బెడ్రూంలో భార్యను వేరొకరితో చూసి.. | Alabama man catches his wife in bed with her lover | Sakshi
Sakshi News home page

బెడ్రూంలో భార్యను వేరొకరితో చూసి..

Published Sun, Jan 1 2017 7:06 PM | Last Updated on Mon, Apr 8 2019 8:11 PM

బెడ్రూంలో భార్యను వేరొకరితో చూసి.. - Sakshi

బెడ్రూంలో భార్యను వేరొకరితో చూసి..

అలబామా: అలబామాలో ఓ భర్త ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన భార్య చేసిన మోసానికి అతడికి చిర్రెత్తిపోయింది. ఇంట్లోని పడకగదిలో తన భార్య పక్కన వేరొకరిని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే భార్య బాయ్‌ఫ్రెండ్‌పై శివమెత్తాడు. పిడిగుద్దులు కురిపిస్తూ తన్నులతో చుక్కలు చూపించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. అలబామాలో ఓ వ్యక్తి బయటకు పనిమీద వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సమయంలో తన భార్య ఓ వ్యక్తితో అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన భర్తకు కోపం కట్టలు తెంచుకుని ఒక్కసారిగా తన భార్యతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. తన భర్త ఆవేశాన్ని చూసి భయంతో భార్య పారిపోగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను మాత్రం ఆ భర్త చితక్కొట్టాడు. ఇదంతా కూడా ఆ భర్తతోపాటు వచ్చిన మరో వ్యక్తి వీడియో తీశాడు. ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement