![Nirmal Eating Contaminated Food Makes The Whole Village Sick - Sakshi](/styles/webp/s3/article_images/2021/11/10/chicken.jpg.webp?itok=WXI71eio)
ప్రతీకాత్మక చిత్రం
కడెం: కలుషిత ఆహారం తిని ఊరంతా అస్వస్థతకు గురైన సంఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం రానిగూడలో చోటు చేసుకుంది. గ్రామ పంచాయతీ పరిధిలోని మొర్రిపేట్ గ్రామంలో దండారీ వేడుకల్లో భాగంగా ఈనెల 6న ఊరంతా కలిసి ఒక చోట సహపంక్తి భోజనాలు చేశారు. మరుసటి రోజు నుంచి ఒక్కొక్కరుగా వాంతులు, విరేచనలతో ఊరంతా అస్వస్థతకు గురయ్యారు.
మంగళవారం వైద్య సిబ్బంది గ్రామానికి చేరుకుని 61 మందికి చికిత్స అందజేశారు. ప్రస్తుతం అందరూ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. ఆహారంలో తీసుకున్న చికెన్‌తోనే అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment