విశాఖ జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు.
పెందుర్తి: విశాఖ జిల్లాలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. పెందుర్తిలో ఆగంతకులు ఓ గృహిణి కాళ్లు చేతులు కట్టేసి బంగారు ఆభరణాలను దోచుకుపోయారు.
బుధవారం మధ్యాహ్నం పెందుర్తిలోని రిషి అపార్ట్‌మెంట్‌లోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించారు. ఓ ఫ్లాట్‌లోకి చోరబడి కె.వెంకటలక్ష్మి అనే మహిళను బెదిరించి ఆమె కాళ్లు, చేతులు కట్టేశారు. తర్వాత ఆమె మెడలోని బంగారు తాడు, బీరువాలో ఉన్న నాలుగున్నర తులాల బంగారం అపహరించుకుపోయారు. బుధవారం సాయంత్రం ఆమె భర్త ఇంటికి వచ్చిన తర్వాత విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.