US: అమెరికాలో మరో భారతీయుడి హత్య | 29-Year-Old UP Man Raj Singh Shot Dead Outside Gurdwara In US - Sakshi
Sakshi News home page

అమెరికాలో ఆగని భారతీయుల మరణాలు

Published Fri, Mar 1 2024 2:16 PM | Last Updated on Fri, Mar 1 2024 2:59 PM

Up Musician Shot Dead In Us Alabama - Sakshi

అలబామా: అమెరికాలో భారతీయుల వరుస మరణాలు కొనసాగుతున్నాయి. తాజాగా సిక్కులకు సంబంధించిన ఒక కీర్తన కార్యక్రమం కోసం అమెరికాకు వెళ్లిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ రాజ్‌సింగ్‌ అలియాస్‌ గోల్డీ(23)ని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చి చంపారు. కీర్తన కార్యక్రమంలో పాల్గొని గురుద్వారా బయటికి వచ్చిన తర్వాత జరిగిన కాల్పుల్లో రాజాసింగ్‌ మృతిచెందాడు. 

రాజాసింగ్‌ది ఉత్తరప్రదేశ్‌లోని టండా సాహువాలా గ్రామం. ఐదేళ్ల క్రితమే రాజాసింగ్‌ తండ్రి మరణించాడు. కుటుంబానికి రాజాసింగ్‌ సంపాదనే ఆధారం. రాజాసింగ్‌ మృతదేహాన్ని భారత్‌ తీసుకువచ్చేందుకు సాయం చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని అతడి కుటుంబం కోరింది.   

కాగా, ఇటీవలి కాలంలో అమెరికాలతో భారత్‌, భారత సంతతికి చెందిన వారి మరణాలు ఎక్కువయ్యాయి. గడిచిన రెండు మూడు నెలల కాలంలో అమెరికాలో మరణించి వారిలో భారత విద్యార్థులతో పాటు ఒక వ్యాపారవేత్త కూడా ఉండటం గమనార్హం. ఈ వరుస మరణాలపై భారత విదేశాంగ శాఖ ఇప్పటికే స్పందించింది. మరణాల వెనుక ప్రత్యేక కుట్ర లేదని స్పష్టం చేసింది. 

ఇదీ చదవండి.. ఢాకాలో ఘోర అగ్నిప్రమాదం 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement