missing students
-
తిరుపతిలో అదృశ్యమైన ఐదుగురు విద్యార్థుల ఆచూకీ లభ్యం
-
పూడిమడిక బీచ్‌లో విద్యార్థుల గల్లంతు ఘటనపై సీఎం జగన్ ఆరా
సాక్షి, అమరావతి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక బీచ్‌లో విద్యార్థులు గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. ఈ ఘటనపై సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తక్షణమే సహాయక చర్యలు పర్యవేక్షించాలని మంత్రి గుడివాడ అమర్నాథ్ను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలంటూ అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. చదవండి: పోలవరంపై చంద్రబాబు కొంగజపం పూడిమడక బీచ్‌లో అనకాపల్లి డైట్ కాలేజీకి చెందిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. గల్లంతైన వారిని జగదీష్, యశ్వంత్, సతీష్, గణేష్, చందుగా గుర్తించారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నిజాంపేట్‌లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమం
సాక్షి, హైదరాబాద్: నిజాంపేట్‌లో అదృశ్యమైన విద్యార్థులు క్షేమంగా ఉన్నారు. భాష్యం పాఠశాలకు చెందిన ముగ్గరు విద్యార్థులు శనివారం ఉదయం ఇంటి నుంచి వెళ్ళారు. పాఠశాలకు వెళ్ళిన విద్యార్థులు సాయంత్రమైన ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఎల్లంపేట ఆలయం వద్ద విద్యార్థులను గుర్తించిన స్థానికులు.. తల్లిదండ్రులకు అప్పగించారు. విద్యార్థుల ఆచూకీ లభించడంతో తీవ్ర ఆందోళనకు గురైన తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
ఆ పిల్లల ఆచూకీ దొరికింది
సాక్షి, తిరుమల: హైదరాబాద్ రామాంతాపూర్‌లో డాన్‌బాస్కో నవజీవన్ రిహాబిలిటేషన్ కేంద్రం నుంచి పారిపోయిన 8మంది విద్యార్ధులు ఆచూకీ తిరుమలలో లభ్యమైంది. ఈ నెల 8వ తేదీన విద్యార్థులు పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పారిపోయిన పిల్లలు తిరుమలలోని శ్రీవారి పుష్కరిని వద్ద ఉన్నట్టు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తాము 6వ తేదీనే తిరుమలకు వచ్చినట్టు విద్యార్థులు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడించారు. తర్వాత విద్యార్థులను టీటీడీ విజిలెస్స్ సిబ్బంది స్కూల్ యాజమాన్యానికి అప్పగించారు. కాగా, నిర్వాహకుల వేధింపుల కారణంగానే విద్యార్థులు పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. -
అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు మృతి
-
అదృశ్యమైన ఇద్దరు చిన్నారులు మృతి
మాచవరం : గుంటూరు జిల్లా మాచవరంలో విషాదం చోటు చేసుకుంది. స్థానికంగా లయోలా ప్రేమ నిలయంలో ఆశ్రయం పొందుతున్న ఇద్దరు చిన్నారులు శనివారం ఉదయం స్కూల్‌కు వెళ్లి తిరిగి వసతి గృహానికి చేరుకోలేదు. దీనిపై ప్రేమ నిలయం సిబ్బంది శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. హెచ్ఐవీ సోకిన చిన్నారులకు లయోలా ప్రేమ నిలయం ఆశ్రయం కల్పిస్తోంది. అక్కడే ఉంటూ స్థానిక జెడ్పీ హైస్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు (ఒకరు అద్దంకి ప్రాంతానికి చెందిన వారు కాగా, మరొకరు పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన వారు) శనివారం సాయంత్రం అనారోగ్యంగా ఉందని ముందుగానే స్కూల్ నుంచి బయల్దేరినట్టు తెలుస్తోంది. అయితే స్కూల్ సమీపంలో ఇటీవలే ఓ పెద్ద వ్యవసాయ బావిని తవ్వారు. అందులో చిన్నారుల మృతదేహాలు ఉన్నట్టు స్థానికులు అందించిన సమాచారంతో ఆదివారం ఉదయం పోలీసులు అక్కడకు చేరుకున్నారు. ఆ మృతదేహాలు అదృశ్యమైన విద్యార్థులవిగా గుర్తించారు. మృతదేహాలను వెలికి తీశారు. -
ముగ్గురు విద్యార్ధినుల అదృశ్యం