సొసైటీలో ‘సభ్యత్వ’ బేరం! | Sale of flats not related to society | Sakshi
Sakshi News home page

సొసైటీలో ‘సభ్యత్వ’ బేరం!

Published Sun, Oct 6 2024 4:48 AM | Last Updated on Sun, Oct 6 2024 4:48 AM

Sale of flats not related to society

జూబ్లీహిల్స్‌ సొసైటీలో భాగం కండి అంటూ.. సొసైటీతో సంబంధం లేని ఫ్లాట్ల అమ్మకాలు 

అక్కడ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేస్తేనే.. ఇక్కడ సభ్యత్వం! 

ఇంకా కట్టని, వివాదాల్లో ఉన్న వెంచర్‌లో ఫ్లాట్లు అంటగట్టే ప్రయత్నాలు 

ఆ వెంచర్‌కు రోడ్డు సౌకర్యమే లేదంటున్న స్థానికులు.. సొసైటీ పాలకవర్గం తీరుపై కొందరు సభ్యుల విస్మయం 

ఇది రూ.వందల కోట్ల స్కామ్‌ అంటూ ఆరోపణలు 

సాక్షి, హైదరాబాద్‌:  ‘‘రండి బాబు.. రండి.. అపార్ట్‌మెంట్‌ ఫ్లాట్లు కొనండి.. జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీలో భాగస్వాములు కండి.. ఇక్కడ కొనండి.. అక్కడ సభ్యత్వం పొందండి..’’ ఎన్నో అక్రమాలకు కేరాఫ్‌గా మారిన జూబ్లీహిల్స్‌ సొసైటీ పాలకవర్గం చేస్తున్న ప్రచారమిది. సొసైటీకి ఏ మాత్రం సంబంధం లేని, ఇంకా కట్టని, అసలు ఎలాంటి అనుమతుల్లేని వెంచర్‌లో ఫ్లాట్లను అంటగట్టేందుకు ప్రయత్నం చేస్తోంది. 

13.713 ఎకరాలు.. 1,900 ఫ్లాట్లు.. 40 ఫ్లోర్లు.. రివర్‌ వ్యూ, హైరైజ్‌ అంటూ జూబ్లీహిల్స్‌–4 పేరిట విక్రయాలు చేస్తోంది. ఇదంతా నమ్మి రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తే.. ఏదో ఒకరోజు ‘హైడ్రా’ ఎటాక్‌ తప్పని పరిస్థితి. ఈ వెంచర్‌కు సంబంధించి స్థానికులు, కొందరు సభ్యులు పలు కీలక వివరాలు వెల్లడించారు. 

జూబ్లీహిల్స్‌–4 వెంచర్స్‌ పేరుతో.. 
‘జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ హౌసింగ్‌ బిల్డింగ్‌ సొసైటీ (జేహెచ్‌సీహెచ్‌బీఎస్‌)’ పాలకవర్గం కొత్త దందాకు తెర తీసింది. ఓ ప్రైవేట్‌ వెంచర్‌లో ప్రపోజ్డ్‌ డెవలపర్‌గా ప్రవేశించి.. ఫ్లాట్లు విక్రయించే పని చేపట్టింది. ఫ్లాట్లు అమ్మేందుకు భారీ స్కెచ్‌ వేసింది. ఎంతో డిమాండ్‌ ఉన్న ‘జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీ’లో కొత్తగా సభ్యత్వాలను మొదలుపెట్టింది. సభ్యత్వం కావాలంటే.. ప్రైవేట్‌ వెంచర్‌లో ఫ్లాట్‌ కొనాలని కొర్రీపెట్టి, అంటగడుతోంది. 

సొసైటీ నుంచి ఒక్క రూపాయి కూడా వినియోగించడం లేదని పాలకవర్గం చెప్తున్నా.. ఇక్కడ సభ్యత్వాలు ఇచ్చే సమయంలోనే వెంచర్‌ తెరపైకి ఎలా వచ్చింది? అది ప్రైవేట్‌ వెంచర్‌ అయినప్పుడు సొసైటీ ఎందుకు విక్రయిస్తోంది? అనే ప్రశ్నలు వస్తున్నాయి. దీని వెనుక వందల కోట్ల స్కామ్‌ ఉందంటూ కొందరు ఆరోపిస్తున్నారు. ఫ్లాట్ల అమ్మకాలకు సంబంధించి చదరపు అడుగు (ఎస్‌ఎఫ్‌టీ)కు ఇంత అన్న లెక్కన కొందరి జేబుల్లోకి సొమ్ము చేరేలా తతంగం నడిపిస్తున్నారనే చర్చ సాగుతోంది. 

అందుకే కొత్తగా సభ్యత్వం కోసం వస్తున్నవారికి ‘‘దాదాపు 15 వేల కోట్ల ఆస్తులపై మీకు హక్కులు వస్తాయి. క్లబ్‌కు వెళ్లొచ్చు. స్కూల్‌లో మీ పిల్లలను చదివించొచ్చు. కమ్యూనిటీ సెంటర్‌ వంటివి వినియోగించుకోవచ్చు..’’ అంటూ ప్రచారం చేస్తున్నారని సభ్యులు చెప్తున్నారు. ఎలాంటి అనుమతులు లేని ఫేజ్‌–4లో ఫ్లాట్‌ కొనుగోలు చేయాల నే షరతు పెట్టారని, భవిష్యత్‌లో అన్ని అనుమతులు రా కుంటే పరిస్థితి ఏమిటనేది ఎక్కడా పేర్కొనలేదని అంటున్నారు. 

ఇదంతా తెలియని కొందరు మాత్రం సిటీ మధ్య లోని ఆస్తుల్లో భాగస్వాములం కాబోతున్నామనే ఆశతో సొసైటీ పాలకవర్గం బుట్టలో పడుతున్నారని చెప్తున్నారు. 

మాకే ఇంకా స్థలాలు ఇవ్వలేదంటూ.. 
మరోవైపు దశాబ్దాలుగా సొసైటీలో సభ్యులుగా ఉన్న తమకే స్థలాలు ఇవ్వలేదని.. ప్రైవేట్‌ వెంచర్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారికి ఇక్కడ రూ.5 లక్షలు తీసుకుని సభ్యత్వం ఇవ్వడమేంటని కొందరు సభ్యులు మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు కూడా తమ సొసైటీ సభ్యులుగా ఉన్నా.. ఈ అక్రమాలపై స్పందించడం లేదేమని ప్రశ్నిస్తున్నారు. 

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఫేజ్‌–4 బ్రోచర్‌ను నేరుగా మంత్రి తుమ్మలతోనే ఆవిష్కరింపజేశారు. దీనివల్ల ఇబ్బందులు, అనుమానాలు ఉండవనే ఎత్తుగడ ఉన్నట్టు స్పష్టమవుతోందని సొసైటీ సభ్యులు చెప్తున్నారు. జనం ఫ్లాట్ల కొనుగోలుకు ముందుకొస్తారని, అధికారులు జోక్యం చేసుకోకుండా ఓ సంకేతం ఉంటుందని అంటున్నారు. నిజానికి ఇక్కడి మోసాలు, అక్రమాలు మంత్రికి తెలియకుండా తప్పుదారి పట్టించారని ఆరోపిస్తున్నారు. 

జూబ్లీహిల్స్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీని రియల్‌ ఎస్టేట్‌ మార్కెటింగ్‌ సొసైటీ మార్చారని వాపోతున్నారు. ఒక్కో షేర్‌కు రూ.300 చొప్పున వసూలు చేసి.. రూ.15,000 కోట్ల ఆస్తులపై హక్కులు ఎలా కలి్పస్తారని కొందరు సభ్యులు ప్రశి్నస్తున్నారు. సొసైటీ మొత్తం సభ్యులు 5,000 మంది అనుకున్నా.. ఒక షేర్‌ కొన్న కొత్త సభ్యుడి వాటా సుమారు రూ.30 లక్షలు అవుతుందని... ఇలా ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఏమిటా వెంచర్‌.. ఎక్కడ? 
నార్సింగి పరిధిలోని మంచిరేవుల వద్ద టింబర్‌ చెరువును ఆనుకుని జూబ్లీహిల్స్‌ ఫేజ్‌–4 పేరుతో చేపడుతున్న ఈ వెంచర్‌కు రహదారి వివాదం ఉంది. దేవాదాయ శాఖ భూముల్లోంచి దారితీసే ప్రయత్నం చేయగా.. స్థానికులు అడ్డుకున్నారు. వెంచర్‌కు అనుమతి రావాలంటే దారి చూపించాలి. అది సాధ్యం కాదు గనుక వెంచర్‌ ఏర్పాటు కలేనని స్థానికులు అంటున్నారు. 

ఎవరైనా వాస్తవాలు తెలుసుకున్నాకే కొనుగోలు చేయాలని స్పష్టం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఇదంతా తెలిసినా.. వెంచర్‌ బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించడంతో ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నారని సమాచారం. అలాగే వదిలేస్తే భవిష్యత్‌లో హైడ్రా దృష్టిలో పడితే ఎలాగని, తమ ఉద్యోగానికి ఎసరొచ్చే పరిస్థితి వస్తుందేమోనని కలవరపడుతున్నారు.

జవాబు లేని ప్రశ్నలెన్నో.. 
»  రహదారే లేకుండా హెచ్‌ఎండీఏ నుంచి వెంచర్‌కు అనుమతి ఎలా వస్తుంది? 
»  అనుమతి లేని వెంచర్‌లో ప్లాట్లు తీసుకోవాలని సభ్యులపై ఒత్తిడి ఎందుకు? 
»  షరతు విధిస్తూ సభ్యత్వ నమోదు ఫారం ఇస్తున్నా సహకార శాఖ అధికారులెక్కడ? 
»   ఇలా అక్రమాలు, అవకతవకలు జరుగుతున్నా సహకార శాఖ అధి కారులు కళ్లు మూసుకుని కూర్చోవడం వెనుక ఏం జరుగుతోంది?

మా భూమిలో నుంచి రోడ్డు లేదు 
మంచిరేవుల రెవెన్యూ పరిధిలో జూబ్లీహిల్స్‌ ఫేజ్‌–4 పేరుతో వస్తున్న వెంచర్‌కు ఉత్తరం వైపు నుంచి 40 అడుగుల రోడ్డు మాత్రమే ఉంది. ఆ రోడ్డుతో అనుమతులు రావనే ఉద్దేశంతో.. 70ఏళ్లుగా సాగు చేసుకుంటున్న సర్వే నంబర్‌ 293లోని దేవాదాయ శాఖ భూమిలో నుంచి వంద అడుగుల రోడ్డు ఉన్నట్టు చూపుతూ హెచ్‌ఎండీఏ, ఇతర అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. 

ఇప్పటికే రోడ్డు వేసేందుకు ప్రయతి్నస్తే అడ్డుకున్నాం. వారికి అనుమతులు రాకుండా హెచ్‌ఎండీఏలో ఫిర్యాదు చేస్తాం. ఇలాంటి అనుమతులు లేని వెంచర్లలో ఫ్లాట్లు కొని మోసపోవద్దు.  – పి.సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్, మంచిరేవుల

ప్రైవేటు కేసులు, రోడ్డు డాక్యుమెంట్లు చూసుకోవాలి 
మంచిరేవులలో సర్వే నంబర్‌ 234, 236, 237, 263, 264, 265, 266, 267లలో ఉన్న భూమి పట్టాభూమి. దానికి ఉత్తరం వైపు గ్రీన్‌ఫీల్డ్‌ లే–అవుట్‌లో నుంచి రోడ్డు ఉంది. రెవెన్యూపరంగా కేసులు లేవు. ప్రైవేటుగా ఉన్న కేసులు, రోడ్డు సౌకర్యం, ఇతర వివరాల డాక్యుమెంట్లను పరిశీలించుకోవాలి. 

కొంత మేర ఇటికిన్‌ చెరువు బఫర్‌ ఈ భూమికి తగిలి ఉంటుంది. ఇటీవల దేవా దాయ శాఖ భూమిలో నుంచి రోడ్డు ఏర్పాటు చేసేందుకు ప్రయతి్నస్తే స్థానికులు అడ్డుకున్నారు. కోర్టుల్లో కేసులు ఉన్నాయనే విషయం ప్రచారంలో ఉంది.  – నర్రా శ్రీనివాస్‌రెడ్డి, తహసీల్దార్, గండిపేట మండలం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement