
డెలాయిట్ సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో రచ్చ శైలజ భార్గవి(29) అనే సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది.
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిజాంపేటలో రచ్చ శైలజ భార్గవి(29) అనే సాప్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబకలహాలతోనే శైలజ ఆత్మహత్య చేసుకున్నట్టు భావిస్తున్నారు. డెలాయిట్ కంపెనీలో శైలజ ఉద్యోగం చేస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్నున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.