సాక్షి, తిరుమల: హైదరాబాద్ రామాంతాపూర్‌లో డాన్‌బాస్కో నవజీవన్ రిహాబిలిటేషన్ కేంద్రం నుంచి పారిపోయిన 8మంది విద్యార్ధులు ఆచూకీ తిరుమలలో లభ్యమైంది. ఈ నెల 8వ తేదీన విద్యార్థులు పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పారిపోయిన పిల్లలు తిరుమలలోని శ్రీవారి పుష్కరిని వద్ద ఉన్నట్టు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తాము 6వ తేదీనే తిరుమలకు వచ్చినట్టు విద్యార్థులు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడించారు. తర్వాత విద్యార్థులను టీటీడీ విజిలెస్స్ సిబ్బంది స్కూల్ యాజమాన్యానికి అప్పగించారు. కాగా, నిర్వాహకుల వేధింపుల కారణంగానే విద్యార్థులు పారిపోయినట్టు వార్తలు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment