అమెరికాలో దోపిడి దొంగల కాల్పులు.. తెలుగు యువకుడి దుర్మరణం | A Guy From Visakhapatnam Shot dead In A Robbery At Alabama In US | Sakshi
Sakshi News home page

అమెరికాలో దోపిడి దొంగల కాల్పులు.. తెలుగు యువకుడి దుర్మరణం

Feb 12 2022 3:27 PM | Updated on Feb 12 2022 8:29 PM

A Guy From Visakhapatnam Shot dead In A Robbery At Alabama In US - Sakshi

అమెరికాలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే లూటీలకు ప్రయత్నిస్తున్నారు. తుపాకులు చేతబట్టి కాల్పులకు తెగపడుతున్నాడు. అలబామలోని బిర్మింగ్‌హమ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు యవకుడు ప్రాణాలు కోల్పోయాడు. 

విశాఖపట్నం సిటీకి చెందిన సత్యకృష్ణ చిట్టూరి (27) గతేడాది వివాహం అయ్యింది. భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అయితే అమెరికాలో ఉన్నత విద్య చదవాలనే లక్ష్యంతో గత నెల అప్పు చేసి మరీ అమెరికా చేరుకున్నాడు. అలబామ రాష్ట్రంలోని బిర్మింగ్‌హామ్‌ల్‌లో ఓ క్రౌన్‌ సర్వీస్‌ స్టేషన్‌ అనే స్టోర్‌లో క్లర్క్‌గా పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు.

ఫిబ్రవరి 11న సత్యకృష్ణ పని చేస్తున్న స్టోర్‌లో దోపిడికి దొంగలు యత్నించారు. ఆయుధాలు చేతబట్టి స్టోర్‌లోకి చొరబడ్డారు. అరడుగుల పొడవుతో నల్లని స్వెట్‌షర్ట్‌ ధరించిన దుండగుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు నేరుగా తాకడంతో సత్యకృష్ణ అక్కడిక్కడే మరణించాడు.

సత్యకృష్ణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫోటోలు రిలీజ్‌ చేశారు. కాల్పులు జరిపి సత్యకృష్ణ చావుకి కారణమైన దుండగుడి ఆచూకీ తెలిస్తే తెల్లడేగా కౌంటీ పోలీసులకు తెలపాలంటూ కోరారు. 

చదవండి: న్యూయార్క్‌లో బాపూజీ విగ్రహం ధ్వంసం.. ఎన్నారైల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement