
కార్తీక్ మృతదేహం
కుషాయిగూడ: తాను ప్రేమించి అమ్మాయికి పెళ్లి నిశ్చమైందని మనస్థాపం చెందిన ఓ యువకుడు విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన బుధవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ కథనం మేరకు.. కుందన్‌పల్లికి చెందిన జంగే కార్తీక్ (22) అతని తండ్రి ధనుంజయ రాధిక చౌరస్తాలోని కనక మహాలక్ష్మీ మ్యాచింగ్ సెంటర్‌లో పనిచేస్తున్నారు. మంగళవారం సాయంత్రం కార్తీక్ ఈసీఐఎల్‌కు వెళ్తున్నట్లు తండ్రితో చెప్పి వెళ్లాడు. బుధవారం ఉదయం తాను పనిచేసే షాపు ఎదుట విగతజీవిగా పడిఉన్నాడు.
షాపు నిర్వాహకులు కార్తీక్‌ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని పరిశీలించగా అప్పటికే మృతి చెంది ఉన్నాడు. తన కుమారుడు ఓ యువతితో ప్రేమలో పడ్డాడని, ఆ అమ్మాయికి వివాహం నిశ్చయం కావడంతో గత కొన్ని రోజులుగా బాధపడుతున్నాడని, ఈ క్రమంలోనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని మృతుడి తండ్రి పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment