lanka villages
-
కొల్లేరులోని లంక గ్రామాల్లో పెద్దలదే పెత్తనం
కొల్లేరులో పెదరాయుళ్ల జమానా బలంగా నడుస్తోంది. అడ్డగోలు తీర్పులతో కుటుంబాలను విభజించడం, అన్యాయంగా కొన్ని కేసుల్లో బాధితులను ఇబ్బందులు పెట్టేలాంటి తీర్పులు తరచూ లంక గ్రామాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఏళ్ల తరబడి ఒకే తరహా తీర్పులతో కుల కట్టుబాట్ల పేరుతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నా ఉన్నతాధికారులు నోరుమెదపలేని పరిస్థితి. అనేక ఘటనలు తెర మీదకు వచ్చి ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదులు చేసినా విచారణల పేరుతో వదిలేస్తున్నారు. తాజాగా చేతబడి నెపంతో ఒక కుటుంబాన్ని తీవ్రంగా కొట్టి గాయపరచడం, మరో కేసులో అడ్డగోలుగా భార్యాభర్తలకు విడాకులు ఇప్పించడం వివాదాస్పదంగా మారాయి. – సాక్షి ప్రతినిధి, ఏలూరుకొల్లేరులో పంచాయతీలకు సమాంతరంగా బంటాపెద్దలు తీర్పులు చెబుతూ సమాంతర పంచాయితీ నడుపుతున్నారు. సాధారణంగా తప్పు చేస్తే స్టేషన్‌కు వెళ్లే సంస్కృతి లేకుండా తప్పు జరిగితే బంటా పెద్దలకు ఫిర్యాదు చేయడం, వారే సెటిల్మెంట్ చేయడం కొల్లేరులోని ప్రజలు వారి తీర్పును వ్యతిరేకిస్తే గ్రామానికి వచ్చే అక్రమ చేపల చెరువుల ఆదాయంలో వాటాలు ఇవ్వబోమని బెదిరించడం, సాంఘిక బహిష్కరణ చేస్తామని హెచ్చరించడం చేస్తూ నిరాటంకంగా తమ జమానా కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొల్లేరు పెదరాయుళ్ళ హవా రెట్టించింది. అన్ని రాజకీయ పార్టీలకూ కొల్లేరు ఓట్లు అత్యంత కీలకం. 4 నియోజకవర్గాలు.. 9 మండలాల్లో విస్తరించిన కొల్లేరులో 122 గ్రామాలున్నాయి. బంటా పెద్దలదే పెత్తనం, ఓటింగ్ విషయంలో వీరి మాటే చెల్లుతుండటంతో అధికార పార్టీ సహా అందరూ పెద్దల మాటకు తలొగ్గాల్సిన పరిస్థితులున్నాయి.కొల్లేరు స్వరూపం ఇదీ..నియోజకవర్గాలు: ఉంగుటూరు, దెందులూరు, ఉండి, కైకలూరు మండలాలు: కైకలూరు, మండవల్లి, ఏలూరు రూరల్ మండలం, పెదపాడు, దెందులూరు, భీమడోలు, నిడమర్రు, గణపవరం, ఉండిగ్రామాలు : 122జనాభా: 3.50 లక్షలుకుటుంబాలు: 78 వేలుఓట్లు : 1.75 లక్షలుకట్టేసి కొట్టడమే కొన్నింటిలో శిక్షలుఉదాహరణకు భార్య, భర్త విడిపోతే వివాహ సమయంలో భర్త తీసుకున్న లాంచనాలు సర్వం చెల్లించేస్తే విడాకులు మంజూరవుతాయి. వివాహేతర సంబంధం కేసుల్లో అయితే వివాహేతర సంబంధం ఉన్న వ్యక్తి వివాహిత భర్తకు పరిహారం ఇస్తే కేసు సెటిల్ అయిపోతుంది. అది కూడా కేసును బట్టి లక్షల్లోనే ఉంటుంది. ఇక చేతబడులు, ఇతరత్రా అనుమానాలు అయితే కట్టేసి కొట్టడమే శిక్ష. ఇలాంటి అనైతిక చర్యలు నేటికీ కొల్లేరులో కొనసాగుతున్నాయి. తాజాగా కైకలూరు మండలం చటాకాయి గ్రామంలో చేతబడి నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులను కొల్లేరు పెద్దల తీర్పుతో చితకబాదారు. అక్టోబరు 25న కమ్యూనిటీ హాలు వద్ద స్తంభాలకు కట్టేసి గ్రామపెద్దల సమక్షంలో 18 మంది కలసి కర్రలతో కొట్టారు. వీరిలో బాధితుడు సైదు రఘు ఏకంగా మంగళగిరి టీడీపీ కార్యాలయానికి వెళ్లి గోడు వెళ్లబోసుకున్నాడు. మరో ఇద్దరు మోరు రాంబాబు, జయమంగళ ధనుంజయ ఏలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఈ కేసులో ఆరుగురిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కొందరు బాధితులపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏలూరు రూరల్ మండల శ్రీపర్రులో భార్యాభర్తలకు విడాకులు అడ్డగోలుగా ఇప్పించడంపై భార్య ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. శ్రీపర్రు గ్రామానికి చెందిన సుభాష్‌తో కైకలూరు మండలం చటాకాయి గ్రామానికి చెందిన మహిళకు 2012లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. గత నెల 27న గ్రామ పెద్దలు ఏకంగా రాతపూర్వకంగా విడాకుల తంతు పూర్తి చేశారు. దీంతో బాధిత మహిళ.. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కేపీఎస్ కిషోర్‌లకు ఇటీవల ఫిర్యాదు చేసింది.1952 నుంచి తీర్పులుఒడిశాకు చెందిన ఒక తెగ వందల ఏళ్ల క్రితం కొల్లేరు ప్రాంతానికి వచ్చి చేపలు పట్టుకోవడం ప్రధాన వృత్తిగా ఎంచుకుని లంక గ్రామాల్లో స్థిరపడిపోయింది. 1952 నుంచి కొల్లేరులో బంటా పెద్దల పాలనకు తెర లేచింది. అందరికీ ఆదాయాన్ని చూపి పెద్దల పెత్తనం సాగిస్తుంటారు. ఉదాహరణకు ఒక గ్రామ పరిధిలో 500 ఎకరాల్లో అభయారణ్యం ఉంటే దానిలో కొందరు పెట్టుబడిదారులతో చెరువులు వేయించి ఎకరాకు రూ.లక్ష చొప్పున కౌలుకు తీసుకుని గ్రామంలో ఎంతమంది మగవారు ఉంటే అంతమందికి వాటాలేసి ప్రతి ఏటా బంటా పెద్దలు ఆదాయం ఇస్తుంటారు. కొన్ని కీలక ఘటనల్లో బాధితులు స్టేషన్లకువెళ్లినా..ఉన్నతాధికారులను కలిసినా వారిని కట్టుబాట్ల పేరుతో వేధించడం, బహిష్కరణకు గురి చేస్తున్నారు. 122 గ్రామాల్లో పంచాయతీ పాలన ఉండి, సర్పంచులు ఉన్నప్పటికీ వ్యవస్థ నడిపేది బంటా పెద్దలే. ఒక్కో గ్రామంలో 10 మందితో పెద్దలు కమిటీలా ఏర్పడి ప్రతిరోజూ కమ్యూనిటీ హాలు వద్ద పంచాయితీలు చేస్తుంటారు. -
వరదతో లంకవాసుల జీవితం ఛిద్రం
సాక్షి, అమలాపురం/సాక్షి, భీమవరం: గోదావరి, వశిష్ట గోదావరి మరోసారి పోటెత్తడంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పలు లంక గ్రామాల్లోని ప్రజల జీవితం ఛిద్రమైంది. ఈ ఏడాది గోదావరి వరద లంక గ్రామాలను ముంచడం ఇది మూడోసారి. జూలైలో వచ్చిన వరదకంటే ఇప్పుడు వరద భారీగా ఉంది. జూలై చివర్లో వచ్చిన వరదలకే పలు పంటలకు నష్టం వాటిల్లగా ప్రస్తుత వరదలకు అక్కడక్కడా మిగిలిఉన్న కాస్త పంటలు కూడా దెబ్బతిన్నాయి. వరదల ప్రభావం అంబేడ్కర్ జిల్లాలోని పి.గన్నవరం, ముమ్మిడివరం నియోజకవర్గాలపై అధికంగా ఉంది. ఈ నియోజకవర్గాల్లోని లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. 12 మండలాల్లోని 44 శివారు గ్రామాలు పూర్తిగా మునిగిపోయాయి. కాజ్వేలతోపాటు ప్రధాన రోడ్లపై 5 అడుగుల ఎత్తున నీరు చేరడంతో లంకవాసులు, విద్యార్థులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. అప్పనపల్లి గ్రామం, బి.దొడ్డవరం ఇందిరమ్మ కాలనీ, అయినవిల్లి మండలంలో వీరవల్లిపాలెం, పొట్టిలంక, ముమ్మడివరం మండలంలోని లంకాఫ్ ఠాన్నేల్లంక, కూనాలంక, గురజాపులంక, అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో వరద మరింత పెరిగింది. జిల్లాలోని మత్స్యకార గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. ఉద్యాన పంటలు మరోసారి పెద్ద ఎత్తున నీట మునిగాయి. అరటి, కంద, కోకో, కొబ్బరి, కూరగాయ పంటలు నీట నానుతున్నాయి. పాడి రైతులు పాలు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. మత్స్యకారులు పది రోజులుగా వేట లేక ఇబ్బంది పడుతున్నారు.లంక భూములను ముంచెత్తిన వశిష్ట గోదావరిఎగువ నుంచి ఉరకలెత్తుతూ వస్తున్న జలాలతో వశిష్ట గోదావరి సుడులు తిరుగుతూ ప్రవహిస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని పలు లంక గ్రామాలను వరద ముంచెత్తింది. ఆచంట, పెనుగొండ, యలమంచిలి, నరసాపురం మండలాల్లోని 600 ఎకరాల్లో కూరగాయలు, 80 ఎకరాల్లో తమలపాకుల పంటలకు నష్టం వాటిల్లింది. 200 ఎకరాల్లోని అరటి తోటలను వరద ముంచెత్తింది. యలమంచిలి మండలం కనకాయలంక, పెదలంక, దొడ్డిపట్ల, లక్ష్మీపాలెం గ్రామాల్లో వరదనీరు చేరింది. వడ్డిలంక వద్ద స్లూయిజ్ గేటు సక్రమంగా మూసుకోకపోవడంతో గోదావరి నీరు నక్కల డ్రెయిన్‌లోకి ఎగదన్నుతోంది. -
వరద వదిలింది.. బురద మిగిలింది!
కుప్పకూలిన పూరిల్లుఓలేరు–పల్లెపాలేనికి చెందిన రావిలంకె ముత్యాలమ్మ పూరిల్లు వరద నీటిలో నాని కుప్పకూలింది. పక్కనే ఉన్న పశువులపాకా పడిపోయింది. ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్, ఇతర విలువైన వస్తువులు పాడయ్యాయి. వంటపాత్రలతో పాటు చిన్న చిన్న వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఉన్న ఎకరం పొలంలో రూ.60 వేలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన కంద..రెండు నెలల్లో చేతికొస్తుందనగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. ఇల్లు మునిగిపోయింది బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఓలేరు పల్లెపాలెం గ్రామాన్ని వరద ముంచెత్తడంతో రామాలయం గుడి పూజారి దశరథరామయ్య ఇల్లు మునిగిపోయింది. ఇంట్లో ఉన్న టీవీ, ఫ్రిజ్, గ్యాస్ స్టౌతో పాటు అన్ని వస్తువులూ పనికి రాకుండా పోయాయి. వంట పాత్రలు, దుస్తులు నీటిలో కొట్టుకుపోయాయి. నీటిలో నానడంతో ఇంటి గోడలు కూలి పోయాయి. వరద మిగిల్చిన బురదను కడుక్కోవడం వృద్ధులైన దశరథ రామయ్యతో పాటు ఆయన భార్య అంజలిలకు మరింత కష్టతరంగా మారింది. కూలీలు కూడా దొరకని స్థితిలో ఏం చేయాలో పోలుపోక కన్నీటిపర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. వరద మింగేసింది.. పల్లెపాలేనికి చెందిన చింతా కోటేశ్వరరావు కూలీ. ఆదివారం పనికి వెళ్లి వచ్చేసరికి ఊరుతో పాటు తన ఇంటినీ వరద మింగేసింది. మూడు రోజుల తర్వాత నీరు తగ్గాక చూస్తే దుస్తులు, బియ్యం సహా అన్ని వస్తువులూ పనికిరాకుండా పోయాయి. కట్టు బట్టలతో మిగిలారు. పక్కనే ఉన్న కన్న శివచంద్ర ఇంటిదీ ఇదే పరిస్థితి. జీవాలకు ఆహారం కరవు ప్రాణప్రదంగా భావించే మేకలు, గొర్రెల కోసం ఇళ్లలో నిల్వ ఉంచుకున్న వరి ధాన్యం, బియ్యం మొత్తం వరద నీటిలో నాని పనికిరాకుండా పోయాయని ఓలేరు–పల్లెపాలేనికి చెందిన పెద్ద బోయిన దుర్గాభవానీ విలపించింది. గ్రామంలోని 25 కుటుంబాల యాదవుల ఇళ్లలో ఉన్న మొత్తం వందలాది బస్తాల ధాన్యం, బియ్యం నీటిలో తడిసిపోవడంతో మేకలు, గొర్రెలకు ఆహారం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నీటిలో మునగడంతో ఇళ్లు, పొలాల స్టాంపు పేపర్లు పనికి రాకుండా పోయాయని పెద్దబోయిన శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేయగా, పశువులకు మేత లేకుండా పోయిందని లంకె వెంకటేశ్వరరావు, దొక్కు శ్రీనివాసరావులు చెప్పారు. ఎకరం పొలంలో అరటి పంట కొట్టుకుపోయిందని రామారావు విలపించాడు. తీరని బురద కష్టాలు కృష్ణా వరద నాలుగు రోజుల్లో వీడినా అది మిగిల్చిన బురద కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కృష్ణానది ప్రాంతంలో కొల్లూరు మండలంలో 22, భట్టిప్రోలు మండలంలో 4, రేపల్లె మండలంలో ఒకటి చొప్పున 27 లంక గ్రామాలుండగా.. అన్నింటినీ వరద ముంచెత్తడంతో వేలాది ఇళ్లను బురద కప్పివేసింది. ఇళ్లల్లోనూ పెద్ద ఎత్తున బురద పేరుకుపోయింది. నీటిలో మునిగిన టీవీ, ఫ్రిజ్ మొదలు విలువైన వస్తువులతో పాటు నిత్యావసర వస్తువులన్నీ పాడయ్యాయి. దీంతో ఒక్కో కుటుంబానికి రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇళ్లలో చేరిన బురదను శుభ్రం చేయడం మరింత కష్టతరంగా మారింది. క్షేత్ర స్థాయిలో శూన్యంచంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తుపాను, వరదల్లో నష్టపోయిన ప్రతి ఎకరాకు రూ.20 వేలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని నాడు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదే విషయాన్ని పలువురు లంకగ్రామాల రైతులు గుర్తుచేసుకుంటున్నారు. అధికారంలో ఉన్న చంద్రబాబు వెంటనే నష్టపరిహారాన్ని అందించాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగు రోజులుగా వరద నీటిలో చిక్కుకున్న వేలాది పశువులు గ్రాసం కోసం అల్లాడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్‌తో పాటు కొందరు ప్రజాప్రతినిధులు గ్రాసం అందిస్తున్నట్టుగా ఫొటోలకు ఫోజులిచ్చారు గానీ.. క్షేత్రస్థాయిలో అందరికీ గ్రాసం ఇవ్వలేదు. అలాగే వేమూరు, రేపల్లె తోపాటు జిల్లా వ్యాప్తంగా రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా కృష్ణా నది ముంపు ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా పాడయ్యాయి. అరవింద వారధిపై బురదతో పాటు చెత్త పెద్ద ఎత్తున చేరింది. కొన్ని పశువులు మృతి చెందాయి. విద్యుత్‌ను పునరుద్ధరించకపోవడంతో ప్రజలు ఇంకా అంధకారంలోనే మగ్గిపోతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2023 డిసెంబర్ 5న జిల్లాలో మిచాంగ్ తుపాను కారణంగా 261 గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోగా.. కేవలం రెండో రోజు సాయంత్రానికే పునరుద్ధరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, బాధితులకు ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందలేదు. కొంత మేర భోజనం, తాగునీటిని మాత్రమే అధికారులు అందించారు. అయితే పచ్చపార్టీ నేతలకే బాధ్యతలు అప్పగించడంతో ఒక వర్గం వారికే అవి అందాయి. – సాక్షి ప్రతినిధి, బాపట్ల -
చుట్టుముట్టిన కష్టాలు
కళ్ల ముందు నీళ్లు పారుతున్నాయి.. కానీ గొంతు తుడుపుకొనేందుకు గుక్కెడు మంచి నీరు లేని పరిస్థితి. పేదలకు పట్టెడన్నం దొరకని దుస్థితి. అడుగు పడనీయని అంధకారం.. విష పురుగులు విలయతాండవం.. ఇళ్లు, వీధుల్లో నీళ్లు పారుతుండటంతో అధ్వాన పారిశుధ్యం.. పట్టపగలే పీక్కుతింటున్న దోమలు. ఇదీ.. వేమూరు, రేపల్లె నియోజకవర్గాల్లోని లంక గ్రామాల ప్రజల దీన స్థితి.సాక్షి ప్రతినిధి, బాపట్ల : బాపట్ల జిల్లా కొల్లూరు మండలం తోకలవారిపాలెం, తురకపాలెం తదితర గ్రామాలను మంగళవారం ‘సాక్షి’ బృందం పరిశీలించింది. వరద సహాయ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. అందుతున్న కొద్దిపాటి సాయం కూడా ఒకవర్గం వారికే చేరుతోంది. బాధితులకు అధికారుల ద్వారా పంపిస్తున్నట్లు చెబుతున్న ఆహారం, తాగునీటి ప్యాకెట్లను ఆయా గ్రామాల్లోని అధికార పార్టీ నేతల ఇళ్ల వద్దకు చేరుతున్నాయి.దీంతో ఒక వర్గం వారికే సాయం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ కాలనీలను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇప్పటికీ చాలామంది పేదలు అన్నంతో పాటు తాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. కొద్దిపాటి నీరు, ఆహారం వచ్చిందంటే చాలు.. వాటి మీదికి జనం ఎగబడుతున్నారంటే వారి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కనీసం మంచి నీళ్లిచ్చినా తాగి ప్రాణాలు దక్కించుకుంటామని పలువురు బాధితులు ‘సాక్షి’తో చెప్పారు.అంధకారంలో గ్రామాలుమూడు రోజులుగా 27 లంక గ్రామాలను వరద చుట్టుముట్టగా గత రెండు రోజులుగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచి పోయింది. లంక గ్రామాల పరిధిలో ఉన్న రెండు విద్యుత్ సబ్స్టేషన్లు నీటిలో మునగడంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యుత్ లైన్లు, స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ సరఫరా నిలిచి పోయి గ్రామాల్లో అంధకారం అలుముకుంది. కొన్ని పూరిళ్లతో పాటు వీధుల్లోనూ నీరు అలానే ఉంది. విషపురుగులు బెడద పెరిగింది. దోమలు పట్టపగలే పీక్కుతింటున్నాయి. దీనికి తోడు పారిశుధ్యం అధ్వానంగా మారడంతో జ్వరాలు పెరుగుతున్నాయి. బయట ఆస్పత్రులకు వెళదామంటే బోట్లు లేని దుస్థితి. నీరు, భోజనం సరఫరా చేయడానికి వచ్చిన బోట్లలో కొంతమందిని బయటకు తరలించి అక్కడి నుంచి తెనాలి, గుంటూరులోని ఆస్పత్రులకు పంపారు. బోట్లు లేక.. ఊరు దాటలేక... లంక గ్రామాల నుంచి బయటకు వచ్చేందుకు బోట్లు అందుబాటులో లేక ప్రజలు నానా అగచాట్లు పడుతున్నారు. బయటకు వచ్చి సొంతంగా తాగునీరు, ఆహారం, ఇతర వస్తువులు తెచ్చుకుందామన్నా ప్రభుత్వం తగినన్ని బోట్లను ఏర్పాటు చేయలేదు. అలాగే పశువులకు తినేందుకు మేత లేక అవి దీనంగా అరుస్తున్నాయి. వేలాది ఎకరాల్లోని అరటి, తమలపాకు, కంద, పసుపు వంటి వాణిజ్య పంటలు మొత్తం నీటి పాలయ్యాయి. ఒక్కో ఎకరానికి రెండు నుంచి రూ. 3 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఎకరం రూ.50 వేలకు కౌలుకు తీసుకుని పంటలను సాగు చేశారు. వరద రాకతో ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ కష్టాలు తీర్చాలని లంక గ్రామాల ప్రజలు కోరుతున్నారు. బోటు లేదు.. ఓటి మాటలేసీఎం చంద్రబాబు దగ్గరుండి మూడు రోజులుగా హెలికాప్టర్లు, డ్రోన్లు, బోట్లతో వరద బాధితులకు సాయం చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. కానీ.. కనీసం బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు బోట్లు కూడా ఏర్పాటుచేయలేదనేందుకు నిదర్శనం ఈ చిత్రం. విజయవాడలో వరద నీటిలో థర్మాకోల్ షీట్‌పై వెళుతున్న దివ్యాంగురాలిని చంద్రబాబు పరామర్శిస్తున్న దృశ్యమిది. -
ఆక్రమణలతోనే కొంప ‘కొల్లేరు’
సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. విజయవాడను ముంచెత్తిన బుడమేరు నీరు చివరకు కొల్లేరు సరస్సులో కలవాలి. ఇక్కడ నుంచి 52 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రానికి ఆ నీరు చేరాలి. ఎగువ నుంచి చేరుతున్న నీటి ప్రవాహానికి కొల్లేరులో అక్రమ చెరువు గట్లు అడ్డుపడుతున్నాయి. వరదల సమయంలో కొల్లేరుకు 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, ఎర్ర కాల్వల నుంచి భారీగా వరద నీరు వస్తోంది. ఇలా చేరిన నీరు కేవలం 12 వేల క్యూసెక్కులు మాత్రమే దిగువకు చేరుతోంది. నేడు ఈ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2,22,300 ఎకరాల్లో కొల్లేరు సరస్సుఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల్లో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరిధిలో మొత్తం 122 గ్రామాలు ఉన్నాయి. పర్యావరణవేత్తల ఆందోళన కారణంగా కొల్లేరు సరస్సును–5 కాంటూరు వరకు 77,138 ఎకరాల్లో అభయారణ్యంగా గుర్తించారు. ఏలూరు, ఉంగుటూరు, పెదపాడు, దెందులూరు, ఆకివీడు, నిడమర్రు, భీమడోలు, కైకలూరు, మండవల్లి మండలాల్లో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. కొల్లేరుకు బుడమేరు, రామిలేరు, తమ్మిలేరు, గుండేరు, ఎర్రకాల్వ వంటి వాగుల ద్వారా భారీగా నీరు చేరుతోంది. కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే ఏకైక మార్గమైన మండవల్లి మండలం పెద యడ్లగాడి వంతెన వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరింది. మరో అడుగు చేరితే 13 లంక గ్రామాలు ప్రమాదం బారిన పడే అవకాశం ఉంది. అక్రమ చెరువులే అసలు కారణం.. వరదల సమయంలో కొల్లేరుకు చేరే వరద నీరు సముద్రానికి చేరడానికి అడ్డంకిగా ఉన్నది కొల్లేరు సరస్సులో అక్రమంగా తవి్వన చేపల చెరువులేనని అనేక మంది కోర్టులను సైతం ఆశ్రయించారు. ప్రధానంగా గతంలో టీడీపీ పాలనలో వేలాది ఎకరాల కొల్లేరు భూమి ఆక్రమణలకు గురైంది. దీంతో పర్యావరణవేత్తల ఫిర్యాదులతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2006లో ఆపరేషన్ కొల్లేరు పేరుతో ఇరు జిల్లాల్లో 25,142 ఎకరాల విస్తీర్ణంలో చేపల చెరువులను ధ్వంసం చేశారు.ప్రస్తుతం ఇంకా 15 వేల ఎకరాల పైబడే అక్రమ సాగు జరుగుతున్నట్టు అంచనా. తిరిగి కూటమి పాలన రావడంతో అక్రమ చేపల సాగు అధికమైంది. అధికారంలోకి వచి్చన టీడీపీ కొల్లేరు నాయకులు ఇటీవల అక్రమ దందాలకు తెర తీశారు. సుప్రీంకోర్టు పూర్తిస్థాయిలో కొల్లేరు ప్రక్షాళనకు ఆదేశాలివ్వాలని పర్యావరణవేత్తలు కోరుతున్నారు. గ్రామాలకు రాకపోకలు బంద్.. ఎగువ ప్రాంతాల నుంచి కొల్లేరుకు భారీగా వరద నీరు చేరుతోంది. కొల్లేరు సరస్సులోకి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు చంద్రయ్య కాలువ, పెదపాడు, వట్లూరు, మొండికోడు, పందికోడు, పోల్‌రాజ్, కైకలూరు స్వాంపు, మాదేపల్లి, రాళ్ళకోడు, దోసపాడు, మోటూరు, పోతునూరు వంటి చానల్స్ నుంచి ప్రతి ఏటా నీరు చేరుతుంది. ఈ ఏడాది ఇప్పటికే ఏలూరు జిల్లా మండవల్లి మండలం పెద్ద యడ్లగాడి–పెనుమాకలంక రోడ్డు బుడమేరు నీరు అధికంగా రావడంతో నీట మునిగింది. మూడు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కైకలూరు –ఏలూరు రహదారిలో రోడ్లపైకి వరద నీరు చేరుతోంది. రానున్న రెండు రోజుల్లో కొల్లేరు పరీవాహక ప్రాంతాలకు భారీ ముంపు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
బాధితులకు బాబు మొండిచెయ్యి
-
లంక గ్రామాలను ముంచెత్తిన గోదావరి వరద
-
లంక గ్రామాలు అస్తవ్యస్తం
సాక్షి, అమలాపురం : పాడి పంటలు.. అన్నపానీయాలు అందించి డెల్టాను సస్యశ్యామలంగా మార్చిన గోదావరే.. ఏటా ఉగ్రరూపం దాల్చి గ్రామాలను ముంచెత్తుతోంది. పాడి పంటలకు అంతులేని నష్టాన్ని మిగులుస్తోంది. అపారమైన నష్టాన్ని కలగజేస్తోంది. రోడ్లు, డ్రెయిన్లు, కాలువలను ఏకం చేస్తోంది. వాహనాలను పక్కనబెట్టి పడవల మీద రాకపోకలు సాగించేలా చేస్తోంది. చేలు, చెరువులు, ఉద్యాన పంటలను కబళిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే లంక గ్రామాలను అస్తవ్యస్థం చేస్తోంది. వరుసగా రెండుసార్లు ముంచెత్తిన గోదావరి వరద డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని లంక వాసులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. వరద ముంపులో 21వేల కుటుంబాలు.. గోదావరి వరదలవల్ల జిల్లాలో 12 మండలాల్లోని 47 శివారు గ్రామాలు నీట మునిగాయి. 21,492 కుటుంబాలు వరద ముంపు బారినపడ్డాయి. పి. గన్నవరం, ముమ్మిడివరం, అయినవిల్లి, ఐ.పోలవరం, మామిడికుదురు, మలికిపురం, సఖినేటిపల్లి మండలాల్లో ఇది అధికంగా ఉంది. వరదకు లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ స్థానికులు పడవల మీదే రాకపోకలు సాగిస్తున్నారు. ఎటుచూసినా వరద నీరు తప్ప మరొకటి కనిపించడంలేదని లంక వాసులు వాపోతున్నారు. అల్లవరం మండలం బోడసుకుర్రు, ముమ్మిడివరం మండలం ఠానేలంక గ్రామాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఇక్కడ 293 కుటుంబాలకు చెందిన 809 మందికి పునరావాసం కల్పించి ఆహార పొట్లాలను అందిస్తున్నారు. ఎనిమిది గృహాలు దెబ్బతిన్నాయి. 3,943.30 ఎకరాల్లో ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అరటి, కంద, పసుపు, కర్ర పెండలం, కోకో పంటలతోపాటు కూరగాయ పంటలకు అధిక నష్టం కలిగింది. పన్నెండు రోజులుగా నదీపాయల్లో వరద కొనసాగుతుండడంవల్ల డెల్టాలోని మురుగునీటి కాలువల ద్వారా ముంపు నీరు దిగడంలేదు. వరద నీరు రాకుండా అవుట్ ఫాల్ స్లూయిజ్‌లు మూసివేశారు. ఇదే సమయంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో డెల్టాలో వరిచేలు నీట మునగడంతో పంట దెబ్బతింది. అధికారుల లెక్కల ప్రకారం ఇక్కడ 2,734 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. కానీ, ఇంతకు రెట్టింపు నష్టం జరిగిందని రైతులు చెబుతున్నారు. వీటితోపాటు 300 ఎకరాల్లో వెనామీ రొయ్యల సాగు తుడుచుపెట్టుకుపోయిందని అంచనా. పాలు మా వద్దే ఉండిపోతున్నాయి.. నాకు మూడు గేదెలున్నాయి. రోజుకు ఆరు లీటర్ల పాలు వస్తాయి. పాలు కొనుగోలు చేసే వ్యాపారులు వరదలు కారణంగా రావడంలేదు. ఇంట్లోనే కొంత వాడాల్సి వస్తోంది. వరదలవల్ల పచ్చగడ్డి కొరత అధికంగా ఉంది. గతంలో వరదల సమయంలో ఎండు గడ్డి ఇచ్చేవారు. ఇప్పుడు ఇవ్వడంలేదు. – కుసుమ కోటేశ్వరరావు, అయినవిల్లి లంక, అయినవిల్లి మండలం ఈ నాలుగు నెలలు పడవ ప్రయాణమే.. వరదలు ఉండే ఈ నాలుగు నెలలు పడవ మీదనే రాకపోకలు చేయాల్సింది. ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు రేవు దాటి బస్సుపై నరసాపురం వెళ్తుంటా. తిరిగి వచ్చేసరికి రాత్రి ఏడవుతుంది. ఎక్కువ సమయం పడవ మీదే సరిపోతోంది. తిరిగొచ్చే వరకూ ఇంట్లో వారికి ఆందోళనే. – దొడ్డా శివ, బూరుగుపూడి, పి.గన్నవరం మండలం బీర, బెండ పంట దెబ్బతింది.. రెండు ఎకరాల్లో బీర, బెండ పాదులు సాగుచేశా. ఎకరాకు రూ.40 వేల చొప్పున పెట్టుబడి పెట్టాను. పంట మంచి కాపు మీద ఉంది. దిగుబడి బాగా వస్తుందని ఆశించాను. 11 రోజులుగా వరదలు ముంచెత్తడంతో కాయగూర పంటలు నీటమునిగి దెబ్బతిన్నాయి. పాదులు కుళ్లిపోయాయి. పెట్టుబడులు కూడా వచ్చే అవకాశంలేదు. లంక గ్రామాల్లో రైతులను ప్రభుత్వం తక్షణం ఆదుకోవాలి. – ధూళిపూడి రామకృష్ణ, సలాదివారిపాలెం, మమ్ముడివరం మండలంచెరువులను ముంచేసింది అన్నంపల్లిలో నాలుగు ఎకరాల్లో ఆక్వా సాగుచేశా. ఈసారి కౌంట్ అనుకున్నంత వేగంగా రాలేదు. దీంతో చెరువుల పట్టుబడులు ఆలస్యమయ్యాయి. ఆగస్టులో రావాల్సిన వరద జూలైలో వచి్చంది. చెరువులు మొత్తం మునిగిపోయాయి. కౌంట్ 120 ఉన్న సమయంలో పట్టుబడులు చేసినా అనుకున్నంత రేటు రాలేదు. నష్టాలను చవిచూడాల్సి వచి్చంది. – దంతులూరి నానిరాజు, అన్నంపల్లి, ఐ.పోలవరం మండలం సాయం అందించాలి.. ఏటా వరదల సమయంలో వేటకు విరామం ప్రకటించాల్సి వస్తోంది. మాకు చేపల వేట మాత్రమే జీవనోపాధి. వేటకు వెళ్లకపోతే కుటుంబ పోషణ కష్టం. వరదల సమయంలో ప్రభుత్వం నిత్యావసర వస్తువుల రూపంలో ఇచ్చే సాయం కంటే ఆర్థికంగా సాయం అందించాలి. – సంగాడి ముత్యాలు, మత్స్యకారుడు, మసకలపల్లి. కె.గంగవరం మండలం -
రూ.200 కోట్లతో గ్రామాలకు రక్షణ గోడ
సాక్షి అమలాపురం: గోదావరి నది కోత వల్ల ఇళ్లు దెబ్బతినే ప్రాంతాల్లో గ్రోయెన్లు, రివిట్మెంట్ నిర్మాణాల కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లంక గ్రామ వాసుల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మంగళవారం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు వచ్చిన ఆయన ముమ్మిడివరం మండలం గురజాపులంక, కూనలంక రామాలయంపేట, లంకాఫ్ ఠానేల్లంక రామాలయంపేట, అయినవిల్లి మండలం కొండుకుదురులంకలోని తొత్తరమూడివారిపేటలో నదీ కోత తీవ్రతను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ముమ్మిడివరం, పి.గన్నవరం ఎమ్మెల్యేలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, కొండేటి చిట్టిబాబులు కోత తీవ్రత గురించి సీఎంకు వివరించారు. ఈ ప్రాంతంలో గ్రోయెన్లు, రివిట్మెంట్ల నిర్మాణాలు చేపట్టాలని కోరారు. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లిన సమయంలో. బహిరంగంగా వారితో మాట్లాడినప్పుడు పలువురు ఇదే సమస్యను ప్రస్తావించారు. దీనిపై కూనలంకలో సీఎం జగన్.. అప్పటికప్పుడే స్పందిస్తూ ఆరు గ్రామాల్లో కోతకు పరిష్కారం చూపేందుకు రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. జనం నివాసముండే ఆవాస ప్రాంతాల్లో సుమారు 3.5 కిలోమీటర్ల మేర బిట్లు బిట్లుగా గ్రోయెన్ల నిర్మాణాలు చేపడతామని తెలిపారు. పొట్టిలంకలో వెయ్యి మీటర్లు, కొండుకుదురులంక వద్ద 400 మీటర్లు, వివేకానంద వారధి వద్ద 300 మీటర్లు, లంకాఫ్ ఠానేల్లంకలో 400 మీటర్లు, కూనలంక వద్ద 800 మీటర్లు, గురజాపులంక వద్ద 600 మీటర్లు చొప్పున నిర్మిస్తామని చెప్పారు. ప్రజల సమక్షంలోనే ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు సతీష్‌తో మాట్లాడారు. ఎప్పటికి పూర్తి స్థాయిలో అంచనాలు తయారు చేస్తారని ప్రశ్నించారు. అంచనాలు పూర్తి చేసి, నెలాఖరు నాటికి టెండర్లు పూర్తి చేయాలని, ఆ తర్వాత నెల రోజులకు పనులు ప్రారంభించాలని ఆదేశించారు. పనులు మొదలైన తర్వాత కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్‌లు తనకు ఫొటోలు పంపాలని ఆదేశించారు. -
లంక గ్రామాల ప్రజలకు అండగా సీఎం జగన్
-
లంకల్ని ముంచెత్తిన వరద
సాక్షి నెట్వర్క్: గోదావరి నదిలో ప్రవాహం మహోగ్ర రూపం దాల్చడంతో లంక గ్రామాల్లో ముంపు తీవ్రత మరింత పెరిగింది. లంకలను పూర్తిస్థాయిలో వరద ముంచెత్తగా.. విలీన మండలాల్లోని పలు గ్రామాల్లోకి వరద నీరు చేరింది. పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాలైన వేలేరుపాడులో 10 గ్రామాలు, కుక్కునూరు మండలంలో 9 గ్రామాల్లోకి వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను అధికారులు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వేలేరు–బూర్గుంపాడు, వేలేరు–సీతానగరం రహదారులు నీట మునిగాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో వరద పరిస్థితులు నెలకొన్నాయి. గోదావరి ఉధృతికి శబరి నది ఎగపోటుకు గురికావడంతో చింతూరు మండలంలోనూ వరద పెరుగుతోంది. ముందుగా ముంపునకు గురయ్యే గ్రామాలను గుర్తించిన అధికారులు ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద బాధిత కుటుంబాలకు కేజీ చొప్పున కందిపప్పు పంపిణీ చేశారు. శుక్రవారం శబరి నది కొంత తగ్గడంతో ఆంధ్రా నుంచి తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌కు రాకపోకలు కొనసాగాయి. దిగువన లోతట్టు ప్రాంతాల్ని ముంచెత్తుతున్న వరద గోదావరికి దిగువన గల అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ముంపు తీవ్రత మరింత పెరిగింది. నదీ పరీవాహక ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లను, రోడ్లను, కాజ్‌వేలను వరద ముంచెత్తుతోంది. పి.గన్నవరం మండలంలోని నాలుగు లంకలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోగా.. మరో నాలుగు లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఈ గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అయినవిల్లి మండలంలో ఎదురు బిడియం, మామిడికుదురు మండలం అప్పనపల్లి కాజ్‌వేపై ముంపు తీవ్రత పెరగడంతో ట్రాక్టర్లు, పడవల మీద ప్రయాణికులు, రైతులను దాటిస్తున్నారు. కోనసీమ జిల్లాలోని పది మండలాల పరిధిలోని 48 గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీరు వచ్చి చేరింది. సహాయ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి బాధితులకు భోజనాలను అందిస్తున్నారు. అల్లవరం మండలం బోడసుకుర్రు పల్లిపాలెంలో వరద ముంపు మరింత పెరిగింది. 50 వరకు ఇళ్లు నీట మునిగాయి. ఎదురుబిడియం కాజ్వే వద్ద వరద తీవ్రతను గృహ నిర్మాణ శాఖమంత్రి జోగి రమేష్, బోడసకుర్రు వద్ద ముంపు ప్రాంతాలను రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పరిశీలించారు. ఏటిగట్ల పరిరక్షణకు ప్రతి అర కిలోమీటర్‌కు ఒక వలంటీర్ చొప్పున 740 మంది వలంటీర్లను రక్షణగా ఏర్పాటు చేశామని కోనసీమ కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కనకాయలంక, పుచ్చల్లంక వద్ద వరద ఉధృతి మరింతగా పెరిగింది. యలమంచిలి మండలం కనకాయలంక, ఆచంట మండలం అయోధ్యలంక గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాగులో కొట్టుకుపోయి వృద్ధురాలి దుర్మరణం అల్లూరి జిల్లా కూనవరం మండలం దూగుట్టకు చెందిన మడకం భద్రమ్మ (65) అనే వృద్ధురాలు పశువులను మేపేందుకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో కొట్టుకుపోయి మృతి చెందింది. అదే జిల్లాలోని ఎటపాక మండలంలో రాయనపేట వద్ద ప్రధాన రహదారిపై ప్రవహిస్తున్న వరద నీటిలో కారును దాటించేందుకు ప్రయత్నించగా.. ప్రవాహ ఉధృతికి కారు గల్లంతైంది. అందులో ప్రయాణిస్తున్న భద్రాచలం వాసులు ముగ్గురు క్షేమంగా బయటపడ్డారు. స్థానికుల సాయంతో నడుచుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. కాగా.. ఏలూరు జిల్లా పెదవేగి మండలంలో బలివే అడ్డరోడ్డు వద్ద తమ్మిలేరుపై గల రహదారి వరద ఉధృతికి కొట్టుకుపోయింది. వరద విధుల్లో వలంటీర్లు అల్లూరి జిల్లా చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక మండలాల్లో 873 మంది గ్రామ వలంటీర్లు ఉండగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో 550 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరంతా తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ముంపు ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా వారి అవసరాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం అయ్యేలా కృషి చేస్తున్నారు. ఐతవరం వద్ద రాకపోకలు పునరుద్ధరణ ఎన్టీఆర్ జిల్లా నందిగామ సమీపంలో మున్నేటి వరద ఉధృతి క్రమేపి తగ్గుముఖం పడుతోంది. 65వ నంబర్ జాతీయ రహదారిపై ఐతవరం సమీపంలో విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలను గురువారం సాయంత్రం నిలిపివేయగా.. శుక్రవారం 7 గంటల నుంచి వాటి రాకపోకలను అనుమతిస్తున్నారు. ముందుగా కేవలం విజయవాడ వైపు వెళ్లే భారీ వాహనాలను మాత్రమే పంపుతున్నట్టు ఏసీపీ జనార్ధన్ నాయుడు తెలిపారు. పూర్తి స్థాయిలో వరద తగ్గిన తర్వాతే రెండు వైపులా అనుమతిస్తామన్నారు. -
లంక గ్రామాల్లో వరద కష్టాలు
-
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం జగన్
-
డ్రామాల్లేవ్.. దిశా నిర్దేశమే
కోనసీమ నుంచి సాక్షి ప్రతినిధి వరదలు లాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి వనరులను కలెక్టర్ల చేతిలో పెట్టి వారికి దిశా నిర్దేశం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ‘ముంపు బారిన పడ్డ వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, సాయం అందించడంపై దృష్టి పెట్టాలే కానీ డ్రామాలు అనేవి ఉండకూడదు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే వచ్చేసి ఫొటోలకు ఫోజులిచ్చి చంద్రబాబులా టీవీల్లో, పత్రికల్లో పబ్లిసిటీ కోసం పాకులాడకూడదు’ అని వ్యాఖ్యానించారు. మంగళవారం కోనసీమ లంక గ్రామాల్లో పర్యటన సందర్భంగా సీఎం జగన్ నేరుగా బాధితులను కలుసుకుని మాట్లాడారు. సాయం అందలేదని ఒక్కరైనా చెప్పారా బాబూ? ‘చంద్రబాబు ప్రజలకు మేలు జరగకపోయినా ఫర్వాలేదనుకుంటారు. టీవీ, పత్రికలు చేతిలో ఉన్నాయని ప్రచారం చేసుకునే వారు. మన బాబు బంగారం.. బాగా పని చేస్తున్నారంటూ ఈనాడు, ఈటీవీ, టీవీ 5, ఆంధ్రజ్యోతిలో ప్రచారం చేసుకునేవారు. ఇదే పెద్ద మనిషి రెండు రోజుల క్రితం ఇక్కడే (కోనసీమ) తిరిగారు. లంక ప్రాంతాల్లో తమకు సాయం అందలేదన్న వారిని కనీసం ఒక్కరినైనా చూపించలేకపోయారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు వాళ్లు పని చేయడం లేదు... వీళ్లు పనిచేయడం లేదంటూ సస్పెన్షన్లు, డిస్మిస్లు చేసేవారు. ఆర్భాటం చేసి సొంత మీడియాలో పబ్లిసిటీ చేసుకునేవారు’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. -
సీఎం జగన్ ఎదురెళ్లి స్వాగతం పలికిన లంక గ్రామస్థులు
-
సాయం అందుతోందయ్యా..
సాక్షి ప్రతినిధి, ఏలూరు, కాకినాడ / పెనుగొండ: తమ ఊళ్లను వరద ముంచెత్తినప్పటి నుంచీ ప్రభుత్వం తమను ఆదుకుంటోందని, భోజనం, నీళ్లు, వసతి సౌకర్యాలు కల్పించారని లంక గ్రామాల ప్రజలు ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడికి స్పష్టం చేశారు. గురువారం ఆయన పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద పరామర్శ యాత్ర నిర్వహించారు. తొలుత ఆచంట నియోజకవర్గంలోని పెనుగొండ, ఆచంట మండలాల్లో కారు కాన్వాయ్, ట్రాక్టర్, పడవపై పర్యటించి బాధితులతో మాట్లాడారు. పెనుగొండ మండలం దొంగరావిపాలెం చేరుకొన్న చంద్రబాబు.. సిద్ధాంతం, నడిపూడి, చినమల్లం మీదుగా కోడేరుకు వచ్చారు. అక్కడి నుంచి పంటుపై మర్రిమూలం చేరుకున్నారు. భోజనాలు అందుతున్నాయా.. అంటూ పడవపై నుంచే జనాన్ని ప్రశ్నించారు. తాగునీరు, భోజనాలు అందుతున్నాయని ప్రజలు రెండుసార్లు చెప్పినప్పటికీ, మళ్లీ అదే ప్రశ్న వేశారు. ప్రభుత్వంపై అదే పనిగా విమర్శలు మొదలు పెట్టడంతో గోదావరి బ్రిడ్జిపై సమాధానం చెప్పాలంటూ లంకవాసులు గొంతెత్తారు. రెండుసార్లు శంకుస్థాపనకే పరిమితం చేశారని నిలదీశారు. బ్రిడ్జి నిర్మాణం చేయలేకపోయామని, అధికారంలోకి రాగానే నిర్మిస్తామని బాబు హామీ ఇచ్చారు. వాస్తవానికి లంక గ్రామాల్లో ప్రభుత్వం అందిస్తున్న భోజనాలతో పాటు, మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు సొంత ఖర్చులతో భోజనాలు అందిస్తూ లంకవాసుల మన్ననలు పొందుతున్నారు. దీంతో చంద్రబాబు పదేపదే ప్రశ్నించినా ప్రజల నుంచి ఆయనకు సానుకూల స్పందన రాలేదు. హైడ్రామా.. హడావిడి చంద్రబాబు పర్యటనకు జనం నుంచి స్పందన లేకపోవడంతో టీడీపీ నేతలు హైడ్రామాకు తెరతీశారు. మర్రిమూలంలో చంద్రబాబు ప్రసంగం పూర్తయ్యాక.. గ్రామానికి చెందిన కొప్పాడి వీరమ్మ అనే మహిళ చేతికి బురద నీటి వాటర్ బాటిల్ ఇచ్చి ఇవే తాగుతున్నామని చెప్పమన్నారు. దాంతో సదరు మహిళ ఆ వాటర్ బాటిల్ చూపించింది. దానిపై చంద్రబాబు స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘గోదావరి వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. బాధ్యత కలిగిన సీఎం అయితే ఇక్కడే ఉండి ప్రజల కష్టాలు తీర్చాలి. హుదూద్, తిత్లీ తుపాన్ల సమయంలో తుపాన్ కంటే వేగంగా ఈ ప్రాంతానికి వచ్చి ఆదుకున్నాం. బాధిత కుటుంబాలకు కేవలం రూ.2 వేలు ఇస్తున్నారు’ అని అన్నారు. ఇదిలా ఉండగా.. చంద్రబాబు వెళ్లిన అనంతరం విలేకరులు కొప్పాడి వీరమ్మను ఈ నీళ్లే తాగుతున్నారా.. అని ప్రశ్నించగా.. అదేమీ లేదని చెప్పింది. టీడీపీ వాళ్లు ఆ బాటిల్ ఇచ్చి, అలా చెప్పమని బలవంతం చేశారంది. తమకు రోజూ భోజనం, మంచి నీళ్లు అందుతున్నాయని చెప్పింది. దారిపొడవునా పూల దండలు, బొకేలు.. అనంతరం చంద్రబాబు గోదావరిలో పంటుపై కోనసీమ జిల్లా రాజోలు మండలం సోంపల్లికి చేరుకున్నారు. ఆ తర్వాత బాబు.. సోంపల్లి నుంచి పి.గన్నవరం మండలం చాకలిపాలెం వెళ్లారు. అక్కడ నుంచి మానేపల్లి చేరుకున్నారు. ఎక్కడికక్కడ ముందస్తుగా తరలించిన పార్టీ శ్రేణులు ఆయనకు భారీగా స్వాగతం పలికి హడావిడి చేశాయి. దారిపొడవునా పుష్పగుచ్ఛాలు, పూల దండలు, బొకేలతో కార్యకర్తలు హంగామా చేశారు. సీఎం.. సీఎం.. అని నినాదాలు చేశారు. మానేపల్లిలో.. మృతి చెందిన కడలి శ్రీనివాసరావు, కారాడి రామకృష్ణ కుటుంబాలను చంద్రబాబు పరామర్శించారు. వారి కుటుంబాలకు రూ.75 వేల చొప్పున పరిహారం అందించారు. ఈ పర్యటన ఆద్యంతం పార్టీ ప్రచారం, బల ప్రదర్శనను తలపించింది. -
లంక గ్రామంలో తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
-
లంక గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు
-
లంక వీడని జనం.. గోదారి ఈదుతున్న యంత్రాంగం
(పశ్చిమ గోదావరి లంక గ్రామాల నుంచి సాక్షి ప్రతినిధులు ఐ.ఉమామహేశ్వరరావు, వీఎస్వీ కృష్ణకిరణ్): చుట్టుముట్టిన వరద.. ఇళ్లను వదిలి రావడానికి ఇష్టపడని లంక వాసులు.. ప్రజాప్రతినిధులు, అధికారులు ఎంత బతిమాలినా లంక వీడేదిలేదని మంకుపట్టు. గత్యంతరం లేక ప్రభుత్వ యంత్రాంగామే పడవలతో గోదావరి దాటుకుని లంకల్లోకి వెళ్లి నిత్యావసరాలు అందిస్తోంది. ప్రతి ఒక్కరినీ ఆదుకుంటోంది. లంక వాసుల క్షేమం కోసం గోదావరి గట్టుపై పోలీసులు, ఫైర్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు, గజ ఈతగాళ్లను నియమించింది. వారు కంటి మీద కునుకులేకుండా గస్తీ కాస్తున్నారు. ప్రజా ప్రతిప్రతినిధులు కూడా వరద నీటిలో గ్రామాలకు వెళ్తున్నారు. శనివారం రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ ఆచంట, పాలకొల్లు, నర్సాపురం నియోజకవర్గాల్లో పర్యటించి వరద సహాయక చర్యలను సమీక్షించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రభుత్వం 18 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. వరద బాధితులకు పాలు, గుడ్లు, బ్రెడ్, బిస్కెట్ ప్యాకెట్లు, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్ర భోజనం, వసతి ఏర్పాట్లు చేసింది. ఆచంట నియోజకవర్గంలోని పెదమల్లంక, కోడేరు లంక, అయోధ్యలంక, రావి లంక, పుచ్చల లంక, అణగారి లంకల ప్రజలు కొంత మంది మాత్రమే పునరావాస శిబిరాలకు వచ్చారు. ఈ లంకలకు చెందిన మిగతా వారితోపాటు భీమలాపురం, ఏటిగట్టు ప్రాంత వాసులు సైతం గ్రామాలను వీడి వచ్చేందుకు ఇష్ట పడలేదు. దీంతో ప్రభుత్వ యంత్రాంగమే పడవలపై లంక గ్రామాలకు వెళ్తోంది. వారికి బియ్యం, కూరగాయలు, నూనె, కందిపప్పు, మంచినీరు, పాలు, గుడ్లు వంటి నిత్యావసరాలను అందిస్తోంది. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు నాలుగు రోజులుగా సిద్దాంతం, ఆచంట మండలంలోని లంక ప్రాంతాల్లో బోట్లపై ప్రయాణిస్తూ లంక వాసుల బాగోగులు చూస్తున్నారు. పునరావాస కేంద్రాల్లోని వారికి ఆహారం, లంకల్లో ఉండిపోయిన వారికి సరుకులు అందించేలా సమన్వయం చేస్తున్నారు. ఆయన శనివారం భోజనాలతోపాటు 600 కిలోలకు పైగా చికెన్, 2 వేలకుపైగా గుడ్లను బాధితులకు అందించారు. ప.గోదావరి జిల్లా లంక గ్రామాల్లోని వారి కోసం నిత్యావసరాలను తరలిస్తున్న దృశ్యం పగలంతా పడవలో.. రాత్రయితే పునరావాసంలో.. దొడ్డిపట్ల రేవులో గోదావరి కట్టకు దిగువన 150పైగా కుటుంబాలు జీవిస్తున్నాయి. కట్టకు సమాంతరంగా వరదనీరు ప్రవహిస్తున్నప్పటికీ నీట మునిగిన ఇళ్ల వద్దే వారంతా పడవల్లో ఉంటున్నారు. ఇళ్లలో సామాన్లు దాదాపు 240 పడవల్లో వేసి, వర్షానికి తడవకుండా బరకాలు కప్పి వాటిపైనే పిల్లలు, పెద్దలు ప్రమాదకర స్థితిలో జీవిస్తున్నారు. పగలు పడవల్లో, రాత్రి పునరవాస కేంద్రాల్లో ఉంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఎంత నచ్చచెప్పినా సురక్షిత ప్రాంతాలకు రావడంలేదు. రెవెన్యూ, పోలీస్, ఫైర్, తదితర సిబ్బంది వారి కోసం గట్టుపై గస్తీ కాస్తున్నారు. దొడ్డిపట్ల రేవు వద్ద గోదావరి గట్టు బలహీనంగా ఉన్న ప్రాంతంలో వరదనీరు గ్రామంలోకి చొచ్చుకుని వస్తుండటంతో యుద్ధ ప్రాతిపదికన గట్టును పటిష్టం చేశారు. డేంజర్ జోన్లో నర్సాపురం గోదావరి నీరు సముద్రంలో కలిసే నర్సాపురానికి వరద తాకిడి ఆందోళనకరంగా మారింది. వరదనీరు నర్సాపురం – పాలకొల్లు ప్రధాన రహదారి పైకి సైతం చేరింది. స్లూయిజ్‌ల నుంచి నీరు వస్తుండడంతో ప్రభుత్వ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ముదనూరి ప్రసాదరాజు నాలుగు రోజులుగా యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. శనివారం రాత్రి వరదనీరు పట్టణంలోకి రాకుండా చర్యలు చేపట్టారు. అన్నానికి మాత్రమే వెళ్తున్నాను! గోదావరి ఇంత ఉధృతంగా ప్రవహించడం మునుపెన్నడూ చూడలేదు. ఏటు గట్టు పక్కనే ఉంటున్న మా ఇల్లు పైకప్పు వరకు మునిగిపోయింది. పది అడుగులు మేర ప్రవాహం ఒక్కసారిగా పెరిగిపోవడంతో సామగ్రిని పడవల్లో వేసి తాళ్లతో చెట్లకు కట్టేశాం. భార్య, బిడ్డలను దొడ్డిపట్ల ప్రభుత్వ హైస్కూల్లోని సహాయక శిబిరంలో ఉంచి నేను రేయింబవళ్లు పడవలను కాపలా కాస్తున్నాను. ప్రభుత్వం మూడు పూటలా ఆహారం అందిస్తుండటంతో ఆ కాసేపు శిబిరానికి వెళ్లి మళ్లీ పడవల దగ్గరకు వచ్చేస్తున్నా. – కొప్పాడి శ్రీను, మత్స్యకారుడు, దొడ్డిపట్ల శివారు, యలమంచిలి మండలం బడిలో తలదాచుకుంటున్నాం! మాకు ముంపు అలవాటే. కానీ, ఈ సారి భయపడేంతగా వచ్చింది. కొబ్బరి చెట్టులో సగభాగం నీళ్లలో నానుతోంది. నేను కూలికి వెళితే, మా ఇంటాయన పడవలో ఇసుక తవ్వగా వచ్చిన డబ్బులతో నాలుగు నూకలు కొనుక్కునే వాళ్లం. వారం రోజులుగా ఏ పనీ లేదు. ఇల్లు వదిలి బడిలో తలదాచుకుంటున్నాం. ప్రభుత్వమే అన్నం పెడుతోంది. అధికారులు రెండు పూటలా మమ్మల్ని చూసి వెళ్తున్నారు. – లంకె సత్యవతి, దొడ్డిపట్ల పునరావాస కేంద్రం, యలమంచిలి మండలం అమ్మ చిరునవ్వు వెనుక.. ఊహకందని ఉప్పెనలో.. ఊహ తెలియని చిన్నారితో.. వీపుపై ఊయల ఊపుతూ.. కష్టమంతా కొట్టుకుపోయినా.. కన్నీళ్లు పెట్టించినా.. ఒడ్డుకొచ్చిన ఊపిరితో.. చిరునవ్వులోనే బాధను దాచుకున్న ఈ మహిళ పేరు సెరి మరియమ్మ. మత్స్యకార కుటుంబానికి చెందిన ఈమె భర్తతో కలిసి దొడ్డిపట్ల ప్రభుత్వ పాఠశాలలోని సహాయక శిబిరంలో తలదాచుకుంటోంది. ప్రభుత్వం ఇచ్చే పాలతో బిడ్డకు ఉగ్గుపడుతూ.. తానూ ఇంత అన్నం తింటోంది. శనివారం ముంపు లంకల్లో పర్యటించిన సాక్షి బృందానికి కనిపించిన చిత్రమిది. -
బిక్కుబిక్కుమంటున్న కోనసీమ లంక గ్రామాలు
-
జలదిగ్బంధంలో చిక్కుకున్న లంక గ్రామాలు
-
లంకగ్రామాల్లో పర్యటించిన పామర్రు ఎమ్మెల్యే
సాక్షి, కృష్ణా: వరదలపై తాజా పరిస్థితిని అంచనా వేయడానికి పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ జిల్లాలోని లంక గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. తోట్లవల్లూరు లంకగ్రామల్లో మునిగిన పంటలను పరిశీలించిన ఎమ్మెల్యే, వల్లూరుపాలెం పునరావాసకేంద్రంలో బాధితులతో కలసి భోజనం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహనరెడ్డి ఆదేశాలతో సహాయకచర్యలు చర్యలు చేపట్టామని, ప్రభుత్వం భాదితులకు అన్ని విధాలా అండగా ఉటుందని పేర్కొన్నారు. ఈ మేరకు పంట నష్టాన్ని అంచనావేసి రైతులకు త్వరితగతిన నష్టపరిహారం అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అంతేకాక వరద పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకూ బాధితులను పునరావాస కేంద్రాల్లోనే ఉంచి వారికి ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. లంకగ్రామల్లో అంటువ్యాధులు ప్రభలకుండా శానిటేషన్ పై దృష్టి సారించి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. -
ముంపులోనే లంక గ్రామాలు!
సాక్షి, అమరావతి/కొల్లూరు/సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టినప్పటికీ నదీ తీరంలోని లంక గ్రామాల్లో ఆదివారం కూడా వరద ముప్పు కొనసాగింది. గుంటూరు జిల్లాలో ప్రధానంగా తాడేపల్లి, కొల్లిపర, దుగ్గిరాల, భట్టిప్రోలు, కొల్లూరు, అమరావతి, దాచేపల్లి మండలాల్లో 29,754.75 ఎకరాల్లో ఉద్యాన, వాణిజ్య పంటలు నీట మునిగాయి. మిరప, అరటి, బొప్పాయి, నిమ్మ, మామిడి, కొబ్బరి, జామ, పసుపు, కంద, కూరగాయల తోటలు, పూల తోటలు, పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొల్లిపర, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పడవల ద్వారా వెళ్లి అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. లంక గ్రామాల్లో కొంత నీరు తగ్గినప్పటికీ పంట పొలాల్లో మాత్రం అలానే ఉండటంతో పంటలు కుళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. అమరావతి– విజయవాడ మధ్య ఇంకా రాకపోకలు సాగడం లేదు. సహాయక బృందాలకు ప్రశంసలు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఫైర్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. గత రెండు రోజుల్లో అన్నవరపులంకలో 100 మందిని, జువ్వలపాలెంలో 50 మందిని, పల్లెపాలెంలో 80 మందిని వరద ముప్పు నుంచి ఫైర్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. రెండు జిల్లాల్లో 23,551 మందిని సహాయ శిబిరాలకు తరలించాయి. శిబిరాల్లో బాధితులకు భోజనం, వైద్యం, వసతి సౌకర్యాలు కల్పించారు. విజయవాడ రామలింగేశ్వరనగర్లో విధులు నిర్వహించిన ఫైర్ సిబ్బంది సేవలకు నెటిజన్లు సైతం ఫిదా అయ్యారు. ముంపు ప్రాంతం నుంచి బోటులో తీసుకొచ్చిన బాలింతను కిందకు దించేందుకు ఓ ఫైర్ ఉద్యోగి తనే స్టూల్గా మారి బాలింతకు ఊతమిచ్చాడు. ఆయన వీపుపై కాలు మోపి ఆ బాలింత సురక్షితంగా కిందకు దిగింది. శనివారం జరిగిన ఈ సన్నివేశం ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి సుచరిత వరదల కారణంగా నష్టపోయినవారిని ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండల పరిషత్ కార్యాలయంలో ఆదివారం అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. వైఎస్ జగన్ విదేశీ పర్యటన నుంచి రాగానే వరదలపై సమీక్ష నిర్వహించి నష్టపరిహారం ప్రకటిస్తామన్నారు. కృష్ణా జిల్లాలో ఒకరు, గుంటూరు జిల్లాలో మరొకరు వరద కారణంగా ప్రాణాలు కోల్పోయారన్నారు. వరదల ప్రభావం గుంటూరు జిల్లాలో 53 గ్రామాలపైనా, కృష్ణా జిల్లాలో 34 గ్రామాలపైనా ఉందన్నారు. రెండు జిల్లాల్లో 17,491 మంది వరద ముంపు బారిన పడ్డారని వివరించారు. సీఎం ఆదేశాల మేరకు సహాయ చర్యలు చేపడుతున్నామని, ఆహార పొట్లాలు, పెరుగు, పాలు, తాగునీరు సరఫరా చేస్తున్నామన్నారు.వ్యాధులు ప్రబలకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. సమావేశం అనంతరం మంత్రి కొల్లూరు, దోనేపూడి గ్రామాల్లో కరకట్ట దిగువన వరద ప్రాంతాలను పరిశీలించారు. కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, జేసీ దిలీప్‌కుమార్, ఆర్డీవో శ్యామ్‌ప్రసాద్, డీఎస్పీ శ్రీలక్ష్మి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా కొల్లిపరలో తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, కలెక్టర్ శామ్యూల్ వరద పరిస్థితిపై ఆరా తీశారు. కొల్లూరు, పెసర్లంకలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత లేళ్ల అప్పిరెడ్డి పర్యటించారు. హెచ్చెల్సీ, హంద్రీనీవా కాలువలకు గండ్లు బొమ్మనహాళ్/ఉరవకొండ: తుంగభద్ర, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నా కాలువలకు అడుగడుగునా గండ్లు పడుతుండటంతో ఆశలు ఆవిరవుతున్నాయి. ఆదివారం హెచ్చెల్సీ కాలువకు, హంద్రీనీవా డిస్ట్రిబ్యూటరీకి గండ్లు పడి నీరు వృథా అయ్యాయి. తుంగభద్ర ఎగువ కాలువ (హెచ్చెల్సీ)కు బొమ్మనహాళ్ మండలంలోని మైలాపురం సమీపంలో 122–200 కిలోమీటరు వద్ద ఆదివారం గండి పడి నీరు వృథాగా పారింది. కాగా, హంద్రీ నీవా 34వ ప్యాకేజీలో భాగంగా నిర్మించిన డీ2 డిస్ట్రిబ్యూటరీ కాలువకు భారీ వర్షంతో మూడు చోట్ల గండి పడింది. వరద నీటిలో బోటు కార్మికుడి గల్లంతు భట్టిప్రోలు(వేమూరు):కృష్ణా నది లంక గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు వెళ్లిన బోటు కార్మికుడు విద్యుదాఘాతానికి గురై వరద నీటిలో మునిగి గల్లంతయ్యాడు. మరొక కార్మికుడి పరిస్థితి విషమంగా ఉంది. కొల్లూరు మండలం ఈపూరులంక నుంచి బోటులో పెదపులివర్రు వైపు వస్తుండగా విద్యుత్ తీగలు అడ్డుపడ్డాయి. వాటిని చేతితో పైకెత్తడంతో రేపల్లె మండలం పెనుమూడికి చెందిన వల్లభనేని వెంకట్రాజు (27) షాక్‌కు గురై బోటులోంచి వరద నీటిలో పడిపోయి గల్లంతయ్యాడు. అదే గ్రామానికి చెందిన ఒడుగు ప్రభుదాస్ (37) కూడా షాక్‌కు గురికాగా.. అతడు బోటులో పడిపోయాడు. అతడిని తోటి కార్మికులు వెల్లటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆస్పత్రికి చేరుకుని మెరుగైన వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టారు. గల్లంతైన వెంకట్రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
వరద పొడిచిన లంక గ్రామాలు
సాక్షి, అమరావతి: కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతూనే ఉంది. సాగర్, పులిచింతల ప్రాజెక్టులను ముంచెత్తుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతుండడంతో వరద నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. వరద దెబ్బకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో లంక గ్రామాలకు ముప్పు ఏర్పడింది. పల్నాడుతోపాటు డెల్టా ప్రాంతంలో ఇప్పటికే సాగులో ఉన్న పంటలు నీట మునిగాయి. రాజధాని ప్రాంతంలో వాగులు ఉప్పొంగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరాయి. లంక గ్రామాలను వరద చుట్టుముట్టడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటించి ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న మంత్రి మోపిదేవి, ఎంపీ సురేష్, ఎమ్మెల్యే నాగార్జున ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదికి వరద కొనసాగుతూనే ఉంది. జిల్లాలోని నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుకు నుంచి దిగువకు భారీగా నీటి విడుదల చేస్తుండటంతో కృష్ణా నది పరివాహక ప్రాంతంలోని పలు గ్రామాల్లోకి నీరు చేరుతోంది. పలు లంక గ్రామాలు నీట మునిగాయి. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం రాత్రికి వరద ప్రకాశం బ్యారేజీకి చేరుతుందన్న అంచనాతో లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మాజీ సీఎం చంద్రబాబు నివాసంలోకి నీరు చేరాయి. కరకట్ట లోపల ఉన్న పలు గృహాలలోకి వరద నీరు వచ్చింది. అక్కడ ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ముంచెత్తిన వరద కృష్ణా నది పరివాహక ప్రాంతాలు, దాచేపల్లి మండలంలోని పొందుగల, కాట్రపాడులో దాదాపు 500 ఎకరాలు, అచ్చంపేట మండలంలోని కస్తల, అంబడిపూడి, క్రోసూరు, మాదిపాడు, అమరావతి, పెద్దమద్దూరు, మునుగోడు, మల్లాది, దిడుగు, ధరణికోట ప్రాంతాల్లో సుమారు 6,500 ఎకరాల్లో పత్తి, మిరప పంటలు నీటి పాలయ్యాయి. పెద్దమద్దూరు గ్రామంలోకి నీరు చేరింది. విజయవాడ– అమరావతి– క్రోసూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి–ధరణికోట మధ్య గన్నేరువాగు, జూపూడి–మునుగోడు మధ్య నక్కల వాగు ప్రవహించటంతోనే ఇబ్బందులు తలెత్తాయి. తుళ్లూరు మండలంలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. తాడేపల్లి కరకట్ట లోపల ఉన్న ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరింది. వరద వచ్చిన విషయాన్ని టీడీపీ నేతలు రాద్ధాంతం చేసి హంగామా చేశారు. మాదిపాడు చప్టాపై ప్రయాణికుల రాకపోకలకు ఏర్పాటు చేసిన పడవ లంక గ్రామాల్లో పంటలు నీట మునక కొల్లిపర మండలంలో అన్నవరపు లంక, కొత్తలంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ గ్రామాలకు బోట్లపైన వెళ్లాల్సి వస్తోంది. వల్లభాపురం,, మున్నంగి, పిడపర్రు, పిడవర్తిపాలెం, పాతబొమ్మవానిపాలెం, అన్నవరం, అన్నవరపులంక, కొత్తూరులంకలో పంట పొలాల్లోకి నీరు చేరాయి. ఈ మండలంలో 2815.75 ఎకరాల్లో అరటి, పసుపు, కంద, జామ నిమ్మ, కూరగాయల తోటల్లోకి నీరు వచ్చినట్లు ప్రాథమిక అంచనా వేశారు. కొల్లూరు మండలంలో పెసర్లంక–అరవింద వారధి సమీపంలో గండి పడటంతో రోడ్డు కోతకు గురైంది. అరవిందవారిపాలెంలో చినపాయలోకి నీరు ప్రవేశించకుండా వేసిన అడ్డుకట్టకు గండి పడటంలో పలు గ్రామాల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. దీంతో చిలుమూరు లంక, సుగ్గులంక, ఈపూరిలంక, చింతర్లక, పెసరలంక, పెదలంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోతార్లంక, తిప్పలకట్ట, తోకల వారిపాలెం, కిష్కింపాలెం, జువ్వలపాలెం పంట పొలాల్లోకి నీరు చేరింది. దాదాపు 4000 ఎకరాల్లో పసుపు, కంద, అరటి, బొప్పాయి, మొక్క జొన్న పంటలు మునిగిపోయాయి. కొల్లూరు మండలం పెసర్లంక వద్ద పడిన గండితో రాకపోకలకు అంతరాయంగా మారింది. దుగ్గిరాల మండలంలో వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ముంపు గ్రామాల్లో మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ పర్యటన కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, రేపల్లి భట్టిప్రోలు, ప్రాంతాల్లో మంత్రి మోపిదేవి వెంకటరమణరావు, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, కలెక్టర్ ఐ.శ్యామూల్ అనందకుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్‌కుమార్ పర్యటించారు. కొల్లూరులో వరద పరిస్థితిపై మంత్రి మోపిదేవి వెంకటరమణరావు అధికారులతో సమీక్షించారు. ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. తాగు నీరు, భోజనం అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. తుళ్లూరు మండలంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. తాడేపల్లిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పర్యటించి వరద పరిస్థితిని అంచనా వేశారు. అమరావతి మండలంలో నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు. గజ ఈతగాళ్లను, పడలవలను సిద్ధంగా ఉంచారు. వరద నివారణకు ప్రత్యేక చర్యలు పోతార్లంక వద్ద వరదలో చిక్కుకుపోయిన వారిని కాపాడుతున్న గజ ఈతగాళ్లు గుంటూరు జిల్లాలో వరద ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా 60 మంది సభ్యులు గల ఎన్డీఆర్ఎఫ్ బృందాలను విజయవాడ, కొల్లిపర, కొల్లూరు, తెనాలిలో సిద్ధంగా ఉంచారు. జిల్లాలోని 12 మండలాలు, 39 గ్రామాల్లో 537 కుటుంబాలు, 709 మంది ప్రజలకు వరద ముప్పు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో 8 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 1619 మంది తరలించారు. సాగర్ రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో 7,13,052 క్యూసెక్కులు వస్తుండగా, బయటకు 7,13,042 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 8,39,136 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 7,97,502 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ఫ్లో 7,57,005 క్యూసెక్కులు వస్తుండగా దిగువకు 7, 71,134 క్యూసెక్కులను పంపుతున్నారు. శనివారం నాటికి వరద ఉద్ధృతి పెరిగి దాదాపు 10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉంది. -
ముంపులోనే పశ్చిమ గోదావరి లంక గ్రామాలు