
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాగా, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అక్కడక్కడా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వివరించింది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2022
కాగా, ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, యాద్రాద్రి భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయి.
సిరిసిల్ల, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఇక, ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది.
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 10, 2022