సాక్షి, నిర్మల్: గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్ట్ లు ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో నిండుతున్నాయి. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండగా అటు శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు కూడా ఇన్ ఫ్లో పెరుగుతోంది.
ఆందోళనలో ప్రజలు..
నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేని పరిస్థితి తలెత్తింది. నీటిని దిగువకు వదులుదామంటే ప్రాజెక్టు నాలుగు గేట్లు మొరాయిస్తున్నాయి. క్షణం క్షణం నీటిమట్టం పెరుగుతోంది. పద్దెనిమిది గేట్లలో నాలుగు గేట్లు తెరుచుకోకపోవడంతో ఎప్పుడేమవుతుందోననే ఆందోళన నెలకొంది.
పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఇన్ ప్లోగా ప్రాజెక్టులోకి 93,200 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో 14 గేట్ల ద్వారా దిగువకు 1,55,770 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు.
(దంచికొడుతున్న వానలు.. హుస్సేన్ సాగర్ నీటి మట్టం అలర్ట్!)
ఆందోళన వద్దు, రిపేర్ చేస్తున్నాం: కలెక్టర్
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ను కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించారు. భారీగా వస్తున్న వరద నీటిపై అదికారులను అప్రమత్తం చేశారు. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో వరదనీరు వచ్చి చేరుతుందన్నారు. అదేవిధంగా ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టామన్నారు. గేట్లను ఎత్తి వరద నీటిపి బయటకు పంపుతున్నామన్నారు.
కడెం పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 7.6టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వను 5.6 టిఎంసీల వరకు ఉంచుతున్నామన్నారు. పద్దెనిమిది గేట్లలలో పద్నాలుగు గేట్లు ఎత్తామన్నారు. మిగతా నాలుగు గేట్లను రిపేర్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దస్తురాబాద్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశామని కలెక్టరు పేర్కొన్నారు.
#Kadam#KadamProject#Kadem@balaji25_t pic.twitter.com/uGGJkLuc3C
— Almas Khan (@almaskhaninc) July 21, 2023
సీఎం ఆరా
గోదావరి బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు ఏమేరా ఇన్ ఫ్లో వస్తోంది. ఎంత మేర నీటి విడుదల కొనసాగుతుందన్న దానిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు.
(చదవండి: వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు)
Comments
Please login to add a commentAdd a comment