Heavy Rains Forecast
-
Tirumala: తిరుమలపై ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్
-
#APHeavyRains : ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (ఫొటోలు)
-
ఏపీకి 4 రోజుల పాటు భారీ వర్షం
-
అల్పపీడనం ప్రభావం..నెల్లూరు జిల్లాలో భారీ వర్షం (ఫొటోలు)
-
విజయవాడ ఇంద్రకీలాద్రిపై విరిగిపడ్డ కొండచరియలు
-
వరదతో ఎర్రకాలువ ఉగ్రరూపం 20 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు
-
బిగ్ అలర్ట్.. ఈ తెలంగాణ జిల్లాలకు అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. మరో రెండ్రోజులపాటు ఈ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు ఉంటాయని తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు రాజధాని హైదరాబాద్‌ను కూడా భారీ వర్షం ముంచెత్తే అవకాశం ఉందని తెలిపింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రెండు నుంచి మూడు రోజులపాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. అలాగే బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా నిన్నటి నుంచి వర్షం కురుస్తూనే ఉంది. వాగులు, వంకలు పొంగుతున్నాయి. ఇక ఇవాళ(శనివారం) సాయంత్రం హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణ శాఖ తాజా ప్రకటనతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. -
రెడ్ అలర్ట్.. తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు
హైదరాబాద్, సాక్షి: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాబోయే మూడు రోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ.. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.తెలంగాణలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. దాదాపుగా తెలంగాణ రాష్ట్రమంతటా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములతో కూడిన వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఖమ్మం, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లోని పలు చోట్ల ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో దక్షిణ భాగంలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఉత్తరం వైపు మరో అల్పపీడనం ఏర్పడింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం కుండపోత వర్షం కురవొచ్చని హెచ్చరించింది. ఆ అంచనాకు తగ్గట్లే పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంతో పాటు పాటు శివారుల్లోనూ భారీగా వర్షం పడుతున్నట్లు సమాచారం. దీంతో నగరవాసుల్లో వణుకు మొదలైంది. భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచిస్తోంది. లోతట్టు ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆఫీసులు అయిపోయే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో.. నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికే అలర్ట్ కాగా.. చాలా చోట్ల ఇప్పటికే నెమ్మదిగా ట్రాఫిక్ ముందుకు సాగుతోంది. Heavy Downpour started in Kukutpalli #HyderabadRains .@balaji25_t https://t.co/MqsBHdcmXM pic.twitter.com/CgfI4uCwow — Vudatha Nagaraju (@Pnagaraj77) July 31, 2023 -
భారీ నుంచి అతి భారీ వర్షాలు.. నేడు స్కూళ్లకు సెలవు
సాక్షి న్యూఢిల్లీ: భారీ వర్షాలతో ఉత్తరభారతం అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఎడతెరిపిలేని వానలతో దేశ రాజధాని ఢిల్లీలో జనజీవనం అస్తవ్యస్తమైనది. ఇప్పుడు దేశ వాణిజ్య రాజధాని ముంబై వంతు వచ్చింది. దంచి కొడుతున్న వానలు నగరాన్ని ముంచెత్తుతున్నాయి. నేడు అనగా గురువారం కూడా ముంబైకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ మేరకు ప్రజలను అప్రమత్తం చేస్తూ ముంబైలోని కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ముంబైలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే అధికారు లను అలర్ట్ చేశారు. అవసరమైన అన్ని సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలను ఆ పరిసర ప్రాంతాల్లో ఉండే ఇతర సముదాయాలను కాస్త ముందుగానే మూసివేయాలని సూచించారు. #WATCH | Maharashtra: Heavy rain lashes parts of Mumbai. IMD has issued a 'Red' alert for Palghar, and Raigad districts and an 'Orange' alert for Thane, Mumbai and Ratnagiri today. pic.twitter.com/HR0KUqGCPZ — ANI (@ANI) July 19, 2023 తద్వారా జనం త్వరగా ఇళ్లకు చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు ఎప్పుడు తెరవాలో పరిస్థితులను బట్టి స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ముంబై తో పాటు పాల్గర్, రాయఘడ్ జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ శాఖ సూచనతో పాల్గర్, రాయఘడ్ జిల్లాల్లో కూడా నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. -
జర పైలం: మరో మూడు రోజులు మస్తు వానలే.. ఈ జిల్లాల్లో జాగ్రత్త!
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది. pic.twitter.com/RPhZIciJTL — IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2022 కాగా, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాద్రాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి. సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. pic.twitter.com/qRCs1YJSXV — IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2022 -
AP Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం (నేడు) ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఐదారు జిల్లాలు మినహా అన్నిచోట్లా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లాలోని పలుచోట్ల కుండపోతగా వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక వైఎస్సార్, ప్రకాశం, గుంటూరు, తూర్పుగోదావరి, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో సాధారణం నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని తెలిపింది. అలాగే ఈ నెల 7న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. కాగా 7న ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుకుదనాన్ని సంతరించుకోనున్నాయి. ఫలితంగా 7, 8 తేదీల్లో దక్షిణ కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగా, కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. కాగా అల్పపీడనం ప్రభావంతో తీరం వెంబడి గంటకు 45–55, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అందువల్ల మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. ఇది మూడో అల్పపీడనం.. నైరుతి రుతుపవనాల సీజను ప్రారంభమయ్యాక ఇప్పటివరకు బంగాళాఖాతంలో రెండు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. కానీ అవి అల్పపీడనాలకే పరిమితమయ్యాయి తప్ప వాయుగుండంగా బలపడలేదు. జూలై 9న వాయవ్య బంగాళాఖాతంలో, 16న అదే ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడింది. ఈ నెల 7న ఏర్పడబోయే అల్పపీడనం మూడోది. -
Asani Cyclone : ఉత్తరాంధ్రను వణికిస్తున్న‘అసని’ తుపాను (ఫొటోలు)
-
ఉత్తరాంధ్రలో ‘అసని’ తుపాను అలజడి.. (ఫొటోలు)
-
Cyclone Asani: తీరంలో ‘అసని’ అలజడి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై ఉన్న ‘అసని’ తీవ్ర తుపాను గంటకు 25 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది కాకినాడకు ఆగ్నేయంగా 390 కి.మీ., విశాఖçకు ఆగ్నేయంగా 390 కి.మీ., గోపాల్‌పూర్‌కు 510 కి.మీ., పూరీకి దక్షిణ దిశగా 580 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం వాయవ్య దిశగా ప్రయాణించి.. ఉత్తరాంధ్ర, ఒడిశా తీరాలకు ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి చేరుకుంటుంది. అనంతరం యూటర్న్ తీసుకుని ఉత్తర–ఈశాన్య దిశగా ప్రయాణించి.. తిరిగి ఒడిశా తీరం సమీపంలోని వాయవ్య బంగాళాఖాతం వైపునకు మరలనుంది. తదుపరి 48 గంటల్లో క్రమంగా సముద్రంలోనే తుపానుగా బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. కాగా, బలహీనపడిన అనంతరం కాకినాడ, విశాఖపట్నం మధ్య కూడా తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో సోమవారం సముద్రంలో గంటకు 100 నుంచి 110 కి.మీ., గరిష్టంగా 120 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీచాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో గంటకు 45 నుంచి 55 కి.మీ., గరిష్టంగా 65 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. చాలాచోట్ల విద్యుత్ వైర్లు తెగిపడి సరఫరా నిలిచిపోయింది. విశాఖ జిల్లాలో కొన్నిచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. సహాయ చర్యల నిమిత్తం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ డైరెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. పలు విమానాల రద్దు.. రైళ్ల దారి మళ్లింపు గాలుల తీవ్రత కారణంగా విశాఖపట్నం రావాల్సిన పలు విమానాల్ని రద్దు చేశారు. మరికొన్ని విమానాల్ని దారి మళ్లించారు. విశాఖ విమానాశ్రయానికి రావాల్సిన 10 విమానాలు రద్దయ్యాయని, 7 విమానాలను మళ్లించామని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తుపాను ప్రభావం ఉత్తరాం«ధ్ర, ఒడిశాపై ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో తూర్పు కోస్తా రైల్వే జోన్, వాల్తేరు డివిజన్ అధికారులు అప్రమత్తమయ్యారు. ట్రాక్‌లు దెబ్బతిని ప్రమాదాలు సంభవించకుండా ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. ఒడిశా వైపు వెళ్లే మూడు రైళ్లని దారి మళ్లించారు. ఉత్తరాం«ధ్ర జిల్లాల కలెక్టర్లు అప్రమత్తమై.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. తుపాను తీవ్రత తగ్గుముఖం పట్టేంత వరకూ మండలస్థాయి అధికారులు, సిబ్బంది హెడ్ క్వార్టర్స్‌లోనే అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు భారత నౌకాదళం అప్రమత్తమైంది. ఇండియన్ కోస్ట్‌గార్డ్‌షిప్ ఐసీజీఎస్ వీరా సహాయక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. 20 మంది కోస్ట్ గార్డు సిబ్బందితో పాటు 5 విపత్తు సహాయ బృందాలు సహాయక సామగ్రితో సన్నద్ధంగా ఉన్నాయి. మత్స్యకారులెవరైనా సముద్రంలో చిక్కుకుపోయారేమోనన్న అనుమానాలతో కోస్ట్‌గార్డు, నౌకాదళ బృందాలు బంగాళాఖాతాన్ని జల్లెడ పట్టాయి. విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కోస్తాకు రెండ్రోజుల పాటు వర్ష సూచన రాగల రెండ్రోజులపాటు కోస్తాంధ్రలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. పలుచోట్ల 12 నుంచి 20 సెంటీమీటర్ల అతి భారీ వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు వివరించారు. ఉత్తరాం«ధ్ర జిల్లాలతో పాటు కోస్తా తీర ప్రాంతాల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లోని తీరప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. ఉప్పాడ తీరానికి కొట్టుకొచ్చిన స్టీల్ బార్జి పిఠాపురం:కాకినాడ జిల్లాలోని తీర ప్రాంతంపై తుపాను ప్రభావం చూపుతోంది. సోమవారం ఉదయం నుంచి సముద్రం అల్లకల్లోలంగా మారింది. బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. తీరప్రాంతం కోతకు గురవుతోంది. ఈదురు గాలుల ప్రభావంతో కాకినాడ పోర్టులో లంగరు వేసిన స్టీల్ బార్జి ఉప్పాడ తీరానికి కొట్టుకు వచ్చి ఇసుకలో కూరుకుపోయింది. దానిని తిరిగి సముద్రంలోకి తీసుకెళ్లేందుకు అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు. సముద్ర కెరటాలు ఉప్పాడ తీరంపై విరుచుకుపడ్డాయి. కాకినాడ లైట్‌హౌస్ నుంచి ఉప్పాడ వరకు ఉన్న బీచ్ రోడ్డు తీవ్ర కోతకు గురయ్యింది. సుమారు 6 మీటర్ల ఎత్తున కెరటాలు బీచ్ రోడ్డుపై విరుచుకుపడడంతో వాహనాల రాకపోకలను నిషేధించారు. పోలీసు గస్తీ ఏర్పాటు చేసి వాహనాలను దారి మళ్లించారు. కెరటాల తాకిడికి ఉప్పాడ శివారు ఎన్టీపీసీ సమీపంలోని పెద్దవంతెన పక్కకు ఒరిగిపోయి కూలిపోడానికి సిద్ధంగా ఉంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
AP: తుపాను ముప్పు తప్పినట్టే కానీ..
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: బంగాళాఖాతంలో పరిస్థితులు సహకరించకపోవడంతో రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పింది. కానీ.. భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలుల ప్రభావం ఉంటుంది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్ర స్తుతం సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి రాగల 36 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అనంతరం.. తీవ్ర వాయుగుండంగా బలపడుతూ ఈ నెల 18 నాటికి నైరుతి బంగాళాఖాతం మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్–తమిళనాడు తీరాలకు సమీపించనుంది. ఇది తుపానుగా మారకుండా తీవ్ర వాయుగుండం లేదా వాయుగుండంగా బలహీన పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో మంగళవారం నుంచి రాష్ట్రంలో మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయన్నారు. భారీ, అతి భారీ వర్షాలు కురిసే ప్రాంతాలివి ► మంగళవారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక ట్రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయి. ► 17న ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, వైఎస్సార్, కర్నూలు, అనం తపురం జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం. ► 18న ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలు, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం. ► 19నవిజయనగరం, విశాఖపట్నం,ఉభయ గోదా వరి, కృష్ణా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం. 18 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు ► సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. 16వ తేదీ నుంచి 18 వరకు తీరం వెంబడి గంటకు గరిష్టంగా 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 18 వరకు మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. అనంత జిల్లా గాండ్లపెంట మండలంలో 235 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
వాయుగుండంగా మారనున్న అల్పపీడనం?
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో శనివారం ఏర్పడిన అల్పపీడనం ఉత్తర ఒడిశా–పశ్చిమబెంగాల్ తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది వాయువ్య దిశగా పయనించి 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం రాష్ట్రంపై పెద్దగా ఉండదని వెల్లడించింది. అయితే కోస్తా తీరానికి సమీపం నుంచి కదులుతుండటంతో ఆదివారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నట్లు తెలిపింది. కోస్తా, రాయలసీమల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొంది. సెప్టెంబర్ రెండో వారం వరకూ వర్షాలు పడే సూచనలున్నాయనీ.. తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టి.. పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయని తెలిపింది. కాగా, శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి, వజ్రపుకొత్తూరు మండలాల్లో శుక్రవారం వేర్వేరు చోట్ల పిడుగులు పడి ముగ్గురు మృతి చెందారు. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి /సాక్షి, విశాఖపట్నం: రుతుపవన ద్రోణి మచిలీపట్నం మీదుగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా గుజరాత్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ వరకూ కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. శుక్రవారం కోస్తాంధ్రలోని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రావులపాలెంలో 12 సెం.మీ, అడ్డతీగలలో 9.5, రంగాపురంలో 7.2, ఆత్రేయపురంలో 6.6, నాగాయలంకలో 6.0, చిలకలూరిపేటలో 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో విస్తారంగా వానలు ఆగస్టులో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. 139.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 138.5 మి.మీ వర్షం కురిసింది. కోస్తా జిల్లాల్లో 162.1 మి.మీ వర్షానికి 169 మి.మీ వర్షం పడింది. రాయలసీమలో 108.5 మి.మీటర్లకు 96.4 మి.మీ వర్షం కురిసింది. 3 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, 4 జిల్లాల్లో కురవాల్సిన దాని కంటే కొంచెం తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు బలపడటంతో ఈ సీజన్లోనే ఎక్కువ వర్షపాతం ఈ నెలలో నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. -
ఇక వర్షాకాలమే...
సాక్షి, విశాఖపట్నం : ఉత్తర భారతదేశంలో అల్పపీడన ప్రాంతం.. రుతుపవన ద్రోణితో కలిసి హిమాలయాల వైపుగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా మారుతున్నాయి. ఈ కారణంగా రాష్ట్రంలో వర్షాలు కురిసే రోజులు సమీపించాయి. ఈ నెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మరోవైపు రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి, ఉభయగోదావరి జిల్లాల మీదుగా సోమవారం మరో ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వాయువ్య గాలుల ప్రభావంతో సోమవారం వివిధ ప్రాంతాల్లో ఎండలు విజృంభించాయి. మంగళవారం తర్వాత నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
ఏపీ: రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర భారతదేశంలో హిమాలయ ప్రాంతాన్ని ఆనుకొని ఏర్పడిన రుతుపవన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం కోస్తాంధ్ర మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ కారణంగా రానున్న రెండు రోజుల పాటు దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఈ నెల రెండు లేదా మూడో వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయనీ, ఈ అల్పపీడనం ఏర్పడితే రాష్ట్రంలో వర్షాలు ఊపందుకోనున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల గంటకు 45 నుంచి 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచాయి. వేపాడలో 9.3 సెం.మీ. వర్షపాతం నమోదుకాగా, ఆనందపురంలో 8.8, కె.కోటపాడులో 7.2, సంతబొమ్మాళిలో 7.1, యర్రగొండపాలెంలో 6.3, మందసలో 5.9, అనంతగిరిలో 5.9, విశాఖపట్నంలో 5.8, ఎస్.కోటలో 5.7, కోయిలకుంట్లలో 5.2, డెంకాడ, సోంపేటలలో 5, కొరిశపాడులో 4.8, రామభద్రాపురం, మార్కాపురంలలో 4.7, నిడదవోలులో 4.6, గుండ్లకుంటలో 4.5 సెం.మీల వర్షపాతం నమోదైంది. -
రాగల 24 గంటల్లో.. అతి భారీ వర్షాలు!
విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఒడిశా తీరంపై భువేనేశ్వర్‌కు ఆగ్నేయంగా 30 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తా, ఉత్తర తెలంగాణకు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
16 రాష్ట్రాలను ముంచెత్తనున్న అతిభారీ వర్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: కేరళను వణికిస్తున్నవర్షాలు మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నాయి. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో అల్లకల్లో పరిస్థితుల కారణంగా రానున్న రెండు రోజుల్లో 16 రాష్ట్రాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్ కేరళ, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ సహా 16 రాష్ట్రాల్లో భారీ వర్షాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపింది. కేరళతోపాటు సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, బీహార్, జార్ఖండ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్, తీరప్రాంత కర్నాటక, తమిళనాడులో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఆది సోమ వారాల్లో ఉత్తరాఖండ్‌లో అతి భారీ వర్షాలుకురనున్నాయంటూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు శనివారం ఎన్డీఎంఏ శనివారం ఒక ప్రకటన జారీ చేసింది. పశ్చిమ మధ్య అరేబియా సముద్రంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారనుందనీ, ఈ ప్రాంతంలోకి ప్రవేశించకూడదని మత్స్యకారులకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అధికారులు సూచించారు. భారతీయ వాతావరణ విభాగం సమాచారం మేరకు ఆగస్టు 12(ఆదివారం), ఆగష్టు 13 (సోమవారం) ఉత్తరాఖండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురవనున్నాయంటూ అప్రతమత్తను జారీ చేసింది. -
రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : వాయవ్య బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలలో కూడా అల్పపీడనం కొనసాగుతోంది. ఈ కారణంగా రేపు ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రంభీం, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాష్ట్రంలో మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ ప్రాంతాలలో నమోదైన వర్షపాతం: భూపాలపల్లి జిల్లాలోని పెరూర్లో 4 సెం.మీ, భూపాలపల్లి 2 సెం.మీ, వెంకటాపురం 1 సెం.మీ, కాళేశ్వరం 1 సెం.మీ, చెన్నూరు (మంచిర్యాల)1 సెంమీ, గంగాధర (కరీంనగర్) 1 సెం.మీ. -
నేడు కూడా సిటీలో భారీ వర్షాలు
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడడంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నందువల్ల బుధవారం కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ డైరెక్టర్ వైకే రెడ్డి పేర్కొన్నారు. నగరంలో 12 గంటల పాటు రాత్రంతా భారీ వర్షం పడిందని, ఈరోజు కూడా నగరంలో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు రాత్రి కురిసిన వర్షాలకు మరింతగా దెబ్బతిన్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. కూకట్పల్లి, మియాపూర్, అమీర్‌పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో రోడ్లుపై ఏర్పడిన గోతులు వాహనచోదకులకు నరకం చూపిస్తున్నాయి. అల్వాల్, కూకట్ పల్లి, నిజాంపేట ప్రాంతాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. అల్వాల్‌లో చాలా చోట్ల అపార్ట్మెంట్లలోకి నీరు చేరింది. చెరువుల్లో నుంచి కాలనీల్లోకి వరద నీరు వచ్చింది. నిజాంపేట బాలాజీనగర్‌లో 40 శాతం అపార్ట్మెంట్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఖైరతాబాద్ నుంచి మియాపూర్ మరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రాంతం వర్షపాతం షాపూర్ నగర్లో- 16 సెం.మీ కుత్బుల్లాపూర్- 9 సెం.మీ బొల్లారం - 9 సెం.మీ మాదాపూర్- 8 సెం.మీ తిరుమలగిరి- 6.5 సెం.మీ అమీర్‌పేట్- 6 సెం.మీ నాచారం, కాప్రా, ఆసిఫ్ నగర్లలో కూడా భారీ వర్షం పడింది.