
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్‌లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. భాష్యం పాఠశాలకు చెందిన ముగ్గరు విద్యార్థులు శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళారు. పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎల్లంపేట ఆలయం వద్ద విద్యార్థులను గుర్తించిన స్థానికులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థుల ఆచూకీ లభించడంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment