kadem
-
గోదావరిలో మళ్లీ జలకళ!
సాక్షి, హైదరాబాద్/బాల్కొండ/కడెం/కాళేశ్వరం: రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వానలతో గోదావరి నది మళ్లీ జలకళ సంతరించుకుంది. ఎగువన శ్రీరాంసాగర్ నుంచి నది పొడవునా ప్రవాహాలు పెరిగాయి. సోమవారం రాత్రికి ఎగువన శ్రీరాంసాగర్‌లోకి 50 వేల క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 16 గేట్లు ఎత్తి సుమారు అదే స్థాయిలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నీటి నిల్వ పూర్తిస్థాయిలో 90 టీఎంసీలకు చేరింది. ఇక కడెం ప్రాజెక్టుకు వరద 36,560 క్యూసెక్కులకు పెరిగింది. నాలుగు గేట్లను ఎత్తి 56,429 క్యూస్కెకుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా.. ప్రస్తుతం 6.5 టీఎంసీలు నిల్వ ఉంది. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 35,300 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 46,221 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్షి్మ) బ్యారేజీ నుంచి 1,66,970 క్యూసెక్కులు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజీ నుంచి 1,32,480 క్యూసెక్కులు, దుమ్ముగూడెం వద్ద సీతమ్మసాగర్ బ్యారేజీ నుంచి 81,108 క్యూసెక్కులను వదులుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం సరస్వతి బ్యారేజీకి సోమవారం రాత్రి గోదావరి ఎగువనుంచి వరద పోటెత్తడంతో 66 గేట్లకు 45 గేట్లు ఎత్తారు. లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇంజనీరింగ్ అధికారులు గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేశారు. ఆ నీరంతా కాళేశ్వరం వైపు తరలివస్తోంది. బేసిన్ పరిధిలో ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి గోదావరిలో వరద మరింతగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కృష్ణాలో కానరాని ప్రవాహాలు పశ్చిమ కనుమల్లో తీవ్ర వర్షాభావం కొనసాగుతుండటంతో కృష్ణా నదిలో ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. సోమవారం ఆల్మట్టి డ్యామ్‌లోకి కేవలం 5,086 క్యూసెక్కుల ప్రవాహమే నమోదైంది. అక్కడ విద్యుదుత్పత్తి ద్వారా వదులుతున్న 14 వేల క్యూసెక్కులు దిగువన నారాయణపూర్‌లోకి చేరుతున్నాయి. రాష్ట్రంలోని జూరాలకు కేవలం 420 క్యూసెక్కులే వరద ఉంది. కృష్ణా ప్రధాన ఉప నది తుంగభద్రకు కూడా కేవలం 559 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. శ్రీశైలం డ్యామ్‌కు ఎలాంటి వరద రావడం లేదు. స్థానిక వర్షాలతో నాగార్జునసాగర్‌కు 11,424 క్యూసెక్కులు, మూసీ ప్రవాహంతో పులిచింతలకు 5,546 క్యూసెక్కులు చేరుతున్నాయి. -
‘కడెం’ కష్టమే.. ప్రాజెక్టు నిర్వహణపై చేతులెత్తేసిన నీటిపారుదలశాఖ
సాక్షి, హైదరాబాద్: కడెం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ చేతులెత్తేసింది. నిర్వహణతో నెట్టుకురాలేమని, తరచూ సమస్యలు ఉత్పన్నం అవుతాయని, గేట్లు మొరాయిస్తూనే ఉంటాయని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నుంచి దిగువకు 3.82 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసే సామర్థ్యం ఉన్నా, గతేడాది జూలై 13న రికార్డు స్థాయిలో 5,09,025 క్యూసెక్కుల వరద పోటెత్తడంతో ప్రాజెక్టు తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొంది. ప్రాజెక్టు ఎత్తు 700 అడుగులు కాగా అప్పట్లో ప్రాజెక్టుపై నుంచి 706 అడుగుల ఎత్తులో వరద ప్రవహించింది. గతనెల చివరి వారంలో భారీ వర్షాలు కురవడంతో కడెం ప్రాజెక్టుపై నుంచి 702 అడుగుల ఎత్తులో వరద పారింది. గేట్ల మొరాయింపుతోనే సమస్య గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను వచ్చినట్టు కిందకు పంపించడం సాధ్యం కావడం లేదు. టాప్‌సీల్ గేట్ల కారణంగా వీటి నిర్వహణ సమస్యాత్మకంగా మారింది. గతేడాది వచ్చిన వరదలకు 4 గేట్లు మొరాయించడంతో వచ్చిన వరదను పూర్తి స్థాయిలో దిగువకు వదలడం సాధ్యం కాలేదు. మళ్లీ ఆ గేట్లకు మరమ్మతులు చేసి పునరుద్ధరించారు. గత నెలలో వ చ్చి న వరదల సమయలోనూ మరో 4 గేట్లు మొరాయించడంతో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు గేట్లకు అప్పటికప్పుడు మరమ్మతులు చేసి పైకి ఎత్తగలిగారు. మరో గేటుకు తర్వాత మరమ్మతులు పూర్తి చేశారు. చివరి గేటుకు మరమ్మతులు సాధ్యం కాలేదు. గేట్ల విడి భాగాలు లభించడం లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ చేసి తయారు చేయించుకోవాలనుకున్నా, వీటి డిజైన్లు, డ్రాయింగ్స్ అందుబాటులో లేవు. కడెం ప్రాజెక్టు 18 గేట్లను పైకి ఎత్తడానికి కనీసం 2 గంటల సమయం పడుతుంది. అయితే కడెం నదిపరీవాహక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలతో గంట వ్యవధిలో కడెం ప్రాజెక్టుకు గత నెలలో 3 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరింది. మూడు చోట్ల పగుళ్లు.. ప్రాజెక్టు గేట్ల మధ్య పిల్లర్ తరహాలో ఉంటే కట్టడాన్ని పీయర్స్ అంటారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించి మూడు పీయర్స్‌కు అర్ధ అంగుళం నుంచి అంగుళం నిడివితో పగుళ్లు వచ్చాయి. వీటికి సిమెంట్ మిశ్రమంతో మూసి గ్రౌటింగ్‌తో తాత్కాలిక మరమ్మతులు చేశారు. భవిష్యత్‌లో ప్రాజెక్టుకు భారీ వరదలు వస్తే పగుళ్లు వచ్చిన పీయర్స్ ఉధృతిని తట్టుకోవడం కష్టమేనని, అకస్మాత్తుగా కొట్టుకుపోతే దిగువన ఉన్న గ్రామాలు నీటమునిగే ప్రమాదముందని నీటిపారుదలశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కుఫ్తీ కడితే పెద్దగా ప్రయోజనం ఉండదు.. ఎగువ పరీవాహక ప్రాంతంలో కుఫ్తీ డ్యాం నిర్మిస్తే కడెం ప్రాజెక్టుపై వరద ఉధృతి తగ్గుతుందని గతంలో నీటిపారుదల శాఖ భావించింది. అయితే కుఫ్తీ ప్రాజెక్టు నిర్మాణంతో కడెంపై పెద్దగా వరద ఒత్తిడి తగ్గదని, ఎగువ నుంచి వచ్చే వరదను ముందస్తుగా అంచనా వేసేందుకు అవసరమైన సమయం మాత్రం లభిస్తుందని తాజాగా నీటిపారుదలశాఖ ఓ అభిప్రాయానికి వచ్చింది. ఆధునీకరణ ప్రతిపాదనలు ఇలా.. కొత్తగా రేడియల్ గేట్లు ఏర్పాటు చేయాలి. అదనంగా 1.5 లక్షల నుంచి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేలా డిజైన్ చేయాలి. అదనపు గేట్లు, కొత్త స్పిల్‌వే నిర్మించాలి. గతేడాది డ్యామ్ సేఫ్టీ అండ్ రిçహాబిలేషన్ ప్రోగ్రామ్(డీఎస్ఆర్పీ) కింద నిపుణులతో అధ్యయనం చేయించినా ఇదే సూచనలు చేసినట్టు సమాచారం. -
అయ్యో.. పాపం.. నలుగురిని బలిగొన్న నిర్లక్ష్యపు డ్రైవింగ్
కడెం(ఖానాపూర్): నిర్లక్ష్యపు డ్రైవింగ్ నలుగురి ప్రాణాలను బలితీసుకుంది. బాధిత కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. బిడ్డను చూసేందుకు వెళ్తున్న ఓ తండ్రిని, ఇతర పనుల నిమిత్తం వెళ్తున్న మరో ముగ్గురు మహిళలను అన్యాయంగా పొట్టనబెట్టుకుంది ఆటో రూపంలో వచ్చిన రహదారి ప్రమాదం. హృదయ విదారకమైన ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కడెం నుంచి ఎనిమిది మంది ప్రయాణికులతో బయలుదేరిన ఆటో చిన్నబెల్లాల్ వైపు వెళ్తుండగా పెద్ద బెల్లాల్ సబ్‌స్టేషన్ మూలమలుపు వద్ద అదుపుతప్పి కల్వర్టుపై నుంచి కింద పడింది. పది అడుగుల పై నుంచి ఆటో కింద పడడంతో పెద్దబెల్లాల్ గ్రామానికి చెందిన చీమల శాంత(45), లింగాపూర్ పంచాయతీ పరిధి మల్లన్నపేట్ గ్రామానికి చెందిన బోడ మల్లయ్య(60), కన్నాపూర్ పంచాయతీ పరిధి చిన్నక్యాంప్ గ్రామానికి చెందిన కొండ్ర శంకరవ్వ(48) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన దస్తురాబాద్ మండలం గొడిసెర్యాలకు చెందిన శ్రీరాముల లక్ష్మి(60) నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అలాగే ఆటోలో ప్రయాణిస్తున్న అక్షయ్, కోల శ్రీనుతోపాటు డ్రైవర్, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను నిర్మల్, జగిత్యాల ఆసుపత్రులకు తరలించారు. ఘటనా స్థలాన్ని ఖానాపూర్ సీఐ ఆజయ్‌బాబు, ఎస్సై రాజు పరిశీలించారు. డ్రైవర్ అజాగ్రత్త వల్లే ప్రమాదం జరిగిందని, ఘటనపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మల్లయ్య తన బిడ్డను చూసేందుకు చిన్నబెల్లాల్ వెళ్తున్నాడు. చీమల శాంత, కొండ్ర శంకరవ్వ బొర్నపల్లికి, శ్రీమంతుల లక్ష్మి జగిత్యాల వైపు పని నిమిత్తం వెళ్తున్నారు. లక్ష్మికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు. శాంతకు నలుగురు కూతుళ్లు, భర్త ఉన్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంతోనే.. నిబంధనల ప్రకారం నలుగురు మాత్రమే ప్రయాణించాల్సిన ఆటోలో ఎనిమిది మంది ప్రయాణికులతో వెళ్తున్నారు. మండల కేంద్రానికి చెందిన ఆటో డ్రైవర్‌తో పాటు, బెల్లాల్ గ్రామానికి చెందిన అతడి స్నేహితుడు పలుమార్లు రన్నింగ్‌లోనే ఆటో స్టీరింగ్‌ను మార్చుకుంటూ అతి వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగినట్లు సమాచారం. అయితే ఈ ఆటోను నడిపిస్తున్న ఇద్దరు యువకులు మైనర్లేనని స్థానికులు పేర్కొన్నారు. ఊపిరాడక మరణించారా? మూలమలుపు వద్ద రహదారికి కొద్దిపాటి ఎత్తులో ఉన్న కల్వర్టు రక్షణ గోడను ఎక్కి సుమారు పది అడుగులో లోతులో ఆటో పడిపోయింది. పక్కనే ఉన్న చెరువు నుంచి పొలాలకు సాగునీటిని అందించే ఈ కాలువగుండా కొద్దిపాటి నీరు ప్రవహిస్తోంది. క్షతగాత్రులు ఆటో కింద పడిపోగా బురద నీటిలో కురుకుపోవడం వల్ల శ్వాస అందక మృతిచెంది ఉండవచ్చని అంబులెన్స్ సిబ్బంది పేర్కొన్నారు. మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు ప్రమాదంలో మృతిచెందిన నలుగురి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ‘నాన్న.. నన్ను చూసేందుకు వచ్చినవా.. ఏమైంది నాన్న.. లే నాన్న.. నీ బిడ్డ వచ్చింది సూడు నాన్న..’ అంటూ బోడ మల్లయ్య కూతురు విలపించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ‘బిడ్డా..మమ్ములను విడిచిపెట్టి పోయినవా.. నీ బిడ్డలు కూడా గుర్తు రాలేదా.. వాళ్లకు ఏం జెప్పినవ్..’ అంటూ కొండ్ర శంకరవ్వ తల్లి రోదించింది. -
Telangana: చికెన్ తిని ఊరంతా అస్వస్థత...
కడెం: కలుషిత ఆహారం తిని ఊరంతా అస్వస్థతకు గురైన సంఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం రానిగూడలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని మొర్రిపేట్ గ్రామంలో దండారీ వేడుకల్లో భాగంగా ఈనెల 6న ఊరంతా కలిసి ఒక చోట సహపంక్తి భోజనాలు చేశారు. మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనలతో ఊరంతా అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని 61 మందికి చికిత్స అందజేశారు. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆహారంలో తీసుకున్న చికెన్‌తోనే అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. -
కడెం డివిజన్లో పులి సంచారంపై అప్రమత్తం
సాక్షి, జన్నారం(ఖానాపూర్): కడెం డివిజన్లోని పాడ్వాపూర్ బీట్ ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని జన్నారం అటవీ డివిజన్ అధికారులు అప్రమత్తం అయ్యారు. పాడ్వాపూర్ బీట్ పరిధిలోని గంగాపూర్ ప్రాంతం, ఇస్లాంపూర్ అడవి నుంచి కవ్వాల్ సెక్షన్లో పులి పర్యటించే అవకాశం ఉంది. దీంతో ఆదివారం ఇందన్పల్లి రేంజ్ అధికారి శ్రీనివాసరావు అధ్వర్యంలో అధికారులు కవ్వాల్ టైగర్‌జోన్ పరిధిలోని కవ్వాల్ సెక్షన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. పులి అడుగులు, ఇతర గుర్తింపులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. అటవీ ప్రాంతంలో రహదారులు, వాగులు, ఇతర ప్రాంతాల్లో అధికారులు పులి అడుగుల కోసం అన్వేషించారు. ఎక్కడా అడుగులు కనిపించలేదు. గంగాపూర్ మీదుగా కవ్వాల్కు వచ్చే అవకాశం ఉన్నందున ముందస్తుగా ఎలాంటి అలజడి లేకుండా, పశువులు రాకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పులి కవ్వాల్ సెక్షన్లో ప్రవేశిస్తే ఇక్కడి సౌకర్యాల దృష్ట్యా తిరిగి వెళ్లే పరిస్థితి ఉండదనే ఆశాభావం అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కవ్వాల్ అభయారణ్యాన్ని 2012 జనవరి 10న కేంద్ర ప్రభుత్వం టైగర్‌జోన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి అసెంబ్లీ స్పీకర్ మనోహర్ కవ్వాల్ అభయారణ్యంలో పర్యటించి ఆయన చేసిన సూచన మేరకు 49వ టైగర్‌జోన్‌గా ఏర్పాటు చేశారు. టైగర్‌జోన్ ఏర్పాటు నుంచి పులి రాక కోసం అధికారులు అన్నిరాకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం రాలేదు. మూడేళ్ల క్రితం కొన్ని రోజులు రాకపోకలు కొనసాగించింది. ఈ క్రమంలో హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ సభ్యులు, అటవీశాఖ అధికారులు పులికి రక్షణ కల్పించారు. కొంత అలజడి వల్ల వచ్చిన పులి మూడు సంవత్సరాలుగా కనిపించకుండా పోయింది. ఎట్టకేలకు ఈ నెల 15 న కడెం రేంజ్ పరిధిలోని పాడ్వాపూర్ బీట్, గంగాపూర్ పరిధిలో బేస్‌క్యాంపు సిబ్బందికి పులి కనిపించింది. వారు అప్రమత్తమై ఉన్నత అధికారులకు తెలియజేయడంతో కెమరాలు అమర్చడం వల్ల పులి కెమెరాకు చిక్కింది. దీంతో అధికారుల అనుమానం నిజమైంది. అడుగుల సేకరణలో సిబ్బంది కవ్వాల్ అభయారణ్యం పరిధిలో ఇటీవలే పెద్ద పులి కనిపించడంతో అధికారులు వాటి సంఖ్యను క్షేత్రస్థాయిలో గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ నిర్వహించారు. శనివారం కడెం ఆటవీ రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్, బీట్ల ఫరిధిలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాల్లో పెద్ద పులి కనిపించడంతో అంతకుముందు దాని పాదలు గుర్తించిన అధికారులు వాటి సంఖ్యను గుర్తించేందుకు ఆదివారం అడుగుల సేకరణ పనిలో ఉన్నారు. కడెం రేంజ్ ఫరిధిలోని పాండ్వపూర్ బీట్లతోపాటు ఇతర బీట్లలో వాటి అనవాళ్లు ఉన్నాయా అనే కోణంలో పరిశీలించారు. అధికారులు బృందాలుగా ఏర్పడి వాటిని గుర్తించే పనిలో ఉన్నారు. ఆదివారం హైదరాబాద్ అటవీ శిక్షణ ఎఫ్ఆర్ఓలు శిక్షణకు రావడంతో ఈ ప్రాం తం, జంతువుల వివరాలను అటవీ అధికారులు తెలియజేశారు. ఎఫ్ఆర్వో రమేశ్ రాథోడ్, ఎఫ్‌ఎస్‌ఓలు ప్రభాకర్, మమత పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
కడెం(ఖానాపూర్): మండలంలోని కొండుకూరు గ్రామానికి చెందిన మద్ది శ్రావణ్(24) గురువారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై అజయ్‌బాబు తెలిపిన వివరాలివీ..శ్రావణ్ మండలంలోని పాండ్వాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. కాని మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ప్రేమించిన అమ్మాయి గురువారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి చెందిన యువకుడు మద్దిపడగ గ్రామసమీపంలోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుంటుంబీకులు అపస్మారక స్థితిలో ఉన్న యువకున్ని 108లో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి పోశవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
697 అడుగులకు ‘కడెం’ నీటిమట్టం
కడెం : కడెం ప్రాజెక్టు నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టు పరివాహక కుప్టి, బోథ్, గుడిహత్నూర్, ఉట్నూర్, నేరడిగొండ, బజార్హత్నూర్ తదితర ప్రాంతాల్లో నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో జలాశయానికి జలకళ సంతరించింది. రెండు రోజుల క్రితం నీటిమట్టం 695 అడుగులు. గురువారం సాయంత్రం వరకు 697 అడుగులకు చేరింది. ఎగువ నుంచి 2,497 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా వస్తుంది. కాగా ఎడమ కాలువ ద్వారా 755 క్యూసెక్కులు, కుడికాలువ ద్వారా 42 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు జేఈ తడమల్ల శ్రీనాథ్ విలేకరులకు తెలిపారు. -
కడెం సందర్శించిన అదనపు డీజీపీ
కడెం : కడెంను శనివారం సాయంత్రం రాష్ట్ర అదనపు డీజీపీ ఉమేష్ షరాఫ్ కుటుంబసమేతంగా సందర్శించారు. ఆయన టూరిజం వారి బోటింగు కేంద్రానికి వచ్చి అక్కడ పడవలో ఎక్కి కుటుంబీకులతో కలిసి జలాశయంలో విహరించారు. ఇక్కడి అందమైన ప్రకతి దశ్యాలను ఆయన ఫోటోలు తీశారు. అనంతరం ఆయన కడెం ప్రాజెక్టుకు వెళిల అక్కడ ప్రాజెక్టును తిలకించారు. శనివారం రాత్రి స్థానికంగా ఉన్న హరితా రీసార్ట్స్లోనే బస చేశారు. ఈ సందర్భంగా ఖానాపూర్ సీఐ నరేష్, కడెం, పెంబీ ఎసై ్సలు రాము, అజయ్‌లు బందోబస్తు నిర్వహించారు. -
అంగన్వాడీ కేంద్రంలోకి నాగుపాము
భయంతో వణికిపోయిన చిన్నారులు కడెం : మండలంలోని కొండుకూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలోకి శుక్రవారం మధ్యాహ్నం పాము రావడంతో చిన్నారులు భయంతో వణికిపోయారు. కేంద్రంలో పిల్లలు కూర్చుండే హాలులో ఒక మూలన సరుకులు, కోడిగుడ్లు, బియ్యం, పప్పులు ఇతర సామగ్రి ఉంచారు. వాటి పక్క నుంచే ఒక్కసారిగా పాము బయటకు వచ్చింది. ఆ సమయంలో కార్యకర్త గంగామణి లేదు. విధుల్లో ఉన్న ఆయా లక్ష్మి వెంటనే పిల్లలను దూరం వెళ్లమని చెప్పి భయాందోళనతో బయటకు వెళ్లి కేకలు వేసింది. దీన్ని చూసిన అదే గ్రామానికి చెందిన వైస్ ఎంపీపీ పి. సంతోష్‌రెడ్డి వెంటనే అక్కడి చేరుకుని ఆ పామును చంపించారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరిపీల్చుకున్నారు. కేంద్రం పనితీరు అస్తవ్యస్తంగా తయారైందనాటికి ఈ ఘటనే నిదర్శనం. -
బావిలో పడి ఇద్దరు యువకుల దుర్మరణం
కడెం: ఆదిలాబాద్ జిల్లాలో ప్రమాదవశాత్తూ బావిలోపడి ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన కడెం మండలం గుడితిర్యాల గ్రామ శివారులో సోమవారం చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లా పెరికి గ్రామానికి చెందిన నరేష్(24), చింటు(20) అనే యువకులు దైవదర్శనార్థం గుడితిర్యాలకు వచ్చారు. పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో స్నానం చేసేందుకు వెళ్లిన నరేష్ నీటిలో మునిగిపోతుండగా గట్టుపై ఉన్న చింటూ కాపాడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇద్దరి మృతి దేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
కడెం (ఆదిలాబాద్ జిల్లా) : కడెం మండలం సింగాపూర్ గ్రామంలో బాణావత్ తులసీరాం నాయక్(44) అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఇంట్లో ఎవరూలేని సమయం చూసి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో సుమారు రూ.5 లక్షల మేర అప్పలు అయినట్లు తెలిసింది. అప్పుల వాళ్ల ఒత్తిడి తట్టుకోలేకే ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. -
విద్యార్థి అదృశ్యం
కడెం (ఆదిలాబాద్ జిల్లా) : కడెం మండలం ముర్రిగూడెం గ్రామానికి చెందిన సాయిచంద్(13) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన సాయిచంద్ అల్లంపల్లిలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన సాయిచంద్‌ను తండ్రి గురువారం సాయంత్రం బీర్సాయిపేట స్టేజీ వద్ద వదిలివెళ్లాడు. అక్కడి నుంచి అల్లంపల్లి పాఠశాలకు ఆటోలో వెళ్లిపోవచ్చు. అయితే సాయిచంద్ పాఠశాలకు రాలేదని.. అదే స్కూల్లో చదువుతున్న మరో విద్యార్థి శుక్రవారం సాయిచంద్ తల్లిదండ్రులకు తెలిపాడు. ఇంటికి కూడా రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు శుక్రవారం సాయంత్రం కడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నిండిన జలాశయాలు
కడెం : ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల్లో మండలంలో వేలాది ఎకరాలు బీడుగా మారాయి. కొందరు రైతులు మొండి ధైర్యంతో వరి నార్లు పోయగా అవి ఎండలకు ఎండిపోయాయి. ఇదీ.. మొన్నటి వరకు కడెం ప్రాజెక్టు, సదర్మాట్ ఆయకట్టుల కింద ఉన్న పరిస్థితి. ప్రస్తుతం వారం రోజులుగా వరుసగా ముసుర్లు పడుతుండడంతో కడెం ప్రాజెక్ట్‌తోపాటు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, బావులు జలకళను సంతరించుకున్నాయి. పొలం పనుల్లో రైతులు బిజీ.. కడెం ప్రాజెక్టు, సదర్మాట్లు నిండడంతో అధికారులు ఇదివరకే కాలువల ద్వారా నీటిని వదిలారు. ఈ నీరు పంటలకు కాదు.. చెరువులకు మాత్రమే అని కూడా వారు ప్రకటించారు. కానీ చెరువులు, బావుల కింద మాత్రం రైతులు ఇప్పటికే మండలంలోని చాలా గ్రామాల్లో వరినార్లు పోసుకున్నారు. కష్టపడి వరినార్లను కాపాడిన రైతులకు ఈ వర్షం చాలా ఆదుకున్నట్లయింది. వారంతా ఇపుడు వరినాట్లు వేసుకుంటున్నారు. వారిలో కొత్త ఆశలు చిగురించాయి. తమ పంట సాగు విజయవంతంగా జరుగుతుందన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. మండలంలో ఎక్కడ చూసినా వరినాట్లు వేసుకోవడంలో రైతులు బిజీగా కనిపిస్తున్నారు. 15 రోజుల కిందట కురిస్తే.. వర్షాలున్నట్టుండి ఎటూ కాని సమయంలో కురుస్తుండడంతో కొందరు రైతులు సంతోషంతో ఉండగా మరి కొందరు అయ్యో ఇంకో 15 రోజుల కిందట పడితే తమ వరినారు దక్కేదని బాధ పడుతున్నారు. ఆయకట్టు కింద చాలా మంది రైతుల వరినార్లు ఇప్పటికే ఎండలకు ఎండిపోయాయి. కొందరు తెలిసిన తోటి రైతుల నుంచి, పరిచయం ఉన్న వారి నుంచి డబ్బులకు వరినార్లు కొనుక్కుంటున్నారు. వరినారు దొరకనివారు బాధపడుతున్నారు. ప్రస్తుతం మండలంలో కొద్దిరోజులుగా పంట భూములు రైతులతో కళకళలాడుతున్నాయి. -
చేప పిల్లల ఉత్పత్తి ప్రారంభం
కడెం : నాలుగు కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా కడె ంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ముందుకుసాగుతోంది. ఈ కేంద్రాన్ని ప్రభుత్వం 1989లో ప్రారంభించింది. కడెం ప్రాజెక్టు సమీపంలోని దాదాపు 25 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. చేప పిల్లలను ఉత్పత్తి చేసి కడెం రిజర్వాయర్‌లో వదిలి ఇక్కడి మత్స్యకారుల జీవనోపాధికి తోడ్పాటునందించాలనేది కేంద్రం ఉద్దేశం. అయితే ఏటా చేప పిల్లల ఉత్పత్తికోసం లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తోంది. అందుకోసం సిబ్బంది ఆ దిశగా కృషి చేస్తున్నారు. పిల్లల ఉత్పత్తికి చల్లని వాతావరణం అనుకూలంగా ఉంది. ఉత్పత్తికి అవసరమైన హౌజులు 35 వరకు ఉన్నాయి. ఈ సారి వర్షాభావం కారణంగా ఉత్పత్తికి కొంత ఆటంకం కలుగుతోంది. ప్రారంభమైన ఉత్పత్తి జూలై రెండోవారంలో ఉత్పత్తి ప్రారంభించా రు. మొదటగా బంగారు తీగ, కట్ల,రహు రకం చేపల ఉత్పత్తి చేపట్టారు. తల్లి చేపకు కృత్రిమ గర్భదారణ చేయించిన అనంతరం మగ చేపలతో ఫలదీకరణ చేయిస్తారు. ఇలా వచ్చిన చిన్న పిల్లలను 45 రోజుల వరకు హౌజులలో వాటికి అవసరమైన ఆహారం వేసి జాగ్రత్తగా పెంచుతారు. 45 రోజుల తర్వాత ఇంచు సైజులో పెరుగుతాయి. వాటిని కేంద్రం పరిధిలోని కడెం, ముథోల్, ఖానాపూరు, భైంసా, కుభీర్, తానూరు మండలాల్లోని గుర్తింపు పొందిన 45 మత్స్యకారుల సొసైటీలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయిస్తారు. కేంద్రంలో కట్ల చేప 13 లక్షలు, రహూ 20 లక్షలు, బంగారు తీగ 50 వేల వరకు పిల్లలున్నాయి. హౌజుల్లో వేసిన పిల్లలకు ఆహారాన్ని ప్రత్యేకంగా తయారు చేసి రోజూ అందిస్తారు. అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు జలాశయంలోనూ పిల్లలను వదులుతారు. ప్రస్తుతం ఉత్పత్తి కేంద్రం పరిధిలో 51 చెరువులు,కుంటలున్నాయి. ఈసారి 4 కోట్ల పిల్లల ఉత్పత్తి లక్ష్యం ఉండడంతో ఇంకా కొద్దిరోజుల్లో మళ్లీ ఉత్పత్తి చేపడతామని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా దోమల నివారణకోసం గంబూజియా చేపలు కేంద్రంలో ప్రస్తుతం 5 లక్షల చేప పిల్లలున్నాయి. వాటిని ఆయా పంచాయతీలకు ఉచితంగా సరఫరా చేస్తారు. కేంద్రంలో సిబ్బంది కొరత ఉత్పత్తి కేంద్రంలో సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. నాలుగైదు ఏళ్లుగా కేంద్రానికి ఇన్చార్జి అధికారే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం చుట్టూ కంచె లేదు. పశువులు విచ్చలవిడిగా సంచరిస్తుంటాయి. రాత్రి వేళల్లో అంధకారం. -
అంతా అప్రమత్తం!
కడెం : మావోయిస్టుల వారోత్సవాలు సోమవారం నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరుగనున్న నేపథ్యంలో పోలీసు విభాగం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూనే మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. కడెం మండలంలో... ఒకప్పుడు కడెం మండలం మావోయిస్టుకు వారికి కంచుకోటగా ఉండేది. కానీ మారిన పరిస్థితుల కారణంగా క్రమంగా మావోయిస్టుల ఉనికి చాలా వరకు తగ్గింది. మండలంలోని సమీప అటవీ గ్రామాలైన అల్లంపల్లి, గంగాపూరు, కల్లెడ, దోస్తునగర్, ఉడుంపూరు, ఇస్లాంపూరు, గండిగోపాల్పూర్, మైసంపేట, ధర్మాజీపేట, సింగాపూరు తదితర గ్రామాలన్నీ వారికి ఎంతగానో అనుకూలంగా ఉండేవి. దీంతో ఈ ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కొద్ది రోజులుగా ఇక్కడ ప్రధాన రహదారిపై అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిఘా ఉంచారు. అపరిచిత, అనుమానిత వ్యక్తుల ఏగురించి తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రజా ప్రతినిధులకు రక్షణ పెంచారు. మావోయిస్టు వారోత్సవాల దృష్ట్యా తాము పూర్తిగా అప్రమత్తంగా ఉన్నాం.వాహనాల తనిఖీని ముమ్మరంగా చేపట్టాం.రాత్రి వేళ పెట్రోలింగును పెంచాం.స్థానికంగా ఇందుకు సంబందించిన అన్ని చర్యలను తీస్కున్నాం.పోలీస్టేషను వద్ద భద్రతను పెంచాం. ప్రజా ప్రతినిధులను కూడా అప్రమత్తం చేశాం. వాహనాల తనిఖీలు ఖానాపూర్ : మండలంలోని తర్లపాడ్ గ్రామంలో బాసర-మంచిర్యాల 222 ప్రధాన రహదారిపై ఆదివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోకి మావోయిస్టులు చొరబడ్డారనే అనుమానంతో పోలీసులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. మండల కేంద్రంతోపాటు మండలంలోని వేర్వేరు చోట్ల పలు సందర్భాల్లో ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానం ఉన్న వారి వివరాలు సేకరించారు. జిల్లా ఉన్నతాధికారులతోపాటు సీఐ ఎల్.జీవన్‌రెడ్డి ఆదేశాల మేరకు వాహనాలు తనిఖీ చేస్తున్నట్లు ఎస్సై సునిల్ తెలిపారు. -
‘విండో’ చైర్మన్‌పై అవిశ్వాసం ?
కడెం : మండలంలో రాజకీయం మళ్లీ వేడెక్కుతోంది. కడెం సహకార సంఘం చైర్మన్‌పై అవి శ్వాసం ప్రతిపాదించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. సహకార సంఘ కార్యవర్గం 2013 ఫిబ్రవరి 4న ఎన్నికైం ది. 13 మంది డెరైక్టర్లు ఉండగా.. వీరిలో ఒకరు చైర్మన్‌గా, మరొకరు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. 2/3వ వంతు మెజార్టీ అవసరం కావడంతో అప్పట్లో టీడీపీకి చెందిన చుంచు భూమన్నకు ఏడుగురు డెరైక్టర్లు మద్దతు ఇచ్చి చైర్మన్‌గా ఎన్నుకున్నారు. దీంతో ఆయన ఏకగ్రీవంగా ఎ న్నికయ్యారు. భూమన్న ఎన్నికై ఏడాది గడిచిపోతోంది. అప్పట్లో చైర్మన్ పదవిని ఆశించి విఫలమైన వారు మళ్లీ ఇప్పుడు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో డీఎల్సీవో, డీసీవోలకు నోటీసు అందజేయనున్నట్లు సమాచారం. అప్పట్లో టీడీపీలో ఉన్న భూమన్న ప్రస్తుతం ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఏ పార్టీలోనూ చేరలే దు. అధికార టీఆర్ఎస్ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారని ప్రచారంలో ఉంది. మరోవైపు చై ర్మన్ పదవిని దక్కించుకోవాలని టీఆర్ఎస్ నా యకులు యోచిస్తున్నారు. ఈ క్రమంలో భూమ న్న టీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారని సమాచారం. అవిశ్వాసం ప్రతిపాదిస్తే సునాయాసంగా నెగ్గేందుకు తన డెరైక్టర్లతో స న్నిహితంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే శిబిరం నిర్వహించేందుకు సిద్ధమవుతున్న ట్లు సమాచారం. గురువారం విండో కార్యాల యంలో జరిగిన కార్యవర్గ సమావేశంలోనూ ఈ విషయం ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. కానీ కొందరు డెరైక్టర్లు, చైర్మన్ ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. తనకు పూర్తి మద్దతు ఉంద ని భూమన్న తెలిపారు. కార్యాలయ సీఈవో వ జ్రవేలును సంప్రదించగా.. అవిశ్వాసం సమాచారం అనధికారికంగా తెలిసిందన్నారు. -
‘కడెం’ వెలవెల
కడెం : వర్షాకాలం వచ్చింది.. సగం కాలం గడిచింది.. కార్తెలూ వస్తున్నాయి.. అయిపోతున్నాయి. కానీ కాలం కావడం లేదు. వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. కడెం ఆయకట్టు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగితా ప్రాంతాల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఇదే సమయానికి కడెం ప్రాజెక్టు ఆయకట్టు అంతా పచ్చదనంతో కళకళలాడింది. పచ్చని పొలాలతోఎటు చూసినా భూములున్నీ సాగులో ఉన్నాయి. ఈసారి వర్షాభావ పరిస్థితులతో ఎటు చూసినా భూములు బీడువారి కనిపిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద కడెం, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాలు ఉన్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్లో కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు కింద 85 వేల ఎకరాలు సాగు అవుతోంది. ప్రాజెక్టు కింద 87 వరకు చెరువులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్నాయి. గత ఏడాది ప్రాజెక్టులో ఇదే సమయానికి 700 అడుగుల నీటిమట్టం ఉంది. చాలాసార్లు వదర గేట్లు ఎత్తి నీటిని వృథాగా గోదావరినదిలోకి వదిలారు. ప్రస్తుతం నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. సోమవారం సాయంత్రం వరకు ప్రాజెక్టు నీటిమట్టం 680 అడుగులుగా ఉంది. కనిష్ట నీటిమట్టం 675 అడుగులు. జలాశయంలో కేవలం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది మండలంలోని ఆయకట్టు కింద ఖరీఫ్‌లో 17,654 ఎకరాలు సాగయ్యాయి. పత్తి, వరి, మొక్కజొన్న, పసుపు తదితర పంటలు సాగు చేస్తుంటారు. ఈసారి వ్యవసాయ పనులు ఇంకా ముందుకు సాగడం లేదు. వర్షాలు కురుస్తాయనే ఆశతో ఆయకట్టు రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు సిద్ధం చేసుకుని ఉన్నారు. ఆకాశం మేఘావృతం అవుతోంది.. కానీ వర్షాలు పడడం లేదు. మబ్బులు తేలిపోతూ రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో వర్షాల కోసం రైతులు కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. మరి కొందరు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ఆయకట్టు కింద ఇదే దుస్థితి 2008లోనూ ఎదురైంది. వర్షాకాలం చివరలో కష్టంగా ప్రాజెక్టు నిండింది. -
చేపల కేంద్రంపై నిర్లక్ష్యం
కడెం : జిల్లాలోనే పెద్దది కడెంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం. ఏటా రూ.మూడు కోట్ల వరకు చేప పిల్లల ఉత్పత్తి జరిగేది. కేంద్రంలో అధికార్లు,సిబ్బంది కూడా పూర్తిస్థాయి లో ఉండేవారు. దశాబ్దకాలంగా కేంద్రం నిరాదరణకు గురవుతోంది. అధికార్లు,సిబ్బంది మూడేళ్లక్రితం ఇతర ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కేంద్రం అధికారి పోస్టును లక్షెట్టిపేటలోని అధికారికి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. కేంద్రంలో దాదాపుగా 55 వరకు నీటి తొట్టిలు, చేప పిల్లలను ఉత్పత్తి చేసే హాచరీలు, జనరేటర్ గది, అధికారి కార్యాలయం,సిబ్బంది గదులు,మ్యూజియం హాలు,సమావేశం గది ఉన్నాయి. వీటన్నింటినీ గాలికి వదిలేశారు. తల్లి చేపలుండే నాలుగు పెద్ద కుంటలున్నాయి. వాటికీ రక్షణ లేదు. కేంద్రంలో ఇద్దరు మత్య్సకేంద్రాభివృద్ధి అధికార్లు, క్షేత్ర సహాయకులు ఐదుగురు, ఇతర సిబ్బంది ముగ్గురు స్థాని కంగా ఉండడంలేదు. కేంద్రానికి ఇన్చార్జి ఎఫ్‌డీవోలు ఉండడంతో అభివృద్ధి కుంటుపడింది. మత్స్య కార్మికుల ఉపాధికోసం గతంలో రాజమండ్రి వంటి సుదూర ప్రాంతాల నుం చి చేప పిల్లలను తెచ్చి ఇక్కడ పెంచి కడెం రిజర్వాయర్‌లో వేసేవారు. మూడేళ్లుగా తెప్పించడం లేదు. -
నీటి నిల్వకు ‘కడెం’ సన్నద్ధం
కడెం, న్యూస్‌లైన్ : వర్షాకాలంలో నీటి నిల్వ కోసం కడెం ప్రాజెక్టు సిద్ధమవుతోంది. నీటి నిల్వతోపాటు జలాశయంలోకి అదనంగా నీళ్లొస్తే.. బయటకు పంపేందుకు వినియోగించే వరద గేట్లను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. నాలుగైదు రోజుల నుంచి ప్రాజెక్టు యంత్రాలు, గేట్ల సామర్థ్య పరిశీలనలో అధికారులు నిమగ్నమ య్యారు. వారం క్రితం ఎస్సారెస్పీ ఎస్ఈ శ్యాంసుందర్, ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్లు కలిసి కడెం ప్రాజెక్టు గేట్లను పరిశీలించిన విషయం తెలిసిందే. గేట్లను పెకైత్తి వాటి పనితీరు, సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యుత్ సరఫరా లేని సమయంలో వినియోగించుకునేందుకు ఏర్పాటు చేసిన 100 కేవీ సామర్థ్యం గల జనరేటర్ పనితీరును తెలుసుకున్నారు. ఈ ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల ద్వారా ఖరీఫ్ సీజన్లో సుమారు 80 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ క్రమంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగైదు రోజులుగా ప్రాజెక్టు వరదగేట్ల గదుల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించే పనుల్లో సిబ్బంది నిమగ్నమయ్యారు. వరద గేట్లను పైకి లేపేందుకు ఉపయోగించే గేరు బాక్సులు, యంత్రాలు, వైర్ రోప్‌లు తదితర యంత్రాలకు గ్రీసింగు పూస్తున్నారు. దీని తర్వాత కాడీ కంపౌండ్, ఆయిలింగు వంటి పనులు చేపడతారు. ప్రాజెక్ట్‌కు ఉన్న 18 గేట్లకు ఈ పనులు చేస్తున్నారు. ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్, జేఈ నరేందర్ పనులను పర్యవేక్షిస్తున్నారు. వరదగేట్లపై ఉన్న వీధిదీపాల మరమ్మతు కొనసాగుతోంది. రాత్రివేళ వరదగేట్లు ఎత్తే సమయంలో అవసరమైన వెలుతురు కోసం భారీ సామర్థ్యం గల లైట్లను ఏర్పాటు చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, కనిష్ట స్థాయి నీటిమట్టం 675 అడుగులు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 7 టీఎంసీలు. బుధవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 678 అడుగుల నీటిమట్టం ఉంది. -
ధాన్యం.. వర్షార్పణం
కడెం, న్యూస్‌లైన్ : అన్నదాతపై ప్రకృతి కన్నెర్రజేసింది. కష్టపడి పండిం చిన పంట వర్షార్పణం అయింది.దీంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. కడెం మండలంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి అంబారీపేట, పాండ్వాపూరు, లింగాపూరు తదితర గ్రామాల్లో చాలా వరకు రైతుల ధాన్యం దెబ్బతింది. పాండ్వాపూరు గ్రామంలోని ఐకేపీ వారి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం అంతా తడిసిపోయింది. కేంద్రంలో అమ్ముకునేందుకు తెచ్చిన రైతు ల ధాన్యం కూడా తడిసింది. కేంద్రంలో దాదాపు 2వేల క్విం టాళ్ల ధాన్యం తూకం చేసేందుకు తెచ్చిన ధాన్యం నీటిపాలైం ది. ఇక్కడ వీరబత్తుల రమేశ్, గోపు సత్తన్న, ఎండీ లాయక్, ముద్దసాని లక్ష్మణ్, బండి శంకర్, బండి అంజన్న, పిన్నం అంజన్నలతో పాటు పలువురు రైతుల ధాన్యం తడిసింది. అంబారీపేట గ్రామంలోని పీఏసీఎస్ వారి కేంద్రంలోని ధాన్యం కూడా వర్షానికి తడిసింది. కేంద్రంలో గల 1755 సంచులు ఇంకా వేముల రాయలింగు, అల్లంల భూమన్న, అల్లంల గంగన్న, పసుల రాజన్న, ఎంకోసి రాజన్న, బైరి భూమన్న, బూస మల్లేశ్, కొప్పుల నర్సయ్యలతో పాటు చాలా మంది ధాన్యం తడిసింది. కేంద్రంలో రైతులు తమ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. గ్రామం చివరన గల వేముల శేఖర్‌కు చెందిన పంట భూమిలో అతని వరి కుప్పపై పిడుగు పడడంతో ఆ కుప్ప మొత్తం దగ్ధమైంది. -
అటవీ ఉత్పత్తులతో ఉపాధి
కడెం, న్యూస్‌లైన్ : అడవి ఉత్పత్తులు గిరిజనులకు ఉపాధినిస్తున్నాయి. ఇప్పపువ్వు, తప్సి బంక, ఇప్ప పరక, తేనె తదితర ఫలాలను గిరిజనులు సేకరించి ఉపాధి పొందుతున్నారు. కాని వాటికి సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. ప్రతీ సంవత్సరం ఏప్రిల్‌లో ఇప్పపువ్వు విరబూస్తుంది. పల్లె ప్రజలు, కూలీలు ఇప్పపువ్వును పెద్ద ఎత్తున సేకరిస్తారు. ప్రస్తుతం గత కొద్దిరోజులుగా మండలంలోని బూత్కూరు, గొడిసెర్యాల, కుర్రగూడెం, దోస్తునగర్, ధర్మాజీపేట, సింగాపూరు, కల్లెడ, మద్దిపడగ, గోండుగూడెం, డ్యాంగూడెం గ్రామాల ప్రజలు తెల్లవారంగనే గంపలతో అడవులకు వెళ్లి ఇప్పపువ్వు సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన పువ్వును కడెంలోని జీసీసీ(గిరిజన సహకార సంస్థ)లో విక్రయిస్తారు. ఇక్కడ ప్రతీ ఆదివారం అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. ఇప్పపువ్వుకు కిలోధర రు.10 ఉంది. ఇలా ఒక్కొక్కరు 10 నుంచి 25 కిలోల దాకా పువ్వు తెచ్చి ఇక్కడ విక్రయిస్తారు. వెంటనే వారికి డబ్బులు చేతికందుతాయి. ఇలా గిరిజనులు ఇప్పపువ్వుతో ఉపాధి పొందుతున్నారు. గిట్టుబాటు ధర కరువు గిరిజనులు, గిరిజనేతరులు సేకరించిన అటవీ ఉత్పత్తులను ప్రభుత్వం నామమాత్రపు ధరకు మాత్రమే కొనుగోలు చేస్తోంది. తెలతెల్లవారంగా అడవికి వెళ్లి పువ్వు సేకరిస్తే సరైన ధర రావడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కిలో పువ్వుకు కేవలం రు.10 మాత్రమే చెల్లిస్తున్నారు. ప్రస్తుతం అన్నింటికీ ధరలు పెరిగాయి. ఇలాంటప్పుడు తామేలా బతికేదని గిరిజనులు వాపోతున్నారు. పెద్ద ఎత్తున కొనుగోళ్లు కడెంలోని జీసీసీ ద్వారా ఏటా ఏప్రిల్ మొదటి వారం నుంచి అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం జీసీసీకి ఎక్కువగా ఇప్పపువ్వు మాత్రమే వస్తుండటంతో దీన్నే కొంటున్నారు. ఇప్పటి వరకు 31 క్వింటాళ్లు కొనుగోలు చేశారు. గతే డాది 440 క్వింటాళ్లు కొనుగోలు చేయగా ఈ సారి 500 క్వింటాళ్లు కొనుగోలు లక్ష్యం ఉంది. ఆ దిశగా జీసీసీ సిబ్బంది కృషి చేస్తున్నారు. -
కడెం ఆయకట్టు రైతులు సాగుకు సిద్ధం
కడెం, న్యూస్‌లైన్ : కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శుభవార్త. ఈయేడు కడెం ఆయకట్టుకు రబీ సీజన్లో నీరివ్వనున్నారు. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జలసాధన సమితి ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు ఫలించా యి. ఈ రబీకి నీరిస్తారా లేదా అని రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారు. ఒక దశలో ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని నీరివ్వమని అధికారులు ప్రకటించినా ఎట్టకేలకు సందిగ్ధత తొలగింది. మూడేళ్లుగా ప్రాజెక్టులో నీరు సక్రమంగా లేకపోవడంతో రబీ పంటకు నీరు ఇవ్వలేదు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో నీటి విడుదలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ‘శివం’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికారులు కడెం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై వివరించారు. దీంతో ప్రభుత్వం నీటి విడుదలకు పచ్చజెండా ఊపింది. నీటిని వచ్చే నెల 20వ తేదీ నుంచి ఇవ్వాలని సూచన ప్రాయంగా అంగీకరించారు. దీంతో కడెం, దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల్లోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏరువాక సాగడానికి సన్నద్ధం అవుతున్నారు. వరి, ఆరుతడి పంటలు వేయడానికి రెడీ అవుతున్నారు.