‘విండో’ చైర్మన్‌పై అవిశ్వాసం ? | infidelity on window chairman | Sakshi
Sakshi News home page

‘విండో’ చైర్మన్‌పై అవిశ్వాసం ?

Published Fri, Jul 25 2014 1:49 AM | Last Updated on Fri, Aug 10 2018 8:08 PM

infidelity on window chairman

కడెం : మండలంలో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. కడెం సహకార సంఘం చైర్మన్‌పై అవి శ్వాసం ప్రతిపాదించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సహకార సంఘ కార్యవర్గం 2013 ఫిబ్రవరి 4న ఎన్నికైం ది. 13 మంది డెరైక్టర్లు ఉండగా.. వీరిలో ఒకరు చైర్మన్‌గా, మరొకరు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2/3వ వంతు మెజార్టీ అవసరం కావడంతో అప్పట్లో టీడీపీకి చెందిన చుంచు భూమన్నకు ఏడుగురు డెరైక్టర్లు మద్దతు ఇచ్చి చైర్మన్‌గా ఎన్నుకున్నారు.

దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. భూమన్న ఎన్నికై ఏడాది గడిచిపోతోంది. అప్పట్లో చైర్మన్ పదవిని ఆశించి విఫలమైన వారు మళ్లీ ఇప్పుడు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో డీఎల్సీవో, డీసీవోలకు నోటీసు అందజేయనున్నట్లు సమాచారం. అప్పట్లో టీడీపీలో ఉన్న భూమన్న ప్రస్తుతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఏ పార్టీలోనూ చేరలే దు. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారని ప్రచారంలో ఉంది. మరోవైపు చై ర్మన్ పదవిని దక్కించుకోవాలని టీఆర్‌ఎస్ నా యకులు యోచిస్తున్నారు. ఈ క్రమంలో భూమ న్న టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం.

 అవిశ్వాసం ప్రతిపాదిస్తే సునాయాసంగా నెగ్గేందుకు తన డెరైక్టర్లతో స న్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే శిబిరం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ట్లు సమాచారం. గురువారం విండో కార్యాల యంలో జరిగిన కార్యవర్గ సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కానీ కొందరు డెరైక్టర్లు, చైర్మన్ ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. తనకు పూర్తి మద్దతు ఉంద ని భూమన్న తెలిపారు. కార్యాలయ సీఈవో వ జ్రవేలును సంప్రదించగా.. అవిశ్వాసం సమాచారం అనధికారికంగా తెలిసిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement