రోడ్డు ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి గాయాలు | accident in Alabama, ATA Sewa team has jumped to help them | Sakshi

రోడ్డు ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి గాయాలు

Published Tue, May 23 2017 10:00 AM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

రోడ్డు ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి గాయాలు - Sakshi

రోడ్డు ప్రమాదంలో ఎన్‌ఆర్‌ఐ కుటుంబానికి గాయాలు

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం తీవ్రంగా గాయపడింది

అలబామా: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎన్‌ఆర్‌ఐ కుటుంబం తీవ్రంగా గాయపడింది. సోమవారం సాయంత్రం అలబామాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన దంపతులు శరవణన్‌, వెనిలాతో పాటు వారి కూతురికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన శరవణన్‌తో పాటు కూతురు అపస్మారక స్థితిలో ఉన్నట్లు సమాచారం.

కాగా.. ఎన్‌ఆర్‌ఐ కుటుంబం ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే అమెరికా తెలుగు అసొసియేషన్‌(ఆటా) సభ్యులు వేగంగా స్పందించారు. తొలుత బాధితులకు గాడ్స్‌డెన్‌ మెడికల్‌ సెంటర్‌లో చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం తీవ్రంగా గాయపడిన శరవణన్‌, ఆయన కూతుర్ని యూఏబీ ట్రామా సెంటర్‌కు తరలించి మెరుగైన చికిత్స అందేలా ఏర్పాట్లు చేశారు. ఆటా సేవా సభ్యులు సుధీర్‌, బోదిరెడ్డి అనిల్‌, దొంతి సతీష్‌, శివ రామడుగు, శంకర్‌ తదితరులు రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచి వారి కుటుంబ సభ‍్యుల్లో మనోస్థైర్యం నింపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement