
గార్డును ఫూల్ చేసి గుంటనక్కల్లాగ..
శనగలతో తయారు చేసిన పదార్థాన్ని ఉపయోగించి వారు ఉంటున్న సెల్ డోర్ నెంబర్ కనిపించకుండా చేశారు. బహుశా డోర్‌కు అదే వెనుక భాగం అనుకున్న యువ గార్డు కాస్త ఆ డోర్ బటన్ నొక్కి వెళ్లిపోయాడు. అదే అదనుగా చూసుకున్న ఖైదీలు పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డయిన ఈ వీడియో చూసిన అధికారులు అవాక్కయ్యారు. అప్పటికప్పుడు అప్రమత్తత ప్రకటించి పదకొండుమందిని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జైలు అధికారులు మాట్లాడుతూ ’ఈ ఖైదీలు అచ్చం గుంట నక్కల మాదిరిగా ప్రణాళిక రచించారు. వారు చేసిన పని చాలా క్రేజీగా అనిపించింది. మిగితా ఒక్కడిని కూడా పట్టుకుంటాం’ అని చెప్పారు.