల్లో పరిశీలించాలని, ఆన్‌లైన్‌లోనూ వివరాలు లభిస్తాయని వెల్లడించింది. రెరా చట్టం ఏం చెపుతోంది? కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రియల్ ఎస్టేట్ (నియంత్రణ, అభివృద్ధి) చట్టం–2016 ఆధారంగా.. రాష్ట్రంలో 2017లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)ని ఏర్పాటు చేశారు. రియల్ వెంచర్లు, అపార్ట్మెంట్లలో ప్లాట్లు/ ఫ్లాట్ల అమ్మకాల్లో పారదర్శకత కోసం ఈ అథారిటీ పనిచేస్తుంది. రియల్ఎస్టేట్ సంస్థలు తమ ప్రాజెక్టులను రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. ఆయా ప్రాజెక్టులు, నిర్మాణాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా అన్న దానిని రెరా పరిశీలించి విక్రయాలకు అనుమతులు ఇస్తుంది. అనుమతుల్లో ఆలస్యం వల్లే..: డెవలపర్లు ప్రీలాంచ్ కింద ఫ్లాట్లు/ప్లాట్లు విక్రయించడానికి కారణం అనుమతులు ఆలస్యంగా రావటమేనని రియల్ఎస్టేట్ సంస్థల ప్రతినిధులు, డెవలపర్లు చెప్తున్నారు. ‘‘మున్సిపల్ అనుమతుల నుంచి మొదలుపెడితే రెవెన్యూ, ఇరిగేషన్, ఎయిర్పోర్ట్ అథారిటీ, ఎన్విరాన్మెంటల్, ఫైర్, పోలీస్.. ఇలా సుమారు 15 ప్రభుత్వ విభాగాల నుంచి నిర్మాణ అనుమతులు తీసుకోవాలి. ఆ తర్వాత రెరా కోసం దరఖాస్తు చేసుకోవాలి. వీటన్నింటి కోసం ఏడాదిన్నరకుపైనే సమయం పడుతోంది. ఈ సమయంలో ప్రాజెక్టు రుణాలపై వడ్డీ, కాంట్రాక్టర్లు, ఉద్యోగుల జీతభత్యాలు, ఆఫీసు నిర్వహణ, ఇతర ఖర్చుల భారం మోయాల్సి వస్తోంది. అదే ప్రీలాంచ్ కింద కొన్ని ఫ్లాట్లను విక్రయిస్తే ముందుగా కొంత సొమ్ము చేతికి అందుతుంది’’ అని ఓ సంస్థ ప్రతినిధి తెలిపారు. మాది గుంటూరు. వృత్తిరీత్యా ముంబైలో ఉంటున్నా. రిటైరయ్యాక హైదరాబాద్‌లో స్థిరపడాలనుకున్నా. 2010 జూలైలో తెల్లాపూర్‌లో అద్భుతమైన ప్రాజెక్టు నిర్మిస్తున్నామంటూ ఓ సంస్థ ఇచ్చిన యాడ్ చూశా. ప్రీలాంచ్లో బుక్ చేస్తే తక్కువ ధరకు వస్తుందనడంతో నమ్మేసి రూ.50 లక్షల విలువైన ఫ్లాట్ కోసం రూ.45 లక్షలు ముందే చెల్లించేశా. ఇప్పటికీ ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాలేదు. కట్టిన డబ్బులు వెనక్కి రాలేదు. నాతోపాటు మరో 300 మంది పరిస్థితి ఇదేనని తెలిసింది. -సుధాకర్, బాధితుడు మాది గండిపేట ప్రాంతం. ఐటీ ఉద్యోగిని. మంచి విల్లా కొనాలనుకొని మంచిరేవుల ప్రాంతంలో చూశాం. అప్పటికే అక్కడ బెంగళూరుకు చెందిన కంపెనీ ఓ ప్రాజెక్టును పూర్తి చేసింది. దానికి ఆనుకుని 4 ఎకరాల్లో మరో ప్రాజెక్టును మొదలుపెట్టనున్నట్టు ప్రకటించింది. దానితో చదరపు అడుగుకు రూ.2,800 ధరతో విల్లా బుక్ చేశా. నాలాగే మరో 120 మంది డబ్బులు కట్టారు. ప్రాజెక్టుకు పలు సమస్యల కారణంగా నిర్మాణ అనుమతులు రాలేదు. మేం కట్టిన డబ్బులు అడిగితే డెవలపర్ రేపు మాపు అంటూ తిప్పుతున్నాడు. -జాన్ విన్సెంట్, బాధితుడు రెరా, స్థానిక సంస్థల అనుమతి ఉంటేనే.. స్థానిక సంస్థల నుంచి భవన నిర్మాణ అనుమతులు పొందకుండా, రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే.. ప్రీలాంచ్/ప్రీసేల్ ఆఫర్ల పేరిట ఫ్లాట్లను, బిల్టప్ ఏరియాను విక్రయించొద్దని మున్సిపల్ శాఖ స్పష్టం చేసింది. ఆఫర్ల పేరిట పత్రికలు, చానళ్లలో ప్రకటనలు ఇవ్వడం, సోషల్ మీడియాలో ప్రచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. ఒక బిల్డర్ గానీ, నిర్మాణ సంస్థగానీ తాము నిర్మించే భవనానికి అనుమతులన్నీ పొందిన తర్వాతే విక్రయాలు చేపట్టాలని ఆదేశించింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా నిర్మించే ఫ్లాట్లకు.. స్థానిక సంస్థల నుంచి అనుమతి లేకపోతే కొనుగోలుదారులు నష్టపోవాల్సి ఉంటుందని హెచ్చరించింది.శామీర్‌పేటలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఐదంతస్తుల్లో నిర్మించే అపార్ట్మెంట్లలో ఫ్లాట్లకు ప్రీసేల్ ఆఫర్ ప్రకటించింది. వెయ్యి చదరపు అడుగుల ఫ్లాట్‌ను ముందస్తుగా బుక్ చేసుకుంటే.. చ.అడుగుకు రూ.5,000గా ఉన్న ధరను రూ.3,500కు తగ్గిస్తామని ప్రకటించింది. మొత్తం సొమ్ములో 25 శాతం చెల్లించి బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. సదరు స్థలానికి వెళ్లి చూస్తే.. ఎలాంటి నిర్మాణం మొదలుకాలేదు. రెరా రిజిస్ట్రేషన్, ఇతర అనుమతులు లేకుండానే దందా సాగుతోంది. ఇక్కడే కాదు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ సహా చాలా చోట్ల ఇదే పరిస్థితి. -
రికార్డ్ సేల్స్: అపార్ట్మెంట్లా.. హాట్ కేకులా..!
కరోనా మహమ్మారి ఇళ్ల కొనుగోలు దారుల ఆలోచనల్ని పూర్తిగా మార్చేసింది. గతంలో అఫార్డబుల్ హౌస్‌లను కొనుగోలు చేసేందుకు ఇష్టపడే వారు. కానీ ఇప్పుడు వారి ఆలోచన మారింది. లెక్క ఎక్కువైనా పర్లేదు..లగ్జరీ మాత్రం మిస్ అవ్వకూడదనేలా ఆలోచిస్తున్నారని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే తెలిపింది. ఈ క్రమంలో దసరా సందర్భంగా పలు బ్యాంకులు హోం లోన్లపై వడ్డిరేట్లతో పాటు స్టాంప్ డ్యూటీ రుసుము తగ్గించడంతో భారీ ఎత్తున ఇళ్ల కొనుగోళ్లు జరిగినట్లు తేలింది. ముఖ్యంగా లగ్జరీ, సెమీ లగ్జరీ సెగ్మెంట్లో వందల కోట్ల బిజినెస్ జరిగినట్లు మరో సర్వే సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి చిరకాల కోరిక. జీవితం మొత్తం కష్టపడి సంపాదించిన డబ్బులతో కలల పొదరిల్లును నిర్మించుకోవాలని అనుకుంటారు.అలాంటి పొదరిల్లును ముంబై మహా నగరంలో ఎంతమంది సొంతం చేసుకున్నారనే అంశంపై నైట్ ఫ్రాంక్ ఇండియా స్టడీ చేసింది. ఈ స్టడీలో దసరా నవరాత్రి సందర్భంగా ముంబైలో ప్రతి రోజు 400కి పైగా అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. బ్యాంకులు తక్కువ వడ్డీకే హోంలోన్లను ఆఫర్ చేయడంతో అక్టోబర్ 7 నుంచి అక్టోబర్ 15 మధ్యకాలంలో రియల్టీ ఎక్స్పర్ట్స్ అంచనాల్ని తల్లకిందులు చేస్తూ సుమారు 3,205 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా తన స్టడీలో పేర్కొంది. ఇక ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ దసరా పండుగ మధ్య కాలంలో ప్రతి రోజు 219 నుంచి 260 యూనిట్ల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్పష్టం చేసింది. ఆగస్ట్ నెలకంటే అక్టోబర్ 13 వరకు ఇళ్ల సేల్స్ 17శాతం పెరిగాయి. అక్టోబర్ మొదటి రెండు వారాల్లో 4,052 యూనిట్ల ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా స్టడీ నిర్ధారించింది. దివాళీ ఫెస్టివల్ లో సైతం సేల్స్ పెరగొచ్చు ఈ సందర్భంగా ది గార్డియన్స్ రియల్ ఎస్టేట్ అడ్వైజరీ జాయింట్ డైరెక్టర్ రామ్ నాయక్ మాట్లాడుతూ..గత 8 రోజుల్లోనే రూ12,00కోట్ల విలువైన అపార్ట్మెంట్లను అమ్మినట్లు తెలిపారు. వాటిలో సుమారు రూ.750కోట్ల విలువైన లగ్జరీ, సెమీ లగ్జరీ సెగ్మెంట్ అపార్ట్ మెంట్లు ఉన్నట్లు చెప్పారు. దీపావళి సందర్భంగా ఇళ్ల సేల్స్ పెరిగే అవకాశం ఉంది. బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ఆఫర్ చేయడం, దీపావళికి ఇళ్లు కొనుగోలు చేయాలనే సెంటిమెంట్‌తో పాటు ఇతర కారణాల వల్ల సేల్స్ పెరుగుతాయని రామ్ నాయక్ అభిప్రాయం వ్యక్తం చేశారు. -
లగ్జరీ అపార్ట్మెంట్స్ కేరాఫ్ హైదరాబాద్
ముత్యాల నగరం హైదరాబాద్ ఇప్పుడు లగ్జరీ అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. బడ్జెట్ ఇళ్ల నిర్మాణం కంటే లగ్జరీ అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు కట్టేందుకు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రముఖ రియల్టీ రీసెర్చ్ సంస్థ 99 ఎకర్స్ తాజా సర్వేలో ఇదే విషయం వెల్లడైంది. నివాస యోగ్యం ఫార్మా, ఐటీ రంగాల్లో ఇప్పటికే మేటీగా ఉన్న హైదరాబాద్ నగరం కరోనా తర్వాత వైద్య సేవల విభాగంలోనూ సత్తా చాటుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు సైతం ఇక్కడ ఉపాధి లభిస్తోంది. దీంతో నగరంలో జనాభా పెరగడంతో పాటు నివాసం ఉండే ఇళ్లకు డిమాండ్ పెరుగుతోంది. బడ్జెట్ ఇళ్లకే డిమాండ్ ప్రస్తుతం నగరంలో ఇళ్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిలో 39 శాతం మంది బడ్జెట్ ధరలో ఇండిపెండెంట్ ఇళ్లు లేదా అపార్ట్మెంట్ సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కానీ ప్రస్తుతం ఈ ధరలో నగరంలో నిర్మాణం అవుతున్న ఇళ్ల సంఖ్య తక్కువగా ఉంది. ఈ సెగ్మెంట్లో డిమాండ్ 39 శాతం ఉండగా సప్లై మాత్రం కేవలం 26 శాతానికే పరిమితమైంది. రూ.కోటి దగ్గరే నగరంలో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ హౌజ్‌లు, గేటెడ్ కమ్యూనిటీస్‌లో ఇళ్ల ధర కోటి రూపాయలకు అటు ఇటుగానే ఉంటోంది. ఈ బడ్జెట్ సెగ్మెంట్లోనే బిల్డర్లు, డెవలపర్లు తమ ప్రాజెక్టుల విస్తరణ చేస్తున్నారు. బిగ్ ప్లేయర్లు ఎవరూ కూడా రూ. 40 లక్షలలోపు ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు రెడీగా లేరు. చిన్న ప్లేయర్లు మాత్రమే నగర శివార్లలో రూ. 40 లక్షలలోపు ఇళ్ల నిర్మాణం చేస్తున్నారు. డిమాండ్‌ని మించి నలభై లక్షల నుంచి కోటి రూపాయలు, అంత కంటే ఎక్కువ ధర ఉన్న ఇళ్లు, అపార్ట్మెంట్లు నగరం నలుమూలల శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. సెమీ లగ్జరీ, లగ్జరీ కేటగిరిలో డిమాండ్ 61 శాతమే ఉండగా ఇళ్ల నిర్మాణాలు మాత్రం 74 శాతంగా ఉన్నాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్ కంటే ఎక్కువ ఇళ్లు అందుబాటులో ఉన్నాయి. నమ్మకం కరోనా క్లిష్ట పరిస్థితుల నుంచి హైదరాబాద్ నగరం వేగంగా కోలుకుంటుంది. ఇక్కడ జనజీవనం గాడిన పడటంతో పాటు ఆర్థిక రంగం వేగంగా పుంజుకుంటోంది. మరిన్ని అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రాబోయే డిమాండ్‌కి తగ్గట్టుగా సెమీ లగ్జరీ, లగ్జరీ సెగ్మెంట్లో ఇళ్ల నిర్మాణం భారీగా చేపడుతున్నట్టు బిల్డర్లు చెబుతున్నారు. చదవండి : మౌలిక రంగానికి రుణ లభ్యత అంతంతే! -
అమ్మాయిలకు అద్దె ఇళ్ల కష్టాలు.. బౌన్సర్లతో బెదిరింపులు
చదువుకునేందుకు ఉద్యోగాలు చేసేందుకు నగరాలకు వచ్చే అమ్మాయిలు, మహిళలకు కొత్త కష్టాలు ఎదురవుతున్నాయి. ఒంటరి మహిళలు, పెళ్లికాని అమ్మాయిలకు ఇళ్లు ఇవ్వమంటూ అపార్ట్మెంట్ సొసైటీలు విద్యార్థినులు, లేడీ ఎంప్లాయిస్‌ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. కేవలం అమ్మాయిలు ధరించే దుస్తులు సరిగా లేవన్న కారణంతో ఈ దారుణానికి అపార్ట్మెంట్ సొసైటీ సభ్యులు తెగబడుతున్నారు. కోవిడ్ తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇంత కాలం ఇళ్లకే పరిమితమై వర్క్ ఫ్రం హోంలో ఉన్న ఉద్యోగులు ఆఫీసుల బాట పడుతున్నారు. ఉన్నత విద్య కోసం గ్రామాలను వదిలిన విద్యార్థినులు నగరాల బాట పడుతున్నారు. అయితే ఇలా వస్తున్న మహిళల పట్ల కొందరు ఛాందసవాదులు పెడుతున్న రూల్స్ ఇబ్బందికరంగా మారుతున్నాయి. అహ్మదాబాద్‌లో వ్యాపార వాణిజ్య రంగాల్లో మెట్రో నగరాల సరసన చేరేందుకు వడివడిగా అడుగులు వస్తోంది అహ్మదాబాద్. ఈ నగరంలో ఎన్నో అంతర్జాతీయ సంస్థల కార్పొరేట్ ఆఫీసులు, జాతీయస్థాయి విద్యాలయాలు ఉన్నాయి. ఇక్కడ పని చేసేందుకు, చదువుకునేందుకు గుజరాత్ నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి చాలా మంది అహ్మదాబాద్ చేరుకుంటారు. స్థానికంగా ఉన్న ఇళ్లలో పేయింగ్ గెస్టులుగా, ఇళ్లలో, అపార్ట్మెంట్లలో అద్దెకు ఉంటున్నారు. నిన్నామొన్నటి వరకు ఇలా ఉండే వారికి ఏ ఇబ్బందులు లేవు, కానీ తాజాగా అమ్మాయిలు, మహిళలను టార్గెట్‌గా చేసుకుని కొత్త రూల్స్ పెడుతున్నారు. అమ్మాయిలకు ఇవ్వం అహ్మదాబాద్‌లో గత కొద్ది కాలంగా చాపకింద నీరులా కొత్త రకం ప్రచారం తెరపైకి తెచ్చారు. పెళ్లైన జంటలకే ఇళ్లు అద్దెకు ఇవ్వాలి తప్పితే సింగిల్‌గా ఉండే అమ్మాయిలు, మహిళలకు ఇల్లు అద్దెకు ఇవ్వొద్దంటూ ప్రచారం ప్రారంభించారు. కనీసం పెయింగ్ గెస్టులుగా కూడా ఇళ్లలో ఉండనివ్వరాదంటూ హుకుం జారీ చేస్తున్నారు. చాలా మంది మౌనంగా ఈ ఇబ్బందులు పడుతున్నారు. కాదని ఎదురు తిరిగితే దాడులకు తెగబడుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవల జరిగిన ఓ ఘటన అహ్మాదాబాద్ మిర్రర్లో ప్రచురితమైంది, దీంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బౌన్సర్లతో దాడులు అహ్మదాబాద్‌లోని వైష్ణోదేవీ ఏరియా సమీపంలో ఉన్న రత్నా పారడైజ్ అపార్ట్మెంట్ సొసైటీ సభ్యులు మహిళల పట్ల కఠిన ఆంక్షల విషయంలో మరింతగా దిగజారారు. తమ అపార్ట్మెంటులో ఉంటున్న నిర్మా యూనివర్సిటీ విద్యార్థినులను ఫ్లాట్ ఖాళీ చేయాలంటూ ఆగస్టు 27న ఆదేశించారు. దీనికి వారు అంగీకరించకపోవడంతో బౌన్సర్లతో బెదిరించారు. కాలేజీ నుంచి అపార్ట్మెంట్కి వచ్చిన స్టూడెంట్స్‌ని గేటు దగ్గరే గంటల తరబడి నిలబెట్టారు. వర్షంలో తడుస్తున్నా లోనికి రానివ్వలేదు. పోలీస్ స్టేషన్లో అదే తీరు సోసైటీ సభ్యుల వేధింపులను ఆ విద్యార్థినులు ప్లాట్ యజామాని యోగేష్ పటేల్ దృష్టికి తీసుకెళ్లారు. సోసైటీ సభ్యుల తీరుని ప్లాట్ యజమాని ఖండించగా మరుసటి రోజు బౌన్సర్లు అతనిపై దాడికి పాల్పడ్డారు. వెంటనే జిల్లా రిజిస్ట్రార్ ఆఫ్ కోపరేటివ్ సొసైటీ ఆఫీసులో జరిగిన ఘటనపై అతను ఫిర్యాదు చేశాడు. ఇది జరిగిన రెండు రోజులకు ఆగస్టు 29న యోగేష్ పటేల్‌కి స్థానిక పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వచ్చింది. అతనిపై నాలుగు ఫిర్యాదు వచ్చాయని, వాటిపై విచారణ చేయాలంటూ.. యోగేష్ పటేల్‌తో పాటు అతని భార్యా పిల్లలను ఆ రోజంతా స్టేషన్లోనే ఉంచారు. చివరకు సొసైటీపై రిజిస్ట్రార్ ఆఫీసులో ఇచ్చిన ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. అయితే పోలీసులు ఈ ఆరోపణలను కొట్టి పారేస్తున్నారు. మమ్మల్నీ ఇబ్బంది పెట్టేందుకే మా సొసైటీలో బ్యాచ్‌లర్స్‌కి ఇళ్లు అద్దెకు ఇవ్వొద్దని ముందే చెప్పాం. కానీ యోగేష్ పటేల్ ఆ నిబంధన ఉల్లంఘించాడు. దాన్ని కప్పి పుచ్చుకునేందుకే మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మరో సొసైటీ మెంబర్ కరణ్ కియాని అంటున్నారు. వాళ్ల దుస్తులు బాగాలేవు నిర్మా యూనివర్సిటీ విద్యార్థులతో మాకు ఏ సమస్యా లేదు. అయితే అప్పుడప్పుడు వారు ధరించే దుస్తులు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. అలాంటి దుస్తులతో వారు అపార్ట్మెంట్లో తిరగడం మాకు ఇబ్బందిగా ఉంటోంది. అందుకే ఖాళీ చేయమని కోరుతున్నాం అంటూ అరుణ్ జోషి అనే సొసైటీ మెంబర్ మీడియాకు తెలిపారు. ఇంకెక్కడ భద్రత రత్నా సొసైటీలోని ప్లాట్స్‌లో నేను అమ్మాయితో పాటే ఉంటున్నాను. తనకు కాలేజీకి వెళ్లడం, ఇంటికి వచ్చి చదువుకోవడం తప్ప మరో ధ్యాసే ఉండదు. అలాంటిది ఇప్పుడు మమ్మల్ని ప్లాటఠ్ ఖాళీ చేయమనడం ఎంత వరకు సబబు. ఫుల్ సెక్యూరిటీ ఉండే అపార్ట్మెంట్లోనే మాకు రక్షణ లేకుండా ఇంకా ఎక్కడ దొరకుతుంది అంటూ బాధిత విద్యార్థినుల తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. డీజీపీకి చేరిన పంచాయతీ తమను ఇళ్లు ఖాళీ చేయించేందుకు పారడైజ్ అపార్ట్మెంట్ సొసైటీ బలవంతం చేయడంపై బాధిత విద్యార్థినులు డీజీపీకి ఫిర్యాదు చేశారు. నిర్మా యూనివర్సిటీలో విద్యార్థులు అందరికీ సరిపడ వసతి లేదని, అందువల్లే తాము బయట ప్లాట్‌లో ఉంటూ చదువుకుంటున్నామని వివరించారు. ఇప్పుడు బలవంతంగా తమను ప్లాట్ ఖాళీ చేయిస్తే ఎక్కడికి పోవాలంటూ ప్రశ్నించారు. తమను బెదిరించిన బౌన్సర్లు, ఇబ్బంది పెడుతున్న సొసైటీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రియల్టర్ల ఆందోళన పెద్ద నగరాల్లో అపార్ట్మెంట్ల అద్దె అనేది ఎంతో ముఖ్యమైన బిజినెస్ అని.. కేవలం పెళ్లైన వారికే వాటిని అద్దెకు ఇవ్వాలంటూ నిబంధనలు పెడితే ఇళ్ల అమ్మకాలు పడిపోతాయని రియల్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఇండిపెండెంట్‌గా పని చేస్తున్న యువతులు అహ్మాదాబాద్‌కు వచ్చేందుకు వెనుకంజ వేస్తారని చెబుతున్నారు. - సాక్షి, వెబ్ ప్రత్యేకం చదవండి : ఒంటరి మహిళల ఉమ్మడి శక్తి -
సుచిరిండియా ‘ది టేల్ ఆఫ్ గ్రీక్’
హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ కంపెనీ సుచిరిండియా ‘ది టేల్ ఆఫ్ గ్రీక్’ పేరిట లగ్జరీ, స్టూడియో అపార్ట్‌మెంట్‌కు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్ట్‌ను హీరోయిన్ సమంతా అక్కినేని లాంఛనంగా ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. శంషాబాద్‌లో 2.55 ఎకరాలలో నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్‌లో 6 లక్షల చదరపు అడుగుల బిల్టప్ ఏరియాలో మొత్తం 398 గృహాలుంటాంటాయని సుచిరిండియా చైర్మన్ డాక్టర్ కిరణ్ తెలిపారు. 800–945 చదరపు అడుగుల మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. మూడంతస్తులలో క్లబ్ హౌస్‌తో పాటు స్విమ్మింగ్ పూల్, జిమ్, చిల్ట్రన్స్ ప్లే ఏరియా, ఫార్మసీ వంటి వసతులుంటా యి. బెంగళూరు హైవేలోని కొత్తూరులో గిజాపొలీస్, అల్వాల్‌లో ఆర్యవర్త నగరి ప్రాజెక్ట్‌లను నిర్మి స్తుంది. మరొక 12 ప్రాజెక్ట్‌లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. -
ఎమ్మెల్యే గ్రంధిని కలిసిన శ్రీనివాస అపార్ట్మెంట్ వాసులు
సాక్షి, భీమవరం: బలుసుపూడిలో కూలేందుకు సిద్ధంగా ఉన్న శ్రీనివాస అపార్ట్మెంట్.. తీవ్ర భయాందోళనలు కలిగించిన సంగతి తెలిసిందే. బీటలు రావడంతో తాత్కలికంగా జాకీలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అపార్ట్మెంట్ వాసులు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌ను కలిసి తమకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. అపార్ట్మెంట్ వాసుల సమస్య విన్న ఎమ్మెల్యే వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక అపార్ట్మెంట్ పిల్లర్లు దెబ్బతిన్నా ఇప్పటి వరకు బిల్డర్ సత్యనారాయణ ఈ సమస్యపై స్పందించలేదు. ఇదిలా ఉండగానే అపార్ట్మెంట్లో మరో పిల్లర్‌కు బీటలు రావడంతో స్థానికులు భయపడుతున్నారు. ఇక దీని గురించి మున్సిపల్ అధికారులు నోటీసులు ఇచ్చినప్పటికి బిల్డర్ సత్యానారయణ సోదరుడు ఇంకా ఇదే అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. -
కూలేందుకు సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్
-
కూలేందుకు సిద్ధంగా ఉన్న అపార్ట్మెంట్.. భయాందోళనలో స్థానికులు
పశ్చిమ గోదావరి: భీమవరంలో ఓ అపార్ట్మెంట్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. దీంతో అపార్ట్మెంట్ ఎప్పుడు కూలుతుందో.. అని దానిలో నివాసం ఉండేవారు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అపార్ట్మెంట్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, అపార్ట్మెంట్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండేవారు జాకీలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం అపార్ట్మెంట్లో పిల్లర్లు విరిగి భారీ శబ్దలు రావడంతో నివాసం ఉండే వారు రోడ్డుపైకి పరుగులు తీశారు. 2004లో కట్టిన ఈ అపార్ట్మెంట్లో 20 కుటుంబాలు వరకూ నివసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అపార్ట్‌మెంట్‌కు నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు.. అందులో ఉండేవారిని ఖాళీ చేయిస్తున్నారు. నాణ్యతా లోపం వల్ల అపార్ట్మెంట్ ఎక్కడికక్కడ బీటలు తీసింది. దీనికి మరమ్మత్తులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో అందులో ఉన్న వారిని ఖాళీ చేయించడం ఒక్కటే మార్గంలా కనబడుతుంది. లక్షలు పోసి కొనుక్కున్న అపార్ట్మెంట్ ఇలా కూలిపోవడానికి సిద్ధంగా ఉండటంతో అందులో ఉన్న వారు ఏం చేయాలో తెలియని డైలమాలో పడ్డారు. -
బాత్రూంలో చల్లటి గాలి.. అద్దం జరిపి చూసి అవాక్కయ్యింది
-
అద్దం వెనక ఏకంగా అపార్ట్‌మెంటే కట్టేశారు..!
వాషింగ్టన్: అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో.. భూమి లోపల, కప్బోర్టుల వెనక రహస్య గదులు ఉండే సన్నివేశాలను చాలానే చూశాం. కానీ అద్దం వెనక ఏకంగా ఓ అపార్ట్మెంట్ బయటపడిన సంఘటన గురించి ఎప్పుడైనా విన్నారా.. కనీసం చూశారా.. లేదా ఇది చదవండి. ఇలాంటి సంఘటన ఒకటి అమెరికాలో చోటు చేసుకుంది. న్యూయార్క్‌కు చెందిన టిక్‌టాక్ యూజర్ సమంతా హార్ట్సో అనే మహిళ తన బాత్రూమ్ అద్దం వెనక ఏకంగా ఓ అపార్ట్‌మెంట్‌ని గుర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియోని ఆమె టిక్‌టాక్‌లో షేర్ చేశారు. దీన్ని ఇప్పటికే 7 మిలియన్ల మంది చూశారు. ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ.. ‘‘గత కొద్ది రోజులుగా నా బాత్రూమ్లోకి చల్లటి గాలి వీస్తుంది. అక్కడ కిటికీ, వేరే కూలింగ్ పరికరాలు ఏం లేవు. ఎంత బలమైన గాలి అంటే అది నా జుట్టును వెనక్కి నెడుతుంది. ఈ గాలి ఎక్కడి నుంచి వీస్తుందా అని వెతకడం ప్రారంభించాను. ఈ క్రమంలో బాత్రూమ్ సింక్‌కు అతికించిన అద్దం వెనక నుంచి ఈ గాలి వస్తుందని అర్థం అయ్యింది. దాంతో అద్దం జరిపి చూశాను. అక్కడ పెద్ద రంధ్రం కనిపించింది. అసులు నా బాత్రూమ్ వెనక ఏం ఉందో తెలుసుకోవాలని భావించాను’’ అన్నారు. బాత్రూమ్ వెనక ఏం ఉందో తెలుసుకోవడం కోసం అక్కడకు వెళ్లాలని భావించింది సమంతా. ఈ క్రమంలో ఫేస్‌మాస్క్ పెట్టుకుని.. చేతికి గ్లౌవుజులు ధరించి బయలు దేరడానికి సిద్ధమయ్యింది. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తం చర్యగా ఓ సుత్తిని కూడా తనతో పాటు తీసుకెళ్లింది. ఆ తర్వాత బాత్రూమ్ వెనక తనకు కనిపించిన పెద్ద రంధ్రం గుండా లోపలికి ప్రవేశించింది. మొదట అదేదో సీక్రెట్ రూమ్‌గా భావించిన సమంతా ఆ తర్వాత అక్కడ మొత్తం అపార్ట్‌మెంట్‌ని చూసి షాకయ్యింది. అపార్ట్మెంట్ చూసి ఆశ్యర్యంతో గట్టిగా కేకలు వేశారు సమంతా. ఇక ఆ అపార్ట్మెంట్ అంతా చెత్త బ్యాగులు.. వాడేసిన వాటర్ బాటిళ్లు ఉన్నాయి. ఈ సందర్భంగా సమంతా మాట్లాడుతూ.. ‘‘లోపలికి అడుగుపెట్టిన నేను అక్కడ ఎవరైనా ఉంటారని భావించాను. కానీ అద్దం వెనక ఏకంగా అపార్ట్మెంట్ ఉండటం నిజంగా వింతే’’ అన్నారు. చదవండి: టిక్‌టాక్ ఛాలెంజ్‌లో అపశ్రుతి.. బాలిక మృతి వైరల్: తనను తానే పెళ్లి చేసుకున్న యువతి -
పెద్ద సైజ్ అపార్ట్మెంట్లు హైదరాబాద్‌లోనే..
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో రియల్టీ పెట్టుబడులు క్షీణిస్తుంటే.. ఫ్లాట్ల విస్తీర్ణాలు మాత్రం పెరిగాయి. గతేడాది దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అపార్ట్మెంట్ సగటు పరిమాణం 10 శాతం వృద్ధి చెంది 1,150 చదరపు అడుగులు (చ.అ.)లకు చేరింది. విస్తీర్ణం ఎక్కువ ఉన్న ఫ్లాట్లకు డిమాండ్ పెరగడమే వృద్ధికి కారణామని ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ తెలిపింది. 2019లో దేశంలో సగటు ఫ్లాట్ల విస్తీర్ణం 1,050 చ.అ.లుగా ఉంది. దేశంలోని ఇతర మెట్రో నగరాల కంటే హైదరాబాద్‌లోనే అపార్ట్మెంట్ల సైజ్లు బాగా వృద్ధి చెందాయి. 2019లో నగరంలో సగటు ఫ్లాట్ల విస్తీర్ణం 1,700 చదరపు అడుగులుగా ఉండగా.. గతేడాది 3 శాతం పెరిగి 1,750 చదరపు అడుగులకు పెరిగిందని అనరాక్ తెలిపింది. 2016 నుంచి ప్రతి సంవత్సరం సగటు గృహ విస్తీర్ణం తగ్గుతూ వస్తుంటే.. గతేడాది మాత్రం పెరిగింది. ఆదాయ స్థోమత, నిర్వహణ చార్జీల తగ్గింపు కోసం గతంలో గృహ కొనుగోలుదారులు చిన్న సైజ్ అపార్ట్మెంట్లను ఇష్టపడేవాళ్లు. అందుకు తగ్గట్టుగానే తక్కువ ధరలతో మిలీనియల్స్‌ను ఆకర్షించేందుకు డెవలపర్లు కూడా చిన్న సైజ్ గృహాలనే నిర్మించేవాళ్లు. కానీ, 2020లో కోవిడ్–19 నేపథ్యంలో వర్క్ ఫ్రం హోమ్ ప్రారంభం కావటంతో కొనుగోలుదారుల గృహ ప్రాధాన్యతలో మార్పులు వచ్చాయని అనరాక్ చైర్మన్ అనూజ్ పురీ తెలిపారు. అందుకే గత నాలుగేళ్లుగా ఎన్నడూ లేనివిధంగా 2020లో అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. చదవండి: పెరిగిన హౌసింగ్ సేల్స్.. కారణాలు ఇవే! -
నిజాంపేట్‌లో అపార్ట్మెంట్లకు ఏమైంది!
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. సదరు నిర్మాణాలు పూర్తయినా కూడా వాటిని వదిలిపెట్టడం లేదు. ఇటీవల నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ గోపి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమంగా నిర్మించిన 103 భవనాలను గుర్తించి సీజ్ చేశారు. గ్రామ పంచాయతీ పరిపాలనలో ఉన్నప్పుడు అనుమతులతో జీ ప్లస్–4 అంతస్తులు నిర్మించారు. నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్ మూడు గ్రామాలు కలిపి కార్పొరేషన్‌గా గత సంవత్సరం ఏర్పాటైంది. అంతకు ముందు వచ్చే నుంచే విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల కమిషనర్ అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడంతో యజమానులు, కాంట్రాక్టర్లలో తీవ్ర ఆందోళన నెలకొంది. కార్పొరేషన్ ఏర్పడిన నాటి నుంచి బిల్డర్లు నిర్మాణాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఇక్కడ కమిషనర్‌గా పనిచేసిన ముకుందరెడ్డి గత ఏడాది నవంబరు 1న అక్రమ నిర్మాణాల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సబ్ రిజిస్ట్రార్‌కు లేఖ రాశారు. ఈ ఏడాది మే 16న ప్రస్తుత కమిషనర్ గోపి సుమారు 1000కి పైగా అక్రమ నిర్మాణాలను రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ లేఖ రాశారు. కరోనా ప్రభావం, ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో రిజిస్ట్రేషన్ నిలిపివేయడం పనులు నిలిచాయి. యథాతథంగా పనుల నిర్వహణ.. కార్పొరేషన్ అధికారులు ఇటీవల సీజ్ చేసిన భవనాల్లో యథాతథంగా పనులు కొనసాగుతున్నాయి. సీజ్ చేసిన తర్వాత అధికారులు తమ పని పూర్తయినట్లుగా వ్యవహరిస్తుండటంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్నారు. పనులు జరుగుతున్న విషయం తెలిసినా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నారు. ప్రాథమిక దశలోనే నిర్మాణాలను అడ్డుకుంటే ఎవరికీ నష్టం జరగదని, నిర్మాణం పూర్తయిన తర్వాత సీజ్ చేస్తే ఎలా అని పలువురు ఆరోపిస్తున్నారు. ఏమాత్రం ఉపేక్షించం.. సీజ్ చేసిన అక్రమ భవన నిర్మాణదారులకు నోటీసులు జారీ చేశాం. అనుమతులకు సంబంధించిన పత్రాలను తమకు ఇవ్వాలని కోరాం. అన్నీ పరిశీలించిన తర్వాతే అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదు. ఇప్పటికే 103 భవనాలను సీజ్ చేశాం. – గోపి, కమిషనర్, నిజాంపేట్ కార్పొరేషన్ -
కిచెన్‌లో బాత్రూమ్: ‘ఓనర్‌ను జైలులో వేయాలి’
సిడ్నీ : ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన శైలిలో ఇంటిని నిర్మించుకోవాలనుకుంటారు. అలాగే ప్రతి గదిని ప్రత్యేకంగా కట్టుకోడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇంటిని వినూత్నంగా నిర్మించాడు. కిచెన్‌లో గోడలు లేకుండా బాత్రూమ్ను నిర్మించుకున్నాడు. ఈ వింత నిర్మాణం ఆస్ట్రేలియాలో జరిగింది. సాధారణంగా సిడ్నీ నగరం ఖరీదైన రియల్ ఎస్టేట్‌కు మారుపేరు. అక్కడ స్థలాన్ని ఆదా చేసేలా భవనాలు, అపార్ట్మెంట్ల నిర్మాణం ఉంటుంది. కానీ సర్రిహిల్స్లో అపార్ట్మెంట్లో మాత్రం ఇంటిని వినూత్నంగా కట్టించాడు. వంట గదిలో గోడలు లేకుండా గాజు గ్లాస్‌తో బాత్రూమ్ను(టాయిలెట్, షవర్) నిర్మించారు. ఇక వంటగదిని బాత్రూమ్ను కేవలం గాజు గ్లాస్ మాత్రమే వేరుచేస్తుంది. ఇటాలియన్ డిజైనర్ ‘మాడ్రన్ కిచెన్’గా రూపొందించిన ఈ ఫ్లాట్‌ను ప్రస్తుతం అద్దెకు పెట్టారు. ఒకవేళ ఇది ఎవరికైనా నచ్చితే వారానికి దాదాపు రూ.18 వేల చెల్లించి అద్దెకు ఉండొచ్చు. (‘ఆరోగ్య సేతు’ భద్రతా సమస్య.. కేంద్రం క్లారిటీ ) అయితే దీనికి సంబంధించిన ఫోటోను ఓ వ్యక్తి ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఇవి చూసిన నెటిజన్లు ‘టాయిలెట్ ఇన్ ది కిచెన్ లే అవుట్’ భయంకరంగా ఉందంటున్నారు. బాత్రూమ్ ఎవరికైనా వ్యక్తిగత ప్రదేశమని, అయితే కిచెన్‌లో బాత్రూమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిని నిర్మించిన వారిని, ఇంటి యాజమానిని జైలులో వేయాలని మండిపడుతున్నారు. కాగా ఈ ఇంటిపై అనేక ప్రతికూల కామెంట్లు వచ్చినప్పటికీ దీనిపై యాజమాని మాట్లాడుతూ.. ఈ ఇంటిపై అనేకమంది ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిపారు. ఒంటరి వ్యక్తులు, ప్రేమికులు, ఇద్దరు అబ్బాయిలు వంటి వారు అపార్ట్‌మెంట్‌ను అద్దెకు కావాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు. (వినూత్నం: గోడలు లేని బాత్రూమ్) -
అపార్ట్మెంట్లపై ఆసక్తి
సాక్షి, ఉంగుటూరు: రెండు దశాబ్దాల క్రితం వరకు పల్లెలు ఉమ్మడి కుటుంబాలు, మండువా పెంకిటిళ్లతో అలరాయాయి. నేడవి కనుమరుగయ్యాయి. నగరాలు, పట్టణాల్లో కనబడే అపార్ట్మెంట్లు సంస్కృతి నేడు పల్లెల్లోనూ దర్శనమిస్తోంది. అపార్టుమెంట్లలో నివసించేందుకు గ్రామీణులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు నిదర్శనమే ఉంగుటూరు మండలం నారాయణపురం. ఈ గ్రామ కూడలిలో ఇప్పటికి ఏడు అపార్ట్మెంట్లు నిర్మించారు. గ్రూపుహౌసులు కూడా నిర్మించారు. 1 ప్లస్ 2 వరకు అనుమతిచ్చే అధికారం గ్రామ పంచాయతీలకు ఉంది. దీంతో టౌన్ ప్లానింగ్ అనుమతులతో అపార్ట్మెంట్లు నిర్మితమవుతున్నాయి. ఇందుకు కొల్లేరు మండలాలకు ముఖ ద్వారంగా, జాతీయ రహదారిని ఆనుకుని, జంగారెడ్డిగూడెం నుంచి భీమవరం వెళ్లే ఆర్అండ్బీ రహదారి నారాయణపురం గ్రామం మధ్య నుంచి వెళుతుండటమే కారణంగా తెలుస్తోంది. సుమారు 60 ఐస్ పరిశ్రమలు నారాయణపురంలో ఉన్నాయి. రోజుకి 500 లారీలు చేపలు ఇక్కడి నుంచి కలకత్తా వెళుతున్నాయి. సిలికా సిరమిక్ వంటి అతిపెద్ద పరిశ్రమలు ఇక్కడున్నాయి. భీమవరం వైపు సముద్రతీర ఉప్ప ప్రభావం ఎక్కవుగా ఉండటం, తాగునీరు కలుషితం, ప్రతికూల వాతావరణ ప్రభావంతో ఉన్నత శ్రేణి ప్రజలు నారాయణపురం సెంటరులో నివాసం ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు రైల్వేస్టేషన్లకు వెళ్లేందుకు అనకూలంగా ఉండటమే కారణంగా చెబుతున్నారు. ఈ ఏరియాలో సెంటు రూ.5 లక్షలుపైగా పలుకుతోంది. స్థలం కొని బిల్డింగ్ నిర్మించాలంటే తలకు మించిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో స్థలం కంటే అపార్టుమెంటులో ప్లాటు కొనుక్కోవడమే మేలని భావిస్తున్నారు. మూడెకరాల స్థంలో అపార్ట్మెంట్ నిర్మించాలంటే స్థానిక పంచాయతీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకుని అమరావతి నుంచి అనుమతులు పొందాల్సుంది. అపార్ట్మెంట్ చుట్టూ పైర్ ఇంజిన్ తిరిగేలా, చుట్టు గాలి, వెలుతుర వచ్చేలా, పార్కింగ్ స్థలం చూపి, గార్డెన్ పెంచేందుకు స్థలం చూపించాల్సి ఉంది. అపార్ట్మెంట్ల నిర్మాణానికి అనుమలు ఇచ్చే అధికారం తమకు లేదని పంచాయతీ కార్యదర్శి రవిచంద్ర తెలిపారు. జి ప్లస్ 2 వరకూ తాము అనుమతులిస్తామని, అపార్ట్మెంట్లకు అనుమతులు అమరావతిలో ఉన్నతాధికారుల నుంచి తీసుకోవాల్సి ఉందని వివరించారు. స్థానికుల ఇష్ట ప్రకారమే నిర్మాణాలు వాటర్ బాగుండటం, పొల్యూషన్ లేకపోవడం, గాలి బాగా వీస్తుండంటతో అపార్ట్‌మెంట్లులో ఉండేందుకు ప్రజలు ఇష్ట పడుతున్నారు. రిజర్వు స్థలం చూపించటం, మూడెకరాలకు పైగా స్థలంలో అపార్టుమెంటు నిర్మాణానికి అమరావతి నుంచి ప్లానింగ్ డిపార్టుమెంటు అధికార్లు వచ్చి చూశాక గాని అనుమతులు ఇవ్వడంలేదు. చట్టుపక్కల ప్రజల ఇష్టాలను పరిగణలోకి తీసుకుని అనుమతులు ఇస్తున్నారు. – పొత్తూరి కృష్ణంరాజు, వెంకటలక్ష్మి దుర్గ డవలపర్సు పార్టనర్ కల నెరవేరింది 15 ఏళ్లుగా అద్దె ఇళ్లల్లో నారాయణపురంలోనే ఉంటున్నాను. సెంటు రూ.5.50 లక్షలు పైనే పలుకుతోంది. ఈ నేపథ్యంలో స్థలం కొని బిల్డింగ్ నిర్మించటం సాధ్యంకావడంలేదు. దీంతో రూ.30 లక్షలుతో అపార్టుమెంటులో ప్లాటు తీసుకొన్నాను. వసతులు బాగున్నాయి. కొంత బ్యాంకు రుణం కూడా తీసుకున్నాను. నా ఇంటి కల నెరవేరింది. – పెనుమత్స భాస్కరరాజు, అపార్టుమెంటు కొనుగోలు దారుడు -
లగ్జరీ ఫ్లాట్ల వివాదం : సుప్రీం సంచలన ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేరళ కొచ్చిన్ శివార్లలోని మరాదు ఫ్లాట్ల వివాదంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేయనున్న ఎర్నాకుళం మరాదు ప్రాంతంలోని నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల ఫ్లాట్ యజమానులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని భారత అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. ఈ మధ్యంతర పరిహారాన్ని నాలుగు వారాల్లోగా పంపిణీ చేయాలని కేరళ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది, ఈ మొత్తాన్ని నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌ల బిల్డర్లు, ప్రమోటర్లు చెల్లిస్తారని సుప్రీం కోర్టు పేర్కొంది. నష్టపరిహార ప్రక్రియను అంచనా వేయడానికి , కూల్చివేత ప్రక్రియను పర్యవేక్షించడానికి రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తులతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ రవీంద్ర భట్‌లతో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొంది. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్‌జెడ్) నిబంధనలను ఉల్లంఘించినందుకు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లను కూల్చివేయాలని సుప్రీంకోర్టు ఈ నెల ప్రారంభంలో ఆదేశించిన సంగతి తెలిసిందే. మున్సిపాలిటీలో నిర్మించిన అత్యంత విలాసవంతమైన 400 ఫ్లాట్లను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ భవనాలను ఎప్పుడు పడగొట్టవచ్చో తెలుపుతూ కేరళ ప్రభుత్వం శుక్రవారం తాజా అఫిడవిట్ సమర్పించిన తరువాత సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కూల్చివేత ప్రక్రియ అక్టోబర్ 9 నుంచి ప్రారంభమై 90 రోజుల్లో పూర్తి చేస్తామని కేరళ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ ప్రదేశం నుండి శిధిలాలను తొలగించడానికి అదనంగా 48 రోజులు అవసరమని తెలిపింది. మరాదు మునిసిపాలిటీ కోరినట్లు గురువారం కేరళ రాష్ట్ర విద్యుత్ బోర్డు (కెఎస్ఇబి), కేరళ వాటర్ అథారిటీ (కేడబ్ల్యుఎ) నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లకు విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేశాయని సీనియర్ కౌన్సెల్ హరీష్ సాల్వే తెలిపారు. నిర్దేశిత సమయంలో కూల్చివేత పూర్తి చేయాలని సుప్రీం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణను అక్టోబరు 25కి వాయిదా వేసింది. కాగా జైన్స్ కోరల్ కోవ్, గోల్డెన్ కయలోరం, హెచ్ 20 హోలీ ఫెయిత్, ఆల్ఫా సెరీన్ సంస్థలే అనే నాలుగు అపార్ట్మెంట్ కాంప్లెక్సులు 2005కి ముందు ఇక్కడ భవన సముదాయ నిర్మాణ అనుమతి పొందాయి. మరాదు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు ఈ అనుమతి లభించింది. అయితే నవంబర్ 2010 లో మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయబడింది. దీంతో వివాదం నెలకొంది. ప్రతి అపార్ట్మెంట్ ధర రూ .50 లక్షల నుంచి రూ .1.5 కోట్ల మధ్య ఉంటుందని అంచనా. ఈ వ్యవహారంలో నలుగురు బిల్డర్ల మీద కేసులు నమోదయ్యాయి. విద్యుత్, నీటి సరఫరాను నిలిపివేతతో బిల్డర్లు ఏర్పాటు చేసిన జనరేటర్ జైన్స్ కోరల్ కోవ్ కాంప్లక్స్‌లో 122 అపార్ట్మెంట్లు ఉండగా, జైన్ హౌసింగ్ అండ్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్ ప్రతి ఫ్లాట్‌ను రూ .86 లక్షలకు విక్రయిస్తోంది. కెపి వర్కీ అండ్‌వీఎస్ బిల్డర్స్ నిర్మించిన గోల్డెన్ కయలోరం ఫ్లాట్ ధర 50-60 లక్షల మధ్య ఉంటుంది. హోలీ ఫెయిత్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెచ్ 2 ఓ హోలీ ఫెయిత్ ఫ్లాట్ 1.25 - 1.5 కోట్ల రూపాయలకు విక్రయిస్తోంది. ఆల్ఫా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆల్ఫా సెరెన్ ఫ్లాట్ ధర 1.07 కోట్ల నుండి 1.33 కోట్ల మధ్య ఉంటుంది. ఆత్మహత్యే శరణ్యం మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై ఫ్లాట్ యజమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ విభాగాల తప్పునకు తమకు శిక్ష విధించడం సరికాదని వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇళ్లను ఖాళీ చేసేది లేదని ప్రాన్సిస్ అనే ఫ్లాట్ ఓనర్ స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవడమే మార్గం అని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ సుహాస్, హరీష్ సాల్వే పర్యటన సందర్భంగా అపార్ట్మెంట్ వాసుల ఆందోళన -
ఆదిభట్లలో ఆర్క్ ప్రాజెక్ట్
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో అందుబాటు ధరల్లో గృహాలను నిర్మించి సామాన్యుల సొంతింటి కలను నిజం చేస్తున్న ఆర్క్ గ్రూప్.. ఆదిభట్లలో 2.80 లక్షల చ.అ.ల్లో అపార్ట్‌మెంట్‌ను నిర్మించనుంది. సూర్యాపేటలో 2 వేల గజాల్లో ఐదంతస్తుల అపార్ట్‌మెంట్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తోంది. 40 ఫ్లాట్లుండే ఈ ప్రాజెక్ట్‌ను 2 నెలల్లో ప్రారంభిస్తామని ఆర్క్ గ్రూప్ సీఎండీ గుమ్మి రాంరెడ్డి తెలిపారు. ►కర్మన్‌ఘాట్‌లో 92 వేల చ.అ.ల్లో ఆప్తా ప్రాజెక్ట్‌ను నిర్మించనున్నాం. 70 యూనిట్లు. కొంగరకలాన్‌లో లే అవుట్ కూడా ప్లాన్ చేస్తున్నాం. గాజులరామారంలోని ఉషాముళ్లపూడి రోడ్లో 1.45 లక్షల చ.అ.ల్లో హేమ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. 7 అంతస్తుల్లో మొత్తం 108 గృహాలుంటాయి. 1000 నుంచి 1700 చ.అ.ల్లో 2, 2.5 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3900. ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేస్తాం. ► బొల్లారంలో ఆర్క్ హోమ్స్ ఫేజ్–2ను ప్రారంభించనున్నాం. మొత్తం 560 గృహాల ప్రాజెక్ట్ ఇది. ఫేజ్–1లో 420 ఫ్లాట్లను నిర్మించేశాం. 24 వేల చ.అ.ల్లో క్లబ్ హౌజ్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల వసతుల ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే కొనుగోలుదారులు నివాసముంటున్నారు కూడా. ఫేజ్–2లో 140 గృహాలను నిర్మించనున్నాం. 1075–1510 చ.అ.ల్లో 2, 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3700. -
మరోసారి..
తూర్పుగోదావరి ,సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): ఏవీ అప్పారావు రోడ్డు గెయిల్ కార్యాలయం ఎదురుగా గతంలో ప్రసాదిత్య మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా సుమారు 30 అడుగుల లోతు తవ్వడంతో పక్కనే ఉన్న అపార్టుమెంటు ఒరిగిన సంగతి తెలిసిందే. తాజాగా సోమవారం పూడ్చిన మట్టి ఒక్కసారిగా కిందకి జారిపోయింది. దాంతో అపార్టుమెంటు వాసులు భయాందోళనలు వ్యక్తం చేశారు. గత ఏడాది నవంబర్ 24న జరిగిన సంఘటనతోనైనా నిర్మాణదారులు కనీసం చర్యలు తీసుకోకపోవడం విడ్డురంగా ఉందని అపార్ట్మెంట్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు ఎకరాల స్థలంలో 70 అడుగల మేర లోపలికి తవ్వారు. పార్కింగ్ కోసం రెండు సెల్లార్లు, ఆపై భవనం నిర్మించేలా ప్రణాళికలు రచించారు. చుట్టూ 13 అడుగుల మేర స్థలం వదిలి పునాదులు తవ్వాల్సి ఉండగా అడుగు కూడా వదలకుండా నాలుగు వైపులా తవ్వేయడంతో ఆ స్థలానికి అనుకుని ఉన్న జీఈవీ గ్రాండు అపార్టుమెంటు ప్రహరీ దెబ్బతింది. అయినా ఆగకుండా పనులు చేయడంతో గత ఏడాది నవంబర్ 24న అపార్టుమెంటు సెట్‌బ్యాక్ స్థలం కుంగిపోవడంతో పాటు వంద అడుగుల మేర ప్రహరీ కూలిపోయింది. దీంతో అపార్టుమెంటులో నివసిస్తున్న కుటుంబాలు భయాందోళనతో బయటకు పరుగులు తీశాయి. తరువాత జేఎన్టీయూకే ప్రొఫెసర్లు, నిపుణులతో సంబంధిత ప్రాంతాన్ని పరిశీలించి అపార్టుమెంటుకు ఎటువంటి ప్రమాదం లేకుండా రిటైనింగ్ వాల్‌ను అంచెల విధానంలో బలోపేతం చేసేలా ప్రణాళిక రూపొందించారు. కానీ భవన యాజమానుల నిర్లక్ష్యం వలన సోమవారం రాత్రి మరలా కొంతమేర రక్షణ గోడ కూలిపోయింది. దీంతో మరలా ఆపార్టుమెంటు వాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. సోమవారం జరిగిన సంఘటనతో నగరపాలక సంస్థ కమిషనర్ సుమిత్ కుమార్, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు పరిస్థితిని సమీక్షించారు. మట్టి జారిన ప్రాంతానికి ఆనుకుని ఉన్న ప్లాట్లలోని రెండు కుటుంబాలను ఖాళీచేయించారు. నిర్లక్ష్య సమాధానంఇస్తున్న నిర్మాణ సిబ్బంది సోమవారం రాత్రి ఆపార్టుమెంటుకు విద్యుత్‌ను సరఫరా చేసే ఒక ట్రాన్స్ఫార్మర్ కూలిపోయింది. ఇదేంటిని నిర్మాణానికి సంబంధించిన సిబ్బందిని అడిగితే తమకు అన్ని అనుమతులు ఉన్నాయని, ట్రాన్స్ఫార్మర్ కూలిన మాట వాస్తవమేనని, దీని నుంచి విద్యుత్ సరఫరా అయ్యే అపార్టుమెంటు బ్లాకులోని వారిని హోటల్ రూమ్‌లకు మార్చామని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. విద్యుత్ పునరుద్ధరణ పూర్తయ్యాక మరలా వారిని అపార్ట్మెంట్కి చేరుస్తామన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా పరిశీలించారని చెప్పుకొచ్చారు. కాగా మంగళవారం అక్కడ పరిస్థితి తెలుసుకోవడానికి వెళ్లిన పాత్రికేయులను లోనికి అనుమతించలేదు. ‘గుడా’ నుంచిఅన్ని అనుమతులు పొందారా? మల్టీప్లెక్స్ నిర్మాణ సమయంలో ఏడు లేయర్ల లోతు అంటే సుమారు 10 మీటర్లు లోతు తవ్వుకోవడానికి అనుమతులు ఉంటాయి. కానీ మొదట నాలుగు లేయర్ల తవ్వకం పూర్తయిన వెంటనే నిర్మాణానికి సుమారు ఐదారు మీటర్ల దూరంలో ఉండే అపార్టుమెంటు ప్రహరీ కూలిపోయింది. దాంతో అక్కడ మల్టీప్లెక్స్ నిర్మాణానికి అనువైన ప్రాంతమేనా అనే సందేహాలు కలుగుతున్నాయి. గుడా నుంచి భవన నిర్మాణానికి కావలసిన అనుమతులు అన్నీ ఉన్నాయా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారులు, గుడా సంబంధిత వ్యక్తులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనేది మరో ప్రశ్న. అధికార టీడీపీ నాయకులు వెనుకుండడం వల్లే వారందరూ నోరుమెదపడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నవంబర్ 24, 2018ఏవీ అప్పారావు రోడ్డు.. గెయిల్ కార్యాలయం ఎదురుగాప్రసాదిత్య మల్టీప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.సుమారు 30 అడుగుల లోతులో మట్టి తవ్వకం పనులు చేపట్టగా.. పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పిల్లర్లు ఒరిగాయి. అప్పట్లో ఈ సంఘటన జిల్లాలోసంచలనం సృష్టించింది.వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అపార్ట్మెంట్లో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించారు. అయితే జేఎన్టీయూకే బృందం భూ పరీక్షలు నిర్వహించి కొన్ని సూచనలు చేయడంతో ఆ ప్రకారం అక్కడ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు అక్కడే తిరిగి నివాసం ఉంటున్నారు. ఆరు నెలల తర్వాత.. జేఎన్టీయూకే బృందం ఇచ్చిన నివేదిక ప్రకారం అపార్ట్మెంట్ చుట్టూ మట్టితో పూడ్చి పటిష్టం చేసే పనులు చేపట్టారు. పూడ్చిన మట్టి సోమవారం ఒక్కసారిగా కిందకి అండలుగా జారిపోయింది. దీంతో అపార్ట్మెంట్ వాసుల్లో మళ్లీకలకలం మొదలైంది. -
పంచాయతీకో కార్యదర్శి
నేరడిగొండ(బోథ్): గ్రామపంచాయతీల్లో నూతన కార్యదర్శుల నియామకానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గ్రామ పంచాయతీకో కార్యదర్శిని నియమించింది. దీంతో గ్రా మపంచాయతీలు అభివృద్ధి పథంలో పయనించనున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో 467 గ్రామపంచాయతీలు ఉండగా కార్యదర్శులు 132 మంది మాత్రమే ఉన్నారు. ఈ లెక్కన 335 మంది పంచాయతీ కార్యదర్శుల కొరత ఉండేది. ఒక్కో కార్యదర్శికి మూడు నుంచి నాలుగు గ్రామాల చొప్పున అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో 2018 అక్టోబర్‌లో ప్రభుత్వం గ్రామపంచాయతీ సెక్రెటరీల నియామకం కోసం నోటిఫికేషన్ విడుదల చేసి ఎంపిక ప్రక్రియ చేపట్టింది. రాత పరీక్షకు హాజరైన అభ్యర్థుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేపట్టారు. డిసెంబర్లో సర్టిఫికెట్ల పరిశీలన సైతం జరిపారు. అనంతరం కొంద రు అభ్యర్థులు ప్రభుత్వం రోల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించడం లేదని, పరీక్షల్లో ప్రశ్నలను తప్పుగా ఇచ్చారని కోర్టుకు వెళ్లిన విషయం విధితమే. దీంతో నియామకాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కోర్టు క్లియరెన్స్ ఇవ్వడంతో ఇప్పటికే కార్యదర్శి ఉద్యోగాలకు ఎంపికైన వారికి శుక్రవారం నియామక పత్రాలను అందించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ కార్యదర్శుల నియామకానికి సంబంధించిన చర్యలు వెంటనే చేపట్టాలనే ఆదేశాలతో పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. 290 మంది జూనియర్ పంచాయతీల నియామకం ఆదిలాబాద్ జిల్లాలో 335 పంచాయతీ కార్యదర్శులు ఖాళీగా ఉండగా ఇటీవల రాసిన పంచాయతీ పరీక్షలో ఫలితాలు సా«ధించిన 318 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో 290 మందికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులుగా నియామక పత్రాలు అందించారు. మరో 28 మందిని పూర్తి వివరాలు సేకరించి నియామక పత్రాలు అందజేస్తామని జిల్లా అధికారులు తెలిపారు. త్వరలోనే అన్ని స్థానాల్లో నియామకం చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. తీరనున్న సమస్యలు.. గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులదే కీలక పాత్ర. జనన, మరణ ద్రువీకరణ పత్రాలతోపాటు 18 రకాల సర్టిఫికెట్లు ఇచ్చేది వారే. గ్రామాభివృద్ధి కోసం విడుదలయ్యే నిధులు ఎన్ని, ఖర్చు చేసింది ఎంత, తాగునీరు, పన్నుల వసూళ్లు, అత్యవసరంగా గ్రామాల్లో చేపట్టాల్సిన పనులు, తదితర అంశాలన్ని కార్యదర్శులే చేపట్టాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న కార్యదర్శుల పోస్టులు ఖాళీగా ఉండడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడింది. నూతనంగా జూనియర్ కార్యదర్శులు గ్రామానికొకరు రానుండడంతో సమస్యలు పరిష్కారం కానున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. నూతనంగా ఎంపికైన కార్యదర్శులకు నియామక పత్రాలను అందజేశాం. వీరికి సంబంధించిన సర్టిఫికెట్లను గతంలోనే పరిశీలించాం. గ్రామానికో కార్యదర్శి నియామకంతో పల్లెల్లో సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారానికి నోచుకుంటాయి. దీంతో పాలన సౌలభ్యంగా ఉంటుంది. మరిన్ని ఖాళీలను భర్తీ చేస్తాం. – టి.సాయిబాబా, జిల్లా పంచాయతీ అధికారి సంతోషంగా ఉంది కాస్త ఆలస్యమైనా నియామకాలు చేపట్టడం సంతోషంగా ఉంది. 2018 అక్టోబర్ 10న రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలను అదే ఏడాది డిసెంబర్ 18న వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన సైతం చేశాక న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నం కావడంతోపాటు శాసన మండలి ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు రావడంతో నియామకంలో ఆలస్యం జరిగింది. శుక్రవారం నియామక పత్రం అందజేయడంతో సంతోషంగా ఉంది. – కొప్పుల రవీందర్, వడూర్ -
రాంకీ నుంచి 4 ప్రాజెక్ట్‌లు
సాక్షి, హైదరాబాద్: రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ దక్షిణాదిలో శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో 3, చెన్నైలో 1 సరికొత్త ప్రాజెక్ట్‌తో కొనుగోలుదారుల ముందుకొచ్చింది. నల్లగండ్లలో ఇప్పటికే రాంకీ వన్ గెలాక్సియా ప్రాజెక్ట్‌ను నిర్మించిన రాంకీ.. తాజాగా ఫేజ్–2 ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. జీ+14 అంతస్తుల నిర్మాణంలో 2 బ్లాక్స్‌లో మొత్తం 412 యూనిట్లుంటాయి. 1265 నుంచి 1665 చ.అ. విస్తీర్ణాల్లో 2, 3 బీహెచ్‌కే గృహాలను నిర్మిస్తుంది. మహేశ్వరంలోని రాంకీ డిస్కవరీ సిటీలో ది హడ్లీ పేరిట క్లస్టర్ విల్లా ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుంది. 9.98 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 125 విల్లాలుంటాయి. విస్తీర్ణాలు 174 నుంచి 402 గజాల్లో ఉంటాయి. ప్రారంభ ధర రూ.1.05 కోట్లు. ఇదే ప్రాంతంలో 3.81 ఎకరాల్లో గ్రీన్ వ్యూ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మొత్తం 200 ఫ్లాట్లు. 1130 నుంచి 2060 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. ప్రారంభ ధర రూ.46 లక్షలు. చెన్నైలోని కలీకుప్పంలో 1.31 ఎకరాల్లో లెమన్గ్రాజ్ (ఆర్డబ్ల్యూడీ) ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. మొత్తం 129 గృహాలు. 1047 నుంచి 1498 చ.అ. మధ్య 2, 3 బీహెచ్‌కే గృహాలుంటాయి. రాంకీ ఎస్టేట్స్ అండ్ ఫామ్స్ గత రెండు దశాబ్ధాలుగా హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు నగరాల్లో 80 లక్షల చ.అ.ల్లో నివాస, వాణిజ్య సముదాయాలను నిర్మించింది. వీటిల్లో లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలు, ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు, హై, మిడ్, లో రైజ్ అపార్ట్మెంట్లు, కాంటెంపరరీ వాణిజ్య సముదాయాల ప్రాజెక్ట్‌లున్నాయి. ప్రస్తుతం కోటి చ.అ.ల్లో పలు నివాస ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నాయి. 20 లక్షల చ.అ.ల్లో పలు ప్రాజెక్ట్‌లు ప్రారంభ దశలో ఉండగా.. మరొక 1.8 కోట్ల చ.అ.లో ప్రాజెక్ట్‌లు పైప్‌లైన్‌లో ఉన్నాయి. -
స్టూడియో అపార్ట్మెంట్ రూ.11.20 లక్షలు!
సాక్షి, హైదరాబాద్: అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, అందుబాటు ధరల్లో నివాస, లే అవుట్ ప్రాజెక్ట్‌లను నిర్మించే శ్రీ శ్రీ గృహ నిర్మాణ్ ఇండియా.. ఎయిరో సిటీ పేరిట సుందరమైన ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. ఇబ్రహీంపట్నం మంగల్‌పల్లిలో 6 ఎకరాల్లో నిర్మిస్తున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి కొనుగోలుదారులకు అందిస్తామని కంపెనీ ఎండీ భూపతి రాజు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తి వివరాలు... ►6 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో 620 గృహాలను నిర్మిస్తున్నాం. 10 బ్లాక్‌లు. ఒక్కో బ్లాక్ సెల్లార్, స్టిల్ట్ ప్లస్ 7 అంతస్తుల్లో ఉంటుంది. 350 చ.అ. స్టూడియో అపార్ట్మెంట్స్, 750 చ.అ.లలో సింగిల్ బెడ్ రూమ్, 1000 చ.అ.ల్లో 2 బీహెచ్‌కే, 1450 చ.అ.ల్లో 3 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. ధర చ.అ.కు రూ.3500. సింగిల్ బెడ్ రూమ్ ధర రూ.31.25 లక్షలు, స్టూడియో అపార్ట్మెంట్ ధర సౌకర్యాలతో (పార్కింగ్ రూ.2.50 లక్షలు, వసతులకు రూ.2.50 లక్షలు) రూ.16.20 లక్షలు. ► 2016లో ఎయిరో సిటీ నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. ఈ నెల ముగింపు నాటికి ప్రాజెక్ట్ పూర్తవుతుంది. 50, 40, 30 ఫీట్ల రోడ్లు, 24 గంటల పాటు సెక్యూరిటీ, ఇంటర్‌కామ్ ఫెసిలిటీ, పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంటాయి. సగానికి పైగా ఫ్లాట్లు అమ్ముడుపోయాయి. ఈ ప్రాజెక్ట్‌కు ఎదురుగానే 34 ఎకరాల్లో ఎయిరో పార్క్ సౌత్ పేరిట లే అవుట్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. రోజూ 25 వేల మంది ఉద్యోగులు.. ►తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆదిభట్ల, పటేల్‌గూడ, రావిర్యాల, కొంగర ప్రాంతాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఐటీ, ఎయిరో స్పేస్ కంపెనీలతో పాటూ కొంగరలో కలెక్టరాఫీసు ఏర్పాటుతో స్థిరమైన అభివృద్ధి జరుగుతుంది. స్థానికంగా పెద్దగా గృహ అవసరాలు లేకపోవటంతో ప్రతి రోజు టీసీఎస్, కాగ్నిజెంట్, టాటా అడ్వాన్స్, బీడీఎల్, ఆక్టోపస్ వంటి కంపెనీలకు, స్థానిక ప్రభుత్వ కార్యాలయాలకు 25 వేల మంది హైదరాబాద్ నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. ►18 వేల చ.అ.ల్లో క్లబ్ హౌస్ ఉంటుంది. ల్యాండ్ స్కేపింగ్, స్విమ్మింగ్ పూల్, జిమ్, మెడిటేషన్, పార్టీ హాల్స్, మినీ థియేటర్, షటిల్ కోర్టు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, జాగింగ్ ట్రాక్, రెస్టారెంట్, సూపర్ మార్కెట్, విజిటర్స్ లాంజ్ వంటి ఏర్పాట్లుంటాయి. ప్రాజెక్ట్ ఆవరణలో అపోలో ఆసుపత్రి క్లినిక్‌ను ఏర్పాటు చేసింది. 24 గంటలు డాక్టర్, నర్సు అందుబాటులో ఉంటారు. -
విస్తీర్ణం తగ్గింది!
దేశంలో నివాస సముదాయాల విస్తీర్ణాలు తగ్గాయి. ఏడాది కాలంలో ఏడు ప్రధాన నగరాల్లో ఫ్లాట్ల సేలబుల్ ఏరియా 15–17 శాతం వరకు క్షీణించాయి. డెవలపర్లు కొత్త అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు తగ్గించి.. ధరలను మరింత అందుబాటులోకి తీసు కొచ్చారని ప్రాపర్టీ టెక్నాలజీ సేవల కంపెనీ స్క్వేర్ యార్డ్స్ తెలిపింది. సాక్షి, హైదరాబాద్: గత రెండేళ్లుగా గుర్గావ్, బెంగళూరు, చెన్నై, పుణె, కోల్‌కతా, ముంబై, నోయిడా, హైదరాబాద్ నగరాల్లోని నిర్మాణ సంస్థలు కొత్త అపార్ట్మెంట్ల విస్తీర్ణాలు తగ్గిస్తున్నాయి. 2017లో 1130 చ.అ.లుగా ఉన్న 2 బీహెచ్‌కే ఫ్లాట్ సేలబుల్ ఏరియా.. 2018 నాటికి 963 చ.అ.లకు తగ్గింది. 2017లో 1754 చ.అ.లుగా ఉన్న 3 బీహెచ్‌కే ఫ్లాట్ సేలబుల్ ఏరియా.. 2018 నాటికి 1458 చ.అ.లకు తగ్గింది. అంటే 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో 15 శాతం, 3 బీహెచ్‌కేలో 17 శాతం వరకూ సేలబుల్ ఏరియా విస్తీర్ణం తగ్గిందన్నమాట. పెట్టుబడికి విలువ.. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చట్టం కార్పెట్ ఏరియా, సేలబుల్ ఏరియాలపై స్పష్టమైన నిర్వచనాన్ని ఇచ్చింది. ఫ్లాట్ల ధరలను కార్పెట్ ఏరియా ప్రాతిపదికన కాకుండా సేలబుల్ ఏరియా ప్రకారం నిర్ణయించాలని తెలిపింది. దీంతో దేశంలోని వేర్వేరు మెట్రో నగరాల్లో అపార్ట్మెంట్ల ధరల్లో వ్యత్యాసం కనిపిస్తుంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు డెవలపర్లకు అపార్ట్మెంట్ల విస్తీర్ణాలను తగ్గించి నిర్మాణాలు చేపడుతున్నారు. సేలబుల్ ఏరియాను తగ్గించడంతో లే అవుట్లో ఎక్కువ స్థలం అందుబాటులోకి వస్తుంది. దీంతో కొనుగోలుదారుల చేతిలో ఎక్కువ స్థలం అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్‌లో వృద్ధి; ముంబైలో క్షీణత మెట్రో నగరాల్లో ఫ్లాట్ల విస్తీర్ణాలు తగ్గుతుంటే.. హైదరాబాద్‌లో మాత్రం పెరుగుతున్నాయి. ఏడాదిలో నగరంలో 2 బీహెచ్‌కే విస్తీర్ణంలో 2 శాతం, 3 బీహెచ్‌కేలో 1 శాతం వృద్ధి నమోదైంది. 2017లో 1261 చ.అ.లుగా ఉన్న 2 బీహెచ్‌కే సేలబుల్ ఏరియా.. 2018 నాటికి 1291 చ.అ.కి, 1919 చ.అ.గా ఉన్న 3 బీహెచ్‌కే 1935 చ.అ.లకు పెరిగాయి. ఇక, ఫ్లాట్ల విస్తీర్ణాల తగ్గింపులో ముంబై ప్రథమ స్థానంలో నిలిచింది. 2 బీహెచ్‌కేలో 25 శాతం, 3 బీహెచ్‌కేలో 26 శాతం తగ్గుముఖ పట్టాయి. ముంబైలో 2 బీహెచ్‌కే 1084 చ.అ. నుంచి 809 చ.అ.లకు, 3 బీహెచ్‌కే 1710 చ.అ. నుంచి 1265 చ.అ.లకు తగ్గింది. -
అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య
హైదరాబాద్: అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఓ విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. సికింద్రాబాద్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం కుమార్తె ఎస్.హర్షిత (21) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతోంది. గురువారం 11.30కి నల్లగండ్లలోని హిమసాయి అపార్ట్‌మెంట్‌కు వచ్చింది. అపార్ట్మెంట్లోని 1401 ఫ్లాట్‌కు వెళ్తున్నట్టు సెక్యూరిటీ రిజిస్టర్లో రాసింది. 12.30 గంటల సమయంలో అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడివారు అందించిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరిపారు. అపార్ట్మెంట్ వాసులను హర్షిత గురించి ప్రశ్నించగా తమకెవరికీ తెలియదని జవాబు చెప్పారు. దీంతో పోలీసులు తనిఖీలు చేయగా.. 14వ అంతస్తులో ఆమె బ్యాగ్ లభించింది. అందులో బుక్స్, టిఫిన్, వాటర్ బాటిల్‌తో పాటు సెల్‌ఫోన్ లభించాయి. అందులో ఉన్న వివరాలను చూసి మృతురాలు హర్షితగా గుర్తించారు. సెల్ఫోన్లో ఉన్న నంబర్ ద్వారా తండ్రి సుబ్రహ్మణ్యంకు ఫోన్ చేసినా సమాధానం రాకపోవడంతో హెచ్‌సీయూ అధికారులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాం«ధీ ఆస్పత్రికి తరలించారు. వివిధ కోణాల్లో పోలీసుల దర్యాప్తు ఈస్ట్ మారేడుపల్లిలోఉండే హర్షిత తల్లి అనురాధ భర్తకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ చదువుతున్న హర్షిత.. యూనివర్సిటీ నుంచి వెళ్లి నల్లగండ్లలోని హిమసాయి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడటం పలు అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఇదే అపార్ట్‌మెంట్‌కు ఎప్పుడైనా వచ్చిందా...? అక్కడ తెలిసిన వారు ఎవరైనా ఉన్నారా...? ఆత్మహత్య చేసుకోవడంతో వారు తమకు సంబంధం లేనట్లు వ్యవహరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీలోని సౌత్ క్యాంపస్ నుంచి చూస్తే హిమసాయి అపార్ట్మెంట్ ఎత్తుగా కనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే అపార్ట్‌మెంట్‌ను ఎంచుకుందా అనే అభిప్రాయం కలుగుతోంది. అపార్ట్మెంట్లోని బోర్డులో చూసి నంబర్ చెప్పి మరో ఫ్లాట్‌లోకి వెళ్లి పై అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఆత్మహత్య కోసమే అపార్ట్‌మెంట్‌ను ఎంచుకుందా..? సెమిస్టర్లో ఫెయిల్ కావడంతోనే మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తల్లి అనురాధ తన కూతురు బాగా చదువుతుందని ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్టు పోలీసులకు తెలిపింది. అపార్ట్మెంట్ పైన ఉన్నప్పుడే తల్లికి ఫోన్ చేయగా ఆమె లిఫ్ట్ చేయలేదని, దీంతో బాయ్ అని తల్లికి మెసేజ్ పెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకునేందుకు వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
లైంగిక దాడి.. మేడపై నుంచి తోసి
ముంబై : యువతిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ యువకుడు అనంతరం ఆమెను రెండో అంతస్తుపై నుంచి కిందకు తోసేశాడు. ఈ సంఘటన గురువారం ముంబైలోని ఎమ్ఐడీసీ ఏరియాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైలోని ఎమ్ఐడీసీకి చెందిన 17 ఏళ్ల యువతి అత్తమామలతో కలిసి ఓ అపార్ట్మెంట్లోని మూడవ అంతస్తులో నివాసముంటోంది. అదే అపార్ట్మెంట్లోని రెండో అంతస్తులో నివాసముంటున్న 21 ఏళ్ల యువకుడు ఆ యువతి పని మీద బయటకు వెళుతున్న సమయంలో ఇంటిలోపలికి లాక్కెల్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి చాలా సేపటినుంచి కనిపించకపోవటంతో ఆమె మామ వెతకటం మొదలుపెట్టాడు. యువతిని రెండో ఫ్లోర్‌లోని యువకుడు ఇంటి లోపలికి లాక్కెళ్లాడన్న విషయం తెలుసుకుని అతడి ఇంటి తలుపు తట్టాడు. దీంతో భయాందోళనకు గురైన యువకుడు ఆమెను రెండో అంతస్తులోని ఇంటి కిటికీ నుంచి కిందకు తోసేసి అక్కడి నుంచి పరారయ్యాడు. రెండో అంతస్తు మీద నుంచి కిందపడ్డ యువతి తీవ్ర గాయాలపాలైంది. ఇది గమనించిన కొంతమంది ఆమె మామకు సమాచారమివ్వటంతో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
అపార్ట్‌మెంట్‌పై ఆరోగ్య పంటలు!
వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకొని, ఆ కంపోస్టుతో మేడపైన ఎంచక్కా సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడం బాధ్యత గల పౌరుల లక్షణం. అటువంటి ఆదర్శప్రాయులు ఇప్పుడు అన్ని నగరాల్లోనూ ఉన్నారు. అయితే, ఈ పని చేస్తున్న అపార్ట్‌మెంట్‌వాసులు ఎక్కడైనా ఉన్నారా? అవును, ముంబైలో ఉన్నారు! వారే మాతాశ్రీ పెర్ల్ అపార్ట్‌మెంట్‌వాసులు. మాహిమ్ ప్రాంతంలోని ఈ 22 అంతస్తుల మాతాశ్రీ పెర్ల్ అపార్ట్మెంట్లో 65 ఫ్లాట్లున్నాయి. ఇందులో నివాసం ఉంటున్న వారంతా గత ఏడాది అక్టోబర్ 2న స్వచ్ఛతా దివస్ సందర్భంగా భలే నిర్ణయం తీసుకున్నారు. ‘మా ఇళ్లలో నుంచి తడి చెత్తను బయట పారెయ్యం. చెత్తను కంపోస్టుగా మార్చి సేంద్రియ పంటలు పండించుకుంటాం’ అని ప్రతిన బూనారు. 65 కుటుంబాల నుంచి చెత్తను సేకరించి, ఆ క్యాంపస్‌లోనే కంపోస్టు తయారు చేసి.. ఆ కంపోస్టుతోనే అపార్ట్మెంట్ భవనం పైన ఎంచక్కా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు సాగు చేస్తున్నారు. కుళ్లి మట్టిలో కలిసిపోయే తడి చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ వాళ్లకు ఇవ్వకుండా.. ఏరోబిక్ బయో కంపోస్టర్ల ద్వారా కంపోస్టు తయారు చేస్తున్నారు. నెలకు 700–800 కిలోల వంటింటి తడి చెత్త, 300 కిలోల పొడి చెత్తను రీసైకిల్ చేయడం ద్వారా.. నెలకు 60–70 కిలోల చక్కని సేంద్రియ ఎరువు అందుబాటులోకి వస్తోంది. 3 నెలల్లో ఇంటిపంటల సాగు ప్రారంభానికి అవసరమైనంత కంపోస్టు సమకూరింది. ఇప్పుడు మాతృశ్రీ పెర్ల్ అపార్ట్మెంట్ టెర్రస్ పచ్చని సేంద్రియ ఇంటిపంటలతో కళకళలాడుతోంది. ఆర్.యు.ఆర్. గ్రీన్ లైఫ్ అనే సంస్థ తోడ్పాటుతో మాతృశ్రీ పెర్ల్ ఈ ఘన విజయాన్ని సాధించింది. పిల్లలు, గృహిణులు, సీనియర్ సిటిజన్లతో ఏర్పాటైన ‘గ్రీన్ చాంపియన్ల’ బృందం ఈ సామూహిక ఇంటిపంటల సాగును పర్యవేక్షిస్తున్నారు. మార్చి ఆఖరు నాటికే రెండు విడతలుగా ఆకుకూరలు కోసి.. అపార్ట్మెంట్ వాసులందరూ తాము పండించుకున్న ఇంటి కూరలను రుచి చూశారు. ఇంటిపంటల రుచే వేరబ్బా.. అని లొట్టలు వేస్తున్నారు. నెలకు వెయ్యి నుంచి 1,200 కిలోల చెత్తను మున్సిపల్ కార్పొరేషన్ నెత్తిన పడెయ్యకుండా కంపోస్టుకు ఉపయోగించారు. మన అపార్ట్మెంట్ల టెర్రస్లూ పచ్చబడితే ఎంత బాగుంటుందో..! -
190 కోట్ల నగదు.. 400 హ్యాండ్‌బ్యాగ్‌లు
కౌలాలంపూర్: మలేసియా మాజీ ప్రధాని నజీబ్ రజాక్‌కు చెందిన అపార్ట్మెంట్లలో పోలీసులు సోదాలు నిర్వహించి దాదాపు రూ.190 కోట్ల (2.86 కోట్ల డాలర్ల) విలువైన నగదు, అత్యంత ఖరీదైన 400 హ్యాండ్‌బ్యాగ్‌లను జప్తు చేశారు. మరెన్నో ఆభరణాలు, చేతి గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై ఉన్న తీవ్ర అవినీతి ఆరోపణలే తాజా ఎన్నికల్లో ఓటమికి ప్రధాన కారణం. మలేసియా ప్రభుత్వానికి చెందిన 1ఎండీబీ అనే సంస్థ డబ్బునూ నజీబ్, ఆయన కుటుంబసభ్యులు, సన్నిహితులు కలసి కాజేశారనే ఆరోపణలున్నాయి. అవినీతి ఆరోపణలపై కొత్త ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో గతవారం రోజుల్లో నజీబ్ ఇల్లు సహా 12 చోట్ల పోలీసులు సోదాలు నిర్వహించారు. -
చల్లగాలి కోసం కిటికీ తీస్తే..
రాజేంద్రనగర్: చల్లటి గాలికోసం ప్రధాన ద్వారం పక్కనే ఉన్న కిటికీని తెరిచి ఉంచగా ఆ కిటికీలోంచి దొంగలు దూరి ఇల్లును కాజేసిన ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. 30 తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలతోపాటు రూ.20 వేల నగదును ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూర్యాపేటకు చెందిన కొత్త జంట విజయ్, అనూష. వీరిద్దరికి 20 రోజుల కిందట వివాహమవడంతో హైదర్షాకోట్లోని మాధవీనగర్‌లో కొత్త కాపురం పెట్టారు. స్థానికంగా వీరి బంధువులు ఉండడంతో ఇంటిని కోనుగోలు చేసి నివసిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసే విజయ్ శనివారం ఉద్యోగానికి వెళ్లి రాత్రి 8 గంటల ప్రాంతంలో ఇంటికి వచ్చాడు. భార్యాభర్తలు ఇద్దరు భోజనాలు పూర్తిచేసుకొని నిద్రపోయారు. వేడి ఎక్కువగా ఉండడంతో తలుపు పక్కనే ఉన్న కిటికీని చల్లగాలి కోసం తెరిచి ఉంచారు. ఆదివారం ఉదయం 5 గంటల ప్రాంతంలో విజయ్‌కి ఫోన్ రావడంతో బయటకు వచ్చి తలుపు తీసేందుకు ప్రయత్నించాడు. బయట నుంచి గడియ ఉండడంతో పక్క ఇంట్లోని బంధువులకు ఫోన్‌చేసి గడియ తీయించాడు. అయితే ఆ తర్వాత లేచిన అనూష బాల్కాని పక్కనే ఖాళీ స్థలంలో తన ఆభరణాల ఖాళీ డబ్బాలు పడి ఉండడంతో గమనించింది. వెంటనే భార్యాభర్తలు ఇంట్లోకి వెళ్లి చూడగా ఆభరణాలు కనిపించలేదు. దొంగతనం జరిగింది అని గ్రహించి నార్సింగి పోలీసులకు సమాచారం అందించారు. మాదాపూర్ డీసీపీ వెంకట్రావు, ఏసీపీ శ్యామ్సుందర్తో పాటు క్లూస్, డాగ్‌స్క్వాడ్ సిబ్బంది ఇంటిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్లంబర్‌పై అనుమానం అయితే ఈ దొంగతనానికి పాల్పడింది ప్లంబర్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ శనివారం మధ్యాహ్నం ఓ ప్లంబర్‌ను పిలిపించి బాత్రూమ్లో వాటర్ హీటర్‌ను బిగించే పనిని చెప్పాడు. పనులు చేసి వెళ్లిన ప్లంబర్‌పైనే అనుమానం ఉందని విజయ్ తెలిపాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
గృహ నిర్మాణంలో... రూ.200 కోట్ల స్కాం
ధర్మవరంటౌన్ : ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను నిజం చేస్తామంటూ గృహ నిర్మాణ పథకం ద్వారా అపార్ట్మెంట్లు నిర్మించి ఇస్తామని చెబుతూ అవినీతికి బాటవేసిందని, ఒక్క ధర్మవరం నియోజకవర్గంలోనే రూ.200 కోట్ల స్కాంకు టీడీపీ ప్రజా ప్రతినిధులు తెరలేపారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వాలు పేదలకు ఉచితంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సింది పోయి లబ్ధిదారులపై బ్యాంక్ భారం మోపి నెల నెలా రూ.4 వేలు చెల్లించేలా ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. వివిధ పథకాల పేరుతో రూ.500కే ఇళ్లు నిర్మించి ఇస్తామని పేద ప్రజలకు భ్రమలు కల్పిస్తోందన్నారు. రూ.200 కోట్ల స్కాం ధర్మవరం నియోజకవర్గంలో అపార్ట్మెంట్ నిర్మాణంలో రూ.200 కోట్ల స్కాంకు టీడీపీ ప్రజా ప్రతినిధి తెరలేపారని కేతిరెడ్డి పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు బినామీ కాంట్రాక్టర్లు అయిన సాహోజి పల్లంజీలకు ఈ కాంట్రాక్ట్ దక్కేలా ప్రభుత్వం పావులు కదిపిందన్నారు. ధర్మవరం నియోజకర్గంలో ఓ టీడీపీ ప్రజా ప్రతినిధి 8 వేల మందికి అపార్ట్మెంట్ ద్వారా ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం డీడీలు స్వీకరించిందన్నారు. అపార్ట్మెంట్ నిర్మాణం చదరపు గజం రూ.1.20 లక్షలు బహిరంగ మార్కెట్లో ధర ఉంటే ప్రస్తుతం లబ్ధిదారుల నుండి కాంట్రాక్టర్ వసూలు చేస్తున్న మొత్తం రెట్టింపుగా ఉందన్నారు. 8,832 మందికి బహిరంగ మార్కెట్లో అపార్ట్మెంట్లు నిర్మించి ఇవ్వడానికి రూ.300 కోట్లు ఖర్చు అయితే కాంట్రాక్టర్ మాత్రం రూ.544.67 కోట్లకు అంచనా వ్యయం పెంచేశారన్నారు. ఫలితంగా ఎటుచూసిన స్థానిక ప్రజా ప్రతినిధులకు రూ.200 కోట్లు అక్రమార్జన రూపంలో స్వాహాకు సిద్ధమయ్యారని విమర్శించారు. పట్టాలు మంజూరు చేయరా ? పట్టణంలో విభిన్న ప్రతిభావంతులకు ఇచ్చిన పట్టాలను వెనక్కి తీసుకొని ఆ స్థలంలో అపార్ట్మెంట్ నిర్మించేందుకు సన్నాహాలు ప్రారంభించారన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో తొలి విడతగా 8 వేల మందికి అపార్ట్మెంట్ ద్వారా ఇళ్లు నిర్మించేందుకు అనుమతి వచ్చినా వారికి అధికారులు పట్టాలు మంజూరు చేయక పోవడం దారుణమన్నారు. ఒకవైపు అపార్ట్మెంట్ నిర్మించి ఇస్తామని చెప్పి మరోవైపు మండలంలోని పోతులనాగేపల్లి, కుణుతూరు, రేగాటిపల్లి వద్ద వందల ఎకరాల భూములను స్థల సేకరణ చేస్తున్నారని.. ఆ భూములు ఎవరికి కట్టబెట్టడానికని ప్రశ్నించారు. పట్టణంలో ఇంటిస్థలం ఇస్తామని చెబుతూ టీడీపీ నాయకులు జాబితా సిద్ధం చేశారని ప్రస్తుతం స్థల సేకరణ చేసిన ప్రాంతంలోని గ్రామాల్లోని టీడీపీ కార్యకర్తలకు ఇంటిపట్టాలు ఇచ్చి దొంగ ఓట్లు నమోదు చేసేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేశారని వీరికి రెవెన్యూ అధికారులు కూడా వంత పాడుతున్నారన్నారు. ధర్మవరంలో జరుగుతున్న అపార్ట్మెంట్ దోపిడీని ప్రజలు నమ్మొద్దని ఈ అవినీతి కార్యక్రమంపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటం చేపడతామన్నారు. చేనేతల పరిస్థితేంటి? ధర్మవరంలో అత్యధిక సంఖ్యాకులైన చేనేత కార్మికులందరూ చేనేత మగ్గం నేసుకొని జీవనం సాగిస్తున్నారని అపార్ట్మెంట్ ద్వారా వారికి గదులు కేటాయిస్తే మగ్గం ఎలా వేసుకుంటారని కేతిరెడ్డి ప్రశ్నించారు. అంతేకాక అపార్ట్మెంట్లో ఉండటం ఇక్కడ ప్రాంతంలో సాధ్యం కాదని కేవలం స్థానిక ఎమ్మెల్యే వరదాపురం సూరి కంకర, ఇసుకను అమ్ముకునేందుకు మాత్రం ఇది ఉపయోపడుతుందన్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
మల్కాజిగిరి: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్హెచ్ఓ కొమరయ్య కథనం ప్రకారం..గుంటూరు జిల్లా, రాజుపాలెంకు చెందిన పెమ్మ రమేష్, నాగలక్ష్మి దంపతులు సాయినగర్ గ్రీన్‌గోల్డ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వారికి కుమార్తె మోక్షాంజలి(4) ఉంది. సోమవారం తెల్లవారుజామున నాగలక్ష్మి అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతి చెందినట్లు సమాచారం అందడంతో డీసీసీ ఉమామహేశ్వరరావు, ఏసీపీ సందీప్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనుమానాలెన్నో.. నాగలక్ష్మి పడివున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు అంతస్తులపై నుంచి కిందకు దూకినా అమె ఒంటిపై ఎక్కడా గాయాలు లేవు. ఆదివారం రమేష్, నాగలక్ష్మి మ్యారేజ్ డే సందర్భంగా జూబ్లిహిల్స్‌లోని జగన్నాథస్వామి గుడికి వెళ్లి వచ్చామని, మధ్యాహ్నం అమీర్‌పేటలో కంప్యూటర్ కోర్సు వెళ్లి వచ్చి రాత్రి ఇంట్లోనే భోజనం చేసి నిద్రపోయామని మృతురాలి భర్త రమేష్ తెలిపాడు. సోమవారం తెల్లవారుజామున తనకు మెలుకువ వచ్చి చూసే సరికి నాగలక్ష్మి కనిపించకపోవడంతో బయటకు రావడానికి ప్రయత్నించగా బయట గడియపెట్టి ఉండటంతో పక్క ప్లాట్‌లో ఉంటున్న వారికి ఫోన్ చేస్తే వారు గొళ్లెం తీసారన్నారు. సెక్యూరిటీ గార్డు సహాయంతో గాలించగా కిందపడి ఉన్న నాగలక్ష్మిని గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించానన్నాడు. కాగా తమ మథ్య ఎలాంటి గొడవలు లేవని, ఆమెకు ఆరోగ్య సమస్యలు కూడా లేవని రమేష్ పేర్కొన్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసు జాగిలాన్ని రప్పించడంతో జాగిలం నేరుగా అపార్ట్మెంట్ డాబా పైకి వెళ్లి నేరుగా నాగలక్ష్మి మృతదేహం వరకు వచ్చి ఆగిపోయింది. జాగిలం పైకి వెళ్లినప్పుడు నాగలక్ష్మి చున్నీని గుర్తించింది. నాగలక్ష్మి ఎడమ కాలి మడమ వద్ద,వెన్నుముక కింది భాగం(పెల్విక్) వద్ద గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అనుమానాలున్నాయి : నాగలక్ష్మి తల్లితండ్రులు తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని నాగలక్ష్మి తండ్రి అచ్చయ్య, తల్లి కృష్ణకుమారి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కూడా నాగలక్ష్మి ఫోన్ చేసిందని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. నాగలక్ష్మి కుమార్తె మోక్షాంజలిని తల్లి మృతదేహం వద్దకు తీసుకెళ్లగా అమ్మ పడుకుందా అని అడగడం అందరినీ కదిలించింది. తమ కుమార్తె మృతిపై పూర్తి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్హెచ్ఓ కొమురయ్య మాట్లాడుతూ నాగలక్ష్మి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
గాలి పటం ఎగురవేస్తుండగా జారి పడి..
-
గాలిపటం ఎగురవేస్తుండగా..
సాక్షి, నందిగామ: సంక్రాంతి పండుగ సందర్భంగా కృష్ణాజిల్లా నందిగామలో విషాదం చోటుచేసుకుంది. పట్టణంలో గాలిపటాలు ఎగరవేస్తుండగా భవనంపైనుంచి జారిపడి ఓ బాలుడు మృతిచెందాడు. చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామానికి చెందిన నితీష్ కుమార్(15) గాలిపటం ఎగురవేస్తుండగా అపార్టుమెంట్‌పై నుంచి జారి కిందపడి మృతిచెందాడు. మృతుడు నందిగామలోని ఓ ప్రెవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. -
క్షణాల్లోనే ప్రాణాలు పోయాయి
బొమ్మనహళ్లి : మురికి నీటి ట్యాంక్ శుభ్రం చేయడానికి దిగిన ముగ్గురు వ్యక్తులు ఊపిరి అందక మృతి చెందిన సంఘటన బొమ్మనహళ్లి హెచ్ఎస్ఆర్ లేఔట్ సామసంద్ర పాళ్యలో ఉన్న ఎన్.డి. సెఫల్ అపార్టుమెంటులో ఆదివారం చో టు చేసుకుంది. మృతులు తుమకూరు జిల్లా గుబ్బి తాలూకా నాగసంద్ర గ్రా మానికి చెందిన మాదేగౌడ (45), కోలా రు జిల్లా శ్రీనివాసపుర తాలూకా యగువపాపిశెట్టిపల్లి గ్రామానికి చెందిన నారాయణ స్వామి (38), సామసంద్రపాళ్యకు చెందిన పేయింటర్ శ్రీనివాస్ (52)గా గుర్తించారు. వీరు ఇక్కడి సామసంద్రపాళ్యలో నివాసం ఉంటున్నారు. అసలు విషయానికి వస్తే వీరికి మురికి ట్యాంకులు శుభ్రం చేయడం తెలియదు. మాదేగౌడ గార్మెంట్స్‌లో ఉద్యోగి కాగా, నారాయణ స్వామి ఎలక్ట్రీషియన్, శ్రీనివాస్ పెయింటర్. ఆదివారం సెలవు కావడంతో ఇక్కడి ఎన్డీ సెఫల్ అపార్టుమెంట్లో మురికినీటి ట్యాంక్‌ను శుభ్రం చేయడానికి ఒప్పందం చేసుకున్నారు. ఉదయం ముగ్గురు మురికి నీటి ట్యాంకులోకి దిగారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో వీరికి అనుభవం లేకపోవడంతో వీరు ఊపిరి ఆడక అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో అపార్టుమెంట్ నిర్వాహకులు విషయం గుర్తించి పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమా చారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని వారిని సెయింట్‌జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీష్‌రెడ్డి, కార్పొరేటర్లు గురుమూర్తి, శోభా స్థానిక నాయకులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. ఇదే సమయంలో మంత్రి జార్జ్‌తో పాటు మేయర్ సంపత్ రాజ్ అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు తలా రూ. 5 లక్షలు ఇస్తున్నట్లు మేయర్ ప్రకటించారు. పోలీస్ కమిషనర్ సునీల్ కుమార్ కూడా ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ఇదిలా ఉంటే మార్చురీ వద్ద సామసంద్రపాళ్య గ్రామస్తులు ధర్నా నిర్వహించారు. బాధ్యులు కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
న్యూయార్క్‌లో అగ్నిప్రమాదం
న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. బ్రాంక్స్ బరోలిలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో 12 మంది మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. చికిత్స నిమిత్తం వీరిని ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి ఆందోళనకరంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న మరో 12 మందిని అగ్నిమాపక అధికారులు రక్షించారు. 160 ఫైరింజన్లు.. అపార్ట్మెంట్లోని మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు అధికారులు ప్రకటించారు. మృతిచెందిన వారిలో ఏడాదిన్నర పసిపాప ఉన్నట్లు న్యూయార్క్ మేయర్ బిల్ డే చెప్పారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇదిలావుండగా.. అమెరికా ఆర్థిక రాజధానిలో ఈ అపార్ట్మెంట్ టూరిస్టులకు ప్రత్యేక ఆకర్షణగా ఉండేది. అపార్ట్మెంట్లో మంటలు ఎలా వ్యాపించాయన్న విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ ఘటన స్థానిక కాలమానం ప్రకారం.. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో జరిగింది. మంటలు వ్యాపించిన సమయంలో స్థానికులు గట్టిగా కేకలేశారని..అందువల్ల కొంత ప్రాణనష్టం తగ్గిందని అధికారులు చెబుతున్నారు. పై అంతస్తుల్లో ఉన్నవారు.. బయటకు వచ్చేలోపే.. మంటలు, పొగ విస్తరించడంతో.. బయటకు రాలేకపోయారని వారు చెప్పారు. -
అపార్ట్మెంట్లో వాచ్‌మన్ నిర్వాకం
సాక్షి,సిటీబ్యూరో: ఓ అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో గుట్టుగా సాగుతున్న పేకాట శిబిరంపై మధ్య మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకుడైన అపార్ట్మెంట్ వాచ్‌మెన్‌తో పాటు ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు డీసీపీ రాధాకిషన్‌రావు ఆదివారం వెల్లడించారు. గుల్బర్గాకు చెందిన అబ్దుల్ ఖదీర్ నాలుగేళ్ల క్రితం నగరానికి వలసవచ్చాడు. నెలకు రూ.6,500 జీతానికి చిరాగ్ అలీ లైన్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ వద్ద వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. ఈ జీతంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలో కొన్నాళ్ళుగా ఖాళీగా ఉన్న అపార్ట్మెంట్ పెంట్‌హౌస్‌లో మూడు నెలలుగా తనకు పరిచయస్తులైన పేకాట రాయుళ్ళతో పాటు వారి స్నేహితులను రప్పించి అర్ధరాత్రి వేళల్లో వారితో మూడు ముక్కలాటలు ఆడించి కమీషన్లు తీసుకుంటున్నాడు. ఇందులో భాగంగా శనివారం అర్ధరాత్రి వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురిని రప్పించిన ఖదీర్ వారితో పేకాట ఆడిస్తున్నట్లు సమాచారం అందడంతో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయిని శ్రీనివాస్‌రావు నేతృత్వంలోని బృందం దాడి చేసింది. నిర్వాహకుడు ఖదీర్ సహా ఎనిమిది మందిని అరెస్టు చేసింది. వీరి నుంచి రూ.32,640 నగదు తదితరాలు స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం అబిడ్స్ పోలీసులకు అప్పగించింది. -
మీడియా పుకార్లపై స్పందించిన మల్లికా
సాక్షి, ముంబై : మీడియాలో వస్తున్న పుకార్లపై ఎట్టకేలకు నటి మల్లికా షెరావత్ స్పందించారు. పారిస్.. ఇల్లు.. ఖాళీ చేయించటం వార్త నిజం కాదని ఆమె చెప్పారు. భారీగా బకాయిలు పడటంతో ఆమెను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించినట్లు మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె తన ట్విట్టర్లో స్పందించారు. పారిస్‌లో ఇల్లు అంటూ వస్తున్న వార్త నిజం కాదు. నాకు అసలు ఇల్లు లేదు. అద్దెకూ ఉండటం లేదు. ఒకవేళ ఎవరైనా నాకు దానం చేయాలనుకుంటే వారి అడ్రస్ నాకు పంపండి అంటూ వ్యంగ్యంగా ఆమె ట్వీటారు. కాగా, పారిస్‌లోని విలాసవంతమైన ఈ అపార్ట్మెంట్లో బాయ్ ఫ్రెండ్ సిరిల్ ఆక్సన్‌ఫాన్స్‌తో ఆమె నివసించారు. గతంలో ఓసారి ఇదే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొందరు ఆగంతకులు దాడి చేయగా.. మీడియాలో ప్రముఖంగా వార్తలు కూడా వచ్చాయి. సుమారు 64 లక్షల దాకా బకాయిలు చెల్లించకపోవటంతో ఆమెను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించినట్లు బీబీసీ లాంటి ప్రముఖ మీడియా సంస్థల్లో కూడా కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె అది నిజం కాదంటూ ఖండించటం కొసమెరుపు. Some in the media think I hv an apartment in Paris !! It’s absolutely Not True , if someone has donated one to me, pls send me the address :) https://t.co/ScDyL3Abt8 — Mallika Sherawat (@mallikasherawat) December 14, 2017 -
గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం
-
ఇద్దరి ప్రాణాలు తీసిన లిఫ్ట్‌లు
రాజమహేంద్రవరం క్రైం/చీరాల రూరల్: మంగళవారం వేర్వేరు ఘటనల్లో లిఫ్ట్‌లు ఇద్దరి ప్రాణాలు తీశాయి. ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఘటనలో.. లక్ష్మీవారపు పేట చక్రవర్తి అపార్ట్మెంట్లోని లిఫ్ట్ కొంతకాలం క్రితం మరమ్మతుకు గురైంది. ఇది తెలియని పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం, కాల్ధారికి చెందిన యర్రంశెట్టి గంగరాజు (60) లిఫ్ట్ కదులుతుండగానే గేట్లు తెరుచుకోవడంతో లిఫ్ట్ ఆగి ఉందని లిఫ్ట్‌లోకి వెళ్లాడు. అక్కడ ఖాళీ ప్రదేశం ఉందన్న విషయం తెలియక కాలు పెట్టడంతో కింద పడిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. లిఫ్ట్‌లో ఇరుక్కుపోయి పూజారి.. అలాగే ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఘటనలో.. అపార్టుమెంట్‌లోని లిఫ్ట్‌లో ప్రమాదవశాత్తు తల ఇరుక్కుపోవడంతో పూజారి మృతి చెందాడు. పాపరాజుతోట ప్రాంతంలో వేమూరి లక్ష్మీనారాయణ (55), భారతి దంపతులు ఉంటున్నారు. లక్ష్మీనారాయణ.. మేనల్లుడి పెళ్లికార్డులు బంధువులకు ఇచ్చేందుకు మంగళవారం తన మేనకోడలు లీలారాణితో కలసి ఆంధ్రాబ్యాంకు సమీపంలోని శ్రీరంగ సదన్ అపార్టుమెంట్‌కు వెళ్లాడు. ఇద్దరూ మూడో అంతస్తులోని బంధువు శ్రీనివాసరావును కలిసేందుకు లిఫ్ట్ ఎక్కారు. లిఫ్ట్ మొదటి గేటు మూసి రెండో గేటు మూసే క్రమంలో లీలారాణి లిఫ్ట్ బటన్ నొక్కింది. దీంతో లిఫ్ట్ పైకి వెళ్లడంతో లక్ష్మీనారాయణ తల లిఫ్ట్ గేటుకు గోడకు మధ్యలో ఇరుక్కుపోయింది. లిఫ్ట్ వేగానికి తల ఛిద్రమై తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెందాడు. -
లోథా యాజమాన్యం మోసం చేసింది
-
విశాఖ బీచ్‌రోడ్డు అపార్ట్మెంట్లో దారుణం
-
పరేషాన్ నం.1 బిందాస్ పార్కింగ్!
అపార్ట్‌మెంట్‌వాసుల పల్స్ ‘రేటింగ్’.. అక్రమ పార్కింగ్‌లతో తల పట్టుకుంటున్న నగర జీవి - అత్యధిక అపార్ట్‌మెంట్‌వాసుల ఇబ్బంది ఇదే.. - తర్వాతి స్థానంలో మందుబాబుల ఆగడాలు, ట్రాఫిక్ - వెయ్యి అపార్ట్మెంట్లలో అధ్యయనం చేసిన పోలీసు శాఖ పోలీసుల దృష్టికి వచ్చిన అపార్ట్‌మెంట్‌వాసుల సమస్యలివీ.. సందర్శించిన అపార్ట్మెంట్లు 1,000 వివిధ రకాల ఇబ్బందులు ఉన్నాయన్న సంఘాలు 630 అక్రమ పార్కింగ్ సమస్యగా ఉందన్న అపార్ట్మెంట్ సంఘాలు 169 మందుబాబుల ఆగడాలు 115 ట్రాఫిక్ ఇబ్బందులు 65 బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం 63 సాక్షి, హైదరాబాద్: మహానగరం.. కోటి జనాభా.. వారిలో మెజారిటీ మధ్యతరగతి ప్రజలు ఉంటోంది అపార్ట్మెంట్లలోనే.. మరి అందులో నివసిస్తున్న వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇబ్బంది ఏంటో తెలుసా? అక్రమ పార్కింగ్! అపార్ట్మెంట్ భవనాల ముందు అడ్డదిడ్డంగా పార్కింగ్ చేస్తున్న వాహనాలు నగరజీవికి తలనొప్పిగా మారాయి. అపార్ట్మెంట్లలో నివసిస్తున్నవారి ఇబ్బందులపై పోలీసు శాఖ తాజాగా ఓ అధ్యయనం చేసింది. సుమారు వెయ్యి అపార్ట్మెంట్లకు వెళ్లి అక్కడి అసోసియేషన్లను, జనాన్ని కలిశారు. వారికి ఎదురవుతున్న, పోలీసుల దృష్టికి తీసుకువెళ్లలేని ఇబ్బందులు ఏమున్నాయని ఆరా తీశారు. మొత్తం 32 అంశాలను ఎంపిక చేసుకుని ఈ అధ్యయనం చేపట్టారు. ఇందులో అందరినీ ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న సమస్య అక్రమ పార్కింగ్ అని తేలింది. ఆ తర్వాత స్థానంలో ‘మందుబాబులు’నిలిచారు. తప్పతాగి వారు చేస్తున్న గోలతో ఇబ్బందులు పడుతున్నామని అపార్ట్‌మెంట్‌వాసులు తెలిపారు. గుడి, బడి తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ వెలిసిన మద్యం షాపులు ‘ఓపెన్ బార్’లా మారడం, వాటి ముందు మందుబాబుల ఆగడాలతో జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక తర్వాతి స్థానాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు, జీహెచ్ఎంసీ సంబంధిత సమస్యలు, శబ్ద కాలుష్యం తదితరాలు నిలిచాయి. పరిష్కారానికి కమ్యూనిటీ పోలీసింగ్.. నగరంలో మొత్తం 60 ఠాణాలుండగా.. 370 రక్షక్, బ్లూకోల్ట్స్ వాహనాలున్నాయి. రెండున్నరేళ్ల నుంచి సిటీలో కమ్యూనిటీ పోలీసింగ్ విధానం అమలవుతోంది. ఈ బాధ్యతల్ని క్షేత్రస్థాయిలో గస్తీ విధులు నిర్వర్తించే పెట్రోలింగ్ వాహనాలతోపాటు బ్లూకోల్డ్స్ సిబ్బందికి అప్పగించారు. వీరు నిత్యం తమ పరిధుల్లోని ప్రాంతాల్లో తిరుగుతూ కాలనీ సంక్షేమ సంఘాలు, అపార్ట్మెంట్ సంక్షేమ సంఘాలు, వర్తక/వాణిజ్య సంఘాలు, ఇతర కమ్యూనిటీలను కలిసేవారు. పోలీసు విభాగం చేపడుతున్న కార్యక్రమాలను వారికి వివరించడంతోపాటు నేరాల నిరోధానికి సంబంధించి ప్రత్యేకంగా ముద్రించిన పుస్తకాలు, కరపత్రాలను పంపిణీ చేసేవారు. అయితే, ఇది పూర్తిస్థాయి కమ్యూనిటీ పోలీసింగ్ కాదని నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి భావించారు. ఫలితాలతో కూడిన కమ్యూనిటీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించి బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్ కేంద్రంగా సపోర్ట్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా స్థానిక సమస్యలు, పోలీసుల వద్దకు వచ్చి జనం చెప్పుకోలేని ఇబ్బందులను క్షేత్రస్థాయిలోని పోలీసు సిబ్బంది గుర్తిస్తారు. వాటిని పరిష్కరించాల్సిన బాధ్యతల్ని సపోర్ట్ సెంటర్ ద్వారా అధికారులకు అప్పగిస్తారు. ఒకవేళ సమస్య పరిష్కారం పోలీసుల పరిధిలో లేకుంటే దాన్ని సంబంధిత విభాగం దృష్టికి తీసుకువెళ్తారు. గత వారమే ఈ వినూత్న విధానాన్ని ప్రారంభించారు. నగరవాసుల ఇబ్బందులపై పోలీసులు ప్రయోగాత్మకంగా అపార్ట్మెంట్ల వద్ద అధ్యయనం చేశారు. -
లిఫ్ట్‌లో ఇరుక్కొని పదేళ్ల చిన్నారి మృతి
-
నగరంలో విల్లామెంట్ గృహాలు
విల్లా+అపార్ట్మెంట్= విల్లామెంట్ 20 ఎకరాల్లో 700 గృహాలు వ్యక్తిగత గృహాలు, అపార్ట్మెంట్స్, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు ఇదీ వరస! ఇప్పుడీ జాబితాలో విల్లామెంట్ చేరింది. విల్లా+అపార్ట్మెంట్ రెండూ కలిపితే విల్లామెంట్. నగరంలో కొత్త తరహా గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది ప్రజయ్ ఇంజనీర్స్ సిండికేట్! ప్రాజెక్ట్ విశేషాలు సంస్థ సీఎండీ విజయ్‌సేన్ రెడ్డి మాటల్లోనే.. సాక్షి, హైదరాబాద్: సాధారణంగా వ్యక్తిగత గృహాల్లో స్థలం తక్కువగా వస్తుంది. ఓపెన్ స్పేస్ ఎక్కువ రావటం కోసం కొత్తగా విల్లామెంట్ సంస్కృతికి తెరతీశాం. విల్లాల్లోని స్థలం, అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లు రెండూ కలిపి విల్లామెంట్లో ఉంటాయన్నమాట. షామీర్పేటలోని 27.18 ఎకరాల్లో ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్–2 ప్రాజెక్ట్ ఉంది. ఇందులో 20 ఎకరాల్లో విల్లామెంట్ నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం. ⇔ 20 ఎకరాల్లో మొత్తం 700 విల్లామెంట్లొస్తాయి. 240 గజాల్లో జీ+2 అంతస్తుల్లో నిర్మాణం ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో 2, పై అంతస్తులో 2 ఫ్లాట్లుంటాయి. 4 ఫ్లాట్లు కూడా 835 చ.అ.ల్లో విస్తరించి ఉంటాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఫ్లాట్ల ధర రూ.18.85 లక్షలు, పై అంతస్తులోని ఫ్లాట్ల ధర రూ.17.85 లక్షలు. గ్రౌండ్ ఫ్లోర్‌లోని కొనుగోలుదారులకు ముందు స్థలం, పై అంతస్తులోని వారికి టెర్రస్ రిజిస్ట్రేషన్ చేస్తాం. ⇔ వసతుల విషయానికొస్తే.. 45 వేల చ.అ.ల్లో క్లబ్‌హౌజ్, స్విమ్మింగ్ పూల్, పార్కు, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్స్, యోగా సెంటర్, జిమ్, ఇండోర్, అవుట్ డోర్ ప్లే ఏరియా, టెన్నిస్, బాస్కెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ కోర్టులు, క్రికెట్, ఫుట్ బాల్ మైదానాలు, ప్రాజెక్ట్‌లోనే షాపింగ్ కాంప్లెక్స్, స్కూలు, ఆసుపత్రి కూడా ఉంటాయి. ⇔ ప్రజయ్ వాటర్ ఫ్రంట్ సిటీ ఫేజ్–2లో కొంత భాగంలో అందుబాటు గృహాలను కూడా నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఆయా గృహాలు అమ్మకాలు 80 శాతం పూర్తయ్యాయి కూడా. 835 చ.అ.ల్లో ఉండే ఒక్కో ఇంటి ధర రూ.23 లక్షలు. ⇔ త్వరలోనే మహేశ్వరంలో వర్జిన్ కౌంటీ ప్రాజెక్ట్‌లో 1,500, కుంట్లూరులో గుల్మోర్ ప్రాజెక్ట్‌లో 150 గృహాలు, ఘట్కేసర్లో విన్సర్పాక్ ప్రాజెక్ట్‌లో 1,200 నిర్మాణాలను ప్రారంభించనున్నాం. -
అపార్ట్‌మెంట్‌పై పిడుగు
నంద్యాల: స్థానిక నూనెపల్లె మున్సిపల్ హైస్కూల్ సమీపంలోని అపార్టుమెంట్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటాక పిడుగు పడింది. దీంతో పైకప్పు స్వల్పంగా దెబ్బతినింది. ఏడాది క్రితం నిర్మించిన దీనిలో 30 కుటుంబాలు నివాసం ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురవడంతోపాటు భారీగా శబ్దం చేస్తూ పిడుగు పడింది. శబ్దానికి అపార్టుమెంట్లో ఉన్న వారు భయాందోళనకు గురై బయటకు వచ్చారు. అపార్టుమెంట్పైనే పిడుగు పడిందని తెలుసుకొని షాక్‌కు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.