alabama
-
మిస్ అలబామాగా ప్లస్ సైజ్ మోడల్..!
అందం అంటే నాజుగ్గా, శిల్పంలా ఉండటమే కాదని ప్రూవ్ చేసిందామె. ఆత్మవిశ్వాసం, తనపై తనకు నమ్మకం ఉంటే..ప్లస్ సైజులో ఉన్నా బ్యూటీగా గెలవొచ్చని చాటి చెప్పింది. అందం అంటే ఆకృతికి సంబంధించింది కాదని మానసిక సౌందర్యమే నిజమైన అందమని తెలియజెప్పింది. అంతేగాదు బాడీ షేమర్ల చెంపచెళ్లుమనేలా అందాల పోటీల్లో గెలిచి చూపించింది. సోషల్ మీడియా, సినిమాల పుణ్యామా అని అందం మీద మోజు ఎక్కువయ్యింది. కేవలం నాజుగ్గా, చెక్కిన శిల్పంలా ఉంటేనే అందం అన్నట్లుగా భావిస్తున్నారు చాలామంది. ఆఖరికి రంగు విషయంలో కూడా అవహేళనలే. తెల్ల తోలు ఉన్న వాళ్లు తప్ప మిగతా వాళ్లెవరూ కంటికి ఆనరు అనేంతగా ఉంది ప్రస్తుతం పరిస్థితి. ముఖ్యంగా యువతలో ఇది మరీ ఎక్కువగా ఉంది. దీంతో జన్యు పరంగానో లేదా అనారోగ్య కారణాల వల్లనో లావుగా ఉన్నవాళ్లు సమాజం నుంచి పలు చిత్కారాలు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి అవమానాలనే ఎదుర్కొంది సారా మిల్లికెన్. సారా మెంటల్ హెల్త్ లాయర్(మానసిక ఆరోగ్య న్యాయవాది). చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు బాడీ షేమింగ్‌కి గురయ్యింది. సోషల్‌మీడియాలో కూడా తన ఆకృతి విషయమై ట్రోల్స్ బారిన పడింది. అయినా సరే తనలాంటి వాళ్లు కూడా అందాల పోటీల్లో విజేతలవ్వగలరు అని చెప్పాలన్న సంకల్పంతో మిస్ అలబామా అందాల పోటీల్లో పాల్గొంది. రెండు సార్లు కిరీటం కోసం పోటీపడి త్రుటిలో చేజారిపోయింది. ఆ టైంలో కూడా ఆమె విశ్వాసాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు ఎదుర్కొంది. దీంతో మళ్లీ ఈ పోటీల్లో పాల్గొనకూడదు అని వెనక్కి వచ్చేసింది. అలా ఏడేళ్ల పాటు ర్యాపింగ్కి దూరంగా ఉంది. మళ్లీ అందాల పోటీల్లో పాల్గొనకపోవడం అంటే..ఆ వ్యక్తి అన్న మాటను తాను అంగీకరించి వచ్చేసినట్లే కదా అన్న బాధ వెంటాడింది సారాని. తనలో ఎలాగైన ఆ అవహేళనలు, బాడీ షేమర్లను తిప్పికొట్టేలా ఈ పోటీల్లో గెలవాలన్న కసి పెరిగింది. ఆ పట్టుదలే సారాని మిస్ అలబామా 2024లో కిరీటాన్ని దక్కించుకునేలా చేసింది. అంతేగాదు ఆ వేదికపైనే తన ఆకృతి గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. విరుచుకుపడింది. తన గెలుపుతో హేళన చేసే వారి చెంప చెళ్లుమనిపించేలా చేసింది. అంతేగాదు దయచేసి ఎవ్వరూ మరొకరి శరీరాన్ని అగౌరవపరచొద్దు, మానసిక సౌందర్యానికే ప్రాధాన్యత ఇవ్వండి అని కోరింది సారా. మహిళలు మనసు పెట్టి సాధించాలనుకుంటే కచ్చితంగా సాధించగలరని సోషల్ మీడియా వేదికగా తనలాంటి వాళ్లను మోటీవేట్ చేస్తుంటుంది సారా. అంతేగాదు సోషల్ మీడీయా ట్రోల్స్‌కి చాలా వ్యూహాత్మకంగా కౌంటర్లు ఇచ్చేది. దీంతో సారాకు అనూహ్యంగా వేలాది మంది నెటిజన్ల మద్దతు లభించేది. అదే ఆమెకు ఎక్కవ మంది ఫాలోవర్స్‌ని తెచ్చిపెట్టింది. అంతేగాదు ఇలా ఆన్లైన్లో టైప్ చేసే బాడీ షేమింగ్ వ్యాఖ్యలు ప్రజల్లో అనుచిత ముద్ర వేస్తాయంటూ.. అంటించే చురకలు అందరిలోనూ చైతన్యం తీసుకువచ్చేలా చేసింది. ఈ వైఖరే సారానీ మిస్ అలబామాగా అందాల పోటీలో విజేతగా నిలబెట్టింది. ఇప్పుడామెకు ఈ విజయానికి గానూ సోషల్ మీడియా నుంచి వేలాదిగా ప్రశంసలు వెల్లువలా వస్తున్నాయి. (చదవండి: వంద కోట్ల స్కాం బయటపెట్టిన అధికారిని పిచ్చోడని వేటు వేశారు..కట్ చేస్తే 15 ఏళ్ల తర్వాత) -
US: అమెరికాలో మరో భారతీయుడి హత్య
అలబామా: అమెరికాలో భారతీయుల వరుస మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా సిక్కులకు సంబంధించిన ఒక కీర్తన కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన మ్యూజిక్ డైరెక్టర్ రాజ్‌సింగ్ అలియాస్ గోల్డీ(23)ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. కీర్తన కార్యక్రమంలో పాల్గొని గురుద్వారా బయటికి వచ్చిన తర్వాత జరిగిన కాల్పుల్లో రాజాసింగ్ మృతిచెందాడు. రాజాసింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని టండా సాహువాలా గ్రామం. ఐదేళ్ల క్రితమే రాజాసింగ్ తండ్రి మరణించాడు. కుటుంబానికి రాజాసింగ్ సంపాదనే ఆధారం. రాజాసింగ్ మృతదేహాన్ని భారత్ తీసుకువచ్చేందుకు సాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అతడి కుటుంబం కోరింది. కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలతో భారత్, భారత సంతతికి చెందిన వారి మరణాలు ఎక్కువయ్యాయి. గడిచిన రెండు మూడు నెలల కాలంలో అమెరికాలో మరణించి వారిలో భారత విద్యార్థులతో పాటు ఒక వ్యాపారవేత్త కూడా ఉండటం గమనార్హం. ఈ వరుస మరణాలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది. మరణాల వెనుక ప్రత్యేక కుట్ర లేదని స్పష్టం చేసింది. ఇదీ చదవండి.. ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం -
ప్రపంచంలో తొలిసారి ఇలాంటి మరణశిక్ష
అతనో కాంట్రాక్ట్ కిల్లర్. ఓ వ్యక్తి ఇచ్చిన సుపారీతో.. అతని భార్యను హత్య చేశాడు. ఆపై సుపారీ ఇచ్చిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యవర్తి జీవితఖైదుతో జైల్లోనే చచ్చాడు. హత్యలో సహకరించిన వ్యక్తికి మరణశిక్ష అమలయ్యింది. కానీ, ఇతగాడికి మరణశిక్ష పడి దశాబ్దాలు గడుస్తున్నా.. అది అమలు కావడంలో జాప్యం అవుతూ వస్తోంది. చివరికి.. పోయినేడు ఏడాది శిక్షను అమలు చేయాలని చూస్తే అది విఫలం అయ్యింది.. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదివేయండి.. ప్రపంచంలోనే తొలిసారి నైట్రోజన్ గ్యాస్‌నుNitrogen Hypoxia Execution ఉపయోగించి ఓ వ్యక్తికి మరణశిక్ష అమలు చేయబోతున్నారు. అమెరికా సంయుక్తం రాష్ట్రం అలబామాలో ఈ శిక్ష గురువారం అమలు కాబోతోంది. ఘోరంగా.. ఊహకందని రీతిలో అమలు కాబోయే ఈ మరణశిక్ష తప్పించుకునేందుకు చివరిదాకా యత్నం చేసిన కెన్నెత్ యూజీన్ స్మిత్(58) చివరికి నిరాశే ఎదురైంది. బుధవారం యూఎస్ సుప్రీం కోర్టు సైతం శిక్ష అమలు నిలుపుదలకు నిరాకరించింది. అలబామా కోర్టులు ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో.. ఈ శతాబ్దంలో ఒక వ్యక్తిని ఈ తరహాలో శిక్షించి చంపడం ఇదే తొలిసారి కానుంది. కేసు ఏంటంటే.. 1988లో కోల్బర్ట్ కౌంటీలో చార్లెస్ సెన్నెట్ అనే మతాధిపతి తన భార్య ఎలిజబెత్ సెన్నెట్‌ను చంపడానికి బిల్లీ గ్రే విలియమ్స్ అనే వ్యక్తికి సుపారీ ఇచ్చాడు. వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఆయన ఆ విషయం భార్యకు తెలియడం.. ఆమె నిలదీయడంతో తట్టుకోలేకపోయాడు. అలాగే.. భార్య పేరిట ఉన్న ఇన్సూరెన్స్ సొమ్ము కోసమే ఆయన ఆమెను అడ్డు తొలగించుకునే పని చేశాడు. కెన్నెత్ స్మిత్, జాన్ పార్కర్ అనే ఇద్దరు అనే ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్లకు 1000 డాలర్ల చొప్పున ఇస్తూ.. ఆ పని అప్పగించాడు బెల్లీ. ఇంట్లోనే మార్చి 18వ తేదీన ఆమెను దారుణంగా హతమార్చారు ఆ ఇద్దరు. ఇది దొపిడీ దొంగల పనేనని నమ్మించే యత్నం చేశారు. వారం తర్వాత.. దర్యాప్తులో అసలు విషయం బయటపడుతుందన్న భయంతో ఛార్లెస్ ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు తన కుటుంబ సభ్యుల ముందు ఆయన నిజం ఒప్పుకున్నారు. ఇక ఈ కేసులో బిల్లీ గ్రే విలియమ్స్‌కు కఠిన యావజ్జీవ శిక్షపడగా.. 2020లో జైల్లోనే అనారోగ్యంతో మరణించాడు. స్మిత్, పార్కర్ ఇద్దరికీ మరణశిక్ష విధించింది కోర్టు. 2010 జూన్‌లో పార్కర్‌కు లెథల్(ప్రాణాంతక) ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేశారు. కానీ, స్మిత్ విషయంలోనే ఆ శిక్ష జాప్యం అవుతూ వస్తోంది. కిందటి ఏడాది.. నవంబర్ 17వ తేదీన స్మిత్‌కు లెథల్ ఇంజెక్షన్ ఇచ్చి మరణశిక్ష అమలు చేయాలని ప్రయత్నించారు. అయితే.. ఇంజెక్షన్లు ఎక్కించేందుకు నరాలు దొరక్కపోవడంతో ఆ శిక్ష నిలిపేశారు అధికారులు. ఈలోపు అలబామా సుప్రీంకోర్టు ఇచ్చిన డెత్ వారెంట్ గడువు ముగిసిపోయింది. దీంతో.. అతని మరణశిక్ష అమలుపై సమీక్ష జరపాలని అలబామా గవర్నర్ కెయ్ ఇవెయ్ ఆదేశించారు. చివరకు.. నైట్రోజన్ హైపోక్సియా పద్ధతితో శిక్ష అమలు చేయాలని అధికారులు నిర్ణయించగా.. అసలు వ్యవహారం మొదలైంది. ఐరాసతో సహా అభ్యంతరాలు.. అయితే.. ఈ తరహా మరణశిక్ష అమలుపై ప్రపంచవ్యాప్తంగా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. తొలి ప్రయత్నం విఫలమయ్యాక.. స్మిత్ శారీరక మానసిక స్థితి స్థితి ఘోరంగా దెబ్బతిందని అతని తరఫు న్యాయవాదులు వాదిస్తూ వచ్చారు. స్మిత్ కుటుంబ సభ్యులు కూడా ఈ తరహా శిక్షను అమలుచేయడానికి వీల్లేదని.. ఆయన అనుభవించిన శిక్షా కాలం పరిగణనలోకి తీసుకుని విడుదల చేయాలని క్షమాభిక్ష కోరారు. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలు సైతం ఇది అత్యంత మానవీయమైన చర్యగా పేర్కొంటూ వస్తున్నాయి. మరోవైపు ఐక్యరాజ్య సమితి మాన హక్కుల సంఘ కార్యాలయం సైతం ఈ శిక్షను నిలిపివేయాలంటూ అలబామాను కోరుతూ వస్తోంది. అయితే ఎలిజబెత్ కుటుంబ సభ్యులు మాత్రం శిక్ష అమలు చేయాల్సిందేనని కోరుతూ వస్తున్నారు. ఈలోపు అమెరికా రాజ్యాంగంలోని ఎనిమిదో సవరణ ప్రకారం(నేర, అసాధారణ శిక్షల నుంచి రక్షణ) శిక్షను నిలిపివేయాలని కోర్టును ఆశ్రయించారు స్మిత్ తరఫు లాయర్లు. ఈలోపు బుధవారం.. యూఎస్ సుప్రీం కోర్టు ఆ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. తొమ్మిది మంది న్యాయమూర్తుల్లో ముగ్గురు మాత్రమే స్మిత్ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోగా.. మిగతా మెజార్టీ న్యాయమూర్తులు పిటిషన్‌ను తిరస్కరించారు. ఎలా ఉంటుందంటే.. నైట్రోజన్ హైపోక్సియా అంటే.. నైట్రోజన్ సిలిండర్‌కు బిగించిన పైప్‌ను మాస్క్ ద్వారా నిందితుడి ముక్కుకు బిగిస్తారు. గ్యాస్‌ను విడుదల చేయగానే.. ఆక్సిజన్ అందక నైట్రోజన్ మోతాదుతో ఆ వ్యక్తి గిలగిల కొట్టుకుంటూ మరణిస్తారు. ఐసీయూలో ఆక్సిజన్ సిలిండర్ ద్వారా ఒక వ్యక్తి ప్రాణాల్ని ఎలా రక్షిస్తారో.. అదే విధంగా నైట్రోజన్‌తో ఆ ప్రాణాల్ని హరిస్తారన్నమాట. అదీ చట్టబద్ధంగా!. బుధవారం అర్ధరాత్రి దాటాక(గురువారం 12గం. నుంచి.. ఆ మరుసటి రోజు ఉదయం 6గం. లోపు ఈ శిక్షను అమలు చేస్తారు). ఇప్పటిదాకా అమెరికాలో ప్రాణాంతక ఇంజెక్షన్ల ద్వారానే మరణశిక్షలు అమలు చేస్తూ వచ్చారు. అయితే.. ఆ ఇంజెక్షన్లలో ఉపయోగించే మందు దొరకడం కష్టతరం అవుతుండడంతో(ఐరోపా దేశాలు వాటిని నిషేధించాయి).. ప్రత్యామ్నాయాల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అలబామాతో పాటు మిసిసిప్పీ, ఓక్లహోమా నైట్రోజన్ గ్యాస్‌తో చంపడం లాంటి శిక్షలను పరిశీలనలోకి తెచ్చుకున్నాయి. :::సాక్షి వెబ్‌డెస్క్ -
2 గర్భసంచులు.. 2 రోజులు..2 ప్రసవాలు
అమెరికా మహిళ అరుదైన రికార్డు అద్భుతాలకే అద్భుతంగా చెప్పదగ్గ ఈ ఉదంతం అమెరికాలో జరిగింది. అలబామాకు చెందిన కెల్సీ హాచర్ అనే 32 ఏళ్ల మహిళ పురిటి నొప్పులతో డిసెంబర్ 19న యూనివర్సిటీ ఆఫ్ అలబామాలోని బర్మింగ్‌హాం ఆస్పత్రి (యూఏబీ)లో చేరింది. 10 గంటల పురిటి నొప్పుల తర్వాత సాధారణ కాన్పులో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. కానీ పురిటి నొప్పులు మాత్రం అలాగే కొనసాగాయి. మరో 10 గంటల తర్వాత సిజేరియన్ ద్వారా మరో ఆడపిల్లకు జన్మనిచ్చి అబ్బురపరిచింది. కెల్సీకి రెండు గర్భసంచులుండటం, రెండింట్లోనూ ఒకేసారి గర్భధారణ జరగడం వల్ల ఈ అద్భుతం సాధ్యమైంది. మహిళల్లో ఇలా రెండు గర్భసంచులుండే ఆస్కారమే కేవలం 0.3 శాతమట! వారిలోనూ రెండింట్లోనూ ఒకేసారి గర్భం ధరించే ఆస్కారమైతే 10 లక్షల్లో ఒక్క వంతు మాత్రమేనట! అరుదైన ఈ జంట అద్భుతాలు రెండూ కలిసి రావడంతో కెల్సీ ఇలా అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది!! తొలి మూడు కాన్పులు సాధారణమే... కెల్సీకి రెండు గర్భసంచులు ఉన్నట్టు 17వ ఏట బయట పడింది. కానీ పెళ్లి తర్వాత తొలి కాన్పుల్లోనూ సాధారణంగా ఒక్కొక్కరే పుట్టారు. ఈసారీ అలాగే జరగనుందని నెల తప్పినప్పుడు కెల్సీ అనుకుందట. ‘‘కానీ అల్ట్రా సౌండ్ చేయిస్తే రెండు గర్భసంచుల్లోనూ పిండాలున్నట్టు తెలిసి చెప్పలేనంత థ్రిల్‌కు లోనయ్యా. అసలలాంటిది సాధ్యమని మొదట నమ్మకమే కుదర్లేదు’’ అని సంబరంగా చెప్పుకొచ్చిందామె! అక్కణ్నుంచి కెల్సీ తన అసాధారణ జంట గర్భధారణ గాథను ఇన్‌స్టాగ్రాంలో రెగ్యులర్‌గా ఎప్పటికప్పుడు పంచుకుంటూ వచి్చంది. చూస్తుండగానే నెలలు నిండటం, ఆస్పత్రిలో చేరడం, వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు పాపాయిలకు జన్మనిచ్చి రికార్డులకెక్కడం చకచకా జరిగిపోయాయి. ఈ అరుదైన కాన్పుల కోసం ఆస్పత్రి డబుల్ ఏర్పాట్లు చేయడం విశేషం! డబుల్ మానిటరింగ్, డబుల్ చారి్టంగ్ మొదలుకుని కాన్పు కోసం రెండింతల సిబ్బందిని నియమించడం దాకా అన్నీ ‘రెట్టింపు స్పీడు’తో జరిగాయి. ఇద్దరు పాపాయిలూ గర్భంలో ఆరోగ్యంగా పెరిగినట్టు కాన్పు చేసిన వైద్య బృందానికి సహ సారథ్యం వహించిన ప్రొఫెసర్ రిచర్డ్ డేవిస్ తెలిపారు. ‘‘ఒకే గర్భసంచిలో రెండు పిండాలు పెరిగిన బాపతు సాధారణ గర్భధారణ కాదిది. పిల్లలిద్దరూ ఒకే అపార్ట్మెంట్లో వేర్వేరు ఫ్లాట్లలో మాదిరిగా ఎవరి గర్భసంచిలో వారు స్వేచ్ఛగా ఎదిగారు’’ అని చెప్పుకొచ్చారు. ‘‘డిసెంబర్ 19న రాత్రి 7.45 గంటలకు తొలి పాప పుట్టింది. 10 గంటల పై చిలుకు పురిటి నొప్పుల తర్వాత డిసెంబర్ 20న ఉదయం 6.10 గంటలకు సిజేరియన్ చేసి రెండో పాపను బయటికి తీశాం. ఇంతటి అరుదైన ఘటనకు సాక్షులుగా నిలిచామంటూ మా వైద్య బృందమంతా కేరింతలు కొట్టాం’’ అని వివరించారు. పిల్లల బుల్లి రికార్డు...! నవజాత శిశువులు కూడా రికార్డుల విషయంలో తమ తల్లికి ఏ మాత్రమూ తీసిపోలేదు. వేర్వేరు గర్భసంచుల్లో పెరగడమే గాక ఏకంగా వేర్వేరు పుట్టిన రోజులున్న అత్యంత అరుదైన కవలలుగా రికార్డులకెక్కారు. అంతేకాదు, వీరు ఎవరికి వారు వేర్వేరు అండం, వీర్య కణాల ఫలదీకరణ ద్వారా కడుపులో పడటం మరో విశేషం! ఇలాంటి కవలలను ఫ్రాటర్నల్ ట్విన్స్‌గా పిలుస్తారని ప్రొఫెసర్ రిచర్డ్ తెలిపారు. మొత్తానికి రికార్డులు సృష్టించడంలో తల్లికి తీసిపోమని పుట్టీ పుట్టగానే నిరూపించుకున్నారంటూ అంతా ముక్కున వేలేసుకుంటున్నారు! బంగ్లా మహిళ బంపర్ రికార్డు! ఇలాంటి అరుదైన ‘జంట జననాలు’ అత్యంత అరుదే అయినా అసలు జరగకుండా పోలేదు. 2019లో బంగ్లాదేశ్‌లో జరిగిన ఇలాంటి ఘటన దీన్ని తలదన్నేలా ఉండటం విశేషం! రెండు గర్భసంచుల్లోనూ గర్భం దాలి్చన ఓ మహిళ తొలి కాన్పు తర్వాత ఏకంగా నెల రోజుల తర్వాత రెండో పాపాయికి జన్మనిచ్చిందట! ఆ పురుళ్లు పోసిన వైద్యుడు అప్పట్లో ఈ వింతను బీబీసీతో పంచుకున్నాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికాలో దోపిడి దొంగల కాల్పులు.. తెలుగు యువకుడి దుర్మరణం
అమెరికాలో దోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. పట్టపగలే లూటీలకు ప్రయత్నిస్తున్నారు. తుపాకులు చేతబట్టి కాల్పులకు తెగపడుతున్నాడు. అలబామలోని బిర్మింగ్‌హమ్‌లో ఫిబ్రవరి 11న జరిగిన కాల్పుల్లో ఓ తెలుగు యవకుడు ప్రాణాలు కోల్పోయాడు. విశాఖపట్నం సిటీకి చెందిన సత్యకృష్ణ చిట్టూరి (27) గతేడాది వివాహం అయ్యింది. భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది. అయితే అమెరికాలో ఉన్నత విద్య చదవాలనే లక్ష్యంతో గత నెల అప్పు చేసి మరీ అమెరికా చేరుకున్నాడు. అలబామ రాష్ట్రంలోని బిర్మింగ్‌హామ్‌ల్‌లో ఓ క్రౌన్ సర్వీస్ స్టేషన్ అనే స్టోర్‌లో క్లర్క్‌గా పార్ట్‌టైం జాబ్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 11న సత్యకృష్ణ పని చేస్తున్న స్టోర్‌లో దోపిడికి దొంగలు యత్నించారు. ఆయుధాలు చేతబట్టి స్టోర్‌లోకి చొరబడ్డారు. అరడుగుల పొడవుతో నల్లని స్వెట్‌షర్ట్ ధరించిన దుండగుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్లు నేరుగా తాకడంతో సత్యకృష్ణ అక్కడిక్కడే మరణించాడు. సత్యకృష్ణ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి ఫోటోలు రిలీజ్ చేశారు. కాల్పులు జరిపి సత్యకృష్ణ చావుకి కారణమైన దుండగుడి ఆచూకీ తెలిస్తే తెల్లడేగా కౌంటీ పోలీసులకు తెలపాలంటూ కోరారు. This is the suspect in Talladega’s recent armed robbery/murder. Calera store clerks and customers stay alert. We arrested an armed felon outside one of our gas stations Tuesday. Call us at 205-668-3505 if you see anything suspicious. #caalerapd #police #violent #alabama pic.twitter.com/MYf0zchmkL — Calera Alabama Police Department (@CaleraPolice) February 11, 2022 చదవండి: న్యూయార్క్‌లో బాపూజీ విగ్రహం ధ్వంసం.. ఎన్నారైల ఆగ్రహం -
తన సర్జరీ కోసం నిమ్మరసం అమ్ముతున్న చిన్నారి!
జీవితమన్నాక కష్టసుఖాలు సర్వసాధారణం. మనం ఖర్చు చేయలేని స్థాయిలో కష్టం ఎదురైతే వెంటనే ఎవరైనా సాయం చేస్తారా? అని ఎదురు చూస్తాం. కొందరైతే సాయం చేసే చేతులకోసం అదేపనిగా వెతుకుతుంటారు. కానీ అమెరికాలోని ఓ ఏడేళ్లమ్మాయి తన బ్రెయిన్ సర్జరీ కోసం తానే సంపాదించాలనుకొంది. ఇంత చిన్న వయసులో అంతపెద్ద సమస్య వచ్చినప్పటికీ కలేజాతో ముందుకు సాగుతూ.. ఎవర్నీ సాయమడగకుండా సొంతంగా డబ్బులు సంపాదిస్తూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తోంది. అమెరికాలోని అలబామా కు చెందిన ఏడేళ్ల లిజా స్కాట్‌కు తరచూ ఫిట్స్(మూర్ఛ) వచ్చి పడిపోయేది. ఫిట్స్ ఎందుకొస్తున్నాయో తెలుసుకునేందుకు లిజాను డాక్టర్ల వద్దకు తీసుకెళ్లగా.. మస్తిష్కంలో కొన్ని లోపాల కారణంగా తరచూ మూర్ఛ వస్తుందని, బ్రెయిన్ సర్జరీ ద్వారా ఈ సమస్య ను సరిచేయవచ్చని వైద్యులు చెప్పారు. అయితే బ్రెయిన్ సర్జరీకయ్యే ఖర్చును భరించే శక్తి లిజా కుటుంబానికి లేదు. దీంతో లిజా తన ఆపరేషన్‌కు తానే సంపాదించుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే లిజా తల్లి నడిపే బేకరీలో సొంతంగా నిమ్మరసం అమ్ముతూ డబ్బులు సంపాదించడం మొదలు పెట్టింది. నిమ్మరసం కొనే కస్టమర్లు లిజా పరిస్థితి తెలుసుకుని బిల్లుతోపాటు మరికొంత ఎక్కువ నగదును ఇచ్చేవారు. ఒక్కో కస్టమర్ ఐదు డాలర్ల నుంచి వంద డాలర్ల వరకు బిల్లు కట్టేవారు. ఇప్పటిదాకా నిమ్మరసం అమ్మడం ద్వారా లిజా మొత్తం 12 వేల డాలర్లను కూడబెట్టింది. మళ్లీ ఫిట్స్ రావడంతో ప్రస్తుతం లిజా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ‘నీ ఆపరేషన్ కు నువ్వే ఎందుకు సంపాదించుకోవాలి?’ అనుకున్నావు అన్న ప్రశ్నకు సమాధానంగా... ‘‘నా లాగా ఆపదలో ఉన్నవారు ఇలా సొంతంగా డబ్బు సంపాదించడానికి ప్రయత్నించడం యాచించడం కంటే కొంతమేలే కదా అని’ చెప్పడం చాలా ముచ్చటేస్తుంది. ‘తండ్రిలేని లిజాను తాను ఎంతో ప్రేమ గా చూసుకుంటున్నాననీ, ఆమె వైద్య ఖర్చుల కోసం కోసం కష్టపడి డబ్బులు కూడబెడుతున్నానని లిజా తల్లి ఎలిజబెత్ చెప్పారు. సర్జరీ, ఇంకా మందులకు చాలానే ఖర్చవుతుంది. అందుకే నేను కూడా ఆన్లైన్లో దాతల్ని సాయం చేయమని అభ్యర్థించాను. దీంతో లిజా పరిస్థితి తెలిసిన బంధువులు, స్నేహితులు, ఇతర దాతలనుంచి ఇప్పటివరకు మూడు లక్షల డాలర్ల సాయం అందిందని చెప్పారు. ప్రస్తుతం బ్రెయిన్ ఆపరేషన్‌తో తన పరిస్థితి కాస్త మెరుగుపడినప్పటికీ లిజాకి 30 ఏళ్లు వచ్చేవరకు రెగ్యులర్‌గా చెకప్స్ చేయించాలని ఎలిజ్బెత్ వివరించారు. చదవండి: భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు -
16 సార్లు అరెస్ట్ చేసిన వ్యక్తికే ప్రాణదానం
అలబామా : మేలు చేసిన వారికి సాయం చేయడం కృతజ్ఞత భావం.. 16 సార్లు కటకటాల్లోకి నెట్టిన వ్యక్తికి కిడ్నీ దానం చేసి జోసెలిన్ జేమ్స్ మానవత్వాన్ని చాటుకుంది. ఈ ఘటన అలబామాలో చోటుచేసుకుంది. అసలు విషయంలోకి వెళితే.. అలబామాకు చెందిన జోసెలిన్ జేమ్స్ .. కొన్ని సంవత్సరాల క్రితం మత్తు పదార్థాలకు బానిసగా మారింది. ఎంతలా అంటే జీవితంలో అన్ని బంధాలను వదులుకొని డ్రగ్స్‌నే తన ఆహారంగా చేసుకొని బతికేసింది. ఈ నేపథ్యంలోనే తను చేసే జాబ్, ఇష్టపడి కొనుక్కున్న కారు, ఇళ్లు కూడా అమ్మేసుకుంది. బతకడానికి దొంగతనాలు కూడా చేసింది. అనతికాలంలోనే జేమ్స్ అలబామాలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా పేరు పొందింది. 2007 నుంచి 2012 వరకు దాదాపు 16 సార్లు టెర్రెల్ పాటర్ అనే పోలీస్‌కు చిక్కి అరెస్ట్ అయి జైలుకు వెళ్లి వచ్చింది. టెర్రెల్ పాటర్ కూడా ఈ జీవితాన్ని వదిలేసి మంచి మనిషిగా మారు అని ఎన్నోసార్లు చెప్పిచూశాడు. టెర్రెల్ పాటర్ అనే వ్యక్తి మళ్లీ ఆమె జీవితంలోకి వస్తాడని బహుశా అప్పుడు ఊహించి ఉండదు. (చదవండి :మొత్తం పోయింది: కాలిఫోర్నియా బాధితుల ఆవేదన) ఇదలాఉండగా.. జేమ్స్ ఒకరోజు ఇంట్లోనే టీవీ చూస్తుండగా.. మోస్ట్ వాంటెడ్ అనే వార్త ఆమెను షాక్‌కు గురయింది. ఎందుకంటే మోస్ట్ వాంటెడ్ అని చూపిస్తుంది ఎవరిదో కాదు.. జోసెలిన్ జేమ్స్ దే. అప్పుడు తనకు అర్థమయింది.. తాను ఏ స్టేజీలో ఉన్నానో.. ఇక ఈ జీవితం వద్దని చెప్పి నేరుగ అధికారుల వద్ద లొంగిపోయింది. ఆరు నెలల జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన జేమ్స్ నేరుగా డ్రగ్ అడిక్షన్ సెంటర్‌కు వెళ్లి తొమ్మిది నెలలు అక్కడే రీహాబిటేట్‌గా మార్చుకుంది. అక్కడి నుంచి జేమ్స్ జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం జేమ్స్ తనలాగే డ్రగ్స్‌కు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకుంటున్న మహిళను ఆ మహమ్మారి నుంచి రక్షించే పనిని చేస్తుంది. ఒకరోజు జేమ్స్ తన ఫేస్బుక్ ఓపెన్ చేయగా.. టెర్రెల్ పాటర్ కిడ్నీ దెబ్బతిన్నాయని.. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం దాత అవసరం ఉందని టెర్రెల్ కూతురు షేర్ చేసిన పోస్ట్ కనిపించింది. వెంటనే టెర్రెల్ కూతురును కలిసి కిడ్నీని దానమిచ్చేందుకు తాను సిద్దమని తెలిపింది. గత జూలైలో వాండెర్‌బిల్ట్ యునివర్సీటీ మెడికల్ హెల్త్ సెంటర్లో టెర్రెల్‌కు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతంగా జరిగింది. ఇప్పుడు జేమ్స్, టెర్రెల్ ఆరోగ్యంతోనే ఉన్నారు.(చదవండి : విషాద జ్ఞాపకానికి 19 ఏళ్లు..) ఇదే విషయమై టెర్రెల్ స్పందిస్తూ.. ' నా అనుకున్నవారు సాయం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. అలాంటిది పోలీస్ ఆఫీసర్‌గా 16 సార్లు జైలుకు పంపించిన అమ్మాయి వచ్చి నాకు కిడ్నీ ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. ఆశ్చర్యం ఎందుకంటే.. నాకు కిడ్నీ దానం చేస్తమని ఒక వంద మంది ముందుకు వస్తే అందులో జేమ్స్ పేరు కచ్చితంగా ఉండదనే అనుకుంటాం. ఎందుకంటే ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపించిన తర్వాత మళ్లీ నాకు కనిపించలేదు.. సరైన కాంటాక్ట్ కూడా లేదు.. కానీ దేవుడు మా ఇద్దరిని ఈ విధంగా కలుపుతాడని మాత్రం నేను ఊహించలేదు అంటూ టెర్రెల్ ఉద్వేగంతో పేర్కొన్నాడు. -
ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ!
అలబామా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అలాబామా ఎన్నికల్లో డెమొక్రాట్ అభ్యర్థి డౌగ్ జోన్స్ విజయం సాధించారు. గత 25 ఏళ్లుగా అధికార రిపబ్లికన్ పార్టీకి కంచుకోటగా ఉన్న అలబామాలో డెమొక్రాట్లు విజయం సాధించడం ఇదే తొలిసారి. ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన రిపబ్లికన్ అభ్యర్థి రాయ్ మూర్‌ను ఓడించి.. డౌగ్ జోన్స్ విజయం సాధించారు. అయితే, ఈ ఎన్నికల ఫలితాలను అంగీకరించడానికి మూర్ ససేమిరా అంటుండటం గమనార్హం. హోరాహోరీ పోరు..! సంప్రదాయవాద ఓటర్లు అధికంగా ఉన్న అలబామాలో గత 25 ఏళ్లలో ఒక డెమొక్రాట్ అభ్యర్థి విజయం సాధించడం ఇదే తొలిసారి. ఇక్కడ తాజా ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అయితే, ట్రంప్ మద్దతుతో బరిలోకి దిగిన రాయ్ మూర్కు వ్యతిరేకంగా లైంగిక వేధింపులు ఆరోపణలు వెలుగుచూడటం, బాలికలపై ఆయన లైంగిక వేధింపులు పాల్పడ్డట్టు కథనాలు రావడం రిపబ్లికన్లను కుదిపేసింది. ఈ క్రమంలో ఉదారవాద డెమొక్రాట్లకు బ్లాక్ ఓటర్ల అండ లభించడంతో డౌగ్ జోన్స్ విజయం సాధించినట్టు భావిస్తున్నారు. అలబామాలో డెమొక్రాట్ విజయం.. డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. ఈ విజయంతో అమెరికా సెనెట్ పెద్దలసభ (అప్పర్ చాంబర్)లో రిపబ్లికన్ పార్టీ మెజారిటీ 51-49కి తగ్గిపోయింది. వచ్చే ఎడాది జరగనున్న కాంగ్రెషనల్ ఎన్నికల్లో పెద్దలసభలో రిపబ్లికన్లు మెజారిటీ కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే.. అధ్యక్షుడు ట్రంప్ అజెండా అమలుకు సెనెట్ ఆమోదం లభించడం కష్టమే. -
గార్డును ఫూల్ చేసి గుంటనక్కల్లాగ..
అలబామా: జైలులో ఓ యువ గార్డుకు ఖైదీలు ఝలక్ ఇచ్చారు. అలబామాలో మొత్తం పన్నెండు మంది ఖైదీలు సునాయాసంగా అతడిని బురిడీ కొట్టించి తప్పించుకున్నారు. వీరిలో ఇద్దరు హత్యా చేసిన కేసులో శిఖ అనుభవిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం వీరిలో 11మందిని పోలీసులు తిరిగి అదుపులోకి తీసుకొని జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. ఒక ఖైదీ మాత్రం పోలీసులను ముప్పు తిప్పలుపెడుతున్నాడట. అయితే, వారు తప్పించుకున్న విధానమే పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎప్పటి నుంచో జైలు నుంచి తప్పించుకుందామనుకున్న కొంతమంది ఖైదీలు చాలా తెలివిగా ఆలోచించారు. శనగలతో తయారు చేసిన పదార్థాన్ని ఉపయోగించి వారు ఉంటున్న సెల్ డోర్ నెంబర్ కనిపించకుండా చేశారు. బహుశా డోర్‌కు అదే వెనుక భాగం అనుకున్న యువ గార్డు కాస్త ఆ డోర్ బటన్ నొక్కి వెళ్లిపోయాడు. అదే అదనుగా చూసుకున్న ఖైదీలు పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ వీడియో చూసిన అధికారులు అవాక్కయ్యారు. అప్పటికప్పుడు అప్రమత్తత ప్రకటించి పదకొండుమందిని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జైలు అధికారులు మాట్లాడుతూ ’ఈ ఖైదీలు అచ్చం గుంట నక్కల మాదిరిగా ప్రణాళిక రచించారు. వారు చేసిన పని చాలా క్రేజీగా అనిపించింది. మిగితా ఒక్కడిని కూడా పట్టుకుంటాం’ అని చెప్పారు. -
రోడ్డు ప్రమాదంలో ఎన్ఆర్ఐ కుటుంబానికి గాయాలు
అలబామా: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎన్ఆర్ఐ కుటుంబం తీవ్రంగా గాయపడింది. సోమవారం సాయంత్రం అలబామాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన దంపతులు శరవణన్, వెనిలాతో పాటు వారి కూతురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన శరవణన్‌తో పాటు కూతురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం. కాగా.. ఎన్ఆర్ఐ కుటుంబం ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే అమెరికా తెలుగు అసొసియేషన్(ఆటా) సభ్యులు వేగంగా స్పందించారు. తొలుత బాధితులకు గాడ్స్‌డెన్ మెడికల్ సెంటర్లో చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన శరవణన్, ఆయన కూతుర్ని యూఏబీ ట్రామా సెంటర్‌కు తరలించి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. ఆటా సేవా సభ్యులు సుధీర్, బోదిరెడ్డి అనిల్, దొంతి సతీష్, శివ రామడుగు, శంకర్ తదితరులు రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచి వారి కుటుంబ సభ్యుల్లో మనోస్థైర్యం నింపారు. -
ఆ యాక్సిడెంట్ చూస్తే షాక్.. వైరల్ వీడియో
-
ఆ యాక్సిడెంట్ చూస్తే షాక్.. వైరల్ వీడియో
వాషింగ్టన్: వాహనాలు బోల్తాపడి పల్టీల మీద పల్టీలు కొడితే అందులో ఉన్న వారికి తీవ్రగాయాలు కావడం, కొన్ని సందర్భాలలో చనిపోవడం జరుగుతుంటుంది. కానీ, అతివేగంతో వెళ్తున్న ఓ జీపు ప్రమాదానికి గురై పల్టీలు కొట్టగా అది నడుపుతున్న వ్యక్తి సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు. పైగా జీపు ఎలా ఉందో చూసేందుకు వెంటనే ఎంచక్కా పరుగులు పెట్టాడు. ఈ ఘటన అమెరికాలోని అలబామాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఏజే కెల్విన్ అనే వ్యక్తి తన కారులో డ్యాష్ క్యామ్‌ను అమర్చుకున్నాడు. అలబామాలో అంతర్రాష్ట్ర రహదారి 65పై కారులో ప్రయాణిస్తున్నాడు. ఇంతలో తెలుపురంగు జీపు అతివేగంగా రహదారిపై దూసుకెళ్తోంది. ముందు వెళ్తున్న కారును జీపు డ్రైవర్ ఓవర్ టేక్ చేయబోయి ఢీకొట్టాడు. క్షణాల్లో జీపు రోడ్డుపై బోల్తాపడి గాల్లో పల్టీలు కొడుతూ కొద్దిదూరం వెళ్లి ఆగింది. ఈ క్రమంలో జీపు నుంచి డ్రైవర్ రోడ్డుపై పడిపోయాడు. వెంటనే లేచి తన జీపు ఎలా ఉందో చూసుకునేందుకు వేగంగా కదలడం.. ప్రమాదాన్ని చూసిన వారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ప్రమాదానికి గురైన కారు డ్రైవర్ కు ఎలాంటి గాయాలు కాలేదు. 'నిజంగా ఇది అద్భుతమని చెప్పవచ్చు. సీటు బెల్టు ధరించవద్దని నేను చెప్పడం లేదు. అయితే జీపు నడిపిన వ్యక్తి మాత్రం సీటు బెల్టు పెట్టుకోనందుకే ప్రాణాలతో బయటపడ్డాడన్నది వాస్తవం. కారు నడిపిన వ్యక్తి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నాడు. నా కెమెరాలో ఈ సీన్ చూస్తే మాత్రం ఎవరైనా అవాక్కవుతారు' అని ప్రత్యక్షసాక్షి ఏజే కెల్విన్ చెప్పుకొచ్చాడు. -
బెడ్రూంలో భార్యను వేరొకరితో చూసి..
అలబామా: అలబామాలో ఓ భర్త ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన భార్య చేసిన మోసానికి అతడికి చిర్రెత్తిపోయింది. ఇంట్లోని పడకగదిలో తన భార్య పక్కన వేరొకరిని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే భార్య బాయ్‌ఫ్రెండ్‌పై శివమెత్తాడు. పిడిగుద్దులు కురిపిస్తూ తన్నులతో చుక్కలు చూపించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అలబామాలో ఓ వ్యక్తి బయటకు పనిమీద వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సమయంలో తన భార్య ఓ వ్యక్తితో అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన భర్తకు కోపం కట్టలు తెంచుకుని ఒక్కసారిగా తన భార్యతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. తన భర్త ఆవేశాన్ని చూసి భయంతో భార్య పారిపోగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను మాత్రం ఆ భర్త చితక్కొట్టాడు. ఇదంతా కూడా ఆ భర్తతోపాటు వచ్చిన మరో వ్యక్తి వీడియో తీశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. -
బెడ్రూంలో భార్యను వేరొకరితో చూసి..
-
వైరల్‌గా మారిన పోలీసు ఆఫీసర్ ఫొటో!
మహిళా పోలీసు ఆఫీసర్ అయిన మిషెల్లీ బర్టన్ తన బృందంతోపాటు ఆ ఇంటికి చేరుకునేలోపే అక్కడ బీభత్సం జరిగిపోయింది. డ్రగ్స్ అధికంగా తీసుకున్న ఓ 30 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు విడిచాడు. అతని భార్య కూడా డ్రగ్స్ మత్తులో స్పృహ కోల్పోయి.. కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. ఆ జంట పిల్లలు దీనంగా రోదిస్తూ దిక్కులు చూస్తున్నారు. 'అమ్మా, నాన్నా ఎందుకు మేల్కొనడం లేదు' అంటూ దీనంగా రోదిస్తూ అడిగింది ఏడేళ్ల కూతురు. తనకు మూడేళ్లు, రెండేళ్ల వయస్సున్న ఇద్దరు తమ్ముళ్లు, ఒక నెల వయస్సు కలిగిన చెల్లెలు ఉంది. అమెరికా అలబామాలోని బర్మింగ్‌హామ్‌లో మంగళవారం ఓ అపార్ట్మెంట్ నుంచి అత్యవసర నంబర్‌కు కాల్ రావడంతో మిషెల్లీ బృందం అక్కడికి వెళ్లింది. కానీ, వారు వచ్చేలోపే ఆ పిల్లల తండ్రి చనిపోగా, తల్లి స్పృహలో లేకుండా విషమంగా ఉంది. ఆమెను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వెంటనే ఆ నలుగురి పిల్లల్ని ఏం చేయాలో తెలియక.. తమ వెంట పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ముగ్గురు అంతో-ఇంతో పెద్ద పిల్లలు కావడంతో వారికి బొమ్మలు, స్టేషన్లో ఉన్న టార్చ్లైట్లు ఇచ్చి బుజ్జగించి ఏడ్పు మాన్పించారు. కానీ, నెల వయస్సున్న చిన్నారిని ఎలా ఓదార్చాలో వారికి అర్థం కాలేదు. ఆ చిన్నారి బాధ్యతను మిషెల్లీ తన భుజాలపై వేసుకుంది. తనను బుజ్జగించేందుకు తాను పోలీసు అనే విషయాన్ని మరిచిపోయింది. తుపాకీ తీసి పక్కనపెట్టింది. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ విప్పేసింది. ఓ తల్లిలా ఆ పాపాయిని గుండెలకు హత్తుకొని లాలించింది. ఆ రోజు పోలీసు స్టేషన్ నుంచి ఇంటికి కూడా వెళ్లలేదు. మిషెల్లీ భర్త ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఫోన్ చేయడంతో అతనికి ఈ విషయం తెలిసింది. చిన్నారిని గుండెలకు హత్తుకొని లాలిస్తున్న తన భార్య మిషెల్లీ ఫొటోను చూసి మురిసిపోయిన ఆమె భర్త బ్రియన్ బర్టన్.. ఈ విషయాన్ని ఫేస్బుక్లో వెల్లడించాడు. స్వయంగా ఇద్దరు పిల్లల తల్లైన మిషెల్లీ తాను పోలీస అధికారిని అనే అహాన్ని పక్కనబెట్టి మరీ ఆ చిన్నారిని లాలించిందని, అలా లాలిస్తున్న ఫొటోలో ఆమె ఎప్పుడూ లేనంత అందంగా కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఆ మర్నాడు ఉదయం నలుగురు పిల్లల్ని పోలీసులు బాలల సంక్షరణ కేంద్రానికి అప్పగించారు. కానీ, ఓ మాతృమూర్తిలా ఆ చిన్నారికి మిషెల్లీ పంచిన ప్రేమ నెటిజన్లను కదిలిస్తోంది. ఆమె ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. -
చెట్లపై కూలిన విమానం
ట్యుస్కలూసా: అలబామాలో ఓ విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఓ చిన్న విమానం చెట్లపై కూలిపోవడంతో అందులోని ఆరుగురు మృత్యువాత పడ్డారు. సరిగ్గా విమానం ల్యాండింగ్ అయ్యే సమయంలో ఇబ్బందులు తలెత్తి కూలిపోయినట్లు సంబంధిత అధికారులు చెప్పారు. సెంట్రల్ ఫ్లోరిడా నుంచి ఆక్స్ ఫర్డ్‌కు బయలుదేరిన విమానం ట్యుస్కలూసాలోని ప్రాంతీయ విమానాశ్రయంలో రన్ వేపై దిగే క్రమంలో ప్రమాదానికి గురైంది. పీఏ-31 అనే ఈ చిన్న విమానం కిస్సిమ్మీ గేట్ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరి ట్యుస్కలూసాలోని ఎయిర్ పోర్ట్ రన్ వేపై దిగే ప్రయత్నంలో చెట్లపై కూలిపోయిందని, అందులోని ఆరుగురు చనిపోయారని ది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది. ఇంజిన్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్లే ఈ విమానం కూలిపోయినట్లు చెప్పారు.