ఒహియో: అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని సిన్సినాటి నగరంలో దారుణ ఘటన జరిగింది. మూడేళ్ల అన్న రెండేళ్ల వయసున్న తన తమ్ముడిని తుపాకీతో కాల్చి చంపాడు. తర్వాత విచారణలో పోలీసులడిగితే టీవీలో స్పైడర్ మ్యాన్ ప్రోగ్రామ్ చూసి తండ్రి టేబుల్ డ్రాలో ఉన్న గన్ తీసి తమ్ముడిని కాల్చానని చెప్పాడు. ఈ సమాధానంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది.
అసలు సంఘటన వివరాల్లోకి వెళితే కెంటాన్ కౌంటీలో తల్లిదండ్రులకు చెందిన ఫుల్ లోడెడ్ గన్‌తో మూడేళ్ల బాలుడు తన తమ్ముడిని కాల్చి చంపాడు. దీంతో తీవ్ర గాయాలైన బాలుడి తమ్ముడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తల్లిదండ్రులు నిర్లకక్ష్యంగా ఫుల్ లోడెడ్ తుపాకీని పిల్లలకు అందుబాటులో ఉంచడం వల్లే ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు.
దీంతో బాలుడి తల్లిదండ్రులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ ఘటన ఇళ్లలో ఉన్న తుపాకులపై తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మరోసారి గుర్తు చేసిందని పోలీసులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment