కడెం, న్యూస్‌లైన్ : కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శుభవార్త. ఈయేడు కడెం ఆయకట్టుకు రబీ సీజన్‌లో నీరివ్వనున్నారు. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జలసాధన సమితి ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు ఫలించా యి. ఈ రబీకి నీరిస్తారా లేదా అని రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారు. ఒక దశలో ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని నీరివ్వమని అధికారులు ప్రకటించినా ఎట్టకేలకు సందిగ్ధత తొలగింది. మూడేళ్లుగా ప్రాజెక్టులో నీరు సక్రమంగా లేకపోవడంతో రబీ పంటకు నీరు ఇవ్వలేదు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో నీటి విడుదలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ‘శివం’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికారులు కడెం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై వివరించారు. దీంతో ప్రభుత్వం నీటి విడుదలకు పచ్చజెండా ఊపింది. నీటిని వచ్చే నెల 20వ తేదీ నుంచి ఇవ్వాలని సూచన ప్రాయంగా అంగీకరించారు. దీంతో కడెం, దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల్లోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏరువాక సాగడానికి సన్నద్ధం అవుతున్నారు. వరి, ఆరుతడి పంటలు వేయడానికి రెడీ అవుతున్నారు.
కడెం ఆయకట్టు రైతులు సాగుకు సిద్ధం
Published Thu, Nov 28 2013 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 1:02 AM
Advertisement