ప్రేమ విఫలమై... | man commits suicide in hyderabad | Sakshi
Sakshi News home page

ప్రేమ విఫలమై...

Published Wed, Aug 16 2017 9:50 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

ప్రేమ విఫలమై... - Sakshi

ప్రేమ విఫలమై...

సుల్తాన్‌బజార్‌(హైదరాబాద్‌):  ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం సుల్తాన్‌బజార్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ కృష్ణప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా, అనంతపురం టౌన్, అరవింద్‌నగర్‌కు చెందిన స్వామి(26), అదే ప్రాంతానికి చెందిన హర్షవర్ధన్‌ క్లాస్‌మెట్స్‌.  హర్షవర్ధన్‌ గత మూడున్నర ఏళ్లుగా నగరంలోని అబిడ్స్‌ రెడ్డికాలేజ్‌ రోడ్డులోని హనుమాన్‌టెకిడీలో అద్దెకు ఉంటున్నారు. అతనితో పాత పరిచయం ఉన్న స్వామి ఐఈఎస్‌ కోచింగ్‌కోసం హైదరాబాద్‌కు వచ్చిన స్వామి కోఠిలోని మేడ్‌ ఈజీ కోచింగ్‌ సెంటర్‌లో గత 2016 నుంచి కోచింగ్‌ తీసుకుంటూ హర్షవర్ధన్‌ రూమ్‌లో ఉంటున్నాడు.

స్వామికి అదే కోచింగ్‌ సెంటర్‌లో చదువుతున్న  ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడటంతో ప్రేమలో పడ్డారు. వారి ప్రేమ పెళ్లివరకు వెళ్లింది. అమ్మాయి సైతం పెళ్లికి ఒప్పుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా హర్షవర్ధన్‌ గత జూలై 21న ఉద్యోగ నిమిత్తం ట్రైనింగ్‌కు వెళ్లాడు. 14వ తేదీ రాత్రి హర్షవర్ధన్‌ తన రూమ్‌కు వచ్చాడు. గది తాళం వేసి ఉండడంతో అతనికి అనుమానం వచ్చి ఓనర్‌లకు విషయం చెప్పడంతో వారు కిటికిలోంచి రూమ్‌లోనికి చూడడంతో స్వామి ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. దీంతో వారు సుల్తాన్‌బజార్‌ పోలీసులకు సమాచారం అందించారు. స్నేహితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, మృతుడు ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఓ అంచనాకు వచ్చారు.  పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement