చెరువులా మారిపోయిన నిజాంపేట | water comes into the apartments at Nijampet In Hyderabad | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 21 2016 9:43 AM | Last Updated on Wed, Mar 20 2024 3:29 PM

భారీవర్షాల కారణంగా హైదరాబాద్ శివార్లలోని నిజాంపేట ప్రాంతం మొత్తం చెరువులా మారిపోయింది. మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయం నుంచి మొదలైన వర్షం తెల్లవారుజాము వరకు కురుస్తూనే ఉండటంలో ఆ ప్రాంతం మొత్తం నీళ్లతో నిండిపోయింది. ఇక్కడ అపార్టుమెంట్లు ఎక్కువ కావడంతో దాదాపు ప్రతి అపార్టుమెంటు సెల్లార్‌లోను నీళ్లు భారీగా చేరుకున్నాయి. కార్లు సగానికి పైగా మునిగిపోయాయి. మనుషులు నిలబడి ఉంటే దాదాపు పీకల వరకు కూడా నీళ్లు వస్తున్నాయి. చెరువుకు గండి పడటం వల్ల అక్కడి నుంచి నీళ్లు ఇటువైపు వచ్చాయని అంటున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement