rehabilitation centre
-
మిగ్జామ్ తుపాను బాధితులకు భీమవరంలో పునరావాసకేంద్రం
-
లంకగ్రామాల్లో పర్యటించిన పామర్రు ఎమ్మెల్యే
సాక్షి, కృష్ణా: వరదలపై తాజా పరిస్థితిని అంచనా వేయడానికి పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జిల్లాలోని లంక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. తోట్లవల్లూరు లంకగ్రామల్లో మునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే, వల్లూరుపాలెం పునరావాసకేంద్రంలో బాధితులతో కలసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి ఆదేశాలతో సహాయకచర్యలు చర్యలు చేపట్టామని, ప్రభుత్వం భాదితులకు అన్ని విధాలా అండగా ఉటుందని పేర్కొన్నారు. ఈ మేరకు పంట నష్టాన్ని అంచనావేసి రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతేకాక వరద పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకూ బాధితులను పునరావాస కేంద్రాల్లోనే ఉంచి వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లంకగ్రామల్లో అంటువ్యాధులు ప్రభలకుండా శానిటేషన్ పై దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. -
ఆ పిల్లల ఆచూకీ దొరికింది
సాక్షి, తిరుమల: హైదరాబాద్ రామాంతాపూర్‌లో డాన్‌బాస్కో నవజీవన్ రిహాబిలిటేషన్ కేంద్రం నుంచి పారిపోయిన 8మంది విద్యార్ధులు ఆచూకీ తిరుమలలో లభ్యమైంది. ఈ నెల 8వ తేదీన విద్యార్థులు పునరావాస కేంద్రం నుంచి పారిపోయిన ఘటనపై ఉప్పల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పారిపోయిన పిల్లలు తిరుమలలోని శ్రీవారి పుష్కరిని వద్ద ఉన్నట్టు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తాము 6వ తేదీనే తిరుమలకు వచ్చినట్టు విద్యార్థులు విజిలెన్స్ అధికారుల విచారణలో వెల్లడించారు. తర్వాత విద్యార్థులను టీటీడీ విజిలెస్స్ సిబ్బంది స్కూల్ యాజమాన్యానికి అప్పగించారు. కాగా, నిర్వాహకుల వేధింపుల కారణంగానే విద్యార్థులు పారిపోయినట్టు వార్తలు వచ్చాయి. -
అతివకు భరోసా!
సాక్షి, మహబూబ్‌నగర్ క్రైం: నిర్భయ కేసులు నమోదు తర్వాత దేశంలో భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. అత్యాచారానికి గురైన బాధితులకు సంబంధించి ప్రస్తుత విచారణ విధానాన్ని రీవిక్టిమైజేషన్ ఆఫ్ విక్టిమ్ అని అంటారు. అర్థం అయ్యేలా చెప్పుకోవాలంటే అత్యాచారానికి గురైనా అమ్మాయి మొదట పోలీసులకు తనకేం జరిగిందో చెప్పాలి. ఆ తర్వాత వైద్యులకు, న్యాయవాదులకు, ఆపై మేజిస్ట్రేట్‌కు జరిగిన ఘటన నేపథ్యం వివరించాల్సి వస్తుంది, ఇలా చేయడం వల్ల మళ్లీ మళ్లీ ఆమెలోని గాయాన్ని రేపడమే అవుతుందని అధికారులు భావించారు. దీని కారణంగా వారిలో మానసికమైన కుంగుబాటు వస్తుంది. ఈ విధానానికి స్వస్తి పలికి అందరిని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలనే ఆలోచనతో భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ పనిచేసే సిబ్బందికి శిక్షణ ఇస్తారు. ఎవరూ అమర్యాదగా మాట్లాడేందుకు అవకాశం ఉండదు. మహిళలు, పిల్లలకు సంబంధించిన కేసులు పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైన తరువాత భరోసా కేంద్రానికి వస్తాయి. మొత్తంగా పాత విధానానికి స్వస్తి పలికేందుకు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్‌లో మాత్రమే ఒక మహిళా ఠాణా ఉంది. ఇక్కడకే ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ కేసులు వస్తున్నాయి. నాలుగు జిల్లాల్లో కూడా సఖి–భరోసా కేంద్రాలు ఏర్పాటైతే మహిళలు వచ్చి ఫిర్యాదు చేయడంతో పాటు సత్వరంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కేంద్రలోకి భాధితులు వచ్చిన వెంటనే మనోవికాస నిపుణుడు బాధితురాలితో మాట్లాడి వారికి జరిగిన అన్యాయంపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. -
పునరావాస కేంద్రం నుంచి పిల్లలు పరారీ
-
సినీ నటి శ్వేతా బసు ప్రసాద్ కు ఊరట
-
కోర్టులో శ్వేతా బసుకు ఊరట!
హైదరాబాద్: సినీ నటి శ్వేతా బసు ప్రసాద్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. పునరావాస కేంద్ర నుంచి శ్వేతా బసును వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. శ్వేతాబసును విడుదల చేయాలంటూ కొద్ది రోజుల క్రితం ఆమె తల్లి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. శ్వేతా బసు తల్లి దాఖలు చేసిన పిటిషన్ ను బుధవారం నాంపల్లి కోర్టు విచారించింది. ఓ కేసులో ఓ హెటల్ లో శ్వేతాబసును అరెస్ట్ చేశారు. అప్పట్నుంచి ఆమె పునరావాస కేంద్రంలో ఉంటున్నారు.