సాక్షి, హైదరాబాద్: నగరానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం కుండపోత వర్షం కురవొచ్చని హెచ్చరించింది. ఆ అంచనాకు తగ్గట్లే పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంతో పాటు పాటు శివారుల్లోనూ భారీగా వర్షం పడుతున్నట్లు సమాచారం. దీంతో నగరవాసుల్లో వణుకు మొదలైంది.
భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ సూచిస్తోంది. లోతట్టు ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆఫీసులు అయిపోయే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో.. నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.
ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికే అలర్ట్ కాగా.. చాలా చోట్ల ఇప్పటికే నెమ్మదిగా ట్రాఫిక్ ముందుకు సాగుతోంది.
Heavy Downpour started in Kukutpalli #HyderabadRains .@balaji25_t https://t.co/MqsBHdcmXM pic.twitter.com/CgfI4uCwow
— Vudatha Nagaraju (@Pnagaraj77) July 31, 2023
Comments
Please login to add a commentAdd a comment