
సర్వాంగ సుందరంగా సకల సౌకర్యాలతో ఉండే రాజప్రాసాదం నీటిలో తేలియాడితే ఎలా ఉంటుందంటే, అది అచ్చం ‘సోమ్నియా’లాగే ఉంటుంది. సోమ్నియా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నౌక మాత్రమే కాదు, అద్దాల గోడలతో నిండిన అద్భుత నిర్మాణం. లాటిన్‌లో సోమ్నియా అంటే ‘కల’ అని అర్థం. పేరుకు తగ్గట్లుగానే ఈ నౌక ఒక కలల ప్రపంచంలా కనిపిస్తుంది. ఇందులో మొత్తం విలాసవంతమైన 39 అపార్ట్‌మెంట్లను ఆరు డెక్‌లలో నిర్మించారు.
సుమారు పదివేలమంది వరకు ఇందులో ఉండొచ్చు. పెద్ద రెస్టరెంట్లు, లాబీ, స్పా, బార్‌లు, సూపర్ మార్కెట్లు, బొటిక్, ఫిట్‌నెస్ సెంటర్లు, టెన్నిస్ కోర్టు, జాగింగ్ ట్రాక్, స్విమ్మింగ్‌పూల్, కాక్‌టెయిల్ లాంజ్ సహా సమస్త సౌకర్యాలను ఈ నౌకలో ఏర్పాటు చేశారు. ఈ నౌక యజమాని మలేషియాలో అత్యంత ధనవంతుడైన రాబర్ట్ కుయోక్ అని సమాచారం.
రాబర్ట్ తన విహార యాత్రల కోసం కస్టమైజ్డ్ యాట్‌లను తయారు చేసే డచ్ కంపెనీతో దీనిని తయారు చేయించుకుంటున్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.. కాని, అధికారికంగా ఇంకా ఈ నౌక యజమాని ఎవరనేది వెల్లడి కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment