సాక్షి, హైదరాబాద్: నగరంలోని ముషీరాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ముషీరాబాద్ పీఎస్ పరిధిలోని రాంనగర్ ప్రేమ విఫలమై శుక్రవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికంగా ఉండే బాలాజీ ప్రతాప్ అనే యువకుడు ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. కాగా బాలాజీ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. తన ప్రేమను యువతి అంగీకరించక పోవడంతో మనస్థాపం చెందిన అతను ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. బాలాజీ ఆత్మహత్యపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కాగా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రేమ విఫలమై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య
Published Fri, Dec 15 2017 2:12 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment