ఆచంట మండలం కోడేరులో నీట మునిగిన కర్మల భవనం
జలదిగ్బంధంలో పలు లంక గ్రామాలు
Published Sun, Aug 4 2013 2:28 PM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
గోదావరి ఉగ్రరూపం దాల్చడంలో పశ్చిమ జిల్లాలో పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఆచంట, యలమంచలి మండలంలోని పలు గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. రోడ్డుపై పది అడుగుల మేర నీరు ప్రవహిస్తుండటంతో ఇళ్లు, విద్యుత్ స్తంభాలు, మంచి నీటి బోర్లు, కొబ్బరి చెట్లు నీట మునిగాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు దిక్కుతోచని స్థితిలో కాలం గడుపుతున్నారు.
కనకాయలంక కాజ్ వే మునకతో తూర్పు గోదావరి-పశ్చిమగోదావరి జిల్లాలోని మధ్య రాక పోకలు నిలిచి పోయాయి. బోట్లు పడవల సాయంతో ప్రజలు బయటకు వస్తున్నారు. దీంతో స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముంపు గ్రామాల మండలాలకు ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు ఎప్పటికప్పడూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కాగా, మరోమారు కొవ్వూరు గోపాద క్షేత్రం నీట మునిగింది. చుట్టు ప్రక్కల గిరిజన గ్రామాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. జిల్లాలోని వరద పరిస్థితిని కలెక్టర్ సమీక్షించారు. కొవ్వూరు మండలం మద్దరూ లంకలో వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. ఏలూరు సహా అన్ని డివిజన్ లలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేశారు.
Advertisement
Advertisement