
సాక్షి, హైదరాబాద్: ఏపీలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మంగళవారం కోస్తా తీరంలో స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉంది. ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశాల మీదుగా చత్తీస్‌ఘడ్ వరకు సగటు సముద్రమట్టం వరకు విస్తరించి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
(చదవండి: గుడ్‌న్యూస్: ఉద్యోగులకు ‘ఈ–స్కూటర్లు’)
Comments
Please login to add a commentAdd a comment