
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. హర్యానా రాష్ట్రానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రంజిత్‌సింగ్ తాను ఉంటున్న శిల్పా పార్క్ కాలనీలోని శిల్పా నివాస్ అపార్టుమెంట్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.