Telangana rains
-
భారీ వర్షాలు, కడెం ప్రాజెక్టుకు అంతకంతకూ వరద.. ఆందోళనలో ప్రజలు
సాక్షి, నిర్మల్: గోదావరి పరివాహక ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్ట్ లు ఒక్కొక్కటిగా పూర్తిస్థాయిలో నిండుతున్నాయి. కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తుండగా అటు శ్రీరామ్ సార్ ప్రాజెక్టుకు కూడా ఇన్ ఫ్లో పెరుగుతోంది. ఆందోళనలో ప్రజలు.. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేని పరిస్థితి తలెత్తింది. నీటిని దిగువకు వదులుదామంటే ప్రాజెక్టు నాలుగు గేట్లు మొరాయిస్తున్నాయి. క్షణం క్షణం నీటిమట్టం పెరుగుతోంది. పద్దెనిమిది గేట్లలో నాలుగు గేట్లు తెరుచుకోకపోవడంతో ఎప్పుడేమవుతుందోననే ఆందోళన నెలకొంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లుతుందని ప్రజలు భయపడుతున్నారు. ఇన్ ప్లోగా ప్రాజెక్టులోకి 93,200 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో 14 గేట్ల ద్వారా దిగువకు 1,55,770 క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్టు ప్రాజెక్టు అధికారులు వెల్లడించారు. (దంచికొడుతున్న వానలు.. హుస్సేన్ సాగర్ నీటి మట్టం అలర్ట్!) ఆందోళన వద్దు, రిపేర్ చేస్తున్నాం: కలెక్టర్ నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ను కలెక్టర్ వరుణ్ రెడ్డి సందర్శించారు. భారీగా వస్తున్న వరద నీటిపై అదికారులను అప్రమత్తం చేశారు. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షం కురవడంతో వరదనీరు వచ్చి చేరుతుందన్నారు. అదేవిధంగా ప్రాజెక్టుకు ముప్పు వాటిల్లకుండా చర్యలు చేపట్టామన్నారు. గేట్లను ఎత్తి వరద నీటిపి బయటకు పంపుతున్నామన్నారు. కడెం పూర్తి స్థాయి నీటినిల్వ సామర్థ్యం 7.6టిఎంసీలు కాగా, ప్రస్తుతం నీటి నిల్వను 5.6 టిఎంసీల వరకు ఉంచుతున్నామన్నారు. పద్దెనిమిది గేట్లలలో పద్నాలుగు గేట్లు ఎత్తామన్నారు. మిగతా నాలుగు గేట్లను రిపేర్ చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే దస్తురాబాద్ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశామని కలెక్టరు పేర్కొన్నారు. #Kadam#KadamProject#Kadem@balaji25_t pic.twitter.com/uGGJkLuc3C — Almas Khan (@almaskhaninc) July 21, 2023 సీఎం ఆరా గోదావరి బేసిన్ లో ఉన్న ప్రాజెక్టులకు ఏమేరా ఇన్ ఫ్లో వస్తోంది. ఎంత మేర నీటి విడుదల కొనసాగుతుందన్న దానిపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. (చదవండి: వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు) -
దంచికొడుతున్న వానలు.. ప్రమాద స్థాయిలో బొగత జలపాతం, రెడ్ అలర్ట్!
సాక్షి, వరంగల్: నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంగళవారం ఏకధాటిగా వర్షం కురుస్తోంది. పలుచోట్ల ముసురులా తెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. వర్షాకాలం ఆరంభం తర్వాత తొలిసారిగా రాత్రి నుంచి కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. త్రివేణి సంగమం కాళేశ్వరం వద్ద క్రమంగా వరద పెరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి ప్రాణహిత వరద పోటెత్తడంతో 35 గేట్లు ఎత్తి 165,394 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు తుపాకులగూడెం వద్ద సమ్మక్క బ్యారేజ్ కి గోదావరితో పాటు ఇంద్రావతినది వరద భారీగా వచ్చి చేరుతుండడంతో 33 గేట్లు ఎత్తి లక్షా 95 వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బోగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లా వ్యాప్తంగా 8.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగ, కొన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వాజేడు మండలం బొగత జలపాతంకు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రమాద స్థాయిలో వరద ఉధృతి కొనసాగుతోంది జలపాతం వద్దకు పర్యటకుల సందర్శనను ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. ములుగు, భూపాలపల్లి జిల్లాలో జలాశయాలు జలకళను సంతరించుకున్నాయి. (కిలో కూరగాయలు రూ.20కే!.. ఎక్కడో తెలుసా!) ఉప్పొంగిన వాగులు.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవాహిస్తున్నాయి. దీంతో అనేక గ్రామాల ప్రజలు బాహ్యప్రపంచంతో సంబంధాలు కోల్పోయారు. తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కుమ్రంబీమ్ జిల్లా లో పెన్ గంగా, ప్రాణహిత పరివాహక ప్రాంతాలలో కలెక్టర్ హెమంత్ బోర్కడే ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా, ఉత్తర తెలంగాణకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, జగిత్యాల జిల్లాల్లో అతిభారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. (ఇండియానే కాదు, చైనాను కూడా వర్షాలు వణికిస్తున్నాయి) -
తెలంగాణలో మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు
-
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మంగళవారం కోస్తా తీరంలో స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉంది. ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాల మీదుగా చత్తీస్ఘడ్ వరకు సగటు సముద్రమట్టం వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. (చదవండి: గుడ్‌న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’) -
Rain Alert: తీవ్ర అల్పపీడన ప్రభావం.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, కరీంనగర్ జిల్లాల్లో పలుచోట్ల శనివారం భారీ వర్షాలు కురిశాయి. చాలాచోట్ల ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోనే అత్యధికంగా మెదక్ జిల్లా టేక్మాల్‌లో 16.3 సెంటీమీటర్ల కుండపోత వాన కురిసింది. దీంతో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం జలదిగ్బంధమైంది. కాగా వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారిందని.. దాని ప్రభావంతో ఆది, సోమవారాలు కూడా రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని.. గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. ఇక నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. ఈ రెండు రోజుల పాటు అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని సూచించింది. కాగా.. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపా కకు చెందిన చందా రమ (47) పొలంలో పని చేస్తుండగా పిడుగుపడి మృతి చెందింది. ఇదీ చదవండి: కదలని నేతలు అవుట్.. టీపీసీసీ ప్రక్షాళనపై హైకమాండ్ దృష్టి! -
రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వానలు.. రెండు రోజులు ఇదే పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ వర్షాలు కురుస్తున్నాయి. చాలాచోట్ల ఓ మోస్తరు వర్షం కురియగా.. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అయితే బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రిదాకా వర్షం పడుతూనే ఉంది. పలుచోట్ల నాలుగు నుంచి ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. దాదాపు వంద కూడళ్ల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. మూసీలో వరద పోటెత్తడంతో మూసారాంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపివేశారు. భారీగా పిడుగుపాటు ఘటనలు కుమురంభీం జిల్లా కౌటాల మండలం పార్డి గ్రామానికి చెందిన నౌగడే మాయబాయి (41), మంచిర్యాల జిల్లా వెంకట్రావుపేట గ్రామానికి చెందిన రైతు సత్తయ్య ఇద్దరూ చేనులో పనిచేస్తూ పిడుగుపాటుకు గురై మరణించారు. ఇక కౌటాల మండలం కనికి గ్రామంలో మందడే నానుబాయి, ఆమె ఇద్దరు కుమారులు పిడుగుపాటుకు గురై గాయపడ్డారు. వీరిలో నానుబాయి పరిస్థితి విషమంగా ఉంది. కుమురంభీం జిల్లా చింతలమానెపల్లి మండలం బాలాజీ అనుకోడ గ్రామంలో పిడుగుపాటు మేకల కాపరి లక్ష్మణ్ గాయపడ్డాడు. చదవండి: హైదరాబాద్‌లో రాగల 24 గంటల్లో భారీ వర్షం మంజీర నది ఆవతలి ఒడ్డున చిక్కుకున్న గొర్రెలకాపరులు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం ఇత్వార్పేట్కు చెందిన సయ్యద్ గౌసొద్దీన్ (35) సమీపంలో పిడుగు పడటంతో శబ్ధానికి భయపడి పరుగెత్తి కాల్వలో పడి మృతి చెందాడు. కాగా.. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రానికి చెందిన ఎల్లాపురం ఆశయ్య, పోతంశెట్టిపల్లి గ్రామానికి చెందిన చాకలి దుర్గయ్య మేకలు మేపేందుకు హనుమాన్ బండల్ సమీపంలోని కుర్వగడ్డకు వెళ్లి మంజీరా నది మధ్యలో చిక్కుకున్నారు. మరో రెండు రోజులు వానలు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. దాని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వచ్చే రెండు రోజులు వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలొచ్చే అవకాశం ఉందంది. గురు, శుక్రవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. -
TS: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఒడిశా, దాన్ని అనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీ డనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
Hyderabad: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు
సాక్షి, సిటీబ్యూరో: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురువారం నగరంలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వరుసగా కురుస్తున్న వర్షాలతో ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. సాధారణ జనజీవనం స్తంభించింది. వర్షంతో పలు ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఇక్కట్లు తలెత్తాయి. రానున్న 24 గంటల్లో నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ ప్రాంతాల్లో తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జంట జలాశయాలతోపాటు మూసీలోకి వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు గండిపేట్ జలాశయంలోనికి 1800 క్యూసెక్కుల వరద నీరు చేరగా.. ఆరు గేట్లను ..నాలుగు అడుగుల మేర తెరచి 2328 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలారు. హిమాయత్సాగర్లోనికి 2500 క్యూసెక్కుల వరద నీరు చేరగా..నాలుగు గేట్లను రెండు అడుగుల మేర తెరచి 2532 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదిలిపెట్టినట్లు జలమండలి ప్రకటించింది. చదవండి: ముంపు ప్రాంతాల్లో కొత్త నిర్మాణాలు బంద్! -
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు, జీహెచ్ఎంసీ అత్యవసర భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గురువారం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో నేటి సాయంత్రం వానలు కురిశాయి. అయితే, మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు వర్షాలపై జీహెచ్ఎంసీ అత్యవసరంగా సమావేశమైంది. జీహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 040-21111111, 040-29555500 వాగులో ప్రాణాలు అరచేతపట్టుకుని కామారెడ్డి జిల్లాలోని శెట్పల్లి వాగులో చిక్కుకుపోయిన ముగ్గురిని స్థానికులు,పోలీసుల సహకారంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కాపాడారు. చేపల వేటకు వెళ్లిన ముగ్గురు వ్యక్తులు వరద ఉధృతి ఎక్కువ కావడంతో చెట్టెక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చెట్టుపైనే ఉండి సాయం కోసం ఎదురుచూశారు. విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఘటనస్థలానికి పంపించారు. తాడు సాయంతో వారు బాధితులను ఒడ్డుకు చేర్చారు. దీంతో కొన్ని గంటల ఉత్కంఠకు తెరపడింది. స్థానికులు మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఒడ్డుకు చేరిన అనంతరం బాధితులతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. -
తెలంగాణలో భారీ వర్షం.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. మహబూబాబాద్, జనగామ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. మరో రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ తెలంగాణలో భారీ వర్షాలు, పలుచోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్లు పేర్కొంది. హాఫీజ్పేట్లో అత్యధికంగా 9.85 సెంమీ వర్షపాతం నమోదైంది. బాలానగర్ 9.83 సెం.మీ, గాజుల రామారం 9.7 సెం.మీ, బాలాజీనగర్ 8.7 సెం.మీ, రాజేంద్రనగర్‌లో 8.5 సెం.మీ వర్షపాతం జీడిమెట్ల 9.7 సెం.మీ రాజేంద్రనగర్ 8.2 సెం.మీ,కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లిలో 8 సెం.మీ వర్షపాతం, మాదాపూర్ 7.65 సెం.మీ, మౌలాలీ 7.25 సెం.మీ, నెరేడ్మెట్ 7.1 సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇక మచ్చబొల్లారం, జగద్గిరిగుట్ట, మియాపూర్, ఆర్సీపురం, రంగారెడ్డినగర్‌లో 6 సెం.మీ వర్షాపాతం, ఫతేనగర్, హెచ్‌సీయూ, మోతీనగర్‌లో 5 సెం.మీ వర్షాపాతం నమోదైంది. To whomever it may concern, due to heavy rain water has been logged near Moosapet metro station. It's causing damage and inconvenience. We hope it'll get addressed at the earliest.#Telanganarains #HyderabadRains @imdhydofficial @balaji25_t @KTRTRS pic.twitter.com/UbBGGn50e8 — Tanjeeb Saqueeb (@TSaqueeb) July 22, 2022 ఇక హైదరాబాద్‌లో రాగల 48 గంటలపాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. హైదరాబాద్‌లో ఏకధాటిగా కురుస్తున్న వర్షంతో మోకాళ్లలోతు నీళ్లు వచ్చాయి. రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. What can a few hours rain do to you? #HyderabadRains vanakalamchaduvulu 🤨 pic.twitter.com/6OsU8nByU6 — Doesn'tmatter (@doesntmatter2uu) July 22, 2022 Sai Anurag colony near Bachupally #HyderabadRains pic.twitter.com/yu8mms4l5f — VasanSS (@SsVasanssdgl) July 22, 2022 -
Kadem Project: కడెంపై ఆ 9 మంది ‘చివరి’ సెల్ఫీ..! ఉగ్ర గోదారి ఉరిమి చూస్తే!
నిర్మల్/కడెం: గోదావరి మహోగ్రరూపాన్ని కడెం ప్రాజెక్టు సిబ్బంది కళ్లారా చూశారు. క్షణం ఆలస్యమైనా వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేది. ప్రాజెక్టుపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డ్యామ్ సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. అప్పటికే 5 లక్షల క్యూసెక్కులు వస్తున్నా పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఇంతలో వరద ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఈఈ రాజశేఖర్.. కలెక్టర్ ముషరఫ్ అలీకి ఫోన్ చేసి పరిస్థితి వివరించారు. మీరందరూ వెంటనే డ్యామ్ వదిలి వెళ్లిపోవాలని కలెక్టర్ గట్టిగా ఆదేశించడంతో గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ సెల్ఫీ ఫొటో తీసుకుని వచ్చేశారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్ఈ సునీల్ పరిస్థితిని చూసివద్దామంటూ ఈఈ రాజశేఖర్, డీఈ భోజదాస్, గేట్ ఆపరేటర్లు చిట్టి, సంపత్‌లను వెంటబెట్టుకుని వెళ్లారు. తాము అక్కడికి వెళ్లిన కాసేపటికే వరద ఒక్కసారిగా పోటెత్తిందని, ప్రాజెక్టు పై నుంచి నీళ్లు ఉప్పొంగాయని, దీంతో వెంటనే తమ బైక్ అక్కడే వదిలేసి, ఎస్ఈ కారులో వచ్చేశామని గేట్ ఆపరేటర్లు తెలిపారు. డ్యామ్‌పై నుంచి సునామీలా వచ్చిన వరదను చూసి వణికి పోయామని చెప్పారు. -
వరద విరుచుకుపడినా నిలబడిన కడెం.. చరిత్రలో తొలిసారి భీకర దృశ్యాలు
నిర్మల్/కడెం: సముద్రం నుంచి సునామీ దూసుకువస్తోందా అన్నట్టు కడెం ప్రాజెక్టుపై వరద పోటెత్తింది. చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ప్రాజెక్టు పైనుంచి వరద ప్రవహించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి 5 లక్షల క్యూసెక్కులు వస్తుంటేనే కడెం గుండె దడదడలాడింది. అధికారులు, సమీప గ్రామాల ప్రజలు వణికిపోయారు. అలాంటిది బుధవారం రాత్రి 2 గంటల తర్వాత ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద దూసుకొచ్చింది. ఎత్తిన 17 గేట్లతో పాటు (ఒక గేటు పనిచేయడం లేదు) ఎడమకాలువకు పడ్డ గండి నుంచి 3.5 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తుండగా అంతకు దాదాపు రెట్టింపు స్థాయిలో వచ్చిన వరద ప్రాజెక్టుపై నుంచి పొంగింది. అలా దాదాపు మూడునాలుగు గంటల పాటు కొనసాగింది. ఇక ప్రాజెక్టు కొట్టుకుపోవడం ఖాయమని భావించిన సిబ్బంది వదిలేసి వచ్చేశారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ, అంతటి తాకిడినీ తట్టుకుని ఆనకట్ట చెక్కుచెదరకుండా నిలబడింది. రెండు గేట్ల కౌంటర్ వెయిట్ దిమ్మెలు మాత్రం కొట్టుకుపోయాయి. గేట్ల గదులు, ప్రాజెక్టు పైభాగం మొత్తం వరద తాకిడితో వచ్చిన చెట్లు, చెట్లకొమ్మలు, చెత్తా చెదారంతో నిండిపోయాయి. ఈ కారణంగా గేట్లను దించడానికి వీలు లేని పరిస్థితి ఏర్పడటంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోంది. ఎన్నడూ చూడని వరద ఉధృతి కడెం ప్రాజెక్టుకు తొలిసారి ఈస్థాయి ఇన్‌ఫ్లో వచ్చింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వరదను చూడలేదని అధికారులు, స్థానికులు పేర్కొన్నారు. 1958లో ఒకసారి 5.10 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. (అప్పట్లో 9 గేట్లే ఉండేవి) దిగువన మొత్తం నీటమునిగింది. భారీ వరదకు డ్యామ్ ఒకవైపు కోతకు గురయ్యింది. ఆ ప్రమాదం తర్వాత మరో తొమ్మిది గేట్లను నిర్మించి, ప్రాజెక్టు ఎత్తును కూడా పెంచారు. అయితే 1995లో 4 లక్షల క్యూసెక్కుల వరద రాగా డ్యామ్ ఎడమ కాలువ వద్దనే గండిపడింది. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఏకంగా 6.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి ప్రాజెక్టుపై నుంచి పారింది. ఈసారి కూడా ఎడమవైపు గండిపడటం వల్లే కట్ట ఆగిందని చెబుతున్నారు. ప్రాజెక్టు ఎడమకాలువ వద్ద గండి పడటంతో కోతకు గురైన ప్రాంతం ప్రాజెక్టు నిలిచింది..నష్టం మిగిల్చింది కడెం ప్రాజెక్టు పైభాగమంతా అటవీ ప్రాంతమే ఉంటుంది. భారీ వర్షాలు కురిసినప్పుడు అధికారులు అంచనా వేసే లోపే ఎగువన ఉన్న వాగులన్నీ పొంగి ప్రాజెక్టులోకి వరద వేగంగా వచ్చేస్తుంది. ఈవిధంగా మంగళవారం అర్ధరాత్రి నుంచి గురువారం వేకువ జాము వరకు పోటెత్తిన వరదతో కడెం ప్రాజెక్టు చాలావరకు దెబ్బతింది. భారీ నష్టాన్ని మిగిల్చింది. ప్రాజెక్టు ఒకటి, రెండు గేట్ల కౌంటర్ వెయిట్లు కొట్టుకుపోయాయి. వరద గేట్లను ఎత్తి దించేందుకు ఈ దిమ్మెలు ఉపయోగపడతాయి. 2018లో కూడా రెండో నంబర్ గేటు కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది. ఇక వరద గేట్లలో మొత్తం చెత్త పేరుకుపోవడం, ఎలక్ట్రికల్ కనెక్షన్లు దెబ్బతినడంతో వాటిని సరిచేయడం ఇప్పట్లో కుదరని పని అని అంటున్నారు. ఎడమ కాలువకు గండిపడ్డ ప్రాంతంలో వందమీటర్ల మేర కాలువ కోతకు గురైంది. వరద ఉధృతికి ప్రాజెక్టు దిగువన సైడ్‌వాల్స్ మొత్తం దెబ్బతిన్నాయి. కొనసాగుతున్న అవుట్ ఫ్లో ప్రస్తుతం 17 గేట్ల ద్వారా దిగువకు అవుట్‌ఫ్లో కొనసాగుతూనే ఉంది. గురువారం రాత్రి 9 గంటలకు మొత్తం 700 అడుగులకు గానూ 684.725 అడుగుల నీటిమట్టం, మొత్తం 7.603 టీఎంసీలకు గానూ 4.259 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,25,582 క్యూసెక్కులు ఉండగా అదేస్థాయిలో వరద దిగువకు వెళుతోంది. పెను ప్రమాదం తప్పింది: మంత్రి కడెం ప్రాజెక్టుకు పెనుప్రమాదం తప్పిందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. గురువారం సాయంత్రం అధికారులతో కలిసి ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించారు. పరిస్థితిని పరిశీలించారు. కడెం వాగుకు పూజలు చేశారు. -
రెండ్రోజులు మరిన్ని వానలు! ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు రోజులుగా దంచికొడుతున్న వానలు గురువారానికి కాస్త నెమ్మదించాయి. గురువారం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు నమోదుకాగా.. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం 3.95 సెంటీమీటర్లుగా నమోదైంది. బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం మధ్యాహ్నం వరకు అత్యధికంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో 29.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరికొన్ని చోట్లా భారీ వర్షాలు పడ్డాయి. గురువారం మధ్యాహ్నం తర్వాత చాలా చోట్ల వర్షాలు తెరిపినిచ్చాయి. శుక్ర, శనివారాల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. అయితే ఏ జిల్లాకు కూడా రెడ్ అలర్ట్ జారీ చేయలేదు. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను ప్రకటించింది. బలహీనపడ్డ అల్పపీడనం: ఒడిశా, కోస్తాంధ్ర పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో మూడు రోజులుగా కొనసాగిన తీవ్ర అల్పపీడనం గురువారం ఉదయం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. అయితే దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోందని.. దాని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో తెలంగాణ వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సీజన్లో 52.49 సెంటీమీటర్ల వర్షపాతం: ఏటా నైరుతి సీజన్లో 72.58 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాలి. అందులో జూలై 14కి 22.66 సెంటీమీటర్లు కురవాలి. కానీ ఈసారి ఏకంగా 52.49 సెం.మీ వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది. అంటే మొత్తం నైరుతి రుతుపవనాల కాలంలో కురిసే వర్షంలో మూడింట రెండొంతులు ఇప్పటికే కురిసినట్టు తెలిపింది. -
గర్భిణిని రక్షించేందుకు వరదలోకి దిగి.. ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతి
దహెగాం(సిర్పూర్)/శ్రీరాంపూర్: పురిటినొప్పులు పడుతున్న ఓ గర్భిణిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు వెళ్లి గల్లంతైన ఇద్దరు రెస్క్యూ సిబ్బంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా పెద్దవాగులో బుధవారం గ్రామస్తులను వాగు దాటించేందుకు ప్రయత్నిస్తుండగా ఇద్దరు రెస్క్యూ సిబ్బంది గల్లంతయ్యారు. వీరి కోసం రాత్రి నుంచి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తుండగా.. గురువారం ఉదయం మృతదేహాలు లభ్యమయ్యాయి. వివరాలు.. భారీ వర్షాలకు కుమురంభీం, వట్టివాగు ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో పెద్దవాగు ఉప్పొంగి దహెగాం మండలంలో పలుచోట్ల ప్రధాన రహదారిపైకి వరదనీరు చేరింది. మండలంలోని బీబ్రా గ్రామానికి చెందిన నేర్పల్లి సరస్వతికి బుధవారం పురిటి నొప్పులు రావడంతో దహెగాం పీహెచ్‌సీకి తరలించేందుకు బంధువులు ఏర్పాట్లు చేశారు. దహెగాం, ఐనం, పెసరికుంట వద్ద పెద్దవాగు వరద కారణంగా ముందుకు వెళ్లలేని పరిస్థితి. మధ్యాహ్నం కాగజ్‌నగర్ రూరల్ సీఐ నాగరాజు, స్థానికులు ట్రాక్టర్ సాయంతో దహెగాం సమీపంలో ప్రధాన రహదారిపై వరద దాటే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ మొరాయించడంలో వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న సింగరేణి రెస్క్యూ టీంకు చెందిన ఆరుగురు తిరుపతి, మధుకర్, నర్సింగ్, చిలుక సతీష్, అంబాల రాము, గణేశ్ దహెగాంకు చేరుకున్నారు. గణేశ్ బయట ఉండగా మిగిలిన ఐదుగురు, సీఐ నాగరాజు, మర్రిపల్లి గ్రామానికి చెందిన బాదవత్ తిరుపతి, జర్పుల శ్యాం, జర్పుల సతీశ్ మొత్తం తొమ్మిది మంది తాడు సాయంతో వరద నీటిలోకి దిగారు. ఒకరికొకరు రెండు మీటర్ల దూరంలో ఉంటూ దాటుతుండగా రెస్క్యూటీం సభ్యులు సీహెచ్ సతీశ్, రాము నీటిలో గల్లంతయ్యారు. మిగిలిన వారు ఒడ్డుకు చేరుకుని విషయం అధికారులకు తెలిపారు. అక్కడే ఉన్న ఆర్డీవో దత్తు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు చేరవేశారు. అదనపు కలెక్టర్ రాజేశం ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మూడు బృందాలతో గాలింపు.. విషయం తెలియగానే శ్రీరాంపూర్ జీఎం సంజీవరెడ్డి ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిస్థితిపై చర్చించారు. శ్రీరాంపూర్ నుంచి మరో మూడు రెస్క్యూ బృందాలను ఘటన స్థలానికి పంపించారు. మందమర్రి, బెల్లంపల్లి నుంచి మరో రెండు బృందాలను పంపారు. పరిస్థితిని ఎప్పకటికప్పుడు అక్కడికి వెళ్లిన వారితో చర్చించారు గర్భిణి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం.. బీబ్రా గ్రామంలో ఉన్న గర్భిణి నేర్పల్లి సరస్వతిని ఆస్పత్రికి తరలించేందుకు వరంగల్ నుంచి 22 సభ్యులతో కూడిన ఎన్డీఆర్ఎఫ్ బృందం దహెగాంకు చేరుకుంది. నాలుగు బోట్ల సాయంతో మెడికల్ సిబ్బంది గ్రామానికి బయలుదేరారు. గనులపై ఆందోళన.. రామకృష్ణాపూర్ రామాలయం సమీపంలో నివాసం ఉంటున్న అంబాల రాము ఆర్కే 5 గనిలో జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య స్పందన, రెండేళ్ల కుమారుడు ఉన్నాడు. గని మేనేజర్ అబ్దుల్ ఖాదర్, సంక్షేమ అధికారి రణధీర్, టీబీజీకేఎస్ నేతలు మహేందర్‌రెడ్డి, నీలం సదయ్య కార్మికుడి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అలాగే నస్పూర్ షిర్కేలో నివాసం ఉంటున్న చిలుక సతీశ్ శ్రీరాంపూర్ ఓసీపీలో ఈపీ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదిలా ఉంటే ఆపరేషన్‌లో పాల్గొన్న రెస్క్యూ సభ్యులెవ్వరూ లైఫ్ జాకెట్లు ధరించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. రెస్క్యూ స్టేషన్ నుంచి వీరిని పంపిన అధికారులు జాకెట్లు ఇచ్చి పంపారా లేదా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. -
Telangana: మరో మూడు రోజులు భారీ వర్షాలు.. 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్
సాక్షి, హైదరాబాద్: గత అయిదు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న తెలంగాణ ప్రజలకు మరో షాక్ తగిలినట్లైంది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు పడనున్నట్లు వాతావారణ విభాగం తెలిపింది. దాంతోపాటు ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, జనగామ జిల్లాల్లో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. అయితే రానున్న మూడు రోజులు కూడా భారీ వర్షాలు పడనున్న క్రమంలో తెలంగాణలో విద్యాసంస్థల సెలవుల పొడిగింపుపై విద్యాశాఖ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రాష్ట్రం తడిసి ముద్దయింది. ఊరూ వాడా.. వాగూ వంకా.. ఏరులై పారుతున్నాయి. నది పరివాహక ప్రాంతాలు, ప్రాజెక్టుల వద్ద వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అనేకచోట్ల జనజీవనం స్తంభించింది. కొన్నిచోట్ల అలుగు దుంకుతున్న చెరువులతో అందాలు జాలువారుతున్నాయి. మరికొన్ని కట్టలు తెగి ఊళ్లను, చేలను ముంచెత్తుతున్నాయి. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మంగళవారం నాటికి రాష్ట్రంలో 49 చెరువులు పూర్తిగా తెగిపోయాయి. మరో 43 చెరువులకు గండ్లు పడ్డాయని అధికారులు చెబుతున్నారు. అలాగే, 25 కాల్వలకు సైతం గండ్లు పడ్డాయి. చదవండి: Photo Feature: దంచికొట్టిన వానలు.. స్తంభించిన రాకపోకలు -
పలిమెల.. విలవిల, మూడు రోజులుగా బాహ్య ప్రపంచంతో బంధం కట్
భూపాలపల్లి: ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర–తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలిమెల మండలం జలదిగ్బంధంలో చిక్కుకుని విలవిలలాడుతోంది. ఐదురోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు పలురోడ్లు, బ్రిడ్జీలు కోతకు గురవడంతో రవాణా సౌకర్యం స్తంభించింది. ఏడు 33 కేవీ విద్యుత్ లైన్ స్తంభాలు కూలిపోవడంతో కరెంటు సరఫరా నిలిచిపోయింది. మూడురోజులుగా మండలానికి వెలుపల ఉన్న బాహ్యప్రపంచంతో సంబంధం తెగిపోయింది. మండలంలో 8 గ్రామపంచాయతీలు ఉన్నాయి. మొత్తం జనాభా సుమారు 7,500 ఉంటుంది. ఈ మండలానికి మూడు వైపుల ఉన్న దారులు స్తంభించాయి. మండల ప్రజలు వివిధ అవసరాల నిమిత్తం ఎక్కువగా మహదేవ్పూర్ మీదుగా జిల్లాకేంద్రానికి వస్తుంటారు. శనివారంరాత్రి ఆ దారిలోని పెద్దంపేట వాగు ఉధృతంగా ప్రవహించడంతో మధ్యలోని బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురైంది. పక్కనే పొలాల్లో ఉన్న ఏడు 33 కేవీ కరెంటు లైన్ స్తంభాలు కూలిపోయాయి. గర్భిణి రజితను వాగు దాటించి తీసుకొస్తున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం దీంతో ఆ మండలం మొత్తానికి శనివారంరాత్రి నుంచి రవాణా, విద్యుత్ సరఫరా నిలిచిపోయాయి. తాగు, వంట, ఇతర అవసరాలకు వర్షపు నీరే దిక్కు అయింది. మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో పలువురు యువకులు ట్రాలీలు, కార్లు, ట్రాక్టర్ల బ్యాటరీలతో సెల్ఫోన్లు చార్జింగ్ చేసుకొని అధికారులకు సమాచారం చేరవేస్తున్నారు. మండల ప్రజల దయనీయ పరిస్థితి తెలుసుకొని కలెక్టర్ భవేశ్ మిశ్రా వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని పిలిపించారు. గర్భిణులతోపాటు పాలు, కూరగాయల వ్యాపారులను వాగు దాటిస్తూ ఆపత్కాలంలో సేవలు అందిస్తున్నారు. వైద్య సిబ్బంది పలుచోట్ల వాగులు దాటుకుంటూ వచ్చి నలుగురు గర్భిణులను ప్రభుత్వాసుపత్రులకు తరలించి ప్రసవాలు చేశారు. పలిమెల, పంకేన గ్రామాలకు పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా తాగునీరు సరఫరా చేశారు. మండల కేంద్రంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ట్రాక్టర్ బ్యాటరీతో సెల్ చార్జింగ్ పలిమెల: విద్యుత్ సరఫరా లేక ఫోన్ చార్జింగ్కు ఇబ్బంది ఏర్పడటంతో ఒక రైతు వినూత్నంగా ట్రాక్టర్ బ్యాటరీతో ఇన్వర్టర్ ఏర్పాటు చేశాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఫోన్లు మూగబోయాయి. దీంతో మండల కేంద్రంలో వంగల శివ అనే రైతు సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ట్రాక్టర్ బ్యాటరీ సహాయంతో ఇన్వర్టర్ ఏర్పాటు చేశాడు. దానికి స్విచ్ బోర్డు కనెక్షన్ ఇచ్చాడు. ఈ విషయం తెలియడంతో స్థానికులతోపాటు సమీప గ్రామాల ప్రజలు ట్రాక్టర్ నడిచేందుకు డీజిల్ తెచ్చి శివకు అందిస్తున్నారు. ట్రాక్టర్ ఇంజన్‌ను ఆన్‌లో ఉంచుతూ ఫోన్లు చార్జింగ్ చేసుకుంటున్నారు. (క్లిక్: 64 ఏళ్ల రికార్డు బద్దలు.. దడ పుట్టిస్తున్న‘కడెం’ ప్రాజెక్టు) -
పాల ధారల జలపాతాలు చూసొద్దామా!
-
భారీ వర్షాలు.. ప్రజలను హెచ్చరించిన సీఎం కేసీఆర్
-
తెలంగాణలో భారీ వర్షాలు నీట మునిగిన కాలనీలు
-
సాక్షి కార్టూన్: 11-06-2022
-
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్ష బీభత్సం
-
హైదరాబాద్‌లో 35వేల ఉద్యోగాలకు గండి
హైదరాబాద్ : భాగ్యనగరాన్ని ముంచెత్తున్న భారీ వర్షాలు రోజువారీ కూలీల జీవనాధారానికి గండికొడుతున్నాయి. ఈ వర్షాలతో 35వేలకు పైగా రోజువారీ కూలీలు రోడ్డున పడుతున్నారు. వరదలు తగ్గుముఖం పట్టి యూనిట్లను పునరుద్ధరించేంత వరకు పని ప్రారంభించమని పరిశ్రమల యాజమాన్యాలు తేల్చేయడంతో రోజువారీ వర్కర్లకు ఏం చేయాలో పాలుపోలేని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు పరిశ్రమల యాజమాన్యాలకు ఈ వర్షాలు భారీ నష్టాన్నే మిగులుస్తున్నాయి. ఇప్పటికే పరిశ్రమలు రూ.1000 కోట్ల వరకు నష్టపోయి ఉంటారని ఏపీ, తెలంగాణ చాంబర్స్ వాణిజ్య పరిశ్రమల ఫెడరేషన్ అధ్యక్షుడు రవింద్ర మోదీ అంచనావేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా యూనిట్లలో ఈ నష్టం ఎక్కువగా ఉండొచ్చన్నారు. కుత్భులాపూర్, దులపల్లి, జీడిమెట్ల, చీర్లపల్లి, కూకట్పల్లి, బాలానగర్‌లో పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిశ్రమలో జీవానాధారం కోసం సిటీకి వచ్చిన ఇతర రాష్ట్రాల కూలీలు వేలల్లో పనిచేస్తున్నారు. కానీ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పరిశ్రమలన్నీ ముప్పుకు గురయ్యాయి. పరిశ్రమలోని ముడిసరుకు, యంత్రాలు పాడైపోయ్యాయి. ఫ్యాక్టరీ యాజమాన్యాలు పనిని ఆపివేశాయి. దీంతో ఈ పరిశ్రమల్లో పనిచేసే బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్ వర్కర్లు కడుపులు మాడ్చుకోవాల్సి పరిస్థితి నెలకొంది. "ఎలక్ట్రిక్ బల్బ్ తయారీ ఫ్యాక్టరీలోపనిచేస్తున్నాను. ప్యాక్టరీకి వెళ్లి చూస్తే, వరద నీరు తగ్గే వరకు పనిచేయడానికి కుదరని పరిస్థితి నెలకొంది. రెండు నెలల వరకు ఫ్యాక్టరీ పునఃప్రారంభం కాదని కనిపిస్తోంది. దీంతో గత కొన్ని రోజులుగా చేతిలో పనిలేక తినడానికి తిండి కూడా దొరకడం లేదు" ఒడిశా నుంచి వచ్చిన ఓ వర్కర్ తన బాధను వెల్లబుచ్చుకున్నాడు. జీడిమెట్ల పరిసర ప్రాంతాల్లో చాలా పరిశ్రమలది ఇదే పరిస్థితి. వరదలతో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడిందని, రోడ్డు మార్గాలు పూర్తిగా దెబ్బతిన్నాయని బాలానగర్, జీడిమెట్ల ఇండస్ట్రియల్ అసోసియేషన్ మెంబర్ శ్రీరామ మూర్తి తెలిపారు. ఇంజనీరింగ్, ప్లాస్టిక్, బుల్క్ డ్రగ్స్, ఫుల్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వర్షాల దెబ్బకు బాగా ప్రభావితమయ్యాయని చెప్పారు. దులపల్లి, జీడిమెట్లలోని తమ రెండు స్టోరేజ్ ఫెసిలిటీస్‌లో నాలుగైదు రోజుల నుంచి ఐదు అడుగుల ఎత్తులో మురుగు నీరు ప్రవహిస్తుందని పేర్కొన్నారు. 300 టన్నుల పెట్రో-కెమికల్ ఉత్పత్తులు వరద బారిన పడినట్టు ఆవేదన వ్యక్తంచేశారు.ఇప్పటికీ యూనిట్లలోకి ప్రవేశించడానికి కుదరడం లేదని ఆయుష్మాన్ మెర్చంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ దుగాడ్ తెలిపారు. తమకు రూ.90 లక్షల నుంచి కోటి వరకు నష్టం ఏర్పడిందన్నారు.