Nijampet
-
నిజాంపేటలో తాగుబోతుల రాష్ డ్రైవింగ్ కు ASI బలి
-
నిజాంపేట్లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమం
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. భాష్యం పాఠశాలకు చెందిన ముగ్గరు విద్యార్థులు శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళారు. పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎల్లంపేట ఆలయం వద్ద విద్యార్థులను గుర్తించిన స్థానికులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థుల ఆచూకీ లభించడంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
నిత్యావసరాల కోసం ఇబ్బంది పడ్తున్న ప్రజలు
-
చెరువులా మారిపోయిన నిజాంపేట
-
చూశాడంటే తాళం పగలాల్సిందే..
భాగ్యనగర్ కాలనీ: తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. కేపీహెచ్బీ సీఐ కుషాల్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట కోటిలింగాలకు చెందిన దేశెట్టి ఎల్లేష్(35) కుత్బుల్లాపూర్ భాగ్యలక్ష్మినగర్లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. వచ్చే ఆదాయం సరిపోక దొంగతనాల బాటపట్టాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్ల దగ్గర రెక్కీ చేసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. శనివారం ఉదయం నిజాంపేట రోడ్డు చౌరస్తాలో తనిఖీ చేపట్టిన పోలీసులకు ఎదురుపడటంతో అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాలను అంగీకరించాడు. కేపీహెచ్ బీలో నాలుగు, చందానగర్లో ఒకటి, మియపూర్లో ఒక చోరీ కేసులో నిందితుడిగా పోలీసులు నిర్ధారించారు. అతడి నుంచి ఏడు తులాల బంగారం, వెండి వస్తువులు, రెండు ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించారు. గతంలో పటాన్చెరువు, కేపీహెచ్బీ, దుండిగల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడి జైలు జీవితం అనుభవించాడు. -
డెలాయిట్ సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్బీ పోలీస్స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో రచ్చ శైలజ భార్గవి(29) అనే సాప్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబకలహాలతోనే శైలజ ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. డెలాయిట్ కంపెనీలో శైలజ ఉద్యోగం చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్నున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
నిజాంపేటలో సూదిసైకో కలకలం
కూకట్పల్లి పరిధిలోని నిజాంపేటలో మంగళవారం సూదిసైకో కలకలం రేపాడు. ఉదయం బహిర్భూమికి వెళ్తున్న శేఖర్ అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి సూదితో దాడి చేసి పరారయ్యాడు. గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.