వాషింగ్టన్: సోషల్ మీడియా ఈ ప్రపంచాన్నంతటిని ఓ కుగ్రామంగా మార్చేసి ఉండొచ్చు. ట్విట్టర్, ఫేస్బుక్ విప్లవాత్మక మార్పులు తీసుకుని రావచ్చు. అయితే అత్యుత్సాహంతో సమస్యలు తెచ్చుకోవద్దని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ప్రేమకులు, భార్యాభర్తలు ట్విట్టర్, ఫేస్బుక్తో పూర్తిగా లీనమైపోతే ప్రతికూల పరిణామాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. లేకపోతే బంధాలు విచ్ఛిన్నం కావడంతో పాటు విడాకులకూ దారితీసే ప్రమాదముందని ఓ అధ్యయనంలో తేలింది.
మిస్సోరి స్కూల్ ఆఫ్ జర్నలిజం యూనివర్సిటీకు చెందిన ఓ విద్యార్థి అన్ని వయసులకు చెందిన 581 మంది ట్విట్టర్ ఖాతాదారులపై అధ్యయనం చేశాడు. ట్విట్టర్లో ఎప్పుడెప్పుడు లాగిన్ అవుతుంటారు.. ట్వీట్ చేయడం.. వార్తలు చూడటం.. ఇతరులకు నేరుగా సందేశాలు పంపడం.. ఫాలోయర్స్కు తిరిగి సమాధానాలు పంపడం..వంటి విషయాల గురించి ఆరా తీశాడు. దీనివల్ల ప్రేమికులు, భార్యాభర్తల మధ్య సమస్యలు తలెత్తుతాయా అన్న కోణంలో ప్రశ్నించాడు. ట్విట్టర్, ఫేస్బుక్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల జంటల మధ్య గొడవలు వస్తుంటాయని చెప్పాడు. ఒకొర్నకరు మోసం చేసుకోవడం నుంచి మొదలై భౌతిక దాడులు చేసుకోవడం, విభేదాలతో వీడాకులు తీసుకునే దాకా కూడా దారి తీయొచ్చని తెలిపాడు. అయితే, అమెరికాతో పోలిస్తే భారత్లో భిన్నమైన సంస్కృతి ఉంటుంది కాబట్టి ఇక్కడి సంబంధాలు వేరుగా ఉండొచ్చు.
ట్విట్టర్, ఫేస్బుక్తో జర జాగ్రత్త..!
Published Tue, Apr 8 2014 2:45 PM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM
Advertisement
Advertisement