![People Are Afraid Due To Damage Of Apartment Pillars Which Is Ready To Collapse In AP - Sakshi](/styles/webp/s3/article_images/2021/07/29/BVRM.jpg2_.jpg.webp?itok=eMgPWcPD)
పశ్చిమ గోదావరి: భీమవరంలో ఓ అపార్ట్‌మెంట్ పిల్లర్లు దెబ్బతిన్నాయి. దీంతో అపార్ట్‌మెంట్ ఎప్పుడు కూలుతుందో.. అని దానిలో నివాసం ఉండేవారు, పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అపార్ట్‌మెంట్ నాణ్యతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, అపార్ట్‌మెంట్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉండేవారు జాకీలు ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం అపార్ట్‌మెంట్‌లో పిల్లర్లు విరిగి భారీ శబ్దలు రావడంతో నివాసం ఉండే వారు రోడ్డుపైకి పరుగులు తీశారు. 2004లో కట్టిన ఈ అపార్ట్‌మెంట్‌లో 20 కుటుంబాలు వరకూ నివసిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక అపార్ట్‌మెంట్‌కు నోటీసులు ఇచ్చిన మున్సిపల్ అధికారులు.. అందులో ఉండేవారిని ఖాళీ చేయిస్తున్నారు. నాణ్యతా లోపం వల్ల అపార్ట్‌మెంట్ ఎక్కడికక్కడ బీటలు తీసింది. దీనికి మరమ్మత్తులు చేసినా ప్రయోజనం లేకపోవడంతో అందులో ఉన్న వారిని ఖాళీ చేయించడం ఒక్కటే మార్గంలా కనబడుతుంది. లక్షలు పోసి కొనుక్కున్న అపార్ట్‌మెంట్ ఇలా కూలిపోవడానికి సిద్ధంగా ఉండటంతో అందులో ఉన్న వారు ఏం చేయాలో తెలియని డైలమాలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment