సాక్షి, హైదరాబాద్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఒడిశా, దాన్ని అనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
దీంతో రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీ డనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment