
సాక్షి, హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. వాసుదేవారెడ్డి(38) అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు ప్రస్తుతం తాను ఘట్‌కేసర్ రైల్వే స్టేషన్‌లో ఉన్నానని, అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకొమంటూ తన సోదరుడికి మెసేజ్ పంపాడు. సోదరుడు రైల్వే స్టేషన్‌కి వచ్చే సరికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.