kadem project
-
శ్రీరాంసాగర్ 41 గేట్లు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్/నెట్వర్క్: పరీవాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో కడెం వాగుతోపాటు ఎగువన గోదావరికి వరద పోటెత్తింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు 1,95,767 క్యూసెక్కుల వరద రాగా, నీటినిల్వ 71.85 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టు నిండుకుండలా మారడం, ఎగువ నుంచి ఉధృతంగా వరద వస్తుండడంతో ఉదయం 10:30 గంటలకు 8 గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కుల నీటిని దిగువన గోదావరిలోకి విడుదల చేశారు. ఎగువ నుంచి వరద పెరుగుతున్న కొద్దీ క్రమంగా మరిన్ని గేట్లు ఎత్తుతూ వెళ్లారు. రాత్రి పదిగంటలకు 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండగా, ప్రాజెక్టులో 72.9 టీఎంసీలను నిల్వ చేస్తూ మొత్తం 41 గేట్లు ఎత్తి 2.65లక్షల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ⇒ కడెం ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలు కాగా, 49,763 క్యూసెక్కుల వరద వస్తుండడంతో 5.41 టీఎంసీల నిల్వలు కొనసాగిస్తూ 18 గేట్లు ఎత్తి కిందికి విడుదల చేస్తున్నారు. ⇒ శ్రీరాంసాగర్ నుంచి విడుదలవుతున్న వరదకు కడెం జలాలు తోడుకావడంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద ఉధృతి 2,92,815 క్యూసెక్కులు పెరిగింది. ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా, 15.02 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 2,64,787 క్యూసెక్కు ల నీటిని గేట్ల ద్వారా కిందికి విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బరాజ్‌లకు వరద ఉధృతి భారీగా పెరిగింది. సుందిళ్ల బరాజ్‌కు 3.68లక్షలు, అన్నారం బరాజ్‌కు 6.61లక్షలు, మేడిగడ్డ బరాజ్‌కు 6.79లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచి్చంది వచ్చినట్టు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సమ్మక్కసాగర్‌కు 4.45 లక్షలు, సీతమ్మసాగర్కు 3.13లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు విడుదల చేస్తున్నారు. ⇒ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వరం వద్ద గోదావరి వరద మొదటి ప్రమాద హెచ్చరిక చేరువకు వెళుతోంది. సోమవారం రాత్రి 12. గంటల సమాయానికి 12.010 మీటర్లకు చేరింది. తెల్లవారే సరికి మరింత వరద పెరగనుంది. కాగా, మొదటి ప్రమాద హెచ్చరిక 12.210 మీటర్లు, డేంజర్ లెవల్ 13.460 మీటర్లు వరకు నమోదు అయితే లోతట్టు గ్రామాలు జలమయమవుతాయి.1986లో కాళేశ్వరం వద్ద 15.75 మీటర్ల ఎత్తు, 2022 జూలై 14న 16.72మీటర్ల ఎత్తులో నీటిమట్టం నమోదైంది. సింగూరు, నిజాంసాగర్‌కు జలకళ గోదావరి ఉపనది మంజీరలోనూ వరద ఉధృతి మరింతగా పెరగడంతో సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులు నిండుకుండలా మారుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ సామర్థ్యం 29.917 టీఎంలు కాగా, ప్రస్తుతం 23,942 క్యూసెక్కుల వరద వస్తుండగా, నిల్వలు19.22 టీఎంసీలకు చేరాయి. ⇒ నిజాంసాగర్ నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా 48,800 క్యూసెక్కుల వరద వస్తుండడంతో నిల్వలు 9.16 టీఎంసీలకు చేరాయి. వరద ఇలానే కొనసాగితే మరో ఐదు రోజుల్లో ఈ రెండు ప్రాజెక్టులు పూర్తిగా నిండే అవకాశముంది. మిడ్‌మానేరుకు గ్రావిటీ ద్వారా ఎస్సారెస్పీ జలాలు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో ఎల్లంపల్లి జలాశయం నుంచి నీటిని మిడ్‌మానేరులోకి నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా ఎత్తి పోయాల్సిన అవసరం లేకుండా పోయింది. రెండు పంప్‌హౌస్‌లలో పంపింగ్ బంద్ చేసి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి ఫ్లడ్ ఫ్లో కెనాల్ ద్వారా 7000 క్యూసెక్కుల నీటిని గ్రావిటీతో మిడ్‌మానేరు జలాశయా నికి తరలిస్తున్నారు. అక్కడి నుంచి అనంతగిరి జలాశయానికి, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌లకు నీళ్లను ఐదు దశల్లో పంపింగ్ చేస్తున్నారు. ఎగువన శాంతించిన కృష్ణమ్మ... దిగువన ఉగ్రరూపం ⇒ జూరాల 40 గేట్లు, శ్రీశైలం ప్రాజెక్టు 10 గేట్లు, సాగర్ 26 గేట్ల ద్వారా నీటి విడుదల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువన కృష్ణమ్మ శాంతించింది. మూడు రోజులుగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలు తోడు కావడంతో దిగువన కృష్ణానది ఉగ్రరూపాన్ని కొనసాగిస్తోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బరాజ్‌కు వస్తున్న 11,27,30 క్యూసెక్కుల వరదను వచ్చింది వచ్చినట్టు గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన మహారాష్ట్రలోని ఆల్మట్టి జలాశయానికి 70 వేలు, నారాయణపూర్ జలాశయానికి 30 వేల క్యూసెక్కులకు వరద తగ్గిపోయింది.దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్టుకు సైతం 3.21లక్షల క్యూసెక్కులకు వరద తగ్గిపోగా, 40 గేట్లు ఎత్తి 3.2లక్షల క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.89 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని 10 గేట్లు ఎత్తి కిందకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 5.40 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చింది వచి్చనట్టు 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 5.48 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, 5.43 లక్షల క్యూసెక్కులను దిగువన ఉన్న ప్రకాశం బరాజ్‌కు విడుదల చేస్తున్నారు. దీంతో మంగళవారం నాటికి ప్రకాశం బరాజ్‌కు వరద ఉధృతి తగ్గే అవకాశముంది. అలుగుపారుతున్న డిండి ప్రాజెక్టు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు దుందుభి వాగు పరవళ్లు తొక్కుతుండడంతో నల్లగొండ జిల్లాలోని డిండి ప్రాజెక్టు నిండి సోమవారం అలుగు పోసింది. వర్షాధారంపైనే ఆధారపడిన ఈ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి 50 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి (36 అడుగులు) చేరుకుంది. హైదరాబాద్ – శ్రీశైలం రహదారి మధ్యలో ఉన్న డిండి ప్రాజెక్టు అలుగుపారుతున్న అందాలను తిలకించేందుకు స్థానికులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు తరలి వస్తున్నారు. మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేత మూసీనదికి వరద పోటెత్తడంతో నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. 4.46 టీఎంసీ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యంగల మూసీ రిజర్వాయర్‌లో 3.58 టీఎంసీల నీరు నిల్వ ఉంది. -
మళ్లీ కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, హైదరాబాద్/దోమలపెంట/నాగార్జునసాగర్/కడెం: బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ మళ్లీ పోటెత్తింది. ఎగువన ఆల్మట్టి నుంచి ప్రకాశం బరాజ్ వరకు పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకి భీకర వరద పోటెత్తింది. శనివారం సాయంత్రం 6 గంటలకు వరద ప్రవాహం 4,10,581 క్యూసెక్కులకు పెరగడంతో 212.38 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ 8 గేట్లను 12 అడుగులు, మరో 2 గేట్లను 10 అడుగుల మేరకు పైకెత్తి 3,12,390 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు.కుడిగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 30,227 క్యూసెక్కులు, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రం ద్వారా 37,882 క్యూసెక్కులు కలిపి మొత్తం 68,109 క్యూసెక్కులను విద్యుదుత్పత్తి ద్వారా విడుదల చేస్తున్నారు. ఇంకా పోతిరెడ్డిపాడు ద్వారా 25,000, హంద్రీ నీవా ద్వారా 1,688, కల్వకుర్తి లిఫ్టు ద్వారా 2,400 క్యూసెక్కులు కలిపి కాల్వకు మొత్తం 29,088 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం అవుట్‌ఫ్లోలు 4,09,587 క్యూసెక్కులకు పెరిగాయి. సాగర్ 26 గేట్లు ఎత్తివేత..దిగువన ఉన్న నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 3,87,653 క్యూసె క్కుల వరద వచ్చి చేరుతుండగా, 308.76 టీఎంసీల నిల్వలను కొనసాగిస్తూ వచ్చిన వరదను వచ్చినట్టు వదిలేస్తున్నారు. సాగ ర్ 20 గేట్లను 10 అడుగుల మేర, మరో 6 గేట్లను 5 అడుగు లమేర పైకెత్తి 3,43,810 క్యూసె క్కులను కిందికి విడుదల చేస్తున్నారు. ప్రధాన విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా మరో 29,313 క్యూసెక్కుల ను కిందికి విడుదల చేస్తున్నారు. కుడికాల్వకు 5,496, ఎడమ కాల్వకు 6,634, ఏఎంఆర్పీకి 1,800, ఎల్ఎల్సీకి 600 క్యూసెక్కులను విడుదల చేస్తుండటంతో సాగర్ నుంచి మొత్తం అవుట్‌ఫ్లోలు 3,87,653 క్యూసెక్కు లకు పెరిగాయి.దీంతో దిగువన ఉన్న పులిచింతల ప్రాజెక్టుకు 2,70,349 క్యూసెక్కుల వరద వస్తుండగా, 3,10,395 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. పులిచింతలకు దిగువన నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా కురుస్తున్న వర్షాలు ఈ ప్రవాహానికి తోడు కావడంతో ప్రకాశం బరాజ్‌కి వరద ఉధృతి పెరిగింది. బరాజ్‌కి 3,31,829 క్యూసెక్కులు వస్తుండగా, గేట్లు ఎత్తి 3,18,160 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు 184 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. ఆల్మట్టికి భారీ వరద..పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఎగువన కృష్ణా ప్రధాన పాయ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆల్మట్టిలోకి వస్తున్న 1.75 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది వచ్చినట్టే కిందికి విడుదల చేస్తున్నారు. దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.85 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.78 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. దాంతో జూరాల ప్రాజెక్టులోకి వరద భారీగా పెరిగింది. జూరాల ప్రాజెక్టులోకి 3.30 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 3.27 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో నిలకడగా వరద కొనసాగుతోంది. తుంగభద్ర డ్యామ్‌లోకి 34,983 క్యూసెక్కులు చేరు తుండటంతో నీటి నిల్వ 94.55 టీఎంసీలకు చేరుకుంది.అప్రమత్తంగా ఉండాలి: మంత్రి ఉత్తమ్భారీ నుంచి అతిభారీ వర్షాలు కురు స్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో క్షేత్ర స్థాయిలోని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా ఎవరూ హెడ్‌క్వార్టర్స్‌ను విడిచి వెళ్లరాదని, సెలవులు తీసుకోరాదని సూచించారు. జలాశయాలు, చెరువుల వద్ద వరద పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.కడెం ప్రాజెక్టు ఏడు గేట్లు ఎత్తివేతఎగువన కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు శనివారం 22,696 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఏడు వరద గేట్లు ఎత్తి 57,821 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. -
వరద గోదారి!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, నెట్వర్క్: మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి పోటెత్తుతోంది. ప్రాజెక్టుల్లోకి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శనివారం నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను, ఆసిఫాబాద్ జిల్లా కుమురంభీం (ఆడ) ప్రాజెక్టు మూడు గేట్లను ఎత్తారు. పలు బరాజ్‌ల గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భద్రాచలం వద్ద శనివారం రాత్రి 35 అడుగులు దాటి ప్రవహిస్తోంది. తాలిపేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడం, వర్షాలు ఇంకా కురిసే అవకాశం ఉండటంతో గోదావరికి వరద పెరగొచ్చని కేంద్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.మేడిగడ్డకు వచ్చిన నీళ్లు వచ్చినట్లే..కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కి 3,73,500 క్యూసెక్కుల వరద వస్తుండగా, గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచడంతో వచ్చిన నీళ్లు వచ్చినట్టు కిందికి వెళ్లిపోతున్నాయి. బరాజ్ ఇప్పటికే దెబ్బతిని ఉండడంతో నీటిపారుదల శాఖ ఇంజనీర్లు నిరంతరం వరద పరిస్థితిని, బరాజ్ భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం బరాజ్‌లో నీటి మట్టం 100 మీటర్లకు గాను 93 మీటర్లు ఉంది.మహదేవపూర్ మండలం అన్నారం (సరస్వతీ) బరాజ్‌లో నీటి మట్టం 119 మీటర్లకు గాను 106.96 మీటర్లు ఉంది. బరాజ్‌లోని 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం (సమ్మక్క) బరాజ్‌లోకి 4,82,800 క్యూసెక్కులు చేరుతుండగా 59 గేట్లు ఎత్తి అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. వాటి దిగువన ఉన్న దుమ్ముగూడెం (సీతమ్మసాగర్) బరాజ్‌లోకి 5,93,167 క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు.దాంతో భద్రాచలం వద్ద వరద ఉధృతి గంట గంటకూ పెరుగుతోంది. శనివారం రాత్రి వరద తీవ్రత 6,02,985 క్యూసెక్కులు చేరగా, నీటి మట్టం 35.5 అడుగులకు పెరిగిపోయింది. అధికార యంత్రాంగం అప్రమత్తమై కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసింది. నీటిమట్టం 43 అడుగులకు పెరిగితే తొలి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. ఇక పోలవరం ప్రాజెక్టులోకి 4.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా 48 గేట్ల ద్వారా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. 6 రోజుల్లో 73 టీఎంసీలు సముద్రం పాలుమేడిగడ్డ బరాజ్ కుంగిపోవడంతో గేట్లన్నీ పైకి ఎత్తి ఉంచారు. దీంతో వచ్చిన వరద వచ్చినట్టు దిగువనకు వెళ్లిపోతోంది. గత ఆరు రోజుల్లో ఏకంగా 73 టీఎంసీల వరద మేడిగడ్డ బరాజ్ గుండా ప్రవహించి సముద్రంలో కలిసిందని రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాలిపేరుకు పోటెత్తిన వరదభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తాలిపేరుకు వరద పోటెత్తుతోంది. దీంతో 25 గేట్లు ఎత్తి 1,45,078 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇలావుండగా నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మూడు వరద గేట్లను శనివారం ఎత్తారు. ప్రాజెక్టు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులోకి 15,338 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 (7.603 టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 690.400 (5.345టీఎంసీ) అడుగులు ఉంది. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా అడ గ్రామంలోని కుమురంభీం (అడ) ప్రాజెక్టుకు వరద నీరు చేరడంతో మూడు గేట్లు ఎత్తారు. ప్రాజెకుŠట్ సామర్థ్యం 5.9 టీఎంసీలు కాగా 1,941 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఎస్సారెస్పీలోకి కొనసాగుతున్న వరదశ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి కూడా వరద కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి 18,245 క్యూసెక్కుల వరద నిలకడగా కొనసాగుతుండటంతో ప్రాజెక్టు నీటి మట్టం క్రమంగా òపెరిగింది. అయితే సాయంత్రానికి 15,100 క్యూసెక్కులకు తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 (80 టీఎంసీలు) అడుగులు కాగా శనివారం రాత్రికి 1,067.00 (18.5 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. మరోవైపు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతోంది. శనివారం రాత్రి 9గంటల వరకు నీటిమట్టం 140.91 మీటర్లుగా, నీటి నిల్వ 5.96 టీఎంసీలుగా ఉంది. -
అవార్డుల.. హరిత
కడెం: కడెం ప్రాజెక్ట్ తీరాన.. పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అందమైనా విడిది గదులతో పర్యాటకుల మనసు దోచుతుంది కడెం హరిత రిసార్ట్స్. పర్యాటకులకు చక్కని అతిథ్యాన్ని అందిస్తూ.. అవార్డులను సొంతం చేసుకుంటుంది. ఇటీవలే హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకల్లో భాగంగా పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, చైర్మన్ గెల్లు శ్రీనివాస్, ఎండి మనోహర్‌రావు చేతుల మీదుగా రిసార్ట్స్ మేనేజర్ నునవత్ తిరుపతి ఉత్తమ రిసార్ట్స్ అవార్డ్‌ను అందుకున్నారు. ఆహ్లాదకరంగా హరిత రిసార్ట్... కడెం ప్రాజెక్ట్ పరిసరాలను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో ప్రాజెక్ట్ తీరాన 2015లో పర్యాటకశాఖ 12 విడిది గదులు, రెస్టారెంట్, మీటింగ్‌హాల్‌తో హరిత ఏకో టూరిజం రిసార్ట్స్‌ను ఏర్పాటు చేసింది. ఏడేళ్ల కాలంలో పర్యాటకుల ఉత్తమ సేవలందిస్తూ మూడు సార్లు బెస్ట్ రిసార్ట్స్ అవార్డ్‌ను అందుకుంది. ప్రముఖులతో పాటు, వివిధ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి విడిది చేస్తుంటారు. సెలవు దినాల్లో, వీకెండ్లో పర్యాటకులతో సందడిగా ఉంటుంది. పర్యాటకులు సేదతీరేందుకు విడది గదులతో పాటుగా, పిల్లలకు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది. పర్యాటకులతో పాటుగా ప్రీ వెడ్డింగ్, బర్త్‌డే షూట్లతో పాటుగా, ఫిల్మ్ షూట్లకు హరిత రిసార్ట్ ఫేమస్. అయితే ఇందులో తొమ్మిది మంది విధులు నిర్వహిస్తుండగా ఏడాదికి సుమారుగా రూ.4 నుంచి 5 లక్షల ఆదాయం సమకూరుతుంది. గదుల బుకింగ్ పర్యాటక శాఖ వెబ్సైట్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు. డబ్ల్యూ డబ్ల్యూ డబ్ల్యూ.టీఎస్‌టీడీసీ.కామ్ ద్వారా గదులను బుక్ చేసుకోవచ్చు. వీకెండ్లో (శుక్ర, శని, ఆదివారల్లో) 1848, మిగాత రోజు ల్లో 1680(జీఎస్టీతో కలిపి). మరిన్ని వివరాలకు 9133053007 నంబర్లో సంప్రదించవచ్చు. సిబ్బంది సహకారంతో రాష్ట్రంలోనే బెస్ట్ రిసార్ట్‌గా కడెం హరితకు అవార్డ్ దక్కడం వెనుక సిబ్బంది సహకారం ఎంతో ఉంది. మూడుసార్లు హరిత రిసార్ట్స్‌కు అవార్డ్ దక్కడం అనందంగా ఉంది. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. శుభాకార్యలు, వింధులు జరుపుకునేందుకు అవకాశం ఉంది. పర్యాటకుల టూరిజం శాఖ తరఫున సౌకర్యాలు అందిస్తున్నాం. – నునవత్ తిరుపతి, హరిత రిసార్ట్స్ మేనేజర్, కడెం -
‘కడెం’ నీరు వృథా
కడెం: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ 15వ నంబరు గేటు కౌంటర్ వెయిట్(గేటుకు అనుసంధానంగా ఉండే భారీ దిమ్మె) మంగళవారం తెల్లవారుజామున విరిగిపోవడంతో నీరు వృథాగా పోతోంది. ప్రాజెక్ట్‌లోకి 13,428 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో ఇరిగేషన్ అధికారులు నీటి విడుదలకు గేటును ఎత్తే క్రమంలో కౌంటర్ వెయిట్ విరిగిపోయింది. వరద గేటు మూసివేసే అవకాశం లేనందున నీరంతా వృథాగా పోతోంది. వెంటనే మరమ్మతులు చేయలేకపోయినా, ఇన్‌ఫ్లో లేకపోయినా ప్రాజెక్ట్ మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం పొంచి ఉంది. అయితే ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం ఉండడంతోపాటు ఇన్‌ఫ్లో వస్తున్నందున ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఎస్ఈ సుశీల్‌కుమార్, ఈఈ విఠల్ తెలిపారు. బుధవారం మెకానికల్ సిబ్బంది వచ్చి మరమ్మతులు చేపడుతారని, ఆయకట్టు రైతులు ఆందోళన చెందవద్దని భరోసానిచ్చారు. ప్రస్తుత నీటిమట్టం 699అడుగులు ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 700(7.603టీఎంసీ) అడుగులు కాగా, ప్రస్తుతం 699.625(7.504టీఎంసీ) అడుగులు ఉందని, 3,461 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని, వరద గేటు ద్వారా 3,185 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోందని వెల్లడించారు. ఇదిలా ఉండగా ప్రాజెక్ట్ మొత్తం 18 వరద గేట్లకు గాను గతంలో 2వ నంబర్ గేట్‌కు కౌంటర్ వెయిట్ విరిగినా ఇప్పటికీ వేయలేదు. ఇప్పుడు తాజాగా 15వ నంబర్ గేట్ కౌంటర్ వెయిట్ విరగడంతో మొత్తంగా ఆ రెండింటినీ ఆపరేట్ చేసే పరిస్థితి లేదు. -
భారీ వర్షాలతో తెలంగాణలోని ప్రాజెక్టులకు జలకళ
-
పలు జిల్లాల్లో భారీ వర్షాలు
సాక్షి, నెట్వర్క్: రాజధాని హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షాలు కురిశాయి. కొన్నిచోట్ల వాగులు పొంగి ప్రవహించాయి. ఇటీవలి కాలంలో ఈ స్థాయి వర్షాలు పడటం ఇదే మొదటిసారి. కాగా వేడి వాతావరణంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు తాజా వర్షాలు కాస్త ఉపశమనాన్ని ఇచ్చాయి. దాదాపు నెల రోజుల తర్వాత పడిన వర్షాలతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ వర్షాలు ఆరుతడి పంటలకు మేలు చేస్తాయని చెబుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం సాయంత్రం నుంచి ఆదివారం సాయంత్రం వరకు మోస్తరు వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లాలో 38.4 మిల్లీ మీటర్లు, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 18.9 మిల్లీమీటర్లు, ఆదిలాబాద్ జిల్లాలో 10.1 మిల్లీమీటర్లు చొప్పున సగటు వర్షపాతం నమోదయ్యింది. అధికారులు కుమురంభీం ప్రాజెక్టు ఐదో గేటు ఎత్తారు. కడెం ప్రాజెక్టుకు 41,245 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో మూడు వరద గేట్లను ఎత్తి 36,079 క్యూస్కెకుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఒక్కసారిగా వరద పెరిగి.. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం తరోడా–బి గ్రామ సమీపంలోని 353 బి జాతీయ రహదారిపై ఆరు నెలల క్రితం బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో బ్రిడ్జి కింద వాగుపై కొద్ది రోజులుగా తాత్కాలిక వంతెన పనులు కొనసాగుతున్నాయి. ఆదివారం కూలీలు పనులు చేస్తుండగా సాయంత్రం ఐదు గంటల సమయంలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది. దీంతో ఆదిలాబాద్‌కు చెందిన ఎనుగందుల రాజలింగు, ధోని సంతోష్ వాగు మధ్యలో చిక్కుకుపోయారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు, రెవెన్యూ సిబ్బంది గజ ఈతగాళ్ల సాయంతో వారిని బయటకు తెచ్చారు. పిడుగుపాటుకు గురై యువకుడి మృతి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా భారీ వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌లో అత్యధికంగా 112 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కాగా సిరిసిల్లలో క్రికెట్ ఆడేందుకు వెళ్లిన పడిగె సతీశ్ (32) పిడుగుపాటుకు గురై మరణించాడు. మరోవైపు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామ శివారులోని చెరువు మధ్యలో ఉన్న విద్యుత్ స్తంభం డిస్క్ ఫిల్టర్ పిడుగు పడటంతో దెబ్బతింది. తోకలపల్లి గ్రామానికి శనివారం రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఆదివారం ఉదయం లైన్ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఏఎల్ఎంలు వెంకటేశ్, పరమేశ్‌లు చెరువులో ఈత కొట్టుకుంటూ వెళ్లి డిస్క్ ఫిల్టర్‌ను మార్చి విద్యుత్‌ను పునరుద్ధరించారు. -
కడెం పరిస్థితిపై సీడబ్ల్యూసీ అధ్యయనం
కడెం: భారీగా వరదలు రావడం, గేట్లు సరిగా పనిచేయక ఆందోళన నెలకొనడం నేపథ్యంలో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టును కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), డ్యామ్ భద్రత బృందం శుక్రవారం పరిశీలించింది. మొత్తం 24 మంది అధికారులు, సిబ్బంది డ్యామ్ ప్రస్తుత పరిస్థితిని అధ్యయనం చేశారు. వరద గేట్ల పనితీరు, ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో సామర్థ్యం, ఎడమ కాల్వ వద్ద కోతకు గురైన రోడ్డు వంటి వాటిని పరిశీలించారు. ప్రాజెక్టు అధికారులు గతేడాది ప్రాజెక్టుకు వచ్చిన భారీ వరదలతో దెబ్బతిన్న గేట్లు, ఆఫ్రాన్ (రక్షణ గోడ), స్పిల్‌వేలను సీడబ్ల్యూసీ బృందానికి చూపించారు. ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్, డ్యాం భద్రత నిపుణుడు ఏబీ పాండ్య మాట్లాడారు. కడెం ప్రాజెక్టు భారీగా వస్తున్న ఇన్‌ఫ్లోతో ప్రమాదం నెలకొని ఉందని, డ్యాం భద్రతకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తామని తెలిపారు. ప్రాజెక్టును పరిశీలించిన బృందంలో హైడ్రాలజిస్ట్ చీఫ్ ఇంజనీర్ రామరాజు, డ్యాం భద్రత నిపుణుడు టి.దేశాయి, జియాలజిస్ట్ ఎం.రాజు, హైడ్రో మెకానికల్ నిపుణులు కె.సత్యనారయణ, యోగీందర్కుమార్శర్మ, సీఈ శ్రీనివాస్, ఎస్ఈ సుశీల్‌కుమార్, ఈఈ విఠల్, డీఈ భోజదాసు, ప్రాజెక్ట్ సిబ్బంది ఉన్నారు. శాంతించిన కడెం.. గేట్లకు మరమ్మతులు భారీ వరదతో ప్రాజెక్టును కోతకు గురిచేస్తుందా అన్న ఆందోళన రేపిన కడెం వాగు శాంతించింది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు శుక్రవారం ఉదయం 1,46,675 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. సాయంత్రానికి బాగా తగ్గిపోయింది. రాత్రికి 13,550 క్యూసెక్కు ల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఏడు గేట్ల ద్వారా 20,998 క్యూస్కెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 700 అడుగులుకాగా.. ప్రస్తుతం 685.150 అడుగులుగా ఉంది. రెండు రోజుల కింద తెరుచుకోకుండా మొరాయించిన 3వ నంబర్ గేటుకు సిబ్బంది మరమ్మతులు చేస్తున్నారు. కాగా భారీ వరదతో ఎడమ కాల్వపై మైసమ్మ గుడివద్ద రోడ్డు కోతకు గురైంది. అక్కడ మరమ్మతులు పూర్తిచేసేదాకా సాగునీటిని విడుదల చేసే అవకాశం లేదు. దీనితో వెంటనే మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. -
రైతుల పంటపొలాల్ని ముంచేసిన కడెం వరద
-
మళ్లీ ఉప్పొంగిన కడెం
కడెం: సరిగ్గా ఏడాది..మళ్లీ అదే ఉధృతి. మహారాష్ట్రతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలో కడెం వాగు ఉప్పొంగుతోంది. కడెం మండల కేంద్రంలోని ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద ప్రవహించింది. వరదను కిందకు అదేస్థాయిలో పంపించే సమయంలో తొలుత నాలుగు గేట్లు మొరాయించడంతో గురువారం సాయంత్రం వరకు వాటి పైనుంచి ప్రవాహం కొనసాగింది. అర్ధరాత్రి నుంచి పెరుగుతూ..: బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు 10,256 క్యూసెక్కులతో వరద మొదలైంది. అప్పటికి ప్రాజెక్టులో 691.600 అడుగుల వద్ద 5.598 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇన్‌ఫ్లో భారీగా వస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రాజెక్టు అధికారులు నాలుగు వరద గేట్లు ఎత్తి 24,750 క్యూసెక్కులు వదిలారు. గంట గంటకు ఇన్‌ఫ్లో పెరుగుతుండటంతో 14 గేట్లను ఎత్తారు. జర్మన్ క్రస్ట్ గేట్లయిన 6, 12, 2, 3 నంబర్ గేట్లు మొరాయించాయి. గురువారం వేకువజామున 5 గంటలకు 3,87,583 క్యూసెక్కుల భారీ ఇన్‌ఫ్లో రావడంతో ప్రాజెక్టు డేంజర్ జోన్లో పడింది. అప్రమత్తమైన అధికారులు 14 గేట్లను పూర్తి స్థాయిలో ఎత్తివేసి, 2,18,922 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. నాలుగు గేట్లు మొరాయించిన నేపథ్యంలో అవుట్‌ఫ్లో కంటే ఇన్‌ఫ్లో ఎక్కువై ప్రాజెక్టు గేట్ల పైనుంచి వరద ప్రవాహం కొనసాగింది. ఈ క్రమంలో ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉందని, కట్ట తెగుతుందనే ఆందోళన వ్యక్తమయ్యింది. దీంతో అధికారులు డేంజర్ జోన్ ప్రకటించి, సైరన్ మోతతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. గేట్లతోనే సమస్య..: కడెం ప్రాజెక్టుకు మొత్తం 18 గేట్లు ఉన్నాయి. ఇవి పూర్తిస్థాయిలో ఎత్తితే ప్రమాదకర పరిస్థితులు తలెత్తేవి కాదన్న వాదన ఉంది. గత ఏడాది వరదకు 2, 3 గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. ఇప్పటివరకు రెండో గేటుకు వెయిట్ బిగించారు. అయినా గురువారం ఈ గేటు పనిచేయలేదు. మూడో గేట్ పనులు ఇంకా పూర్తికాలేదు. ఇక 6, 12 నంబర్ గేట్లు సైతం ఎంతకు లేవకుండా మొరాయించాయి. మాన్యువల్‌గా హ్యాండిల్ తిప్పుతూ గేట్లను ఎత్తేందుకు ప్రయత్నించినా వరదలో కొట్టుకువచ్చిన చెట్లు, చెత్తాచెదారం తట్టుకోవడంతో సాధ్యం కాలేదు. చివరకు మధ్యాహ్నం పొక్లెయినర్ సహాయంతో వరద గేట్ల వెనుక భాగంలో ఇరుక్కున్న చెట్లను తొలగించడంతో 6, 12 గేట్లను మాన్యువల్‌గా ఎత్తారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్, నిర్మల్ కలెక్టర్ వరుణ్‌రెడ్డి, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, జిల్లా అధికారులు మొత్తం కడెంలోనే మకాం వేశారు. డ్యాంగూడ, కన్నాపూర్, కొండుకూర్ గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గత ఏడాది ఇదే సీజన్లో కడెంకు ఆరు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడం, ప్రాజెక్టు మునిగిపోవడం గుర్తు చేసుకుంటున్న స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. -
తెరుచుకోని గేట్లు.. ప్రమాదంలో కడెం ప్రాజెక్టు
-
కట్టలు తెంచుకున్న కడెం ప్రాజెక్ట్ .. (ఫొటోలు)
-
Kadem Project Flood Water Video: డేంజర్ జోన్లో కడెం ప్రాజెక్ట్
-
మున్నేరు వరదల్లో చిక్కుకున్న ఏడుగురు సురక్షితం
Updates.. ►భద్రాచలం వద్ద తగ్గుముఖం పడుతున్న గోదావరి. ► గురువారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద కొనసాగుతున్న రెండవ ప్రమాద హెచ్చరిక ►ప్రస్తుతం 48 అడుగుల మేర ప్రవహిస్తున్న గోదావరి. ►దిగువకు 11లక్షల 50వేల క్యుసెక్కుల వరద నీరు గోదావరిలోకి విడుదల. ►ఏ సమయంలోనైన గోదావరి మళ్ళీ పెరిగే అవకాశం ఉందంటున్న అధికారులు. ప్రమాదకరంగా మున్నేరు నది ఖమ్మం నగరంలో మున్నేరు నది 30 అడుగుల ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలు, కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇల్లోకి వరదనీరు చేరింది. మున్నేరు వద్దకు సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. NDRFతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పద్మావతి నగర్ వరద లో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. మీడియాతో మంత్రి పువ్వాడ ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురు కుటుంబ సభ్యులు కాపాడినట్లు మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతోనే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇక్కడికి పిలిపించామని.. వరదల్లో చిక్కుకున్న ఏ ఒక్కరి ప్రాణం పోకూడదనే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు. ఖమ్మం మున్నేరు వరద ఉధృతితో లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను ఖాళీ చేపించి పునరావస కేంద్రలను ఏర్పాటు చేశామని చెప్పారు. పునరావాస కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించామని.. ఇంకా అనేక ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్నారని ఫోన్లు వస్తున్నాయన్నారు. వరదల్లో చిక్కుకున్న అందరిని కాపాడే బాధ్యత తమదేన్నారు. పెద్దపల్లి జిల్లా. ►పార్వతి బ్యారేజ్‌లోకి కొనసాగుతున్న భారీ వరద నీరు. ►మొత్తం 74 గేట్లు కాగా అందులో 70 గేట్లు ఎత్తిన అధికారులు. ►ఇన్ ఫ్లో 5,90,256 క్యూసెక్కుల ►ఔట్ ప్లో 5,90,256 క్యూసెక్కుల ►బ్యారేజ్ పూర్తి సామర్థ్యం 8.83 టీఎంసీలు. ►ప్రస్తుత నీటి సామర్థ్యం : నిల్ రాజన్న సిరిసిల్ల జిల్లా ►గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరులోకి వరద నీరు ►ఇన్ ఫ్లో 29781 క్యూసెక్కులు. ►ఔట్ ప్లో 29781 క్యూసెక్కులు. ►ప్రాజెక్ట్ సామర్థ్యం 2.20 టీఎంసీలు. ►ప్రస్తుత నీటి సామర్థ్యం 2.20 టీఎంసీలు. తెలంగాణలో అసాధారణ వర్షపాతం ►తెలంగాణలో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, అసాధారణమైన వర్షపాతం 24 సెంటీమీటర్లకు పైగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. మోరంచపల్లి గ్రామస్తులు సేఫ్ ►వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. హెలికాఫ్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గ్రామంలోని ప్రజలందరినీ సేఫ్‌జోన్‌కు చేర్చారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకుండా మోరంచపల్లి గ్రామస్తులు అంతా సురక్షితంగా బయటపడటంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ►భారీ వర్షాల నేపథ్యంలో నీటిపారుదల శాఖ అప్రతమతంగా ఉందని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ తెలిపారు. కడెం ప్రాజెక్టులో రెండు గేట్లు మొరాయించాయని, వాటికి వెంటనే మరమ్మతులు చేసి పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. డ్యామ్ ఎత్తు 700 అడుగులు అయితే.. 702 అడుగుల మేర నీటి ప్రవాహం ఉందని తెలిపారు. నీట మునిగిన వరంగల్ ►భారీ వర్షాలతో నీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్ ► పూర్తిగా తెగిపోయిన వరంగల్-హన్మకొండ కనెక్టివిటీ ►శివనగర్ బస్తీల్లో పారుతున్న వరద నీరు ► వరంగల్‌లో పూర్తిగా నీట మునిగిన హంటర్ రోడ్డు, నయూం నగర్, శివనగర్ ► బిల్డింగ్‌లపై తలదాచుకున్న వరద బాధితులు ►హంటర్ రోడ్డుకు చేరుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది ►సాయం చేయాలని బాధితుల ఆర్తనాదాలు ►వరద నీటిలో కొట్టుకుపోయిన వాహనాలు పట్టాలపై వరద.. పెద్దపల్లిలో నిలిచిన గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ ►పెద్దపల్లి రైల్వే స్టేషన్లో మూడు గంటలకుపైగా గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నిలిచిపోయింది. పట్టాలపై భారీగా వరదనీరు చేరడంతో సికింద్రాబాద్‌కు రావాల్సిన రైలును పెద్దపల్లిలో అధికారులు నిలిపేశారు. కాజీపేట వడ్డేపల్లి చెరువు ఉప్పొంగి ప్రవహించడంతో పెద్దపల్లి రైల్వే స్టేషన్లో గోరఖ్ పూర్ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపవేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ప్రయాణికులు వాహనాల్లో తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖమ్మం జిల్లా ► భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు వరదల్లో ఏడుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నగరంలోని పద్మావతి నగర్లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన మందిరంలో చిక్కుకున్న ఏడుగురుని కాపాడేందుకు రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. అయితే వరద ఉదృతితో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. సహాయక చర్యలను మున్సిపల్ కమిషనర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ ప్రియాంక పర్యవేక్షిస్తున్నారు. ►మున్నేరు వరదలో చిక్కుకున్న ఏడుగురి కోసం రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందం రంగంలోకి దిగింది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌కు ఫోన్ చేశారు. మున్నేరు వరద ఉధృతి , సహాయ చర్యల పై మంత్రిని అడిగి తెలుసుకున్నారు. ఏడుగురిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని హుటాహుటిన ఖమ్మం తరలించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ►సీఎం కేసీఆర్ ఆదేశాలతో మంత్రి పువ్వాడ భద్రాచలం నుంచి ఖమ్మం బయలుదేరారు. విశాఖ నుంచి భద్రాచలం వస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని మార్గమధ్యంలో ఖమ్మం మళ్లించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రత్యేక డ్రోన్ పంపించి ఇంట్లో చిక్కుకున్న ఏడుగురి పరిస్థితిని ఖమ్మం అధికారులు ఆరాతీస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మున్నేరు వాగుప్రమాద స్థాయిలో పొంగి ప్రవహిస్తోంది. .ఖమ్మం కాల్వ ఒడ్డు వద్ద గరిష్టంగా 28 అడుగులు ప్రవహిస్తున్న మున్నేరు వరద ఉధృతిని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ పరిశీలించారు. వరద ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటన ►రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు నేపథ్యంలో హైదరాబాద్ తాజా పరిస్థితిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నుంచి పురపాలకశాఖ అధికారులు, అడిషనల్ కలెక్టర్లతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అదే విధంగా హైదరాబాద్ నగరంలోనూ పలు ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. హుస్సేన్ సాగర్ వద్ద వరద ఉధృతిని మంత్రి పరిశీలించారు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే ప్రాథమిక ప్రాధాన్యతగా పని చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ సమీక్ష.. ► తెలంగాణలో ఎడతెరిపిలేని భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష చేపట్టారు. ఎప్పటికప్పుడు తెలంగాణలో పరిస్థితిని కేసీఆర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో గ్రామాల్లో సహాయక చర్యల కోసం హెలికాప్టర్‌ను తరలించాలని కేసీఆర్ ఆదేశించారు. వరద బాధిత జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియామించాలని ఆదేశాలు జారీ చేశారు. ► తెలంగాణ చరిత్రలోనే భారీ వర్షం కురిసింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేటలో 649.8మిమీ వర్షం కురిసింది. అంతకుముందు.. ములుగు జిల్లా వాజేడులో 2013లో జూలై 19న 24 గంటల్లో 517.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసినట్టు అధికారులు తెలిపారు. ► ఇక, గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని 35 ప్రాంతాల్లో 20 సెంటీమీటర్లపైన వర్షపాతం నమోదైంది. 200 కేంద్రాల్లో 10 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసింది. ► హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మరో 24 గంటలు వర్షం ముప్పు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ► ఇక, భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంపీ హై అలర్ట్. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. ► కాగా, జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 11 సెం.మీల వర్షపాతం నమోదైంది. ► బంగాళాఖాతంలో వాయుగుండం బలపడటంతో తెలుగు రాష్ట్రాల్లో మరో 48 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ► తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్, 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. ఇక, హైదరాబాద్‌లో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతోంది. ► భద్రాచలం వద్ద 51 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకుంది. దీంతో, రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. MLA Rekha Naik & other officials run away from #Kadem project after they realize that it is dangerous today morning. While project capacity is 700 ft, it is filled to 699.5 ft. Officials tried to open all 18 gates but 4 didn’t work! #NirmalDist #TelanganaRains #StaySafe pic.twitter.com/27AQxZJ6FH — Revathi (@revathitweets) July 27, 2023 ► హైదరాబాద్‌లో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ప్రధాన జంక్షన్లలో రోడ్లు జలమయమయ్యాయి. మరో మూడు గంటలపాటు నగరంలో వర్షం కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతే బయటకు రావాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్: 040-2111 1111, ఆర్డీఎఫ్ నెంబర్: 90001 13667. #Kadem Project@balaji25_t pic.twitter.com/hfvoSl8uGc — Shravan Pintoo (@ShravanPintoo) July 27, 2023 #Telangana A woman was washed away while crossing a water stream in Kothagudem. And the BRS govt has the audacity to implement this Telangana model across the country... And also KCR wanted to become the PM. pic.twitter.com/Uj3k2KSGJu — Gems Of KCR (@GemsOfKCR) July 27, 2023 ► భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు. భద్రాచలం నుంచి దిగువకు 12.65 లక్షల క్యూసెక్కుల వరద వదులుతున్నారు. భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. నీటమునిగిన అన్నదాన సత్రం, విస్తా కాంప్లెక్స్. చర్లలోని లోతట్టు ప్రాంత ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు. భద్రాచలం పట్టణంలోని 3 కాలనీల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలింపు. బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న ఏజెన్సీ ప్రాంత ప్రజలు. అత్యవసరమైతే ఫొటోలు, లోకేషన్లు పంపాలని జిల్లా ఎస్పీ సూచన. పోలీసు రెస్య్కూ కంట్రోల్ వాట్సాప్ నెంబర్ 87126 82128. In total 80 tourists who were stuck at #Muthyaladara waterfalls, #Mulugu, #Telangana were rescued by the DDRF & NDRF teams deployed. All are safe & sound. One minor boy was bitten by a scorpion, he was shifted to hospital for treatment. #Rains https://t.co/0ey898lYpK pic.twitter.com/RmhWS4v4UE — Sowmith Yakkati (@sowmith7) July 27, 2023 Due to heavy rains across Telangana State, citizens are advised to come out only for extremely important work at night times. Present situation is currently under control. #TelanganaPolice, from home guard officers to the DG level, are well-prepared, and every hour from each PS… pic.twitter.com/CWcLiypmB7 — DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 26, 2023 ► మూసీ ప్రాజెక్ట్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మూసీ ఇన్‌ఫ్లో 19వేలు, ఔట్‌ఫ్లో 17వేలు క్యూసెక్కులు. Water falling from 700 feet at #Mutyamdhara #waterfalls in Veerabhadravaram located in #Mulugu district’s #Vebkatapuram mandal.@telanganatouris @tstdcofficial @VSrinivasGoud @newstapTweets pic.twitter.com/TsGrw0mvbF — Saye Sekhar Angara (@sayesekhar) July 26, 2023 ► నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్ట్ డేంజర్ జోన్లో ఉంది. సామర్ధ్యానికి మించి వరద ప్రవహిస్తోంది. కడెం ప్రాజెక్ట్ సామర్థ్యం 3.50లక్షల క్యూసెక్కులే. కాగా, 6.04 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. కడెం ప్రాజెక్ట్ గేట్లపై నుంచి వరద ప్రవహిస్తోంది. 14 గేట్ల ద్వారా దిగువకు 2.18 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. రంగంలోకి దిగిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నిర్మల్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. Despite heavy #rains, a funeral procession had no option but to risk crossing a seasonal stream to perform the final rites of an elderly person. The incident happened couple of days ago in Cherial of #Siddipet district, #Telangana. pic.twitter.com/rD1utRTTvT — Krishnamurthy (@krishna0302) July 26, 2023 👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. కుండపోత కారణంగా మోరంచ వాగు ప్రవాహం ప్రమాదకర స్థాయి దాటి మోరంచపల్లి గ్రామాన్ని ముంచెత్తింది. దీంతో కొందరు గ్రామస్తులు వర్షంలోనే బిల్డింగ్‌లపైకి ఎక్కి రక్షించాలంటూ ఆర్తనాదాలు చేస్తున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. ► వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు. మోరంచపల్లి గ్రామంలో 300 మంది.. వెయ్యి జనాభా దాకా ఉంది. వానాకాలం వచ్చినప్పుడల్లా మోరంచవాగు ప్రవాహంతో గ్రామం చుట్టూ నీరు చేరుతుంటుంది. అయితే ఈ దఫా గ్రామాన్ని వాగు పూర్తిగా ముంచెత్తడం గమనార్హం. సాక్షి, హైదరాబాద్: తెలంగాణవ్యాప్తంగా వర్షాలు భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు, వాతావరణ శాఖ రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ ప్రకటించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని.. దానికి అనుబంధంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. వర్షాలకు తోడు పలుచోట్ల గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని ప్రకటించింది. -
కడెం.. జనం గుండెల్లో సైరన్!
కడెం: నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు దిగువన గ్రామాల ప్రజల గుండెల్లో సైరన్ మోగుతోంది. ఓ వైపు వరుస వానలతో వరద పోటెత్తుతుండటం, మరోవైపు ప్రాజెక్టు గేట్లు మరమ్మతులకు గురై నీటిని సరిగా విడుదల చేయలేని పరిస్థితి తలెత్తడంపై ఆందోళన మరింతగా పెరుగుతోంది. శనివారం కూడా ప్రాజెక్టుకు గణనీయ స్థాయిలో ప్రవాహం కొనసాగింది. ఇలాంటిది అకస్మాత్తుగా భారీ వరద వస్తే ప్రాజెక్టు తట్టుకుంటుందా? అన్న భయం కనిపిస్తోంది. మరమ్మతులు చేపట్టేదెప్పుడు? గతేడాది జూలైలో వచ్చిన వరదతో కడెం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి ఏర్పడింది. 2, 3 నంబర్ గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. రక్షణ గోడలు, స్పిల్ వే, వరద గేటు మోటార్లు దెబ్బతిన్నాయి. కానీ పూర్తిస్థాయి మరమ్మతులకు సరిపడా నిధులు కేటాయించకపోవడం, అదీ సకాలంలో విడుదల చేయకపోవడంతో ఇటీవలి వరకు మరమ్మతుల పనులు ప్రారంభమే కాలేదు. ప్రాజెక్టు దెబ్బతిన్న పదినెలల తర్వాత అంటే మే నెలలో రూ.1.44 కోట్లను మరమ్మతుల కోసం మంజూరు చేశారు. రెండుసార్లు టెండర్లు నిర్వహించారు. టెండర్ పూర్తయ్యే సమయానికి వానాకాలం మొదలవడంతో పనులు చేపట్టలేదని అధికారులు తెలిపారు. అరకొర నిర్వహణతో.. ఏటా ప్రాజెక్టు గ్రీసింగ్, జనరేటర్ నిర్వహణ, చిన్నస్థాయి మరమ్మతుల కోసం ప్రభుత్వం ఏటా రూ.8 లక్షలు కేటాయిస్తుంది. అవి పైపై పనులకే సరిపోతాయి. అయితే 2018లో ప్రాజెక్టుకు కేటాయించిన 5 కోట్ల నిధుల్లో మిగిలిన మొత్తంతో అధికారులు గేట్ల కౌంటర్ వెయిట్లను తయారు చేయిస్తున్నారు. ఇక వానాకాలం మొదలయ్యే ముందే వరద గేట్లు సరిగా పనిచేస్తున్నాయా, లేదా అని ట్రయల్ రన్ చేసి పరిశీలించాలి. కానీ అధికారులు ఏదో ఒక గేటును పరిశీలించి తూతూమంత్రంగా ప్రక్రియ ముగిస్తున్నారు. అసలు సమయానికి లోపాలు బయటపడితే.. సాంకేతిక కారణాలు అని చెప్తున్నారన్న విమర్శలున్నాయి. ఇక కనీసం ప్రాజెక్టు గేట్ల వద్ద తేనెతుట్టెలనూ తొలగించలేదు. శుక్రవారం వరద పోటెత్తినప్పుడు గేట్లు ఎత్తడానికి వెళ్లిన సిబ్బందిపై తేనెటీగలు దాడి చేయడంతో గాయపడ్డారు. తేనెతుట్టెల కారణంగా 18వ నంబర్ గేటును ఎత్తడం లేదని సమాచారం. ఏడాదిగా నిర్లక్ష్యమే.. కడెం ప్రాజెక్టు మరమ్మతులను ఏడాదైనా పూర్తి చేయించకపోవడం దురదృష్టకరం. స్థానిక ఎమ్మెల్యే, నీటి పారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో ప్రాజెక్టు అధ్వానంగా మారింది. ఇప్పటికైనా వేగంగా మరమ్మతులు చేయించాలి. – అలెగ్జాండర్, ఎంపీపీ, కడెం ప్రాజెక్టుకు ముప్పు లేదు ప్రాజెక్టులో టెక్నికల్ ప్రాబ్లంతో కొన్ని గేట్లు మొరాయించాయి. మెకానికల్ సిబ్బందితో గేట్ల మోటార్లకు మరమ్మతు చేయిస్తున్నాం. ప్రాజెక్టుకు ఎలాంటి ముప్పు లేదు. ప్రజలు ఆందోళన చెందవద్దు. – శ్రీనివాస్, ప్రాజెక్టు సీఈ -
భారీ వర్షాలు, కడెం ప్రాజెక్టుకు అంతకంతకూ వరద.. ఆందోళనలో ప్రజలు
సాక్షి, నిర్మల్: గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్ట్ లు ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో నిండుతున్నాయి. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండగా అటు శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు కూడా ఇన్ ఫ్లో పెరుగుతోంది. ఆందోళనలో ప్రజలు.. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేని పరిస్థితి తలెత్తింది. నీటిని దిగువకు వదులుదామంటే ప్రాజెక్టు నాలుగు గేట్లు మొరాయిస్తున్నాయి. క్షణం క్షణం నీటిమట్టం పెరుగుతోంది. పద్దెనిమిది గేట్లలో నాలుగు గేట్లు తెరుచుకోకపోవడంతో ఎప్పుడేమవుతుందోననే ఆందోళన నెలకొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఇన్ ప్లోగా ప్రాజెక్టులోకి 93,200 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో 14 గేట్ల ద్వారా దిగువకు 1,55,770 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. (దంచికొడుతున్న వానలు.. హుస్సేన్ సాగర్ నీటి మట్టం అలర్ట్!) ఆందోళన వద్దు, రిపేర్ చేస్తున్నాం: కలెక్టర్ నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ను కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించారు. భారీగా వస్తున్న వరద నీటిపై అదికారులను అప్రమత్తం చేశారు. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో వరదనీరు వచ్చి చేరుతుందన్నారు. అదేవిధంగా ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టామన్నారు. గేట్లను ఎత్తి వరద నీటిపి బయటకు పంపుతున్నామన్నారు. కడెం పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 7.6టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వను 5.6 టిఎంసీల వరకు ఉంచుతున్నామన్నారు. పద్దెనిమిది గేట్లలలో పద్నాలుగు గేట్లు ఎత్తామన్నారు. మిగతా నాలుగు గేట్లను రిపేర్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దస్తురాబాద్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశామని కలెక్టరు పేర్కొన్నారు. #Kadam#KadamProject#Kadem@balaji25_t pic.twitter.com/uGGJkLuc3C — Almas Khan (@almaskhaninc) July 21, 2023 సీఎం ఆరా గోదావరి బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు ఏమేరా ఇన్ ఫ్లో వస్తోంది. ఎంత మేర నీటి విడుదల కొనసాగుతుందన్న దానిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. (చదవండి: వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు) -
Kadem Project: ఉన్న గేట్లు మార్చి.. కొత్త గేట్లు కట్టి..!
సాక్షి, హైదరాబాద్: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా భారీ వరదలు పోటెత్తడంతో కుదేలైన కడెం ప్రాజెక్టును ఆధునీకరించాలని నీటిపారుదల శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రాజెక్టు గరిష్ట నీటి విడుదల సామర్థ్యం 3 లక్షల క్యూసెక్కులుకాగా.. ఈ నెల 13న అర్ధరాత్రి 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అంత వరదను కిందికి వదిలేందుకు వీల్లేకపోవడంతో.. నిల్వ సామర్థ్యానికి మించి నీరు చేరి ప్రాజెక్టు తీవ్ర ఒత్తిడికి లోనైంది. ఎడమవైపు స్పిల్‌వేకు గండిపడి వరద వెళ్లేందుకు మరో మార్గం ఏర్పడటంతో ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గి ప్రమాదం తప్పింది. ప్రాజెక్టుకు 18 గేట్లు ఉండగా.. వరదల సమయంలో ఓ గేటు మొరాయించింది. మిగతా 17 గేట్లను ఎత్తగలిగారు. వరద తగ్గాక తిరిగి గేట్లను కిందికి దించడానికి ప్రాజెక్టు ఇంజనీర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరదతోపాటు కొట్టుకువచ్చిన చెట్ల కొమ్మలు, వ్యర్థాలు, బురదతో గేట్లను ఎత్తే పరికరాల గదులు నిండిపోవడం, గేట్లను ఎత్తే రోలర్లు, విద్యుత్ పరికరాలు దెబ్బతినడంతో ఇంజనీర్లు చేతులెత్తేశారు. ఇక రెండు గేట్లకు సంబంధించిన కౌంటర్ వెయిట్స్ కొట్టుకుపోవడంతో.. ఆ గేట్లను కిందికి దించే పరిస్థితి లేదు. ఒకవేళ కిందికి దించగలిగినా.. మళ్లీ పైకి ఎత్తడం సాధ్యం కాదు. ఈ సమస్యలన్నింటి నేపథ్యంలో ప్రస్తుతానికి గేట్లను దించకుండా ప్రాజెక్టును ఖాళీ కానివ్వాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. మొత్తంగా 7.6 టీఎంసీల నిల్వ సామర్థ్యం కలిగిన కడెం ప్రాజెక్టు కింద 1.74 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టును ఖాళీ చేస్తున్న నేపథ్యంలో.. ప్రత్యామ్నాయంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా ఆ ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. 5 లక్షల క్యూసెక్కులను వదలగలిగేలా.. కడెం ప్రాజెక్టును నిజాం కాలంలో 1.3 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల సామర్థ్యంతో నిర్మించారు. 1952లో 3 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వచ్చింది. దీంతో 3 లక్షల క్యూసెక్కులు విడుదల చేయగలిగేలా అప్పట్లో 8 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుత వరదలతో నీటి విడుదల సామర్థ్యాన్ని 5 లక్షల క్యూసెక్కులకుపైగా పెంచాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 18 గేట్లలో 9 జర్మన్ గేట్లు ఉన్నాయి. వాటిని తొలగించి కొత్తగా క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అదనంగా ప్రాజెక్టుకు రెండు వైపులా చెరో నాలుగు కొత్త గేట్లను ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సోమవారం ఇంజనీరింగ్ నిపుణులు కడెం ప్రాజెక్టును సందర్శించి.. ఆధునీకరణ సాధ్యాసాధ్యాలను పరిశీలించనున్నారు. ఈ పనుల పూర్తికి కనీసం ఏడాది పట్టొచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. అప్పటిలోగా ప్రాజెక్టును ఖాళీగానే ఉంచే అవకాశాలు ఉన్నాయి. డెడ్ స్టోరేజీకి కడెం నిర్మల్: ఎగువ నుంచి వరద తగ్గిపోవడం, ఉన్న నీళ్లన్నీ దిగువకు వెళ్లిపోతుండడంతో కడెం ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువైంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 700 అడుగులకుగాను.. ఇప్పుడు 678 అడుగులకు పడిపోయింది. మరో మూడు అడుగులు.. అంటే 675 అడుగులకు తగ్గితే డెడ్ స్టోరేజీకి చేరుతుంది. నీటి నిల్వ కూడా 7.603 టీఎంసీల సామర్థ్యానికిగాను శనివారం సాయంత్రానికి 3 టీఎంసీలకు తగ్గింది. భారీ వరదలకు కొట్టుకొచ్చిన దుంగలు, చెట్ల కొమ్మలతో ప్రాజెక్టు దెబ్బతిన్నదని, ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.8 కోట్లకుపైగా నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు. నీటిమట్టం పూర్తిగా తగ్గితే.. ప్రాజెక్టులో కింది వరకు నష్టం వివరాలు తెలుస్తాయని అంటున్నారు. మరోవైపు ప్రాజెక్టు మొత్తంగా ఖాళీ అవుతుండటంతో ఆయకట్టు రైతులు పంటల సాగుపై ఆందోళన చెందుతున్నారు. -
ఖాళీ అవుతున్న కడెం!
నిర్మల్: ఆరున్నర లక్షల క్యూసెక్కులతో ఏకంగా ప్రాజెక్టు పైనుంచి వరద ఉప్పొంగింది. నిండా నీటితో రిజర్వాయర్ సముద్రాన్ని తలపించింది. ఇదంతా మొన్నటి పరిస్థితి. ఇప్పుడది ఓ చెరువులా మారుతోంది. వరదకు దెబ్బతిన్న గేట్లు కిందకు దిగకపోవడంతో.. వరద జలాలతో కళకళలాడా ల్సిన నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లలో వరద రాకముందు నుంచే 12వ గేటు మొరాయించింది. భారీ వరద నేపథ్యంలో దానిని అలాగే వదిలేసి మిగతా 17 గేట్లు ఎత్తారు. 13న అర్ధరాత్రి వచ్చిన 6.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రాజెక్టు పైనుంచి పారింది. దీంతో చెట్లు, కొమ్మలు, చెత్త మొత్తం ప్రాజెక్టు పైభాగంలో గేట్లను ఎత్తే యంత్రాలు ఉండే రూమ్‌లలో, గేట్లను ఎత్తే రోలర్లలో, పైభాగంలో పూర్తిగా నిండిపోయింది. గేట్లన్నీ వాటిల్లో కూరుకుపోయాయి. మరోవైపు ఎలక్ట్రికల్ వ్యవస్థ దెబ్బతినడంతో శుక్రవారం ప్రాజెక్టు సిబ్బంది ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. ఒక్క గేటును కష్టంగా కొంత కిందకు దింపినా మిగతావి కదల్లేదు. దీంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. గేట్లన్నీ ఎత్తే ఉండటంతో ఉన్న నీళ్లన్నీ దిగువకు వెళ్లిపోతున్నాయి. పైగా ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కూడా చాలావరకు తగ్గిపో యింది. కేవలం 16,890 క్యూసెక్కులు వస్తుండగా, 17,307 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రస్తుతం నీటినిల్వ 3.5 టీఎంసీలకు పడిపోయింది. ఎగువ నుంచి వరద రాకుండా, అవుట్‌ఫ్లో ఇలాగే ఉంటే ప్రాజెక్టు కనీస మట్టానికి పడిపోనుంది. కాగా గేట్ల మరమ్మతుకు శనివారం సాంకేతిక సిబ్బంది రానున్నట్లు అధికారులు తెలిపారు. -
Kadem Project: కడెంపై ఆ 9 మంది ‘చివరి’ సెల్ఫీ..! ఉగ్ర గోదారి ఉరిమి చూస్తే!
నిర్మల్/కడెం: గోదావరి మహోగ్రరూపాన్ని కడెం ప్రాజెక్టు సిబ్బంది కళ్లారా చూశారు. క్షణం ఆలస్యమైనా వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేది. ప్రాజెక్టుపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డ్యామ్ సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. అప్పటికే 5 లక్షల క్యూసెక్కులు వస్తున్నా పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఇంతలో వరద ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఈఈ రాజశేఖర్.. కలెక్టర్ ముషరఫ్ అలీకి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. మీరందరూ వెంటనే డ్యామ్ వదిలి వెళ్లిపోవాలని కలెక్టర్ గట్టిగా ఆదేశించడంతో గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ సెల్ఫీ ఫొటో తీసుకుని వచ్చేశారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఈ సునీల్ పరిస్థితిని చూసివద్దామంటూ ఈఈ రాజశేఖర్, డీఈ భోజదాస్, గేట్ ఆపరేటర్లు చిట్టి, సంపత్‌లను వెంటబెట్టుకుని వెళ్లారు. తాము అక్కడికి వెళ్లిన కాసేపటికే వరద ఒక్కసారిగా పోటెత్తిందని, ప్రాజెక్టు పై నుంచి నీళ్లు ఉప్పొంగాయని, దీంతో వెంటనే తమ బైక్ అక్కడే వదిలేసి, ఎస్ఈ కారులో వచ్చేశామని గేట్ ఆపరేటర్లు తెలిపారు. డ్యామ్‌పై నుంచి సునామీలా వచ్చిన వరదను చూసి వణికి పోయామని చెప్పారు. -
వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు
నిర్మల్/కడెం: సముద్రం నుంచి సునామీ దూసుకువస్తోందా అన్నట్టు కడెం ప్రాజెక్టుపై వరద పోటెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 5 లక్షల క్యూసెక్కులు వస్తుంటేనే కడెం గుండె దడదడలాడింది. అధికారులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోయారు. అలాంటిది బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది. ఎత్తిన 17 గేట్లతో పాటు (ఒక గేటు పనిచేయడం లేదు) ఎడమకాలువకు పడ్డ గండి నుంచి 3.5 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుండగా అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో వచ్చిన వరద ప్రాజెక్టుపై నుంచి పొంగింది. అలా దాదాపు మూడునాలుగు గంటల పాటు కొనసాగింది. ఇక ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయమని భావించిన సిబ్బంది వదిలేసి వచ్చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అంతటి తాకిడినీ తట్టుకుని ఆనకట్ట చెక్కుచెదరకుండా నిలబడింది. రెండు గేట్ల కౌంటర్ వెయిట్ దిమ్మెలు మాత్రం కొట్టుకుపోయాయి. గేట్ల గదులు, ప్రాజెక్టు పైభాగం మొత్తం వరద తాకిడితో వచ్చిన చెట్లు, చెట్లకొమ్మలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఈ కారణంగా గేట్లను దించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ఎన్నడూ చూడని వరద ఉధృతి కడెం ప్రాజెక్టుకు తొలిసారి ఈస్థాయి ఇన్‌ఫ్లో వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదను చూడలేదని అధికారులు, స్థానికులు పేర్కొన్నారు. 1958లో ఒకసారి 5.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. (అప్పట్లో 9 గేట్లే ఉండేవి) దిగువన మొత్తం నీటమునిగింది. భారీ వరదకు డ్యామ్ ఒకవైపు కోతకు గురయ్యింది. ఆ ప్రమాదం తర్వాత మరో తొమ్మిది గేట్లను నిర్మించి, ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచారు. అయితే 1995లో 4 లక్షల క్యూసెక్కుల వరద రాగా డ్యామ్ ఎడమ కాలువ వద్దనే గండిపడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టుపై నుంచి పారింది. ఈసారి కూడా ఎడమవైపు గండిపడటం వల్లే కట్ట ఆగిందని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎడమకాలువ వద్ద గండి పడటంతో కోతకు గురైన ప్రాంతం ప్రాజెక్టు నిలిచింది..నష్టం మిగిల్చింది కడెం ప్రాజెక్టు పైభాగమంతా అటవీ ప్రాంతమే ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు అధికారులు అంచనా వేసే లోపే ఎగువన ఉన్న వాగులన్నీ పొంగి ప్రాజెక్టులోకి వరద వేగంగా వచ్చేస్తుంది. ఈవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువ జాము వరకు పోటెత్తిన వరదతో కడెం ప్రాజెక్టు చాలావరకు దెబ్బతింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాజెక్టు ఒకటి, రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. వరద గేట్లను ఎత్తి దించేందుకు ఈ దిమ్మెలు ఉపయోగపడతాయి. 2018లో కూడా రెండో నంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఇక వరద గేట్లలో మొత్తం చెత్త పేరుకుపోవడం, ఎలక్ట్రికల్ కనెక్షన్లు దెబ్బతినడంతో వాటిని సరిచేయడం ఇప్పట్లో కుదరని పని అని అంటున్నారు. ఎడమ కాలువకు గండిపడ్డ ప్రాంతంలో వందమీటర్ల మేర కాలువ కోతకు గురైంది. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువన సైడ్‌వాల్స్ మొత్తం దెబ్బతిన్నాయి. కొనసాగుతున్న అవుట్ ఫ్లో ప్రస్తుతం 17 గేట్ల ద్వారా దిగువకు అవుట్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి 9 గంటలకు మొత్తం 700 అడుగులకు గానూ 684.725 అడుగుల నీటిమట్టం, మొత్తం 7.603 టీఎంసీలకు గానూ 4.259 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,25,582 క్యూసెక్కులు ఉండగా అదేస్థాయిలో వరద దిగువకు వెళుతోంది. పెను ప్రమాదం తప్పింది: మంత్రి కడెం ప్రాజెక్టుకు పెనుప్రమాదం తప్పిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం అధికారులతో కలిసి ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు. కడెం వాగుకు పూజలు చేశారు. -
కడెం ప్రాజెక్టుకు తప్పిన ముప్పు.. భారీగా తగ్గిన వరద ప్రవాహం
సాక్షి, నిర్మల్ జిల్లా: జిల్లాలోని కడెం ప్రాజెక్ట్‌కు పెను ప్రమాదం నుంచి బయటపడింది. ప్రాజెక్టుకు వరద ప్రవాహం భారీగా తగ్గుముఖం పట్టింది. వరద నీరు తగ్గడంతో ముప్పు తప్పిందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ప్రమాదం ఏం లేదని చెబుతున్నారు. అలాగే ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టిందని, ఇంకా తగ్గితే ప్రమాదం తప్పినట్టేనని కలెక్టర్ ప్రకటించారు. అయితే వానలు పడుతూనే ఉండటం, మరింత పెరగొచ్చనే వాతావరణ శాఖ సూచనలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 2.5 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. అవుట్ ప్లో 2 .5 లక్షల క్యూసెక్కులుగా ఉంది. 17 గేట్లను ఎత్తి అధికారులు నీటిని కిందకు వదులుతున్నారు. కాగా గత కొన్ని రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు ప్రకటించారు. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడటంతో అక్కడి నుంచి వాగుల్లో భారీ వరద మొదలైంది. దానికితోడు మంగళవారం సాయంత్రం నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కురిసిన వాన నీళ్లూ కడెం వైపు పరుగులు తీస్తూ వచ్చాయి. మహారాష్ట్రలోని వాగుల సమాచారం తెలియకపోవడం, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాల స్థాయి తెలిసే పరిస్థితి లేకపోవడంతో.. అధికారులు భారీ వరదను అంచనా వేయలేకపోయారు. ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అవాక్కయ్యారు. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని జీవించారు. అయితే ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు ప్రమాదం లేదని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. -
Kadem Project: ‘కడెం’ దడ
నిర్మల్/కడెం: మంగళవారం అర్ధరాత్రి.. జోరు వాన.. పెద్ద శబ్ధంతో సైరన్ మొదలైంది. ఇదేమిటని జనం ఇళ్లలోంచి బయటికి వచ్చేప్పటికే డప్పు చాటింపు చప్పుడు.. ‘‘ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నందున కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఉన్నఫళంగా అందరూ ఇళ్లు వదిలి మన ఊరి బడి కాడికి రావాలహో..’అంటూ వినపడిన చాటింపు అంత వానలోనూ ఊరివాళ్లకు చెమటలు పట్టించింది. వెంటనే ఊరు ఊరంతా అన్నీ వదిలి బయటికి వచ్చేశారు. నిర్మల్ జిల్లా కడెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి పరిస్థితి ఇది. ఇక్కడి కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టు చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా ఒక్కసారిగా 5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద పోటెత్తింది. గేట్లన్నీ ఎత్తివేసినా.. ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు పడటంతో అక్కడి నుంచి వాగుల్లో భారీ వరద మొదలైంది. దానికితోడు మంగళవారం సాయంత్రం నుంచి నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో కురిసిన వాన నీళ్లూ కడెం వైపు పరుగులు తీస్తూ వచ్చాయి. మహారాష్ట్రలోని వాగుల సమాచారం తెలియకపోవడం, అటవీ ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాల స్థాయి తెలిసే పరిస్థితి లేకపోవడంతో.. అధికారులు భారీ వరదను అంచనా వేయలేకపోయారు. ఒక్కసారిగా ఐదు లక్షల క్యూసెక్కుల వరద రావడంతో అవాక్కయ్యారు. అప్పటికప్పుడు మొత్తం 18 గేట్లలో 17 గేట్లను ఎత్తేశారు. ఒక గేటు మొరాయించడంతో వదిలేశారు. అయితే ప్రాజెక్టు అన్ని గేట్లను ఎత్తేసినా విడుదలయ్యే నీరు మూడు లక్షల క్యూసెక్కుల లోపే కావడం.. ఇన్‌ఫ్లో మాత్రం ఐదు లక్షల క్యూసెక్కులు ఉండటం.. ఇది 1955లో కట్టిన పాత ప్రాజెక్టు కావడంతో.. అధికారులు అర్ధరాత్రి దాటాక ప్రమాద ఘంటికలు మోగించారు. ఒక్కసారిగా వచ్చిన వరదతో కడెం పరీవాహక ప్రాంతంలో పంటచేలన్నీ కొట్టుకుపోయాయి. కిలోమీటర్ల పొడవు రోడ్లు తెగిపోయాయి. అర్ధరాత్రి అప్రమత్తమై.. కడెం ప్రాజెక్టు తెగిపోయే పరిస్థితి వచ్చిందన్న విషయం తెలియగానే కలెక్టర్ ముషరఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్‌కుమార్, పలు శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం రాత్రే కలెక్టర్, ఇతర అధికారులు నిర్మల్ నుంచి బయలుదేరారు. ఖానాపూర్ మీదుగా వెళ్లే 61 నంబర్ జాతీయ రహదారి తెగిపోవడంతో నిజామాబాద్, జగిత్యాల జిల్లాల మీదుగా చుట్టూ తిరిగి కడెం చేరుకున్నారు. అప్పటికే స్థానిక అధికారులకు సమాచారమిచ్చి.. ప్రాజెక్టు దిగువన ఉన్న కడెం, దస్తురాబాద్ మండలాల్లోని 12 గ్రామాలను ఖాళీ చేయించడం మొదలు పెట్టారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి బుధవారం ఉదయమే కడెం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఎడమ కాలువకు గండి పడటంతో.. పరిమితికి మించి వచ్చిన వరదతో ప్రాజెక్టు ఎడమ కాల్వ గేట్లపై నుంచి నీళ్లు పొంగి పొర్లాయి. దీనితో బుధవారం మధ్యాహ్నం ఎడమ కాల్వ వద్ద గండిపడి.. నీళ్లు దిగువకు వెళ్లిపోతున్నాయి. అయితే ఈ గండి వల్లే ప్రాజెక్టుపై భారం తగ్గిందని అధికారులు చెప్తుండగా.. ఆ గండి పెరిగి ప్రమాదకరంగా మారొచ్చన్న ఆందోళనా వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుకు వచ్చే ఇన్‌ఫ్లో కాస్త తగ్గుముఖం పట్టిందని, ఇంకా తగ్గితే ప్రమాదం తప్పినట్టేనని కలెక్టర్ ప్రకటించారు. అయితే వానలు పడుతూనే ఉండటం, మరింత పెరగొచ్చనే వాతావరణ శాఖ సూచనలతో ఎప్పుడేం జరుగుతుందోనన్న భయం వ్యక్తమవుతోంది. -
ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్టు
-
నిర్మల్ జిల్లా: ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్టు
-
నిర్మల్ జిల్లా: వాగు మధ్య చిక్కుకుపోయిన ఒక యువకుడు
-
నిర్మల్: ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్టు
-
ఫోన్ ఉన్నా సిగ్నల్స్ లేకపోవడంతో.. రాత్రంతా వాగులోనే..
సాక్షి, నిర్మల్: వాగు మధ్య చిక్కుకుపోయిన ఒక యువకుడు ఎట్టకేలకు గ్రామస్తుల సాయంతో క్షేమంగా బయటపడ్డాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం మారుమూల అటవీ గ్రామమైన ఇస్లాంపూర్‌కు చెందిన యువకుడు కనక దాము అనే యువకుడు ఈనెల 11న మండలం ఉడుంపూర్ గ్రామానికి రేషన్ బియ్యం తీసుకొచ్చేందుకు వెళ్లాడు. తిరిగి వస్తున్నప్పుడు వాగు పొంగడంతో చిక్కుకుపోయాడు. ఫోన్ ఉన్నా సిగ్నల్స్ లేకపోవడంతో రాత్రంతా బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపాడు. మంగళవారం ఉదయం సమీపంలోని చెట్టు ఎక్కి గ్రామస్తులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న సర్పంచ్ కనక పద్మ భర్త జైతు, ఉప సర్పంచ్ వామన్, గ్రామస్తులతో కలిసి వాగు వద్దకు వెళ్లారు. తాడు సాయంతో యువకుడిని ఒడ్డుకు క్షేమంగా తీసుకొచ్చారు. -
64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు
సాక్షి, నిర్మల్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు రికార్డుస్థాయిలో వరద వస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో గతంలో ఎన్నడూ లేనివిధంగా 64 ఏళ్ల రికార్డును బద్దలు చేస్తూ వరదనీరు వచ్చి చేరుతోంది. మంగళవారం రాత్రి నుంచి ప్రాజెక్టుకు వరద ఉధృతి భారీగా కొనసాగుతుంది. వరద నీరు తీవ్రంగా పోటెత్తుతుండటంతో ప్రాజెక్ట్‌లో నీటిమట్టం ప్రమాద స్థాయిలో ఉందని అధికారులు ప్రకటించారు. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 7.603 టీఎంసీలు. ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో నీటిమట్టానికి చేరుకొని 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో ప్రాజెక్టు 18 గేట్లు ఎత్తిన అందులో ఒక్కటి లేవక పోయేసరికి మొత్తం 17 గేట్లు ఎత్తి అధికారులు రెండు లక్షల 50వేల క్యూసెక్కుల నీటిని దిగకు వదిలారు. అయినా అవుట్ ఫ్లో కంటే ఇన్ ఫ్లో రెండు లక్షల క్యూసెక్కులు ఎక్కువ ఉండడంతో ప్రాజెక్టు కట్ట పైనుంచి నీరు ప్రవహిస్తుంది. వరద ఇంకా పెరిగితే ప్రమాదం పొంచిఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అదనంగా మూడు లక్షల నీరు ప్రాజెక్టు పైనుండి వారుతుండడంతో జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ, ఎస్పీ ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే రేఖా నాయక్, అదనపు కలెక్టర్ హేమంత్ ప్రాజెక్టు వద్ద ప్రాంతాన్నిపరిశీలించారు. స్థానిక అధికారులు అప్రమత్తమై కడెం మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు ముంపు గ్రామాలను ఎత్తైన ప్రాంతాలకు తరలించారు. ఇప్పటి వరకు 12 గ్రామాలకు చెందిన 3 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. చదవండి: హైదరాబాద్ పరిధిలో 68% అధిక వర్షపాతం.. వరద నీరు ఇంకే దారేదీ? ‘గడ్డెన్నవాగు’కు భారీగా ఇన్‌ఫ్లో భైంసాటౌన్: ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు భైంసాలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. సోమవారం మధ్యాహ్నం ఇన్‌ఫ్లో తగ్గడంతో గేట్లు మూసివేయగా, రాత్రి నుంచి మళ్లీ ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో అర్ధరాత్రి గేట్లు ఎత్తారు. ఉదయం రెండు, ఆ తరువాత మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు 32 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా, 25,200 క్యూసెక్కుల నీటిని వదిలిపెడుతున్నారు. ‘సదర్మాట్’ పరవళ్లు.. ఖానాపూర్: ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం గోదావరి అత్యంత ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎస్సారెస్పీలో 26 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదలడంతో గోదావరికి ఉగ్రరూపం దాల్చింది. మండలంలోని మేడంపల్లి గ్రామంలోని సదర్మామాట్ వద్ద పూర్తిస్థాయి నీటిమట్టం 7.6 ఫీట్లు కాగా, మగంళవారం 9.11 ఫీట్లలో నీటిమట్టం కొనసాగుతోంది. 35,399 క్యూసెక్కుల వరద గోదావరిలోకి వెళ్తుందని జేఈఈ ఉదయ్ తెలిపారు. -
కడెం ప్రాజెక్టుకు రికార్డు స్థాయిలో వరద
-
గోదారి గంగ.. ఉరకలెత్తంగ
సాక్షి, హైదరాబాద్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మేడిగడ్డ వద్ద 4.50 లక్షల క్యూసెక్కుల మేర వరద ఉధృతి కొనసాగింది. దీంతో గేట్లెత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. అన్నారం బ్యారేజీ వద్ద సైతం స్థానిక వాగుల నుంచి నీరు వస్తుండటంతో 9 గేట్లు ఎత్తి 36 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద ప్రవాహం పెరిగి జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ప్రస్తుతం మేడిగడ్డలో 4.51 టీఎంసీలు, అన్నారంలో 9.25 టీఎంసీలు, సుందిళ్లలో 6 టీఎంసీల మేర నిల్వలున్నాయి. నిర్మల్ జిల్లా కడెం జలాశయంలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రానికి 51,864 క్యూసెక్కుల మేర వరద వస్తుండటంతో 4 గేట్లు తెరిచి 39,809 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్న గోదావరిలోకి వదులుతున్నారు. కడెం నీటి నిల్వ సామర్థ్యం 7.6 టీఎంసీలుకాగా ప్రస్తుతం 6.23 టీఎంసీల నిల్వ ఉంది. కడెం నుంచి వస్తున్న నీటితో ఎల్లంపల్లి జలాశయంలో నీటిమట్టం పెరుగుతోంది. ఎల్లంపల్లిలోకి 48,861 క్యూసెక్కుల వరద వస్తుండగా, నిల్వ 20 టీఎంసీలకుగాను 13 టీఎంసీలకు చేరింది. ఎస్సారెస్పీలోకి 20 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నీటి నిల్వ 90 టీఎంసీలకుగాను 7.3 టీఎంసీలకు చేరుకుంది. -
‘కడెం’కు పొంచి ఉన్న ముప్పు!
కడెం (ఖానాపూర్): నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు 2వ నంబర్ వరద గేటుకు అనుసంధానంగా ఉండే భారీ దిమ్మె (కౌంటర్ వెయిట్) గురువారం రాత్రి విరిగిపోయింది. దీంతో వరద గేటు మూసివేసే అవకాశం లేనందున నీరు వృథాగా వెళ్లిపోతోంది. శుక్రవారం సాయంత్రం వరకు సుమారు ఐదు వేల క్యూసెక్కుల వరకు నీరు బయటకు పోయినట్లు సమాచారం. అయితే దీనికి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇన్‌ఫ్లో వస్తే వరద గేటు ద్వారా నీళ్లు పోయినా ప్రాజెక్టులో నీటి మట్టం ఉంటుంది, కానీ వర్షాలు తగ్గుముఖం పట్టి ఇన్‌ఫ్లో పూర్తిగా తగ్గితే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 693.626 అడుగుల నీటిమట్టం ఉంచుతున్నారు. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో రాకుంటే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గురువారం సాయంత్రం 14 వరద గేట్లు ఎత్తి నీటిని వదలగా, మరో నాలుగు వరద గేట్లు ఎత్తేందుకు ప్రయత్నించారు. కానీ అవి మొరాయించడంతో అధికారులు హైరానా పడ్డారు. అదే సమయంలో ఇన్‌ఫ్లో కొంత తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలో 2వ నంబర్ వరద గేటుకు అనుసంధానంగా ఉండే కౌంటర్ వెయిట్ విరిగిపోవడంతో గేటు కిందకు ఒరిగిపోయి, తెరవడానికి వీలు లేకుండా పోయింది. కాగా గతంలో 1995లో ప్రాజెక్టు ఆనకట్ట తెగిపోయిన ఘటనను స్థానికులు గుర్తు చేసుకుంటున్నారు. అప్పుడు ఇలాగే భారీ వర్షాలతో ప్రాజెక్టు నీటిమట్టాని కంటే ఎక్కువగా వరద రావడంతో ఆనకట్ట తెగిపోయింది. ముంపు గ్రామాల ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. కడెం ప్రాజెక్టు అధికారుల నిర్లక్ష్యం వల్ల అలాంటి ఘటన మళ్లీ పునరావృతం అవుతుందేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకట్రెండు రోజుల్లో మరమ్మతులు: జేఈ ఈ విషయమై ప్రాజెక్టు జేఈ శ్రీనాథ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా ఇన్‌ఫ్లో తగ్గిన తర్వాత ఒకట్రెండు రోజు ల్లో గేటు మరమ్మతులు చేపడుతామన్నారు. హైద రాబాద్ నుంచి భారీ క్రేన్లను తీసుకొని ఇంజనీర్లు శనివారం ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. గేటు నుంచి నీరు వెళ్లిపోకుండా మరమ్మతులు చేపడుతామన్నారు. కౌంటర్ వెయిట్ ఇప్పుడు అమర్చే అవకాశం లేదని, నీటిమట్టం పూర్తిగా తగ్గిన తర్వాత కొత్తది ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. అప్పటి వరకు 2వ నంబర్ వరద గేటును తెరవడం వీలుకాదని వివరించారు. -
సాగుకు నీళ్లు నిల్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద ఖరీఫ్ ఆయకట్టుకు ఇప్పటికిప్పుడు నీటి విడుదల సాధ్యం కాదని రాష్ట్ర సాగునీటి సమీకృత, నీటి నిర్వహణ, ప్రణాళిక స్టాండింగ్ కమిటీ (శివమ్) తేల్చి చెప్పింది. ప్రధాన ప్రాజెక్టుల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో నీటి లభ్యత లేకపోవడం, లభ్యతగా ఉన్న కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సిన దృష్ట్యా ఖరీఫ్‌లో నీరివ్వడం కష్టమని స్పష్టం చేసింది. ముఖ్యంగా నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల్లోకి పెద్దగా ప్రవాహాలు లేకపోవడం, నిల్వలు ఆశించిన స్థాయిలో లేని దృష్ట్యా వాటి కింది ఆయకట్టుకు నీటి విడుదల చేయరాదని నిర్ణయించింది. జూరాల, కడెంలలో నీటి నిల్వలు ఉండటంతో ఇక్కడ ఆయకట్టుకు నీరిచ్చేందుకు కమిటీ అంగీకరించింది. వరద జలాలపై ఆధారపడ్డ కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ల కింది ఆయకట్టుకు వరద నీటి లభ్యత ఉంటే ఆయకట్టుకు నీరిచ్చుకునేందుకు అంగీకరించింది. తొలి ప్రాధాన్యం తాగునీటికే... రాష్ట్రంలో భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల పరిధిలో నీటి లభ్యత, వినియోగం, తాగు, సాగునీటి అవసరాలపై చర్చించేందుకు గురువారం నీటిపారుదలశాఖ శివమ్ కమిటీ హైదరాబాద్‌లోని జలసౌధలో ప్రత్యేకంగా భేటీ అయింది. సమావేశంలో ఈఎన్సీలు మురళీధర్, నాగేంద్రరావు, అనిల్‌కుమార్‌లతోపాటు అన్ని ప్రాజెక్టులు, జిల్లాల చీఫ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. మిషన్ భగీరథ కింది తాగు అవసరాలు, కనీస నీటిమట్టాలకు ఎగువన ఉండే లభ్యత జలాల లెక్కలపై భేటీలో ప్రధానంగా చర్చించారు. ప్రభుత్వం మిషన్ భగీరథ కింద తాగునీటికి ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా, ఆ అవసరాల మేరకు ప్రాజెక్టుల పరిధిలో కనీస నీటిమట్టాలను నిర్వహించాల్సిందేనని ఈఎన్సీలు స్పష్టం చేశారు. ఎక్కడైనా కనీస నీటిమట్టాల నిర్వహణలో విఫలమైనట్లు సమాచారం అందింతే నోటీసులు ఇవ్వకుండానే సంబంధిత ఈఈలను సస్పెండ్ చేసి పెనాల్టీలు విధించేలా ప్రభుత్వం ఆదేశించిందని గుర్తు చేశారు. భగీరథకు కృష్ణా, గోదావరి బేసిన్లలో 60 టీఎంసీల అవసరం ఉంటుందని, వాటిని పక్కన పెట్టాకే ఖరీఫ్ ఆయకట్టు అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి విడుదల కోసం రైతులు చేస్తున్న అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ప్రస్తుతం ఎస్సారెస్పీ కింద పూర్తిస్థాయి ఆయకట్టు 9.68 లక్షల ఎకరాలకు నీరివ్వాలంటే 72 టీఎంసీల మేర అవసరం ఉండగా లభ్యత జలాలు మాత్రం 15.93 టీఎంసీలే ఉన్నాయి. ఇందులో 6.5 టీఎంసీల మేర భగీరథకు పక్కన పెట్టడంతోపాటు డెడ్ స్టోరేజీ, ఆవిరి నష్టాలు పక్కనపెడితే మిగిలే 5 టీఎంసీలతో కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కెనాల్ పరిధిలో సర్దుబాటు చేయడం కష్టమని ప్రాజెక్టు అధికారులు వివరించారు. గతేడాది ఖరీఫ్‌లో పంటలకు అధికారికంగా నీటి విడుదల జరగలేదు. అయితే చెరువులు నింపేందుకు మాత్రం ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో గరిష్టంగా 8 టీఎంసీలను విడుదల చేయగా మిడ్ మానేరును నింపేందుకు మరో 10 టీఎంసీలను విడుదల చేశారు. ప్రవాహాలు వచ్చేదాకా అంతే... నాగార్జున సాగర్, సింగూరు, నిజాం సాగర్ల కింద సైతం ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు వచ్చే వరకు ఆయకట్టుకు నీటి విడుదల అంశాన్ని పక్కనపెట్టాలని కమిటీ నిర్ణయించింది. సింగూరులో 29.9 టీఎంసీల నిల్వలకుగాను ప్రస్తుతం 7.57 టీఎంసీలే ఉండగా ఇక్కడ భగీరథకు 5.7 టీఎంసీలు పక్కనపెట్టాలని భేటీలో నిర్ణయం తీసుకున్నారు. అదిపోనూ మిగిలేది ఏమీ లేనందున ప్రాజెక్టు కింది 40 వేల ఎకరాలకు నీరిచ్చే అవకాశం లేదని కమిటీ తేల్చింది. దీంతోపాటే సింగూరు దిగువన ఉన్న ఘన్పూర్ ఆయకట్టుకు 40 వేల ఎకరాలకు నీరివ్వడం కష్టమని కమిటీ అభిప్రాయపడింది. నిజాం సాగర్‌లోనూ ప్రస్తుతం 17 టీఎంసీలకుగాను 2.37 టీఎంసీల నిల్వ ఉండగా ఇక్కడ 2.08 లక్షల ఆయకట్టుకు 22 టీఎంసీలు అవసరం ఉందని, అయితే ప్రస్తుత లభ్యత తక్కువగా ఉండటంతో ఈ ఆయకట్టుకు నీరివ్వలేమని తెలిపింది. నాగార్జున సాగర్ కింద 6.41 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలంటే 54 టీఎంసీలు అవసరమని ప్రాజెక్టు అధికారులు కమిటీకి వివరించారు. ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిలో తెలంగాణకు దక్కే వాటా 43 టీఎంసీలుగా ఉందని, ఇందులో సాగర్ కింద ఏడాదంతా తాగునీటికే 41 టీఎంసీలు అవసరం ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సాగర్ కింది ఆయకట్టుకూ నీటి విడుదల సాధ్యం కాదని కమిటీ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్లలో ప్రవాహాలు వస్తే ఖరీఫ్ ఆయకట్టుకు నీటి విడుదలపై మళ్లీ చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ తెలిపింది. -
భారీ వర్షాలతో ఉప్పొంగిన వాగులు
-
నిర్మల్ కడెం ప్రాజెక్టుకు భారీగా వరద
-
ఆదిలాబాద్‌లో మూడు రిజర్వాయర్లు
సాక్షి, హైదరాబాద్: కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టుకు సమృద్ధిగా నీటి లభ్యతను పెంచే లక్ష్యంతో కుఫ్టి బహుళార్థ్ధ సాధక ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుఫ్టి గ్రామం వద్ద 5.32 టీఎంసీల సామర్ధ్యంతో రూ.870 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు అనుమతిచ్చింది. అలాగే, లోయర్‌పెన్‌గంగ నదిపై మరో రెండు రిజర్వాయర్లు నిర్మిస్తారు. రూ.369 కోట్లతో 1.42 టీఎంసీల సామర్థ్యంతో పిప్పల్‌కోటి, రూ.215 కోట్లతో 0.7 టీఎంసీల సామర్థ్యంతో గోముత్రి రిజర్వాయర్ నిర్మాణానికి అనుమతిచ్చింది. ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కడెం నదిపై ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి 13.42 టీఎంసీల నీటి కేటాయింపులుండగా 7.2 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో 4 టీఎంసీలే వాడుకుంటుండగా మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంది. దీంతో 4 టీఎంసీలతో 68,150 ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యం ఉన్నా కేవలం 41,868 ఎకరాలకు మాత్రమే సాగునీరు అందుతోంది. మరో 26,282 ఎకరాలు గ్యాప్ ఆయకట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో కుఫ్టి రిజర్వాయర్ నిర్మించాలని కడెం కింది ఆయకట్టుకు నీటి లభ్యతను పెంచే లక్ష్యంతో దీన్ని చేపట్టనుంది. కుఫ్టి ప్రాజెక్టును చేపట్టడం ద్వారా కుంటాల జలపాతానికి ఏడాది పొడవునా నీటి లభ్యతను ఉంచడం ద్వారా పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. దీంతోపాటే ఇక్కడ 3 మెగావాట్ల హైడ్రో పవర్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే, సమీప గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ఏడాదంతా నీటిని అందించే అవకాశం ఉందని ఉత్తర్వుల్లో తెలిపారు. -
కుంటాల అందాలకు కుఫ్టి జలాలు
సాక్షి, హైదరాబాద్: గోదావరి ఉపనది అయిన కడెం నదీ జలాలను వినియోగంలోకి తీసుకొచ్చేలా మరో రిజర్వాయర్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడ మండలాల మధ్య కుఫ్టి గ్రామం వద్ద రిజర్వాయర్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కడెం ప్రాజెక్టు కింది ఆయకట్టు స్థిరీకరణతో పాటు అవసరమైనపుడు కుంటాల జలపాతానికి నీరు విడుదల చేసేలా ప్రాజెక్టును రూపొందించారు. 5.32 టీఎంసీల సామర్థ్యంతో రూ.744 కోట్లతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. ప్రాజెక్టు పనులు ముమ్మరం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో కేబినెట్ నోట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో దీన్ని ఆమోదించే అవకాశం ఉంది. 7 టీఎంసీలే వినియోగం.. కడెం నదిపై ఆదిలాబాద్ జిల్లాలో కడెం ప్రాజెక్టు నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి 13.42 టీఎంసీల నీటి కేటాయింపులుండగా 7.2 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును చేపట్టారు. ఇందులో 4 టీఎంసీలే వాడుకుంటుండగా మిగతా 3 టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉంది. ఆ 4 టీఎంసీలతో 68,150 ఎకరాలకు నీరివ్వాలనే లక్ష్యం ఉన్నా ఆశించిన మేర అందడం లేదు. అదీగాక వరద ఉన్న ఒక్క సీజన్లోనే పంటలకు నీరందుతోంది. నీటి నిల్వ పెంచేందుకు కడెం ప్రాజెక్టు ఎత్తు పెంచితే అటవీ భూములు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. దీనికి తోడు ఎత్తు పెంపు పనులు పూర్తయ్యే వరకు నాలుగైదేళ్లు పంటలు వేసుకునే అవకాశం ఉండదు. మరోవైపు మొత్తం కేటాయింపుల్లో 6.22 టీఎంసీల నీటి వినియోగమే లేదు. ఈ నేపథ్యంలోనే కుఫ్టి రిజర్వాయర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బోథ్‌లో 30 వేల ఎకరాలకు నీరు.. ఆదిలాబాద్ జిల్లాలో నేరడిగొండ, ఇచ్చోడ మండలాల పరిధిలో సహజసిద్ధంగా ఉన్న 2 కొండల మధ్య నుంచి కడెం వాగు ప్రవహిస్తుంటుంది. ఈ కొండలను కలుపుతూ ఆనకట్ట నిర్మిస్తే 6.22 టీఎంసీల నీటిని వినియోగంలోకి తీసుకురావొచ్చని ప్రభుత్వం తొలుత అంచనా వేసింది. దీనిపై సర్వే నిర్వహించగా 5.32 టీఎంసీలతో ప్రాజెక్టు నిర్మించవచ్చని తేలింది. అలాగే కుఫ్టిని కడెం ప్రాజెక్టుకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా వాడుకుంటూ బోథ్ నియోజకవర్గంలో 30 వేల ఎకరాలకూ నీరిచ్చే అవకాశం ఉంటుంది. అవసరమైనపుడు కుంటా లకు కూడా నీరు విడుదల చేయొచ్చు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఆదిలాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ప్రాజెక్టు పనులను వీలైనంతర త్వరగా ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. -
‘కడెం’ వద్ద పర్యాటకుల సందడి
కడెం : కడెం ప్రాజెక్టు జలాశయం వద్ద ఆదివారం పర్యాటకులతో సందడి కనిపించింది. వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు వాహనాల్లో భారీగా తరలివచ్చి ఇక్కడి బోట్లలో జలాశయంలో విహరించారు. సెల్ఫీలు తీసుకున్నారు. గుట్టలు, పచ్చదనంతో అలుముకున్న ప్రకృతి అందాలను చూసి మురిసిపోయూరు. ప్రాజెక్టు ప్రస్తుతం నిండుకుండలా ఉండడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. -
‘కడెం’ లీకేజీకి మందు ఎండుగడ్డి
రబ్బర్ సీల్స్ వేసినప్పటికీ.. కడెం : కడెం ప్రాజెక్టుకు తిరిగి ఎండుగడ్డే గతి అవుతోంది. వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ఉధతి తగ్గినందున కొద్దిరోజులుగా నీరు వరదగేట్ల ద్వారా వథాగా బయటికి పోతోంది. ఇలా దాదాపు రోజూ 50 క్యూసెక్కుల నీరు వథాగా పోయింది. ప్రస్తుతం ఆయకట్టుకు నీరు చాలా అవసరం. కాబట్టి నీటిని పొదుపుగా వాడుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ప్రాజెక్టు అధికార్లు వరదగేట్ల నుంచి అవుతున్న లీకేజీని ఆపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా సాధారణ ఎండు గడ్డితోనే ఈ లీకేజీలున్న చోట పెడుతున్నారు. అధికార్లు నాలుగు రోజుల నుంచి లీకేజీని ఆపేందుకు ఇతర ప్రాంతం నుంచి తెప్పించిన ఎండుగడ్డితో లీకేజీ అవుతున్న చోట పెట్టి బయటకు వెళ్తున్న నీటిని ఆపుతున్నారు. శుక్రవారం కూడా ఈ పనులు జరిగాయి. ఇంకా రెండు రోజుల్లో గేట్లన్నింటికీ గడ్డిపెట్టే పని పూర్తవుతుందని ప్రాజెక్టు జేఈ శ్రీనాథ్ వివరించారు. రబ్బర్ సీల్స్ పెట్టినప్పటికీ. . ప్రాజెక్టు నిర్మాణ కాలంలో వరదగేట్లకు నీటి లీకేజీలను ఆపేందుకు ఉపయోగించే టాప్, బాటమ్ రబ్బర్ సీల్స్ పాతవి కావడంతో అవి దెబ్బతిన్నాయి. దీంతో రెండేళ్ల క్రితమే రు.25 లక్షలతో కొత్తవి రబ్బర్ సీల్స్ తెప్పించి ప్రాజెక్టున్న అన్ని గేట్లకు పెట్టించారు. వీటి ద్వారా నీటి చుక్క కూడా బయటకు వెళ్లకూడదు. కానీ ప్రస్తుతం నీరు చాలా వరకు లీకేజీ అవుతోంది. దీన్ని బట్టి చూస్తే రబ్బర్ సీల్స్ ఏ మేరకు నాణ్యమైనవో తెలిపోతుంది. ఈ విషయమై ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా రబ్బర్ సీల్స్ పెట్టినప్పటికీ వాటిలో చెత్తా చెదారం రావడంతో, ఇలా నీరు లీకేజీ అవుతోందని, అన్ని ప్రాజెక్టుల్లో రబ్బర్ సీల్స్ వేసినప్పటికీ కూడా ఇలాగే లీకేజీ జరుగుతుందని వివరణ ఇచ్చారు. -
కడెంను సందర్శించిన ‘మండలి ’డెప్యూటీ చైర్మన్
కడెం : శాసనమండలి డెప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ సోమవారం కడెంను సందర్శించారు. అక్కడి పడవలో ఎక్కి జలాశయంలో విహరించారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పూల రవీందర్, రిటైర్డ్ డీఐజీ గంగాధర్, టీఆర్ఎస్ నేతలు రాఘవేందర్, చింతల వెంకటేశ్వర్ రెడ్డి తదితరులున్నారు. వీరికి జన్నారం డీఎఫ్‌వో రవీందర్ పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. కడెం ప్రాజెక్టు సందర్శించిన డీఆర్వో జిల్లా రెవెన్యూ అధికారి సంజీవరెడ్డి సోమవారం కడెం ప్రాజెక్టు సందర్శించారు. ప్రాజెక్టు వరదగేట్లు,నీటిమట్టం తాజాస్థితి, తదితర వివరాల గురించి ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్‌ను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు వద్ద ఫోటోలు దిగారు. ఆయన వెంట కడెం తహసీల్దార్ నర్సయ్య, ఆర్ఐలు బాబారావు, రవీందర్ తదితరులున్నారు. -
గూడెం వంతెన తాకుతున్న గోదావరి
దండేపల్లి/ధర్మపురి: ఆదిలాబాద్- కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని గూడెం(రాయపట్నం వంతెన) వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండ్రోజుల క్రితం కడెం ప్రాజెక్టు నుంచి వరద నీటిని వదలడంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. నదిపై ఉన్న పాత లోలెవల్ వంతెన ఆదివారం మునిగిపోయేలా కనిపించింది. వంతెనకు సమానంగా నీరు ప్రవహిస్తుండడంతో.. అధికారులు శనివారం రాత్రి నుంచి వాహనాల రాకపోకలు నిలిపి వేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు, జీపులను ఆదివారం ఉదయం నుంచి కొత్త వంతెనపై నుంచి పంపిస్తున్నారు. కొత్త వంతెనపై బీటీ నిర్మాణం పనులు పూర్తయ్యాయి. వంతెనకు ఇరువైపులా అప్రోచ్ రోడ్డు పనులు రాయపట్నం వైపు పూర్తయ్యాయి. గూడెం వైపు ఇంకా సాగుతున్నాయి. వర్షాలు పడడంతో అప్రోచ్ రోడ్డు పనుల్లో కొంత జాప్యం జరిగింది. కాగా, నీటి ప్రవాహం పెరిగితే సోమవారానికి లో లెవల్ వంతెన పూర్తిగా మునిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. -
కడెంలో ప్రముఖుల సందడి
కడెం : కడెంకు మునుపెన్నడూ లేని విధంగా ఒక్కరోజే ప్రముఖల సందడి ఏర్పడి ఏర్పడింది. ఆదివార ం ఉదయం నుంచే ప్రముఖుల తాకిడి మొదలైంది. కలెక్టర్ జగన్మోహన్ కుటుంబ సమేతంగా ఒక రోజు ముందే కడెం రిసార్స్‌కు చేరుకున్నారు. కలెక్టర్‌ను కలిసేందుకు పీసీసీఎఫ్ పీకే ఝా, అడిషనల్ పీసీసీఎఫ్ పీ మధుసూదన్ రావు, టైగర్ ప్రాజెక్టు ఫీల్డ్ డైరెక్టర్ ఎస్కే గుప్త ఆదివారం ఉదయం కడెంకు వచ్చారు. వారి వెంట సీఎఫ్ తిమ్మారెడ్డి, నిర్మల్, జన్నారం డీఎఫ్‌వోలు రాంకిషన్‌రావు, రవీందర్, కడెం ఎఫ్ఆర్వో నాగయ్య ఉన్నారు. మధ్యాహ్న సమయంలో జిల్లా జడ్జి ఉదయగౌరి కుటుంబసమేతంగా కడెం ప్రాజెక్టును సందర్శించారు. కుటుంబ సభ్యులతో కలిసి పడవలో జలాశయంలో విహరించారు. హరితారిసార్ట్స్, కడెం ప్రాజెక్టును మంచిర్యాల, ఖానాపూర్ ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, రేఖానాయక్ సందర్శించారు. సాయంత్రం కడెం ప్రాజెక్టు, బోటింగు కేంద్రం వద్ద పర్యాటకుల తాకిడి ఎక్కువైంది. ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చారు. వందల సంఖ్యలో పర్యాటకులు వాహనాల్లో రావడంతో ప్రాజెక్టుపై ట్రాఫిక్ జాం ఏర్పడింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్‌ను నియంత్రించారు. చాలా రోజుల తర్వాత ఆదివారం పర్యాటకులతో కళకళలాడింది. -
ఆకర్షిస్తున్న కడెం ప్రొజెక్టు బోటు షికారు
-
‘కడెం’నీటి కోసం ఆందోళన
లక్సెట్టిపేట్: రబీ పంటల సాగుకు కడెం ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని కోరుతూ రైతులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండలానికి చెందిన దాదాపు 50 మంది రైతులు రాస్తారోకో చేశారు. గురువారం మధ్యాహ్నం నిరసన సాగటంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకుని ఆందోళన విరమింపజేశారు. ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. -
దండు కదిలింది !
- ప్రధాన కాల్వ అడ్డుకట్ట తొలగించిన 400 మంది రైతులు - అన్నదాతలకు మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి సంఘీభావం జన్నారం : కడెం ప్రాజెక్ట్ నుంచి ప్రధాన కాలువ ద్వారా 28 డిస్ట్రిబ్యూటరీ వరకు నీరు అందడం లేదని, దీంతో తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ దండేపల్లి మండల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గురువారం జన్నారం మండలం కామన్పల్లి ప్రాంతంలో 13 డిస్ట్రిబ్యూటరీకి వెళ్లేతూము వద్ద ఆ ప్రాంత రైతులు బండరాళ్లతో అడ్డుకట్ట వేశారు. దీంతో తమకు నీరు రావడం లేదని ఆగ్రహించిన దండేపల్లికి చెందిన 400 మంది రైతులు దండులా కదిలివచ్చారు. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డి అధ్వర్యంలో అడ్డుకట్టను తొలగించారు. కడెం ఆయక ట్టులో నీరున్న తగినంత విడుదల కాకుండా వారబందీ ద్వారా కేవలం 4 ఫీట్లు విడుదల చేయడం వల్లే నీళ్లు జన్నారం మండల వరకైనా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ దండేపల్లి మండలం అధ్యక్షుడు గడ్డం త్రిమూర్తి , తాళ్లపేట్ సర్పంచ్ లింగరావు, గూడెం ఎంపీటీసీ సభ్యులు ముత్తే నారాయణ పాల్గొన్నారు. మేదరిపేటలో సాగునీటి కోసం రాస్తారోకో దండేపల్లి : కడెం ఆయకట్టు కింద ఖరీఫ్‌లో సాగు చేసిన పంటలకు సాగునీరందక ఎండిపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి డిమాండ్ చేశారు. కడెం ఆయకట్టు కింద పంటలకు సాగునీరు సక్రమంగా అందడం లేదని, నీటి గేజ్‌ను పెంచాలని మండల రైతులు గురువారం కడెం ప్రాజెక్టుకు తరలి వెళ్లారు. దారిలో మండలంలోని మేదరిపేట వద్ద రైతులు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు మద్దతు పలికారు. కడెం ప్రాజెక్టు వద్ద రైతుల ఆందోళన కడెం: కడెం ప్రాజెక్టు ద్వారా తమ పంట పొలాలకు నీరందించాలని డిమాండ్ చేస్తూ గురువారం ఆయకట్టు పరిధిలోని దండేపల్లి,తాళ్లపేట,లక్సెట్టిపేట, తపాలాపూర్,రోటిగూడెం ప్రాంతాలకు చెందిన వందలాది మంది రైతులు ఇక్కడికి తరలివచ్చారు. సాగు నీరులేక తమ పంటలు ఎండిపోతున్నాయని వారు అధికార్లతో చెప్పారు. అయితే రైతులు వచ్చారనే సమాచారంతో ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. రైతులతో పాటు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే అరవింద రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. రైతుల తరఫున ఆయన ప్రాజెక్టు డీఈతో మాట్లాడి ఆయకట్టు పరిస్థితిని వివరించారు.గతంలో కడెంలో జరిగిన నీటి సంఘాల సమావేశంలో చేసిన తీర్మానం ప్రకారం ఆయకట్టు కిందనున్న డీ-28 వరకు నీటిని విడుదల చేయాలన్నారు.నీరివ్వకుంటే ఊర్కోమని,నీరిచ్చేదాకా ఇక్కడే ఉంటామని రైతులు భీష్మించారు. దీంతో ప్రాజెక్టు డీఈ నూరుద్దీన్ ఇక్కడి పరిస్థితిని ఈఈ వెంకటేశ్వర్‌కు వివరించారు. నీటి విడుదలపై రెండు రోజుల్లో తగు నిర్ణయం తీసుకుంటామని వారు రైతులకు హామీ ఇచ్చారు.దీంతో స్పందించిన రైతులు ఇచ్చిన హామీని నిలుపుకోవాలని అధికారులకు సూచించి నిరసన విరమించారు. 400 మంది రైతులు నిరసనలో పాల్గొన్నారు. 28వ డిస్ట్రిబ్యూటరీ దాకా నీళ్లిస్తాం దండేపల్లి : కడెం ప్రాజెక్టు నీటిని 28వ డిస్ట్రిబ్యూటరీ కాల్వ వరకూ నీటిని అందిస్తామని ఎమ్మెల్యే దివాకర్‌రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయకట్టు కింద నెలకొన్న సాగు నీటి ఇబ్బందులను నీటి పారుదల మంత్రి హరీశ్‌రావు దృష్టికి తీసుకెళ్లానన్నారు. ప్రధాన కాల్వలకు నీటి గేజిని సుమారు 7 ఫీట్లకు పైగా పెంచి విడుదల చేస్తామన్నారు. కాల్వలో నీటికి అడ్డుకట్టలు వేయకుండా చూడాలని అధికారులకు సూచించామన్నారు. గూడెం ఎత్తిపోతల నీటిని శుక్రవారం నుంచి రెండు మోట్లార్ల ద్వారా విడుదల చేస్తామన్నారు. -
నిండిన జలాశయాలు
కడెం : ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల్లో మండలంలో వేలాది ఎకరాలు బీడుగా మారాయి. కొందరు రైతులు మొండి ధైర్యంతో వరి నార్లు పోయగా అవి ఎండలకు ఎండిపోయాయి. ఇదీ.. మొన్నటి వరకు కడెం ప్రాజెక్టు, సదర్మాట్ ఆయకట్టుల కింద ఉన్న పరిస్థితి. ప్రస్తుతం వారం రోజులుగా వరుసగా ముసుర్లు పడుతుండడంతో కడెం ప్రాజెక్ట్‌తోపాటు గ్రామాల్లోని చెరువులు, కుంటలు, బావులు జలకళను సంతరించుకున్నాయి. పొలం పనుల్లో రైతులు బిజీ.. కడెం ప్రాజెక్టు, సదర్మాట్లు నిండడంతో అధికారులు ఇదివరకే కాలువల ద్వారా నీటిని వదిలారు. ఈ నీరు పంటలకు కాదు.. చెరువులకు మాత్రమే అని కూడా వారు ప్రకటించారు. కానీ చెరువులు, బావుల కింద మాత్రం రైతులు ఇప్పటికే మండలంలోని చాలా గ్రామాల్లో వరినార్లు పోసుకున్నారు. కష్టపడి వరినార్లను కాపాడిన రైతులకు ఈ వర్షం చాలా ఆదుకున్నట్లయింది. వారంతా ఇపుడు వరినాట్లు వేసుకుంటున్నారు. వారిలో కొత్త ఆశలు చిగురించాయి. తమ పంట సాగు విజయవంతంగా జరుగుతుందన్న ధీమా వారిలో వ్యక్తమవుతోంది. మండలంలో ఎక్కడ చూసినా వరినాట్లు వేసుకోవడంలో రైతులు బిజీగా కనిపిస్తున్నారు. 15 రోజుల కిందట కురిస్తే.. వర్షాలున్నట్టుండి ఎటూ కాని సమయంలో కురుస్తుండడంతో కొందరు రైతులు సంతోషంతో ఉండగా మరి కొందరు అయ్యో ఇంకో 15 రోజుల కిందట పడితే తమ వరినారు దక్కేదని బాధ పడుతున్నారు. ఆయకట్టు కింద చాలా మంది రైతుల వరినార్లు ఇప్పటికే ఎండలకు ఎండిపోయాయి. కొందరు తెలిసిన తోటి రైతుల నుంచి, పరిచయం ఉన్న వారి నుంచి డబ్బులకు వరినార్లు కొనుక్కుంటున్నారు. వరినారు దొరకనివారు బాధపడుతున్నారు. ప్రస్తుతం మండలంలో కొద్దిరోజులుగా పంట భూములు రైతులతో కళకళలాడుతున్నాయి. -
నేడు ‘కడెం’ ఆయకట్టుకు నీటి విడుదల
కడెం : కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతన్నలకో శుభవార్త. ప్రాజెక్టు నుంచి ఆయకట్టుకు గురువారం నీటిని వదలనున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఈ సారి కాస్త ఆలస్యంగా కడెం ప్రాజెక్టులోకి నీరు చేరింది. ప్రాజెక్టు మీద ఆశతో ఆయకట్టు రైతులు ఖరీఫ్‌లో వరినారు పోసుకున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు కురవక.. ప్రాజెక్టులోకి నీరు చేరక నారుమడులు ఎండిపోయాయి. మరికొన్ని మడులు ముదిరి పశువులకు మేతగా మారాయి. బావుల కింద సాగు చేస్తున్న చేలు సైతం ఎండిపోయే దశకు చేరా యి. ఈ క్రమంలో వారం రోజుల నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్టులోకి భారీగానే వరద నీరు చేరింది. ప్రాజెక్టు నీటిమట్టం 692 అడుగులకు చేరింది. జలాశయంలో 5.5 టీఎంసీల నీరుంది. దీంతో పంటలకు ప్రాజెక్టు నీటిని వదిలి ఆదుకోవాలని రైతులు పలుమార్లు విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ జగన్మోహన్, రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావులను ఎమ్మెల్యే రేఖానాయక్ కలిసి పరిస్థితి వివరించారు. ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం కడెం ఆయకట్టు పరిధిలోని నీటి సంఘాల చైర్మన్లతో ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించి, నీటి విడుదలపై చర్చించారు. చివరికి జలాశయంలో ఉన్న నీటిని కేవలం డీ-10(కలమడుగు) వరకు మాత్రమే వదలాలని, మిగతా ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు నింపాలని తీర్మానించారు. ఈ మేరకు కడెం ప్రాజెక్టు ఆయకట్టు కిందనున్న డీ-10 వరకు గురువారం ఉదయం 8.30 గంటలకు నీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు డీఈ నూరొద్దీన్ తెలిపారు. ఎడమ కాలువ ద్వారా 4 అడుగులు, కుడి కాలువ ద్వారా 15 క్యూసెక్కుల నీటిని విడుదల చేసి దశల వారీగా ప్రవాహాన్ని పెంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు రేఖానాయక్, దివాకర్‌రావు హాజరుకానున్నారని తెలిపారు. -
చేప పిల్లల ఉత్పత్తి ప్రారంభం
కడెం : నాలుగు కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా కడె ంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ముందుకుసాగుతోంది. ఈ కేంద్రాన్ని ప్రభుత్వం 1989లో ప్రారంభించింది. కడెం ప్రాజెక్టు సమీపంలోని దాదాపు 25 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. చేప పిల్లలను ఉత్పత్తి చేసి కడెం రిజర్వాయర్‌లో వదిలి ఇక్కడి మత్స్యకారుల జీవనోపాధికి తోడ్పాటునందించాలనేది కేంద్రం ఉద్దేశం. అయితే ఏటా చేప పిల్లల ఉత్పత్తికోసం లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తోంది. అందుకోసం సిబ్బంది ఆ దిశగా కృషి చేస్తున్నారు. పిల్లల ఉత్పత్తికి చల్లని వాతావరణం అనుకూలంగా ఉంది. ఉత్పత్తికి అవసరమైన హౌజులు 35 వరకు ఉన్నాయి. ఈ సారి వర్షాభావం కారణంగా ఉత్పత్తికి కొంత ఆటంకం కలుగుతోంది. ప్రారంభమైన ఉత్పత్తి జూలై రెండోవారంలో ఉత్పత్తి ప్రారంభించా రు. మొదటగా బంగారు తీగ, కట్ల,రహు రకం చేపల ఉత్పత్తి చేపట్టారు. తల్లి చేపకు కృత్రిమ గర్భదారణ చేయించిన అనంతరం మగ చేపలతో ఫలదీకరణ చేయిస్తారు. ఇలా వచ్చిన చిన్న పిల్లలను 45 రోజుల వరకు హౌజులలో వాటికి అవసరమైన ఆహారం వేసి జాగ్రత్తగా పెంచుతారు. 45 రోజుల తర్వాత ఇంచు సైజులో పెరుగుతాయి. వాటిని కేంద్రం పరిధిలోని కడెం, ముథోల్, ఖానాపూరు, భైంసా, కుభీర్, తానూరు మండలాల్లోని గుర్తింపు పొందిన 45 మత్స్యకారుల సొసైటీలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయిస్తారు. కేంద్రంలో కట్ల చేప 13 లక్షలు, రహూ 20 లక్షలు, బంగారు తీగ 50 వేల వరకు పిల్లలున్నాయి. హౌజుల్లో వేసిన పిల్లలకు ఆహారాన్ని ప్రత్యేకంగా తయారు చేసి రోజూ అందిస్తారు. అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు జలాశయంలోనూ పిల్లలను వదులుతారు. ప్రస్తుతం ఉత్పత్తి కేంద్రం పరిధిలో 51 చెరువులు,కుంటలున్నాయి. ఈసారి 4 కోట్ల పిల్లల ఉత్పత్తి లక్ష్యం ఉండడంతో ఇంకా కొద్దిరోజుల్లో మళ్లీ ఉత్పత్తి చేపడతామని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా దోమల నివారణకోసం గంబూజియా చేపలు కేంద్రంలో ప్రస్తుతం 5 లక్షల చేప పిల్లలున్నాయి. వాటిని ఆయా పంచాయతీలకు ఉచితంగా సరఫరా చేస్తారు. కేంద్రంలో సిబ్బంది కొరత ఉత్పత్తి కేంద్రంలో సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. నాలుగైదు ఏళ్లుగా కేంద్రానికి ఇన్చార్జి అధికారే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం చుట్టూ కంచె లేదు. పశువులు విచ్చలవిడిగా సంచరిస్తుంటాయి. రాత్రి వేళల్లో అంధకారం. -
‘కడెం’ వెలవెల
కడెం : వర్షాకాలం వచ్చింది.. సగం కాలం గడిచింది.. కార్తెలూ వస్తున్నాయి.. అయిపోతున్నాయి. కానీ కాలం కావడం లేదు. వ్యవసాయ పనులు ముందుకు సాగడం లేదు. కడెం ఆయకట్టు పరిస్థితే ఇలా ఉంటే ఇక మిగితా ప్రాంతాల్లో పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత ఏడాది ఇదే సమయానికి కడెం ప్రాజెక్టు ఆయకట్టు అంతా పచ్చదనంతో కళకళలాడింది. పచ్చని పొలాలతోఎటు చూసినా భూములున్నీ సాగులో ఉన్నాయి. ఈసారి వర్షాభావ పరిస్థితులతో ఎటు చూసినా భూములు బీడువారి కనిపిస్తున్నాయి. కడెం ప్రాజెక్టు ఆయకట్టు కింద కడెం, జన్నారం, దండేపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాలు ఉన్నాయి. ఏటా ఖరీఫ్ సీజన్లో కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు కింద 85 వేల ఎకరాలు సాగు అవుతోంది. ప్రాజెక్టు కింద 87 వరకు చెరువులు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రస్తుతం నీరు లేక వెలవెలబోతున్నాయి. గత ఏడాది ప్రాజెక్టులో ఇదే సమయానికి 700 అడుగుల నీటిమట్టం ఉంది. చాలాసార్లు వదర గేట్లు ఎత్తి నీటిని వృథాగా గోదావరినదిలోకి వదిలారు. ప్రస్తుతం నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. సోమవారం సాయంత్రం వరకు ప్రాజెక్టు నీటిమట్టం 680 అడుగులుగా ఉంది. కనిష్ట నీటిమట్టం 675 అడుగులు. జలాశయంలో కేవలం రెండు టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గత ఏడాది మండలంలోని ఆయకట్టు కింద ఖరీఫ్‌లో 17,654 ఎకరాలు సాగయ్యాయి. పత్తి, వరి, మొక్కజొన్న, పసుపు తదితర పంటలు సాగు చేస్తుంటారు. ఈసారి వ్యవసాయ పనులు ఇంకా ముందుకు సాగడం లేదు. వర్షాలు కురుస్తాయనే ఆశతో ఆయకట్టు రైతులు ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు సిద్ధం చేసుకుని ఉన్నారు. ఆకాశం మేఘావృతం అవుతోంది.. కానీ వర్షాలు పడడం లేదు. మబ్బులు తేలిపోతూ రైతులను నిరాశకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే గ్రామాల్లో వర్షాల కోసం రైతులు కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. మరి కొందరు దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. ఆయకట్టు కింద ఇదే దుస్థితి 2008లోనూ ఎదురైంది. వర్షాకాలం చివరలో కష్టంగా ప్రాజెక్టు నిండింది. -
ఏటా అవే హామీలు
ఎన్నికల సమయంలో హామీలివ్వడం, అధికారంలోకి వచ్చాక మర్చిపోవడం.. ఇదీ మన నేతల తీరు. ఏజెన్సీ ప్రాంతమైన ఖానాపూర్ నియోజకవర్గంలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ప్రభుత్వాలు.. పాలకులు మారుతున్నా ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదు. ప్రతీ ఎన్నికల్లో నాయకులు ఏటా అవే సమస్యలు లేవనెత్తి పరిష్కారానికి కృషి చేస్తామంటూ హామీలు గుప్పిస్తున్నారు. ఈ సారీ అదే మాట చెప్పారు. మరి.. ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ విధమైన తీర్పునిస్తారో వేచి చూడాల్సిందే. ఉట్నూర్, న్యూస్‌లైన్ : ఉట్నూర్ మండల ప్రజలకు సురక్షిత నీరు అందించాలనే ఆశయంతో గ్రామీణ నీటి పారుదలశాఖ ద్వారా ఆర్డబ్ల్యూఎస్ నుంచి 2008-09 సంవత్సరంలో ఆర్వో ప్లాంట్లు (రివర్స్ ఆస్మాసిస్) మంజూరు చేశారు. వేణునగర్, పాత ఉట్నూర్(రామాలయం), హనుమాన్‌నగర్, ఫకీర్‌గుట్ట, మొమిన్‌పురా, చిన్నుగూడలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వ్యయంతో ఒక్కో ఆర్వో ప్లాంట్ నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతలు పంచాయతీలకు అప్పగించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో ప్రారంభం కాకుండానే మూలనపడ్డాయి. ఒక్క వేణునగర్లోనే పథకం పనిచేస్తోంది. మూలనపడ్డ శుద్ధజల కేంద్రం.. గిరిజనులకు రెండు రూపాయలకే 20 లీటర్ల సురక్షిత నీరు అందిస్తామని ఐటీడీఏ, వాటర్ హెల్త్ ఇండియా ఆధ్వర్యంలో ఇందిర క్రాంతి పథం, మండల సమాఖ్య భాగస్వామ్యంతో మండలంలోని నర్సాపూర్-బీ గ్రామంలో ఏర్పాటు చేసిన శుద్ధ జల కేంద్రం ప్రారంభించి నెలలు గడవకుండానే మూలనపడింది. దీంతో నీటి కోసం స్థానికులు అష్టకష్టాలు పడుతున్నారు. కలగా వంద పడకల ఆస్పత్రి ఏజెన్సీలోని సమస్యాత్మక ఐదు మండలాలకు ఉట్నూర్ ఆస్పత్రే దిక్కు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి నార్నూర్ మండల పర్యటనలో గిరిజనుల సౌకర్యార్థం ఉట్నూర్ సీహెచ్‌సీని వంద పడకల ఆస్పత్రిగా అప్‌గ్రేడ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ మహానేత అకాల మరణంతో ఆ హామీ అటకెక్కింది. దీంతో సరైన వైద్యం అందక ఎందరో గిరిజనులు మృత్యువాతపడుతున్నారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటయ్యేనా? కేంద్ర ప్రభుత్వం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు 2008 నవంబర్ 17న జీవో నంబర్ 797ను విడుదల చేయగా.. కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2011 ఆగస్టు 27న జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 783 జీవో జారీ చేసింది. యూనివర్సిటీ ఏర్పాటు కోసం జిల్లా, ఐటీడీఏ అధికార యంత్రాంగం ఉట్నూర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల వెనకాల ఉన్న 470 ఎకరాల పరంపోగు భూమిలో 300 ఎకరాలు గుర్తించారు. రవాణా సౌకర్యం, హైటెన్షన్ విద్యుత్ తదితర సౌకర్యాలున్నట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదికలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏజెన్సీ ప్రాంతంలో యూనివర్సిటీ ఏర్పాటు ఖాయమని భావిస్తున్న తరుణంలో ప్రభుత్వం నిర్మల్‌లో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపడంపై గిరిజనులు మండిపడుతున్నారు. ఉట్నూర్ కేంద్రంగా యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎటుచూసినా సమస్యలే.. ఖానాపూర్ మండలంలో ఎటుచూసినా సమస్యలే దర్శనమిస్తున్నాయి. బాదన్‌కుర్తి వంతెన నిర్మాణం పూర్తవడంతో ఐదేళ్లుగా కరీంనగర్ జిల్లా నుంచి వాహనాల రాకపోకలు పెరిగాయి. దీంతో ఖానాపూర్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారి రోడ్డు వెడల్పు సమస్య పరిష్కారానికి నోచుకోవడంలేదు. మాస్టర్ ప్లాన్ మరుగున పడడంతో ట్రాఫిక్ సమస్య అధికమైంది. ఇక అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు కలగానే మిగిలింది. మండలంలోని పుల్గంపాండ్రి నుంచి ఇచ్చోడ మండలం సిరిచెల్మ రహదారినే కలిపే రోడ్డు నిర్మాణం అటకెక్కింది. ప్రతీ ఎన్నికల్లో నాయకులు రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చి ఆ తర్వాత విస్మరించడం మామూలైపోయింది. ఈ రోడ్డు పూర్తయితే ప్రజలకు 30 కిలోమీటర్ల దూరభారం తప్పుతుంది. మండల కేంద్రం నుంచి కడెం మండలం బెల్లాల్ వరకు ఉన్న 22 కిలోమీటర్ల ప్రధాన రోడ్డు అధ్వానస్థితికి చేరి 15 ఏళ్లుగా శాశ్వత మరమ్మతుకు నోచుకోవడంలేదు. ఎక్బాల్‌పూర్, రాజూరా గ్రామాల మధ్య ఉన్న కడెం మండలం సింగాపూర్ గ్రామాన్ని ఖానాపూర్ మండలంలో కలపాలనే డిమాండ్ అమలుకు నోచుకోవడంలేదు. సోమర్పేట్, కుసుంపూర్ కోలాంగూడ మధ్య వంతెన నిర్మాణం కలగానే మిగిలింది. కడెం ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. ఈ ప్రాంత రైతుల పాలిట వరప్రదాయిని అయిన కడెం సాగునీటి ప్రాజెక్టుపై అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. 1972లో నిర్మించిన ఈ ప్రాజెక్టు జలాశయంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయిన పూడిక తొలగింపునకు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 85 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టు 18 వరదగేట్ల కండీషన్ సరిగా లేదు. సాంకేతికపరమైన మరమ్మతులు లేక నీటి లీకేజీలు ఎక్కువయ్యాయి. మరమ్మతుకు నిధుల మంజూరులోనూ పాలకులు వివక్ష ప్రదర్శిస్తున్నారు. కడెం మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణం కల నెరవేరడంలేదు. ఎందరో నాయకులు ఇచ్చిన హామీలు నీటిమూటలే అవుతున్నాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఇక్కడ బస్టాండ్ లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నా పట్టించుకునేవారు కరువయ్యారు. కడెంలో కోటి రూపాయలతో ఫిల్టర్ బెడ్ ప్రకటించినా నిర్మాణానికి చర్యలు తీసుకోవడంలేదు. కడెంలోని రెవెన్యూ కార్యాలయానికి ఇంతవరకు పక్కాభవనంలేదు. అల్లంపల్లి, గంగాపూర్ గ్రామాలకు రహదారి నిర్మాణం హుళక్కే అయింది. రింగురోడ్డు మరమ్మతు ఎప్పుడో..? ఇంద్రవెల్లి మండలంలో రింగ్ రోడ్డు మరమ్మతు చేపట్టి దారికష్టాలు తొలగిస్తామని మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ సుమన్ ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. గోపాల్పూర్, భీంపూర్, టేకిడిగూడా, తుమ్మగూడ, బొప్పాపూర్లకు మట్టి రోడ్డు సౌకర్యం కల్పిస్తామని చెప్పినా ఇంతవరకు నెరవేరలేదు. రోడ్లు.. అధ్వానం జన్నారం మండల కేంద్రం నుంచి ధర్మారం వెళ్లే రోడ్డు దశాబ్దాల కాలంగా మరమ్మతుకు నోచుకోక అధ్వానస్థితిలో ఉంది. లోతొర్రే, సోనాపూర్ తండా, జన్నారం నుంచి చింతలపల్లి, చెరుకుగూడ, ఇప్పలపల్లికి వెళ్లే రోడ్లు గుంతలమయమై స్థానికులు నిత్యం అవస్థలు పడుతున్నా మరమ్మతు చేయించేవారు కరువయ్యారు. జన్నారంలోని కవ్వాల్ ఆభయారణ్యాన్ని ప్రభుత్వం టైగర్ జోన్‌గా గుర్తించింది. దీంతో మండలంలోని అల్లినగర్, దొంగపల్లి, మల్యాల్, మైసంపేట్ గ్రామాల్లో దశాబ్దాల తరబడి ఉంటున్న సుమారు 150 కుటుంబాల మనుగడకు ము ప్పు ఏర్పడింది. అటవీశాఖ అధికారులు తమను ఎప్పు డు ఖాళీ చేయిస్తారోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరి గోడు పట్టించుకునేవారు కరువయ్యారు. -
జనవరి 16 నుంచి ‘కడెం’ నీటి విడుదల
కడెం, న్యూస్‌లైన్ : కడెం ప్రాజెక్టు ఆయకట్టు కిందనున్న వేలాది ఎకరాల పంట పొలాలకు వచ్చే నెల 16వ తేదీ నుంచి రబీ నీటిని విడుదల చేయనున్నట్లు ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రెండు రోజుల క్రితం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి అధికారుల సమావేశంలో వారు ఈ నిర్ణయం తీస్కున్నారని ఈఈ వివరించారు. కాగా, తొలుత కడెంలో జరిగిన నీటి సంఘాల సమావేశంలో జనవరి 8వ తేదీ నుంచే నీటి విడుదలకు నిర్ణయించారు. కానీ ఈ తేదీని అధికారులు తాజా సమావేశంలో మార్చారు. అయితే జనవరి 16వ తేదీ నుంచి ఎడమ, కుడి కాలువల ద్వారా నీటి విడుదల పద్ధతి ఈ విధంగా ఉంటుందని ఆయన వివరించారు. జనవరి 16 నుంచి 25వ తేదీ వరకు ఫిబ్రవరి 1 నుంచి 14 వరకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 6 వరకు మార్చి 17 నుంచి 26 వరకు ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు.. మిగతా రోజుల్లో కాలువలు మూసి ఉంటాయ ని ఈఈ తెలిపారు. ఈ పద్ధతిన డి-01 నుంచి డి-40 వరకు నీరిస్తామని, డి-42 పరిధిలో చెరువులను నింపుతామని పేర్కొన్నారు. ఆయకట్టు రైతులు ఈ విషయాన్ని గమనించి ఉన్న నీటిని పొదుపుగా వాడుకొని పంటల సాగు చేసుకోవాలని ఆయన సూచించారు. -
8న ‘కడెం’ నీటి విడుదల
కడెం, న్యూస్‌లైన్ : కడెం ప్రాజెక్టు ఆయకట్టు భూములకు వచ్చే నెల 8వ తేదీ నుంచి రెండో పంటకు నీరివ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఆయకట్టు నీటి సంఘాలు, రైతు నాయకులతో ఆదివారం స్థానిక విశ్రాంతి భవనంలో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు ఈఈ వెంకటేశ్వర్రావు, డీఈలు శివనాగరాజు, నూరొద్దీన్ హాజరయ్యారు. కుడి, ఎడమ కాలువల ఆయకట్టు కింద పంట భూములకు చివరి దాకా నీరందించాలని రైతులు, నీటి సంఘాల నాయకులు కోరారు. ప్రాజెక్టులోని నీరు సరిపోని పక్షంలో ఎస్సారెస్పీ నుంచి ఆరు టీఎంసీలు తెప్పించాలని అన్నారు. ప్రస్తుతం చివరి వరకు నీరిచ్చే సామర్థ్యం ప్రాజెక్టుకు లేదని, ఉన్న నీటితో ఆయకట్టు కింద కొంతవరకు మాత్రమే రబీకి.. అదీ ఆరుతడి పంటలకే నీరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. రైతులు అంగీకరించకపోవడంతో చాలాసేపు అధికారులతో వాడీవేడిగా చర్చ సాగింది. వారబందీ పద్ధతిన.. ఆయకట్టు కింద డీ-30 వరకు వారబందీ పద్ధతిన నీరిస్తామని, వచ్చే నెల 8వ తేదీన నీటిని విడుదల చేస్తామని ఈఈ వివరిం చారు. దీనిపై సమావేశంలో తీర్మానించా రు. ప్రతీ పది రోజులు కాలువ మూసి ఉం టుందని, రైతులు పూర్తిగా ఆరుతడి పం టలు వేసుకోవాలని, ప్రతీ నీటి చుక్కను పొదుపుగా వాడుకుని అధికారులకు సహకరించాలని రైతులను కోరారు. సమావేశం లో నీటి సంఘాలు, డీసీల చైర్మన్లు జి.మోహన్‌రెడ్డి, శరత్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, సత్యనారాయణ, కొత్త సత్తయ్య, ప్రాజెక్టు జేఈ లు నరేందర్, శ్రీనాథ్, జల సాధన సమితి అధ్యక్షుడు ఎన్.గోవర్ధన్, తదితరులు పాల్గొన్నారు. -
కడెం ఆయకట్టు రైతులు సాగుకు సిద్ధం
కడెం, న్యూస్‌లైన్ : కడెం ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు శుభవార్త. ఈయేడు కడెం ఆయకట్టుకు రబీ సీజన్లో నీరివ్వనున్నారు. ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. జలసాధన సమితి ఆధ్వర్యంలో రైతుల ఆందోళనలు ఫలించా యి. ఈ రబీకి నీరిస్తారా లేదా అని రైతులు వేయి కళ్లతో ఎదురుచూశారు. ఒక దశలో ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని నీరివ్వమని అధికారులు ప్రకటించినా ఎట్టకేలకు సందిగ్ధత తొలగింది. మూడేళ్లుగా ప్రాజెక్టులో నీరు సక్రమంగా లేకపోవడంతో రబీ పంటకు నీరు ఇవ్వలేదు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురియడంతో నీటి విడుదలకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల ‘శివం’ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా అధికారులు కడెం ప్రాజెక్టు తాజా పరిస్థితిపై వివరించారు. దీంతో ప్రభుత్వం నీటి విడుదలకు పచ్చజెండా ఊపింది. నీటిని వచ్చే నెల 20వ తేదీ నుంచి ఇవ్వాలని సూచన ప్రాయంగా అంగీకరించారు. దీంతో కడెం, దండేపల్లి, జన్నారం, లక్సెట్టిపేట, మంచిర్యాల మండలాల్లోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏరువాక సాగడానికి సన్నద్ధం అవుతున్నారు. వరి, ఆరుతడి పంటలు వేయడానికి రెడీ అవుతున్నారు. -
మన్ను తింటున్న ‘కడెం’
కడెం, న్యూస్‌లైన్ : జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల్లో ఒకటైన కడెం ప్రాజెక్టు మన్ను తింటోంది. ఏటేటా పూడిక పెరిపోతుండడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది. కడెం ప్రాజెక్టును 1958లో నిర్మించారు. నీటి నిల్వ సామర్థ్యం 7.06 టీఎంసీలు. పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా.. కనిష్ట స్థాయి మట్టం 675 అడుగులు. ఆయకట్టు కింద జన్నారం, కడెం, లక్సెట్టిపేట, దండేపల్లి మండలాలు ఉన్నాయి. ఆయా మండలాల్లో కుడి, ఎడమ కాలువల ద్వారా ఆయకట్టు కింద 85వేల ఎకరాలకు ఖరీఫ్ సీజన్లో సాగు నీరందిస్తోంది. జలాశయానికి ఎగువన కుంటాల, బోథ్, బజార్హత్నూర్, కుప్టి, పొచ్చెర, నాందేడ్ ప్రాంతాలు ఉన్నాయి. వర్షాకాలంలో ఆయా ప్రాంతాల నుంచి వరద ఇన్‌ఫ్లో రూపంలో వచ్చి చేరుతోంది. ఇలా వరదతోపాటు పెద్దయెత్తున మట్టి కూడా వచ్చి చేరతోంది. జలాశయంలో నీరు ఎక్కువైనప్పుడు అధికారులు గేట్లు ఎత్తి మిగులు జలాలు వదులుతారు. కానీ మట్టి మాత్రం అలాగే ఉండిపోతోంది. ఏటా నీటిలో పెద్ద ఎత్తున పూడిక మట్టి(సీల్టు) పేరుకుపోతోంది. దీంతో గుట్టలు గుట్టలుగా నిల్వ అయిన ఈ మట్టి క్రమంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గిస్తూ వస్తోంది. తగ్గుతున్న నీటి సామర్థ్యం ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 7.06 టీఎంసీలు కాగా పూడిక కారణంగా క్రమంగా తగ్గుతోంది. ప్రాజెక్టుకు నిర్మాణం సమయంలో పూడికకు గేట్లు కూడా ఏర్పాటు చేసినా వాటి నిర్వహణ సరిగ్గా చేయక అవి ప్రస్తుతం తుప్పు పట్టాయి. ఫలితంగా మట్టి నిల్వ ఏటా పెరగడంతో నీటి నిల్వలు తగ్గుతున్నాయి.దీని ప్రభావం ఆయకట్టుపై పడుతోంది. ఏటా జలాశయంలో ఉన్న నీరు చాలక వారబందీ వంటి పద్ధతులతో ఆయకట్టు పంటలకు నీరు ఇచ్చే దుర్భర స్థితికి చేరింది. ఇలాగే కొనసాగితే మట్టితో మరో 20 ఏళ్లలో నీటి నిల్వ సామర్థ్యం మరింతగా త గ్గే ప్రమాదం ఉంది. కొనసాగుతున్న సర్వే ప్రస్తుతం ప్రాజెక్టులో పేరుకున్న మట్టి, నీటి నిల్వ సామర్థ్యం, లోతు, జలాశయం విస్తీర్ణం వంటి అంశాలపై నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలోని ఏపీ ఇంజినీరింగు రీసెర్చ్ లాబొరేటరీ బృందం ఈ నెల 6వ తేదీ నుంచి సర్వే చేస్తోంది. ఈ బృందంలో డెప్యూటీ ఈఈ జె.ఆశీర్వాదం, ఇంజినీర్లు అరుణశ్రీ, వెంకటరమణ, కిరణ్‌కుమార్, దేవానంద్, తదితర సిబ్బంది మొత్తంగా 13 మంది ఉన్నారు. సర్వే కోసం అత్యంత అధునాతన పరికరాలు ఉపయోగిస్తున్నారు. వీటి విలువ రూ.కోటీ 70 లక్షల వరకు ఉంటుంది. ప్రాజెక్టు గేజ్ రూం వద్ద డీజీపీఎస్ పరికరాన్ని అమర్చారు. సర్వే సమయంలో నీటిపై ఈ బృందం ఏ ప్రాంతంలో ఉన్నదో ఆ పరికరం(రిఫ్రెష్ స్టేషన్ )లో కనిపిస్తోంది. మిగతా జీపీఎస్(గ్లోబల్ పొజీషన్ సిస్టం) పరికరాలతో గ్రౌండ్ పొజిషన్ తెలుసుకుంటారు. నీటిలో లోతు ఎంత ఉన్నది, ఏ ప్రాంతంలో మట్టి నిల్వ ఎంత ఉన్నదీ చాలా స్పష్టంగా తెలుసుకునేందుకు కంప్యూటర్లను పడవలో అమర్చారు. ప్రతీ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పడవలో ఈ బృందం సర్వే చేస్తోంది. సర్వేను ఇటీవల ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ శ్రీదేవి, జాయింటు డెరైక్టరు జాన్ విక్టర్ తదితర ఉన్నతాధికారులు పరిశీలించారు. 1989, 2000లో కూడా సర్వే చేశారు. కానీ అప్పుడు ఇంత శాస్త్రీయ సర్వే జరగలేదు. కన్వెన్షనల్ హైడ్రోగ్రాఫిక్తో సర్వే చే శారు. 1989లో 6 టీఎంసీలకు, 2000లో 5.07 టీఎంసీలకు జలాశయంలో నీటి సామర్థ్యం తగ్గినట్లు తేలింది. జలాశయం మధ్యలో లోతు 56 అడుగుల వరకు ఉందని కనుగొన్నారు. 70 శాతం సర్వే పూర్తి కాగా.. మరో వారంలో సర్వే పూర్తి చేయున్నారు. ఇదే బృందం శ్రీశైలం, నాగార్జునసాగర్, ఏలేరు, జూరాల ప్రాజెక్టుల్లో సర్వే చేసింది. కడెం ప్రాజెక్టు తర్వాత ఎస్సారెస్పీ, నిజాంసాగర్ ప్రాజెక్టులను కూడా సర్వే చేస్తామని ఈ బృందం తెలిపింది. సర్వే నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని డెప్యూటీ ఈఈ జె.ఆశీర్వాదం తెలిపారు.