సాక్షి, కృష్ణా: వరదలపై తాజా పరిస్థితిని అంచనా వేయడానికి పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జిల్లాలోని లంక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. తోట్లవల్లూరు లంకగ్రామల్లో మునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే, వల్లూరుపాలెం పునరావాసకేంద్రంలో బాధితులతో కలసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి ఆదేశాలతో సహాయకచర్యలు చర్యలు చేపట్టామని, ప్రభుత్వం భాదితులకు అన్ని విధాలా అండగా ఉటుందని పేర్కొన్నారు.
ఈ మేరకు పంట నష్టాన్ని అంచనావేసి రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతేకాక వరద పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకూ బాధితులను పునరావాస కేంద్రాల్లోనే ఉంచి వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లంకగ్రామల్లో అంటువ్యాధులు ప్రభలకుండా శానిటేషన్ పై దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment