infidelity
-
బీఆర్ఎస్కు షాక్.. నల్గొండ మున్సిపల్ ఛైర్మన్ పీఠం ‘హస్త’గతం
సాక్షి, నల్గొండ: నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డిపై కాంగ్రెస్ పార్టి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం నెగ్గంది. మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉండగా సోమవారం ప్రవేశ పెట్టి అవిశ్వాస తీర్మానానికి 47మంది కౌన్సిలర్ హాజరయ్యారు. వీరిలో 41మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టికి మద్దతు తెలపడంతో మున్సిపల్ ఛైర్మన్ పదవి కాంగ్రెస్ పార్టి కైవసం చేసుకుంది. ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపగా. న్యూట్రల్‌గా ఉన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కౌన్సిలర్లు పిల్లిరామరాజు మీగత ఇద్దరు సభ్యలు అవిశ్వాసం తీర్మానానికి హాజరు కాలేదు. నూతన చైర్మన్ ఎన్నుకునే వరకు తాత్కాలిక చైర్మన్‌గా.. ప్రస్తుత వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ పదవి బాధ్యతలు చేపట్టనున్నారు. -
కొడుక్కి జన్యుపరమైన వ్యాధి.. బయటపడ్డ వివాహేతర సంబంధం
భువనేశ్వర్: కుమారుడి అనారోగ్యం భార్య వివాహేతర సంబంధాన్ని బట్ట బయలు చేసింది. దాదాపు 20 ఏళ్ల క్రితం పక్కింటి వ్యక్తితో భార్యకున్న వివాహేతరసంబంధాన్ని వెలుగులోకి తెచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఒడిశాకు చెందిన ఓ వ్యక్తి కుమారుడు(18) కొన్ని నెలల క్రితం నుంచి తరచుగా కీళ్ల నొప్పులతో బాధపడుతుండేవాడు. చుట్టుపక్కల ఆస్పత్రుల్లో చూపించినప్పటికి పెద్దగా ప్రయోజనం లేకపోయింది. కుమారుడి అనారోగ్యానికి కారణాలు తెలియలేదు. ఈ క్రమంలో సదరు వ్యక్తి తన కుమారుడిని ఢిల్లీ, గురుగావ్ ఫోర్టీస్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అతడికి హై-పెర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ(హెచ్పీఎల్సీ) టెస్ట్ చేయడంతో ఆ వ్యక్తి కుమారుడికి ‘సికిల్ సెల్ అనీమియా’ అని తెలిసింది. అయితే ఇది వంశపారంపర్యంగా వచ్చే జబ్బని తెలిపారు వైద్యులు. తల్లిదండ్రులిద్దరి నుంచి పిల్లలకు ఈ జబ్బు వస్తుందని వెల్లడించారు వైద్యులు. బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయాలని తెలిపారు. ఈ క్రమంలో వైద్యులు సదరు వ్యక్తి, అతడి భార్యకు టెస్ట్‌లు చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. టెస్టుల్లో ఆ వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడిగా తేలింది. ఇక అతడి భార్యలో సికెల్ సెల్ అనీమియా లక్షణాలు మధ్యస్థంగా ఉన్నట్లు గుర్తించారు వైద్యులు. అయితే వైద్య శాస్త్రం ప్రకారం తల్లిదండ్రులిద్దరిలో సికెల్ సెల్ అనీమియా మధ్యస్థ లక్షణాలు ఉంటేనే.. వారి ద్వారా వంశపారంపర్యంగా అది పిల్లలకు వస్తుంది. కానీ ఇక్కడ సదరు యువకుడి తల్లిలో మాత్రమే సికెల్ సెల్ అనీమియా లక్షణాలు గుర్తించారు వైద్యులు. ఎందుకైనా మంచిదని మరోసారి టెస్ట్ చేశారు. అప్పుడు కూడా అదే ఫలితం రావడంతో ఈ విషయాన్ని కుర్రాడికి తెలిపారు. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పాడా యువకుడు. తనకు వచ్చిన జబ్బు.. అది ఎలా వస్తుందో తండ్రికి వెల్లడించాడు. ఈ క్రమంలో భార్య చేసిన మోసం వెలుగులోకి వచ్చింది. ఇంటికి వెళ్లిన తర్వాత దీని గురించి భార్యను నిలదీయగా.. ఆమె తన తప్పు అంగీకరించింది. దాదాపు 20 ఏళ్ల క్రితం పక్కింటి వ్యక్తితో ఆమెకు వివాహేతర సంబంధం ఉండేదని తెలిపింది. అతడి ద్వారా ఆమె గర్భవతి అయ్యింది. సదరు మహిళకు, ఆమె ప్రియుడికి సికెల్ సెల్ అనీమియా ఉండటం వల్లే.. ఆ కుర్రాడికి కూడా అదే జబ్బు వచ్చి ఉంటుందని భావిస్తున్నారు వైద్యులు. -
వివాహేతర సంబంధం: డీఎన్ఏ పరీక్ష ఉత్తమం
అలహాబాద్ : పిల్లల పితృత్వాన్ని నిరూపించేందుకు డీఎన్ఏ పరీక్ష చేయించటం ఒక్కటే న్యాయబద్ధమైన, శాస్త్రీయమైన మార్గమని అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్య వివాహేతర సంబంధాన్ని నిరూపించటానికి భర్తకు.. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ఎలాంటి వివాహేతర సంబంధం కలిగిలేనని, భర్త ఆరోపణలు అబద్ధమని తేల్చడానికి భార్యకు డీఎన్ఏ పరీక్ష ఉత్తమమైనదని పేర్కొంది. నీలం అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి వివేక్ అగర్వాల్ మంగళవారం విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా, యువతీ యువకులు తమకు నచ్చిన వారితో కలిసి ఉండొచ్చని గతంలో అలహాబాద్ హైకోర్టు తేల్చిచెప్పిన సంగతి తేలిసిందే. వారి జీవితాల్లో కలుగజేసుకునే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేసింది. నచ్చిన వారితో కలిసి జీవించే అవకాశం యువతకు ఉందని పేర్కొంది. వేర్వేరు మతాలకు చెందిన యువతి, యువకుడు వివాహం చేసుకున్న ఘటనలో న్యాయస్థానం ఈ సంచలన తీర్పునిచ్చింది. -
టీడీపీ ఎంపీపీ భర్త ఆడియో సంభాషణలు హల్చల్ ..
చిత్తూరు,సాక్షి: పిచ్చాటూరు ఎంపీపీపై అవిశ్వాస రాజకీయాలు వేడెక్కాయి. బేరసారాలు మొదలయ్యాయి. పిచ్చాటూరు ఎంపీపీ మధుబాల (టీడీపీ)పై స్వపక్షానికి చెందిన మెజారిటీ సభ్యులు అవిశ్వాసానికి ప్రతిపాదించారు. మొత్తం తొమ్మి ది మంది ఎంపీటీసీలుండగా ఏడుగులు టీడీపీకి చెందినవారు. ఇద్దరు వైఎస్సార్సీపీకి చెందినవారు. టీడీపీలో లుకలుకలు రావడంతో మధుబాలకు ఏడుగురిలో ఆరుగురు దూరమయ్యా రు. అంతరాలు పెరిగిపోవడంతో ఆమెపై అవి శ్వాసానికి నోటీసిచ్చారు. దీంతో ఆమె ఒంట రైంది. అక్టోబరు 1వ తేదీన ఎంపీడీఓ కార్యాలయంలో దీనిపై చర్చ ఓటింగు జరగనుంది. మరో రెండు రోజులే గడువుంది. దీంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మధుబాల పక్షాన ఆమె భర్త పద్మనాభరాజు బేరసారాలకు దిగారు. సభ్యులతో మంతనాలకు దిగారు. నయానో భయానో తమవైపు తిప్పుకోడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాయిలాలు కూడా ఇస్తామని చెబుతున్నారు. సమావేశానికి హాజరుకావాలని ఇప్పటికే సభ్యులకు నోటీసులందాయి. గడువు సమీపించడంతో టీడీపీలోని మరో గ్రూపు కూడా పార్టీ మండల అధ్యక్షుడు ఇళంగోవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. ఎలాగైనా అవిశ్వాసం నెగ్గేలా వ్యూహాలు పన్నుతోంది. అనుకూలంగా ఓటేయకపోయినా హాజరుకాకున్నా ఎంతో కొంత ముట్టజెబుతానని పద్మనాభరాజు మాటిస్తున్నట్లు తెలిసింది. అడవి కొడియంబేడు ఎంపీటీసీ ప్రతాప్‌తో ఆయన చర్చిం చిన ఆడియో టేప్ ఇటీవల ఈ ప్రాంతంలో హల్చల్ చేస్తోంది. రాకున్నా చాలని చెప్పినట్లు అందులో ఉంది. సంభాషణలో కొంత భాగం ఇలా సాగింది. ఎంపీపీ భర్త: నువ్వొచ్చి పలాంది చెయ్ అ ను.. నేను చేసి పెడ్తా అంతే.. పనా, ఇంకొకటా.. ఇంకొకటా.. ఫైనాన్సా.. ఏం చేయమంటే అది చేసిపెడతా.. నువ్వు (అవిశ్వాస తీర్మానానికి) రాకుండా ఉంటే చాలంతే.. ఎంపీటీసీ సభ్యులు: సరే..నా.. ఎంపీపీ భర్త: నేను చెప్పేదిను. ఇదేం శాశ్వతం కాదు.. మళ్లీ ఇంకోసారి.. ఇంకోసారి ఇంకేదైనా అవకాశం ఉంటాది. ఆపొద్దు కూడా నేను పట్టుబట్టి నీకు టికెట్టు తీయిచ్చి నీకు అన్నీ చేయిచ్చినాను.. నాకు ఈ సహాయం చేయంటే అది చేయిస్తానంతే.. నువ్వు ఏమి చేయమంటే అది చేస్తా ..అంత వరకే.. ఎంపీటీసీ సభ్యులు: సరే ఓకె నా.. ఎంపీపీ భర్త: అదీ ఒకే మాట.. -
‘అవిశ్వాసం’ సెగ
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్లో అధికార పార్టీలోని కొందరు నేతల్లో మధ్య ఉన్న అంతర్గత కలహాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎప్పటి నుంచో ఉన్న ఈ అభిప్రాయభేదాలు ఇటీవలి అవిశ్వాస తీర్మానాలతో మరింత ముదిరి పాకాన పడుతున్నాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ప్రవేశపెట్టిన ఈ అవిశ్వాస తీర్మానాల వెనుక అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల పాత్ర ఉండటం.. వాటిని ఎదుర్కోవడమో, తిప్పి కొట్టడం వెనక ఉన్నది సైతం ఆ పార్టీకి చెందిన జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులే కావడం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో పలుచోట్ల చోటు చేసుకున్న ‘అవిశ్వాసం’ రాజకీయాలతో అధికార పార్టీ నేతల మధ్యన ఏర్పడిన అంతర్గత విభేదాలు మరోసారి బయట పడ్డాయి. ‘అవిశ్వాసం’తో వేడెక్కిన హుజూరాబాద్.. హుజూరాబాద్ ఎంపీపీ, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతా రావు సతీమణి వొడితెల సరోజినిదేవిపై అవిశ్వా సం నోటీసు ఇవ్వడంతో ఒక్కసారిగా హుజూరా బాద్ రాజకీయాలు వేడెక్కాయి. ఇప్పటికే టీఆర్ఎస్ నాయకుడు, హుజూరాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ వడ్లూరి విజయ్‌కుమార్ (బ్రహ్మచారి)పై ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఇచ్చిన అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. మొత్తం 20 మంది కౌన్సిలర్లకు 18 మంది అవిశ్వాసంపై సంతకాలు చేయడం.. ఆ తర్వాత విజయ్‌కుమార్ రాజీనామా కు సిద్ధమయ్యారు. ఈ వివాదం కొలిక్కి వస్తుందనుకున్న సమయంలో హుజూరాబాద్ ఎంపీపీపై ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులను కలుపుకుని టీఆర్ఎస్కు చెందిన బావు తిరుపతి తొమ్మిది మంది సంతకాలతో కూడిన అవిశ్వాస తీర్మానాన్ని జెడ్పీ సీఈవో, ఆర్డీవోలకు ఇవ్వడం కొత్త వివాదానికి తెరలేపింది. ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతారావు మధ్య సఖ్యత లేదన్న చర్చ రాజకీయవర్గాల్లో ఉంది. ఈ ఇద్దరు నేతలు, వర్గాల మధ్య పొసగడం లేదన్న సంగతి ఆ పార్టీలోని వర్గాల్లోనూ ఉంది. ఇదే సమయంలో సరోజినీదేవిపై అవిశ్వాసం పెట్టడం హాట్‌టాపిక్‌గా మారింది. దీంతో ఓ వైపు కెప్టెన్ వి.లక్ష్మీకాంతారావు, ఆయన కుమారుడు, హుస్నాబాద్ ఎమ్మెల్మే వి.సతీష్‌రావు, మరోవైపు మంత్రి ఈటల రాజేందర్ రంగంలోకి దిగారు. ఇంకోవైపు కాంగ్రెస్ ఎంపీటీసీలను శాంతపరచేందుకు ఆ పార్టీకి చెందిన మండల మాజీ మండల ప్రజాప్రతినిధి, ఓ ప్రజాప్రతినిధి, ప్రముఖ కాంట్రాక్టర్ తదితరులను కూడా రంగంలోకి దింపారు. సతీష్‌కుమార్ హన్మకొండలోని హంటర్‌రోడ్‌లో ఎంపీటీసీలతో చర్చించగా, మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్‌లోని ఆయన క్యాంపు కార్యాలయంలో అవిశ్వాసం నోటీసు ఇచ్చిన ఎంపీటీసీల కూటమితో మాట్లాడారు. ఈ ఇరువర్గాలు కూడా అసంతృప్తి ఎంపీటీసీలకు ప్రభుత్వ పనులు ఇప్పించేందుకు హామీ ఇవ్వడంతో ‘అవిశ్వాసం’ వేడి చల్లారింది. సద్దుమణిగింది. రచ్చకెక్కిన రామగుండం రాజకీయాలు.. ఇండిపెండెంట్ కార్పొరేటర్‌గా గెలుపొంది ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆశీస్సులతో టీఆర్ఎస్లో చేరి మేయర్‌గా ఎన్నికైన కొంకటి లక్ష్మీనారాయణ తిరిగి టీఆర్ఎస్ చేతిలోనే ఓటమి పాలయ్యారు. దీంతో రామగుండం నియోజకవర్గం అధికార పార్టీలో గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్యే, ఆర్టీసీ సోమారపు సత్యనారాయణ, ఎంపీ బాల్క సుమన్ వర్గీయుల మధ్య ఎప్పటి నుంచో వర్గపోరు సాగుతోంది. బయటికి కనిపించకపోయినా పోలీసు అధికారుల మొదలు పలు అంశాల్లో ఒకరి నిర్ణయాలను ఒకరు అడ్డుకున్న సంఘటనలు అనేకం. ఈ పోరులో రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, ఎంపీ సుమన్ వర్గంగా ముద్రపడిన మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసం వరకు దారితీసిందన్న చర్చ ఉంది. ఈ నేపథ్యంలో తెరపైకి వచ్చిన అవిశ్వాస తీర్మానం అనేక మలుపులు తిరిగింది. నాటకీయ ఫక్కీలో పరిణామాలు చోటు చేసుకున్నవి. ఆ క్రమంలో మనస్థాపానికి గురైన ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసమే ప్రకటించారు. ఆ తర్వాత తన మాటలను ఉపసంహరించుకుంటున్నట్టు మంత్రి కేటీఆర్ సమక్షంలో మళ్లీ ఆయనే హైదరాబాద్‌లో మీడియా ముందు చెప్పడం వంటి పరిణామాలు రక్తికట్టించాయి. స్వపక్షంలోనే తన రాజకీయ ప్రత్యర్థిగా తయారైన మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసానికి అధిష్ఠానం నుంచి ఎలాంటి అడ్డుకట్ట లేకుండా ఎమ్మెల్యే చక్రం తిప్పి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు, వర్గీయుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రామగుండం అభివృద్ధిని ఎమ్మెల్యేను అడ్డుకున్నారని శనివారం కొంకటి లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా.. ఈ నియోజకవర్గంలో ఇప్పటికే మాజీ మేయర్ అయిన కొంకటి లక్ష్మీనారాయణ, పార్టీ నాయకుడు కోరుకంటి చందర్, పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, జెడ్పీటీసీ సంధ్యారాణి సైతం గ్రూపులుగా కొనసాగుతుండటంతో రామగుండం రాజకీయాలు రచ్చకెక్కాయి. నువ్వా–నేనా.. ఎమ్మెల్యే రమేష్, తుల ఉమ కరీంనగర్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు మధ్య ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. కొద్ది మాసాలుగా పార్టీ సభ్యత్వం, పదవులు, పనుల విషయంలో ఈ ఇద్దరు నేతలు, వర్గీయుల మధ్య రసవత్తర పోరే సాగుతోంది. కమిటీలకు కమిటీలు రద్దు చేయడం, మరికొందరిపై బహిష్కరణ వేటుతోపాటు అధిష్టానానికి ఫిర్యాదు చేసుకునే వరకు గొడవలు వెళ్లాయి. తాజాగా వేములవాడ ఎంపీపీ రంగు వెంకటేశ్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఈ ఇద్దరు నేతల మధ్య మరింత అగాధం పెరిగిందంటున్నారు. ఎంపీపీ వెంకటేశ్ జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ వర్గీయుడు కాగా, ఆయనపై ఎమ్మెల్యే రమేష్ వర్గీయులు నోటీసు ఇచ్చినట్లు చెప్తున్నారు. మొత్తం తొమ్మిది మందితో అవిశ్వాసం నోటీసు ఇవ్వగా, గత నెల 25న నిర్వహించిన అవిశ్వాస పరీక్షలో తిప్పాపూర్ ఎంపీటీసీ అహ్మద్‌పాషా గైర్హాజర్ కాగా వెంకటేశ్‌పై అవిశ్వాసం వీగిపోయింది. ఈ వ్యవహారంలో తుల ఉమ కీలకంగా వ్యవహరించారన్న చర్చ జరుగుతోంది. అదేవిధంగా బీజేపీ నుంచి కౌన్సిలర్‌గా గెలుపొంది టీఆర్ఎస్లో చేరిన నామాల ఉమ వేములవాడ మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఇటీవల ఆమె భర్త లక్ష్మీరాజంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ 20 మందిలో 15 మంది కౌన్సిలర్లు నామాల ఉమను దింపేందుకు నోటీసు ఇచ్చారు. ఇదే సమయంలో క్యాంపునకు తరలిన 15 మంది ఎంపీటీసీల్లో ఇద్దరు (నిమ్మశెట్టి విజయ్, ముద్రకోల వెంకటేశం) బయట పడటంతో సీన్ రసవత్తరంగా మారింది. ఈ వ్యవహరంలోనూ ఇద్దరు నేతల మధ్య విభేదాలు తలెత్తినట్లు ఆ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా వుంటే కరీంనగర్ ఎంపీపీ వాసాల రమేష్‌కు అవిశ్వాసం ముప్పు తప్పింది. మొత్తం 24 మంది ఎంపీటీసీ సభ్యుల్లో సుమారు 17 మంది అసంతృప్తి వ్యక్తం చేస్తూ అవిశ్వాసానికి సిద్ధంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రంగ ప్రవేశం చేశారు. ఒకేపార్టీలో ఉంటూ అవిశ్వాసం పెట్టడం సరికాదని, ఇరువర్గాలకు నచ్చజెప్పిన ఆయన చివరకు వాసాలపై ‘అవిశ్వాసం’కు తెరవేశారు. అలాగే కరీంనగర్ నగరపాలక సంస్థకు చెందిన మెజార్టీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే కమలాకర్ ఎదుట తమ అక్కసు వెళ్లబోసుకోగా, పార్టీకి అప్రతిష్ట తెచ్చేలా వ్యవహరించొద్దని సూచించి, వారించినట్లు చర్చ ఉంది. -
ఎమ్మెల్యేలకు ‘అవిశ్వాస’ టెన్షన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాధారణ ఎన్నికలకు సమాయత్తమవుతున్న వేళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని శాసనసభ్యులకు ‘అవిశ్వాసం’ తలనొప్పి తీవ్రమైంది. పూర్వ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో నాలుగింట ఇదే పరిస్థితి నెలకొంది. సొంత పార్టీలో ఎమ్మెల్యేలకు అనుయాయులుగా వ్యవహరించినవారే అదను చూసి అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగిస్తుండడంతో ఏం చేయాలో తోచని స్థితిలో శాసనసభ్యులు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో సొంత పార్టీలోనే అసమ్మతి పెరిగిపోతుందనడానికి ఈ పరిణామాలను ఉదాహరణగా చెప్పుకునే పరిస్థితి తలెత్తింది. అవిశ్వాసం పెట్టినవారు, అవిశ్వాసాన్ని ఎదుర్కోబోయే వారు ఇద్దరూ టీఆర్ఎస్ వాళ్లే అవుతుండడం ఎమ్మెల్యేలకు మింగుడుపడడం లేదు. ‘కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. ‘నా కనుసన్నల్లో ఉండే నాయకులు ఎదురు తిరుగుతారా?’ అనే అతి విశ్వాసం పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు ఇప్పుడు ఇబ్బందిగా మారింది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఓటింగ్ నిర్వహిస్తారు. అలాగే మండలాల్లో ఎంపీపీలపై ఇచ్చిన అవిశ్వాస నోటీసులకు కూడా ఆదిలాబాద్ జెడ్పీ సీఈవో నుంచి స్పందన వచ్చింది. నోటీసులు ఇచ్చిన తేదీల ఆధారంగా జెడ్పీ సీఈవో ప్రత్యేక సమావేశాలకు ఆదేశాలు జారీ చేశారు. కాసిపేట ఎంపీపీ శంకరమ్మపై ఇచ్చిన అవిశ్వాసం నోటీస్‌పై ఆగస్టు 7న సమావేశం ఏర్పాటు చేయగా, రెబ్బెన ఎంపీపీ సంజీవ్‌కుమార్ అవిశ్వాసంపై ఆగస్టు 9న ప్రత్యేక సమావేశం జరుగనుంది. అలాగే కుంటాల ఎంపీపీ కొత్తపల్లి గంగామణి అవిశ్వాసాన్ని ఆగస్టు 14న జరిగే సమావేశంలో ఎదుర్కోనున్నారు. ఖానాపూర్ ఎంపీపీ శోభారాణిపై అవిశ్వాస ప్రత్యేక సమావేశం ఆగస్టు 16న జరుగుతుంది. జన్నారం ఎంపీపీపై ఇచ్చిన అవిశ్వాసంపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. రాష్ట్రంలో చర్చనీయాంశమైన బెల్లంపల్లి బెల్లంపల్లి మున్సిపాలిటీలో 33 మంది కౌన్సిలర్లకు ఏకంగా 29 మంది అవిశ్వాసం ప్రకటించారు. వైస్ చైర్మన్‌తో పాటు టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ సభ్యులంతా ఈ అవిశ్వాసంలో పాలు పంచుకున్నారు. నెలరోజులుగా క్యాంపు రాజకీయాలు చేస్తుండగా, నేరుగా ఎమ్మెల్యే రంగంలోకి దిగి అసమ్మతిని అణచివేయాలని చేసిన ప్రయత్నాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసాన్ని ఉపసంహరించుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఓ కౌన్సిలర్ కూతురుకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య చేసిన హెచ్చరికలు వైరల్‌గా మారడంతో టీఆర్ఎస్ అధిష్టానం కూడా ఉలిక్కిపడింది. ఈ క్రమంలోనే ఖైరిగూడ ఓసీపీలో పనిచేసే ఇద్దరు కౌన్సిలర్ల భర్తలను ఏకంగా మణుగూరుకు బదిలీ చేయిస్తూ ఉత్తర్వులు జారీ చేయించినా, కౌన్సిలర్లు తగ్గలేదు. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 2న జరిగే అవిశ్వాస సమావేశం కోసం అందరితో పాటు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ఎదురుచూస్తున్నారు. నెలరోజులకు పైగా క్యాంపులో ఉన్న అసమ్మతి కౌన్సిలర్లు ఆగస్టు 2వ తేదీన నేరుగా సమావేశానికే హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ అధ్యక్షతన బెల్లంపల్లిలో జరిగే ఈ సమావేశంపైనే ఉమ్మడి జిల్లా రాజకీయ నాయకులు దృష్టి సారించారు. కాసిపేటలో చక్రం తిప్పిన ఎమ్మెల్యే కాసిపేట ఎంపీపీ శంకరమ్మ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వైఖరిని తప్పుపడుతూ రెండు నెలల క్రితం కోదండరాం టీజేఎస్ పార్టీలో చేరగా, ఆమెపై ఐదుగురు ఎంపీటీసీలు అవిశ్వాసం పెట్టారు. ఇక్కడ అవిశ్వాసం నెగ్గడం లాంఛనమే. అయితే బెల్లంపల్లి మున్సిపాలిటీ ముందు కాసిపేట ఎంపీపీ అతి చిన్న అంశంగా మారింది. ఎత్తుకు పైఎత్తుల్లో రేఖానాయక్–రమేష్‌రాథోడ్ ఖానాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు మాజీ ఎమ్మెల్యే రమేష్ రాథోడ్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. టీడీపీ ద్వారా సుధీర్ఘకాలం ఎమ్మెల్యే, ఎంపీగా పదవులు పొందిన రమేష్ రాథోడ్ గత సంవత్సరం టీఆర్ఎస్లో చేరారు. టీఆర్ఎస్లో చేరినప్పుడే వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేసిన రమేష్ రాథోడ్ ఆ దిశగా పావులు కదుపుతూ నియోజకవర్గంలో తన వర్గాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. రాథోడ్ ఎత్తులను చిత్తు చేసేందుకు రేఖా నాయక్ సైతం తనవంతు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే జన్నారంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ వర్గీయులైన ఎంపీపీ చెట్టుపల్లి రాజేశ్వరిపై రమేష్ రాథోడ్ మద్దతుతో తొమ్మిది మంది ఎంపీటీసీలు అవిశ్వాసానికి నోటీస్ ఇచ్చారు. వీరిలో ఏడుగురు టీఆర్ఎస్కు చెందిన వారు కాగా, ఇద్దరు కాంగ్రెస్ ఎంపీటీసీలు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ చక్రం తిప్పి ఒకరిద్దరు ఎంపీటీసీలను తనవైపు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండు గ్రూపులు క్యాంపులోనే ఉన్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ ఖానాపూర్ మండలంలో రమేష్ రాథోడ్ వర్గానికి చెందిన శోభారాణిపై అవిశ్వాసం పెట్టించారు. ఇక్కడ ఎంపీపీకి వ్యతిరేకంగా 13 మంది క్యాంపులో ఉండడం విశేషం. ఒప్పందాల ఉల్లంఘనతో కుంటాల, రెబ్బెన అవిశ్వాసాలు రెబ్బెన ఎంపీపీ సంజీవ్‌కుమార్‌పై వైఎస్ ఎంపీపీతో పాటు ఏడుగురు ఎంపీటీసీలు అవిశ్వాసం ప్రకటించగా, ఆగస్టు 9న సర్వసభ్య సమావేశం జరుగనుంది. ఇక్కడ ఎంపీపీ, వైఎస్ ఎంపీపీలకు మధ్య రెండున్నరేళ్ల పదవీకాలం ఒప్పందం ఉండగా, దాన్ని ఎంపీపీ ఉల్లంఘించారు. కుంటాలలో కూడా ఎంపీపీ గంగామణి, గొల్లమాడ ఎంపీటీసీకి మధ్య రెండున్నరేళ్ల ఒప్పందం ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా పదవిలో కొనసాగడంతో అవిశ్వాసం అనివార్యమైంది. ఈ పరిణామాల్లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ జోక్యం చేసుకున్నా రెబ్బెనలో ఫలితం లేకుండా పోయింది. కుంటాలలో టీఆర్ఎస్కే చెందిన ఎంపీటీసీల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఎవరికి మద్ధతు ఇవ్వలేక మిన్నకుండిపోతున్నారు. -
పరకాల మునిసిపల్ చైర్మన్‌పై వీగిన అవిశ్వాసం
సాక్షి, వరంగల్ రూరల్: పరకాల పురపాలక సంఘ చైర్మన్, వైస్ చైర్మన్లపై అధికార పార్టీ కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం వీగిపోయింది. ఈ నెల 5వ తేదీన 14 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు కలెక్టర్‌కు అందజేశారు. అయితే.. అదేరోజు చైర్మన్ రాజభద్రయ్య టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరారు. కాగా, గురువారం అవిశ్వాస పరీక్ష కోసం నిర్వహించిన సమావేశంలో అధికార పార్టీ కౌన్సిలర్లు సైతం హాజరు కాలేదు. కోరం లేని కారణంగా పరకాల పురపాలక సంఘం చైర్మన్ రాజభద్రయ్యపై అవిశ్వాసం వీగినట్లు ఆర్డీఓ మహేందర్‌జీ ప్రకటించారు. ఇదే తరహాలో వైస్‌చైర్మన్ రమ్యకృష్ణపై పెట్టిన అవిశ్వాస తీర్మానం కూడా వీగిపోయింది. అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోవడంతో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి షాక్ ఇచ్చినట్లయింది. -
రాష్ట్రానికి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రానికి సీఎం కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన సిద్దిపేటలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని పార్లమెంట్లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ ప్రశంసించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే, ‘రాష్ట్ర విభజన ప్రక్రియ తల్లిని చంపి బిడ్డను బతికించినట్టు ఉంది.., తలుపులు మూసి విభజన చేశారు’అంటూ ప్రధాని చేసిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని మంత్రి అన్నారు. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీ వినోద్‌కుమార్ అన్ని విషయాలు చెప్పారని, హైకోర్టు విభజన, ప్రాజెక్టులకు జాతీయ హోదా.. తదితర అంశాలపై స్పష్టత వస్తుందని ప్రజలు భావించారని, అయితే మోదీ ప్రసంగంలో అవేమీ ప్రస్తావనకు రాకపోవడంతో బాధపడ్డారని పేర్కొన్నారు. తెలంగాణలోని ఏడు మండలాలను రాత్రికి రాత్రే ఏపీలో కలపడంతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని అన్నారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అంటే తెలంగాణకు అన్యాయం చేయడమే అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇటీవల వేసిన జంబో సీడబ్ల్యూసీ కమిటీలో తెలంగాణకు స్థానం ఇవ్వకపోవడం చూస్తే వారికి ఇక్కడి ప్రజలపై ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతోందన్నారు. కాంగ్రెస్‌కు బద్ధశత్రువైన తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆ పార్టీ నాయకులు మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కొందరు నేతలు అప్పులు ఆంధ్రాకు, ఆదాయం తెలంగాణకు అని మాట్లాడుతున్నా కాంగ్రెస్ నాయకులు ఎందుకు స్పందించలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం, ఇక్కడి ప్రజలపై గతంలో విషం కక్కిన టీడీపీ, అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ మద్దతు అడగడం విచారకరమన్నారు. కేంద్ర కేబినెట్లో తెలంగాణకు స్థానం ఇవ్వని బీజేపీ, సీడబ్ల్యూసీలో స్థానం ఇవ్వని కాంగ్రెస్ పార్టీలకు రాష్ట్రంపై ఉన్న ప్రేమ ఎలాంటిదో తెలుస్తోందని చెప్పారు. ఏది ఏమైనా రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అంటే ఏమిటో ఈ రెండు పార్టీలు చెప్పకనే చెప్పాయని, నాలుగు సంవత్సరాల తర్వాత మరోసారి తెలంగాణ అభివృద్ధి, హక్కులను కాపాడే విషయంలో టీఆర్ఎస్సే ముందుంటుందన్న విషయం ప్రజలకు అర్థమైందని పేర్కొన్నారు. -
తెలంగాణ అంశాలపై మాట్లాడలేదు: చాడ
హుస్నాబాద్: పార్లమెంట్లో అవిశ్వాసంపై జరిగిన చర్చలో టీఆర్ఎస్ ఏడు మండలాల గురిం చి ఫోకస్ చేసిందే తప్ప విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన అంశాలపై మాట్లాడలేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తంచేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని సీపీఐ అమరుల భవన్లో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ.. బీజేపీ, టీఆర్ఎస్ల మధ్య ఉన్న ఒప్పం దంతోనే పరోక్షంగా టీఆర్ఎస్ తటస్థంగా ఉండి బీజేపీకి మద్దతు తెలిపిందని ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనలో పేర్కొన్న అంశాలను అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. టీడీపీ చర్చను ప్రారంభించినా ఎవరి రాజకీయ కోణంలో వారు మాట్లాడారే తప్ప ప్రత్యేక హోదా గురించి ప్రస్తావించలేదని అన్నారు. బీజేపీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆగస్టు మొదటి వారంలో సీపీఐ తరఫున ఢిల్లీకి వెళ్లనున్నట్లు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. -
అవిశ్వాసానికి కౌంట్‌డౌన్
సాక్షి,పెద్దపల్లి: రామగుండం బల్దియాలో అవిశ్వా సంపై కౌంట్‌డౌన్ మొదలైంది. మేయర్, డిప్యూటీ మేయర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఆగస్టు 2న ప్రత్యేక సమావేశం నిర్వహించనుండడంతో, రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అవిశ్వాసం తీర్మానం ఇచ్చి దాదాపు పదిహేను రోజులు గడుస్తున్నా.. ప్రత్యేక సమావేశం తేదీ ప్రకటించకపోవడంతో కాస్త అయోమయం నెలకొంది. ఎట్టకేలకు వచ్చే నెల 2న అవిశ్వాసం తీర్మాన ప్రక్రియ చేపట్టనుండడంతో ఇరువర్గాల్లో కదలికవచ్చింది. నోటీసులు జారీ అవిశ్వాసం ఆగస్టు 2న పెట్టనున్నట్లు అధికారికంగా వెల్లడి కావడంతో అధికారులు తమ ప్రక్రి యను మొదలు పెట్టారు. అవిశ్వాసం తీర్మానం పెట్టిన కార్పొరేటర్లకు బుధవారం నోటీసులు అందజేశారు. మేయర్ కొంకటి లక్ష్మినారాయణ, డిప్యూటి మేయర్ సాగంటి శంకర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 39 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. అయితే ఇందులో ఇద్దరి సంతకాల్లో తేడా రావడంతో 37 మందికి అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే మరో ముగ్గురితో కలిపి మొత్తం 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఉన్నారని ఎమ్మెల్యే వర్గం చెబుతోంది. కాంగ్రెస్‌పైనే మేయర్ ఆశలు! అవిశ్వాసం తేదీ ఖరారు కావడంతో అందరి దృష్టి మేయర్ కొంకటి లక్ష్మినారాయణపై పడింది. ఇప్పటికే దాదాపు 40 మంది కార్పొరేటర్లు అవిశ్వాసానికి అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుండడం, 37 మంది సంతకాలు చేసినట్లు ‘అధికారికంగా’ గుర్తించడంతో మేయర్ ఏం చేయబోతున్నారనే అంశంపై సర్వత్రా చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం సానుకూలంగా స్పందించకపోవడంతో మేయర్ ప్రస్తుతం ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ఆశలు పెంచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా 20 మంది కార్పొరేటర్లు ఉండడంతో ఆ పార్టీ పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది. ఇందు లో ఇప్పటికే 9 మంది టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మిగిలిన 11 మందిలో తొమ్మిది మంది అ విశ్వాసానికి అనుకూలంగా సంతకాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ సహకారంతో పాటు తానంటే అభి మానం ఉన్న కార్పొరేటర్లు సహకరిస్తే ఎలాగోలా గట్టెక్కచ్చని మేయర్ భావిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్‌లో భిన్న వాదనలు అవిశ్వాసంపై కాంగ్రెస్ పార్టీలో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసానికి బలంగా మద్దతు పలుకుతుండగా, పార్టీ నేతలు మాత్రం భిన్నంగా ఆలోచిస్తున్నారు. అధికార పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలను కాంగ్రెస్‌కు అనుకూలంగా మార్చుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అందుకే అవిశ్వాసంపై బహిరంగంగా వ్యాఖ్యానించడం లేదు. అయితే మేయర్‌ను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ కార్పొరేటర్లు మాత్రం, అవిశ్వాసంపై పునరాలోచన లేదని స్పష్టం చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. ‘అవిశ్వాసంలో మేయర్‌కు అనుకూలంగా వ్యవహరించి టీఆర్ఎస్ను దెబ్బతీస్తే ఎలా ఉంటుందనే ఓ ఆలోచనను మా నాయకులు చేశారు. కానీ అలాంటి ఆలోచన పెట్టుకోవద్దని, ప్రతిపక్ష పార్టీగా తామే అవిశ్వాసం పెట్టామని.. ఇప్పుడు వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పాం’ అని ఓ కాంగ్రెస్ కార్పొరేటర్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఏదేమైనా అవిశ్వాసం తేదీ ప్రకటించడంతో రామగుండంలో రాజకీయ పరిణామాలు వేగం పుంజుకొన్నాయి. -
అవిశ్వాసం ఆపేయండి!
సాక్షి, పెద్దపల్లి: రామగుండం అవిశ్వాస రాజకీయం నాటకీయ మలుపులు తిరుగుతోంది. టీఆర్ఎస్ అధిష్టానం అవిశ్వాసాన్ని ఆపేయాలంటూ అల్టిమేటం జారీచేయగా, హైకమాండ్ ఆదేశానికి కట్టుబడి ఉండాలని ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ సూచించారు. అయితే అవిశ్వాసం నోటీసు ఇచ్చాక ఇప్పుడు వెనక్కి తగ్గేదిలేదని, ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గిస్తామని, లేదంటే తమ కార్పొరేటర్ పదవులకైనా రాజీనామా చేస్తామని టీఆర్ఎస్ కార్పొరేటర్లు తెగేసి చెప్పారు. దీంతో రామగుండం అవిశ్వాసం రాజకీయం రసకందాయంలో పడింది. ఎమ్మెల్యేకు కేటీఆర్ ఫోన్ రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై ప్రవేశపెట్టిన అవిశ్వాసంపై టీఆర్ఎస్ హైకమాండ్ మండిపడింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణకు ఫోన్‌చేసి అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించారు. అవిశ్వాసం పెట్టడం పార్టీ విధానం కాదని, వెంటనే అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఈ సందర్భంగా రామగుండం పరిస్థితిని వివరించడానికి ఎమ్మెల్యే ప్రయత్నించినా కేటీఆర్ వినిపించుకోలేదని విశ్వసనీయంగా తెలిసింది. ‘‘అవిశ్వాసం ఆపేస్తారా...అవిశ్వాసం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురమ్మంటారా’’ అని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎంకు మేయర్ల ఫిర్యాదు పార్టీ అధిష్టానం అకస్మాత్తుగా అవిశ్వాసం వ్యవహారంపై దృష్టిపెట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా మేయర్లు కారణమని సమాచారం. శనివారం హైదరాబాద్‌లో మేయర్లు, కమిషనర్ల సమావేశం జరిగింది. సమావేశానికి రామగుండం మేయర్ లక్ష్మీనారాయణ సహా, ఆరుగురు మేయర్లు హాజరయ్యారు. సమావేశం పూర్తయ్యాక, ఆరుగురు మేయర్లు సీఎం కేసీఆర్‌ను కలిసి రామగుండం మేయర్‌పై సొంత పార్టీయే అవిశ్వాసం పెట్టిందంటూ ఫిర్యాదు చేశారు. స్పందించిన కేసీఆర్ అవిశ్వాసం పెట్టడమేంటంటూ అసహనం వ్యక్తం చేశారని, వెంటనే తన రాజకీయ కార్యదర్శి నరసింహారావు, మంత్రి కేటీఆర్‌లకు ఈ విషయంపై పురమాయించినట్లు సమాచారం. ఈక్రమంలోనే కేటీఆర్, నరసింహారావులు ఎమ్మెల్యే సత్యనారాయణకు ఫోన్‌చేసి అవిశ్వాసాన్ని ఆపేయాలని ఆదేశించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అధిష్టానం చెప్పింది వినండి: ఎమ్మెల్యే అవిశ్వాసం నిలిపివేసి...కలిసి పనిచేసుకోవాలని పార్టీ అధిష్టానం సూచించింది..అధిష్టానం సూచనను కార్పొరేటర్లంతా పాటించాలి...అంటూ ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆదేశించారు. ఆదివారం తన నివాసంలో టీఆర్ఎస్కు చెందిన 30 మంది కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. మంత్రి కేటీఆర్ ఫోన్‌చేసిన విషయాన్ని వివరించారు. ఇంతటితో ఈ వ్యవహారాన్ని ఆపేయాలని కార్పొరేటర్లకు చెప్పారు. వెనక్కి తగ్గేది లేదు: కార్పొరేటర్లు అవిశ్వాసంపై వెనక్కి తగ్గేదిలేదు. నోటీసు ఇచ్చాక..ఇప్పుడు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు.స్టాండింగ్ కమిటీ ఎన్నికలప్పుడు లేని హైకమాండ్ ఇప్పుడే వచ్చిందా? మేం అవిశ్వాసానికే కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా అవిశ్వాసం నెగ్గిస్తాం. లేదంటే మా కార్పొరేటర్ పదవులకే రాజీనామా చేస్తాం. అంటూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు తేల్చిచెప్పారు. పార్టీ అధిష్టానం వైఖరిని ఎమ్మెల్యే చెప్పినా.. కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ఒకదశలో ఎమ్మెల్యేను సైతం ధిక్కరించారు. ఇదిలాఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా అవిశ్వాసాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. రాజకీయం రసవత్తరం అవిశ్వాసం ఆపేయాలని అధిష్టానం ఆదేశించడం...ఎమ్మెల్యే చెప్పినా...కార్పొరేటర్లు ససేమిరా అనడంతో రామగుండంలో రాజకీయం రసవత్తరంగా మారింది. నాటకీయ పరిణామాలతో అవిశ్వాసం రోజుకోమలుపు తిరుగుతోంది. పార్టీ వైరి వర్గాల ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయ చదరంగం రక్తికడుతోంది. -
కరీంనగర్లో ‘అవిశ్వాసం’ కాక!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉద్యమాల ఖిల్లా.. ముఖ్యమంత్రి కేసీఆర్ సెంటిమెంట్ జిల్లా అయిన పూర్వ కరీంనగర్ జిల్లా నుంచే ఆ పార్టీ ప్రజాప్రతినిధులపై అవిశ్వాసపర్వం మొదలైంది. టీఆర్ఎస్ ఏర్పాటు నుంచి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎంతో ఆదరించిన జిల్లాగా కరీంనగర్‌కు పేరుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది ఇక్కడి నుంచే. అయితే స్థానిక సంస్థల, ప్రజాప్రతినిధుల నాలుగేళ్ల పాలన ముగింపు సందర్భంగా ఎప్పటి నుంచో రగులుతున్న అసంతృప్తిని వెళ్లగక్కేందుకు అవిశ్వాసం నోటీసులు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులపైనే ఈ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇస్తుండటం చర్చనీయాంశంగా మారుతోంది. రామగుండం నగరపాలక సంస్థ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, డిప్యూటి మేయర్ సాగంటి శంకర్‌లపై కార్పొరేటర్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ దేవసేనకు శుక్రవారం అవిశ్వాసం నోటీసులు అందజేశారు. మొత్తం 50 కార్పొరేటర్లకు గాను 39 మంది సంతకాలతో కూడిన అవిశ్వాస నోటీసును అందచేయడం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. ఇందులో 10 మంది కాంగ్రెస్, ఒక బీజేపీ, 28 మంది టీఆర్ఎస్ కార్పొరేటర్లు ఉన్నారు. రామగుండం బల్దియాలో రెండేళ్ల నుంచి స్థానిక ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, మేయర్ కొంకటి లక్ష్మీనారాయణల నడుమ విభేదాలు నెలకొన్నాయి. ఏడాది నుంచి ఇవి మరింత ముదిరిపోవడంతో కార్పొరేటర్లు, పార్టీ రెండుగా చీలిపోయిన ఫలితమే అవిశ్వాసంగా చెబుతున్నారు. హుజూరాబాద్ మునిసిపల్ చైర్మన్‌పై అవిశ్వాసం! కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ వడ్లూరు విజయ్‌కుమార్‌పై అవిశ్వాసం పెట్టేందుకు రంగం సిద్ధమైంది. హుజూరాబాద్ నగర పంచాయతీగా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికైన విజయ్‌కుమార్ టీఆర్ఎస్లో చేరి మంత్రి ఈటల రాజేందర్ ఆశీస్సులతో చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల అనేక అవినీతి ఆరోపణలు, వివాదాలకు కేంద్రబిందువుగా మారిన ఆయనను పలుమార్లు మంత్రి ఈటల రాజేందర్ మందలించారు. ఇదే సమయంలో కౌన్సిలర్లు సైతం తీవ్ర అసంతృప్తితో ఉండగా, శుక్రవారం మొత్తం 20 మందిలో 16 మంది కౌన్సిలర్లు కలెక్టర్‌కు నోటీసు అందజేశారు. వేములవాడ, కథలాపూర్ ఎంపీపీలపై కూడా.. టీఆర్ఎస్కు చెందిన వేములవాడ ఎంపీపీ వెంకటేశ్ గౌడ్‌పైన అదే పార్టీకి చెందిన తొమ్మిది మంది ఎంపీటీసీ సభ్యులు రాజన్న సిరిసిల్ల డీఆర్వో జీవీ శ్యాంప్రసాద్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అక్కడి నుంచి అటే క్యాంపునకు తరలి వెళ్లడం టీఆర్ఎస్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. కథలాపూర్ ఎంపీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన తొట్ల నర్సుపైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. మొత్తం 13 మంది ఎంపీటీసీ సభ్యులకు గాను ఐదుగురు బీజేపీ, ఒక కాంగ్రెస్ ఎంపీటీసీ, ఆరుగురు టీఆర్ఎస్ సభ్యులు కలిసి మొత్తం 11 మంది ఈ నోటీసు ఇచ్చి క్యాంపునకు తరలివెళ్లారు. -
మేం తలచుకుంటే.. ఏముందమ్మా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘మేం తలచుకున్నంక ఏముంటదమ్మా.. డీజీపీకి చెప్పి ఎక్కడున్నదో క్యాంపు చూడుమంటే ఏంచేస్తడు. బస్సును తీసుకపోయి పోలీస్‌స్టేషన్ లోపల పెడతడు’ ‘యూసఫ్ది లాండ్ ఇష్యూ ఉంది. దాన్ల ప్రాబ్లం క్రియేటవుతది. గవర్నమెంట్ కబ్జా చేస్తది. రమేష్ లాండ్ గుడ గవర్నమెంట్ హాండోవర్ అవుతది. ఆడ బోర్డు బెడతరు’ ‘సుధ వాళ్ల భర్త బెల్లంపల్లి ఓసీల జాబ్ చేస్తుండు. ఆయన్ను రెండు రోజు లల్ల తీసుకుపోయి మణుగూరుల పడేస్తం. కేటీఆర్ తలచుకున్నంక ఎంతసేపమ్మ. ఒక్క మాట చెప్తే రేప్పొద్దున ట్రాన్స్ఫర్ చేసేస్తడు’ ‘కలెక్టర్ ఏం జేస్తడు. గవర్నమెంట్‌కు ఫేవర్గ చేస్తడు కద. అఫీషియల్‌గ ప్రొలాంగ్ చేపించుడో, పోస్ట్‌పోన్ చేయించుడా ఏదో చేస్తం’ బెల్లంపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ కొప్పుల సత్యవతి కూతురుతో స్థానిక ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడిన మాటలు ఇవి. బెల్లంపల్లి మున్సి పల్ చైర్పర్సన్ సునీతారాణిపై అవిశ్వాసం పెట్టేందుకు పార్టీలకు అతీతంగా పాలకమండలిలోని 29 మంది కౌన్సిలర్లు కొద్దిరోజులుగా అజ్ఞాతంగా క్యాంపులో ఉన్నారు. అవిశ్వాసాన్ని వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే చిన్నయ్య క్యాంప్‌ను విచ్ఛిన్నం చేయడానికి రంగంలోకి దిగారు. కౌన్సిలర్ల ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఉండటంతో వారి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి క్యాంపు నుంచి తిరిగి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా 34వ వార్డు కౌన్సిలర్ సత్యవతి కూతురుతో తొలుత మాట్లాడిన ఎమ్మెల్యే క్యాంపు నుంచి తిరిగి వచ్చేలా ఒప్పిం చమని చెప్పారు. తల్లితో మాట్లాడిన కూతురు ఆ విషయాన్ని ఎమ్మెల్యేకు చెప్పేందుకు ఫోన్ చేయగా మంత్రి కేటీఆర్ పేరును ఉపయోగిస్తూ భయ పెట్టేలా సంభాషణ జరిపారు. కేటీఆర్ తలచుకుం టే ఏమైనా జరుగుతుందని, కౌన్సిలర్లకు ఇబ్బం దులు కలుగుతాయని స్పష్టం చేశారు. మాట వినకపోతే కౌన్సిలర్ల అధీనంలో ఉన్న వివాదాస్పద భూములను సర్కార్ కబ్జా చేసుకుంటుందని, బెల్లంపల్లి ఓపెన్‌కాస్ట్‌లో పనిచేస్తున్న సుధ అనే కౌన్సిలర్ భర్తను మణుగూరుకు రెండు రోజుల్లో బదిలీ చేస్తామని చెప్పుకొచ్చారు. ఈ ఫోన్ కాల్ లీక్ అయి గురువారం ఉదయాన్నే వాట్సాప్, ఫేస్బుక్ గ్రూపుల్లో వైరల్‌గా మారింది. అవిశ్వాస తీర్మానం వీగిపోయేందుకు ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలన్నీ ఫోన్ సంభాషణ ద్వారా వెల్లడి కావడంతో అధికార పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. బెల్లంపల్లి ప్రిస్టేజ్ ఇష్యూ బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తన సంభాషణలో మంత్రి కేటీఆర్ పేరును పలుమార్లు వాడుకున్నారు. ‘గవర్నమెంట్ తలచుకుంటే ఏమన్న అయితది. కేటీఆర్ ప్రిస్టేజ్ ఇష్యూ బెల్లంపల్లి క్యాంప్ అయింది’ అని ఎమ్మెల్యే సంభాషణ సాగించారు. ‘క్యాంపు నుంచి రాకుంటే ఎవరెవరికి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ టైట్ చేసేసి తీసు కొస్తం’ అని మాట్లాడటం చర్చనీయాంశమైంది. అవిశ్వాసానికి ఏడుగురు సభ్యుల నోటీసు బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవి శ్వాసం ప్రకటిస్తూ పాలక మండలిలోని ఏడు గురు సభ్యులు జాయింట్ కలెక్టర్ సురేందర్‌రావు కు నోటీసు అందజేశారు. గురువారం కలెక్ట ర్ కార్యాలయంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ నూనే టి సత్యనారాయణ (టీఆర్ఎస్) నేతృత్వంలోని సభ్యులు సతీష్, ఆర్.శారద (కాంగ్రెస్), బి.రాజేశ్, డి.సుజాత (టీఆర్ఎస్), టి.వంశీకృష్ణారెడ్డి, పి.రాజ్‌కుమార్ (ఇండిపెండెంట్లు) జేసీని కలసి అవిశ్వాసం నోటీసు అందజేశారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం కోసం పాలకమండలిని సమావేశపర్చాలని వారు కోరారు. 29 మంది సభ్యులు అవిశ్వాసం నోటీస్‌పై సంతకాలు చేశారు. -
టార్గెట్ ఈదర!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబుపై అవిశ్వాసం పెట్టి ఆయన్ను పదవీచ్యుతుడ్ని చేసేందుకు అధికార పార్టీ సిద్ధమవుతోందా..? యర్రగొండపాలేనికి చెందిన టీడీపీ నేత మన్నే రవీంద్ర అధికార పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారా..? ఈదరను పదవి నుంచి దింపి చైర్మన్‌ను చేస్తామని రవీంద్రకుటీడీపీ హామీ ఇచ్చిందా..? ఈ మేరకు సీఎం సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారా..? ఈ నేపథ్యంలోనే జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసానికి టీడీపీ సిద్ధమైందా..? ఇందుకు అధికార పార్టీ వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.. అసంతృప్తిలో మన్నే రవీంద్ర.. యర్రగొండపాలేనికి చెందిన టీడీపీ నేత, దొనకొండ జడ్పీటీసీ మన్నే రవీంద్ర అధికార పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిగా అధికార పార్టీ నుంచి నాడు మన్నే రవీంద్ర బరిలో దిగారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో అధికార పార్టీ జడ్పీటీసీ ఈదర హరిబాబుకు మద్ధతు పలకడంతో రవీంద్ర చివరి నిమిషంలో జిల్లా పరిషత్ చైర్మన్ కాలేకపోయారు. చైర్మన్‌గిరి కోసం ఆర్థికంగా నష్టపోయిన రవీంద్రకు పార్టీ అధికారంలోకి వచ్చినా ఒరిగిందేమి లేదు. మరోవైపు యర్రగొండపాలెం నియోజకవర్గంలో కీలకనేతగా ఉన్నా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచిన డేవిడ్‌రాజు అధికార పార్టీలో చేరడంతో రవీంద్ర అధిపత్యానికి గండిపడింది. అప్పటికే అక్కడ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న అజితరావు, కేడర్‌లో పట్టున్న జడ్పీటీసీ మన్నె రవీంద్రల మధ్య వర్గ విభేదాలున్నాయి. డేవిడ్‌రాజు రాకతో పార్టీ మూడు వర్గాలుగా చీలిపోయింది. ప్రసుత్తం అజితరావు నియోజకవర్గానికి కొంత దూరంగా ఉన్నా, మన్నె రవీంద్ర, ఎమ్మెల్యే డేవిడ్‌రాజులకు పొసగడం లేదు. ఈ పరిస్థితుల్లో డేవిడ్‌రాజుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చినా.. అటు మన్నె రవీంద్ర, ఇటు అజితరావు వర్గాలు పని చేసే పరిస్థితి లేదు.ఒక వేళ అజితరావుకు టికెట్ ఇచ్చినా మన్నె రవీంద్ర, డేవిడ్‌రాజులు ఆమెకు మద్ధతు ఇచ్చే ప్రసక్తే లేదు. సుదీర్ఘంగా సేవలందించినా.. పదవితో పాటు ప్రాధాన్యత లేకపోవడంతో మన్నే రవీంద్ర అలకబూనినట్లు తెలుస్తోంది. ఆయన త్వరలోనే టీడీపీని వీడతారన్న ప్రచారమూ సాగుతోంది. యర్రగొండపాలెం, దర్శి, పర్చూరు ప్రాంతాల్లో సామాజికవర్గ బలంతో పాటు కొంత మేర ప్రజాబలమున్న మన్నే రవీంద్ర టీడీపీ వీడటం వల్ల ఆ పార్టీకి మరింత నష్టం కలగనుంది. జడ్పీ చైర్మన్‌గిరి ఎర.. అధికార పార్టీ మన్నే రవీంద్రను బుజ్జగించే ప్రయత్నానికి దిగింది. జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబును పదవి నుంచి దించి మన్నే రవీంద్రకు చైర్మన్ పదవి అప్పగించాలని ముఖ్యమంత్రి జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్‌తో పాటు మిగిలిన నేతలను ఆదేశించినట్లు సమాచారం. దీంతో జడ్పీపై అవిశ్వాసం పెట్టేందుకు అధికార పార్టీ నేతలు మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు టీడీపీ నేతలు దీన్ని లోలోన వ్యతిరేకిస్తున్నా పైకి అంటిముట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు అవిశ్వాసాన్ని దామచర్ల జనార్ధన్ నెత్తికెత్తుకొనే పక్షంలో కరణం బలరాం వర్గం ఇందుకు పూర్తి స్థాయిలో మద్ధతు పలికే అవకాశాలు కానరావడం లేదు. అయినా జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసానికి అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ తాజా పరిస్థితిని పరిశీలిస్తే... 56 మంది సభ్యులున్న జిల్లా పరిషత్‌లో 31 మంది వైఎస్సార్సీపీ తరపున, 25 మంది టీడీపీ తరపున ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ తరపున నూకసాని బాలాజీ, టీడీపీ తరపున దొనకొండ జడ్పీటీసీ మన్నే రవీంద్రలు చైర్మన్ అభ్యర్థులుగా బరిలోకి దిగారు. తొలి సమావేశం నాటికే అధికార పార్టీ ముగ్గురు వైఎస్సార్సీపీ జడ్పీటీసీలను కొనుగోలు చేసింది. దీంతో ఇరుపార్టీలకు 28 చొప్పున సమానంగా జడ్పీటీసీలున్నారు. రెండవ సమావేశం నాటికి అధికార పార్టీ వైఎస్సార్సీపీకి చెందిన మార్కాపురం జడ్పీటీసీ రంగారెడ్డిపై ఎస్సీ యాక్టు కేసు పెట్టించారు. సమావేశానికి వస్తున్న సమయంలో రంగారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. దీంతో టీడీపీకి 28 మంది, వైఎస్సార్సీపీకి 27 మంది సభ్యులున్నారు. దీంతో అప్పట్లో వైఎస్సార్సీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాత్రికి రాత్రే చక్రం తిప్పారు. టీడీపీ తరపున పొన్నలూరు జడ్పీటీసీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే హరిబాబును జడ్పీ చైర్మన్ చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఇందుకు నూకసాని బాలాజీని ఒప్పించారు. వ్యూహం మేరకు సమావేశంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయించి ఈదరను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. 27 సభ్యులే కావడంతో టీడీపీ ఓటమిపాలైంది. మన్నే రవీంద్రకు చైర్మన్‌గిరి దక్కలేదు. ఆ తర్వాత టీడీపీ ఈదర హరిబాబును పార్టీ నుండి సస్పెండ్ చేయటం, జడ్పీటీసీ పదవి రద్దు కావడంతో ఈదర తాత్కాలికంగా చైర్మన్ కుర్చీ దిగిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత కోర్టుకెళ్ళి ఆయన తిరిగి చైర్మన్‌గా కొనసాగారు. ఈ మధ్య కాలంలో 13 నెలల పాటు జడ్పీ వైస్ చైర్మన్‌గా ఉన్న నూకసాని బాలాజీ చైర్మన్‌గా కొనసాగారు. అవిశ్వాసం ఫలించేనా..? జిల్లా పరిషత్‌కు 56 మంది సభ్యులుండగా ప్రస్తుతం 55 మంది సభ్యులే సభలో ఉన్నారు. వీరిలో వైఎస్సార్సీపీకి 17 మంది సభ్యులున్నారు. ఈదర హరిబాబుతో కలిపితే 18 మంది అవుతారు. అధికార టీడీపీకి 37 మంది సభ్యులున్నారు. అవిశ్వాసం ప్రవేశపెట్టేందుకు ఈ సంఖ్య సరిపోతుంది. నాలుగేళ్ళ పదవి కాలం అనంతరం అవిశ్వాసం పెట్టవచ్చు. ఈ లెక్కన జులై 13 నాటికి అవిశ్వాసం పెట్టే అవకాశం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం అధికార పార్టీకి అనుకూలంగానే ఉంది. ఈదరపై అవిశ్వాసం పెట్టే పక్షంలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అధికార పార్టీలోని దాదాపు 10 మంది సభ్యులు ఈదర హరిబాబుకు మద్ధతు పలికే అవకాశం ఉంది. కొండపి, చీరాల, గిద్దలూరు, మార్కాపురం, అద్దంకి నియోజకవర్గాల పరిధిలోని పలువురు సభ్యులు వ్యక్తిగతంగా, సామాజికవర్గ పరంగా ఈదరకు మద్ధతునిస్తున్నారు. ఇదే జరిగితే ఈదర హరిబాబును చైర్మన్ పదవి నుంచి దించడం సాధ్యం కాదు. మరోవైపు టెక్నికల్‌గా ఈదరపై ఇప్పట్లో అవిశ్వాసం పెట్టే అవకాశం లేదన్న ప్రచారం సాగుతోంది. నాలుగేళ్ళ పదవి కాలం ముగిసిన తర్వాత అవిశ్వాసం పెట్టవచ్చు. ఈదర 13 నెలల పాటు పదవిలో లేరు. ఈ సమయాన్ని నాలుగు సంవత్సరాల సమయంతో లెక్కిస్తారా.. లేదా.. అన్న దానిపై అవిశ్వాస తీర్మానం ఆధారపడి ఉంది. చైర్మన్ పదవిలో ఉన్న కాలాన్ని మాత్రమే లెక్కించే పక్షంలో నాలుగేళ్ళ కాలం పూర్తి కాద. ఈ లెక్కన చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టే అవకాశం ఉండదు. అలా కాకుండా పాలకవర్గం ఏర్పడిన నాటి నుండి మొత్తం కాలాన్ని గణించే పక్షంలోనే అవిశ్వాసం వీలవుతుంది. చైర్మన్ పదవి కాలాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉందని ఇప్పటికే న్యాయ నిపుణులు పేర్కొంటున్నట్లు సమాచారం. ఇదే జరిగితే జడ్పీ చైర్మన్‌పై అవిశ్వాసం జరిగే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఈదరకు పదవి గండం అవకాశాలు తక్కువే. ఒక వేళ అవిశ్వాసం నేపథ్యంలో మరోమారు ఈదర కోర్టు మెట్లెక్కాల్సి వస్తే అదృష్టం కలిసి వచ్చి వైస్ చైర్మన్‌గా ఉన్న తనకు పదవి దక్కకపోతుందా.. అని నూకసాని బాలాజీ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా జిల్లా పరిషత్‌పై అవిశ్వాసం వ్యవహారం ప్రస్తుతం అధికార టీడీపీతో పాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. -
దక్షిణాఫ్రికాలో గుప్తా ఫ్యామిలీ అక్రమాలు
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలోని ప్రముఖ వాణిజ్య సంస్థలకు అధిపతులైన గుప్తాల కుటుంబంలోని ఓ కీలక వ్యక్తిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో సన్నిహిత సంబంధాలున్న గుప్తాల ఇళ్లపై పోలీసు దాడులు జరిగాయి. దక్షిణాఫ్రికాలోని ఫ్రీస్టేట్ ప్రావిన్సులో ఉన్న వ్రెడె అనే పట్టణంలో పాల ఉత్పత్తి కేంద్రం నుంచి పేదలకు చెందాల్సిన కోట్ల రూపాయల డబ్బును అధ్యక్షుడి అండతో గుప్తా సోదరులు అక్రమ పద్ధతుల్లో కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విషయమై జొహన్నెస్‌బర్గ్ శివారు ప్రాంతమైన శాక్సన్వల్డ్లో ఉన్న వారి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించి ముగ్గురిని అరెస్టు చేయగా వారిలో ఒకరు గుప్తా కుటుంబంలోని వ్యక్తి ఉన్నారు. జాకబ్ జుమాను పదవి నుంచి దిగిపొమ్మని ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ) పార్టీ కోరడానికి కూడా గుప్తాలతో ఉన్న సంబంధాలే కారణమని తెలుస్తోంది. జాకబ్ జుమాపై అవిశ్వాసం! అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి జాకబ్ జుమాకు ఏఎన్సీ బుధవారం సాయంత్రం (నిన్న) వరకు గుడువిచ్చింది. ఆయన రాజీనామా చేయకపోతే పార్లమెంటులో గురువారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతా మంది. రాజీనామా చేయాల్సిందిగా ఇప్పటికే జుమాను ఏఎన్సీ కోరగా ఆయన అందుకు నిరాకరిస్తున్నారు. ఏఎన్సీ నిర్ణయాన్ని తానెప్పుడూ ధిక్కరించలేదనీ, కానీ తనను ఎందుకు తొలగించాలనుకుంటున్నారో, తాను చేసిన తప్పేంటో ఎవరూ చెప్పడం లేదని జుమా అన్నారు. ఎవరీ గుప్తాలు? జాకబ్ జుమాను తమ గుప్పెట్లో పెట్టుకుని రాజ్యాంగాధికారాలు సైతం చెలాయించిన గుప్తా సోదరుల ప్రయాణం ఉత్తరప్రదేశ్ నుంచి మొదలైంది. యూపీ లోని సహారాన్పూర్కు చెందిన శాండ్‌స్టోన్ వ్యాపారి శివ్‌కుమార్ గుప్తాకు అజయ్, అతుల్, రాజేష్ ‘టోనీ’ గుప్తా అనే ముగ్గురు కొడుకులున్నారు. వీరు 1993లో జొహన్నెస్‌బర్గ్‌లో అడుగుబెట్టి విశాల వాణిజ్య సామ్రాజ్యం నిర్మించారు. కంప్యూటర్లు, వాటి విడిభాగాల వ్యాపారంతో ప్రారంభించి మీడియా, యురేనియం, బొగ్గు గనులు, రియల్ ఎస్టేట్, లోహాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల వరకూ విస్తరించారు. అడ్డగోలుగా వ్యాపా రాలు చేశారు. 2009లో దేశాధ్యక్షుడైన జుమాకు అత్యంత సన్నిహితులుగా మారి న గుప్తాలు.. పాలకపక్షమైన ఏఎన్సీని సైతం తమ చెప్పుచేతల్లోకి తెచ్చుకున్నారు. ఊరి పేరుతో తొలి కంపెనీ.. గుప్తా సోదరులు తాము పుట్టి పెరిగిన సహారాన్పూర్ పేరు మీదుగా జొహన్నెస్ బర్గ్‌లో మొదటగా ‘సహారా కంప్యూట ర్స్’ను స్థాపించారు. ఇతర వ్యాపారాలకు విస్తరించాక 20 ఏళ్లలో అపర కుబేరుల య్యారు. 2013లో వారి సమీప బంధువు అనిల్ గుప్తా కూతురు పెళ్లికి చేసిన భారీ ఖర్చుతో వారి పేర్లు మార్మోగిపోయాయి. ఈ పెళ్లికి ఇండియా నుంచి 217 మంది అతిథులతో వచ్చిన విమానాన్ని వైమానికదళ స్థావరంలో దిగడానికి అనుమతించడంతో గుప్తాలు జుమాతో ఉన్న బంధాన్ని ఎలా వాడుకుంటున్నారో బయటపడింది. -
సర్పంచ్‌లపై అవిశ్వాసం వేటు
సాక్షి, హైదరాబాద్: సర్పంచ్‌లను పరోక్షంగా ఎన్నుకోవటంతోపాటు అవిశ్వాస తీర్మానంతో వారిపై వేటు వేసేలా కొత్త పంచాయతీరాజ్ చట్టానికి ప్రభుత్వం సవరణలు చేస్తోంది. సర్పంచ్‌లపై కొరడా ఝళిపిస్తూనే.. పలు విశేషాధికారాలనూ కల్పించనుంది. ప్రస్తుతం నిధుల దుర్వినియోగానికి పాల్పడితేనే సర్పంచిపై వేటు వేసే అవకాశం ఉంది. ఇప్పుడు విధులు నిర్వహించకపోయినా పదవి ఊడిపోయేలా కట్టుదిట్టంగా నిబంధనలు పొందుపరుస్తున్నారు. త్వరలోనే కొత్త చట్టానికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. చట్టం ముసాయిదాలో ఏయే అంశాలున్నాయి? వేటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది? ప్రస్తుతం ఉన్న చట్టానికి ఏమేం సవరణలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. కొత్త చట్టంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన సంస్కరణలు ఉండేలా అధ్యయనం చేయాలని సీఎం ఇప్పటికే అధికారులకు సూచించారు. దీంతో ముసాయిదా తుది రూపుదిద్దుకుంటున్న కొద్దీ కొత్త చట్టం ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతమున్న పంచాయతీరాజ్ చట్టంలో 220 సెక్షన్లున్నాయి. కొత్తగా మరో 50 సెక్షన్లను పొందుపరిచి చట్టంలో మొత్తం 275 సెక్షన్లు ఉండేలా భారీగా సవరణలు చేసే అవకాశాలున్నాయి. అధికార వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం ముసాయిదాలో ఇప్పటికే పొందుపరిచిన కొన్ని కీలకమైన అంశాలు ఇవీ.. ఎన్నిక పరోక్షం.. అసమ్మతితో వేటు సర్పంచ్ ఎన్నికను పరోక్షంగా నిర్వహించాలని కొత్త చట్టంలో పొందుపరచనున్నారు. గ్రామాల్లో గెలిచిన వార్డు మెంబర్లందరూ తమలో మెజారిటీ మద్దతు సాధించిన అభ్యర్థిని సర్పంచ్‌గా ఎన్నుకుంటారు. సర్పంచ్‌గా ఎన్నికయ్యే అభ్యర్థి విధిగా వార్డు మెంబర్‌గా గెలుపొంది ఉండాలి. ఒక అభ్యర్థి రెండు మూడు వార్డులకు పోటీ చేయటం కుదరదు. ఏదైనా ఒక వార్డు నుంచే పోటీ చేయాలి. మరోవైపు అసమ్మతి తీర్మానం ద్వారా సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించే వీలుంటుంది. సర్పంచ్, ఉప సర్పంచ్‌పై ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం పెట్టొచ్చు. విధులు సరిగ్గా నిర్వహించటం లేదని భావిస్తే ఎప్పుడైనా అవిశ్వాసం పెట్టే వెసులుబాటు ఉండేలా చట్టంలో ప్రత్యేకంగా సెక్షన్లను పొందుపరుస్తారు. ప్రస్తుత చట్టంలో ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లను అవిశ్వాస తీర్మానంతో తొలగించే నిబంధన ఉంది. పదవీకాలం నాలుగేళ్లు పూర్తయితేనే అవిశ్వాసం పెట్టాలనే షరతు కూడా ఉంది. సర్పంచ్‌లపై అవిశ్వాసానికి సంబంధించి ఇదే నాలుగేళ్ల వ్యవధి పాటిస్తారా లేదా అనేది స్పష్టత లేదు. బడ్జెట్ నుంచే నిధులు స్థానిక సంస్థలకు ప్రత్యేకంగా రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయిస్తారు. వీటిని ఖర్చు చేసేందుకు ప్రత్యేకంగా ఎక్స్పెండిచర్ కమిటీ ఉంటుంది. స్పెషల్ ఫండ్ గ్రామ సర్పంచ్ల అధీనంలో ఉంటుంది. కమిటీ సూచనల మేరకు ఫండ్‌ను ఖర్చు చేయాలనే నిబంధన ఉంటుంది. ఎన్ఆర్ఐలు, ఇతర దాతలు, వివిధ సంస్థల నుంచి సర్పంచ్ గ్రామానికి అవసరమైన నిధిని సేకరించే వెసులుబాటు ఉంటుంది. పంచాయతీరాజ్ చట్టం ముసాయిదా బిల్లు తయారీ తుది దశకు చేరిందని, సీఎం నిర్ణయం మేరకు నెలాఖరున లేదా జనవరిలో బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. సర్పంచ్‌లు సైతం పవర్ఫుల్ కొత్త చట్టంతో సర్పంచ్‌లకు సైతం విశేషాధికారాలు కల్పిస్తారు. గ్రామాల్లో రోడ్లపై చెత్త వేసినా, రోడ్లను తవ్వినా డ్రైనేజీలు, రోడ్ల వెడల్పుతోపాటు ఇతర ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఎవరైనా అడ్డుపడినా వాళ్లపై క్రిమినల్ కేసులు పెట్టించే అధికారాలు ఉంటాయి. గ్రామాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని సిఫారసు చేయవచ్చు. ఈ విషయాల్లో సర్పంచ్ సరిగ్గా వ్యవహరించకపోయినా, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచకపోయినా, పచ్చదనం పెంపొందించకపోయినా, సర్పంచ్‌ను బాధ్యుడిగా గుర్తించి సస్పెండ్ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సర్పంచ్, వార్డు మెంబర్‌పై నేరుగా పోలీసులు కేసు పెట్టే అవకాశం లేదు. సర్పంచ్‌పై ఎవరైనా కేసు పెట్టాలంటే 15 రోజుల ముందు ఆయనకు నోటీసు పంపటం తప్పనిసరి. ఎస్సైలు సలాం కొట్టాల్సిందే కొత్త చట్టం ప్రకారం సర్పంచ్ల ఆదేశాలను స్థానిక పోలీసులు పాటించాల్సి ఉంటుంది. ఏదైనా కేసు లేదా శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై స్థానిక పోలీస్, అంటే ఎస్సై స్థాయి అధికారి సర్పంచ్ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది. గ్రామ పంచాయతీకి రావాలని ఎస్సై స్థాయి అధికారిని సర్పంచ్ పిలిస్తే రావాల్సిందే. సర్పంచ్‌లపై పెత్తనపు కమిటీ సర్పంచ్‌లకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు గ్రామాల్లో కొత్తగా ఓ కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీ సూచనలను సర్పంచ్ తప్పక పాటిలించాలి. ప్రభుత్వమే ఈ కమిటీని నియమిస్తుంది. ఇందులో అధికారులుంటారా.. ఎవరైనా నామినేట్ సభ్యులుంటారా.. అనేది ప్రభుత్వమే తదుపరి జీవో ద్వారా వెల్లడిస్తుంది. గ్రామ సర్పంచ్ విధుల్లో విఫలమయ్యారని, అభివృద్ధి పనుల్లో అవినీతికి పాల్పడినట్లు కమిటీ భావిస్తే పదవి నుంచి సస్పెండ్ చేయాలని సిఫారసు చేసే విస్తృత అధికారాలు కమిటీకి ఉంటాయి. కమిటీ సలహాలను పాటించకున్నా సర్పంచ్ వ్యవహార శైలిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేసే అధికారం కమిటీకి ఉంటుంది. -
బెడ్రూంలో భార్యను వేరొకరితో చూసి..
అలబామా: అలబామాలో ఓ భర్త ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తన భార్య చేసిన మోసానికి అతడికి చిర్రెత్తిపోయింది. ఇంట్లోని పడకగదిలో తన భార్య పక్కన వేరొకరిని చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే భార్య బాయ్‌ఫ్రెండ్‌పై శివమెత్తాడు. పిడిగుద్దులు కురిపిస్తూ తన్నులతో చుక్కలు చూపించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అలబామాలో ఓ వ్యక్తి బయటకు పనిమీద వెళ్లాడు. కొన్ని గంటల తర్వాత ఇంటికి తిరిగొచ్చాడు. ఆ సమయంలో తన భార్య ఓ వ్యక్తితో అభ్యంతరకర పరిస్థితుల్లో కనిపించింది. ఆ దృశ్యాన్ని చూసిన భర్తకు కోపం కట్టలు తెంచుకుని ఒక్కసారిగా తన భార్యతో ఉన్న వ్యక్తిపై దాడికి దిగాడు. తన భర్త ఆవేశాన్ని చూసి భయంతో భార్య పారిపోగా ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను మాత్రం ఆ భర్త చితక్కొట్టాడు. ఇదంతా కూడా ఆ భర్తతోపాటు వచ్చిన మరో వ్యక్తి వీడియో తీశాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. -
బెడ్రూంలో భార్యను వేరొకరితో చూసి..
-
నెగ్గిన అవిశ్వాసం
⇒ కందుకూరు పీఏసీఎస్ వైస్ చైర్మన్‌పై గెలిచిన అధికార పార్టీ ⇒ తాత్కాలిక చైర్మన్‌గా మల్లేష్, వైస్ చైర్మన్‌గా బాల్‌రెడ్డి ⇒ 4వ తేదీన పూర్తి స్థాయిలో ఎన్నిక ⇒ అవిశ్వాసం అనంతరం డైరెక్టర్లు నేరుగా శిబిరానికి కందుకూరు: కందుకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం(పీఏసీఎస్) చైర్మన్ రాజీనామా చేయడంతో వైస్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసాన్ని ఎట్టకేలకు అధికార పార్టీ నెగ్గించుకుంది. జూలై 11న అధికార పార్టీ డైరెక్టర్ సరికొండ మల్లేష్ 10 మంది సభ్యుల సంతకాలతో చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చారు. సొసైటీ అధికారులు ఆగస్టు 2న అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి తేదీని ప్రకటించారు. జరిగిన పరిణామాలతో జూలై 30న చైర్మన్ వెదిరె నర్సింగంరెడ్డి రాజీనామా పత్రాన్ని డీఎల్సీఓకు అందించారు. దీంతో మంగళవారం ఉదయం 11 గంటలకు పీఏసీఎస్ కార్యాలయంలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానానికి శిబిరం నుంచి నేరుగా పది మంది డైరెక్టర్లు సరికొండ మల్లేష్, హరికిషన్‌రెడ్డి, బాల్‌రెడ్డి, రాములు, కొండారెడ్డి, యాదయ్య, జంగయ్య, బాల్‌రాజ్, లక్ష్మమ్మ, యాదమ్మతో ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి వచ్చారు. డిప్యూటీ రిజిస్ట్రార్, డివిజన్ కో ఆపరేటివ్ అధికారి శ్రీనివాస్‌రావు, సబ్ డివిజనల్ కో ఆపరేటివ్ అధికారి నర్సింహారెడ్డి ఉదయం 10.30 గంటలకు చైర్మన్ నర్సింగంరెడ్డి పంపిన రాజీనామ పత్రాన్ని ఆమోదించారు. అనంతరం హాజరైన సభ్యుల సమక్షంలో వైస్ చైర్మన్ ఎల్లారెడ్డిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చర్చకు అనుమతించారు. 10 మంది డైరెక్టర్ల ఏకగ్రీవ ఆమోదంతో వైస్ చైర్మన్ పదవీచ్యుతుడు అయినట్లు అధికారులు వెల్లడించారు. అనంతరం తాత్కాలిక చైర్మన్‌గా మీర్ఖాన్పేట డైరెక్టర్ సరికొండ మల్లేష్, వైస్ చైర్మన్‌గా నేదునూరు డైరెక్టర్ సర్గారి బాల్‌రెడ్డిని సభ్యులందరి ఏకాభిప్రాయంతో నియమించినట్లు ప్రకటించారు. పూర్తి స్థాయి చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఈనెల 4న మధ్యాహ్నం 12 గంటలకు మరోసారి సమావేశాన్ని నిర్వహించి ఎన్నిక నిర్వహిస్తామని డీఎల్సీఓ శ్రీనివాస్‌రావు ఈ సందర్భంగా విలేకరులకు తెలిపారు. ఆరోజు కోరం కింద 7 మంది డైరెక్టర్లు హాజరైతే పరిగణలోకి తీసుకుంటామని, చేతులు ఎత్తే పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎన్నుకుంటామని చెప్పారు. సొసైటీ పదవీ కాలం ఫిబ్రవరి 2018 వరకు ఉంటుందన్నారు. ఒకసారి ఎన్నికైతే మళ్లీ మూడేళ్ల వరకు అవిశ్వాసానికి అవకాశం లేదన్నారు. పోలీసుల బందోబస్తు.. ఉదయం నుంచి సొసైటీ కార్యాలయంలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఏలాంటి అడ్డంకులు ఏర్పడకుండా ఏసీపీ నారాయణ ఆధ్వర్యంలో ఆదిబట్ల, మంచాల, మహేశ్వరం సీఐలు గోవిందరెడ్డి, గంగారం, మన్మోహన్, స్థానిక ఎస్ఐలు చెన్నకేశ్వర్, సుధాకర్, సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. అయితే, అవిశ్వాస సమావేశం పూర్తయిన తర్వాత డైరెక్టర్లను నేరుగా ఎమ్మెల్యే తీగల మినీ బస్సులో శిబిరానికి తరలించారు. -
అవిశ్వాసం నోటీసు తుస్!
ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు టీడీపీ యత్నం అసెంబ్లీకి వెళ్లేందుకు యత్నించిన నేతలను అడ్డుకున్న పోలీసులు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వంపై శాసనసభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వాలని టీ టీడీపీ పన్నిన ఆఖరి వ్యూహాన్ని కూడా సర్కారు విజయవంతంగా అడ్డుకుంది. సస్పెండైన టీడీపీ సభ్యులు అసలు శాసనసభ ఆవరణలోకే రాకుండా పకడ్బం దీగా వ్యవహరించింది. సభ ప్రారంభం కావడానికి గంట ముందే అవిశ్వాస తీర్మానం నోటీసును శాసనసభా వ్యవహారాల కార్యదర్శి రాజా సదారామ్‌కు అందజేసి.. మరోసారి వార్తల్లోకి ఎక్కాలని టీ టీడీపీ భావించినప్పటికీ సాధ్యం కాలేదు. ‘సస్పెన్షన్‌కు గురైన సభ్యులు అసెంబ్లీలోకి రాకూడదు’ అని స్పీకర్ ఆదేశాల పేరుతో అసెంబ్లీ వెలుపలే ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. అసెంబ్లీ ఆవరణలోకి వచ్చిన ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, రాజేందర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావులను మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో వారు టీడీఎల్పీ కార్యాలయం ఆవరణ ముందు ధర్నా చేపట్టగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు తరలించారు. ఇదే సమయంలో కారులో అసెంబ్లీకి వస్తున్న రేవంత్‌రెడ్డిని మూడో గేటు వద్దే పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆయన కారును గేటుకు అడ్డంగానే నిలిపి, అందులోనే కూర్చున్నారు. దీంతో అసెంబ్లీలోకి వెళ్లాల్సిన వాహనాలన్నీ రోడ్డుపైనే నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసే వాహనా న్ని తెప్పించి, కారును వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయానికి తరలించి, రేవంత్‌ను పార్టీ కార్యాలయానికి పంపించారు. తర్వాత వచ్చిన ఎమ్మెల్యేలు వివేక్, గాంధీలను, టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి తదితరులనూ అరెస్టు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌కు తరలించారు. ఇక చివరికి టీడీఎల్పీ కార్యాలయ సిబ్బందితో అవిశ్వాస తీర్మానం నోటీసును అసెంబ్లీ కార్యదర్శికి పంపగా... అప్పటికే సమయం ముగియడంతో ఆయన తిరస్కరించారు. కాగా, దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రతిపక్షం అంటేనే రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోందని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల గౌరవానికి సాక్షాత్తుస్పీకరే భంగం కలిగించడం ప్రజాస్వామ్యంలో ఎక్కడా జరగలేదని ఆరోపించారు. ప్రభుత్వం, స్పీకర్ వైఖరిని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి తీవ్రంగా ఖండించారు. -
‘విండో’ చైర్మన్‌పై అవిశ్వాసం ?
కడెం : మండలంలో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. కడెం సహకార సంఘం చైర్మన్‌పై అవి శ్వాసం ప్రతిపాదించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సహకార సంఘ కార్యవర్గం 2013 ఫిబ్రవరి 4న ఎన్నికైం ది. 13 మంది డెరైక్టర్లు ఉండగా.. వీరిలో ఒకరు చైర్మన్‌గా, మరొకరు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2/3వ వంతు మెజార్టీ అవసరం కావడంతో అప్పట్లో టీడీపీకి చెందిన చుంచు భూమన్నకు ఏడుగురు డెరైక్టర్లు మద్దతు ఇచ్చి చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. భూమన్న ఎన్నికై ఏడాది గడిచిపోతోంది. అప్పట్లో చైర్మన్ పదవిని ఆశించి విఫలమైన వారు మళ్లీ ఇప్పుడు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో డీఎల్సీవో, డీసీవోలకు నోటీసు అందజేయనున్నట్లు సమాచారం. అప్పట్లో టీడీపీలో ఉన్న భూమన్న ప్రస్తుతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఏ పార్టీలోనూ చేరలే దు. అధికార టీఆర్ఎస్ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారని ప్రచారంలో ఉంది. మరోవైపు చై ర్మన్ పదవిని దక్కించుకోవాలని టీఆర్ఎస్ నా యకులు యోచిస్తున్నారు. ఈ క్రమంలో భూమ న్న టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. అవిశ్వాసం ప్రతిపాదిస్తే సునాయాసంగా నెగ్గేందుకు తన డెరైక్టర్లతో స న్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే శిబిరం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ట్లు సమాచారం. గురువారం విండో కార్యాల యంలో జరిగిన కార్యవర్గ సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కానీ కొందరు డెరైక్టర్లు, చైర్మన్ ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. తనకు పూర్తి మద్దతు ఉంద ని భూమన్న తెలిపారు. కార్యాలయ సీఈవో వ జ్రవేలును సంప్రదించగా.. అవిశ్వాసం సమాచారం అనధికారికంగా తెలిసిందన్నారు. -
ట్విట్టర్, ఫేస్‌బుక్‌తో జర జాగ్రత్త..!
వాషింగ్టన్: సోషల్ మీడియా ఈ ప్రపంచాన్నంతటిని ఓ కుగ్రామంగా మార్చేసి ఉండొచ్చు. ట్విట్టర్, ఫేస్బుక్ విప్లవాత్మక మార్పులు తీసుకుని రావచ్చు. అయితే అత్యుత్సాహంతో సమస్యలు తెచ్చుకోవద్దని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రేమకులు, భార్యాభర్తలు ట్విట్టర్, ఫేస్‌బుక్‌తో పూర్తిగా లీనమైపోతే ప్రతికూల పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. లేకపోతే బంధాలు విచ్ఛిన్నం కావడంతో పాటు విడాకులకూ దారితీసే ప్రమాదముందని ఓ అధ్యయనంలో తేలింది. మిస్సోరి స్కూల్ ఆఫ్ జర్నలిజం యూనివర్సిటీకు చెందిన ఓ విద్యార్థి అన్ని వయసులకు చెందిన 581 మంది ట్విట్టర్ ఖాతాదారులపై అధ్యయనం చేశాడు. ట్విట్టర్లో ఎప్పుడెప్పుడు లాగిన్ అవుతుంటారు.. ట్వీట్ చేయడం.. వార్తలు చూడటం.. ఇతరులకు నేరుగా సందేశాలు పంపడం.. ఫాలోయర్స్‌కు తిరిగి సమాధానాలు పంపడం..వంటి విషయాల గురించి ఆరా తీశాడు. దీనివల్ల ప్రేమికులు, భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తుతాయా అన్న కోణంలో ప్రశ్నించాడు. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జంటల మధ్య గొడవలు వస్తుంటాయని చెప్పాడు. ఒకొర్నకరు మోసం చేసుకోవడం నుంచి మొదలై భౌతిక దాడులు చేసుకోవడం, విభేదాలతో వీడాకులు తీసుకునే దాకా కూడా దారి తీయొచ్చని తెలిపాడు. అయితే, అమెరికాతో పోలిస్తే భారత్‌లో భిన్నమైన సంస్కృతి ఉంటుంది కాబట్టి ఇక్కడి సంబంధాలు వేరుగా ఉండొచ్చు.