Indian Meteorological Department
-
తెలంగాణలో మూడురోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలెర్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.శుక్రవారం పశ్చిమ-మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం.. ఇవాళ పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి చేరువగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ. నుంచి 4.5 కి.మీ మధ్యలో కొనసాగుతున్నట్లు వెల్లడించింది. ఈ ప్రభావంతో తెలంగాణలోకి పశ్చిమ, వాయువ్య దిశ నుంచి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.దీంతో శనివారం జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది.ఆదివారం యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని చెప్పింది. సోమవారం ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. -
ఎవరికోసం ఈ కృత్రిమ విపత్తు?
భోపాల్ దుర్ఘటనకు ఇప్పుడు సరిగ్గా నలభయ్యేళ్ల వయసు. భారత చరిత్రలోని విషాద ఉదంతాల్లో అదొకటి. నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించి ప్రజల ప్రాణాలు బలిగొన్నందుకు గాను కంపెనీ యాజమాన్యంపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదైంది. తమ నిర్లక్ష్యం కారణంగా లేదా చర్యల కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఉండే అవకాశం ఉందని తెలిసి కూడా ముందుకు వెళ్లడాన్ని నేర శిక్షాస్మృతి 'culpable homicide'గా పరిగణిస్తుంది. ఐపీసీ స్థానంలో ‘భారత న్యాయ సంహిత’ (బీఎన్ఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత, తీవ్రమైన నిర్లక్ష్యం కారణంగా జరిగే ప్రాణనష్టం సెక్షన్ 106 కిందకు వస్తుందని చెబు తున్నారు. కారకులకు పదేళ్లు జైలు, జరిమానా కూడా ఉండ వచ్చు.ప్రతి పౌరుడికీ జీవించే హక్కు ఉన్నది. భారత రాజ్యాంగం ఈ హక్కును ప్రాథమిక హక్కుగా (Article 21, Right to life) గుర్తించింది. దీన్ని ఉల్లంఘించే అధికారం ఏ వ్యక్తికి గానీ, వ్యవస్థకు గానీ, ప్రభుత్వానికి గానీ లేదు. నిర్లక్ష్యం వల్లనో, ఉద్దేశ పూర్వకంగానో పౌరుల ప్రాణాలను బలిగొనే ప్రభుత్వాలు అధికారంలో కొనసాగడం రాజ్యాంగ విరుద్ధం. రెండు వారాల కింద విజయవాడ నగరం ఎదుర్కొన్న ఆకస్మిక వరదల కారణంగా డజన్లకొద్దీ ప్రాణాలు పోయాయి. మూడు లక్షల కుటుంబాలు తమ సమస్తాన్నీ కోల్పోయాయి. పదేళ్ల కష్టార్జితాన్ని కోల్పోయి, కట్టుబట్టలతో మిగిలామని ఆ కుటుంబాలు రోదిస్తున్నాయి.విజయవాడ ఆకస్మిక వరదలను ‘ప్రకృతి విపత్తు’ కోటాలో వేసేయలేము. వీటిని నివారించడానికి ఉన్న అవకాశాలను బాధ్యులైన వారు వినియోగించలేదు. బహుశా అందువల్లనే ఈ వరదలను ‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’గా మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అభివర్ణించారు. కచ్చితంగా ఈ విషాదం మానవ కల్పితమే! ఈ మానవ కల్పిత విషాదం వెనుక ప్రభుత్వ నిర్లక్షం ఉన్నది. పరిపాలనా వైఫల్యం ఉన్నది. పాలకుల దురుద్దేశం కూడా దాగున్నది. జరిగిన పరిణామాలను క్రమానుగతంగా పరిశీలిస్తే ఈ సంగతి ఎవరికైనా తేటతెల్లమవుతుంది.ఆగస్టు 28వ తేదీ బుధవారం నాడు భారత వాతావరణ శాఖ (ఐఎమ్‌డి) వారు ఒక నివేదికను విడుదల చేశారు. బంగా ళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం రాబోయే రెండు రోజుల్లో ఆంధ్ర, ఒడిషాలపై ప్రభావం చూపబోతున్నదనే అంశం కూడా ఈ నివేదికలో ఉన్నది. వాతావరణ నివేదికల్లో తుపాను సంబంధిత హెచ్చరికలు వెలువడగానే తీరప్రాంత రాష్ట్రాలు తక్షణం స్పందించి సమీక్ష జరపడం రివాజు. పైగా గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన సముద్ర తీరం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ తుపాను హెచ్చరికలపై స్పందన వేగంగా ఉండాలి. కానీ ప్రభుత్వ పెద్దలు గానీ, అధికార యంత్రాంగం గానీ ఈ హెచ్చరికను పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు.ఆ మరుసటిరోజు ఆగస్టు 29న ఐఎమ్‌డీ రెండో నివేదికను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు గురువారం రాత్రి నుంచి శనివారం వరకు పడతాయని నివేదిక హెచ్చరించింది. ఐఎమ్డీతోపాటు ‘ఆంధ్ర ప్రదేశ్ వెదర్‌మ్యాన్’, ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ కూడా ట్విట్టర్ వేదికగా హెచ్చరించారు. వాతావరణ శాస్త్రవేత్తలైన ఈ యువకులు ‘వెదర్‌మ్యాన్’ పేరుతో అత్యంత కచ్చితత్వంతో కూడిన హెచ్చరికలు జారీచేస్తూ ఇటీవలి కాలంలో సంచలనం సృష్టిస్తున్నారు. ‘ఆంధ్రప్రదేశ్ వెదర్‌మ్యాన్’ సాయి ప్రణీత్ 29న డిప్యూటీ సీఎంను ట్యాగ్ చేస్తూ నివేదికను విడుదల చేశారు. విజయనగరం నుంచి పల్నాడు జిల్లా వరకు అన్ని జిల్లాల్లో భారీ వర్షాలుంటాయని, ముఖ్యంగా శనివారం నాడు అతి భారీ వర్షా లుంటాయి కనుక పాఠశాలలకు ముందుగానే సెలవు ప్రకటించాలని పవన్ కల్యాణ్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.వరుస హెచ్చరికలున్నప్పటికీ ప్రభుత్వ పెద్దలు పెడచెవిన పెట్టారు. అధికార యంత్రాంగం చేష్టలుడిగి కూర్చున్నది. రాజకీయ – అధికార ముఖ్యులందరూ వీకెండ్ మూడ్‌లోకి, చలో హైదరాబాద్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. రిజర్వాయర్లలో ‘ఫ్లడ్ కుషన్’ మెయింటెయిన్ చేయలేదని జగన్మోహన్రెడ్డి పదేపదే ఆరోపిస్తున్నట్టు నదుల్లో వరద నియంత్రణ చర్యలను యంత్రాంగం గాలికి వదిలేసింది. భారీ వర్ష సూచనలున్నప్పుడు నిండుగా ఉన్న రిజర్వాయర్ల నీటిని కొంత మేరకు దిగువకు విడుదల చేసి వచ్చే వరద ప్రవాహానికి కొంత కుషన్ ఏర్పాటు చేసుకుంటారు. ఈ ప్రోటోకాల్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రకాశం బ్యారేజికి రికార్డు స్థాయి వరద చేరి పరిస్థితిని సంక్లిష్టం చేసింది. దీని ప్రభావం బుడమేరు మీద, రాజ ధాని ప్రాంతం మీద కూడా పడింది.బుడమేరు అనే వాగుకు ఎప్పటినుంచో ‘బెజవాడ దుఃఖ దాయని’ అనే పేరున్నది. విజయవాడకు ఉత్తర దిక్కున ఉన్న ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతం నుంచి ఈ వాగు దక్షిణా భిముఖంగా ప్రవహించి, నగరానికి వాయవ్య దిక్కున ఉన్న వెలగలేరు అనేచోట తూర్పు వైపు తిరిగి, పలు వంపులు తిరు గుతూ నగరం మీదుగా కొల్లేరు దాకా పారుతుంది. విజయ వాడకు వరద ముప్పును నియంత్రించడం కోసం వెలగలేరు మలుపు దగ్గర బుడమేరుపై గేట్లు బిగించారు. వరద ప్రవాహాన్ని దక్షిణం వైపు మళ్లిస్తూ ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదిలోకి పారేలా ‘బుడమేరు డైవర్షన్ కెనాల్’ (బీడీసీ) ఏర్పాటు చేశారు. దిగువన ఇబ్రహీంపట్నం దగ్గరున్న విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ కోసం ఏర్పాటైన కూలింగ్ కెనాల్‌తోనే ఈ బీడీసీని అనుసంధానించారు. పోలవరం కుడికాల్వను కూడా వెలగలేరు వద్ద బీడీసీతో కలిపేశారు. ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ సామర్థ్యం 15 వేల క్యూసె క్కులని చెబుతారు. కానీ అంతకుముందే అక్కడ వీటీపీఎస్ కూలింగ్ కెనాల్‌పై చంద్రబాబు ఓ యెల్లో మీడియా ప్రముఖునికి ఇచ్చిన పవర్ ప్లాంట్ కారణంగా ఐదు వేల క్యూసెక్కులకు మించి అక్కడ ప్రవహించే అవకాశం లేదని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. బుడమేరు వరదెత్తిన రోజుల్లో గరిష్ఠ స్థాయిలో ఆ ప్రవాహాన్ని బీడీసీలోకి మళ్లిస్తే విజయవాడకు వరద ముప్పు తగ్గుతుంది. ఆ గరిష్ఠ స్థాయి మళ్లింపునకు అడ్డుగా ఉన్న పవర్ ప్లాంట్‌ను తొలగించడానికి గతంలో కొన్ని ప్రయత్నాలు జరిగినా కోర్టు›స్టేల వల్ల సాధ్యం కాలేదు.ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులో 45 వేల క్యూసెక్కుల వరద రాబోతున్నదని శనివారం మధ్యా హ్నానికి ముందే స్థానిక ఇరిగేషన్ ఇంజనీర్లు అంచనా వేసి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్టు చెబుతున్నారు. బుడ మేరు రెగ్యులేటర్ డీఈ మాధవనాయక్ ‘సాక్షి’ టీవీతో ఆన్ రికార్డు ఈ విషయాన్ని నిర్ధారించారు. బీడీఎస్ సామర్థ్యం 15 వేల క్యూసెక్కులే కనుక అనివార్యంగా బుడమేరు గేట్లను శని వారం సాయంత్రానికల్లా ఎత్తవలసి ఉంటుందని కూడా వారు ఉన్నతాధికారులకు చేరవేశారు. ‘పైస్థాయి’ వారు వెంటనేస్పందించి గేట్లు ఎత్తడంపై నిర్ణయం తీసుకొని ఉంటే విజయ వాడలోని బుడమేరు ముంపు ప్రాంత ప్రజలను తరలించడానికి సరిపోయే సమయం ఉండేది. రాబోతున్న వరదను గురించి ప్రజలను అప్రమత్తం చేయడానికి అవకాశం ఉండేది. ప్రొటో కాల్ ప్రకారం గేట్లు ఎత్తడానికి పన్నెండు గంటల ముందు ప్రజ లను అప్రమత్తం చేయాలి. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలి.ఇవన్నీ జరగాలంటే వాతావరణ హెచ్చరికలు వెలువడి నప్పుడే ఇరిగేషన్, రెవెన్యూ, హోంశాఖ ఉన్నతాధికారులతో ప్రభుత్వ పెద్దలు సమీక్షా సమావేశం జరిపి నిర్ణయాలు తీసు కోవాలి. అది జరగలేదు. తీరా కృష్ణానదిలో వరద పెరిగి చంద్ర బాబు కరకట్ట నివాసంలోకి కూడా నీళ్లు రావడంతో ఆయన కలెక్టరేట్‌లోకి తన బసను మార్చుకున్నారు. అప్పటికే బుడమేరు పరిస్థితి భయానకంగా ఉన్నట్లు సమాచారం ఉన్నది. ఆ సమ యంలో తీరిగ్గా మూడు శాఖల అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. బుడమేరు గేట్లపై ఏం నిర్ణయం తీసు కున్నారో ఎవరికీ తెలియదు. ఎటువంటి ప్రకటనా వెలువడ లేదు. పునరావాస శిబిరాలు ఏర్పాటు కాలేదు. ప్రజలకు హెచ్చరి కలు జారీ కాలేదు. వారిని తరలించే ప్రయత్నాలూ జరగలేదు.మూడు లక్షలమందిని వరద ముంచేసిన తర్వాత వారం రోజులకు రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్పి సిసోడియా ఒక భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. ఒక రోజు ముందుగానే వరద సంగతి తమకు తెలుసనీ, కానీ రెండు లక్షల కుటుంబాలను ఆ ప్రాంతం నుంచి తరలించడం సాధ్యమయ్యే పని కాదు కనుక ప్రజలను హెచ్చరించలేదని చెప్పారు. ఇంత కంటే దిగ్భ్రాంతికరమైన విషయం ఇంకోటి ఉంటుందా? ఇంత కన్నా బాధ్యతా రాహిత్యం ఉంటుందా? ఇదే కదా నేరపూరిత నిర్లక్ష్యం! ఇదే కదా ఉద్దేశపూర్వకంగా ప్రజల ప్రాణాలను బలి పెట్టడం! ఇది కేవలం ఆ ఉన్నతాధికారి నిర్ణయం మాత్రమే అను కోలేము కదా! అత్యున్నత స్థాయి నిర్ణయాన్నే ఆయన వెల్లడించి ఉంటారు కదా!హెచ్చరికలు లేకుండా, ఏర్పాట్లు లేకుండా బుడమేరు గేట్లెత్తి లక్షలాదిమందిని వరదపాలు చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రేరేపించిన పరిస్థితులేమిటి? శనివారం మధ్యా హ్నానికే ప్రకాశం బ్యారేజీలోకి దాదాపు 8 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుకున్నది. కరకట్ట మొదటి అంతస్తుల్లోకి ప్రవేశించింది. బ్యారేజీ దగ్గర కృష్ణానది బెడ్ లెవెల్ సముద్ర మట్టానికి 11.24 మీటర్లు. రాజధాని ప్రాంతం గుండా పారే కొండవీటి వాగు ఉండవల్లి దగ్గరున్న కృష్ణానది తూము ద్వారా నదిలో కలుస్తుంది. అక్కడ దాని బెడ్ లెవెల్ 11 మీటర్లు. ఐదారు లక్షల క్యూసెక్కుల ప్రవాహం గనుక బ్యారేజీ దగ్గర ఉన్నట్లయితే కొండవీడు వాగు కృష్ణలో కలవడానికి బదులు కృష్ణ నీళ్లు వాగు లోకి ఎగదన్నుతాయి. కొండవీడు వాగు మోసుకొచ్చే వరదను రాజధాని ప్రాంతంలో నియంత్రించడం కోసం ఒక లిఫ్టును ఏర్పాటు చేశారు. దాని సామర్థ్యం ఐదువేల క్యూసెక్కులు మాత్రమే. కృష్ణాలో ప్రవాహం పెరిగి వాగులోకి ఎగదన్నడం ఎక్కువైతే అమరావతి డ్రీమ్ ప్రాజెక్టుకు కోలుకోలేని డ్యామేజ్ అవుతుంది. బ్యారేజీలో కొంచెం ఎగువన నదికి మరోవైపున బుడమేరు డైవర్షన్ కెనాల్ కృష్ణానదిలో కలుస్తున్నది. ఈ బుడ మేరు నీళ్లనే కృష్ణలో కలిపి కృష్ణా–గోదావరి నదుల అనుసంధా నాన్ని పూర్తి చేశానని గతంలో చంద్రబాబు ప్రకటించిన సంగతి చాలామందికి గుర్తుండే ఉంటుంది. దీనికే ఆయన ‘పవిత్ర సంగమం’ అనే నామకరణం చేశారు.ఇక్కడ కృష్ణానది, బుడమేరు కాలువల బెడ్‌లెవెల్ సమానంగా ఉంటుంది. ఫలితంగా కృష్ణా ప్రవాహం వేగంగా కాల్వ లోకి ఎగదన్నడం మొదలైంది. మరోపక్క బుడమేరు గేట్లు మూసి ఉన్నందువలన వరద మొత్తం డైవర్షన్ కెనాల్ ద్వారా కృష్ణ వైపు పరుగెత్తుతున్నది. పవర్ ప్లాంట్ కారణంగా ఇరుకైన కాలువ తట్టుకోలేక గట్టుకు గండ్లు పడి కృష్ణా జలాలు పడమటి దిక్కు నుంచి విజయవాడ వైపు మళ్లాయి. శనివారం రాత్రి పడిన ఈ గండ్లనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూడ్చలేకపోయిందని అధికార పార్టీ ప్రచారంలో పెట్టింది. గేట్లు ఎత్తితే బుడమేరు వరద ఎదురు రాకుండా కృష్ణా వరద స్వేచ్ఛగా ఎగదన్నడం వలన బ్యారేజీ నీటిమట్టం ప్రమాదకరంగా పెరగకుండా నియంత్రించవచ్చనే ఆలోచన కూడా కారణం కావచ్చు. రాత్రి పూట చెప్పాపెట్టకుండా గేట్లు ఎత్తేశారు. బుడమేరు వరద బెజవాడపై ఉత్తరం దిక్కు నుంచి విరుచుకుపడింది.శనివారం మధ్యాహ్నానికే నిర్ణయం తీసుకొని, చాటింపు వేయించి ప్రజలను తరలించి ఉన్నట్లయితే పెను ఉత్పాతం నివారించడం సాధ్యమయ్యేది. కానీ ఈ ఏర్పాట్లు చేయడానికి యంత్రాంగం సన్నద్ధంగా లేదు. నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా కిమ్మనాస్తిగా స్తంభించిపోయింది. పెద్దల ఆయువుపట్టుకే దెబ్బ తగలబోతోందన్న ఆలోచన రాగానే విజయవాడను బలిపెట్టడా నికి సిద్ధమైనట్టుగా ఈ పరిణామాలు కనిపిస్తున్నాయి.ప్రభుత్వ ఘోరవైఫల్యం, దూరదృష్టి లేకపోవడం, పాలనా యంత్రాంగ నిస్తేజం, ఆపైన పెద్దల సొంత ప్రయోజనాలు... వెరసి విజయవాడ వీధుల్లో కన్నీటి కెరటాలు ఎగసిపడ్డాయి. ఈ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి వారం రోజుల పాటు ప్రభుత్వ పెద్దలు పడినపాట్లు అన్నీ ఇన్నీ కావు. విష్ణుమూర్తి అవతారాల మాదిరిగా కొన్నిసార్లు పడవల మీద, కొన్నిసార్లు బుల్డోజర్లపై, మరికొన్ని సార్లు కాలినడకన ప్రయాణిస్తూ ముఖ్యమంత్రి ప్రజ లకు అభివాదాలు చేస్తూ కనిపించారు. వర్షంలోనే గండ్లు పూడ్చుతూ కనిపించే మంత్రుల ఫొటోలు, వీడియోలు దర్శన మిచ్చాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించిన ఫోటోల్లో, డ్రోన్ల ద్వారా ఇంటింటికి ఆహారం సరఫరా దృశ్యాలు ప్రచారంలోకి వచ్చాయి.ప్రవాహంలో కొట్టుకుపోయేవాడికి గడ్డిపోచ కనిపించి నట్టుగా వైఫల్యాల సుడిలో కొట్టుమిట్టాడుతున్న సర్కార్‌కు ప్రకాశం బ్యారేజీ దగ్గరకు కొట్టుకొచ్చిన బోట్లు కనిపించాయి. ఈ బోట్లను వైసీపీ వాళ్లే ప్రయోగించారనీ, ఈ బోట్ల కారణంగానే బెజవాడ మునిగిందనే డైవర్షన్ స్కీమును ముందుకు తెచ్చారు. బురదను కడుక్కోవాలి కనుక అవతలి పక్షం వారు కూడా బోట్లు టీడీపీ వారివేననే సాక్ష్యాలను ముందుకు తెచ్చారు. ఈ బోట్ల కాట్లాట నడుమ అసలైన కారణాలను మరుగున పడేయడమే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. వారి లక్ష్యం ఏదైనా కావచ్చు, ప్రజల ప్రాణాలను బలిగొనే నేరపూరిత నిర్లక్ష్యాలను ఉపేక్షించడం ప్రజాస్వామ్యానికి హితం కాదు. ప్రభుత్వాల చేతగానితనాన్ని సహించడం కూడా క్షేమం కాదు. జరిగిన విధ్వంసంపై కేసులు నమోదు కావాలి. ఈ విషాదానికి కేవలం నిర్లక్ష్యం, చేతగాని తనాలే కారణాలా? మరేదైనా లోతైన కారణం ఉన్నదా అనే కోణంలో విచారణ జరగాలి.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
మానవ తప్పిదాలే విలయ హేతువులు
కేరళలోని వయనాడ్‌లో జూలై 30న వానరూపంలో మృత్యువు చేసిన కరాళ నృత్యానికి 375 మంది మృత్యు వాతపడగా మరో 400 మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ విలయం కంటే ముందు 2019 ఆగస్ట్‌లో పుతుమల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి భారీ ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించాయి. ఇక, 2018లో కనివిని ఎరుగని విధంగా కేరళ రాష్ట్రాన్ని ముంచెత్తిన వర్షాలు, వరదలకు 433 మంది మృత్యువాత పడగా, దాదాపు 6 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయినట్లు అధికారిక లెక్కలు వెల్లడించాయి. ఇంతకూ ఎందుకు కేరళ రాష్ట్రంలో పదేపదే ప్రకృతి ప్రకోపిస్తోంది? ఈ ప్రశ్నకు జవాబు ప్రభుత్వాలకు చెంప పెట్టుగా నిలుస్తుంది. నిజానికి ప్రకృతి తనంతట తాను ప్రకో పించదు. దాన్ని ధ్వంసం చేసినప్పుడు మాత్రమే కన్నెర్ర జేస్తుంది. మనిషి అంతులేని స్వార్థంతో ప్రకృతి సంపదను ఇష్టానుసారం దోచుకోవడానికి చేసే విధ్వంసమే ప్రకృతి గతి తప్పడానికి కారణం అవుతోంది. ఇది ఒక్క కేరళలో మాత్రమే కాదు... గత దశాబ్ద కాలంగా హిమాలయ ప్రాంతంలోని ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలలో సైతం ఇదే జరుగు తోంది. అందుకే అక్కడా తరచుగా భారీ వర్షాలు కురిసి కొండ చరియలు విరిగి పడుతున్నాయి. వాటి వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు జరగడం పరిపాటిగా మారింది. బెంగళూరులోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’కు చెందిన ప్రొఫెసర్ సీపీ రాజేంద్రన్ ‘వయనాడ్’లో ప్రకృతి ప్రకోపానికి కారణమవుతున్న అంశాలను శాస్త్రీయంగా వివరించారు. 50వ దశకం వరకు వయనాడ్‌లో 85 శాతం దట్టమైన అడవులు ఉండగా, అవి క్రమంగా క్షీణిస్తూ 2018 నాటికి 62 శాతానికి చేరుకొన్నాయి. అడవులను నరికి వేసి ఆ ప్రాంతంలో విస్తారంగా తేయాకు తోటల పెంపకం ప్రారంభించారు. దాంతో అక్కడ అనేక జనావాసాలు పుట్టు కొచ్చాయి. మానవ కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి. కాలుష్య కారకాల వల్ల కర్బన ఊద్గారాలు పెరిగి వాతా వరణంలో వేడి అధికమైంది. ఫలితంగా, ఆగ్నేయ ప్రాంతంలోని అరేబియా సముద్రం వేడెక్కి ఒక్కసారిగా కుండపోత వానలు పడటం మొదలైంది. అడవులు ఉన్నప్పుడు వర్షపు నీటి ప్రవాహ వేగం తక్కువుగా ఉండి ఒక క్రమపద్ధతిలో పల్లపు ప్రాంతానికి చేరేది. కానీ, అడవుల్ని నరకడం వల్ల ప్రవాహ ఉధృతి పెరిగిపోవడం, వర్షపునీటి సాంద్రత అధికమవడంతో... రాతి శకలాల మధ్య ఉన్న మట్టి తొందరగా కరిగిపోయి ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడు తున్నాయి. వయనాడ్ కొండప్రాంతం లేటరైట్ మృత్తిక, రాతిశకలాల మిశ్రమంతో నిండి ఉండటం వల్ల భారీ వర్షాలు, వరదనీటి తాకిడికి కొండలు పెళ్లలు ఊడిపడినట్లు పడతా యని ఎప్పటి నుంచో శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తూనే ఉన్నారు.పశ్చిమ కనుమల పర్యావరణ స్థితిగతుల నిపుణుల బృందం (వెస్ట్రన్ ఘాట్స్ ఎకాలజీ ఎక్స్పర్ట్ ప్యానెల్)కు నేతృత్వం వహించిన మాధవ్ గాడ్గిల్ 2010 నుంచి దాదాపు ఏడాదిపాటు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కేరళ నుంచి ఇటు తమిళనాడు; అటు కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ వరకు విస్తరించిన పశ్చిమ కనుమల ప్రాంతాన్ని సున్నితమైన 3 జోన్లుగా వర్గీకరించి... ఒకటవ జోన్లో ఉన్న వయనాడ్ ప్రాంతంలో పర్యావరణాన్ని నష్టపరిచే కార్యకలా పాల్ని నిషేధించాలని సిఫారసు చేశారు. కనుమల స్థిరత్వాన్ని దెబ్బతీసే భారీ కట్టడాల్ని నిర్మించడం శ్రేయస్కరం కాదని హెచ్చరించారు.అయితే, అపరిమితమైన ప్రకృతి సంపద గలిగిన ఆ ప్రాంతంపై కన్నేసిన కొందరు తమ రాజకీయ పలుకుబడిని ఉపయోగించి మాధవ్ గాడ్గిల్ కమిషన్ నివేదికను బుట్ట దాఖలా చేయాలని చూశారు. స్థానికంగా ఉన్న ప్రజల్ని రెచ్చ గొట్టారు. ఆ ప్రాంతంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగితే స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయన్న ప్రచారం ముమ్మరం కావడంతో మెజార్టీ ప్రజల అభిప్రాయాలకు తలొగ్గిన ప్రభుత్వాలు మాధవ్ గాడ్గిల్ కమిషన్ చేసిన సూచనలకు సవరణలు ప్రతిపాదించి, పరిమితమైన వాణిజ్య కార్యకలాపాలకు అనుమతులు ఇచ్చాయి. ఫలితంగా వయ నాడ్ ప్రాంతంలో మైనింగ్, క్వారీ కార్యకలాపాలు పెరిగి పోయాయి. అలాగే కాలుష్య కారక పరిశ్రమల ఏర్పాటు సజావుగా సాగిపోయింది. ఈ చర్యలన్నింటి వల్లనే కేరళ తరచుగా విపత్తులకు గురవుతోందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. దేశంలో ఎటువంటి ఉపద్రవం సంభవించినా దాని చుట్టూ రాజకీయ రంగు పులుముకోవడం సహజమైపోయింది. వయనాడ్ మృత్యు విలయంపై ఆ మరుసటి రోజునే పార్లమెంట్లో హోమ్ మంత్రి అమిత్‌షా ‘కాలింగ్ అటెన్షన్’ రూపంలో చర్చను ప్రారంభించారు. ముందుగా ఆయన భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరిక (అలెర్ట్) లను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు. అదే సమయంలో పశ్చిమ కనుమలలో దాదాపు 60 వేల చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని పర్యావరణం పరంగా సున్నిత ప్రాంతంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించారు. అందులో వయనాడ్‌లోని కనుమ ప్రాంతం కూడా ఉంది. అయితే, కేంద్రం తాజాగా ప్రకటన నేపథ్యంలో 5 రాష్ట్రాల పశ్చిమ ప్రాంతంలో విస్తరించిన ఈ కనుమలలో ఇప్పటికే జరుగుతున్న పర్యావరణ విధ్వంసకర కార్యకలాపాలను నిలుపుదల చేయాలంటే అక్కడి పరిశ్రమలను వెంటనే తరలించాలి. ఆ పరిశ్రమలలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పరిశ్రమల యజమానులకు తగిన పరిహారం ఇవ్వాలి. ఈ చర్యలన్నీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతోనే జరగాలి. ఇవన్నీ జరగాలంటే.. రాజకీయ చిత్తశుద్ధి అవసరం. ప్రజల ప్రాణాలకంటే విలువైనదేదీ లేదన్న స్పృహ పాలకుల్లో కలిగినప్పుడే విపత్తుల్లో చోటుచేసుకునే ప్రాణ, ఆస్తి నష్టాలు గణనీయంగా తగ్గుతాయి. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి -
మరో రెండు రోజులు వానలే వానలు..
-
సెన్సార్ల లోపం వల్లే ఎక్కువ ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మే 30వ తేదీన నమోదైన 56, వాయవ్య ఢిల్లీలోని ముంగేష్ పుర్లో మే 29వ తేదీన నమోదైన 52.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు తప్పు అని భారత వాతావరణ శాఖ శనివారం స్పష్టంచేసింది. మే 29న ముంగేష్ పుర్లో వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45.2 ఉంటే సెన్సార్ దానిని 52.9 డిగ్రీల సెల్సియస్‌గా చూపించింది. ముంగేష్ పుర్, నాగ్‌పూర్ స్టేషన్లలో ఉష్ణోగ్రతను లెక్కగట్టే సెన్సార్లలో లోపాలు తలెత్తడం వల్లే అసాధారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వివరణ ఇచి్చంది. ‘‘ ఈ రెండు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్(ఏడబ్ల్యూఎస్)లో బిగించిన సెన్సార్లను త్వరలోనే పరిశీలిస్తాం. ఢిల్లీలోని ఇతర ఆటోమేటిక్, మాన్యువల్ అబ్జర్వేటరీల్లో నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ముంగేష్ పుర్ ఏడబ్ల్యూఎస్‌లో అసాధారణ ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడికి ఇప్పటికే నిపుణుల బృందాన్ని పంపించాం. ముంగేష్‌పుర్‌లో స్టాండర్డ్ ఇన్స్ట్రుమెంట్ నమోదుచేసిన దానికంటే ఈ సెన్సార్ మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను ఎక్కువ చూపించింది. లోపాలున్న సెన్సార్‌ను త్వరలోనే మార్చేస్తాం’’ అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. -
Cyclone Remal: ‘రెమాల్’తో బెంగాల్ అతలాకుతలం
కోల్‌కతా: తీవ్ర తుపాను ‘రెమాల్’ ధాటికి పశ్చిమబెంగాల్ అతలాకుతలమవుతోంది. దీని ప్రభావంతో గంటకు 110–120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బెంగాల్ తీరప్రాంత జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని, కోల్‌కతా పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వివరించింది. తీరప్రాంతాల నుంచి 1.1 లక్షల మందిని ఆదివారం యంత్రాంగం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. రెమాల్తో నష్టం తక్కువేనని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తర, దక్షిణ పరగణాల జిల్లాల్లోని బలహీన నిర్మాణాలు, విద్యుత్, సమాచార వ్యవస్థలు, కచ్చా రోడ్లు, పంటలు, తోటలకు నష్టం వాటిల్లవచ్చని చెప్పారు. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఈస్టర్న్, సౌత్ ఈస్టర్న్ రైల్వేలు ఆది, సోమవారాల్లో కొన్ని రైళ్లను రద్దు చేశాయి. కోల్‌కతా విమానాశ్రయం అధికారులు ఆదివారం మధ్యాహ్నం నుంచి 21 గంటలపాటు బయలుదేరాల్సిన, రావాల్సిన 394 సరీ్వసులను రద్దు చేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బందితోపాటు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. బెంగాల్‌తోపాటు ఉత్తర ఒడిశాలో 26, 27వ తేదీల్లో తుపాను ప్రభావంతో అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. అస్సాం, మేఘాలయ, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ తుపాను ప్రభావం తీవ్రంగానే ఉంటుందని అంచనా వేసింది. రక్షణ, సహాయక కార్యక్రమాల సన్నద్ధతపై అధికారులతో ప్రధాని మోదీ ఆదివారం సమీక్ష జరిపారు.బంగ్లాదేశ్‌లో...బంగ్లాదేశ్‌లోని పేరా, మోంగ్లా పోర్టుల్లో అత్యంత ప్రమాద 10వ నంబర్ హెచ్చరికను, కోక్స్ బజార్, చిట్టోగ్రామ్లలో 9వ నంబర్ హెచ్చరికలను ఎగురవేశారు. అలలు సాధారణం కంటే 8 నుంచి 12 అడుగుల వరకు ఎత్తులో ఎగసిపడుతున్నాయి. 8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిట్టగాంగ్ ఎయిర్‌పోర్టులో విమాన సరీ్వసులను రద్దు చేశారు. -
మే 23 వరకు తెలంగాణ, ఏపీలో అతి భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: వాతావరణంలో మార్పుతో రాష్ట్రవ్యాప్తంగా ఎండతీవ్రత, వడగాడ్పులు గణనీయంగా తగ్గాయి. ఎక్కడా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు మించడం లేదు. అంతేగాక ఈ నెలలో ఇప్పటికే వర్షాలు మొదలయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ తరుచూ వానలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణశాఖ మరో చల్లటి కబురు చెప్పింది.దక్షిణ అండమాన్ సముద్రంలో నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. రేపటికి (మే 19) బంగాళాఖాతంలో ఆగ్నేయ ప్రాంతాలపై నైరుతీ రుతుపవనాలు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 22న నైరుతీ బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అల్పపీడనం బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించింది. సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది.దీని కారణంగా మే 23వ తేదీ వరకు కూడా తెలంగాణ, ఏపీలో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనిపేర్కొంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. -
Weather: జాగ్రత్త.. ఈసారి ఎండల మంటలే!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2–3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. గత రెండు నెలలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం,అధిక వేడి ఉండే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని.. అంటే వచ్చే రెండు నెలలు ఎండల మంటలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఈసారి భగభగలు తప్పనట్టే.. దేశవ్యాప్తంగా ఈ వేసవికాలంలో భానుడి భగభగలు తప్పకపోవచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. ఆసియా ఖండంలోని దేశాల్లో తీవ్ర వర్షాభావం, అధిక వేడికి కారణమయ్యే ఎల్‌నినో పరిస్థితులు జూన్ వరకు కొనసాగవచ్చని పేర్కొంటున్నారు. భారత వాతావరణ శాఖ కూడా దీనిపై ఇప్పటికే ప్రకటన జారీ చేసింది. ఈసారి సాధారణం కంటే అధికంగా వడగాడ్పులు వీయవచ్చని కూడా అంచనా వేసింది. పరిస్థితులు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం (మార్చి చివరివారంలో) ఉండాల్సిన సాధారణ ఉష్ణోగ్రతల కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకుపైనే నమోదు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ, పశి్చమ భారత రాష్ట్రాలు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్‌లలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీవ్రమవుతున్న ఎండల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేసింది. తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాయి. ఉత్తర భారతంలోనూ పలు ప్రాంతాల్లో ఎండలు మండుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో సాధారణం కంటే మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్రమైన ఉక్కపోత.. ఆరు బయట జాగ్రత్త అధిక ఉష్ణోగ్రతలతో వాతావరణంలో తేమ శాతం పెరిగిపోతుండటంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. దీనికితోడు పలు ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తుండటం మరింత సమస్యగా మారిందని నిపుణులు చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకూడదని, ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర నీటిని తాగుతూ ఉండాలని, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. జిమ్‌లు, బయటా వ్యాయామాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. డీహైడ్రేషన్, ఇతర పరిస్థితుల వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. ‘దక్షిణం’లో తీవ్ర వర్షాభావం.. భారత వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరి, మార్చి నెలలకు సంబంధించి తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, పంజాబ్‌లతోపాటు ఈశాన్య రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కాస్త లోటు నుంచి సాధారణ వర్షపాతం నమోదైనట్టు గణాంకాలు చెప్తున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అదనంగా నమోదు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోనూ ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో.. రాత్రిపూట కూడా వేడిగా ఉంటున్న పరిస్థితి ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. కాగా.. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను 20 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినట్టు రాష్ట్ర ప్రణాళిక–అభివృద్ధిశాఖ పేర్కొంది. ఈ మేరకు ఉష్ణోగ్రతల అంచనాలను విడుదల చేసింది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏప్రిల్‌లో మరింత ఎక్కువ ఎండలు.. గతేడాది కంటే వేగంగా ఈసారి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాతావరణంలో నెలకొంటున్న మార్పుల వల్లే ఈ పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే వచ్చే వారం రోజుల పాటు ఎండ వేడి ఎక్కువగా ఉన్నా వడగాడ్పులు వీచే అవకాశం లేదు. ఏప్రిల్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా ఉంటాయని అంచనా. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్ 1న విడుదల చేస్తాం. గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా మూడు రోజులపాటు సాధారణం కంటే 2, 3 డిగ్రీలు అధికంగా నమోదై, మరింత పెరిగే అవకాశం ఉన్నప్పుడు అలర్ట్‌లను జారీ చేస్తాం. ఏప్రిల్ నుంచి వేసవి ముగిసేవరకు ఉష్ణోగ్రతల అంచనాలు, జాగ్రత్తలపై రోజువారీగా బులిటెన్ విడుదల చేస్తాం. – నాగరత్న, ఐఎండీ డైరెక్టర్ ప్రధాన కేంద్రాల్లో ఉష్ణోగ్రతల తీరు (డిగ్రీల సెల్సియస్‌లలో) కేంద్రం గరిష్టం కనిష్టం ఆదిలాబాద్ 40.8 25.5 భద్రాచలం 40.0 25.0 నిజామాబాద్ 39.9 25.0 ఖమ్మం 39.6 24.0 నల్లగొండ 39.5 24.2 హైదరాబాద్ 39.2 24.6 మహబూబ్‌నగర్ 39.2 25.0 మెదక్ 39.2 21.1 దుండిగల్ 39.1 22.2 హకీంపేట్ 39.0 20.1 రామగుండం 38.6 24.6 హన్మకొండ 38.0 22.5 ఈ జాగ్రత్తలు తప్పనిసరి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆరుబయట పనిచేసేవారు, ఏదైనా పని కోసం బయటికి వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. తరచూ నీళ్లు తాగాలని, డీహైడ్రేషన్ తలెత్తకుండా చూసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. ఇంకా వైద్యులు సూచనలు ఇవీ.. బయటికి వెళ్లేవారు తెలుపు, లేత రంగుల పలుచటి కాటన్ వ్రస్తాలు ధరించాలి. తలపై టోపీ పెట్టుకోవాలి. లేదా రుమాలు చుట్టుకోవాలి. నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్ఎస్ వంటివి తాగుతూ ఉండాలి. ఎండ వేడిలో అధికంగా పనిచేయకూడదు. ఇబ్బందిగా అనిపిస్తే చల్లని ప్రదేశంలో సేదతీరాలి. అధిక వేడి వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటివి తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లొద్దు. -
వర్షాలకు ఇక విరామం..
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల నుంచి మరికొద్ది రోజుల్లోనే ఈశాన్య రుతుపవనాలు ఉపసంహరించుకోనున్నాయి. ఈనెల 15కల్లా వీటి సీజను పూర్తిగా ముగియనుంది. దీంతో వర్షాలకు విరామం దొరకనుంది. ఫలితంగా కొద్దిరోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం కొనసాగనుంది. నిజానికి.. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ఈశాన్య రుతుపవనాల సీజనుగా పరిగణిస్తారు. ఏటా అక్టోబరు 18–22 తేదీల మధ్య ఈశాన్య రుతుపవనాలు తమిళనాడులోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత రెండుమూడ్రోజుల్లో రాష్ట్రంలోకి విస్తరిస్తాయి. అయితే, ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాలు నిర్ణీత సమయాని కంటే వారం రోజులు ఆలస్యంగా ప్రవేశించాయి. కానీ, అరకొర వర్షాలను మాత్రమే కురిపించాయి. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు మూడునెలల్లో రాష్ట్రంలో 287.2 మి.మీల వర్షపాతం నమోదు కావలసి ఉండగా 219 మి.మీల వర్షపాతం మాత్రమే రికార్డయింది. అంటే.. సాధారణం కంటే 24 శాతం తక్కువ వర్షం కురిసిందన్న మాట. కోస్తాంధ్ర కంటే రాయలసీమలో మరింత తక్కువ వర్షపాతం నమోదైంది. కోస్తాంధ్రలో 18 శాతం (322.9 మి.మీలకు గాను 265.8 మి.మీలు), రాయలసీమలో 30 శాతం (236.4కి 164.7 మి.మీలు) చొప్పున లోటు వర్షపాతం రికార్డయింది. ఈ సీజనులో రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా ఏలూరు జిల్లాలో 42 శాతం అధిక వర్షపాతం కురవగా, అత్యల్పంగా నంద్యాల జిల్లాలో 89 శాతం లోటు వర్షపాతం కురిసింది. ఇక కోస్తాంధ్రలోని 18 జిల్లాలకు గాను అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, బీఆర్ ఆంబేడ్కర్ కోనసీమ, బాపట్ల, ఏలూరు, కృష్ణా, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. రాయలసీమలో ఒక్క తిరుపతి మినహా మిగిలి ఏడు జిల్లాల్లోనూ లోటు వర్షపాతమే రికార్డయింది. రాక.. పోక ఆలస్యమే.. ఈ ఏడాది ఈశాన్య రుతుపవనాల ఆగమనం, తిరోగమనం (నిష్క్రమణ) కూడా ఆలస్యంగానే జరగడం విశేషం. ఈశాన్య రుతుపవనాల సీజను డిసెంబర్ ఆఖరుతో ముగియాల్సి ఉన్నా జనవరిలోనూ రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో.. నిర్ణీత సమయానికి దాదాపు పక్షం రోజులు ఆలస్యంగా ఈ రుతుపవనాలు ఉపసంహరించుకుంటున్నాయి. దీంతో.. ఈనెల 15 తేదీ నాటికి ఈశాన్య రుతుపవనాలు ఉపసంహరణతో అవి బలహీనపడతాయని, ఫలితంగా రాష్ట్రంలో ఇప్పట్లో వర్షాలు కురవవని భారత వాతావరణశాఖ శుక్రవారం వెల్లడించింది. కొనసాగనున్న మంచు, చలి.. రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు పొగమంచు, చలి కొనసాగనుంది. సాధారణం కంటే కనిష్ట (రాత్రి) ఉష్ణోగ్రతలు 2–4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే, చలి తీవ్రత అంతగా ఉండదని.. పొగ మంచు ప్రభావం మాత్రం ఉంటుందన్నారు. -
నేడు అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతంలో మంగళవారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తూ ఈనెల 16వ తేదీ నాటికిపశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. మరోవైపు నైరుతి బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే రాష్ట్రంపైకి ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తాలో ఒకట్రెండు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుకురవనున్నాయి. కాగా.. మంగళవారం తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడ క్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడింంది. అలాగే బుధవారం తిరుపతి, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని తెలిపింది. వర్షాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులు సంభవించే అవకాశం ఉన్నందున ప్రజలు, కూలీలు, పశువుల కాపరులు, రైతులు ఆరు బయట ఉండరాదని హెచ్చరింంది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. -
ఈనెలా అరకొర వానలే!
సాక్షి, విశాఖపట్నం: ఈశాన్య రుతుపవనాల సీజన్ ప్రారంభమై దాదాపు పది రోజులవుతోంది. ఈ సీజన్లో రాష్ట్రంలో వానలు సమృద్ధిగా కురవాల్సి ఉంది. కానీ వాటి జాడ కనిపించకుండా పోతోంది. ఇప్పటికే నైరుతి రుతుపవనాల సీజన్ (జూన్–సెపె్టంబర్) కూడా రాష్ట్రంపై మిశ్రమ ప్రభావాన్ని చూపింది. కొన్ని ప్రాంతాల్లో సంతృప్తికరంగా, మరికొన్ని ప్రాంతాల్లో తక్కువగా వర్షాలు కురిశాయి. దీంతో ఆ సీజనులో 521.6 మి.మీలకు గాను 454.6 మి.మీల వర్షపాతం మాత్రమే నమోదైంది. కురవాల్సిన దానికంటే 13 శాతం తక్కువ కురిసిందన్న మాట. సెప్టెంబర్ లోనూ 16 శాతం తక్కువగా సాధారణ వర్షపాతం (20 శాతం కంటే తక్కువ నమోదైతే సాధారణ వర్షపాతంగానే పరిగణిస్తారు) రికార్డయింది. ఇక ఈశాన్య రుతుపవనాల ప్రభావం ఎక్కువగా ఉండే అక్టోబర్‌లో వర్షాలు మరింతగా ముఖం చాటేశాయి. ఈ నెలలో ఏకంగా 90 శాతం భారీ లోటు నమోదైంది. అక్టోబర్ 1 నుంచి 31 వరకు నమోదైన వర్షపాతాన్ని పరిశీలిస్తే.. 99 శాతం లోటుతో కర్నూలు జిల్లా అట్టడుగున నిలిచింది. ఆ జిల్లాలో అక్టోబర్‌లో 112.2 మి.మీలు కురవాల్సి ఉండగా కేవలం 0.1 మి.మీలు మాత్రమే కురిసింది. ఈశాన్య రుతుపవనాల ఆగమనం వేళ (అక్టోబర్ మూడో వారం) బంగాళాఖాతంలో ఏర్పడిన హమూన్ తుపాను వాటి చురుకుదనానికి బ్రేకు వేసింది. గాలిలో తేమను ఆ తుపాను బంగ్లాదేశ్ వైపు లాక్కుని పోవడంతో ఈశాన్య రుతుపవనాలు బలహీనంగా మారాయి. అప్పట్నుంచి అవి చురుకుదనాన్ని సంతరించుకోలేక వర్షాలు కురవడం లేదు. నవంబర్లోనూ అంతంతే.. సాధారణంగా రాష్ట్రంలో నవంబర్లోనూ భారీ వర్షాలు కురుస్తాయి. అయితే రాష్ట్రంలో ఈ నెలలోనూ ఆశించిన స్థాయిలో వానలు కురిసే పరిస్థితుల్లేవని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది. నవంబర్‌లో దక్షిణాది రాష్ట్రాల్లో సగటున సాధారణ వర్షపాతం నమోదవుతుందని, కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాధారణంకంటే తక్కువ వర్షపాతం రికార్డవుతుందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ ఎస్.స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. వచ్చే మూడు రోజులు వానలు.. తాజాగా గురువారం నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 1.5 కి.మీల ఎత్తులో విస్తరించి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనంతో కలిసి శ్రీలంక పరిసరాల్లో కొనసాగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌పైకి ఈశాన్య, తూర్పు గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా ఈనెల ఆరో తేదీ వరకు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఉత్తరకోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల, దక్షిణ కోస్తాలో అనేక చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
AP: రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కొన్నాళ్లుగా వాతావరణం పొడిగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో మార్పు వల్ల ఉక్కపోత ఉంటోంది. తాజాగా గాలుల దిశ మారిన కారణంగా తూర్పు, ఆగ్నేయ గాలులు రాష్ట్రంపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. అదే సమయంలో తేలికపాటి జల్లులు లేదా వర్షాలకు ఆస్కారం ఉందని భారత వాతావరణశాఖ శనివారం ఓ నివేదికలో తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల జల్లులు కురవవచ్చని పేర్కొంది. అదే సమయంలో ఉరుములు, మెరుపులకు ఆస్కారం ఉందని అంచనా వేసింది. -
ఇవాళ, రేపు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు
-
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరాల వద్ద మంగళవారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. ఈ అల్పపీడనం బుధవారం దక్షిణ ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ దిశలో పయనించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం తెలిపింది. మరోవైపు ఉపరితల ద్రోణి అల్పపీడన ప్రాంతం నుంచి ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వరకు కొనసాగుతోంది. వీటన్నిటి ప్రభావంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. బుధవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలకు ఆస్కారం ఉందని ఐఎండీ తెలిపింది. మంగళవారం అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, అనకాపల్లి, పల్నాడు, కాకినాడ, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. కాగా.. అల్పపీడనం, ఉపరితల ద్రోణి, ఆవర్తనాల ప్రభావంతో గంటకు 40–45 కి.మీ, గరిష్టంగా 55 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులెవరూ రానున్న మూడు రోజులు చేపల వేటకు వెళ్లొద్దని సూచించింది. -
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్/విశాఖ: ఈశాన్య బంగాళాఖాతంలో ఆవర్తన ప్రభావంతో.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆవర్తనం రేపటి కల్లా బలపడి అల్పపీడనంగా మారనుంది. ఈ క్రమంలో.. మరో రెండు మూడు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవొచ్చని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే తెలంగాణలో పలు జిల్లాలకు అలర్ట్‌లు జారీ చేసింది వాతావరణ శాఖ. తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌కు భారీ వర్షసూచన చేయడంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ► తెలంగాణలో.. నిన్నటి నుంచి పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. భూపాలపల్లి, ఉమ్మడి ఆదిలాబాద్‌లో వాగులు పొంగిపొర్లి.. పలు గ్రామాలకు రాకపోకలకు స్తంభించాయి. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో.. రెండు గేట్లను ఎత్తి వరదనీటిని దిగువకు వదులుతున్నారు. MASSIVE DOWNPOURS triggering in Nirmal, Nizamabad, Jagitial belt to cover Kamareddy, Sircilla, Karimnagar, Sangareddy, Medak, Siddipet in coming 2hrs Chances looks highly favourable for morning rains in HYD. Will continue to update. Better prefer public transport this morning — Telangana Weatherman (@balaji25_t) September 4, 2023 ► ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను.. మళ్లీ వర్షాలు ప్రజలకు దడపుట్టిస్తున్నాయి. ఈ ఉదయం నుంచి ఆదిలాబాద్ కేంద్రంలో భారీ వాన కురుస్తుండగా.. రోడ్లు జలమయం అయ్యాయి. ఇప్పటికే రాకపోకలు నిలిచిపోగా.. ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ► భూపాలపల్లిలోనూ నిన్నటి నుంచి వాన కురుస్తుండడంతో.. ఓపెన్ కాస్ట్ పనులకు అంతరాయం కలుగుతోంది. ► నిజామాబాద్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. డిచ్‌పల్లిలో అత్యధిక వర్షపాతం నమోదు అయ్యింది. ► ఉమ్మడి మెదక్‌లోనూ భారీ వర్షం కురుస్తోంది. గరిష్టంగా 13 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో.. రేపు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బలంగా గాలులు వీస్తాయని, ఎల్లుండి సైతం భారీ వానలు ఉంటాయని అప్రమత్తం చేస్తోంది. కర్నూలు: జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక వర్షం నేపథ్యంలో.. రాయలసీమ జోన్ ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా పడ్డాయయి. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జోన్ పరిధిలో(సెప్టెంబర్ 4 వ తేది) కర్నూల్ APSP 2 వ బెటాలియన్ లో సోమవారం జరగాల్సిన ఎస్సై అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలను భారీ వర్షం కారణంగా వాయిదా వేస్తున్నట్లు కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు. ఈ పరీక్షలను సెప్టెంబరు 21 తేదికి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న వర్షాలకు సోమశిల జలాశయానికి వరద పెరుగుతోంది. ఇన్ ఫ్లో 13,897 క్యూసెక్కులు.. అవుట్ ఫ్లో 2,774 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 17.610 టీఎంసీలు కాగా.. జలాశయం పూర్తి కెపాసిటీ 78 టీఎంసీలు. అనంతపురం: తాడిపత్రిలో భారీ వర్షం కురుస్తోంది. పలు వాగులు వంకలు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. -
‘నైరుతి’లో కదలిక
సాక్షి, విశాఖపట్నం: చాలా రోజుల తర్వాత నైరుతి రుతుపవనాల్లో కాస్త కదలిక వచ్చింది. దాదాపు మూడు వారాల నుంచి ఇవి స్తబ్ధుగా ఉండిపోయాయి. ప్రస్తుతం ఈ రుతుపవనాలు కోస్తాంధ్రపై మోస్తరుగా ప్రభావం చూపుతున్నాయి. మరోవైపు రాష్ట్రంపై నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం.. పశ్చిమ, నైరుతి గాలులు, రుతుపవనాల ప్రభావం రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు ఉంటుంది. ఆది, సోమవారాల్లో ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల.. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కాగా.. శనివారం చిత్తూరు జిల్లా రామాపురంలో 3.1 సెం.మీ., తిరుపతి జిల్లా అరణ్యకండ్రిగ, నంద్యాల జిల్లా చిలకలూరు, అనంతపురం జిల్లా చిటికలపల్లె 2.7, సత్యసాయి జిల్లా గోరంట్లలో 2.4, ఏలూరు జిల్లా బుట్టాయగూడెంలో 2.3 సెం.మీ.చొప్పున వర్షపాతం నమోదైంది. -
Telangana: నేడు, రేపు వర్షాలు
సాక్షి, హైదరాబాద్: దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. దీంతో బుధ, గురువారాల్లో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా బుధవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గత 24 గంటల్లో కామారెడ్డి జిల్లా నాగరెడ్డిపేట్లో 7 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా పాపన్నపేటలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. మరోవైపు కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో 240 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 41 మంది మృతి చెందారని హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే మరో 5 వేల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని, దాదాపు 5,900 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని చెప్పింది. హెలికాప్టర్ ద్వారా ఐదుగురిని రక్షించామని పేర్కొంది. వర్షాలు, వరదలు ఇంకా కొనసాగనున్న నేపథ్యంలో పూర్తి రక్షణ చర్యలు తీసుకున్నామని పేర్కొంది. -
హైదరాబాద్‌లో మళ్లీ భారీ వర్షం
సాక్షి, హైదరాబాద్: నగరానికి వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం సాయంత్రం కుండపోత వర్షం కురవొచ్చని హెచ్చరించింది. ఆ అంచనాకు తగ్గట్లే పలు చోట్ల భారీ వర్షం కురుస్తోంది. నగరంతో పాటు పాటు శివారుల్లోనూ భారీగా వర్షం పడుతున్నట్లు సమాచారం. దీంతో నగరవాసుల్లో వణుకు మొదలైంది. భారీ వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ సూచిస్తోంది. లోతట్టు ప్రాంతాలకు ఇప్పటికే సిబ్బంది చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆఫీసులు అయిపోయే టైం కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడంతో.. నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. ట్రాఫిక్ సిబ్బంది ఇప్పటికే అలర్ట్ కాగా.. చాలా చోట్ల ఇప్పటికే నెమ్మదిగా ట్రాఫిక్ ముందుకు సాగుతోంది. Heavy Downpour started in Kukutpalli #HyderabadRains .@balaji25_t https://t.co/MqsBHdcmXM pic.twitter.com/CgfI4uCwow — Vudatha Nagaraju (@Pnagaraj77) July 31, 2023 -
వాతావరణ శాఖ హెచ్చరికలు.. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు
సాక్షి, బెంగళూరు: వారం నుంచి వదలని వానలతో కర్ణాటకలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ కేంద్రం హెచ్చరికలతో రేపు (జులై 26న) రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేరళలోనూ వానలు దంచికొడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేని వర్షం జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. ఈక్రమంలోనే అతి భారీ వర్షాలకు అవకాశముందని వాతావరణ శాఖ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వయనాడ్, కోజీకోడ్, కన్నూర్, మళప్పురం జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలు తదుపరి ఆదేశాలు జారీ చేసేంత వరకు మూసి ఉంచాలని రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, వర్ష ప్రభావిత ప్రాంతాల్లోని విద్యాసంస్థలు ఇప్పటికే సెలవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. (షాకింగ్ వీడియో.. గ్రేటర్ నోయిడాలో నీట మునిగిన 200కు పైగా కార్లు) తెరిపినివ్వని వర్షం కారణంగా కాసర్గాడ్ జిల్లాలోని వెళ్లరికుందు, హోస్దుర్గ్ తాలుకాలు జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాల్లోని విద్యాసంస్థలకు కూడా సెలవులు ఇస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా, వానలు, వరదల కారణంగా కేరళలలో ముగ్గురు ప్రాణాలు విడిచినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇడుక్కి, వయనాడ్, కాసర్గాడ్ జిల్లాలో సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. పలు చోట్ల చెట్లు కూలి ఇళ్లు ధ్వంసమయ్యాయని, భారీ వృక్షాలు ఉన్న చోట్ల జనం జాగ్రత్తగా ఉండాలని పేర్కొంది. కాగా, జులై 27 వరకు దక్షిణ భారతానికి భారీగా వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. (ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు..రేపు.. ఎల్లుండి ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు) -
తెలంగాణలో మరో మూడు రోజులు కుండపోత.. వాన దంచికొట్టే జిల్లాలివే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ ఒడిస్సా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని తెలిపింది. ఈ అల్పపీడనం జూలై 26వ తేదీన వాయుగుండంగా మారుతుందని అంచనా వేసింది. ఈమేరకు సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలంగాణ రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న మూడురోజులు (జులై 25,26,27) రాష్ట్రంలో అతి నుంచి అత్యంత భారీ వర్షాలు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. మంగళవారం రోజున హైదరాబాద్ లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. (చదవండి: విద్యాసంస్థలకు సెలవులు పొడిగించేనా!) జులై 25, మంగళవారం ⇒ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం. ⇒ భారీ నుంచి అతి భారీ వర్షాలు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగాం, సిద్దిపేట అక్కడక్కడ కురిసే అవకాశం. ⇒ భారీ వర్షాలు జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్ని చోట్ల కురిసే అవకాశం. ⇒ తెలంగాణ రాష్ట్రంలో గంటకు 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం. ⇒ అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, యానాం, కర్నాటకలనూ భారీ వర్షాలు కురిసే అవకాశం. రాయలసీమ, కర్నాటకలోనూ భారీ వర్షాలకు అవకాశం. (చదవండి: Snake On TVS Bike: ద్విచక్రవాహనం ఎక్కిన పాము..) -
వాన అప్పుడే అయిపోలేదు.. మరో ఐదు రోజులు దంచికొట్టుడే!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు నైరుతి రుతుపవనాల ప్రభావం, మరోవైపు అల్పపీడనం కారణంగా తెలంగాణవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో రాష్టంలో ఐదు రోజులు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అంచనావేసింది. పలు జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే సూచనలున్నాయని వెల్లడించింది. రెండు రోజులు (గురువారం, శుక్రవారం) మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలోని నాలుగు జిల్లాలకు వాతావారణ శాఖ రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. (చదవండి: వాన లోటు తీరినట్టే!) కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడక్కడ అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, నారాయణపేట, హైదరాబాద్ జిల్లాలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. (చదవండి: తెలంగాణలో నేడు, రేపు స్కూల్స్ బంద్) -
Heavy Rains: ఉత్తర భారతానికి ఈ పరిస్థితి ఎందుకు?
ఢిల్లీ: ఆలస్యంగా వచ్చిన రుతుపవనాలు, బిపర్జోయ్ తుపాను ప్రభావమూ ఓ పక్క.. ఇంకోపక్క అధిక ఉష్ణోగ్రతల ప్రభావమూ ఈ యేడు వానల్ని ఆలస్యం చేశాయి. అయితే ఈలోపు రికార్డు స్థాయిలో ఉత్తరాదిన కురుస్తున్న వర్షాలు.. అతలాకుతలం చేస్తున్నాయి. భీకర వర్షాలతో సగానికి పైగా ఉత్తర భారతం నీట మునిగింది. మరోపక్క ఆస్తి నష్టంపై ఇప్పుడే అంచనాకి రాలేని స్థితిలో.. మృతుల సంఖ్యా వందకు పైనే ఉండొచ్చని తెలుస్తోంది. అయితే ఉన్నట్లుండి ఉత్తరాదిపై వరుణుడు ఇంతగా ప్రతాపం చూపించడానికి కారణంపై భారత వాతావరణ శాఖ స్పందించింది. ఉత్తర భారతంలో నెలకొన్న అసాధరణ పరిస్థితిపై ఐఎండీ స్పష్టత ఇచ్చింది. పశ్చిమ భాగంలో నెలకొన్న సంక్షోభం(వాతావరణ మార్పులు).. అదే సమయంలో రుతుపవనాల ప్రభావం వల్ల ఉత్తర భారత దేశంలో ఈ భీకర వర్షాలు కురుస్తున్నాయని భారత వాతావరణ శాఖ అంటోంది. అలాగే జులై మొదటి వారంలో కురిసిన వర్షాలు.. మొత్తం దేశానికి లోటును భర్తీ చేశాయని తెలిపింది ఐఎండీ. ये आवाज किसकी है? #DelhiRains . Who know this ? #Chandigarh #Atlee #JawanPrevue #Heavyrainfall #Manali #PriyAnkit #TejRan #oriele #emeutes #himachalfloods pic.twitter.com/TC2OgiNqwd — Baba Chuskiwale (@BabaChuskiWale) July 10, 2023 #WATCH | Himachal Pradesh: Latest visuals from Mandi around Victoria Bridge and Panchvakhtra Temple. pic.twitter.com/1jnhmTr8V6 — ANI (@ANI) July 10, 2023 వర్షాకాలంలో సంచిత వర్షపాతం 243.2 మిల్లీమీటర్లకు చేరుకుంది, ఇది సాధారణం 239.1 మిమీ కంటే రెండు శాతం ఎక్కువ అని IMD ప్రకటించింది. అలాగే.. జూన్ చివరి నాటి కల్లా దేశం మొత్తం మీద 148.6 మి.మీ నమోదు కాగా.. అది సాధారణ వర్షపాతం కంటే 10 శాతం తక్కువ తెలిపింది. వాస్తవానికి ఈ జులైలో సాధారణ వర్షపాతమే నమోదు అవుతుందని ఐఎండీ అంచనా వేసింది. కానీ.. వాతావరణ మార్పుల వల్ల అంచనాలు తప్పి అధిక వర్షాలు కురుస్తున్నాయి. जितना हम प्रकृति को नुकसान पहुंचाएंगे, वो हमे भी उतना ही नुकसान पहुंचाएगी 😥 Pray for Himachal #Heavyrainfall #HimachalPradesh #flood #Himachalrain #himachalflood #staysafe #mandi #Kullu pic.twitter.com/j222xFbmbc — कंचन शर्मा (@itsKanchan7) July 10, 2023 ఉత్తర భారతంలో చాలా రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొండచరియలు విరిగిపోవడం, ఆకస్మాత్తుగా వరదలు పొటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. పలు నదులు ఉప్పోంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు చోట్ల ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక యంత్రాంగం రంగంలోకి దిగి వరదల్లో చిక్కుకున్నవారిని కాపాడుతున్నారు. వరదల ధాటికి.. వాహనాలు, రోడ్లు, వంతెనలు, భవనాలు సైతం కొట్టుకుపోతున్నాయి. #WATCH | Water level in Yamuna river reaches near danger mark at Old Railway Bridge. pic.twitter.com/oNfL7qwe1c — ANI (@ANI) July 10, 2023 #Heavyrainfall #HimachalPradesh pic.twitter.com/L0RGEKkzbI — Satendra Pandit (@SatendraPandi10) July 10, 2023 రాజధాని ఢిల్లీ రీజియన్ సహా.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, జమ్ము కశ్మీర్, రాజస్థాన్‌కూ ఇంకా వాన ముప్పు తప్పలేదని వాతావరణ శాఖ హెచ్చరించింది. యమునా నది ఉగ్ర రూపం దాల్చి.. ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. మరోవైపు సెంట్రల్ వాటర్ కమిషన్.. నీటి నిల్వలపైనా ఒక ప్రకటన చేసింది. రిజర్వాయర్లోల నీటి సామర్థ్యం మెరుగుపడిందని పేర్కొంది. -
ఏపీ: తీవ్రమైన వడగాల్పులతో జాగ్రత్త!
సాక్షి, న్యూఢిల్లీ: వర్షాకాలం వచ్చినా.. వేసవి తాపం నుంచి భారత్ ఊరట పొందడం లేదు. రుతుపవనాలు ప్రవేశించినా కూడా పలు రాష్ట్రాల్లో ఇంకా తొలకరి పలకరింపు జరగలేదు. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో వడగాల్పులు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది భారత వాతావరణ శాఖ. ఒడిశా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులో తీవ్ర నుంచి అతితీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అక్కడక్కడా వర్షాలు పడినప్పటికీ.. చాలావరకు ఆయా రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలే ఉంటాయని తెలిపింది. తెలుగు రాష్ట్రాలనైతే ఎండలు హడలెత్తిస్తున్నాయి. ఏపీ విషయానికొస్తే.. దాదాపు 300 మండలాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి. 23 మండలాల్లో మరీ తీవ్రంగా ఉండొచ్చని అంచనా వేస్తోంది. పెద్దలు, పిల్లలు, అనారోగ్యంతో బాధపడేవాళ్లు.. అవసరమైతేనే బయటకు రావాలని, డీహైడ్రేషన్ నేపథ్యంలో దాహం వేయకున్నా నీరు తాగాలని వైద్య నిపుణులు సూచించారు. ఇక బాపట్ల, అల్లూరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తోంది ఐఎండీ. బిపర్జోయ్ తుపాను బలహీనపడడం, మరో 12 గంటలపాటు పరిస్థితి కొనసాగేలా కనిపిస్తుండడంతో.. రేపు సాయంత్రానికిగానీ, ఎల్లుండికిగానీ ఏపీలో రుతుపవనాల ప్రభావం కనిపించొచ్చని అంచనా వేస్తోంది వాతావరణ శాఖ. ఇదీ చదవండి: జూన్ మూడోవారంలోనూ నిప్పుల కొలిమిలా తెలంగాణ -
దెబ్బకొట్టిన బిపర్జోయ్.. ఏపీకి మండుటెండల అలర్ట్
సాక్షి, ఢిల్లీ: జూన్ మూడో వారం వచ్చేసింది. ఈపాటికే వర్షాలు దంచికొట్టాలి. కానీ, ఎర్రటి ఎండలు మాత్రం మే నెలను తలపిస్తున్నాయి. పైగా అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్జోయ్ తుపాను.. రుతుపవనాలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్టంగానే కొనసాగుతుండగా.. వర్షాలు ఇంకా ఆలస్యంగా కురవొచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈలోపు ఆంధ్రప్రదేశ్‌లోని 478 మండలాల్లో అలర్ట్ జారీ చేసింది. మరో 2-3 రోజుల పాటు కోస్తాంధ్రలో వడగాల్పులు కొనసాగుతాయని తెలిపింది. అయితే.. రాయలసీమలో మాత్రం రేపటి(17-06) నుంచి వేడి తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తోంది. అలాగే ఎల్లుండి నుంచి సీమలో భారీ వర్షాలకు అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తొలకరిని మోసుకొచ్చే నైరుతి రుతుపవనాలు.. ఈ ఏడాది దోబూచులాడుతున్నాయి. జూన్ 8నే కేరళను తాకి మెల్లిగా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు చేరుకున్నట్లు కనిపించాయి. ఆలస్యంగా అయినా వచ్చేశాయంటూ సంబురపడే లోపే.. బిపోర్ జాయ్ తుపాను ప్రభావం దానిని ముందుకు కదలనివ్వకుండా అడ్డుకుంది. అంతా సవ్యంగా ఉంటే.. ఎల్లుండి(జూన్ 19) నుంచి నైరుతి రుతుపవనాలు ఏపీలోని ఇతర ప్రాంతాలకు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. -
గుజరాత్లో బిపర్జాయ్ బీభత్సం.. భీకర గాలులు, కుండపోత
ఢిల్లీ: మహోగ్ర రూపంతో దూసుకొచ్చిన బిపర్జాయ్ తుపాన్ కోట్ లఖ్‌పత్ సమీపంలో గుజరాత్ తీరాన్ని తాకింది. ఈ ప్రభావంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కూడిన భీకరమైన గాలులు, మరోవైపు కుండపోత వర్షంతో కురుస్తోంది. తీరం దాటే సమయానికి వాయు వేగం ఇంకా పెరగనుంది. గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బిపర్జోయ్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటాక తీవ్ర తుపానుగా.. ఆపై వాయుగుండంగా బలహీనపడుతుంది. ఆ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే ఛాన్స్ ఉంది. గుజరాత్‌లోని సముద్ర తీరం వెంట ఉన్న 8 జిల్లాల అధికార యంత్రాంగం ఇప్పటికే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. తుపాను తీరానికి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దూసుకొచ్చే ఈ తుపాను తీరాన్ని పూర్తిగా దాటడానికి ఆరు గంటల సమయం పడుతుంది అని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మహోపాత్ర వివరించారు. 🌀 సౌరాష్ట్ర, కచ్ తీరాన్ని దాటుకుని జఖౌ పోర్ట్ వద్ద మాండ్వీ, కరాచీ(పాకిస్థాన్) వైపుగా మళ్లీ అక్కడ తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. 🌀 తుపాను కేటగిరీ-3 ప్రకారం.. ఇది అత్యంత తీవ్రమైన తుపానుగా పరిగణించనున్నారు. 🌀 కచ్‌తో పాటు దేవ్‌భూమి ద్వారకా, జామ్నానగర్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ ఇదివరకే ప్రకటించింది. అంచనాకు తగ్గట్లే ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. కచ్ జిల్లాలో 120 గ్రామాల ప్రజలను(తీరానికి పది కిలోమీటర్ల రేంజ్లో..) ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 🌀 తుపాన్‌పై గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్లో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. మొత్తం గుజరాత్ అరేబియా సముద్ర తీరం వెంట ఉన్న ఎనిమిది జిల్లాల నుంచి లక్ష మందిని తాత్కాలిక ఆశ్రయాలకు తరలించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 🌀 కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ తరపున ఎనిమిది బృందాలు, రాష్ట్రం తరపున ఎస్టీఆర్ఎఫ్ బృందాలు 12, రోడ్లు భవనాల విభాగం నుంచి 115 బృందాలు, విద్యుత్ విభాగం నుంచి 397 బృందాలను తీరం వెంబడి జిల్లాల్లో మోహరింపజేశారు. 🌀 ఇక కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటన చేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, ఇండియన్ కోస్ట్ గార్డు సిద్ధంగా ఉన్నాయి. 🌀 సరిగ్గా రెండేళ్ల తర్వాత గుజరాత్‌ను తాకబోయే తుపాను ఇది. #CycloneBiparjoy As the landfall process of Cyclone #Biparjoy commences, the shed of a petrol pump starts crumbling- WATCH.@rrakesh_pandey briefs about the destruction that has taken place on the ground. pic.twitter.com/pyS3nmXCy4 — TIMES NOW (@TimesNow) June 15, 2023 Video Credits: TIMES NOW -
ఉగ్రరూపం దాలుస్తున్న బిపర్ జోయ్ తుపాను
బిపర్ జోయ్ తీవ్ర తుపానుగా మారబోతోందా..? కేంద్ర వాతావరణ శాఖ ఏమని హెచ్చరిస్తోంది..? దీని ప్రభావం ఏ రాష్ట్రాలపై ఎక్కువ ప్రభావం ఉంటుంది..? అసలు బిపర్ జోయ్ అంటే ఏంటి..? అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్ జోయ్ తుపాను మరికొన్ని గంటల్లో తీవ్ర తుపానుగా మారబోతోందంటూ ఐఎండి హెచ్చరికలు జారీ చేసింది. తుపాను ఉత్తర, ఈశాన్య దిక్కుగా తుపాను కదులుతోందని తెలిపింది. తుపాను కేంద్రీకృతమైన ప్రాంతంలో గంటకు 145 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో కర్ణాటక, గోవా, మహారాష్ట్ర, లక్షద్వీప్, గుజరాత్, కేరళ రాష్ట్రాలకు ఐఎండీ అలెర్ట్ ప్రకటించింది. తీవ్ర తుపాను కారణంతో ఈ కోస్టల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. మరోవైపు తుపాను నేపథ్యంలో గుజరాత్ లోని ప్రఖ్యాత టూరిస్ట్ డెస్టినేషన్ అయిన వల్సాద్ లోని తిథాల్ బీచ్ ను ఈ నెల 14 వరకు మూసి వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లవద్దని... సముద్రంలోకి వెళ్లిన వారు వెంటనే ఒడ్డుకు చేరుకోవాలని తెలిపారు. మరోవైపు, వార్నింగ్ సిగ్నల్ ఇవ్వాలని పశ్చిమ తీరంలోని అన్ని పోర్టులకు ఆదేశాలు జారీ అయ్యాయి. బిపర్ జోయ్ అని బంగ్లాదేశ్ సూచించిన పేరు అదలా ఉంటే.. ప్రతి తుపానుకు ఒక పేరు పెట్టడం అనేది ఆనవాయితీగా వస్తోంది.. ఈ క్రమంలోనే.. ఇప్పుడు అరేబియా సముద్రంలో ఏర్పడిన తుపానుకు బిపర్ జోయ్ అనే పేరు పెట్టారు. ఇది బంగ్లాదేశ్ సూచించిన పేరు. బిపర్ జాయ్ అంటే విపత్తు అని దీని అర్థం. మరి ఈ విపత్తు నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. -
అత్యంత తీవ్ర రూపంలో బిపోర్జాయ్.. ఈ రాష్ట్రాలకు అలర్ట్
అరేబియాలో ఏర్పడిన బిపోర్జాయ్ #CycloneBiparjoy తుపాను అత్యంత తీవ్ర రూపం దాల్చనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాబోయే 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చి.. భారీ వర్షాలకు కారణమవుతుందని శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. బిపోర్జాయ్ ప్రభావంతో కర్ణాటక, గోవా, మహారాష్ట్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే.. కర్ణాటక-మహారాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ ప్రాంతాల్లోనూ తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడొచ్చని తెలిపింది. మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుపాను ఉధృతి పెరిగే సమయంలో బలమైన ఈదురు గాలులు వీయనున్నాయి. తుపాన్ మరింత బలపడి ఉత్తర-ఈశాన్య దిశగా పయనించనుంది. ప్రస్తుతం గోవాకు 690 కి.మీ. దూరంలో పశ్చిమాన.. ముంబైకి పశ్చిమనైరుతి దశలో 640 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. భారీ అలల కారణంగా గుజరాత్ ఫేమస్ తితాల్ బీచ్‌ను అధికారులు నాలుగు రోజులపాటు మూసేశారు. VSCS BIPARJOY lay centered at 0830IST of today, near latitude 16.7N and longitude 67.4E, about 700 km WNW of Goa, 620 km WSW of Mumbai, 600 km SSW of Porbandar and 910 km S of Karachi. To intensify further and move NNE-wards gradually during next 24 hours. pic.twitter.com/o4LHhzOuP8 — India Meteorological Department (@Indiametdept) June 10, 2023 So finally #CycloneBiparjoy might have decided to end up somewhere between Gujarat and Pakistan area. More as we move on.... pic.twitter.com/GOxXZG1Mhx — Leanguy (@The_Techocrat) June 10, 2023 ఇదీ చదవండి: ఒడిశా ప్రమాద ఘటనాస్థలిలో దుర్వాసన.. ఇంకా శవాలున్నాయా? -
కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
-
గుడ్‌న్యూస్.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు
సాక్షి, ఢిల్లీ: భారత వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఇవాళే కేరళను తాకినట్లు అధికారికంగా ప్రకటించింది. అంతకు ముందు రేపు(శుక్రవారం) రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేసింది. అయితే.. ముందుగానే ఇవాళ చేరుకుంది. రుతుపవనాల రాక ప్రభావంతో.. రానున్న 48 గంటల్లో కేరళ, కర్ణాటక, తమిళనాడు సహా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలుపడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఆలస్యంగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని చెబుతోంది. వారం తర్వాతే అంతటా వర్షాలు ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది దోబూచులాడిన రుతుపవనాలు.. ఆలస్యంగా ప్రవేశించాయి. దక్షిణ అరేబియా సముద్రం మీదుగా పడమట గాలులు కొనసాగుతున్నాయి. అంతకు ముందు పశ్చిమ గాలుల లోతులో పెరుగుదల, ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్, కేరళ తీర ప్రాంతాలపై మేఘావృతం ఉధృతం కావడం వంటి పరిణామాలు కనిపించాయి. తెలంగాణలో మూడురోజులపాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది వాతావరణశాఖ. అయితే.. గురు, శుక్రవారాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏపీకి ఉపశమనం కాస్త ఆలస్యం కావొచ్చని అంచనా వేస్తోంది. -
ఏపీకి చల్లని కబురు.. నైరుతి రుతుపవనాల ప్రవేశం ఎప్పుడంటే?
సాక్షి, విశాఖపట్నం: ఈ ఏడాది జూన్ 15వ తేదీకి రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రతి ఏడాదీ మే 20 నాటికి అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. జూన్ 1 నాటికి కేరళను తాకుతాయి. అప్పట్నుంచే దేశంలో నైరుతి రుతుపవనాల ప్రభావం మొదలవుతుంది. అయితే ఈ ఏడాది ‘నైరుతి’ మూడు రోజులు ఆలస్యంగా జూన్ 4 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. గతేడాది మే 20వ తేదీ కంటే వారం రోజుల ముందే నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రంలోకి ప్రవేశించాయి. ఈసారి మాత్రం ఒకటి, రెండు రోజుల ముందు ప్రవేశించి.. ఈనెల 22 నాటికి అండమాన్, నికోబార్ దీవుల అంతటికీ విస్తరిస్తాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు రుతుపవనాల ప్రవేశానికి సూచికగా మూడు రోజులుగా అండమాన్, నికోబార్ దీవుల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చదవండి: సీఎం జగన్ విజయవాడ పర్యటన షెడ్యూల్ ఇదే.. అనంతరం రుతుపవనాలు జూన్ 4 నాటికి కేరళను తాకనుండటంతో.. ఆ ప్రభావం ఏపీపైనా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకిన పది రోజుల్లోగా రాయలసీమ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. అనంతరం మరో వారం రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు విస్తరిస్తాయి. అంతా అనుకూలిస్తే జూన్ 10కి బదులు 15వ తేదీకల్లా రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశముందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్లోనూ రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాగల ఐదు రోజుల పాటు వర్షాలు.. కోస్తా నుంచి దక్షిణ తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటితో పోలిస్తే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టనున్నాయి.నిన్న జంగమహేశ్వరం లో 45.2 బాపట్ల 45 నరసాపురం 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖపట్నం, ఆరోగ్యవరం, కళింగపట్నం ప్రాంతాల్లో సగటున 40 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదైంది. -
తెలుగు రాష్ట్రాల్లో ఠారెత్తిస్తున్న ఎండలు
-
వాయుగుండం కాదు.. వచ్చేది తుపానే
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడుతుందనుకుంటున్న వాయుగుండం అంచనా తప్పి బలపడనుంది. తుపానుగా మారి తమిళనాడు–దక్షిణ కోస్తాంధ్ర వైపు పయనించనుంది. దీని ప్రభావం మన రాష్ట్రంపై కూడా పడనుంది. కాగా.. దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మంగళవారం సాయంత్రానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. అదే దిశలో పయనిస్తూ తుపానుగా బలపడి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించనుంది. ఈ నెల 8న ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి–దక్షిణ కోస్తాంధ్ర సమీపంలో తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) సోమవారం తెలిపింది. దక్షిణ కోస్తా.. రాయలసీమపై అధిక ప్రభావం ఈ తుపాను ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఎక్కువగాను.. ఉత్తర కోస్తాలో స్వల్పంగాను ఉంటుందని తెలిపింది. బుధవారం దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు జిల్లాలో అక్కడక్కడా భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. గురువారం దక్షిణ కోస్తాలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అదే రోజున ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం దక్షిణ కోస్తాలో అనేకచోట్ల, ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవవచ్చని ఐఎండీ వివరించింది. వాయుగుండం, తుపాను ప్రభావంతో ఈ నెల 8, 9 తేదీల్లో కోస్తాలో తీరం వెంబడి గంటకు 40నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని పేరు ‘మాండూస్’ ఈ తుపానుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) సూచించిన ‘మాండూస్’ అనే పేరు పెట్టనున్నారు. ఈ పేరును వాయుగుండం తుపానుగా మారిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. 15న మరో అల్పపీడనం ఈ నెల 15వ తేదీన అండమాన్ సముద్రం లేదా దక్షిణ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముంది. దీని ప్రభావం 20వ తేదీ వరకు ఉండే అవకాశం ఉంది. ఏపీ తీరంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటంతో అల్పపీడనాలు ఏపీ తీరంవైపు కదలడం లేదని అంచనా వేస్తున్నారు. -
AP Rain Alert: కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం.. రానున్న మూడు రోజులు
సాక్షి, అమరావతి/ సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం కోస్తాంధ్రపై ఆవరించి ఉంది. అదే సమయంలో ఉత్తర అండమాన్ నుంచి మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్ తీరం వరకు తూర్పు–పశ్చిమ ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ బుధవారం రాత్రి ఓ నివేదికలో తెలిపింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. -
శ్రీశైలంలోకి పెరిగిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల (రెంటచింతల): కృష్ణా ప్రధానపాయపై నారాయణపూర్ డ్యామ్‌కు దిగువన.. తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి మళ్లీ వరద పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,79,268 క్యూసెక్కులు చేరుతుండగా.. గరిష్టస్థాయిలో అంటే 885 అడుగుల్లో 215.80 టీఎంసీలను నిల్వచేస్తూ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 20 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688, కల్వకుర్తి ద్వారా 1,967 క్యూసెక్కులు తరలిస్తున్నారు. స్పిల్ వే ఏడుగేట్లను పదడుగులు ఎత్తి 1,96,525 క్యూసెక్కులు, విద్యుదుత్పత్తి చేస్తూ కుడిగట్టు కేంద్రం ద్వారా 30,924, ఎడమగట్టు కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 2,09,791 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 17,246 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. స్పిల్ వే గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ 1,93,185 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 588.9 అడుగుల్లో 308.76 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. పులిచింతలలోకి 1,82,816 క్యూసెక్కులు చేరుతుండగా.. 169.79 అడుగుల్లో 38.04 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 1,69,871 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,60,937 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణాడెల్టాకు 15,687 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగిలిన 1,45,250 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా బేసిన్లో ఎగువన మరో రెండ్రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న భారత వాతావరణ సంస్థ అంచనాల నేపథ్యంలో కృష్ణాలో వరద ఉధృతి మరో 3, 4 రోజులు ఇదే రీతిలో కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
AP: మూడు రోజులు వానలు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురవడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయి. కొద్ది రోజులుగా రాష్ట్రంలో వానలు తగ్గాయి. కొన్నిచోట్ల అరకొరగా కురుస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో ఎండలు కాస్తున్నాయి. తాజాగా ఉత్తర బంగాళాఖాతం మీదుగా వాయవ్య బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి నైరుతి వైపునకు వంగి ఉంది. మరోవైపు ఉత్తర మధ్య అంతర్భాగ తమిళనాడు, పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. వీటి ఫలితంగా బుధవారం రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. అనంతపురం జిల్లా బీకే సముద్రం మండలం రేకులకుంటలో అత్యధికంగా 17.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గురు, శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. శుక్రవారం రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
TS: రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: ఒడిశా, పశ్చిమ బెంగాల్ పరిధిలోని వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఆదివారం ఉదయానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఒడిశా, దాన్ని అనుకుని ఉన్న ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరం వద్ద కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీ డనం ఒడిశా, ఛత్తీస్‌గఢ్ మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
గుజరాత్లో వరుణ విలయం
అహ్మదాబాద్: దక్షిణ గుజరాత్లో శుక్రవారం భీకర వర్షం కురిసింది. కొన్ని గంటలపాటు ఎడతెరిపిలేని వాన కారణంగా జనం తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. అహ్మదాబాద్ నగరంలో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జామ్‌నగర్, దేవభూమి ద్వారక, జునాగఢ్ జిల్లాలో కుండపోత వాన కురిసినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. వల్సాద్ జిల్లాలోని కాప్రాడా తాలూకాలో శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా రికార్డు స్థాయిలో 205 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. నవసారిలోని వన్స్‌దాలో 164 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అహ్మదాబాద్‌లోని ఉస్మాన్‌పురా ప్రాంతంలో కేవలం 3 గంటల్లో 228 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు కావడం గమనార్హం. చాకుడియా, విరాట్‌నగర్‌లోనూ భారీ వర్షం కురిసింది. దక్షిణ గుజరాత్లో రానున్న 4 రోజులపాటు భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ముంబైలో కొంత ఊరట నాలుగు రోజులుగా ముంబైని ముంచెత్తుతున్న వర్షం శుక్రవారం కొద్దిగా తెరపినిచ్చింది. బస్సులు, సబర్బన్ రైలు సర్వీసులు యథావిధిగా నడిచాయి. రాగల 24 గంటల్లో 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతోపాటు అక్కడక్కడా అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అధికారులు అలెర్ట్ చేశారు. థానె జిల్లా మిరాభయందర్ ప్రాంతంలో చెనా నది వరదలో చిక్కుకున్న ముగ్గురిని ఫైర్ సిబ్బంది రక్షించారు. రాయ్‌గఢ్ జిల్లాలో 24 గంటల వ్యవధిలో 100 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మాథేరన్‌లో అత్యధికంగా 210 మిల్లీమీటర్లు కురిసింది. జమ్మూకశ్మీర్‌తోపాటు తెలంగాణ, రాజసాŠత్న్, కర్ణాటక, గోవా తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
నేడు పలుచోట్ల భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వరకు సగటు సముద్రమట్టం వద్ద ఉన్న ఉపరితల ద్రోణి మంగళవారం బలహీనపడింది. దీంతో కిందిస్థాయి గాలులు నైరుతి దిక్కు నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో బుధవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్నిచోట్ల రెండ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వివరించింది. ఇదిలావుండగా, గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కొమురంభీం జిల్లా కాగజ్‌నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి, జగిత్యాల జిల్లా సారంగాపూర్‌లలో 12 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. గోవిందరావుపేట, భీమినిలలో 11 సెంటీమీటర్లు, ఘన్పూర్, తాడ్వాయి, భీమదేవరపల్లిలలో 10 సెంటీమీటర్లు, జగిత్యాల, ధర్మసాగర్, చేవెళ్ల, దిండిగల్, చిగురుమామిడి, ఖానాపూర్, చెన్నారావుపేట, హసన్‌పర్తి ప్రాంతాల్లో 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
చిరపుంజిలో రికార్డ్ స్థాయి వర్షం
న్యూఢిల్లీ: దేశంలో అత్యధిక వర్షపాతానికి చిరునామాగా నిలిచిన చిరపుంజిలో గత 27 ఏళ్లలో జూన్‌లో ఎన్నడూలేనంతటి భారీ వర్షపాతం ఈ ఏడాది నమోదైంది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు అంటే ఒక రోజులో ఏకంగా 811.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అక్కడ 1995 తర్వాత జూన్‌లో ఒక్కరోజులో ఇంతటి వర్షపాతం నమోదవడం ఇదే తొలిసారి అని భారత వాతావరణ శాఖ బుధవారం పేర్కొంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్లే ఇంతటి వర్షం పడిందని వెల్లడించింది. మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర వరకు మాసిర్రమ్లో 710.6 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవడం గమనార్హం. 1974–2022 కాలానికి ప్రపంచంలోనే అత్యంత అధిక వర్షపాతం నమోదైన ప్రాంతంగా మాసిర్రమ్ గతంలో రికార్డులకెక్కడం తెల్సిందే. చిరపుంజి, మాసిడ్రమ్ రెండూ దాదాపు 10 కి.మీ.ల దూరంతో మేఘాలయలోనే ఉన్నాయి. -
నాలుగురోజులు... వడగాల్పులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరగడంతో వడగాల్పులు నమోదవుతున్నాయి. రానున్న నాలుగు రోజులు పలుచోట్ల వడగాల్పుల తీవ్రంగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలలో వడగాల్పుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆయా జిల్లాల యంత్రాంగాలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సూచనలు ఇవ్వాలని సూచించింది. -
భానుడి భగభగలతో బతకలేం బాబోయ్! ఆరెంజ్ అలర్ట్ జారీ
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉత్తరాది రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. వేడి, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిపోయాయి. ఢిల్లీలోని సిరి ఫోర్ట్ కాంప్లెక్స్ వద్ద గురువారం అత్యధికంగా 44.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ సహా ఐదు రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. చదవండి👉🏻 విద్యార్థులకు ఫ్రీ హెయిర్ కటింగ్ చేయించిన టీచర్లు.. అసలు మ్యాటర్ ఏంటంటే! ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హరియాణా, ఒడిశాల్లో వచ్చే మూడురోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని హెచ్చరికలు జారీచేసింది. మే తొలివారంలో వర్షాలు పడే వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక పెరిగిన ఉష్ణోగ్రతల నేపథ్యంలో విద్యుత్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. బొగ్గు నిల్వలు అడుగంటడంతో థర్మల్ విద్యుత్ తయారీ సంకటంలో పడిందని మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి చెప్పడం గమనార్హం. కొరత కారణంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు షురూ అయ్యాయి. చదవండి👉 క్షణక్షణం ఉత్కంఠ.. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో -
మార్చిలో 122 ఏళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు
న్యూఢిల్లీ: దేశంలో ఈ ఏడాది మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ శనివారం తెలిపింది. గత నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చురుకైన పశ్చిమ పవనాలు లేకపోవడం, అల్ప వర్షపాతమే ఇందుకు కారణమని విశ్లేషించింది. దీర్ఘకాలం సరాసరి వర్షపాతం 30.4 మిల్లీమీటర్లు కాగా, ఈసారి 71% తక్కువగా 8.9మి.మీ. మాత్రమే నమోదైందని వివరించింది. 1908 తర్వాత ఇదే అత్యల్ప వర్షపాతమని తెలిపింది. ‘దేశం మొత్తమ్మీద చూస్తే, 33.10 డిగ్రీల సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 2022లో నమోదైంది. గత 122 ఏళ్లలో ఇదే అత్యధికం’ అని ఐఎండీ పేర్కొంది. దేశంలో 2010 మార్చిలో 33.09 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది. -
దూసుకోస్తున్న 'అసని తుపాను'...భారీ నుంచి అతి భారీ వర్షాలు
న్యూఢిల్లీ: ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం మరో 24 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారుతుందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) ఆదివారం తెలిపింది. అల్పపీడనం వాయుగుండంగా మారే క్రమంలో తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా కదులుతున్న అల్ప పీడనం తూర్పు ఈశాన్య దిశగా కదులుతూ మరింతగా బలపడింది. ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతంలో వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావం అండమాన్ నికోబార్ దీవులపై అధికంగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. అక్కడ బలమైన ఈదురుగాలులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. తుఫాను బంగ్లాదేశ్, ఉత్తర మయన్మార్ వైపు కదులుతుందని గత వారం ఐఎండీ అంచనా వేసింది. ఏదేమైనా తుపాన్ ప్రభావం తూర్పు, ఈశాన్య భారతంపై ఉండే అవకాశం కనిపిస్తోంది. అండమాన్ నికోబార్ దీవులలోని కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా. ఇది మార్చి 20న అల్ప పీడనంగా మారి..మార్చి 21వ తేదీన 'అసని' తుఫానుగా రూపాంతరం చెందుతుందని అధికారులు పేర్కొన్నారు. మత్స్యకారులు మార్చి 22 వరకు బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవులతో పాటు తూర్పు-మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోకి వెళ్లవద్దని వాతావారణ శాఖ సూచించింది. అండమాన్ నికోబార్ చీఫ్ సెక్రటరీ జితేంద్ర నారాయణ్ తుఫాను దృష్ట్యా మార్చి 22 వరకు - నాలుగు రోజుల పాటు అన్ని పర్యాటక కార్యకలాపాలను నిలిపివేశారు. (చదవండి: దేశంలోనే ఫస్ట్.. కేజ్రీవాల్ సంచలన నిర్ణయం.. అది జరిగితే..) -
నిష్క్రమించిన ఈశాన్య రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి ఈశాన్య రుతుపవనాలు నిష్క్రమించాయి. దీనికి తోడు మధ్య భారతదేశం నుంచి వీస్తున్న పొడిగాలుల కారణంగా వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టనున్నాయి. బుధవారం నుంచి చలి గాలుల తీవ్రత పెరుగుతుందని, మొత్తంగా శీతాకాలం పూర్తిగా ప్రవేశించినట్లేనని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ శీతాకాలంలో రాష్ట్రంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు, హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల కారణంగా సాధారణ పరిస్థితులే కనిపిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతల ప్రభావం మామూలుగా ఉన్నట్లు కనిపించినా.. ఈశాన్య గాలులు వీస్తుండటం, మంచు ప్రభావంతో చలి వణికించే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. రెండు రోజులుగా రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. కోస్తా, రాయలసీమల్లో పొడి వాతావరణం నెలకొంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల్లో దట్టమైన పొగమంచు ఏర్పడింది. -
హైదరాబాద్‌లో చిరుజల్లులు.. రాగల 48 గంటల పాటు వర్షాలు..
సాక్షి, హైదరాబాద్: నగరంలో గత రెండు రోజుల నుంచి అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్‌లో శనివారం వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరంలో శనివారం సాయంత్రం చిరుజల్లులు కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాసబ్ ట్యాంక్, పంజగుట్టతోపాటు పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగాతాయని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చదవండి: కుండపోత వర్షాలతో హైదరాబాద్ మునక.. ఏటా ఇదే సీన్.. అయినా! కాగా తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ విభాగం అధిపతి కే నాగరత్న తెలిపారు.. హైదరాబాద్ సహా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటిందని.. దీని ప్రభావం తెలంగాణపై కూడా ఉంటుందని తెలిపారు. ప్రభావంతో రాగల 48 గంటల్లో హైదరాబాద్ పరిధిలో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశముందని, యాదాద్రి భువనగిరి, నల్గొండలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. -
కేరళను వీడని వర్షాలు
తిరువనంతపురం/డెహ్రాడూన్: కేరళలో పలుప్రాంతాల్లో వరద ఉధృతి కొనసాగుతోంది. గురువారం సైతం ఉరుములు మెరుపులతో కూడిన భారీవర్షాలు బెంబేలెత్తించాయి. రాష్ట్రంలో 8 జిల్లాల్లో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పత్తనంథిట్ట, కొట్టాయం, ఇడుక్కి, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వయనాడ్, కన్నూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఇక తిరువనంతపురం, కొల్లాం, అలప్పుజా, ఎర్నాకుళం, త్రిసూర్, కాసర్గోడ్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 24 గంటల్లో 20 సెంటీమీటర్లకుపైగా వర్షం కురిసే అవకాశం ఉంటే రెడ్అలర్ట్, 6 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల దాకాకురిసే పరిస్థి తి ఉంటే ఆరెంజ్ అలర్ట్, 6 సెంటీమీటర్ల నుంచి 11 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉన్నట్లయితే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. కేరళలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని (ఉపసంహర ణ దశలో), అందుకే కేరళతోపాటు లక్షదీ్వప్లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ వెల్లడించింది. మత్స్యకారులు చేపల వేట కోసం సముద్రంపైకి వెళ్లొద్దని సూచించింది. కేరళలో కొన్ని ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడడంతో ఇప్పటిదాకా 42 మంది మృతి చెందారు. ఆరుగురు కనిపించకుండా పోయారు. ఉత్తరాఖండ్‌లో వరద నష్టం 7 వేల కోట్లు! కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం ఉత్తరాఖండ్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. జల విలయాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. వరదల కారణంగా రాష్ట్రంలో రూ.7,000 కోట్ల నష్టం వాటిలినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం వెల్లడించింది. ఏరియల్ సర్వే అనంతరం జోలీగ్రాంట్ ఎయిర్‌పోర్టులో అమిత్ షా మీడియాతో మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు చురుగ్గా స్పందించడంతో వరదల నష్టాన్ని చాలావరకు నివారించగలిగామని చెప్పారు. వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో 65 మంది మరణించడం, 11 మంది కనిపించకుండా పోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. చార్ధామ్ యాత్ర పునఃప్రారంభం భారీ వర్షాల కారణంగా 18న తాత్కాలికంగా నిలిపివేసిన చార్ధామ్ యాత్ర మళ్లీ ప్రారంభమయ్యింది. రిషికేశ్ చార్ధామ్ బస్ , హరిద్వార్ బస్టాండ్ నుంచి భక్తులు చార్ధామ్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. అధికారులు కేదార్‌నాథ్‌కు హెలికాప్టర్ సర్వీసులను పునరుద్ధరించారు. చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. -
కేరళను ముంచెత్తిన వరదలు.. ఫొటోలు, వీడియోలు వైరల్
తిరువనంతపురం: కేరళ వర్ష బీభత్సానికి చిగురుటాకులా వణికిపోతోంది. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలలోని వరదల ధాటికి కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో మూడు ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 15 మంది ప్రాణాలు కోల్పోగా మరో 12 మంది గల్లంతయ్యారు. కొట్టాయంలో 12 మంది, ఇడుక్కిలో ముగ్గురు మృతి చెందారు. భారత వాతావరణ శాఖ 5 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించగా, మరో ఏడు జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు సహాయ చర్యలకు ఆర్మీ రంగంలోకి దిగింది. భారత వైమానిక దళం కూడా హెలికాప్టర్లను సిద్ధం చేసి ఉంచింది. మిగ్–17, సారంగ్ హెలికాప్టర్లను దక్షిణ ఎయిర్ కమాండ్ పరిధిలో అన్ని వైమానిక స్థావరాల్లో సిద్ధంగా ఉంచారు. అరేబియన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కేరళలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పథనమిట్టా, కొట్టాయం, ఎర్నాకుళం, ఇద్దుకి, త్రిశూర్ జిల్లాల్లో రెడ్ అలెర్ట్ జారీ అవగా, తిరువనంతపురం, కొల్లామ్, అలపుజా, పాలక్కడ్, మల్లాపురం, కొజికోడ్, వాయాండ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినట్టుగా సహకార శాఖ మంత్రి విఎన్ వాసవన్ వెల్లడించారు. తొడుప్పుజ వద్ద రోడ్డుపైకి చేరిన వరద నీరు, కూలిన చెట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం అందరూ జాగ్రత్తగా ఇళ్లల్లోనే ఉండాలని ప్రజలకి హెచ్చరికలు పంపింది. ప్రధానంగా పర్వత, నదీ ప్రాంతాల్లో ఉన్న వారు ప్రయాణాలు చేయొద్దని సూచించింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. బస్సు వీడియో వైరల్ వరద నీటిలో మునిగిపోతున్న పలు ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఒక బస్సు పూర్తిగా నీటిలో మునిగిపోతూ ఉండడంతో దాని నుంచి బయటపడడానికి ప్రయాణికులు చేసే హాహాకారాలకు సంబంధించిన వీడియో గుండె దడ పెంచుతోంది. ఈ ఒక్క వీడియో కేరళలో భయంకర పరిస్థితికి అద్దం పడుతోందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొట్టాయంలో వర్షపు నీటిలో ఒక కారుకి తాళ్లుకట్టి లాగి తీసుకువెళుతున్న వీడియోని నెటిజన్లు విస్తృతంగా షేర్ చేస్తున్నారు. Dramatic visuals of people being evacuated from a KSRTC bus in Poonjar, rural #Kottayam. No loss of life reported, confirm officials. IMD issues red alert for the district. pic.twitter.com/YtOMKHWIc5 — NDTV (@ndtv) October 16, 2021 Heavy rains lash across #Kerala. Red alert issued for five districts. A friend said this is Mundakkayam bridge. #keralarain pic.twitter.com/UW1nurcziv — Rohit Thayyil (@RohitThayyil) October 16, 2021 Visuals from Idukki district. Do not step out to drive as the flooding is substantial and may wash away cars. #keralarain #Kerala pic.twitter.com/vUR2Hm6zia — West Coast Weatherman (@RainTracker) October 16, 2021 Local residents towing a KSRTC bus which got stuck in flood at Poonjar on Saturday. No loss of life.Heavy rain lashes #Kerala triggering floods and inundating several areas.#REDALERT in Pathanamthitta, Kottayam, Ernakulam, Idukki & Thrissur. 4 shutters of Malampuzha dam opened. pic.twitter.com/D1dbOtEqcV — Raam Das (@PRamdas_TNIE) October 16, 2021 Prayers for #Kerala #KeralaRains #KeralaFloods pic.twitter.com/MEs9x6HcHG — NETWA DHURI (@netwadhuri) October 17, 2021 #Kerala: At least 12 missing in rural parts of Kottayam, hit by landslide/slip. On state request, army deployed, airforce on standby. Revised IMD alert with 6 districts under red alert, 6 under orange. Red alerts : Pathanamthitta, Kottayam, Ernakulam, Idukki, Thrissur, Palakkad pic.twitter.com/36Gkca5Vgr — Sneha Koshy (@SnehaMKoshy) October 16, 2021 #RAIN in idukki dist of #kerala . #landslide pic.twitter.com/gnmYsDcuBH — Deepu Revathy (@deepurevathy) October 16, 2021 Over 100 houses were inundated in #Kottyam district of #Kerala after flooding of the Mundakayam river. For #LIVEUpdates on #KeralaRains, click here👇https://t.co/d7jRsZuDot pic.twitter.com/tb11uvgqs2 — News9 (@News9Tweets) October 17, 2021 #Kerala govt has postponed reopening of colleges till Oct 20 and #Sabarimala pilgrimage has been put on hold till October 19 due to heavy rains #Keralarains, pic.twitter.com/9SkkPjb2iG — suban m (@Midssuban) October 16, 2021 -
నేడు, రేపు మోస్తరు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరం మీదుగా ఛత్తీస్‌గఢ్ వైపు కదులుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిమీ ఎత్తులో కేంద్రీకృతమై ఉంది. అదేవిధంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తూర్పు, పశ్చిమ ద్రోణి సముద్ర మట్టానికి 5.8 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. గడచిన 24 గంటల్లో గొల్లప్రోలులో 114.25, కొత్తపల్లిలో 102.25, వాకతిప్పలో 90, హరిపురంలో 87, రాజాంలో 76.75, టెక్కలిలో 67.7, గోపాలపురంలో 62, వేపాడలో 55.7, తునిలో 55.5, కొయ్యూరులో 51, తిరుపతిలో 49.2, మెరకముడిద్దాంలో 48.25 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 27న మరో అల్పపీడనం ఈ నెల 27న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇది కాకినాడ, విశాఖపట్నం లేదా పూరీ ప్రాంతంలో తీరం దాటే సూచనలున్నాయని భావిస్తున్నారు. ఒకవేళ దిశను మార్చుకుంటే తమిళనాడు వైపుగా పయనించే అవకాశాలున్నాయని వెల్లడించారు. తిరుపతిలో భారీ వర్షం తిరుపతితుడా(చిత్తూరు జిల్లా): తిరుపతిలో శనివారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఎడతెరపిలేని వర్షం పడటంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలువలు పొంగి ప్రవహించాయి. దీంతో రాకపోకలు స్తంభించిపోయాయి. -
వర్ష బీభత్సంతో ఐదుగురు మృతి.. ఆరు జిల్లాల్లో రెడ్ అలర్ట్
తిరువనంతపురం: అరేబియా సముద్రంతో ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళలో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపిలేని వర్షాలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజా జీవనం స్తంభించిపోయింది. నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆర్మీ, వాయుసేన బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచించారు. (చదవండి: హైదరాబాద్‌లో కుండపోత వాన.. చెరువులైన లోతట్టు ప్రాంతాలు) భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో పట్నంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిస్సూర్, పాలక్కాడ్ జిల్లాల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. మరో ఆరు జిల్లాలైన తిరువనంతపురం, కొల్లం, అలప్పుజ, మలప్పురం, కోజికోడ్, వయనాడ్‌లో ఆరెంజ్ అలర్ట్, మరో రెండు జిల్లాల్లో యెల్లో అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలో వరదల ఉధృతికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, కడపటి వార్తలు అందేసరికి కేరళను వణికిస్తున్న వర్షాలు, వరదలతో కనీసం ఐదుగురు మృతి చెందినట్టు తెలుస్తోంది. కొట్టాయం జిల్లాలో 12 మంది వరకు గల్లంతయ్యారు. (చదవండి: IPL 2021: ధోని ఫ్యాన్స్‌కు మరో గుడ్ న్యూస్.. ఫ్యామిలీలోకి మరొకరు?) కొట్టాయంలో వరదలో కొట్టుకుపోతున్న కారును ఒడ్డుకు తెస్తున్న దృశ్యాలు Heavy rainfall alert in #Kerala. IMD issues red alert in 5 districts - Pathanamthitta, Kottayam, Ernakulam, Idukki and Thrissur. Orange alert in 7 districts - Thiruvananthapuram, Kollam, Alappuzha, Palakkad, Malappuram, Kozhikode and Wayanad. Shots of flooding in Rural Kottayam. pic.twitter.com/1b04Tkec2a — NDTV (@ndtv) October 16, 2021 కొట్టాయంలోని పూజ్నగర్లో ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీబస్సు వరదల్లో చిక్కుకుంది. అధికారులు హుటాహుటిన స్పందించి ప్రయాణికులందరినీ ఒడ్డుకు చేర్చడంతో ప్రమాదం తప్పింది. Dramatic visuals of people being evacuated from a KSRTC bus in Poonjar, rural #Kottayam. No loss of life reported, confirm officials. IMD issues red alert for the district. pic.twitter.com/YtOMKHWIc5 — NDTV (@ndtv) October 16, 2021 #WATCH Waterlogged street in Kanjirappally, Kottayam district as the area continues to receive heavy rainfall IMD has issued a Red alert in Pathanamthitta, Kottayam, Ernakulam, Idukki and Thrissur districts of Kerala pic.twitter.com/LocqwW3CfL — ANI (@ANI) October 16, 2021 -
15న రెండు అల్పపీడనాల ప్రభావం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ రెండు రోజుల్లో మొదలవుతుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి వెళ్లిపోతున్నాయని పేర్కొంది. ఈ నెల 15న రాష్ట్రంలో వాతావరణపరంగా అరుదైన ప్రక్రియ.. రెండు అల్పపీడనాలు ప్రభావం చూపే సూచనలున్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్ర, దక్షిణ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రంలో ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ విస్తరించి ఉంది. ఇది అల్పపీడనంగా మారి ఈ నెల 15న చిత్తూరు, వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల మీదుగా ప్రయాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయి. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి తదుపరి 24 గంటల్లో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా తీరానికి చేరుకోనుంది. ఇది ఈ నెల 15న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖతో పాటు ఉభయగోదావరి జిల్లాలపై ప్రభావం చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు అల్పపీడనాలు రాష్ట్రంపై ప్రభావం చూపించడం అరుదని చెబుతున్నారు. అల్పపీడనం తుపానుగా బలపడే సూచనలు ప్రస్తుతానికి కనిపించడం లేదని, రాష్ట్రానికి తుపాను ముప్పు తప్పినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. వచ్చే రెండురోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. గత 24 గంటల్లో చిల్లకూరులో 72 మిల్లీమీటర్లు, బండారుపల్లెలో 65.5, మారేడుమిల్లిలో 60, వెంకటగిరికోటలో 56.5, పలమనేరులో 56, గోపాలపురంలో 52, సైదాపురంలో 49.5, బోగోలులో 47.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. -
నేడు, రేపు తేలికపాటి వానలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ కారణంగా అల్పపీడనం ఏర్పడే అవకాశాలు మరింత ఆలస్యమవుతున్నాయి. దీని ప్రభావంతో ఈ నెల 13న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం ఐఎండీ తెలిపింది. ఇది క్రమంగా ఒడిశా వైపుగా పయనించి.. 15వ తేదీన మరింత బలపడే సూచనలున్నాయని పేర్కొంది. దీని ప్రభావంతో ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగానూ.. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. మరోవైపు రుతుపవన ద్రోణి రాయలసీమ మీదుగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి వానలు కురుస్తాయని, ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడేందుకు ఆస్కారం ఉందని అధికారులు తెలిపారు. -
నేడు అల్పపీడనం.. అనంతరం తుపాను
సాక్షి, విశాఖపట్నం: కోస్తాంధ్ర నుంచి రాయలసీమ మీదుగా రుతుపవన ద్రోణి కొనసాగుతోంది. ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో సోమవారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు ఉండటం వల్ల ఇది తదుపరి నాలుగైదు రోజుల్లో మరింత బలపడి తుపానుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఇది దిశ మార్చుకుని బర్మా మీదుగా ప్రయాణించనుంది. బర్మా సమీపానికి వెళ్లిన తర్వాత మళ్లీ దిశ మార్చుకుని దక్షిణ ఒడిశా వైపు రానుంది. ఫలితంగా ఈ తుపాను ప్రభావమంతా ఒడిశాపైనే ఎక్కువగా ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రెండురోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 17న రాష్ట్రాన్ని తాకాల్సిన ఈశాన్య రుతుపవనాలు 23 లేదా 24వ తేదీన వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమలో ఒకటిరెండు చోట్ల వర్షాలు పడే అవకాశాలున్నట్లు పేర్కొంది. పిడుగులకు ఇద్దరి దుర్మరణం పొదలకూరు/దొరివారిసత్రం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆదివారం పిడుగులు పడి ఇద్దరు దుర్మరణం చెందారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. నేదురుమల్లి గ్రామంలో పశువుల్ని మేతకు తోలుకెళ్లిన కోవూరు పెంచలనాయుడు (42), దొరవారిసత్రం మండలం కుప్పారెడ్డిపాళెం ఎస్సీ కాలనీలో గొర్రెల్ని మేతకు తోలుకెళ్లిన తిరునామల్లి నవీన్ (21) పిడుగులు పడి ప్రాణాలు కోల్పోయారు. నేదురుమల్లికి చెందిన కోవూరు రత్నమ్మ తీవ్రంగా గాయపడింది. -
సంతృప్తికర స్థాయిలో వర్షాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది రాష్ట్రంలో సంతృప్తికర స్థాయిలో వర్షాలు కురిపించాయి. జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 30 వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ సమయంలో బంగాళాఖాతంలో తొమ్మిది అల్పపీడనాలు ఏర్పడ్డాయి. అందులో మూడు తీవ్ర అల్పపీడనాలుగా మారాయి. జూన్‌లో ఒకటి, జూలైలో మూడు, ఆగస్టులో రెండు, సెప్టెంబర్‌లో మూడు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. సెప్టెంబర్ చివరలో గులాబ్ సెప్టెంబర్‌లో ఏర్పడ్డ రెండు వాయుగుండాల్లో ఒకటి తీవ్ర వాయుగుండంగా బలపడింది. నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసే సమయంలో సెప్టెంబర్ చివరలో గులాబ్ తుపాను ఏర్పడింది. మొత్తంగా సెప్టెంబర్‌లోనే ఒక తుపాను, ఒక వాయుగుండం, ఒక తీవ్ర వాయుగుండం, రెండు తీవ్ర అల్పపీడనాలు, ఒక అల్పపీడనం ఏర్పడడం విశేషం. వీటన్నింటిలో గులాబ్ తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపింది. సాధారణంగా ఆగస్టు, సెప్టెంబర్‌ల్లో వచ్చే తుపానులు ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో తీరం దాటుతాయి. అక్టోబర్, నవంబర్‌ల్లో వచ్చే తుపానులు ఎక్కువగా మన రాష్ట్రంలో తీరం దాటుతాయి. గత కొన్నేళ్ల వాతావరణ విశ్లేషణలు ఈ అంశాలను స్పష్టం చేస్తున్నాయి. కానీ అందుకు భిన్నంగా ఈ సెప్టెంబర్‌లో వచ్చిన తుపాను మన రాష్ట్రంలోని కళింగపట్నం దగ్గర తీరం దాటి తీవ్ర ప్రభావం చూపింది. విస్తారంగా వర్షాలు ఈ నైరుతి సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 514 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సివుండగా 613.3 మి.మీ వర్షం కురిసింది. 19 శాతం ఎక్కువ వర్షపాతం కురిసింది. దీన్ని వాతావరణ శాఖ సాధారణ వర్షపాతంగానే (20 శాతం వ్యత్యాసం ఉంటే సాధారణమే) పరిగణిస్తుంది. వైఎస్సార్, చిత్తూరు, కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో అధిక వర్షాలు కురిశాయి. చిత్తూరు జిల్లాలో 49 శాతం అధిక వర్షపాతం కురవగా వైఎస్సార్ జిల్లాలో 32 శాతం అధిక వర్షపాతం నమోదైంది. విశాఖపట్నం జిల్లాలో 37 శాతం, విజయనగరం జిల్లాలో 36 శాతం, గుంటూరు జిల్లాలో 33 శాతం, తూర్పుగోదావరిలో 29 శాతం, కృష్ణాలో 28 శాతం అధిక వర్షాలు కురిశాయి. అనంతపురం, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మిగిలిన జిల్లాల కంటె కొంచెం తక్కువ వర్షం కురిసింది. స్వల్పంగా లోటు వర్షం కురిసినా అది పది శాతంలోపే కావడంతో సాధారణంగానే పరిగణిస్తున్నారు. మొత్తంగా నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ సీజన్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఈ నెల 6 నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రారంభమైంది. రాయలసీమకు భారీ వర్ష సూచన సాక్షి, విశాఖపట్నం: ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో రాగల 36 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా బలపడి ఈ నెల 14న వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాంధ్ర తీరం వైపు పయనించనుంది. ఇది 15వ తేదీన తుపానుగా బలపడే సూచనలు పుష్కలంగా ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చెబుతోంది. నిష్క్రమిస్తున్న నైరుతి రుతు పవనాలు క్రమంగా మన రాష్ట్రం వైపు వస్తుండటంతో వారం రోజుల పాటు వర్షాలు పుంజుకోనున్నాయి. వాయువ్య దిశ నుంచి వీస్తున్న గాలులు, అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అదేవిధంగా ఆదివారం దక్షిణ కోస్తాలోని ఒకట్రెండు చోట్ల, సోమవారం రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిశాయి. కె.బిట్రగుంటలో 90.25 మి.మీ., ప్రత్తిపాడులో 63.5, కిర్లంపూడిలో 62.7, గోరంట్లలో 60, జగ్గంపేటలో 59, పమిడిలో 57, పలగలపల్లిలో 52.5, పెద్దతిప్పసముద్రంలో 45, ఓబుళదేవర చెరువు, శంఖవరంలో 44.5 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. కాగా, వైఎస్సార్ జిల్లాను శనివారం వర్షం ముంచెత్తింది. కడప, పులివెందుల, రాయచోటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. జిల్లాలోని ప్రధాన నదులైన పాపాగ్ని, మాండవ్య నదులు వరద నీటితో ప్రవహిస్తున్నాయి. వీరబల్లి మండలంలోని గడికోట వద్ద మాండవ్య నది దాటుతూ కాకినాడకు చెందిన గోవిందరావు (45) అనే వ్యక్తి గల్లంతయ్యాడు. -
తుపాను ప్రభావం.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు
న్యూఢిల్లీ: హైదరాబాదులో కురుస్తున్న భారీ వర్షం నగర ప్రజలను బెంబేలెత్తిస్తోంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో పాటు అక్కడక్కడా పిడుగులు కూడా పడ్డాయి. ఈ నేపథ్యంలో భారత వాతావారణ శాఖ(ఐఎండీ) కీలక ప్రకటన చేసింది. మరొకొన్ని రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. తూర్పు మధ్య అరేబియా సముద్రంపై తుపాను ప్రసరణ ఉందని తెలిపింది ఐఎండీ. ఈ ప్రభావం రాబోయే 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని.. ఇది క్రమంగా బలహీనపడి ఉత్తరం వైపు కదులుతూ ఉంటుందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావం వల్ల దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపింది. (చదవండి: కోస్తాంధ్రకు మరో తుపాను!) గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, కర్ణాటక తీర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ తీరం ప్రాంతం, తమిళనాడు, పాండిచరి రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక గోవా, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, పాండిచేరి, తమిళనాడు రాష్ట్రాల్లో అక్టోబర్10-12 మధ్య వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. చదవండి: మీ స్మార్ట్‌ఫోన్‌తో తుపాన్లను ఎలా ట్రాక్ చేయాలో తెలుసా...! -
రెండ్రోజులు మోస్తరు వానలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య భారత దేశంలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు తిరగోమనం చెందాయి. వారం రోజుల్లో తెలంగాణ, ఏపీ నుంచి నైరుతి నిష్క్రమణం మొదలవ్వనుంది. మరోవైపు తూర్పు అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కర్ణాటక, సీమ మీదుగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఈ నెల 10న ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తా, సీమల్లో అక్కడక్కడా మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది. -
AP: ఈ నెలలో రెండు తుపానులు!
సాక్షి, విశాఖపట్నం: లానినా (సముద్ర వాతావరణం) పరిస్థితులతో పాటు హిందూ మహాసముద్రం డైపోల్ (ద్విధ్రువ) వ్యతిరేక పరిస్థితులు కనిపిస్తుండటంతో బంగాళాఖాతంలో మరో రెండు తుపాన్లు ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నెల 14 లేదా 15వ తేదీన ఒక తుపాను, 21 తర్వాత మరో తుపాను రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఈ తుపానులతో రాష్ట్రంలో సాధారణం కంటే అత్యధిక స్థాయిలో వర్షపాతం నమోదు కానుందని చెబుతున్నారు. ప్రస్తుతం దక్షిణ కోస్తా, రాయలసీమ మీదుగా ఈశాన్య గాలులు, ఉత్తరాంధ్ర మీదుగా వాయువ్య గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో ఈశాన్య గాలుల ప్రభావంతో కామవరపుకోటలో 69.5 మిల్లీమీటర్లు, విజయవాడ, మంగళగిరిలో 56.3, అనంతగిరిలో 56, సత్తెనపల్లిలో 54, గుంతకల్లులో 49.5, అద్దంకిలో 47.5, గొలుగొండలో 44.5, జి.కొండూరులో 43.8, విస్సన్నపేటలో 42, నల్లజర్లలో 40.5, కొయ్యూరులో 38.7 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. చదవండి: ఆర్బీకేలు అద్భుతం.. కళ్లారా చూశా.. చాలా బాగున్నాయ్ -
ఠారెత్తించిన ఎండలు
సాక్షి, విశాఖపట్నం: గులాబ్ తుపాను ప్రభావంతో విస్తారంగా కురిసిన వర్షాల వల్ల వాతావరణం చల్లగా మారిందని భావించిన ప్రజలకు ఆదివారం భానుడు ప్రతాపం చూపించాడు. నడి వేసవిని తలపిస్తూ ఎండలు ఠారెత్తించాయి. చాలాచోట్ల సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కృష్ణా జిల్లా కంచికచర్లలో అత్యధికంగా 39 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, నెల్లూరు జిల్లా బాలాయపల్లెలో 38.6, గోపాలపురంలో 38.4, కర్నూలు, రేణిగుంటలో 38.3, అనకాపల్లిలో 38.2, పమిడిలో 38 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుండగా.. షహీన్ తుపాను పాకిస్తాన్ వైపు వెళ్లడంతో రాజస్థాన్‌లో అధిక పీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా తిరోగమించడం ప్రారంభించాయి. దీంతో రాష్ట్రం వైపుగా తూర్పు, దక్షిణ గాలులు బలంగా వీస్తున్నాయి. ఈ గాలులు రాష్ట్రంపై ఉన్న తేమని తీర ప్రాంతం వైపు తీసుకెళ్తున్నాయి. ఈ పరిస్థితి వల్ల రాగల 2 రోజుల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. మూడో వారంలో తుపాను! అక్టోబర్ మూడో వారంలో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి.. క్రమంగా తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్టు వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని భావిస్తున్నారు. గడచిన 24 గంటల్లో కొమరాడలో 48.5 మి.మీ., పార్వతీపురంలో 37.3 మి.మీల వర్షపాతం నమోదైంది. -
తరుముకొస్తున్న షహీన్
ముంబై: గులాబ్ తుపాను కల్లోలం ముగిసిందో లేదో మరో తుపాను తరుముకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను క్రమంగా బలపడుతోంది. ఏడు రాష్ట్రాల్లో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. గుజరాత్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ‘ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను మధ్య అరేబియా తీర ప్రాంతాలవైపు దూసుకొస్తోంది. ఆ తర్వాత అది తీవ్ర తుపానుగా మారి పాకిస్తాన్లో మాక్రన్ తీర ప్రాంతాన్ని తాకుతుంది. ఆ తర్వాత 36 గంటల్లో దిశ మార్చుకొని గల్ఫ్ ప్రాంతాలపై వెళ్లి ఆ తర్వాత బలహీనపడుతుంది’’అని వాతావరణ శాఖ వెల్లడించింది. గులాబ్ తుపాను ప్రభావం కారణంగా ఏర్పడిన షహీన్ తుపానుతో ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
గులాబ్ తుపాను: నేడు, రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు
సాక్షి, హైదరాబాద్: వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శనివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో 'గులాబ్ తుపానుగా మారిన సంగతి తెలిసిందే. ఇది గోపాల్‌పూర్‌కు తూర్పు ఆగ్నేయంగా 310 కి.మీ, కళింగపట్నానికి తూర్పుగా 380 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను గంటకు 7 కిలో మీటర్ల వేగంతో కదిలి బలపడిన తుపాను ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి కళింగపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ తెలిపింది. పైగా ఇది పశ్చిమంగా పయనిస్తుండడంతో శ్రీకాకుళం జిల్లా కళింగపట్నానికి ఉత్తరంగా తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. (చదవండి: రూ.700 కోట్ల ‘కార్వీ’ షేర్లు ఫ్రీజ్) దీంతో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని , మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖపట్నం విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. అంతేకాక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఈ మేరకు ఉత్తరాంధ్ర కలెక్టర్లను అప్రమత్తం చేశామని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు చేపట్టమని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా రానున్న రెండు రోజులు దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తాంధ్రతో పాటు, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అలాగే హైదరాబాద్‌కు, తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించాంరు. (చదవండి: మన తోకలకు కత్తెర పడిందెలా?) -
తెలుగు రాప్ట్రలకు మరోసారి భారీ వర్ష సూచన..
-
11న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, హైదరాబాద్: ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 11న అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ గురువారం వెల్లడించింది. ఇది 13వతేదీ నాటికి మరింత బలపడే అవకాశం ఉందని, దీని ఫలితంగా రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. ప్రస్తుతం రాష్ట్రానికి పశ్చిమ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్న కారణంగా శుక్రవారం రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరించింది. -
రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది మరింత బలపడి ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతంలో శనివారం (11వ తేదీన) అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 48 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారనుంది. క్రమంగా దక్షిణ ఒడిశా, ఒడిశా ప్రాంతాల మీదుగా మధ్యప్రదేశ్, విదర్భ వైపు వెళ్లనుంది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతంత మాత్రంగానే ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు గుజరాత్ సమీపంలో అరేబియా తీరంలో అల్పపీడనం కొనసాగుతుండటం వల్ల తేమ గాలులు రాష్ట్రం వైపుగా వస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలో రెండురోజులు అక్కడక్కడా ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆది, సోమవారాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు పడే అవకాశాలున్నట్లు చెప్పారు. గడిచిన 24 గంటల్లో పలాసలో 67 మిల్లీమీటర్లు, సోంపేటలో 63, వజ్రపుకొత్తూరులో 56, మందసలో 40.75, నరసన్నపేటలో 33.4, గారలో 22, ఎల్‌ఎన్‌పేటలో 19, సంతబొమ్మాళిలో 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
విస్తారంగా వర్షాలు
సాక్షి, నెట్వర్క్: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మంగళవారం కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. విశాఖ జిల్లా ఏజెన్సీలో కుండపోతగా వానలు కురుస్తున్నాయి. హుకుంపేట–అడ్డుమాండ ప్రధాన రహదారిలో వంతెనపైకి వరదనీరు రావడంతో రాకపోకలు స్తంభించాయి. తూర్పుగోదావరి జిల్లాలో గత 24 గంటల్లో సగటున 67.9 మిల్లీమీటర్ల వర్షపాతం చోటు చేసుకుంది. జిల్లావ్యాప్తంగా సింహభాగం మండలాల్లో అధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కాకినాడ అర్బన్‌లో 174 మిల్లీమీటర్లు.. అత్యల్పంగా రాజోలులో 26.8 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డైంది. ఏజెన్సీలో కొండ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. రంపచోడవరం వాల్మీకిపేటకు చెందిన గొర్లె మహేష్ (చిట్టి) చేపలు పట్టేందుకు స్థానిక పంపుహౌస్ సమీపంలోని కాలువలో దిగగా ఉధృతికి కొట్టుకుపోయాడు. అతడిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. విశాఖపట్నం రుషికొండ బీచ్‌లో కెరటాలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం 15 అడుగులు ముందుకు రావడంతో తీర ప్రాంతం కోతకు గురైంది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరం వెంట ఉన్న కపుల్ బెడ్స్, వాచ్ టవర్స్, గొడుగులు వంటి వాటిని కెరటాలు తాకడంతో పర్యాటకులు భయాందోళనలకు గురయ్యారు. భీమిలి బీచ్ రోడ్డు, మంగమారిపేట, ఉప్పాడ, తిమ్మాపురం ప్రాంతాల్లోనూ కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అత్యధికంగా కవిటిలో 125 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమగోదావరి జిల్లా ఎద్దెలవాగు వంతెనపై ప్రవహిస్తున్న గోదావరి వరద పశ్చిమగోదావరి జిల్లా ఏజెన్సీలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వేలేరుపాడు నుంచి కొయిదా వెళ్లే దారిలో ఎద్దెల వాగు వంతెన సోమవారం రాత్రి నీటమునిగింది. దీంతో దిగువన ఉన్న కొయిదా, కట్కూరు, కాచారం, తాళ్లగొంది, పూసుగొంది, చిట్టంరెడ్డిపాలెం, యడవల్లి, బుర్రెడ్డిగూడెం, టేకూరు, సిద్దారం, కుంకుడుకొయ్యల పాకలుతోపాటు మరో 18 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజుల నుంచి పెదవాగు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో వేలేరుపాడు మండలం కమ్మరిగూడెం, ఒంటిబండ, రామవరం, ఊటగుంపు గ్రామాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. అశ్వారావుపేట వెళ్లే రహదారిలో రామవరం వద్ద లోతు వాగు పొంగిపొర్లుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు నుంచి రుద్రమకోటకు వెళ్లే దారిలో పెదవాగు వంతెన ప్రాంతంలో రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. మద్దిగట్ల ప్రాంతంలో వాగు ఉధృతిలో కొట్టుకుపోతున్న 2,000 గొర్రెలను ఎస్ఐ సాదిక్, సిబ్బంది కాపాడారు. తహసీల్దార్ చల్లన్నదొర ఎద్దెల వాగు వద్ద నాటు పడవను ఏర్పాటు చేశారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో 0.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వాగులో గల్లంతైన యువతి మృతి పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లి తిరిగొస్తూ సోమవారం వాగులో గల్లంతైన మనీషా వర్మ (23) మృతదేహం మంగళవారం లభ్యమైంది. సుమారు ఐదు బృందాలు ఉదయం నుంచి వాగు వెంట ఐదు కిలోమీటర్ల మేర గాలింపు చర్యలు చేపట్టాయి. చివరకు తెలంగాణలోని అశ్వారావుపేట మండలం కంట్లం సమీపంలో వాగులో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వారంలో మరో అల్పపీడనం.. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెండు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణిస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ కేంద్రం తెలిపాయి. అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో కొనసాగుతోంది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులు కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలకు ఆస్కారం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రానున్న వారం రోజుల్లో మరో అల్పపీడనం ఏపీ తీరానికి సమీపంలో ఏర్పడి.. ఒడిశా వైపుగా ప్రయాణించే అవకాశం ఉంది. ఈ అల్పపీడనం ప్రభావంతో 10 రోజుల తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకుంటాయి. కాగా, గత 24 గంటల్లో తాడేపల్లిగూడెంలో 46.5, విశాఖపట్నంలో 30, పెందుర్తి, చింతపల్లిల్లో 22, అనకాపల్లిలో 18, వాయల్పాడులో 16.3, మాకవరపాలెంలో 12, కమలాపురంలో 11, సంజామలలో 10, నర్సీపట్నంలో 9, అమరపురంలో 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
Andhra Pradesh: వచ్చే 3 రోజులు భారీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రానున్న మూడు రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆదివారం వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఇది క్రమంగా ఒడిశా వైపు ప్రయాణించే అవకాశముంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో 2 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. రాయలసీమలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే సూచనలున్నాయి. ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అతిభారీ వర్షాలు.. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయడంవల్ల సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదేవిధంగా బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. మత్స్యకారులెవ్వరూ రాగల రెండు రోజులపాటు వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇక గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. విజయనగరంలో 15సెం.మీ, పూసపాటిరేగలో 14.3 సెం.మీ, డెంకాడలో 14.2, కొప్పెర్లలో 13.5, గోవిందపురంలో 12.8, నెల్లిమర్లలో 12.2, రాంబిల్లిలో 10.9, పైడి భీమవరంలో 10.8, కె.కోటపాడులో 9.5, బొందపల్లిలో 8.7, భోగాపురంలో 8.4, మారికవలస, భీమిలిలో 8.3, ఎల్.ఎన్.పేటలో 8.1, కొయ్యూరులో 7.8, విశాఖ రూరల్, దేవరాపల్లిలో 7.7 సెం.మీ. వర్షపాతం నమోదైంది. -
ఢిల్లీలో కుంభవృష్టి
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని అనూహ్య వర్షం ముంచెత్తింది. గత 19 ఏళ్లలో సెప్టెంబర్ నెలలో ఒకే రోజులో ఇంతటి భారీ వర్షం కురవడం ఇదే తొలిసారి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం ఎనిమిదిన్నర సమయానికల్లా ఏకంగా 112.1 మిల్లీమీటర్ల వర్షపాతంతో వరుణుడు హస్తినను కుంభవృష్టితో తడిసి ముద్దయ్యేలా చేశాడు. ఢిల్లీలో చాలా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. కేవలం మూడు గంటల్లోనే 75.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. చాణక్యపురి, ఐటీవో, రోహతక్ రోడ్ తదితర ప్రాంతాల్లో రోడ్లపై వర్షపునీరు భారీ స్థాయిలో చేరడంతో ట్రాఫిక్ స్తంభించింది. ‘కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల రుతుపవనాల రీతిలో స్వల్ప మార్పులొస్తున్నాయి. అందుకే ఇలాంటి కుండపోత వర్షాలను మేం కూడా ముందుగా అంచనావేయలేకపోతున్నాం. ఏడో తేదీ నుంచి ఇదే స్థాయిలో వర్షం పడే అవకాశం ఉంది’ అని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ఉన్నతాధికారి ఒకరు బుధవారం చెప్పారు. వర్షం సాధారణ స్థాయిలో కురిస్తే భూగర్భ జలాల మట్టం పెరిగే ప్రయోజనం ఉందని, కానీ ఇలా కుంభవృష్టి వర్షాలతో వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచేయడం తప్ప మరే లాభం లేదని వాతావరణ నిపుణులు వివరించారు. -
కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన
సాక్షి, అమరావతి /సాక్షి, విశాఖపట్నం: రుతుపవన ద్రోణి మచిలీపట్నం మీదుగా ఆగ్నేయ దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా గుజరాత్ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకూ ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 5.8 కి.మీ వరకూ కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం విజయనగరం, విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని పేర్కొంది. శుక్రవారం కోస్తాంధ్రలోని జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో రావులపాలెంలో 12 సెం.మీ, అడ్డతీగలలో 9.5, రంగాపురంలో 7.2, ఆత్రేయపురంలో 6.6, నాగాయలంకలో 6.0, చిలకలూరిపేటలో 5.9 సెం.మీ వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్‌లో విస్తారంగా వానలు ఆగస్టులో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. 139.9 మి.మీ సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 138.5 మి.మీ వర్షం కురిసింది. కోస్తా జిల్లాల్లో 162.1 మి.మీ వర్షానికి 169 మి.మీ వర్షం పడింది. రాయలసీమలో 108.5 మి.మీటర్లకు 96.4 మి.మీ వర్షం కురిసింది. 3 జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ, 4 జిల్లాల్లో కురవాల్సిన దాని కంటే కొంచెం తక్కువ వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఈ వర్షాకాలంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. రుతుపవనాలు బలపడటంతో ఈ సీజన్లోనే ఎక్కువ వర్షపాతం ఈ నెలలో నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. -
ఢిల్లీలో రికార్డు స్థాయిలో భారీ వర్షపాతం..
న్యూఢిల్లీ: ఢిల్లీలో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. గడిచిన 27 గంటలలో రికార్డు స్థాయిలో.. 20 సెంమీల వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. గత 19 ఏళ్లలో ఇంత భారీ వర్షం ఎప్పుడు నమోదు కాలేదని ఐఎండీ అధికారులు తెలిపారు. కుండపోతగా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ క్రమంలో.. ఢిల్లీలో ఆరెంజ్ అలర్ట్ జారీచేసినట్లు ఐఎండీ అధికారులు వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చదవండి: US Study: ఆయుః ప్రమాణం తొమ్మిదేళ్లకు పైగా పడిపోతోంది! -
రెండురోజులు వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దిశను మార్చుకుని క్రమంగా మధ్యభారత దేశం వైపు ప్రయాణించింది. అల్పపీడన ప్రభావంతో పశ్చిమ, నైరుతి గాలులు రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఈ గాలుల ప్రభావం ఉత్తర కోస్తా వైపు ఎక్కువగా ఉంటోంది. ఈ కారణంగా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. ఇది ఈ నెల 21 నాటికి మరింత బలపడనుంది. దీని ఫలితంగా 21, 22 తేదీల్లో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాగల రెండు రోజుల పాటు తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయి. -
వడగాలుల ముప్పు; ఉత్తర భారతదేశానికి ఐఎండీ హెచ్చరిక
ఢిల్లీ: ఉత్తర భారతదేశానికి వడగాలుల ముప్పు ఉందంటూ భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్ నుంచి వాయువ్య భారతదేశం దిశగా వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. దీంతో రానున్న రెండు రోజుల్లో తీవ్ర వేడి గాలులు వీస్తాయని తెలిపింది. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్‌పై వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో పలు చోట్ల వేడి గాలులు వీస్తున్నట్లు ఐఎండీ గుర్తించింది. పాకిస్తాన్లో పొడి గాలులతో ఉష్టోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 6.5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ స్పష్టం చేసింది. ఇదే విషయమై ఐఎండీ అధికార ప్రతినిధి కుల్దీప్ శ్రీవాత్సవ స్పందించారు. '' మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు "హీట్ వేవ్'' అని ప్రకటిస్తాం. ప్రస్తుత పరిస్థితుల దృశ్యా వర్షాకాలం సీజన్లోనూ 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.సాధారణంగా, జూన్ 20 వరకు దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో వేడి తరంగాలు రావడం సహజమే. కానీ ఈసారి గరిష్ట ఉష్ణోగ్రత పెరగడం వెనుక రుతుపవనాల రాక ఆలస్యం కావడమే కారణం'' అని చెప్పుకొచ్చారు. ఇక అమెరికాతో పాటు కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. గత నాలుగైదు రోజుల్లోనే వడగాడ్పులకు తాళలేక కెనడాలోని వెన్కౌర్ ప్రాంతంలో 200 మందికి పైగా మృతి చెందారు. ఫసిఫిక్ మహాసముద్రంలో వాతావరణంలోని మార్పుల కారణంగా తీవ్రమైన ఒత్తిడి వల్ల హీట్ డోమ్ ఏర్పడడంతో అమెరికాలోని కాలిఫోర్నియా నుంచి కెనడాలోని ఆర్కిటిక్ ప్రాంతాల వరకు ఎండలు భగభగలాడుతున్నట్టుగా బెర్కెలే ఎర్త్‌కి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త జెకె హస్ఫాదర్ చెప్పారు -
చల్లటి కబురు.. మూడు రోజుల్లో నైరుతి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి పులకరించనుంది. అతి త్వరలో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ఇప్పటికే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లోని కొంత భాగంలోకి వ్యాపించాయి. రానున్న రెండుమూడు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రానికి దక్షిణ దిశలో ఉన్న జిల్లాల్లో రుతుపవనాలు ముందుగా ప్రవేశించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది రుతుపవనాల రాక కాస్త ఆలస్యమైంది. అయితే, రాష్ట్రంలో రుతుపవనాల సీజన్ అప్పుడే కనిపిస్తోంది. నైరుతి ప్రవేశానికి ముందుగానే వానలు కురుస్తున్నాయి. సాధారణ వర్షపాతం నుంచి భారీ, అతిభారీ వానలు గత రెండుమూడు రోజులుగా నమోదవుతున్నాయి. సీజన్‌కు ముందే వర్షాలు కురవడంతో రైతాంగంలో నూతనోత్సాహం నిండుతోంది. మరోవైపు వేసవి ఉష్ణోగ్రతలతో ఉక్కపోతకు గురైన ప్రజలు కాస్త చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా, రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా నైరుతి, ఉత్తర ప్రాంత జిల్లాల్లోని కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈసారీ భారీ వర్షాలే... రాష్ట్రంలో ఈ ఏడాది కూడా వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. గతేడాది రుతుపవనాల రాక ఆలస్యమైనా... చివరి రోజుల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. రాష్ట్ర సాధారణ వర్షపాతం 72.04 సెంటీమీటర్ల వర్షపాతం ఉండగా సీజన్ ముగిసేనాటికి 107.83 సెం.మీ వర్షపాతం నమోదైంది. సాధారణంకంటే 50 శాతం అధికంగా వానలు కురిశాయి. గత సీజన్‌తో పోలిస్తే 5 శాతం తక్కువ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ లెక్కన సాధారణ వర్షపాతాన్ని మించి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా రాష్ట్రంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో తేలికపాటి మొదలుకుని భారీ వర్షాలు కురిసాయి. వర్షంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తప్పలేదు. చదవండి: థర్డ్‌వేవ్ తీవ్రత: ఆ మూడే కీలకం! -
రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు
-
అండమాన్‌ను తాకిన నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించినట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాలు, తూర్పు మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల్లోకి శుక్రవారమే నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు ఐఎండీ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు (శనివారం) అల్పపీడనం కొనసాగుతుంది, మరియు దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని, రాగల 6 గంటలలో ఇది వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది. ఇది ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణించి బలపడి రేపటికి తుఫానుగా మారే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 24 గంటల్లో ఇది మరింత బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. అనంతరం ఉత్తర-వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఈనెల 26వ తేదీ ఉదయానికి ఒడిస్సా-పశ్చిమబెంగాల్ తీరాలకు దగ్గరలోని ఉత్తర బంగాళాఖాతము ప్రాంతమునకు చేరుకుంటుందని వెల్లడించింది. అదే రోజు సాయంత్రానికి పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఒడిస్సా, బంగ్లాదేశ్ తీరాల వెంబడి తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన దీని ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పరిమితంగా ఉండనుంది. ఈరోజు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్ర: ఈరోజు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-4°C అధికంగా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది. రాయలసీమ: ఈరోజు, రేపు రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.ఎల్లుండి రాయలసీమలో ప్రధానంగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. - సంచాలకులు, అమరావతి వాతావరణ కేంద్రము -
Cyclone Yaas: 24న ‘యాస్’ తుపాను!
సాక్షి, అమరావతి బ్యూరో/విశాఖపట్నం: పశ్చిమ తీరాన్ని వణికించిన టౌటే అత్యంత తీవ్ర తుపాను బలహీనపడిన కొద్దిరోజులకే బంగాళాఖాతంలో మరో తుపాను ఏర్పడబోతోంది. ఉత్తర అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. అది వాయవ్యదిశగా కదులుతూ వాయుగుండంగాను, ఆపై తీవ్ర వాయుగుండంగాను బలపడి ఈనెల 24న తుపానుగా మారనుంది. అనంతరం అదే దిశలో పయనిస్తూ మరింతగా తీవ్రరూపం దాల్చి ఈ నెల 26 ఉదయానికి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ల మధ్య తీరానికి చేరుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. దీని ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలపై అధికంగాను ఉంటుందని అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రధానంగా ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపలవేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. యాస్ తుపాను నేపథ్యంలో పలు రైళ్లను రద్దుచేస్తున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎ.కె.త్రిపాఠి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. యాస్ అంటే.. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుపానుకు ఒమన్ దేశం సూచించిన ‘యాస్’ అని నామకరణం చేయనున్నారు. తుపాను ఏర్పడ్డాక ఈ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. యాస్ అనే పదం పర్షియన్ భాష నుంచి వచ్చింది. ఆంగ్లంలో జాస్మిన్ (మల్లెపూవు) అని అర్థం. తుపాన్లు ఏర్పడినప్పుడు వాటికి పేర్లు పెట్టడం రివాజుగా వస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు రానున్న తుపాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలను కురిపించనుంది. అయితే మన రాష్ట్రంలో ఎండలు ఉధృతం కావడానికి దోహదపడనుంది. మధ్య బంగాళాఖాతంలో ఈ తుపాను ఏర్పడనున్న నేపథ్యంలో గాలివాటం మారనుంది. కొన్నాళ్లుగా నైరుతి, దక్షిణ గాలులు వీస్తుండడంతో రాష్ట్రంలో ఉష్ణ తీవ్రత అంతగా కనిపించడం లేదు. ఈ తుపాను ఏర్పడటానికి ముందు నుంచి రాష్ట్రంపైకి ఉత్తర గాలులు వీయనున్నాయి. ఫలితంగా అటునుంచి వచ్చే గాలులు వేడిగా ఉండడం వల్ల రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా ‘సాక్షి’కి చెప్పారు. రాష్ట్రంలో రాబోయే 4 రోజులు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఊటుకూరులో 13 సెంటీమీటర్లు, అమడగూరులో 10, ఉంగుటూరులో 9.6, కడపలో 9, ఆగిరిపల్లిలో 8.5, కంభంలో 8, అద్దంకిలో 7.5, మొవ్వలో 7.3, బెస్తవానిపేట, పెనగలూరుల్లో 7, పొదిలి, ఉరవకొండల్లో 6, సత్తెనపల్లి, కోయిలకుంట్ల, వల్లూరుల్లో 5, జమ్మలమడుగు, వెంకటగిరికోట, దొర్నిపాడు, ప్రొద్దుటూరు, పామిడి, కమలాపురం, జూపాడుబంగ్లాల్లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అండమాన్‌లోకి ‘నైరుతి’ మరోవైపు నైరుతి రుతుపవనాల తొలి అడుగు అండమాన్ సముద్రంలోకి ప్రవేశంతోనే పడుతుంది. శుక్రవారం ఈ రుతుపవనాలు దక్షిణ, ఉత్తర అండమాన్ సముద్రం, నికోబార్ దీవులతో పాటు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి. రెండు రోజుల్లో నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించనున్న ఈ రుతుపవనాలు మన రాష్ట్రంలోకి జూన్ 5వ తేదీనాటికి ప్రవేశించే అవకాశం ఉంది. -
Southwest Monsoon: రేపు ‘నైరుతి’
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి శుక్రవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. 22వ తేదీన ఉత్తర అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని పేర్కొంది. ఇది క్రమంగా బలపడి వాయవ్యదిశగా కదులుతూ తుపానుగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. తుపానుగా మారితే దీనికి యాస్ పేరు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఇది మే 26 నాటికి పశ్చిమ బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సాధారణంగా రుతుపవనాల రాకకు సంకేతంగా తూర్పు, పశ్చిమ తీరాల్లో తుపాన్లు ఏర్పడుతుంటాయని చెబుతున్నారు. ఈ తుపాను ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండబోదని, కేవలం కోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని తెలిపారు. రాగల రెండు రోజులు కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురుస్తాయని, రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వివరించారు. -
తూర్పు మధ్య బంగాళాఖాతంలో 23న అల్పపీడనం
సాక్షి, అమరావతి బ్యూరో/విశాఖపట్నం: పశ్చిమ తీరాన్ని అతలాకుతలం చేసిన ‘టౌటే’ తుపాను బలహీనపడిన తరుణంలో తూర్పు తీరాన్ని వణికించడానికి మరో తుపాను సిద్ధమవుతోంది. ఈనెల 23 నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అది క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారవచ్చని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనా వేస్తోంది. ప్రస్తుత అంచనాల ప్రకారం రాబోయే తుపాను సముద్రంలోనే బలపడుతుంది. ఆపై దిశ మార్చుకుని ఉత్తర కోస్తా ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వైపు పయనిస్తుంది. పశ్చిమబెంగాల్ లేదా బర్మాలో తీరాన్ని దాటే అవకాశం కనిపిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు 200 నుంచి 300 కిలోమీటర్ల సమీపానికి వచ్చేసరికి దిశ మార్చుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఫలితంగా ఈ నెల 25, 26 తేదీల తర్వాత మన రాష్ట్రంలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈనెల 23న అల్పపీడనం ఏర్పడినా, బలపడి తుపానుగా మారినా నైరుతి రుతువపనాల ఆగమనానికి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని వాతావరణశాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. 21న అండమాన్ సముద్రంలోకి ‘నైరుతి’.. మరోవైపు ఈనెల 21న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలోకి ప్రవేశించే వీలుందని ఐఎండీ మంగళవారం వెల్లడించింది. రుతుపవనాలు కేరళను తాకడానికి ముందు అండమాన్ సముద్రంలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలోనే అంటే.. ఈనెల 31న కేరళను తాకుతాయని ఐఎండీ ఇప్పటికే ప్రకటించడం తెలిసిందే. పెరిగిన ఉష్ణోగ్రతలు కాగా, మంగళవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. దీనికితోడు ఉక్కబోత వాతావరణం నెలకొంది. రానున్న 3 రోజులు వాతావరణం మరింత వేడిగా ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. బుధ, గురువారాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతాయన్నారు. ఇదిలావుంటే.. వచ్చే 2 రోజుల్లో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణాజిల్లాల్లో ఒకటి రెండుచోట్ల మోస్తరు వానలు కురుస్తాయని తెలిపారు. -
సకాలంలోనే రుతుపవనాలు
సాక్షి, అమరావతి: నైరుతీ రుతుపవనాలు ఈసారి కూడా సకాలంలోనే రాష్ట్రంలో ప్రవేశిస్తాయని భారతీయ వాతావరణశాఖ అంచనా వేసింది. వ్యవసాయ రంగానికి ఎంతో కీలకమైన ఖరీఫ్ సీజన్ (జూన్ నుంచి సెపె్టంబర్ వరకు)లో కురిసే వర్షాలు నైరుతీ రుతుపవనాల ప్రభావంతో పడేవే. ప్రస్తుత అంచనాల ప్రకారం ఈనెల 31న రుతుపవనాలు కేరళను తాకుతాయి. జూన్ 1కి 4 రోజులు అటు ఇటుగా రుతుపవనాలు తొలుత కేరళలో ప్రవేశిస్తుంటాయి. ఆరేబియా మహా సముద్రంలో ప్రస్తుతం ఏర్పడిన టౌటే తుపాను రుతుపవనాల రాకను వేగవంతం చేసినట్టు తెలుస్తోంది. తుపాను ప్రభావంతో ఈనెల 21 నాటికే అండమాన్ నికోబార్ దీవుల నుంచి రుతుపవనాల కదలికలు ప్రారంభం కావచ్చని అంచనా. రుతుపవనాలకు ఒక నెల ముందు అరేబియా మహాసముద్రం లేదా బంగాళాఖాతంలో అల్పపీడనాలో, తుపాన్లో ఏర్పడుతుంటాయి. వీటివల్ల రుతుపవనాల్లో కదలిక వస్తుంది. అయితే ఈసారి అరేబియా మహాసముద్రంలో తుపాను వల్ల ఇప్పటికే కేరళ, లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక, గోవాలలో భారీవర్షాలు కురుస్తున్నాయి. మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఓమోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తప్ప మిగతా రాష్ట్రాల్లో మరో నాలుగైదు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని, ఆ సమయానికి కాస్త అటు ఇటుగా రుతుపవనాలు వచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ ప్రకటించింది. గత ఏడాది జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకుతాయని ఐఎండీ ప్రకటిస్తే జూన్ 5న ప్రవేశించాయి. ఈసారి మాత్రం జూన్ ఒకటికి ఒకరోజు ముందే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉంది. మే నెలలో అండమాన్‌లో వర్షాలు పడ్డాయంటే రుతుపవనాలు రాకడ ప్రారంభమైనట్టుగా భావిస్తుంటారు. రాష్ట్రంలో రెండురోజులు తేలికపాటి వానలు సాక్షి, విశాఖపట్నం: అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం నుంచి గుజరాత్ వైపు తేమ గాలులు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో వచ్చే రెండురోజులు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వానలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చెదురుమదురు వానలు పడే సూచనలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. రాయలసీమలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో ప్రత్తిపాడులో 3 సెంటీమీటర్లు వంతున వర్షపాతం నమోదైంది. -
రాయలసీమకు కాస్త తక్కువ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి బ్యూరో/సాక్షి, న్యూఢిల్లీ: భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. వరుసగా మూడో ఏడాదీ సాధారణ వర్షపాతం నమోదయ్యేలా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వెల్లడించింది. సాధారణ వర్షపాతం నమోదైతే దేశంలో కరువు పరిస్థితులు ఏర్పడవు. ఏటా రుతుపవనాల సీజనుకు ముందు ఏప్రిల్, మే నెలల్లో ఐఎండీ నైరుతి రుతుపవనాల తీరుతెన్నుల (దీర్ఘకాలిక వ్యవధి సగటు–ఎల్పీఏ) అంచనాలను రూపొందిస్తుంది. ఈ అంచనాల తొలి నివేదికను శుక్రవారం విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నాలుగు నెలల పాటు ప్రభావం చూపుతాయి. ఐఎండీ 1961–2010 మధ్య కాలానికి దేశవ్యాప్తంగా ఎల్పీఏ సగటు 88 సెంటీమీటర్ల వర్షపాతంగా తేల్చింది. ఎల్పీఏ సగటు 96 నుంచి 104 శాతం (అంటే ఐదు శాతం ఎక్కువ లేదా తక్కువ) అంచనా వేస్తే.. ఆ ఏడాది సాధారణ వర్షపాతమని లెక్క. వచ్చే నైరుతిలో 98 శాతం వర్షపాతం నమోదు కావచ్చని పేర్కొంది. ప్రస్తుత నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో కోస్తా కంటే రాయలసీమలో వర్షాలు తక్కువగా కురిసే సూచనలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ప్రకాశం, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు వర్ష సూచనలు తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఐఎండీ మే నెలలో రెండోవిడత నివేదిక విడుదల చేస్తే దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉండటంతో ఎప్పుడూ మే 31 లేదా జూన్ మొదటి వారంలో కేరళని తాకే నైరుతి రుతుపవనాలు ఈసారి 5 నుంచి 7 రోజుల ముందే వచ్చే సూచనలు ఉన్నాయని చెబుతున్నారు. ఈ ఏడాది తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర ప్రాంతంలోను సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని భూశాస్త్ర మంత్రిత్వశాఖ కార్యదర్శి డాక్టర్ ఎం.రాజీవన్, ఐఎండీ డైరెక్టర్ జనరల్ మోహపాత్రా శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కోస్తాంధ్రలో సాధారణం కంటే తక్కువ, రాయలసీమలో కొన్నిచోట్ల సాధారణ వర్షపాతం, కొన్నిచోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. -
ఠారెత్తించిన ఎండలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: రాష్ట్రంలో శుక్రవారం కూడా ఎండలు ఠారెత్తించాయి. వడగాలులు కూడా తోడవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అత్యధికంగా ప్రకాశం జిల్లా కందుకూరులో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సముద్రంపై నుంచి తేమగాలుల రావడంతో వడగాడ్పుల తీవ్రత తగ్గి రాబోయే రెండ్రోజుల్లో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
సెగలు పుట్టిస్తున్న ఎండ
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతిబ్యూరో: రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగి ప్రజలను ఠారెత్తిస్తోంది. ఈ సీజన్లో బుధవారం తొలిసారి 45.9 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. దీనికి వడగాలులు తోడవడంతో జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మార్చి నెలలోనే ఈ స్థాయి ఉష్ణోగ్రత, వడగాలులతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాష్ట్రంలోని 670 మండలాలకుగాను 110 మండలాల్లో బుధవారం ఎక్కువ ఉష్ణోగ్రత, తీవ్రమైన వడగాలులు వీచాయి. మరో 207 మండలాల్లో ఎండ, వడగాడ్పుల ప్రభావం కనిపించింది. ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం జిల్లాలో 15 మండలాలు, విజయనగరం జిల్లాలో 14, విశాఖలో 18, తూర్పుగోదావరిలో 13, కృష్ణాలో 11, గుంటూరు జిల్లాలో 15, ప్రకాశంలో 10 మండలాల్లో ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదై తీవ్రమైన వడగాలులు వీచాయి. ఎండల తీవ్రత దృష్ట్యా విపత్తుల నిర్వహణ శాఖ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వడగాలుల బారిన పడకుండా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. 68 ఏళ్ల తర్వాత బెజవాడలో రికార్డు ఉష్ణోగ్రత బెజవాడలో భానుడు రికార్డు సృష్టించాడు. 68 ఏళ్ల రికార్డును తిరగరాశాడు. బుధవారం ఇక్కడ 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపు ఏడు దశాబ్దాల తర్వాత మార్చిలో ఇంతలా అత్యధిక ఉష్ణోగ్రత నమోదు కావడం ఇదే తొలిసారి. 1953 మార్చి 29న విజయవాడలో 43.3 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. మార్చిలో ఇప్పటివరకు ఇదే ఆల్‌టైం రికార్డుగా భారత వాతావరణ విభాగం గుర్తించింది. బుధవారం నమోదైన 43 డిగ్రీల ఉష్ణోగ్రత సాధారణం కంటే ఆరు డిగ్రీలు అధికం. తెలుగు రాష్ట్రాల్లో పెరగనున్న ఉష్ణోగ్రతలు ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్రంలో తుపాను ప్రభావంతో ఏర్పడిన అల్ప పీడనంతో వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకోనున్నట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రం, పరిసరాలపై మరింత ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ కారణంగా అండమాన్ నికోబార్ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో అక్కడక్కడ బుధ, గురువారాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో మంగళవారం సాధారణం కంటే 5.1 డిగ్రీల ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 2, 3, 5 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలలో ఉరుములతో కూడిన వర్షాలు, 30, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. వాతావరణ శాఖ హెచర్చికలు, వివరాలు, ఈదురుగాలుల వివరాలు తెలుసుకోవడానికి మౌసమి, మేఘదూత్, దామిని యాప్‌లు డౌన్లోడ్ చేసుకోవచ్చని ఐఎండీ సూచించింది. 4 వరకు ఇదే పరిస్థితి.. రాబోయే రోజుల్లో రాష్ట్రంపై వడగాలుల తీవ్రత పెరగనుంది. ఉత్తర భారతదేశం నుంచి వేడి గాలులు రాష్ట్రం వైపుగా వీస్తున్నాయి. ఇదే సమయంలో సూర్యుడు భూ మధ్య రేఖని దాటి.. భారత్‌పై ఉంటున్న సమయంలో ఈ గాలులు వీస్తుండటం వల్ల పొడి వాతావరణం ఏర్పడి వడగాలుల తీవ్రత పెరుగుతూ వస్తోందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. ఈ తీవ్రత ఏప్రిల్ 4 వరకు కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వడగాలుల తీవ్రత విపరీతంగా ఉంటుందని వెల్లడించారు. ఈ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. -
మార్చిలోనే మంటలు!
సాక్షి, అమరావతి బ్యూరో: ఈ వేసవి అధిక ఉష్ణతాపాన్ని వెదజల్లనుంది. అంతేకాదు ఈ ఏడాది ముందుగానే భానుడి భగభగలతో ఎండల తీవ్రత పెరగనుంది. తీవ్ర వడగాడ్పులకూ అవకాశం ఉంది. ఇదే విషయాన్ని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మారిన వాతావరణ పరిస్థితులే ఇందుకు కారణమని చెబుతున్నారు. సాధారణంగా ఏప్రిల్ నుంచి వేసవి సెగలు మొదలవుతాయి. ఈసారి మార్చి ఆరంభం నుంచే ఎండలు మండుతున్నాయి. ఫిబ్రవరి ఆఖరు నుంచే రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరువలో నమోదవుతున్నాయి. ఇవి మున్ముందు మరింత ఉధృతం కానున్నాయి. మార్చి నుంచి మే వరకు కొంకణ్, గోవాలతో పాటు కోస్తాంధ్రలో వేసవి తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఐఎండీ తాజా నివేదికలో వెల్లడించింది. కోస్తాంధ్రలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేసింది. పొరుగున ఉన్న చత్తీస్‌గఢ్, ఒడిశాలో ఉష్ణతాపం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో దాని ప్రభావం కోస్తాంధ్రలోనూ అధికంగా ఉండనుంది. ఈ వేసవి ఎందుకిలా..? ఏటా ఉత్తర భారత దేశంలో మార్చి ఆఖరి వరకు పశ్చిమ ఆటంకాలు (వెస్టర్న్ డిస్టర్బెన్స్) చురుగ్గా ఉంటూ ప్రభావం చూపుతాయి. దీంతో ఆకాశంలో మేఘాలేర్పడి ఉష్ణతీవ్రతను తగ్గిస్తాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అవి చురుకుదనాన్ని తగ్గించుకున్నాయి. ఫలితంగా ఆకాశంలో మేఘాలేర్పడకుండా నిర్మలంగా ఉండడం ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతోంది. మరోవైపు సముద్రం నుంచి నైరుతి, దక్షిణ గాలులు కూడా ప్రస్తుతం రావడం లేదు. ఈ గాలులొస్తే చల్లదనాన్ని మోసుకొస్తాయి. పశ్చిమ ఆటంకాల చురుకుదనం తగ్గడం, సముద్ర గాలులు రాకపోవడంతో ముందుగానే వేసవి తాపం పెరగడానికి కారణమవుతోందని ఐఎండీ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ‘వాస్తవానికి మే నుంచి సముద్ర గాలుల రాక తగ్గుతుంది. కానీ ఈ ఏడాది మార్చి ఆరంభం నుంచే చల్లగాలులు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈ వేసవిలో సాధారణం కంటే 2–5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు, అక్కడక్కడ తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి’ అని ఆయన వివరించారు. మొదలైన వేసవి తాపం.. ఇప్పటికే రాష్ట్రంలో వేసవి తాపం కనిపిస్తోంది. సాధారణం కంటే 2 నుంచి 3.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం తునిలో 38 (+3.5), నందిగామ 37 (+1), మచిలీపట్నం 34.4 (+2), కాకినాడ 34 (+1.2), నర్సాపురం 33.6 (+1.3) కళింగపట్నం 33 (+1.4), బాపట్ల (+1), విశాఖపట్నం 32.3 (+2) డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రంలో పలుచోట్ల నాలుగు రోజుల క్రితమే ప్రస్తుత ఉష్ణోగ్రతలకంటే అధికంగా నమోదు కావడం విశేషం. -
ముంబైలో తేలికపాటి జల్లులు
ముంబై: దేశ ఆర్థిక రాజధానిని వరుణుడు కరుణించడం లేదు. అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ముంబైతో పాటు థానె, కళ్యాణ్, దోంబివాల వంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో సోమవారం ఉదయం తేలికపాటి జల్లులు కురిశాయి. పొగమంచు కప్పేయడంతో ఉష్ణోగ్రతలు పడిపోయాయి.. పరిసరాలు సరిగా కనిపించడం లేదు. ఈ సందర్భంగా ప్రాంతీయ వాతావరణ కేంద్రం ముఖ్య అధికారి కేఎస్ హోసాలికర్ మాట్లాడుతూ.. ‘ముంబై, థానె, నవీ ముంబై ప్రాంతాల్లో గడిచిన ఆరు గంటల నుంచి తేలికపాటి జల్లులు కురుస్తున్నాయి. ఇక రానున్న మూడు, నాలుగు గంటల్లో ఈ ప్రాంతాల్లో మోస్తరు జల్లులు పడే అవకాశం ఉంది’ అని తెలిపారు. ఇక మరో 24 గంటల పాటు ఆకాశం మేఘావృతం అయి ఉంటుందని తెలిపారు. ఇక వాతావరణ శాఖ ప్రకారం మరో 48 గంటల పాటు ముంబై, పరిసర ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతం అయి ఉంటుందని.. ఉష్ణోగ్రత 22 డిగ్రీలకు పడి పోతుందని వెల్లడించింది. ముంబై వాతావరణ పరిస్థితులకు సంబంధించి పలువురు నెటిజన్లు ఫోటోలు షేర్ చేస్తున్నారు. Dip in temperatures with smog shrouding parts of Mumbai city and Thane leading to decreased visibility. According to the forecast, it is likely to be cloudy with the minimum temperature at 23 to 22 degrees celsius for next 48 hours#Mumbairains #December #rains #thane #birds pic.twitter.com/quQXw3OJ2Z — Pratik Mukane | प्रतिक मुकणे (@pratikmukane) December 14, 2020 -
రెండ్రోజులు వానలు
సాక్షి, విశాఖపట్నం/తిరుమల: ఆగ్నేయ బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో 5.8 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు మన్నార్ గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం బలహీన పడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ట్రోపో ఆవరణం ఎత్తు వరకు మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వానలు కురిసే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. గడచిన 24 గంటల్లో నెల్లూరులో 6 సెం.మీ, వెంకటగిరి, శ్రీకాళహస్తిలో 5, తొట్టంబేడులో 4, తడ, సూళ్లూరుపేట, గూడూరు, పలమనేరు, పెనగలూరులో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. తిరుమలలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వారం రోజులుగా వర్ష ప్రభావంతో తిరుమల గిరుల్లో చలితీవ్రత అధికమైంది. ఆదివారం కురిసిన వర్షానికి రెండో ఘాట్ వద్ద కొండ చరియలు విరిగి పడ్డాయి. అధికారులు సకాలంలో వాటిని తొలగించారు. -
2 రోజుల పాటు తేలిక పాటి జల్లులు
సాక్షి, విశాఖపట్నం/సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులోని రామనాథపురం జిల్లా తీరానికి దగ్గర్లోని మన్నార్ గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న వాయుగుండం గడిచిన 33 గంటలుగా అదే ప్రాంతంలో స్థిరంగా ఉంది. రామనాథపురానికి నైరుతి దిశలో 40 కి.మీ దూరంలో, పాంబన్కు పశ్చిమ నైరుతి దిశలో 70 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఆదివారం ఉదయం అదే ప్రాంతంలో బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. గడిచిన 24 గంటల్లో సత్యవేడులో 10 సెం.మీ, సూళ్లూరుపేటలో 6, గూడూరు, తడలో 5, రాపూరు, కోడూరు, తొట్టంబేడులో 4, వెంకటగిరి, శ్రీకాళహస్తి, నగరిలో 3 సెం.మీ వర్షపాతం నమోదైంది. తమిళనాడులో 26 మంది మృతి దక్షిణ తమిళనాడును భయపెట్టిన బురేవి తుపాను తీరానికి చేరకుండానే బలహీనపడి ఊరటనిచ్చింది. అయితే తుపాను ప్రభావంతో సముద్ర తీర జిల్లాలు భారీ వర్షాలతో అతలాకుతలమయ్యాయి. 26 మంది ప్రాణాలు కోల్పోగా, పది లక్షలకు పైగా ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. -
బంగాళాఖాతంలో మళ్లీ ‘వాయుగండం’!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, అమరావతి: నివర్ తుపాను తీవ్రత నుంచి కోలుకోక ముందే.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ప్రస్తుత నివర్ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ కోస్తాంధ్ర – పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. దానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ ప్రభావంతో కోస్తాంధ్రలో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పలు చోట్ల కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటించింది. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. మరో రెండు తుపాన్లు!: తూర్పు హిందూ మహాసముద్రం – దక్షిణ అండమాన్ సముద్రం మీద 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 36 గంటల్లో (ఈ నెల 29న) ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ శుక్రవారం రాత్రి వెబ్సైట్లో ప్రకటించింది. తదుపరి 24 గంటల్లో ఇది క్రమంగా బలపడి తమిళనాడు–పుదుచ్చేరి మీదుగా అరేబియా సముద్రం వైపు పయనించి డిసెంబర్ 2 తర్వాత తుపానుగా మారే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది తుపానుగా మారితే.. మాల్దీవులు సూచించిన ‘బురేవి’గా పేరు పెట్టనున్నారు. అదేవిధంగా.. మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో వచ్చే నెల 5న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండగా.. ఇది క్రమంగా బలపడి తుపానుగా మారితే దీనికి మయన్మార్ సూచించిన ‘టకేటీ’గా పేరు పెడతారు. కాగా గడిచిన 24 గంటల్లో నివర్ ప్రభావంతో.. రాష్ట్రమంతటా భారీ వర్షాలతో పాటు మోస్తరు వానలు విస్తారంగా కురిశాయి. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని అధికా>రులు తెలిపారు. -
దూసుకొస్తున్న ‘నివర్’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి/న్యూఢిల్లీ: నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం సోమవారం ఉదయం మరింత బలపడి వాయుగుండంగా మారింది. గంటకు 11 కి.మీ. వేగంతో ప్రయాణిస్తూ ఆగ్నేయ బంగాళాఖాతంలో పాండిచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 500 కి.మీ., చెన్నయ్‌కి ఆగ్నేయ దిశగా 540 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మంగళవారం మరింత బలపడి తుపానుగా మారే సూచనలున్నాయని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. తుపాను ఏర్పడితే ప్రపంచ వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం.. ఇరాన్ సూచించిన ‘నివర్’ అనే పేరు పెడతామని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇది వాయువ్య దిశగా ప్రయాణించి పాండిచ్చేరిలోని కరైకల్, తమిళనాడులోని మహాబలిపురం సమీపంలో మళ్లాపురం ప్రాంతం వద్ద ఈ నెల 25న (బుధవారం) తుపానుగా మారుతుందని.. ఆ రోజు సాయంత్రం లేదా రాత్రి అదే ప్రాంతంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్లు, గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దాటవచ్చని తెలిపారు. దీని ప్రభావంతో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. మంగళవారం తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతోనూ.. 25, 26 తేదీల్లో గంటకు 65 నుంచి 75 కిలోమీటర్లు.. గరిష్టంగా 85 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. ఈ దృష్ట్యా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులెవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. తమిళనాడు, పుదుచ్చేరి వైపుగా కదులుతున్న వాయుగుండం పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు వాయుగుండం తుపానుగా మారనుందన్న సమాచారంతో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్.. గంగవరం, కాకినాడ పోర్టుల్లో నాలుగో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం ఓడరేవుకు అప్రమత్తత సమాచారం అందించినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రైతులు చేతికొచ్చిన పంటల్ని వెంటనే జాగ్రత్తపర్చే ఏర్పాట్లలో ఉండాలని సూచించారు. మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు దీని ప్రభావంతో రాష్ట్రంలోని నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీరం తీవ్ర అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించారు. ఉత్తర కోస్తాంధ్రలో చాలాచోట్ల మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అనేకచోట్ల మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయి. బుధవారం దక్షిణ కోస్తా, రాయలసీమలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. యంత్రాంగం అప్రమత్తం తుపాను హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ అప్రమత్తం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేయాలని, సరిపడా ఔషధాలు నిల్వ ఉంచుకోవాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో జనరేటర్లను, ప్రతి పీహెచ్సీలో రెండేసి అంబులెన్స్‌లను సిద్ధం చేయాలన్నారు. గర్భిణులు, వృద్ధులు, ఐదేళ్లలోపు చిన్నారులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణులను సమీపంలోని ఆరోగ్య కేంద్రాలకు తరలించాలన్నారు. విద్యుత్ శాఖ హై అలెర్ట్ ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ ఉద్యోగులు ముందస్తు ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి ఆదేశించారు. డిస్కమ్‌ల సీఎండీలు, జిల్లాల సూపరింటెండెంట్ ఇంజనీర్లతో సోమవారం ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్లు, లైన్లు, టవర్లను భౌగోళిక సమాచార విధానం (జీఐఎస్) పరిధిలోకి తీసుకచ్చామని, ముంపు ప్రమాదం ఉన్న టవర్లు, సబ్ స్టేషన్లు, లైన్ల వద్దకు వీలైనంత త్వరగా చేరుకునే మార్గాలను జీఐఎస్ ద్వారా సిబ్బంది తెలుసుకుని తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. ప్రాణ నష్టం లేకుండా చూడండి : కేంద్రం తుపాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు కేంద్ర మంత్రివర్గ కార్యదర్శి రాజీవ్‌గాబా సూచించారు. సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ (ఎన్సీఎంసీ) సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా సమర్ధంగా ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉన్నామని, ఎన్డీఆర్ఎఫ్ ఇతరత్రా సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నామని మూడు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు ఆయనకు వివరించారు. ఈ నెల 24–26 తేదీల మధ్య ఏపీ, తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాలను తుపాను ప్రభావితం చేసే అవకాశం ఉందని భారత వాతావరణ పరిశోధనా సంస్థ డైరెక్టర్ జనరల్ వివరించారు. -
వాయు'గండం'
సాక్షి, నెట్వర్క్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి సోమవారం ఉదయం 11.30 గంటలకు తీవ్ర వాయుగుండంగా మారింది. రాత్రి 9 గంటలకు విశాఖపట్నంకు దక్షిణ ఆగ్నేయ దిశగా 220 కి.మీ, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 240 కి.మీ, నర్సాపురానికి తూర్పు ఆగ్నేయ దిశగా 290 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 6 కిమీ వేగంతో ప్రయాణం చేస్తూ కాకినాడకు అతి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. ఆ సమయంలో కోస్తాంధ్రలో గంటకు 55 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఇవి ఒక దశలో 75 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని తాకవచ్చని తెలిపింది. దీని ప్రభావంవల్ల మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కర్నూలు జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశా, తమిళనాడు, పాండిచ్చేరి తీరాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగసిపడుతున్నాయి. అందువల్ల మంగళవారం మత్స్యకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లరాదని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. పలు పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఉత్తర అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని ఐఎండీ తెలిపింది. కొనసాగుతున్న వర్షాలు వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో ఆదివారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తూనే ఉంది. కాకినాడ తీరంలో సోమవారం రాత్రి నుంచి గాలులు మొదలయ్యాయి. వర్షం కూడా పెరిగింది. కోనసీమలో అధికారులు ముందస్తుగా 41 తుపాను షెల్టర్లలో పునరావస కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాకినాడ– ఉప్పాడ బీచ్ రోడ్డు పలుచోట్ల కోతకు గురయ్యింది. ప్రభుత్వ హెచ్చరికలతో మత్స్యకారులు వేటను నిలిపేశారు. కాకినాడలో 12 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 350 మందిని తరలించారు. సురక్షిత ప్రాంతాలకు నౌకలు కాకినాడ యాంకరేజ్ పోర్టు, డీప్ వాటరు పోర్టుల్లో ఎగుమతి, దిగుమతి పనులు నిలిచిపోయాయి. ఏపీ మెరైన్ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు యాంకరేజ్ పోర్టులో ఉన్న 13 అంతర్జాతీయ నౌకలను సముద్రంలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతులు నిలిపేసినట్లు పోర్టు అధికారి జి.వీరరాఘవరావు తెలిపారు. డీప్ వాటర్ పోర్టు (కాకినాడ సీ పోర్టు)లో చక్కెర, ఎరువుల ఎగుమతి, దిగుమతుల్ని నిలిపేసినట్లు సీపోర్టు అధికారి మురళీధర్ చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో నాగావళి, వంశధార నదీ తీరప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లో లంకలు, లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తింది. విశాఖపట్నం జిల్లాలో భారీవర్షం కురిసింది. విజయనగరం, చిత్తూరు, కర్నూలు తదితర జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. అల్పపీడనం, వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలు ఎనిమిది జిల్లాల్లో సుమారు 12,473 హెక్టార్లలో పంటలపై ప్రభావం చూపినట్లు వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. గడిచిన 24 గంటల్లో భీమిలిలో 17 సెంమీ, విశాఖపట్నం 15, కాకినాడ, పెద్దాపురంలో 14, యానాంలో 11, అనకాపల్లి, అమలాపురంలో 10, మర్రిపూడి, తునిలో 8, సింహాద్రిపురం, ప్రత్తిపాడు, యలమంచిలిలో 7 సెంమీ, చీమకుర్తి, నర్సీపట్నం, చోడవరం, ఒంగోలు, పాలకోడేరులో 5 సెంమీ వర్షపాతం నమోదైంది. అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ భారీ వర్షాల వల్ల అవాంఛనీయ ఘటనలు జరిగితే ప్రజలకు తక్షణం సేవలందించేందుకు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రంలోని పోలీసులను డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. ఈ విషయమై సోమవారం రాత్రి ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని స్టేషన్ హౌస్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్‌వోల) నుంచి జిల్లా ఎస్పీలు, నగర పోలీస్ కమీషనర్ల వరకు 24 గంటలూ విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే ప్రజలు డయల్ 100, డయల్ 112కు సమాచారం ఇచ్చి పోలీసుల సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. -
కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఆదివారం వేకువ జామున 5.30 గంటలకు వాయుగుండంగా మారింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఆదివారం రాత్రి 9 గంటలకు విశాఖపట్నంకు పశ్చిమ ఆగ్నేయ దిశగా 330 కి.మీ, కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 370 కి.మీ, నర్సాపురానికి తూర్పు ఆగ్నేయ దిశగా 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది నర్సాపురం, విశాఖపట్నం మధ్య సోమవారం రాత్రి తీరం దాటే అవకాశముందని ఇక్కడి భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) వెల్లడించింది. దీనికి తోడుగా.. ఉత్తర అండమాన్ సముద్రం.. దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 14న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు తెలిపింది. ఇక తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో విస్తారంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయి. విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశమున్నట్లు ఐఎండీ తెలిపింది. తీర ప్రాంత ప్రజలతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వాయుగుండంగా తీరం దాటనున్న నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందనీ, తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులకు హెచ్చరిక తీవ్ర వాయుగుండం కారణంగా రాగల రెండ్రోజులపాటు మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఇందుకు సంబంధించి కళింగపట్నం, భీమిలి, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరిక జారీచేశారు. -
మూడు రోజులు జోరు వానలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 1.5 కిలో మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి ఈనెల 20వ తేదీ నాటికి ఈశాన్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమరావతి కేంద్రం ప్రకటించింది. ఈ ప్రభావంవల్ల రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. కృష్ణమ్మ ఉగ్రరూపం కృష్ణా నదిలో వరద ఉద్ధృతి కొనసాగు తోంది. ప్రకాశం బ్యారేజీలోకి పెద్ద ఎత్తున వరద రావడంతో శుక్రవారం 70 గేట్లు ఎత్తేసి.. దిగువకు సముద్రంలోకి 4,38,286 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తుండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. మొదటి ప్రమాద హెచ్చరికను సైతం జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళాలని అధికారులు సూచించారు. ► శ్రీశైలం జలాశయం ఆరు గేట్లు, కుడి విద్యుత్ కేంద్రం ద్వారా 1,97,264 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.20 అడుగుల్లో 210.99 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జున సాగర్‌లోకి 1,71,702 క్యూసెక్కులు చేరుతున్నాయి. ► పులిచింతల ప్రాజెక్టులోకి 1,95,927 క్యూసెక్కులు చేరుతుండగా.. 1,85,233 క్యూసెక్కులను గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ► పెన్నాలో వరద ఉద్దృతి కొనసాగుతోంది. సోమశిలలోకి 67,833 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 78 టీఎంసీలకు చేరుకుంది. వరుసగా రెండో ఏడాది గరిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ చేశారు. ► ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,96,420 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 800 క్యూసెక్కులు వదిలి మిగులుగా ఉన్న 1,95,031 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): ఉత్తర మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతం, దక్షిణ ఉత్తరప్రదేశ్ ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర–దక్షిణ ద్రోణి ఉత్తర కోస్తా తమిళనాడు నుంచి కోమెరిన్∙ ప్రాంతం వరకు 0.9 కి.మీ. ఎత్తు వరకు కొనసాగుతోంది. వీటి ప్రభావం వల్ల రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అమరావతి కేంద్రం శనివారం రాత్రి ప్రకటించింది. ► ఉత్తర కోస్తాంధ్రా, దక్షిణ కోసాంధ్రా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి, రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ► శనివారం పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. అనేక చోట్ల ఒక టి లేదా రెండు డిగ్రీలు ఎక్కువగా నమోదు అయినట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. -
అతి భారీ వర్షాలు.. 23 వరకు ఇదే పరిస్థితి
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలో ఎక్కడ చూసిన వరదనీరే కనిపిస్తుంది. ఢిల్లీ, నోయిడా, గురుగావ్, ఫరీదాబాద్, ఘజియాబాద్ ప్రాంతాలలో బుధవారం మొదలైన భారీ వర్షాలు గురువారం కూడా కొనసాగాయి. దీనితో ప్రధాన రహదారులు అన్ని చేరువులను తలపించాయి. ఇక పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా సాకేత్ ఏరియాలోని జే బ్లాక్‌లో ఓ గోడ కూలింది. పక్కనే ఉన్న వాహనాలపై పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన గురుగావ్‌లో కూడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 23 వరకు ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదని జనాలను కోరారు. (11 రాష్టాల్లో వరదలు.. 868 మంది మృతి) దేశంలోని అనేక ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. దీనివల్ల అనేక నగరాల్లో నీరు నిండిపోయింది. రాబోయే ఐదు రోజుల్లో దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. హరియాణా, పంజాబ్, చండీగఢ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురవడంతో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో బుధవారం ఒడిశాలో భారీ వర్షపాతం నమోదయ్యింది. ఇక ఉత్తరాఖండ్‌లో రాత్రిపూట కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్ని జలమయం అయ్యాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. హిమాలయ దేవాలయాలు అయిన కేదార్నాథ్, బద్రీనాథ్‌లకు వెళ్లే రోడ్లు కూడా జలమయమయినట్లు అధికారులు తెలిపారు. -
భారీ వర్షాలు.. గోడ కూలి వాహనాలు ధ్వంసం
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జలమయమైన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజిమాబాద్‌లో బుధవారం ఉదయం వర్షం కుండపోతగా కురిసింది. దీంతో ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపిస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా రోడ్డు పక్కన ఉన్న సరిహద్దు గోడ కూలిపోవడంతో సాకేత్ ప్రాంతంలోని జే బ్లాక్‌లో అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. (కుండపోత వర్షాలు: కొండచరియలు విరిగి..) రంగంలోకి దిగిన ఢిల్లీ పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు సూచనలు చేస్తున్నారు. ట్రాఫిక్‌కు సంబంధించిన అప్డేట్లను ట్విటర్ ద్వారా వెల్లడిస్తున్నారు. లాజవంతి ఫ్లై ఓవర్ సమీపంలో కస్టర్ బస్సు ఆగిపోవడంతో ఫ్లైఓవర్ నుంచి ధౌలా కువాన్ వైపు క్యారేజ్‌వేలో ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. ధౌలా కువాన్ వైపు వెళ్లే ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గం మాయాపురి చౌక్ ద్వారా వెళ్లాలని ట్విటర్లో పేర్కొన్నారు. (నోయిడా విద్యుత్ సబ్ స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం) #WATCH: A number of vehicles damaged in Saket area's J Block, after a side wall collapsed following incessant downpour in Delhi. pic.twitter.com/6NOQXcQXH9 — ANI (@ANI) August 19, 2020 రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడనుందని, రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే ఆగష్టు 23 వరకు వర్షాలు ఇలాగే కొనసాగనున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. -
నేడు మరో అల్పపీడనం
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో/మహారాణిపేట (విశాఖ దక్షిణ)/చిలకలపూడి (మచిలీపట్నం): ఈశాన్య బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో బుధవారం ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతోందని విశాఖ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ విభాగం– అమరావతి తెలిపాయి. రానున్న 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి పశ్చిమం వైపు కదిలే అవకాశం ఉందని వెల్లడించాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా తీరం వెంట బలమైన గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. బుధ, గురువారాల్లో రాష్ట్రమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ► కృష్ణా జిల్లా వ్యాప్తంగా మంగళవారం 3.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గూడూరు మండలంలో 17.0 మిల్లీమీటర్లు, అత్యల్పంగా చాట్రాయి మండలంలో 1.2 మిల్లీమీటర్ల వర్షం పడింది. ► అల్పపీడన ప్రభావంతో గుంటూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడ్డాయి. గుంటూరు నగరంలో కురిసిన వర్షాలకు డ్రెయిన్లు పొంగి పొర్లాయి. ► తడి వాతావరణం ఉండటంతో పశ్చిమ డెల్టా ప్రాంతంలో వెద పద్ధతిలో వరి పంట సాగులో జాప్యం జరుగుతోంది. ► పత్తి పొలాలు ఉరకెత్తడంతో కొన్నిచోట్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. -
నేడు, రేపు విస్తారంగా వర్షాలు
సాక్షి, అమరావతి/చింతూరు (రంప చోడ వరం)/ కొరిటె పాటు (గుంటూరు)/ కర్నూలు (అగ్రికల్చర్): వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అమరావతి కేంద్రం బుధవారం ప్రకటించింది. ► ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమ మినహాయించి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ► వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలవారు అప్ర మత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిం చేందుకు సిద్ధంగా ఉండాలని అధి కారులకు ఆదేశాలిచ్చారు. ఏజెన్సీలో భారీ వర్షాలతో పొంగిన నదులు, వాగులు ► తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో బుధవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుండడంతో ఏజెన్సీ మండలాల్లో నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. ► విలీన మండలాలు.. ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం మండలాలకు వరద ముంపు పొంచి ఉంది. ► చింతూరు మండలంలో సోకిలేరు, జల్లివారి గూడెం వాగులు పొంగి రహదారిపై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో చింతూరు, వీఆర్‌పురం మండలాల మధ్య, చింతూరు మండలంలోని 11 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ► దేవీపట్నం వద్ద గోదావరి క్రమేపీ పెరుగుతుండడంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో ఏలూరు మండలం చొదిమెళ్లకు కొద్దిదూరంలో చింతలపూడి ప్రధాన రహదారిలోని కల్వర్టు కోతకు గురై కూలిపోయింది. ఫలితంగా రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ► కాగా, బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడ్డాయి. -
నేడు, రేపు విస్తారంగా వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట(విశాఖ దక్షిణ): రాష్ట్రవ్యాప్తంగా గురు, శుక్రవారాల్లో ఉరుములు, మెరుపులతో పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం వెబ్సైట్లో ప్రకటించింది. రాయలసీమలో గురువారం కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ విస్తరిస్తాయి. అదే సమయంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా చల్లని గాలులు వీస్తున్నాయి. మొన్నటి దాకా ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు వాతావరణం చల్లబడటంతో సేదదీరుతున్నారు. తూర్పు మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. రాగల 36 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్యం దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఇదిలా ఉండగా బుధవారం కృష్ణా, పశ్చిమగోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతో పాటు పలు చోట్ల వర్షాలు కురిశాయి. విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. -
కోస్తాకు కుండపోత!
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి, గుంటూరు: రుతు పవనాలు, అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. బుధ, గురువారాల్లో విశాఖపట్నం, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. ‘బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మంగళవారం అల్పపీడనంగా బలపడింది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయి ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది రాగల 36 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి బలపడే అవకాశం ఉంది’ అని ఐఎండీ పేర్కొంది. ► నైరుతి రుతు పవనాలు రాబోయే 36 గంటల్లో రాయలసీమలోని మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగిలిన ప్రాంతాలు, కోస్తాంధ్రలో ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ► నేడు, రేపు రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ► గత 24 గంటల్లో విశాఖపట్నంలో 5 సెంమీ, ఎస్.కోట, అనకాపల్లి, అరకు, వేపాడలో 4 సెం.మీ, చోడవరం, భీమిలిలో 3 సెంమీ చొప్పున వర్షపాతం నమోదైంది. ► నేడు, రేపు తీరం వెంట గంటకు 45 నుంచి 55 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ► గుంటూరు జిల్లాలో మంగళవారం సాయంత్రం పలుచోట్ల ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలులకు చెట్లు విరిగి పడి విద్యుత్ తీగలు తెగటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుంటూరులో భారీ వర్షం కురవటంతో ప్రయాణికులు తడిసి ముద్దయ్యారు. -
తీరాన్ని తాకిన ‘నిసర్గ’ తుఫాను
-
ఊపిరి పీల్చుకున్న ముంబై
సాక్షి, ముంబై: కరోనా వైరస్ విజృంభణతో అల్లాడుతున్న ముంబై నగరంపై నిసర్గ తుపాను కరుణ చూపింది. భారీ విధ్వంసానికి కారణమవుతుందని భావించిన నిసర్గ తీరందాటే క్రమంలో ముంబై నగరంపై తక్కువ ప్రభావాన్నే చూపింది. గాలి వేగం, వర్షం తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటివరకు నిసర్గ వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని వెల్లడించారు. ఒకవైపు లాక్డౌన్, మరోవైపు నిసర్గ బారినపడకుండా ప్రభుత్వ హెచ్చరికలతో జనమంతా ఇళ్లకే పరిమితమయ్యారు. బీచ్‌లు, పార్కులు, బహిరంగ ప్రదేశాలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫాను (నిసర్గ)గా మారిన సంగతి తెలిసిందే. ముంబైకి వంద కిలోమీటర్ల దూరంలోని అలీబాగ్ వద్ద నిసర్గ తుఫాను బుధవారం మధ్యాహ్నం 1 గంటకు తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. వాహనాలు ధ్వంసమయ్యాయి. అయితే, ఆరు గంటల వ్యవధిలోనే (రాత్రి ఏడు గంటల ప్రాంతంలో) నీరస పడింది. ఇక తుపాను ప్రభావం తగ్గడంతో ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. ఇప్పటికే మహారాష్ట్ర, గుజరాత్, డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేళీల్లో హై అలర్ట్‌లో ఉన్నాయి. (చదవండి: తుపానుల వలయంలో ముంబై) -
ముంబైని తాకిన నిసర్గ తుఫాను
ముంబై : అరేబియా సముద్రంలోని తూర్పు మధ్య ప్రాంతంలో సూరత్‌కి 670 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం తీవ్ర తుఫాను(నిసర్గ తుఫాను)గా మారిన సంగతి తెలిసిందే. కాగా నిసర్గ తుపాను బుధవారం ముంబైలోని అలీబాగ్ వద్ద మధ్యాహ్నం 1గంట సమయంలో తీరాన్ని తాకింది. మరో మూడు గంటల్లో నిసర్గ సంపూర్ణంగా తీరం దాటనున్నట్లు భారతీయ వాతావరణ శాఖ పేర్కొన్నది. నిసర్గ తుఫాను అలీబాగ్ వద్ద తీరం దాటే సమయంలో సుమారు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో పెద్ద ఎత్తున చెట్లు నేలకూలాయి. కరోనాతో అతలాకుతలం అవుతున్న ముంబై నగరానికి ఈ తుఫాను ప్రభావం తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది.(నిసర్గ: చార్జింగ్ పెట్టుకోండి.. గ్యాస్ కట్టేయండి!) ముందుజాగ్రత్త చర్యగా ముంబైలోని ఛత్రపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రాత్రి 7గంటల వరకు మూసివేశారు. కాగా తుఫాను ప్రభావంతో ముంబై నుంచి వెళ్లాల్సిన పలు విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్పోర్ట్ అధికారులు పేర్కొన్నారు. తుఫాన్ నేపథ్యంలో ముంబైలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను తీవ్రత నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించుకునేందుకు నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గ్రేటర్ ముంబై పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. మహారాష్ట్ర, గుజరాత్ తీర ప్రాంతాలపై నిసర్గ తుపాను ప్రభావం తీవ్రంగా ఉండనున్నది. జాతీయ విపత్తు సహాయక దళం(ఎన్డీఆర్ఎఫ్) తీర ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో 40 వేల మందిని, గుజరాత్లో 50 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ముంబై పరిసర ప్రాంతాల్లో 20 ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. గుజరాత్లో 15 ఎన్డీఆర్ఎఫ్, 6 ఎస్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. దక్షిణ గుజరాత్‌లోని పరిశ్రమలను ముందస్తు జాగ్రత్తగా మూసివేశారు. -
నిసర్గ తుపాను: ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్
సాక్షి, ముంబై: అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘నిసర్గ’ తుపాను మహారాష్ట్ర, గుజరాత్, గోవా తీరాలపై విరుచుకుపడనుందనే భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హెచ్చరికల నేపథ్యంలో ఆ మూడు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ముంబైకి సమీపంలో ఈ తుపాను బుధవారం తీరం దాటే అవకాశముందని ఐఎండీ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో తుపాను ప్రభావంపై మహారాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తుపాను పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాని హోమంత్రి తెలిపారు. కాగా, మహారాష్ట్ర, డయ్యూడామన్, గుజరాత్‌కు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు చేరుకున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. శతాబ్దకాలంలో ముంబై మహానగరాన్ని తాకనున్న రెండో అతిపెద్ద తుపానుగా ‘నిసర్గ’ను పేర్కొంటున్నారు. (చదవండి: ముంబైకి రెడ్ అలర్ట్ ) -
ఉరిమే ఉత్సాహం!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఖరీఫ్ సాగుకు అన్నీ శుభ సూచికలు కనిపిస్తుండటంతో రైతన్నలు ఆనందోత్సాహాలతో ఏరువాక సాగుకు సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సకాలంలో దేశాన్ని తాకి రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ), వాతావరణ నిపుణులు ప్రకటించారు. రైతు భరోసా ద్వారా ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయంగా ఈ ఏడాది తొలి విడత కింద ప్రభుత్వం ఇప్పటికే రూ.7,500 చొప్పున జమ చేయడంతో ఖరీఫ్‌లో అత్యధిక విస్తీర్ణంలో పంటల సాగుకు అన్నదాతలు ఆనందోత్సాహాలతో కదులుతున్నారు. మరోవైపు కల్తీలు, నకిలీలకు ఆస్కారం లేకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు గ్రామాల్లోనే అందచేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. గతంలో రైతులు ఎరువులు, విత్తనాల కోసం గ్రామాల నుంచి పట్టణాలకు వెళ్లి రవాణా సదుపాయాలు ఏర్పాటు చేసుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉండేది. నకిలీ విత్తనాలు/కల్తీల వల్ల నష్టపోయిన ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. దీన్ని నివారించి రైతులకు అన్ని రకాలుగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. కియోస్క్‌లు అందుబాటులోకి తెచ్చి ఎవరికి ఎంత కావాలన్నా 48 గంటల్లోగా నాణ్యమైనవి సర్టిఫై చేసి సమకూరుస్తోంది. తమ ఊరిలోనే గడప వద్దే విత్తనాలు, ఎరువులు అందుతుండటంతో రైతులకు రవాణా ఖర్చులు కూడా కలసి వస్తాయి. వ్యయ ప్రయాసలు ఉండవు. మరోవైపు ప్రభుత్వం విత్తన చట్టాన్ని పటిష్టం చేసింది. ఎక్కడైనా నకిలీ విత్తనాల వల్ల రైతు నష్టపోతే పరిహారం అందేలా విత్తన చట్టాన్ని పకడ్బందీగా రూపొందించింది. పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకుంటే ప్రభుత్వమే ఆర్బీకేలా ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఇవన్నీ తమకు మేలు చర్యలు కావడంతో అన్నదాతలు ఏరువాక పౌర్ణమిని ఆనందంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాతావరణం అనుకూలించడం, రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాత విధానాలను అనుసరిస్తుండటంతో ఖరీఫ్ సాగు విస్తీర్ణం గత ఏడాది కంటే బాగా పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు కేరళకు ‘నైరుతి’ ఆగమనం.. నైరుతి రుతు పవనాలు సోమవారం కేరళను తాకడం ద్వారా భారత్ భూభాగంపై ప్రవేశిస్తాయని ఐఎండీ ప్రకటించింది. ఈనెల 5వ తేదీ ఏరువాక పౌర్ణమి కాగా దాదాపు సకాలంలో అంటే జూన్ 10వతేదీలోగా నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ నిపుణులు తెలిపారు. గతేడాది జూన్ 16న నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. అనుకూల వాతావరణ పరిస్థితులున్నందున నైరుతి రుతు పవనాలు సోమవారం కేరళను తాకనున్నాయని ఐఎండీ ప్రకటించింది. ‘వచ్చే 12 గంటల్లో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కోమెరిన్, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. సోమవారం సాయంత్రానికి గానీ రాత్రికిగానీ కేరళను తాకే అవకాశం ఉంది’ అని ఐఎండీ ఆదివారం రాత్రి వెబ్సైట్లో ప్రకటించింది. ‘పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున నైరుతి రుతుపవనాలు సోమ లేదా మంగళవారం కేరళలో ప్రవేశిస్తాయి. తదుపరి ఇవి జూన్ రెండోవారం ఆరంభంలో ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి రాయలసీమలోని అనంతపురం జిల్లాలో నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తాయి. తదుపరి కోస్తాంధ్ర, తెలంగాణకు విస్తరిస్తాయి. కేరళలో రుతుపవనాలు ప్రవేశించినట్లు నిర్ధారించిన తర్వాత వాతావరణ పరిస్థితులను బట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోకి రుతుపవనాలు ఎప్పుడు వస్తాయో ఒకరోజు అటు ఇటుగా చెప్పవచ్చు’ అని ఐఎండీ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ‘సాక్షి’కి తెలిపారు. మంచి సంకేతమే.. ‘ఈ ఏడాది మంచి వర్షాలే కురుస్తాయి. జూన్ పదో తేదీకల్లా రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించే అవకాశం ఉంది. రుతుపనవాలు రాకముందు ఈ సీజన్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురవడం రివాజే. ఇలా జరగడం మంచి సంకేతమే’ అని ఐఎండీ రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్ ‘సాక్షి’కి తెలిపారు. అరేబియాలో అల్పపీడనం – నేడు, రేపు కోస్తా, సీమలో తేలికపాటి జల్లులు ఆగ్నేయ అరేబియా సముద్రం, దాన్ని ఆనుకొని తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్షదీవుల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. సోమవారం ఇదే ప్రాంతంలో వాయుగుండంగా మారనుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తదుపరి 24 గంటల్లో తుపానుగా మారనుందని వాతావరణశాఖ అధికారులు వివరించారు. తుపానుగా మారిన తర్వాత ఉత్తర దిశగా ప్రయాణించి ఈ నెల 3వ తేదీ నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరుకునే అవకాశం ఉంది. రాయలసీమ, తెలంగాణ మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో జూన్ 1, 2 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. మరోవైపు మబ్బులతో కూడిన వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు ఆదివారం 1 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భీమిలిలో 3 సెంమీ, సాలూరు, వెంకటగిరి కోటలో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. -
రేపు కేరళలోకి నైరుతి!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: నైరుతి రుతు పవనాలు తీరం వైపు చురుగ్గా కదులుతున్నాయి. ఇవి జూన్ 1న కేరళలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం ప్రకటించింది. దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమెరిన్ ప్రాంతాలు, నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు విస్తరిస్తున్నాయి. రాగల 36 గంటల్లో అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది 48 గంటల్లో బలపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో జూన్ 1న కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో 2.1 కి.మీ. ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 0.9 కి.మీ. ఎత్తులో తెలంగాణ, రాయలసీమ, ఇంటీరియర్ కర్ణాటక, కేరళ పరిసరాల్లో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ► దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి లేదా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ► ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో మూడు రోజులపాటు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు కూడా వీస్తాయి. ► రాయలసీమలో ఒకట్రెండు చోట్ల 41 నుంచి 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ► గడచిన 24 గంటల్లో సి.బెలగలో 10 సెం.మీ., పత్తికొండలో 6, బలిజపేట, హోలగుండలో 5, గరివిడి, మెరకముడిదాం, తెర్లాం, గూడూరు, డోన్‌లో 4 సెం.మీ., బొబ్బిలి, పాలకొండ, చీపురుపల్లి, మందస, భీమిలి, గరుగుబిల్లి, బనగానపల్లి, రామగిరి, ఓక్, ఆరోగ్యవరంలో 3 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. ► తూర్పు గోదావరి జిల్లా కోనసీమలోని అమలాపురం, అంబాజీపేట, అయినవిల్లి, పి.గన్నవరం, ముమ్మిడివరం, కొత్తపేట మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ► రాజమహేంద్రవరం రూరల్ మండలంలో అక్కడక్కడా జల్లులు పడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల తేలికపాటి వర్షాలు కురిశాయి. తండ్రీ బిడ్డల్ని కబళించిన పిడుగులు పిడుగులు పడి తండ్రి, ఇద్దరు కుమార్తెలు మృతి చెందిన దుర్ఘటన చిత్తూరు జిల్లా పెద్దపంజాణిలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కృష్ణప్ప (50) వ్యవసాయం చేస్తూ.. పొలంలోనే పశువుల్ని పోషిస్తున్నాడు. శనివారం సాయంత్రం పాలు పితికేందుకు ఇద్దరు కుమార్తెలు రమాదేవి (24), మీనా (22)తో కలసి పొలం వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో భారీ వర్షంతో పాటు పిడుగులు పడ్డాయి. వర్షం తగ్గినా ఎంతసేపటికీ వారు తిరిగి రాకపోవడంతో కృష్ణప్ప భార్య గ్రామస్తులతో కలసి పొలం వద్దకు వెళ్లి చూడగా.. ముగ్గురూ విగతజీవులై పడి ఉన్నారు. ఈ దుర్ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. -
తెలంగాణ, రాయలసీమ మీదుగా ఉపరితల ద్రోణి
సాక్షి, విజయవాడ : రాగల 48 గంటలలో మాల్దీవులు, కోమోరిన్ ప్రాంతం, దక్షిణ బంగాళఖాతంతో పాటి మరికొన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని గురువారం వాతావారణ శాఖ వెల్లడించింది. దీంతో దక్షిణ బంగాళాఖాతంలో, అండమాన్ & నికోబార్ దీవులతో పాటు ఆగ్నేయ అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్ర ప్రాంతాలలో మే 31వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావం వలన సుమారుగా జూన్ 1వ తేదీన కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం కూడా ఉందని తెలిపింది. (ఆ జిల్లాలో పిడుగుపడే అవకాశం) పశ్చిమ మధ్య అరేబియా సముద్రం, దానిని ఆనుకొని ఉన్న నైరుతి అరేబియా సముద్ర ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ మధ్య అరేబియా సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు పేర్కొంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడటంతో ఇది మరింత బలపడిందని వెల్లడించింది. దీంతో రాగల 48 గంటలలో ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావారణ శాఖ పేర్కొంది. మరో 72 గంటల్లో ఇది వాయువ్య దిశగా దక్షిణ ఒమన్, తూర్పు ఒమన్ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని, విదర్భ నుంచి ఇంటీరియర్ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 1.5 km ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచన: ఉత్తర కోస్తాంధ్ర, యానాం : ఇవాళ, రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా ఆంధ్రాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర : ఈ రోజు ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41వినుండి 44వి నమోదయ్యే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమ : ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 41° నుండి 44° నమోదయ్యే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. -
మరో నాలుగు రోజులు నిప్పులే!
నేటి నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తున్న తరుణంలో వడగాడ్పుల ముప్పు పొంచి ఉన్నందున నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. 28 వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాడ్పులు వీస్తాయని తెలిపింది. ప్రజల్ని అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖ అధికారులకు సూచించింది. గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో 47.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సాక్షి, అమరావతి: నేటి నుంచి రోహిణి కార్తె ప్రవేశిస్తున్న తరుణంలో వడగాడ్పుల ముప్పు పొంచి ఉన్నందున నాలుగు రోజుల పాటు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొన్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయాలని విపత్తు నిర్వహణ శాఖ అన్ని జిల్లాల అధికారులకు సూచించింది. ‘రాబోయే నాలుగు రోజులే కాదు. నైరుతి రుతు పవనాలు వచ్చే వరకూ చాలా రోజులు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే’ అని వాతావరణ నిపుణులు సూచించారు. ఆదివారం గుంటూరు జిల్లాలోని రెంటచింతలలో నిప్పుల కొలిమిని తలపిస్తూ గరిష్ట ఉష్ణోగ్రత 47.3 డిగ్రీలు నమోదైంది. 3 రోజులు ఉష్ణోగ్రతలు ఇలా.. ► మే 25న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో పలు చోట్ల 44 నుంచి 46 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. ► మే 26న విజయనగరంతోపాటు దక్షిణ కోస్తా జిల్లాలు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 44 నుంచి 45 డిగ్రీలు, శ్రీకాకుళం, విశాఖ పట్నం, చిత్తూరు జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ► మే 27న తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడా 44 నుంచి 45 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 38 నుంచి 40 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ► రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 2 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. ► ఛత్తీస్‌గఢ్ నుంచి తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం విస్తరించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఒకటి రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. వడదెబ్బ లక్షణాలు ► తలనొప్పి, తల తిరిగినట్లు అనిపించడం ► తీవ్రమైన జ్వరం ► ఒళ్లంతా చెమటతో తడిసిపోవడం ► మూర్ఛ (ఫిట్స్)తో గిలగిలా కొట్టుకోవడం ► కొద్దిగా లేదా పూర్తిగా అపస్మారక స్థితిలోకి వెళ్లడం. వడదెబ్బకు చికిత్స ► నీడ ఉన్న చల్లని ప్రాంతానికి చేరవేయాలి. ► శరీరమంతా చల్లని తడి వస్త్రంతో తుడవాలి. ► శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారెన్ హీట్ కంటే దిగువకు వచ్చే వరకూ చల్లటి వస్త్రంతో తుడవాలి. ► బాగా గాలి అందేలా చూడాలి. ► సాధారణ స్థితికి చేరుకోని పక్షంలో వెంటనే ఆస్పత్రికి తరలించాలి. -
మూడోరోజూ మంటలే..
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వరుసగా మూడో రోజూ వాతావరణం మంటపుట్టించింది. ఒకవైపు ఎండలు ఠారెత్తించగా, మరోవైపు వడగాడ్పుల తీవ్రతతో ప్రజలు విలవిల్లాడారు. శనివారం రాష్ట్రంలోని పలుచోట్ల సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీనికితోడు తీవ్రమైన వడగాడ్పులు వీచాయి. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వడగాడ్పులు విపరీతంగా వీయడంతో ప్రజలు అల్లాడారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రానున్న నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం విజయవాడలో అత్యధికంగా 45.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని పలు ప్రధాన పట్టణాల్లోనూ 43 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలా ఉంటే.. ఆగ్నేయ మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు 0.9 కి.మీ. ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. -
తుపానుపై మోదీ అత్యవసర సమావేశం
న్యూఢిల్లీ : అత్యంత తీవ్ర తుపాను‘అంఫన్’పై సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ అత్యవసర సమావేశం నిర్వహించారు. తుపాను ప్రభావిత రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని సూచించారు. కేంద్ర హోంశాఖ, ఎన్డీఎంఏ అధికారులతో ప్రధాని సమీక్షా సమావేశం నిర్వహించారు. ‘ఆంఫన్ తుపానుపై ఎలా సంసిద్ధమవ్వాలనేదానిపై సమీక్షించాము. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రణాళికలపై చర్చించాము. అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నా. ఏయే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇస్తున్నా’ అని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అత్యంత తీవ్ర తుపాను‘అంఫన్’ ఉత్తర దిశగా ప్రయాణించి సోమవారానికి పెను తుపానుగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది ఈ నెల 20వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని డిగా, బంగ్లాదేశ్‌లో ఉన్న హతియా ఐల్యాండ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. అంఫన్ ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఉత్తర కోస్తాలోని ఒకటి, రెండు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులెవరూ ఈ నెల 20 వరకు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. కోస్తాంధ్ర వెంబడి 50 కి.మీలు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. (చదవండి : అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’) -
అతి తీవ్ర తుపాన్‌గా ‘అంఫన్’
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర తుపాన్ ‘అంఫన్’.. ఉత్తర దిశగా ప్రయాణిస్తూ ఆదివారం మ. 2.30 గంటలకు అతి తీవ్ర తుపాన్‌గా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణ దిశగా 930 కిమీ దూరంలోనూ, పశ్చిమ బెంగాల్‌లోని దిఘాకు నైరుతి దిశలో 1,080 కిమీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని ఖేపుపురకు దక్షిణ నైరుతి దిశగా 1,200 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత వేగంగా బలపడి సోమవారం సాయంత్రానికి అత్యంత తీవ్ర తుపాన్‌గా మారనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ), విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించాయి. ఆ తర్వాత మంగళవారం వేకువజామున ఉత్తర దిశగా ప్రయాణించిన తర్వాత వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించనుంది. అనంతరం.. పశ్చిమ బెంగాల్–బంగ్లాదేశ్ మధ్య దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా దీవుల మధ్యలో అంఫాన్ మే 20 సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని తెలిపాయి. దీని ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయనీ.. రాష్ట్రంలో మాత్రం మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం ఉందని వివరించారు. అంఫన్ ప్రభావంతో కోస్తా, రాయలసీమ, యానాంలో అక్కడక్కడా సోమ, మంగళవారాల్లో గంటకు 30–40 కిమీ వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయనీ విశాఖపట్నం సైక్లోన్ వార్నింగ్ సెంటర్ డైరెక్టర్ వీవీ భాస్కర్ తెలిపారు. అత్యంత తీవ్ర తుపాన్ నేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, కృష్ణపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. కాకినాడ, గంగవరం పోర్టుల్లో సెక్షన్ సిగ్నల్ నంబర్ 5ని జారీచేశారు. కళింగపట్నం, భీమిలి, వాడరేవు పోర్టు ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు అందించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులెవ్వరూ సముద్రంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. కాగా, గడిచిన 24 గంటల్లో చింతపల్లి, యర్రగొండపాలెంలో 4 సెంమీ, అచ్చెంపేట, తాడేపల్లిగూడెం, సత్తెనపల్లిలో 2 సెంమీ వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలోకి ‘నైరుతి’ ఇదిలా ఉంటే.. బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు ఆదివారం ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతం, నికోబార్ దీవులు, అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లోకి నైరుతి రుతుపవనాలు వచ్చాయి. రాగల 48 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ దీవుల్లోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. -
అలర్ట్: ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ రాష్ట్ర ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు విపత్తుల నిర్వహణ కమిషనర్ మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం, తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి, అడ్డతీగల మారేడుమిల్లి, విశాఖ జిల్లా వై.రామవరం, పెద్దబయలు, మాడుగుల, చింతపల్లి, జీకే వీధి ప్రాంతాల్లో పిడుగు పడే అవకాశముందని పేర్కొన్నారు. చదవండి: తుప్పు, పప్పు.. 150 మంది సెక్యూరిటీ అవసరమా? మండలాల వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడేప్పుడు రైతులు, కూలీలు, పశువుల, గొర్రెల కాపరులు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఒడిశాలోని పారదీప్‌కు దక్షిణంగా 1,060 కిలోమీటర్లు, పశ్చిమ్ బెంగాల్‌లోని డిగాకు నైరుతిగా 1,220 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉందని ఐఎండీ తెలిపింది. కాగా.. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపేతమై శనివారం వాయుగుండంగా మారి తుఫాన్‌గా మారే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది రేపటికి బలపడి అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిసున్నారు. చదవండి: కరోనా కల్లోలం: ఇద్దరు ఏఎస్ఐలు మృతి మే 17 వరకు ఉత్తర వాయువ్యం దిశగా పయనిస్తూ.. అనంతరం 18,20వ తేదీ నాటికి ఉత్తర ఈశాన్య దిశగా పశ్చిమ బెంగాల్ వైపు పయనిస్తుందని భావిస్తున్నారు. దీనిప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్ర, యానాం, ఉత్తర కోస్తాలో ఒకటి, రెండుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్రంలో గంటకు 45 నుండి 65 కిమి వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. ఏపీలోని ప్రధాన పోర్ట్ల్లో ఒకటవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేశారు. చదవండి: కరోనా: ప్రకాశం జిల్లా అరుదైన రికార్డ్ -
నేడు తుపానుగా మారనున్న అల్పపీడనం!
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గంటగంటకూ బలోపేతమవుతోంది. ఇది శనివారం తెల్లవారేలోగా వాయుగుండంగా మారి సాయంత్రానికల్లా బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఇది 17వ తేదీ వరకు వాయువ్య దిశగా కదులుతూ.. 18, 20వ తేదీల్లో ఉత్తర ఈశాన్య దిశగా బంగాళాఖాతం వైపు పయనిస్తుందని శుక్రవారం రాత్రి ఐఎండీ వెబ్సైట్లో ప్రకటించింది. వాయుగుండం బలపడటం, ఇతర ప్రభావాల వల్ల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. ‘ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురుస్తాయి. అదే సమయంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి’ అని పేర్కొంది. శనివారం నుంచి 3 రోజుల పాటు బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంటుందని.. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగం, ఒక్కోసారి 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులెవ్వరూ వెళ్లొద్దనీ హెచ్చరించింది. 36 గంటల్లో అండమాన్‌కు ‘నైరుతి’ రాగల 36 గంటల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలకు నైరుతి రుతు పవనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. -
నిలకడగా అల్పపీడనం
సాక్షి, అమరావతి, మహారాణిపేట (విశాఖ దక్షిణ): దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం నిలకడగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా అలాగే ఉంది. తూర్పు మధ్యప్రదేశ్ నుంచి తూర్పు విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారకుండా నిలకడగా కొనసాగుతోందని వాతావరణ విభాగం నిపుణులు తెలిపారు. 36 గంటల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు మరోవైపు అల్పపీడనం ప్రభావంతో రానున్న 36 గంటల్లో ఉత్తర, కోస్తా ఆంధ్రాలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలుగు వీస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. మంగళవారం రాయలసీమ ప్రాంతంలో పొడి వాతావరణం ఉంటుందని పేర్కొన్నారు. తుపానుగా మారే అవకాశం తక్కువ.. ఆంధ్రప్రదేశ్ దిశగా ‘ఎంఫాన్’ తుపాను పయనిస్తోందంటూ కొన్ని మాధ్యమాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని భారత వాతావరణం విభాగం (ఐఎండీ) అమరావతి డైరెక్టర్ స్టెల్లా తెలిపారు. ‘వాతావరణం అనుకూలించకపోవడంవల్ల అల్పపీడనం ఇప్పటి వరకూ బలపడలేదు. వచ్చే నాలుగైదు రోజుల వరకూ అది తుపానుగా మారే అవకాశం లేదు. ఇది ఏపీకి దూరంగా ఉంది. అసలు అది వాయుగుండంగా మారే అవకాశాలు కూడా అతి తక్కువే. ఒకవేళ మారినా మన రాష్ట్రానికి పెద్దగా ప్రభావం ఉండదు. అది తుపానుగా మారే అవ కాశం ఉంటే నాలుగైదు రోజుల ముందే ఐఎండీ ప్రకటిస్తుంది. పంట లు కోతకు వచ్చి ఉంటే నూర్పిళ్లు చేసుకోవడం మంచిదేగానీ లేని దాని ని ఉన్నట్లు ప్రచారం చేయడం సరికాదు. ఐఎండీ ఏదైనా అన్నీ పరిశీలించి నిర్ధారించుకున్నాకే ప్రకటిస్తుంది’ అని ఆమె ‘సాక్షి’కి తెలిపారు. -
30న బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం, అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం క్రమేణా బలపడుతోంది. దీని ప్రభావంతో దక్షిణ అండమాన్ తీర ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 30 నాటికి అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ విభాగం పేర్కొంది. వచ్చే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఆదివారం ప్రకటించింది. ఇది ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి, ఉత్తర ఈశాన్య దిశగా అండమాన్ నికోబార్ దీవుల వెంబడి మే 3 వరకూ పయనిస్తుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గంటకు 40 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు పడే సూచనలున్నాయని అధికారులు తెలిపారు. విస్తారంగా వర్షాలు ఉపరితల ద్రోణి ప్రభావంతో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు చోట్ల తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. సత్యవేడులో 13 సెం.మీ, అనకాపల్లిలో 11 సెం. మీ,, ప్రత్తిపాడులో 10 సెం.మీ., తడలో 9సెం.మీ., విశాఖలో 8సెం.మీ, ఎస్.కోటలో 8సెం.మీ., గంట్యాడలో 7సెం.మీ, నగరి, కుప్పంలో 3సెం.మీ. వర్షపాతం నమోదైంది. పిడుగులు పడే ప్రమాదం రాబోయే నాలుగైదు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతోపాటు పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ సూచించింది. వ్యవసాయ పనులు చేసే వారు, గొర్రెలు, మేకల కాపరులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, ఉరుములతో వర్షం కురిసే సమ యంలో చెట్ల కిందకు వెళ్లొద్దని రాష్ట్ర విపత్తు నిర్వహణ స్పెషల్ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. పిడుగులు పడే ప్రాంతాల సమాచారాన్ని రెండుమూడు గంటల ముందే గుర్తించి ఆయా ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తామని, ప్రజలు అధికారుల సూచ నలను పాటించాలని పేర్కొన్నారు. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో వర్షాలు మరోవైపు, విదర్భ నుంచి తమిళనాడు వరకూ కర్ణాటక మీదుగా 0.9 కిమీ ఎత్తులో ఉపరితల ద్రోణి కొన సాగుతుండడంతో నేడు, రేపు కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిమీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు, ఒక ట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాయలసీమలో నేడు, రేపు ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. రాయలసీమలో నేడు, రేపు గరిష్టంగా పలు చోట్ల 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని పేర్కొన్నారు. -
పొల్యూషన్... దొరికింది సొల్యూషన్
సాక్షి, ఢిల్లీ : ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన పది నగరాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన మన దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పుణ్యమా అని వాయు కాలుష్యం గణనీయంగా తగ్గింది. శనివారం నాటికి సుమారు 40 కరోనా కేసులు నమోదవడం, ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్, పలువురు స్వీయ నిర్బంధంలో ఉండటం ఇందుకు కారణం. భారత వాతావరణ విభాగం అంచనాలను బట్టి ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 29 డిగ్రీలకే పరిమితమయ్యాయి. వాహనాలు తక్కువగా తిరుగుతుండటం, ఫ్యాక్టరీలను తాత్కాలికంగా బంద్ చేయడంతో వాయు కాలుష్యం కూడా బాగా తగ్గింది. సాధారణ పరిస్థితుల్లో ఢిల్లీలో వాయు నాణ్యతను సూచించే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వెయ్యి వరకు ఉండేది. కానీ కరోనా కట్టడి మొదలైన తరువాత ఇది ఏకంగా 129కి పడిపోవడం గమనార్హం. కరోనా వైరస్ పుట్టినిల్లుగా భావించే వూహాన్‌లోనూ ఇదే పరిస్థితి. జనవరి 23 నుంచి వూహాన్‌తోపాటు హుబే ప్రావిన్స్ ప్రాంతం మొత్తమ్మీద లాక్డౌన్ విధించగా ఒకట్రెండు రోజుల క్రితమే దశలవారీగా ఎత్తివేసే ప్రక్రియ మొదలైంది. ఈ కాలం నాటి ఉపగ్రహ ఛాయాచిత్రాలను చూస్తే వూహాన్ (పక్క చిత్రం) ప్రాంతంలో గ్రీన్హౌస్ వాయువైన నైట్రస్ ఆక్సైడ్ గణనీయంగా తగ్గినట్లు స్పష్టంగా తెలుస్తోంది. కచ్చితంగా చెప్పాలంటే నైట్రోజన్ ఆధారిత కాలుష్యం 40 శాతం వరకు తగ్గిందని, చైనా మొత్తమ్మీద పార్టిక్యులేట్ మ్యాటర్ కాలుష్యం 20 – 30 శాతం వరకు తగ్గిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చెబుతోంది. -
ఎండలు మండుతాయ్!
సాక్షి, అమరావతి: ఈ వేసవిలో భానుడి భగభగలు మరింత ఎక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. మార్చి నుంచి మే వరకు దేశంలో సగటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వేసవిలో సాధారణం కంటే 0.5 నుంచి 1 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ముందస్తు అంచనాల్లో పేర్కొంది. ఏపీలో వడగాడ్పులు - మన రాష్ట్రంలో ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలతోపాటు వడగాడ్పులు నమోదయ్యే ప్రమాదం ఉంది. - అపార్ట్మెంట్ల నిర్మాణం వల్ల పట్టణాలు, నగరాలు కాంక్రీట్ జంగిల్స్‌గా మారటం ఉష్ణోగ్ర తలు పెరగటానికి ఒక కారణం. - చెట్లు తగ్గిపోవడం వల్ల భవనాల నుంచి రేడియేషన్ ఎక్కువగా విడుదలవుతోంది. - రాష్ట్రంలో పారిశ్రామిక కాలుష్యం కంటే వాహన కాలుష్యమే ఎక్కువగా ఉంటోంది. ఉగాది నుంచే వడగాడ్పులు ఉగాది తరువాత దక్షిణ కోస్తా, రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు కురవడం వల్ల సాయంత్రానికి వాతావరణం చల్లబడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో మాత్రం రాత్రి వేళ కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. సముద్రం నుంచి తేమ గాలులు రావడం వల్ల ఉక్కపోత, వడగాడ్పులు ఇక్కడ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. – డాక్టర్ మురళీకృష్ణ, వాతావరణ శాఖ రిటైర్డ్ శాస్త్రవేత్త -
రుతుపవనాల సూచన తేదీల మార్పు
న్యూఢిల్లీ: మారుతున్న వర్షపాతం విధానంతో రుతుపవనాల సూచనల తేదీలలో మార్పులుంటాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఈ ఏడాది నుంచి నైరుతి రుతుపవనాల సూచన తేదీలను ఉపసంహరించుకున్నట్లు ఎర్త్‌సైన్స్ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. రుతుపవనాల సూచనల తేదీల మార్పు పంటలు సాగు చేసేందుకు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని పేర్కొంది. జూన్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌గా పేర్కొంటారు. కేరళ మీదుగా నైరుతి రుతుపవనాలు జూన్ 1 నాటికే వస్తాయని, అయితే మిగతా రాష్ట్రాలు, నగరాల్లో ఈ తేదీలో మార్పులుంటాయని తెలిపింది. అయితే, మధ్య భారత వాతావరణ శాఖ కూడా ఈ రుతుపవనాల సూచన తేదీలను మార్పు చేస్తుందని పేర్కొంది. ఏప్రిల్‌లో విడుదలచేసే అవకాశముందని వెల్లడించింది. -
ఢిల్లీని కమ్ముకున్న మంచు
న్యూఢిల్లీ: దేశరాజధానిలో డిసెంబరులో సోమవారం(30న)ను అత్యంత చలిదినంగా భారతవాతావరణ శాఖ ప్రకటించింది. ఢిల్లీలో 119 ఏళ్ళలో ఎప్పుడూ లేనంతగా డిసెంబర్లో 9.4 డిగ్రీ సెల్సియస్‌ల అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. సఫ్దర్జంగ్లో సోమవారం 9.4 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రత నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు ట్విట్టర్లో వెల్లడించారు. దీని ప్రభావం విమానరాకపోకలపై పడింది. మంచుకారణంగా సోమవారం ఉదయం ఢిల్లీలో 20 విమానాలను దారిమళ్ళించారు. 530 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.∙మంచుకురుస్తుండటంతో రైళ్ళ రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. 30 రైళ్ళు ఆలస్యంగా నడుస్తున్నట్టు నార్తర్న్ రైల్వే ప్రకటించింది. మరోవైపు, దట్టమైన పొగమంచు కారణంగా గ్రేటర్ నోయిడా ప్రాంతంలోని ఓ కారు అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలో పడింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఢిల్లీలో చలి పెరిగింది! ఢిల్లీలో రెండో అత్యంత శీతల డిసెంబర్‌గా 2019 డిసెంబర్ నిలిచింది. ఇందుకు కారణాలను వాతావరణ నిపుణులు విశ్లేషించారు. ఢిల్లీకి ఉత్తరంగా ఉన్న కొండప్రాంతాల్లో డిసెంబర్ నెలలో భారీగా మంచు కురవడానికి, చలికాలంలో అక్కడ వర్షాలు కురవడానికి కారణమైన పశ్చిమ తుపాను గాలులు(వెస్ట్రన్ డిస్ట్రబెన్సెస్) గత 10 రోజులుగా వీయకపోవడం అందుకు కారణమని పేర్కొన్నారు. ఆ గాలులు ఢిల్లీ వైపు వీచే అతి శీతల గాలుల దిశను మారుస్తాయని, అవి రాకపోవడం వల్ల ఢిల్లీలో చలి తీవ్రస్థాయికి చేరిందని భారత వాతావరణ శాఖ ప్రాంతీయ వాతావరణ సమాచార కేంద్ర డైరెక్టర్ కుల్దీప్ శ్రీవాస్తవ వివరించారు. ఉత్తరాది పీఠభూమి ప్రాంతంపై.. పంజాబ్ నుంచి ఉత్తర ప్రదేశ్ వరకు 2 వేల నుంచి 3 వేల అడుగుల ఎత్తులో దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా సూర్య కిరణాలు భూమిని చేరలేకపోతున్నాయని, ఈ డిసెంబర్ చలికి అది కూడా కారణమని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్‌లో పనిచేస్తున్న నిపుణుడు మహేశ్ పాలవత్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం యూపీ నుంచి ఢిల్లీ వైపు వీస్తున్న తూర్పు గాలులు కూడా అత్యంత శీతలంగా ఉన్నాయన్నారు. ఈ తూర్పుగాలుల్లోని తేమ కారణంగా దట్టమైన పొగమంచు ఏర్పడుతోందన్నారు. -
దడ పుట్టిస్తోన్న అల్పపీడనం
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణం): అరేబియా సముద్రంలో నైరుతి దిక్కున ఏర్పడిన అల్పపీడనం దక్షిణ కోస్తా జిల్లాల రైతుల్లో దడ పుట్టిస్తోంది. ఈ అల్పపీడనం రానున్న 24 గంటల్లో మరింత బలపడనుందని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని భారతీయ వాతావరణ విభాగం ప్రకటించింది. దీంతో వరి సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం మొదలు పశ్చిమ గోదావరి వరకు పలు జిల్లాల్లోని కొన్నిచోట్ల ఇప్పటికే వరి కోతలు ప్రారంభం కాగా చాలా ప్రాంతాల్లో వరి పంట తుది దశలో ఉంది. ఈ సమయంలో ఏమాత్రం వర్షాలు పడినా పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. ఈ కారణంగా రైతులు బిక్కుబిక్కు మంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో సుమారు 14.67 లక్షల హెక్టార్లలో వరి సాగయింది. ఉత్తర కోస్తా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, కృష్ణాలోని కొన్ని ప్రాంతాల్లో వరి కోతకు వచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో గింజ గట్టిపడే దశలో ఉంది. ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో ఈనిక దశలో ఉంది. ఆగస్టులో వచ్చిన వర్షాలు, వరదలతో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు సహా ఉత్తర కోస్తాలో అక్కడక్కడా వరి పంట దెబ్బతింది. ఆ తర్వాత వచ్చిన వర్షాలకు కృష్ణా, గుంటూరుతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. తుపాన్ల సీజన్ ముగిసిందనుకుంటున్న తరుణంలో అరేబియా మహాసముద్రంలో అల్పపీడనం ఏర్పడిందన్న వాతావరణ శాఖ ప్రకటనతో రైతులు బెంబేలెత్తుతున్నారు. కొనసాగుతున్న ఉపరితల ద్రోణి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. శ్రీలంక, దక్షిణ తమిళనాడు తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఇది ఏర్పడిన సంగతి తెలిసిందే. దీని ప్రభావంవల్ల కోస్తాంధ్ర, రాయలసీమలోని చిత్తూరు, కడప, ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే, ఒకటి రెండుచోట్ల భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కంగారు పడొద్దు ప్రస్తుత అల్పపీడనం వల్ల ముంచుకొచ్చే ముప్పేమీ లేదు. ఇది ఏ దిశగా పయనిస్తుందో పరిశీలిస్తున్నాం. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి ఇది సొమాలియా వైపు పయనించే అవకాశం కనిపిస్తోంది. కోస్తా జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడినా రైతులు కంగారు పడాల్సిన పని లేదు. కోతకు వచ్చిన వరి చేలల్లో నీరు పోయేందుకు వీలుగా పాయలు తీసి ఉంచాలి. కోతలు పూర్తయి పనలమీద ఉంటే కుప్పలు వేసుకోవాలి. ధాన్యం కల్లాల్లో ఉంటే టార్పాలిన్లు సిద్ధం చేసుకోవాలి. కోత కోయాలనుకునేవారు ఒకటి రెండురోజులు ఆగటం ఉత్తమం. – టి.గోపీకృష్ణ, శాస్త్రవేత్త, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం -
కోస్తా, రాయలసీమకు మోస్తరు వర్షాలు!
సాక్షి, విశాఖపట్నం: తమిళనాడు, శ్రీలంక తీరాలకు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి తోడు కోమరిన్ దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. తూర్పు దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. -
చినుకు చక్కగా..
సాక్షి, అమరావతి: జూన్ 1న మొదలైన ఖరీఫ్ (సార్వా) సీజన్ సెప్టెంబర్ 30తో ముగిసింది. నైరుతి రుతు పవనాలు కూడా సెప్టెంబర్ నెలాఖరుతో ముగిసినట్లే లెక్క. సాంకేతికంగా చూస్తే.. రుతు పవనాలు దాటిపోవడానికి వారం అటూ ఇటూ పట్టవచ్చు. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ఆరంభంలో కొంత నిరాశ కలిగించినప్పటికీ చివరకు వచ్చేసరికి సంతృప్తి మిగిల్చాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించిన దానికంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ సీజన్లో గుంటూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో అధిక వర్షపాతం.. మిగిలిన 11 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. నైరుతి సీజన్లో రాష్ట్రంలో సగటు సాధారణ వర్షపాతం 514.4 మిల్లీమీటర్లు కాగా.. ఈ ఏడాది ఈ సీజన్లో 565.2 మిల్లీమీటర్ల వర్షపాతం (10 శాతం అధికం) నమోదైంది. వాతావరణ శాఖ 50 ఏళ్ల సగటు వర్షపాతాన్ని సాధారణ వర్షపాతంగా పరిగణిస్తుంది. దీనికంటే 19 శాతం ఎక్కువ కురిసినా, తక్కువ కురిసినా సాధారణ వర్షపాతంగానే పేర్కొంటుంది. సాధారణం కంటే 20 శాతం తక్కువైతే లోటు వర్షపాతంగా, ఎక్కువైతే అధిక వర్షపాతంగా గుర్తిస్తుంది. ప్రాంతాలవారీగా చూస్తే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో సాధారణం కంటే 12 శాతం, కోస్తాలోని తొమ్మిది జిల్లాల్లో 9 శాతం అధిక వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలో 556.1 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతానికిగాను 676.4 మిల్లీమీటర్లు (22 శాతం అధికం) వర్షపాతం రికార్డయ్యింది. తూర్పు గోదావరి జిల్లాలో 728.9 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతానికి గాను 874 మిల్లీమీటర్లు (20 శాతం ఎక్కువ) వర్షపాతం నమోదైంది. రిజర్వాయర్లలో జలకళ ప్రస్తుత సీజన్లో రాష్ట్రంలో అనుకున్న వర్షపాతం నమోదు కావడంతోపాటు ఎగువ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురిశాయి. దీంతో గోదావరి, కృష్ణా, తుంగభద్ర, వంశధార నదుల్లో వరద నీరు పోటెత్తింది. ఫలితంగా శ్రీశైలం, ప్రకాశం బ్యారేజీ, ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ఎత్తాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణా, గోదావరి డెల్టాలో పంటల సాగుకు, భూగర్భ జలమట్టం పెరుగుదలకు ఇది బాగా దోహదపడుతోంది. ఈ వర్షాలు రబీలో అధిక విస్తీర్ణంలో పంటల సాగుకు కూడా బాగా ఉపకరిస్తాయని వ్యవసాయ రంగ నిపుణులు చెబుతున్నారు. సాగు.. బాగు సెప్టెంబర్ 30తో ముగిసిన ఖరీఫ్ సీజన్లో పంటల సాగు కూడా ఆశాజనకంగానే ఉంది. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్లో 42.04 లక్షల హెక్టార్లలో పంటలు సాగు కావాలన్నది లక్ష్యం. ఈ లెక్కన జూన్ 1నుంచి సెప్టెంబర్ 25 నాటికి 38.30 లక్షల హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 35.26 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. సీజన్ మొత్తమ్మీద చూస్తే.. సెప్టెంబరు 25వ తేదీ వరకూ గణిస్తే 93 శాతం విస్తీర్ణంలో పంటలు సాగయ్యాయి. దీని ప్రకారం చూస్తే ఈ సీజన్లో సాగు సంతృప్తికరంగా ఉన్నట్లే. రాయలసీమ జిల్లాల్లో ఖరీఫ్ ఆరంభం నుంచి రెండు నెలలు సరైన వర్షం కురవకపోవడం వల్ల నిర్ణయించిన సాగు లక్ష్యంలో 93 శాతం విజయవంతమైంది. -
నేడు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: ఉత్తర కోస్తా తీరంలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం పేర్కొంది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని బుధవారం వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం దక్షిణాంధ్ర పరిసర ప్రాంతాల మీదుగా కర్ణాటక, రాయలసీమ, తెలంగాణపై ఆవరించి ఉందని తెలిపింది. -
వర్షపాతం 4% అధికం
న్యూఢిల్లీ: దేశంలో ఈసారి సాధారణం కంటే 4 శాతం అధికంగానే వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. ఇక దేశంలోని దక్షిణ ప్రాంతం 10 శాతం, మధ్య ప్రాంతంలో 23 శాతం అధిక వర్షపాతం నమోదైందని పేర్కొంది. తూర్పు, ఉత్తర, వాయవ్య ప్రాంతాల్లో –18 శాతం, –8 శాతం లోటు వర్షపాతం నమోదైందని తెలిపింది. అయితే ఇప్పటికీ నైరుతి రుతుపవనాల నిష్క్రమణలో ఎలాంటి మార్పులు లేవని పేర్కొంది. దీంతో ఈ వారం సైతం ఉత్తర మైదాన ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం అధికంగా ఉంటుందని తెలిపింది. రాజస్తాన్, గుజరాత్, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి సాధారణంగా సెప్టెంబర్ 1 నైరుతి రుతుపవనాలు పూర్తిగా నిష్క్రమిస్తాయని, అయితే పశ్చిమ రాజస్తాన్ ప్రాంతంలో నైరుతి రుతుపవనాలు చురుకుగా ఉన్నాయని తెలిపింది. వాయవ్య మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొనసాగుతున్న అల్ప పీడనం వల్ల వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ. అల్పపీడనం కారణంగా ఏర్పడిన అధిక తేమకు అధిక ఉష్ణోగ్రతలు తోడవ్వడంతో ఉత్తర భారత్‌లోని చాలా ప్రాంతాలు మరో వారంపాటు అధిక హ్యుమిడిటీని ఎదుర్కొంటాయని పేర్కొంది. -
ఇక వర్షాలే... వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: మారుతున్న సముద్ర, ఉపరితల ఉష్ణోగ్రతలు నైరుతి రుతు పవనాలపై మరిన్ని ఆశలు పెంచుతున్నాయి. ఎల్‌నినో దక్షిణ ఆశిలేషన్‌లు (గాలి సుడులు వంటివి) తటస్థంగా కొనసాగుతున్నాయి. పసిఫిక్ మహా సముద్ర ఉష్ణోగ్రతలు, మధ్య పసిఫిక్ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఇవి రుతు పవనాల కాల పరిమితిని పెంపొందిస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు హిందూ మహాసముద్రంలో ధ్రువపు పరిస్థితులు (ఐఓడీ) కూడా నైరుతికి అనుకూలంగా ఉన్నాయి. ఇవన్నీ నైరుతి రుతు పవనాల కొనసాగింపునకు దోహదపడుతున్నాయనీ.. ఫలితంగా దేశంలోని పలు ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోనూ విరివిగా వర్షాలు కురుస్తాయని స్పష్టం చేస్తున్నారు. రుతు పవనాలు ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ముఖ్యంగా ఈ నెల మూడో వారం నుంచి దక్షిణ భారత దేశంలో విస్తారంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. ఈ సమయంలో ఈశాన్య, ఆగ్నేయ గాలులు కలిసే జోన్ ఉత్తరం నుంచి దక్షిణం వైపుగా ప్రయాణిస్తుందని, ఇవి బంగాళాఖాతంలోకి వచ్చిన తర్వాత అల్పపీడనాలు విపరీతంగా ఏర్పడతాయని వెల్లడించింది. దీని ప్రభావంతో అక్టోబర్ మూడో వారం వరకు ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తన వారాంతపు నివేదికలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే.. రాబోయే రెండు, మూడు వారాల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపానులు ఏర్పడే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు మరోవైపు.. వాయువ్య మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 5.8 కి.మీ. ఎత్తు వరకు ఆవరించి ఉన్న ఉపరితల ఆవర్తనం ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉంది. దీనికి తోడు.. ఉత్తర తమిళనాడు, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కి.మీ. ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులూ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శనివారం రాత్రి వెల్లడించిన నివేదికలో పేర్కొంది. ముఖ్యంగా ఈనెల 16, 17, 18 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలతోపాటు యానాంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. గడచిన 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. బాపట్లలో 8 సెంటీమీటర్లు, అవనిగడ్డలో 6, గూడూరు, గుంటూరులో 5, తిరువూరు, విజయవాడ, లాం(గుంటూరు)లో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. -
కృష్ణమ్మ పరవళ్లు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన గోదావరి మంగళవారం శాంతించగా కృష్ణమ్మ ఉరకలెత్తుతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీకి వచ్చిన వరద జలాల్లో 7,800 క్యూసెక్కులను డెల్టా కాలువలకు విడుదల చేసి, మిగులుగా ఉన్న 10,45,848 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలారు. బుధవారం వరద మరింత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా నదిలో వరద ఉధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రానికి 2,10,312 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 82,661 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 868.6 అడుగుల్లో 135.94 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో ప్రధానంగా నదీ జన్మస్థానమైన మహాబలేశ్వరం పర్వతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల ఎగువ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి భారీగా వరద వస్తోంది. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హెచ్చరికల మేరకు ఈ రెండు జలాశయాల నుంచి మంగళవారం సాయంత్రం నీటి విడుదలను నాలుగు లక్షల క్యూసెక్కులకు పెంచారు. బీమా నదిపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తిగా నిండింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు జూరాల ప్రాజెక్టు మీదుగా శ్రీశైలాన్ని చేరనున్నాయి. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి నాలుగు నుంచి 4.50 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని జలవనరుల శాఖ అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. వరద ఇలాగే కొనసాగితే మూడు రోజుల్లో శ్రీశైలం, ఆ తర్వాత వారం రోజుల్లో నాగార్జునసాగర్ ప్రాజెక్టులు నిండుతాయి. తుంగభద్రలో సోమవారంతో పోల్చితే.. మంగళవారం వరద ప్రవాహం కాస్త పెరిగింది. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తిని ప్రారంభించారు. మంగళవారం ఉదయం కుడిగట్టు విద్యుత్ కేంద్రంలో 0.226 మిలియన్ యూనిట్లు, భూగర్భ విద్యుత్ కేంద్రంలో 15.703 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. నేడు తీరం దాటనున్న వాయుగుండం ఉత్తర బంగాళాఖాతంలో సోమవారం ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. బుధవారం ఉదయం తీవ్ర వాయుగుండంగా మారి ఒడిశాలోని బాలాసోర్ పరిసర ప్రాంతాల్లో మధ్యాహ్నం తీరం దాటుతుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. తుపానుగా మారే అవకాశం లేదని స్పష్టం చేసింది. మత్స్యకారులెవ్వరూ చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ పోర్టులో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ సహాయ చర్యలు ముమ్మరం తూర్పుగోదావరిలో వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో ప్రభుత్వం సహాయ చర్యలను ముమ్మరం చేసింది. ముంపునకు గురైన గ్రామాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తూర్పు గోదావరి జిల్లాలో 18,809 మందికి 85 సహాయ, పునరావాస కేంద్రాల్లో వసతి కల్పించింది. వరదల వల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే 85 వైద్య శిబిరాలను నిర్వహించింది. ఒక్కో వరద బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యం, రెండు లీటర్ల కిరోసిన్, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో ఉల్లిపాయలు, కిలో బంగాళాదుంపలు ఉచితంగా పంపిణీ చేసింది. ఉభయ గోదావరి జిల్లాల్లో 1,377.5 క్వింటాళ్ల బియ్యం, 10,100 లీటర్ల కిరోసిన్, 5,240 కిలోల కందిపప్పు, 6,967 లీటర్ల పామాయిల్, 6,967 కిలోల చొప్పున ఉల్లిపాయలు, బంగాళాదుంపలు పంపిణీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. కాగా, ఉభయగోదావరి జిల్లాల్లో మొత్తం 420 గ్రామాల ప్రజలు వరదలబారిన పడ్డారు. రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో తూర్పుగోదావరి జిల్లాలో 64, పశ్చిమ గోదావరి జిల్లాలో 48 కలిపి మొత్తం 112 గ్రామాలకు రవాణా సదుపాయాలు లేకుండా పోయాయి. 17,737 ఇళ్లు గత 24 గంటలుగా జలదిగ్బంధంలో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు తొమ్మిది వేల ఎకరాల్లోని పంటలు వరద ముంపునకు గురయ్యాయి. సాంఘిక సంక్షేమ మంత్రి పినిపే విశ్వరూప్ మంగళవారం వరద బాధితులను పరామర్శించారు. వచ్చే ఉగాది నాటికి వరద బాధితులందరికీ ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. -
వాన వెల్లువ
సాక్షి, కాకినాడ/సాక్షి, హైదరాబాద్ /రాజమండ్రి/సీలేరు/విశాఖపట్నం/అమరావతి/బాపట్ల: కోస్తా జిల్లాల్లో పలుచోట్ల ఆదివారం విస్తారంగా వర్షాలు కురిశాయి. ఏజెన్సీలో కొండవాగులు పొంగుతుండటంతో మారుమూల గిరిజన గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సీలేరు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో డొంకరాయి రిజర్వాయర్‌లో నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరింది. బలిమెల రిజర్వాయర్‌లోకి ప్రవాహ జలాలు భారీగా వచ్చి చేరుతున్నాయి. మరోవైపు గోదావరిలో వరద ఉధృతి స్వల్పంగా పెరిగింది. ఇదిలావుంటే.. ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు ఈనెల 31వ తేదీ నాటికి వాయవ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ పరిస్థితుల ప్రభావం వల్ల వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నాలుగు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం తూర్పు గోదావరి జిల్లాలో సగటు వర్షపాతం 33.3 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇదే జిల్లాలోని గోకవరంలో అత్యధికంగా 96 మిల్లీమీటర్లు, పి.గన్నవరం, సఖినేటిపల్లి మండలాల్లో అత్యల్పంగా 9 మిల్లీమీటర్ల చొప్పున నమోదైంది. సీలేరు నదికి భారీగా వరద రావడంతో డొంకరాయి డ్యామ్ నుంచి 12,500 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. చింతూరు మండలం తిమ్మిరిగూడెం వద్ద జల్లివారిగూడెం వాగు పొంగి రహదారి మీదుగా ప్రవహించడంతో చింతూరు, వీఆర్ పురం మండలాల నడుమ, చింతూరు మండలం ఏజీ కోడేరు, మల్లెతోట, ఉలుమూరు గ్రామాలకు ఆదివారం ఉదయం రాకపోకలు పాక్షికంగా నిలిచిపోయాయి. ఇదే మండలం కంసులూరు, గవళ్లకోట నడుమ సోకిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రెండో రోజైన ఆదివారం కూడా చదలవాడ పంచాయతీ పరిధిలో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోపక్క ప్రత్తిపాడు, గొల్లప్రోలు మండలాల్లో సుద్దగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాలకు కోనసీమలో పల్లపు ప్రాంతాలు జలమయ మయ్యాయి. విజయనగరం జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకూ జల్లులు పడుతూనే ఉన్నాయి. ధవళేశ్వరం బ్యారేజి నుంచి సముద్రంలోకి విడుదలవుతున్న గోదావరి జలాలు రిజర్వాయర్లకు జలకళ నీరులేక వెలవెల బోయిన జోలాపుట్, బలిమెల, సీలేరు, డొంకరాయి రిజర్వాయర్లు నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జలకళ సంతరించుకున్నాయి. వర్షాల కారణంగా వీటిలోకి భారీగా ప్రవాహ జలాలు వచ్చి చేరుతుండటంతో జెన్కో అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పుగోదావరి జిల్లా డొంకరాయి రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,037 అడుగులు కాగా.. ఈ వర్షాలతో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. జెన్కో అధికారులు అప్రమత్తమై శనివారం అర్ధరాత్రి రెండు గేట్లు ఎత్తి 4,400 క్యూసెక్కుల నీటిని నేరుగా శబరి నదిలోకి విడుదల చేస్తున్నారు. అక్కడి జల విద్యుత్ కేంద్రంలోని ఏవీపీ డ్యాం పూర్తిగా నిండిపోవడంతో మరో రెండు గేట్లు ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని మోతుగూడెం రిజర్వాయర్‌లోకి పంపిస్తున్నారు. మోతుగూడెం జల విద్యుత్ కేంద్రంలోని రెండు యూనిట్లలో 210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. బలిమెలకు 13 వేల క్యూసెక్కులు ఆంధ్రా–ఒడిశా సరిహద్దు జలవిద్యుత్ కేంద్రాలకు నీటిని విడుదల చేసే బలిమెల రిజర్వాయర్‌లోకి భారీగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఇప్పటికి 13 వేల క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరింది. జోలాపుట్ రిజర్వాయర్‌లోకి 7,800 క్యూసెక్కుల నీరు చేరింది. వర్షాలు కొనసాగితే మరో రెండు రోజుల్లో జోలాపుట్, బలిమెల రిజర్వాయర్లు ప్రమాదస్థాయికి చేరుకోవచ్చని జెన్కో వర్గాలు వెల్లడించాయి. గోదావరికి స్వల్ప వరద ఉధృతి ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజి వద్ద గోదావరి వరద ఉధృతి ఆదివారం స్వల్పంగా పెరిగింది. ఒకటి రెండు రోజుల్లో కాటన్ బ్యారేజి వద్ద నీటి ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. వర్షాలు కురుస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. ఆదివారం రాత్రి బ్యారేజి వద్ద గోదావరి నీటిమట్టం 10.70 అడుగులుగా నమోదైంది. బ్యారేజి నుంచి 69,003 క్యూసెక్కుల జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. సోమవారం నాటికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని హెడ్‌వర్క్స్ ఈఈ ఆర్.మోహనరావు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని, వరదలను ఎదుర్కొనేందుకు ఇరిగేషన్ యంత్రాంగం సన్నద్ధంగా ఉందని చెప్పారు. ఎగువ ప్రాంతాలకు సంబంధించి కాళేశ్వరంలో 2.73 మీటర్లు, భద్రాచలంలో 16.50 అడుగులు, కూనవరంలో 7.32 మీటర్లు, పోలవరంలో 6.15 మీటర్లు, రాజమహేంద్రవరం రైల్వే బ్రిడ్జి వద్ద 13.88 మీటర్ల మేర గోదావరిలో నీటిమట్టాలు కొనసాగుతున్నాయి. జూరాల వైపు కృష్ణమ్మ పరుగు మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురవడం, కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలను తలపిస్తుండటంతో దిగువ జూరాలకు నీటి విడుదల మొదలైంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి వరద ఉధృతి పెరుగుతోంది. శనివారం ప్రాజెక్టులోకి 22 వేల క్యూసెక్కుల ప్రవాహాలు రాగా, ఆదివారం సాయంత్రానికి 45వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో ప్రాజెక్టులో నీటిమట్టం ఉదయానికే 129 టీఎంసీలకుగానూ 124 టీఎంసీలకు చేరింది. ఆదివారం అర్ధరాత్రికి లేక సోమవారం ఉదయానికి ఆల్మట్టి గేట్లు ఎత్తే వీలుందని సమాచారం. నారాయణపూర్ నుంచి ఇప్పటికే నీటి విడుదల మొదలైంది. వర్షాలకు కొట్టుకుపోయిన ఎండు చేపలు వర్షాలు మత్స్యకారులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. బాపట్ల మండలం సూర్యలంక సమీపంలోని ఫారెస్ట్ భూమిలో 20 రోజుల క్రితం వేటాడిన చేపలను ఎండబెట్టగా.. వర్షాల కురవడంతో అవన్నీ తడిసి కాలువల గుండా కొట్టుకుపోయి సముద్రంలో కలిశాయి. సుమారు రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. వీటిని లారీలకు ఎక్కించి సొమ్ము చేసుకుందామనుకున్న మత్స్యకారుల ఆశలు అడియాశలయ్యాయి. ఇదిలావుంటే.. వర్షంతోపాటు అలల ఉధృతి పెరగటంతో సముద్రంలో లంగర్ వేసిన పడవలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయి. 31 నాటికి అల్పపీడనం వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం తీరం దాటింది. మరోవైపు ఇక్కడే ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి నైరుతి వైపు వంగి ఉంది. దీనివల్ల ఈనెల 31 నాటికల్లా అల్పపీడనం ఏర్పడనుంది. తాజా పరిస్థితుల నేపథ్యంలో కోస్తాంధ్రలో నైరుతి రుతు పవనాలు చురుకుదనం సంతరించుకున్నాయి. సోమవారం పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులపాటు కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో ఒకట్రెండు చోట్ల తేలికపాటి జల్లులు లేదా వర్షం కురవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. రాయలసీమలో రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. మరోవైపు పశ్చిమ దిశ నుంచి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించింది. గడచిన 24 గంటల్లో వరరామచంద్రాపురంలో 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. కూనవరంలో 8, ప్రత్తిపాడు, వేలేరుపాడులో 6, కుకునూరు, పెద్దాపురంలో 5, పోలవరంలో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. -
విశాఖ ఏజెన్సీని ముంచెత్తిన వర్షాలు
సాక్షి, అమరావతి/ సాక్షి, నెట్వర్క్: విశాఖ జిల్లా మన్యంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తుండడంతో గెడ్డలు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మండల కేంద్రాలతో గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. ముంచంగి పుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కర్లపొదోర్ గ్రామ సమీపంలోని కల్వర్టు వరద ఉధృతికి శనివారం పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో లక్ష్మీపురం, బుంగాపుట్టు పంచాయతీలకు చెందిన 27 గిరిజన గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అలాగే ఒడిశా రాష్ట్రంలోని మూడు పంచాయతీలకు చెందిన 53 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. కల్వర్టు కొట్టుకుపోవడంతో ఈ ప్రాంత ప్రజలు ముంచంగిపుట్టు సంతకు వచ్చేందుకు ఇబ్బంది పడ్డారు. అత్యవసరంగా సరుకులు కావాల్సిన వారు ధైర్యం చేసి గెడ్డలు దాటి సంతకు వచ్చారు. కల్వర్టు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. కల్వర్టు కోతకు గురైందని, మరమ్మతులు చేపట్టాలని గతంలో అనేకమార్లు అధికారులను కోరినా స్పందించలేదని స్థానిక గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కల్వర్టును పునరుద్ధరించాలని కోరుతున్నారు. మరోవైపు డొంకరాయి జలాశయం నిండుకుండలా మారి ప్రమాదస్థాయికి చేరుకుంది. దీంతో అధికారులు ఒక గేటుని ఎత్తి వరద నీటిని శబరి నదిలోకి విడిచిపెట్టారు. జలకళతో తొణికిసలాడుతున్న సీలేరు జలాశయం. (ఇన్సెట్లో) డ్యాం నుంచి విడుదలవుతున్న నీరు 31న మరో అల్పపీడనం ఆదివారం, సోమవారం కోస్తాంధ్రలో జల్లుల నుంచి ఒక మోస్తరు వరకూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం పేర్కొంది. రాబోయే మూడు రోజులు రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నెల 31న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆగస్టు రెండో వారం నుంచి విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు కనిపిస్తున్నాయనీ.. దీనివల్ల లోటు ప్రభావం పూర్తిగా పోతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో కృష్ణా జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో గత 24 గంటల్లో 25.7 మి.మీ వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు కృష్ణా జిల్లాలో పలు చోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవగా, శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా వత్సవాయి మండలంలో 67.8 మి.మీ వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా కంకిపాడులో 6.2 మి.మీ వర్షపాతం నమోదైంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల జిల్లాలో ఖరీఫ్ సాగు ఊపందుకుంది. విజయవాడ అర్బన్‌తోపాటు కొన్ని మండలాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవగా లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. కాగా, తూర్పు గోదావరి జిల్లాలో గత 24 గంటల్లో 26.7 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అరకు–పాడేరు ప్రధాన రోడ్డులో చేరిన వరద నీరు రాష్ట్రంలో నమోదైన వర్షపాత వివరాలివీ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం చింతూరులో 11 సెంమీ, పాలకోడేరులో 7, నర్సీపట్నంలో 6, అమలాపురం, పాడేరు, వరరామచంద్రాపురం, కూనవరం, అరకు లోయ, ఎమ్మిగనూరులో 5 సెం.మీ, విజయవాడ, కంభం, గుడివాడ, యలమంచిలి, యర్రగొండపాలెం, చింతపల్లిలో 4 సెం.మీ, నూజివీడు, అవనిగడ్డ, తుని, వేలేరుపాడు, అర్ధవీడు, మచిలీపట్నం, తిరువూరు, గుంటూరు, కొయిడా, భీమవరం, ఏలూరు, తెనాలి, కైకలూరు, శృంగవరపుకోట, వేపాడ, వెలిగండ్ల, బెస్తవారిపేట, బెలగల, గొనెగండ్ల, నంద్యాల, శ్రీశైలం, నందవరంలో 3 సెం.మీ, కుక్కునూరు, కావలి, నర్సాపురం, పొదిలి, రేపల్లె, నందిగామ, భీమడోలు, రాచెర్ల, చింతలపూడి, నెల్లిమర్ల, బొబ్బిలి, యానాం, మార్కాపురం, కొనకొనమిట్ల, నందికొట్కూరు, గూడూరు, రుద్రవరం, ఓర్వకల్లు, కర్నూలులో 2 సెం.మీ వర్షం కురిసింది. అదేవిధంగా విజయనగరం, కొమరాడ, పార్వతీపురం, అనకాపల్లి, పత్తిపాడు, నెల్లూరు, ధవళేశ్వరం, పోలవరం, బొందపల్లి, మర్రిపూడి, గజపతినగరం, ఉయ్యూరు, తాడేపల్లిగూడెం, ముండ్లమూరు, పూసపాటిరేగ, చోడవరం, అచ్చంపేట, దర్శి, మెంటాడ, డెంకాడ, అనకాపల్లి, రణస్థలం, కొయ్యలగూడెం, తెర్లాం, సీతానగరం, చీమకుర్తి, సంతమాగులూరు, పెద్దాపురం, జియ్యమ్మవలస, అద్దంకి, కురుపాం, మాచర్ల, ఒంగోలు, తణుకు, సత్తెనపల్లి, ఆత్మకూరు, డోన్, పత్తికొండ, జూపాడు బంగ్లా, పగిడ్యాల, బనగానపల్లిలో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. -
కేరళ, కర్ణాటకకు భారీ వర్ష సూచన
తిరువనంతపురం : రానున్న రెండు రోజుల్లో కేరళలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే ఉత్తర కేరళలో కురుస్తున్న వర్షాలకు ముగ్గురు మరణించగా, 300 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా మంగళవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా 204 మిల్లిమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కానునట్లు వాతావరణ శాఖ అంచనావేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కన్నూర్, కాసరగోడ్ జిల్లాలో ప్రమాద హెచ్చరికలు జారీ చేయడమే కాక.. జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. కోజికోడ్, మలప్పురం జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. ఎర్నాకులం, ఇడుక్కి జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది. రాగల 24 గంటల్లో కేరళతో పాటుగా కర్ణాటకలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం వరకూ ఇదే పరిస్థితి కొనసాగనున్నట్లు తెలిపింది. కేరళ, కర్ణాటక,పశ్చిమ తమిళనాడు, లక్ష్యద్వీప్ తీరం వెంబడి గంటకు 40–50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రాష్ట్రాల తీర ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని పేర్కొంది. మత్య్సకారులు కొన్ని రోజులు వేటకు వెళ్లకూడదని సూచించింది. బిహార్, తూర్పు రాజస్తాన్, తూర్పు ఉత్తరప్రదేశ్, యానాం, రాయాలసీమలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే అస్సాం, మేఘాలయ, గోవా లాంటి ప్రాంతాలలో కూడా అత్యధిక వర్షాలు ఉండనున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. -
రాష్ట్రమంతటా వర్షాలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయి. దట్టమైన మేఘాలు అల్లుకోగా.. రాష్ట్రమంతటా వర్షాలు విస్తరించాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో శనివారం రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. మరో రెండు రోజులపాటు దీని ప్రభావం కొనసాగి, మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరం వైపు విస్తరిస్తోంది. దీనివల్ల వర్షాల కొనసాగటానికి అనువైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఆవర్తనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మీదుగా దక్షిణ ఛత్తీస్‌గఢ్ పరిసర ప్రాంతాలకు విస్తరించింది. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. ఇదిలావుంటే.. ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది దక్షిణ అండమాన్ సముద్రం వైపు విస్తరించి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుంచి 5.8 కిలోమీటర్ల మధ్యలో ఆవరించి ఉంది. అల్పపీడనం ఏర్పడితే తప్ప దీని ప్రభావం రాష్ట్రంపై ఉండబోదని వాతావరణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం రాత్రి వరకు పలుచోట్ల భారీ వర్షం పడింది. కర్నూలు జిల్లాలో 20 రోజుల తర్వాత వర్షాలు ఆశాజనకంగా కురిశాయి. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు, రాయలసీమలోని కర్నూలు, కడప జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. గడచిన 24 గంటల్లో గుంటూరు, కృష్ణా జిల్లా తిరువూరు, కర్నూలు జిల్లా అవుకు ప్రాంతాల్లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 28 ప్రాంతాల్లో అత్యల్పంగా ఒక సెంటీమీటర్ చొప్పున కురిసింది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో 8, ప్రకాశం జిల్లా సంతమాగులూరు, కడప జిల్లా ప్రొద్దుటూరులో 7 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా బాపట్ల, కృష్ణా జిల్లా అవనిగడ్డ, అనంతపురం జిల్లా గుత్తి, చిత్తూరు జిల్లా కుప్పంలో 6 సెంటీమీటర్ల చొప్పున నమోదైంది. ప్రకాశం జిల్లా కారంచేడు, గుంటూరు జిల్లా అచ్చంపేట, విజయనగరం జిల్లా కురుపాం, కృష్ణా జిల్లా మచిలీపట్నం, కడప జిల్లా రాజంపేట, చిత్తూరు జిల్లా పలమనేరు, కర్నూలు జిల్లా ఆత్మకూరులో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస, గుంటూరు జిల్లా రేపల్లె, కడపజిల్లా పెనగలూరు, వల్లూరులో 4 సెంటీమీటర్ల చొప్పున నమోదైంది. విజయనగరం జిల్లా బాలాజీపేట, ప్రకాశం జిల్లా ఒంగోలు, శ్రీకాకుళం జిల్లా పాలకొండ, విశాఖ జిల్లా చోడవరం, కృష్ణా జిల్లా కైకలూరు, కడప జిల్లా కమలాపురం, చిత్తూరు జిల్లా వెంకటగిరికోట, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, ఓర్వకల్లులో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు, విజయనగరం జిల్లా కొమరాడ, ప్రకాశం జిల్లా వెలిగొండ్ల, వండ్లమూరు, యర్రగొండపాలెం, అద్దంకి, చిత్తూరు జిల్లా పాలసముద్రం, కడప జిల్లా వేంపల్లి, పోరుమామిళ్ల, చాపడ్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
ముఖం చాటేసిన నైరుతి
వర్షాకాలం వచ్చేసింది. రైతు దుక్కి దున్ని ఆకాశంలోకి ఆశగా చూస్తున్నాడు. కానీ ఒక్క మబ్బు తునక కనిపించడం లేదు. నైరుతి రుతు పవనాలు ముఖం చాటేయడంతో ఖరీఫ్ సీజన్ వృథాయేనన్న ఆందోళన రైతుల్లో నెలకొంది. దక్షిణ భారతంలో రైతులకు జులై నెల అత్యంత కీలకం. ఈ నెలలో వర్షం కురిసే అవకాశాలు కనిపించడం లేదని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) అంటోంది. ‘నైరుతి రుతు పవనాలు బలహీనపడి పోతున్నాయి. వచ్చే రెండు వారాల్లో మధ్య, దక్షిణ భారతంలో ఎక్కడా వానలు కురిసే అవకాశాల్లేవు’ అని భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. దేశం మొత్తమ్మీద చూస్తే 12 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో వానలు ఇప్పటికే దంచికొడుతున్నాయి. మరో నాలుగైదు రోజులపాటు ఉత్తర, ఈశాన్య భారతాల్లోని కొన్ని ప్రాంతాలు, గంగా పరీవాహక రాష్ట్రాలైన ఉత్తరాఖండ్, బిహార్, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారి కశ్యపి పేర్కొన్నారు. అరేబియా సముద్రం, బంగాళాఖాతం ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం కనిపించడం లేదని ఆయన వివరించారు. మధ్య భారతంలో భారీ వర్షాలు నైరుతి రుతుపవనాలు భారత్‌లో ప్రవేశించిన తర్వాత తొలిసారిగా ఈ వారంలో కొన్ని ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జులై మొదటి వారంలో గత 50 ఏళ్ల సగటు తీసుకుంటే 28 శాతం అత్యధికంగా వర్షపాతం నమోదైంది. సోయాబీన్, పత్తి అధికంగా పండించే మధ్యభారతంలో 38 శాతం అధిక వర్షాలు కురిస్తే, వరి పండించే దక్షిణాదిన 20శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. తీవ్రమవుతున్న నీటి సమస్య ఇప్పటివరకు కురిసిన వర్షాలు ఏ మాత్రం ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎక్కడికక్కడ బోర్లు బావురుమంటున్నాయి. చెరువులు ఎండిపోయాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం దిగువకి పడిపోయింది చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో నీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఒక్క వారం ఆలస్యంగా రావడంతో పాటు అరేబియా సముద్రంలో నెలకొన్న వాయు తుఫాన్ ప్రభావం రుతుపవనాలపై పడింది. ఫలితంగా గత ఏడాదితో పోల్చి చూస్తే 27 శాతం వరకు విస్తీర్ణంలో పంటలు వేయడం తగ్గిపోయింది. ‘మన దేశంలో బంగారు పంటలు పండాలంటే వచ్చే రెండు, మూడు వారాల్లో అధికంగా వానలు కురవాలి. అప్పుడే జూన్‌లో తగ్గిన లోటు వర్షపాతం భర్తీ అవుతుంది. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు కనిపించడం లేదు’ అని భారత వాతావరణ శాఖకు చెందిన భారతి చెప్పారు. ఈ ఏడాది సరిగ్గా వానలు కురిసే అవకాశం లేదని వాతావరణ పరిస్థితుల్ని అంచనా వేసే ప్రైవేటు సంస్థ స్కైమెట్ మే నెలలోనే ప్రకటించింది. చెన్నై చేరిన నీళ్ల రైలు చెన్నై: వెల్లూరులోని జోలార్‌పేటై నుంచి 25 లక్షల లీటర్ల నీటిని మోసుకుంటూ ఓ రైలు చెన్నైలోని విల్లివక్కమ్‌కు చేరుకుంది. ఈ రైల్లో మొత్తం 50 వ్యాగన్లు ఉండగా, ఒక్కో వ్యాగన్ సామర్థ్యం 50 వేల లీటర్లు. నీటిని శుభ్రపరిచేందుకు దాదాపు 100 పైపులను అమర్చి ప్లాంటుకు తరలిస్తున్నారు. శుద్ధి చేశాక పంపిణీ చేస్తామని చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అధికారులు తెలిపారు. ఈ పంపిణీ ఈశాన్య రుతుపవనాలు వచ్చే వరకు కొనసాగుతుందన్నారు. ఈశాన్య రుతుపవనాలు రావడానికి ఇంకా ఆరునెలల సమయం ఉంది. దక్షిణ మెట్రోపోలీస్ నుంచి జోలార్‌పేటై 217 కిలోమీటర్ల దూరంలో ఉంది. నీటి కొరతతో అల్లాడుతున్న చెన్నైకి నీటిని తరలించేందుకు సహాయం అందించాల్సిందిగా ప్రభుత్వం రైల్వేను కోరిన నేపథ్యంలో ఈ రైలు వెల్లూరు జిల్లా నుంచి నీటితో చెన్నై చేరుకుంది. జోలార్‌పేటై నుంచి నీటిని తెచ్చి, కొరతను తగ్గించేందుకు ముఖ్యమంత్రి కే. పళనిస్వామి రూ.65 కోట్లను కేటాయించారు. నీటి పంపిణీని తమిళనాడు మంత్రులు ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. చెన్నై నగరానికి రోజుకు 20 కోట్ల లీటర్లు నీరు అవసరం కాగా ఆ నీటిని అందించే నాలుగు ప్రధాన రిజర్వాయర్లలో నీరు అడుగంటిన సంగతి తెలిసిందే. -
బలపడుతున్న అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం క్రమ క్రమంగా బలపడుతోంది. సోమవారం నాటికి ఇది తీవ్ర అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ నైరుతి వైపునకు వంగి ఉంది. ఫలితంగా ఈ తీవ్ర అల్పపీడనం మరింతగా బలపడి మంగళవారం వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇప్పటివరకు బలహీనంగా ఉన్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి నివేదికలో వెల్లడించింది. వాయుగుండం మన రాష్ట్రంపై అంతగా ప్రభావం చూపకుండా పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉండడంతో ఒడిశా, బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తూర్పు గోదావరిలో భారీ వర్షం గడచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. చింతూరులో 8, కుకునూరులో 4, వరరామచంద్రపురం, వేలేరుపాడు, కూనవరం, వెలిగండ్లల్లో 3, బెస్తవారిపేట, టెక్కలి, అర్థవీడు, పగిడ్యాల, కర్నూలు, ఆత్మకూరు, నందికొట్కూరు, శ్రీశైలంలో 2 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైంది. -
నేడు అల్పపీడనం
సాక్షి, విశాఖపట్నం: పశ్చిమ బెంగాల్ తీరానికి ఆనుకుని ఉత్తర బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది సముద్రమట్టానికి 3.1 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి నైరుతి వైపునకు వంగి ఉంది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం 48 గంటల్లో వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఫలితంగా రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండడం వల్ల రాష్ట్రంలో శనివారం చెప్పుకోదగిన వర్షాలు కురవలేదు. -
రాష్ట్రాన్ని పలకరించిన రుతుపవనాలు
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: మృగశిర కార్తె ఆరంభంలో ప్రవేశించాల్సిన నైరుతి రుతు పవనాలు 15 రోజులు ఆలస్యంగా రాష్ట్రాన్ని పలకరించాయి. ఆరుద్ర కార్తెకు రెండు రోజుల ముందు శుక్రవారం రాష్ట్రమంతటా విస్తరించాయి. తీవ్రమైన వడగాడ్పులు, ఉక్కపో తతో అల్లాడుతున్న ప్రజలకు ఎట్టకేలకు ఉపశమనం కలిగించాయి. వాస్తవానికి ఈ ఏడాది రుతు పవనాలు 8 రోజుల ఆలస్యంగా కేరళను తాకాయి. కేరళను తాకిన ఐదారు రోజులకు రాష్ట్రంలోని రాయలసీమలోకి ప్రవేశించాల్సి ఉంది. కానీ.. కేరళను తాకిన రెండు వారాల వరకు వీటి జాడ లేకుండా పోయింది. ఇటీవల అరేబియా సముద్రంలో ఏర్పడిన ‘వాయు’ తుపాను ప్రభావంతో రుతు పవనాలు మందగమనంతో కదిలాయి. ఆ తుపాను బలహీనపడటంతో ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రవేశానికి వీలుపడింది. రుతు పవనాల ఆగమనానికి సంకేతంగా అటు రాయలసీమ, ఇటు కోస్తాంధ్రల్లో రెండు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అదే సమయంలో నైరుతి నుంచి రుతు పవన గాలులు వీస్తున్నాయి. వీటి ఆధారంగా శుక్రవారం నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు.. మునుపెన్నడూ లేనివిధంగా ఈ రుతు పవనాలు ఒక్కరోజులోనే రాయలసీమ, కోస్తాంధ్ర (యానాం సహా) అంతటా విస్తరించాయని వెల్లడించింది. రుతు పవనాల రాకతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల భారీగా, మరికొన్ని చోట్ల మోస్తరుగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో శనివారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రానున్న మూడు రోజుల్లో కోస్తాంధ్రలో పలుచోట్ల, రాయలసీమలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. వర్షాలకు లోటుండదు ‘ఆంధ్రప్రదేశ్‌లోని 60 శాతం పైగా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ లేదా నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. భూమి నుంచి నాలుగు కిలోమీటర్ల ఎత్తువరకూ 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో చల్లని గాలులు వీస్తున్నాయి. రుతు పవనాలు రాష్ట్రమంతా విస్తరించాయనడానికి ఇవే నిదర్శనాలు. వీటి ఆధారంగానే రాష్ట్రం మొత్తం నైరుతి ఆవహించిందని ధ్రువీకరించరించాం’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధిపతి వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ఆలస్యంగా వచ్చినప్పటికీ పూర్తిస్థాయిలో వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు. ‘సాధారణంగా జూన్ 5, 6 తేదీల్లో నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాలి. ఈ ఏడాది 15 రోజులు ఆలస్యంగా 21వ తేదీన వచ్చాయి. ఈ సీజన్లో ఇప్పటివరకూ కురవాల్సిన వర్షం కంటే 67 శాతం పైగా తక్కువ వర్షపాతం నమోదైంది. రుతు పవనాలు జాప్యం కావడం వల్ల జూన్‌లో ఏర్పడిన లోటు జూలై, ఆగస్టు నెలల్లో పూడుతుంది. ఈ సీజన్లో (జూన్–సెప్టెంబర్ మధ్య) సాధారణ వర్షపాతం (97 శాతం) నమోదవుతుంది. ఈ సీజన్లో రాష్ట్రంలో 912 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలి. సెప్టెంబర్ నెలాఖరు నాటికి ఈ మేరకు వర్షపాతం నమోదవుతుంది. రుతు పవనాల రాక ఆలస్యమైనప్పటికీ వర్షాల పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది’ అని వాతావరణ కేంద్రం డైరెక్టర్ వివరించారు. చల్లబడిన వాతావరణం రుతుపవనాల రాకతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. నిన్న మొన్నటిదాకా సాధారణం కంటే 4–7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదై వడగాడ్పులు వీచాయి. శుక్రవారం సాధారణం కంటే 2–5 డిగ్రీల వరకు తక్కువగా రికార్డయి వాతావరణం చల్లబడింది. ఇకపై ఉష్ణోగ్రతలు అదుపులోనే ఉండనున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అత్యధికంగా కావలిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
కోస్తాలో నిప్పుల ఉప్పెన!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి : నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే సమయంలో ఎప్పుడూ లేనంతగా భానుడు మరింత భగభగమంటున్నాడు. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడగాడ్పులు రాష్ట్రాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. మరో రెండు మూడ్రోజుల పాటు కోస్తాంధ్రలో ఇదే పరిస్థితి ఉంటుంది. సాధారణంకంటే ఐదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగాను, అంతకుమించి రికార్డయితే తీవ్ర వడగాడ్పులు గాను పరిగణిస్తారు. కానీ, కోస్తాంధ్రలో ఇప్పటికే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమ, మంగళవారాలు అంతకు మించి ఉష్ణోగ్రతలు రికార్డయి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో వెల్లడించింది. దీంతో రానున్న రెండు రోజులు కోస్తాంధ్ర నిప్పుల కుంపటిలా మారనుంది.రాయలసీమలో మాత్రం సాధారణం కంటే 2–4 డిగ్రీలు మాత్రమే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి జిల్లాల్లో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది. ఆయా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని సూచించింది. ఒకట్రెండు రోజుల్లో రుతుపవనాలు కాగా, ఒకట్రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాయలసీమలోకి ప్రవేశించనున్నాయి. దీంతో ఈనెల 18 తర్వాత నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకూ ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంవల్ల మూడు నాలుగు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. అప్పట్నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునే అవకాశాలున్నాయి. మరోవైపు.. నైరుతీ రుతుపవనాలు నైరుతీ, వాయవ్య బంగాళాఖాతంలోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా విస్తరించినట్లు హైదరాబాద్‌లోని భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తెలిపింది. ప్రస్తుతం కర్ణాటకలోని మంగళూరు, మైసూరు, తమిళనాడులోని సేలం, కడలూరు, ఒడిశాలోని గోపాలపురం, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్ వరకు నైరుతీ రుతుపవనాలు పూర్తిగా విస్తరించాయి. -
48 గంటల్లో సీమకు నైరుతి!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి/అనకాపల్లి: ఉష్ణతాపంతో ఉడికిపోతున్న ప్రజలకు చల్లటి కబురు! నైరుతి రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. తొలుత రాయలసీమలో ప్రవేశించి 24 గంటల్లోనే ఉత్తర కోస్తాకు విస్తరించనున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం కేరళను దాటి కర్ణాటక, తమిళనాడుల్లోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఇవి 48 గంటల్లోగా రాయలసీమలోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేస్తోంది. మరోవైపు ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. అదే సమయంలో రాయలసీమ, కోస్తాంధ్రల్లో అక్కడక్కడ గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయనున్నాయి. కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం కూడా ఉంది. కోస్తాంధ్రలో నేడు కూడా వడగాడ్పులు వీస్తాయని, రాయలసీమలో సాధారణం కంటే 2–4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ వెల్లడించింది. శనివారం కోస్తాంధ్రలో తీవ్ర వడగాడ్పులు వీచాయి. సాధారణం కంటే 4–9 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అల్పపీడనం ప్రభావంతో కోస్తాకు వర్ష సూచన రానున్న మూడు నాలుగు రోజుల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాంధ్రకు ఆవల ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 4.5 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. ఇది బలపడి ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడానికి దోహదపడుతుందని నిపుణులు చెబుతున్నారు. నాలుగు రోజుల్లో కోస్తాంధ్రలో వర్షాలు కురవవచ్చని అంచనా వేస్తున్నారు. కోస్తా భగభగ మండిపోతున్న ఎండలతో కోస్తాంధ్ర కుతకుతలాడుతోంది. వాతావరణంలో తేమ శాతం గణనీయంగా తగ్గడం వల్ల 18వ తేదీ వరకు ఇలాగే కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు. శనివారం విజయనగరం జిల్లా బొండాపల్లెల మండలంలో అత్యధికంగా 46.20 డిగ్రీల సెల్సియస్, విశాఖ జిల్లా దేవరాపల్లె మండలంలో 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ప్రకాశం జిల్లా టంగుటూరులో 45.79, విజయనగరం జిల్లా పెదమోరంగిలో 45.37, విశాఖ జిల్లా భలిగట్టంలో 45.08, గాదిరాయిలో 45.02 డిగ్రీలు, పశ్చిమ గోదావరి జిల్లా పొదురులో 45.31, చిన్నాయగూడెంలో 45.18, చిట్యాలలో 45.07 డిగ్రీలు, తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలంలో 45.30, రాజోలు మండలం శివకోడులో 45.17 డిగ్రీలు, బాపట్లలో 45.12 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు 19న నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని అవేర్ వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. వీటి ప్రభావం వల్ల ఈ నెల 19 నుంచి 24 వరకూ రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు పడొచ్చని అంటున్నారు. -
నేడూ భగభగలే..!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వర్షాలతో చల్లదనం పంచాల్సిన కాలంలో వడగాడ్పులు విజృంభిస్తూ మరింత మంటెక్కిస్తున్నాయి.. ఇప్పటికే ఉష్ణతాపంతో కోస్తాంధ్ర భగ్గుమంటోంది. సాధారణం కంటే 3నుంచి6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ దడ పుట్టిస్తున్నాయి. ఇదే పరిస్థితి శనివారం కూడా కొనసాగుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం రాత్రి నివేదికలో తెలిపింది. కోస్తాంధ్ర అంతటా శనివారం వడగాడ్పులు వీస్తాయని, రాయలసీమలో సాధారణంకంటే 2నుంచి4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డవుతాయని పేర్కొంది. అలాగే శనివారం నుంచి నాలుగు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు గానీ, వర్షం గానీ కురుస్తుందని వివరించింది. అదే సమయంలో దక్షిణ కోస్తాంధ్రలో గంటకు 30నుంచి40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కాగా శుక్రవారం రాష్ట్రంలో పలుచోట్ల వడగాడ్పులు వీచాయి. -
నేడు దక్షిణ కోస్తాలో వడగాడ్పులు!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో వడగాడ్పులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఇప్పటికే పలుచోట్ల సాధారణం కంటే 4–6 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం కూడా ఈ వడగాడ్పులు ప్రభావం చూపనున్నాయి. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో వీటి తీవ్రత అధికంగా ఉండనుంది. మరోపక్క పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం మంగళవారం ఈశాన్య బంగాళాఖాతంలోకి మళ్లింది. ఇది సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు గాని, వర్షాలు గాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి తన నివేదికలో తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో అక్కడక్కడ గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, కొన్ని చోట్ల పిడుగులు కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ నెల 14 నుంచి రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుందని, పిడుగులకు ఆస్కారం ఉందని తెలిపింది. -
‘నైరుతి’కి ఆదిలోనే అంతరాయం!
సాక్షి, విశాఖపట్నం/పొదలకూరు: నైరుతి రుతు పవనాలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగులుతోంది. కేరళను తాకిన రుతు పవనాలకు తుపాను రూపంలో ప్రతికూల పరిస్థితి ఏర్పడబోతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం రెండ్రోజుల్లో తుపానుగా బలపడి, ఉత్తర వాయవ్య దిశగా పయనించనుంది. దీనివల్ల గాలిలోని తేమ పాకిస్తాన్ వైపు వెళ్లి నైరుతి రుతు పవనాల విస్తరణను అడ్డుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి రుతు పవనాలు ప్రవేశించాక అల్పపీడనాలు ఏర్పడితే అవి మరింతగా విస్తరించడానికి దోహదపడతాయి. అయితే, ప్రస్తుతం అరేబియా సముద్రంలోని అల్పపీడనం రెండ్రోజుల్లో తుపానుగా బలపడి పాక్ వైపు పయనించే అవకాశం ఉండటంతో రుతు పవనాల్లో చురుకుదనం తగ్గి ఇతర ప్రాంతాలకు విస్తరించటంలో జాప్యం చోటుచేసు కోనుంది. మరోవైపు అల్పపీడన ద్రోణులు ఏర్పడక పోవడం కూడా వర్షాలకు ఆటంకం ఏర్పడనుంది. ఇది రాష్ట్రంలోకి రుతు పవనాల ప్రవేశంపై ప్రభావం చూపు తుందని వాతావరణ శాఖ మాజీ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. ఇదిలావుంటే.. నైరుతి రుతు పవనాలు రానున్న 24 గంటల్లో తమిళనాడు, నైరుతి, ఆగ్నేయ, ఈశాన్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి విస్తరించే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి నివేదికలో తెలిపింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం మరింతగా దిగువకు వస్తే రుతు పవనాల్లో కదలిక వస్తుందని, రాష్ట్రంలోకి వాటి ప్రవేశానికి వీలుంటుందని మురళీకృష్ణ చెప్పారు. దీనివల్ల రాష్ట్రంలో రెండు మూడు రోజుల్లో వర్షాలకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రానున్న రెండు మూడు రోజులూ ఉక్కపోత అధికంగా ఉంటుందని తెలిపారు. నేడు ఉష్ణ తీవ్రత.. పిడుగుల వాన సోమవారం కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణం కంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఐఎండీ తెలిపింది. అదే సమయంలో కోస్తాంధ్రలో గంటకు 30–40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. నెల్లూరు జిల్లాలో ముగ్గుర్ని బలిగొన్న పిడుగులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతోపాటు పిడుగులు పడ్డాయి. వీటి బారినపడి ఓ రైతు, ఓ మహిళతోపాటు గిరిజనుడు మృతి చెందారు. నెల్లూరు రూరల్ మండలం కందమూరు గ్రామానికి చెందిన రైతు పల్లం శ్రీనివాసులు (45) పిడుగుపాటుకు గురయ్యాడు. ఓజిలి మండలం అత్తివరం గ్రామానికి చెందిన పశువుల కాపరి కవిత (24) పిడుగుపాటుకు గురై మరణించింది. కలిగిరి మండలం పోలంపాడు సమీపంలోని పొలంలో పని చేసుకుంటుండగా దాసరి సుధాకర్ (35) అనే గిరిజనుడు పిడుగుపాటుకు గురై మృత్యువాత పడ్డాడు. -
రాష్ట్రానికి చల్లటి కబురు!
సాక్షి, విశాఖపట్నం : ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందే రైతన్నలు, పాలకులు, ప్రజలకు సాంత్వన ఇచ్చే చల్లటి కబురు ఇది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజనులో సాధారణ వర్షాలు కురవనున్నాయి. దేశవ్యాప్తంగా జూన్ నుంచి సెప్టెంబరు వరకు ప్రభావం చూపే ఈ రుతుపవనాల సీజనులో 96 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజాగా శుక్రవారం అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర, వాయవ్య భారత్ కంటే ఆంధ్రప్రదేశ్ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వర్షపాతం బాగుంటుందని ప్రకటించింది. ప్రాంతాల వారీగా చూస్తే వాయవ్య భారతదేశంలో 94 శాతం, మధ్య భారతదేశంలో 100 శాతం, దక్షిణాది రాష్ట్రాల్లో 97 శాతం, ఈశాన్య రాష్ట్రాలో 91 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఎల్‌నినో బలహీనంగా ఉండడంవల్ల కరువుకు ఆస్కారం ఉండబోదని తెలిపింది. జూన్ 6న కేరళకు నైరుతి.. మరోవైపు.. నైరుతి రుతుపవనాలు జూన్ 6వ తేదీ నాటికి కేరళను తాకే అవకాశాలున్నాయని ఐఎండీ పునరుద్ఘాటించింది. ఇప్పటికే ఈ రుతుపవనాలు అండమాన్, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించాయి. ఇవి క్రమంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం మాల్దీవులు, కొమరిన్, నైరుతి–ఆగ్నేయ బంగాళాఖాతాల్లోకి ప్రవేశించాయి. ఇవి మరింతగా ముందుకు కదులుతూ రానున్న 48 గంటల్లో అరేబియా సముద్రం, మాల్దీవులు, నైరుతి–ఆగ్నేయ బంగాళాఖాతాల్లోకి విస్తరించనున్నాయి. క్రమంగా ఇవి బలపడుతూ జూన్ 6 నాటికల్లా కేరళను తాకుతాయని ఐఎండీ వివరించింది. కాగా, రానున్న రెండ్రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
నేడు.. రేపు పిడుగుల వాన!
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఒకపక్క అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోపక్క ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న వాయవ్య బంగాళాఖాతంలో బుధవారం ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్రమట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఉంది. మరోవైపు తూర్పు మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర కర్నాటక వరకు విదర్భ, మరఠ్వాడా, మధ్య మహారాష్ట్రల మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా గురు, శుక్రవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలతో పాటు పిడుగులు కూడా పడనున్నాయి. అదే సమయంలో రాయలసీమలో గంటకు 30–40, కోస్తాంధ్రలో 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. ఇలావుండగా రాయలసీమలో రానున్న రెండు రోజులు వడగాడ్పులు కొనసాగనున్నాయి. కోస్తాంధ్రలో సాధారణంకంటే 2–3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. గడచిన 24 గంటల్లో సీతానగరంలో 5, పార్వతీపురం, పాలకొండలలో 4, సీతారాంపురం, దువ్వూరు, వీరఘట్టంలలో 3, పాతపట్నం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, కంబం, బలిజపేట, పులివెందుల, చాపాడుల్లో 2 సెం.మీల చొప్పున వర్షపాతం రికార్డయింది. పిడుగు పాటుకు ఇద్దరు గొర్రెల కాపరుల మృతి పెద్దపంజాణి / గురజాల: చిత్తూరు జిల్లా పెద్దపంజాణి మండలంలో బుధవారం పిడుగు పాటుకు ఇద్దరు గొర్రెల కాపరులు మృతి చెందారు. కోగిలేరు పంచాయతీ బసవరాజుకండ్రిగ గ్రామానికి చెందిన అబ్బన్న కుటుంబ సభ్యులు గొర్రెలు మేపుకొంటూ జీవనం చేస్తున్నారు. రోజులాగే అబ్బన్న భార్య నాగమ్మ(68), మనవడు శశికుమార్(17)తో కలిసి గొర్రెలను సమీపంలోని పొలాలకు తీసుకెళ్లారు. సాయంత్రం ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం కురవడంతో ఇద్దరూ సమీపంలోని మామిడి చెట్ల కిందకు వెళ్లారు. సమీపంలో పిడుగు పడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. పరిసర ప్రాంతంలోని రైతులు మృతదేహాలను చూసి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు.. పెద్దపంజాణి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా గుంటూరు జిల్లా గురజాల మండలంలో బుధవారం సాయంత్రం భారీ ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వర్షం పడింది. మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 గంటల వరకు వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. 31.4 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అక్కడక్కడా చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. అదే సమయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బుధవారం వడదెబ్బ తగిలి నలుగురు మృత్యువాత పడ్డారు. -
వడ..దడ!
సాక్షి, విశాఖపట్నం: భానుడు విశ్వరూపం చూపిస్తున్నాడు. రోజురోజుకూ తన ప్రతాపాన్ని తీవ్రతరం చేస్తున్నాడు. ఇప్పటికే కొద్దిరోజులుగా రాయలసీమలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఆ ప్రాంతంలో వడగాడ్పులు హడలెత్తిస్తున్నాయి. మరో రెండ్రోజుల్లో కోస్తాంధ్రలోనూ వడగాడ్పులు మొదలు కానున్నాయి. ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మధ్య మహారాష్ట్ర, విదర్భ, జార్ఖండ్‌ల్లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అటు నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి దోహదపడుతున్నాయి. ఉత్తర కర్ణాటక నుంచి కేప్ కొమరిన్ ప్రాంతం వరకు తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షంగాని కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) బుధవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు రాయలసీమలోని అన్ని జిల్లాల్లో నిప్పుల కుంపటిని తలపించేలా వడగాడ్పులు వీస్తాయని.. అలాగే, కోస్తాంధ్రలో ఈనెల 25 నుంచి వడగాడ్పుల ప్రభావం మొదలవుతుందని పేర్కొంది. కోస్తాంధ్రలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వివరించింది. ఈ ప్రాంతాల్లో 46డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని తెలిపింది. జూన్ మొదటి వారం వరకు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు కొనసాగుతూ వడగాడ్పులకు దోహదమవుతాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి చెప్పారు. కాగా, గడచిన 24 గంటల్లో నందికొట్కూరులో 3, ఆలూరు, నంద్యాల, డోర్నిపాడు, పాడేరుల్లో ఒక్కో సెంటీమీటరు చొప్పున వర్షపాతం నమోదైంది. -
రుతు రాగం..ఆలస్య తాళం
సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు ఈ ఏడాది కాస్త ఆలస్యంగా రానున్నాయి. సాధారణంగా జూన్ 1వ తేదీకల్లా రుతు పవనాలు కేరళను తాకుతాయి. మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది జూన్ 6వ తేదీ వరకు కేరళను తాకే అవకాశాలు లేవని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం వెల్లడించింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నైరుతి రుతు పవనాలు ప్రభావం చూపుతాయి. ఏడాది మొత్తమ్మీద కురిసే వర్షాల్లో 70 శాతం వర్షపాతం వీటి ద్వారానే నమోదవుతుంది. పంటలపై ప్రభావం చూపే నైరుతి రుతు పవనాలపైనే దేశ ఆర్థిక పరిస్థితి ముడిపడి ఉంటుంది. అందువల్లే ఈ రుతుపవనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. కాగా, మే నెల 10 తేదీ తర్వాత కేరళ, లక్షద్వీప్‌లలో ఉన్న 14 వాతావరణ కేంద్రాల్లోని 60 శాతం కేంద్రాల్లో రెండు రోజుల పాటు 2.50 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. మరోవైపు బంగాళాఖాతం, అరేబియా సముద్ర శాఖలు నైరుతి రుతుపవనాల ఆగమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ రెండు శాఖల్లో బంగాళాఖాతం శాఖ చురుగ్గానే ఉంది. అరేబియా శాఖ మాత్రం ఒకింత స్తబ్దుగా ఉంది. ఇది చురుకుదనం సంతరించుకోవడానికి కాస్త సమయం పడుతున్నందున నైరుతి రుతు పవనాలు కేరళను తాకడంలో ఆలస్యానికి కారణమని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే రుతు పవనాలు కేరళను తాకడానికి ముందు అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, వాటికి ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ఈ నెల 18–19 తేదీల్లో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఒకింత ఆలస్యంగా కేరళలోకి ప్రవేశించినా, దాని ప్రభావం దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతంపై ప్రభావం చూపబోదని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేష్ ‘సాక్షి’కి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం నైరుతి రుతుపవనాలు కేరళను ఆలస్యంగా తాకనున్న ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై కూడా చూపనుంది. సాధారణంగా ఈ రుతుపవనాలు కేరళను తాకిన వారం, పది రోజులకు రాయలసీమలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత క్రమంగా రాష్ట్రంలోకి విస్తరించి వానలు కురిపిస్తాయి. కేరళలోకి వీటి ప్రవేశం జాప్యం కావడం వల్ల రాష్ట్రంలోకి వాటి ఆగమనం ఆలస్యమవుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అంటే రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశం జూన్ రెండో వారంలో కనిపించే అవకాశం ఉంది. ఈ లెక్కన మరో నెల రోజులపాటు రాష్ట్రంలో ఎండలు కొనసాగనున్నాయి. కొనసాగుతున్న ద్రోణి దక్షిణ మధ్యప్రదేశ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కర్ణాటక, తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా గురువారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్నిచోట్ల పిడుగులకు ఆస్కారం ఉందని పేర్కొంది. రాయలసీమలో మాత్రం పొడి వాతావరణమే ఉంటుంది. మరోవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతల తీవ్రత ఒకింత తగ్గింది. బుధవారం కొన్నిచోట్ల సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు మాత్రమే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజమవుతున్న ఐఎండీ అంచనాలు నైరుతి రుతు పవనాల ఆగమనంపై ఐఎండీ వేస్తున్న అంచనాలు 2004 నుంచి నిజమవుతూ వస్తున్నాయి. ఒక్క 2015లో మాత్రం ఐఎండీ అంచనా తప్పింది. ఆ సంవత్సరం మే 30న రుతు పవనాలు ప్రవేశిస్తాయని అంచనా వేయగా వారం రోజులు ఆలస్యంగా జూన్ 5న తాకాయి. -
ముందుంది నిప్పుల వాన!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: రాష్ట్రానికి నిప్పుల ముప్పు ఇంకా పొంచి ఉంది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించేదాకా ఉష్ణ తీవ్రత కొనసాగనుంది. ఫొని తుపాను తీరాన్ని దాటక ముందు నుంచీ భానుడు నిప్పులు చెరుగుతూనే ఉన్నాడు. ఎడతెరపి లేకుండా వడగాడ్పులు వీస్తూనే ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ అన్న తేడా లేకుండా సాధారణం కంటే 4–7 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, రాయలసీమ జిల్లాల్లోనూ వెరసి 139 మండలాల్లో వడగాడ్పులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గడిచిన పదేళ్లలో ఉష్ణోగ్రతల పెరుగుదల తీరుపై ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీడీఎంఏ) ఒక అట్లాస్‌ను రూపొందించింది. దాని ప్రకారం రాష్ట్రంలో ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అలాగే ఐఎండీ నేషనల్ మాన్సూన్ మిషన్ ఏప్రిల్, మే నెలల్లో దేశంలో ఉష్ణోగ్రతల ప్రభావంపై పరిశీలన చేసింది. పంజాబ్, హర్యానా, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లోని కొన్ని ప్రాంతాలను తీవ్ర వడగాడ్పుల ప్రభావిత ఏరియాలుగా తేల్చింది. ఏపీ, తెలంగాణపైనా డెడ్లీ హీట్‌వేవ్స్ ప్రభావం ఉత్తర, వాయవ్య భారతదేశంలో ఈ వేసవిలో 50 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు (డెడ్లీ హీట్‌వేవ్స్) నమోదయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్యసమితి ఇటీవల హెచ్చరించింది. వాటి ప్రభావం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలపై కూడా ఉంటుందని తెలిపింది. అధిక ఉష్ణోగ్రతల ధాటికి చాలా మరణాలు సంభవిస్తాయని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఐక్యరాజ్యసమితి అత్యంత అరుదుగా ఇలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రస్తుతం రెండు రోజుల నుంచి ఉపరితల ద్రోణి ప్రభావంతో వడగాడ్పుల తీవ్రత తగ్గి రాష్ట్రంలో పలుచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ పరిస్థితి రెండు మూడు రోజులకే పరిమితమని, ఎండలు విజృంభించి, మళ్లీ తీవ్ర వడగాడ్పులు కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వడదెబ్బకు గురై మంగళవారం ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో నలుగురు వంతున, గుంటూరు జిల్లాలో ఇద్దరు, విశాఖ జిల్లాలో ఒకరు వంతున మృతి చెందారు. నేడు, రేపు కోస్తాంధ్రకు వర్ష సూచన కోస్తాంధ్రలో బుధ, గురువారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. అదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీయనున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) మంగళవారం రాత్రి ఒక నివేదికలో తెలిపింది. ఈదురుగాలులు, వర్షాలతో పాటు కొన్నిచోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. రాయలసీమలో బుధవారం అక్కడక్కడ తేలికపాటి వర్షం గానీ, జల్లులు గానీ కురిసే అవకాశం ఉంది. గురువారం నుంచి అక్కడ రెండు రోజులు పొడి వాతావరణం నెలకొంటుంది. 47 డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు ‘‘జూన్ ఒకటి రెండు తేదీల్లో రుతుపవనాలు కేరళను తాకిన వారం పది రోజుల నాటికి రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. అప్పటిదాకా ద్రోణుల ప్రభావంతో ఒకట్రెండు రోజులు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసి కాస్త చల్లబరచినా మళ్లీ వడగాడ్పులు విజృంభిస్తాయి. ఇప్పటికన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. కొన్నిచోట్ల 47 డిగ్రీల వరకు నమోదై నిప్పుల కొలిమిని తలపిస్తాయి. రానున్న రెండు మూడు రోజుల్లోనే వీటి పెరుగుదల మొదలవుతుంది. మరోవైపు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు మంచి వర్షాలనే కురిపిస్తాయి. ముందుగా ఊహించినట్టుగా ఎల్‌నినో (వర్షాభావ) భయం లేదు’’ – ఓఎస్ఆర్యూ భానుకుమార్, వాతావరణం, సముద్ర అధ్యయనవిభాగ మాజీ అధిపతి. ఏయూ -
ఇక వరుణుడి వంతు
సాక్షి, విశాఖపట్నం: కొన్నాళ్లుగా భగభగ మండు తున్న భానుడు కాస్త శాంతించాడు. మరో రెండు, మూడు రోజులు ఉష్ణతాపం నుంచి తాత్కాలికంగా ఉపశమనం కలిగించనున్నాడు. అయితే, అకాల వర్షాల రూపంలో వరుణుడు ప్రతాపం చూపనున్నాడు. పిడుగుల వర్షాన్ని కురిపించ నున్నాడు. తెలంగాణ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు రాయలసీమ, తమిళనాడు మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ఫలితంగా రెండు రోజులపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో తేలికపాటి జల్లులు లేదా వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాంధ్రలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో గంటకు 40నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం రాత్రి తెలిపింది. ఇదే సమయంలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర కోస్తాలో కొన్నిచోట్ల వర్షంతో పాటు పిడుగులు పడే ప్రమాదం ఉందని, ఆయా ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. సోమవారం పలుచోట్ల దాదాపు సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా కర్నూలులో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే 2 డిగ్రీలు మాత్రమే ఎక్కువ. ఇదిలావుండగా.. సోమవారం వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 8 మంది మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు, తూర్పు గోదావరి జిల్లాలో ఇద్దరు, విశాఖపట్నం జిల్లాలో ఒకరు మరణించారు. -
నిప్పుల కుంపటిలా రాష్ట్రం!
సాక్షి, అమరావతి/విశాఖ సిటీ: రోహిణి రాలేదు.. అయినా రోళ్లు పగిలే ఎండలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. రోడ్లు కొలిమిలా మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఈ నెల మొదటి వారంలోనే భగభగ మండేలా ఎండలు వేస్తుండటంతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి తలెత్తుతోంది. పొడి వాతావరణం, వేడిగాలులు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్నీ ఉక్కిరిబిక్కిరికి గురిచేస్తున్నాయి. సాధారణంగా ప్రతి వేసవిలో రాయలసీమలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. కానీ.. ఈసారి కోస్తా, రాయలసీమ అనే తేడా లేకుండా భానుడి భగభగలకు అన్ని జిల్లాలూ మలమలా మాడిపోతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే మొదలవుతున్న ఉక్కపోత సాయంత్రం 7 గంటలు దాటినా తగ్గడం లేదు. ఆదివారం కృష్ణా, గుంటూరుతోపాటు ఉభయగోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో వడగాలులు బలంగా వీచాయి. రాష్ట్రంలో ప్రతి చోటా సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అనేక ప్రాంతాల్లో 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్‌పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత రెండు రోజులుగా పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో గరిష్టంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. రాష్ట్రం నిప్పుల కుంపటిగా మారిందనడానికి ఈ గణాంకాలే ప్రత్యక్ష నిదర్శనాలు. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ మధ్యాహ్నం 10 గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గే వరకూ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని వాతావరణ నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు. మరో మూడు రోజులు వడగాలులు తొమ్మిది జిల్లాల్లో మరో మూడు రోజులు వడగాలులు నమోదయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రజలను హెచ్చరించింది. ‘కృష్ణా, గుంటూరు, ప్రకాశం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, కర్నూలు, వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో 6 నుంచి 8 తేదీ వరకూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అందువల్ల వడగాలుల ముప్పు ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలి’ అని ఐఎండీ వెబ్సైట్లో పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ శాఖ కూడా ప్రజలను, ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని ఇదే విషయమై అప్రమత్తం చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) కూడా ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేసింది. చెట్ల కింద సేదదీరుతున్న వ్యవసాయ కూలీలు ఉదయం 11 గంటల తర్వాత ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నవారికి తగులుతున్న వేడిగాలులు వడదెబ్బబారిన పడేలా చేస్తున్నాయి. వ్యవసాయ కూలీలు ఎండను భరించలేక ఆముదం ఆకులు, రాగి ఆకులను తలపాగాగా చుట్టుకుని పనిచేస్తున్నారు. గతంలో సాయంత్రం వరకూ వ్యవసాయ పనులు చేసే కూలీలు పెరిగిన వేడిని భరించలేక మధ్యాహ్నం 12 గంటలకే పనులు ఆపేసి చెట్ల నీడన సేదదీరుతున్నారు. ‘పైన సూరీడు, కింద భూమాత తాపానికి తట్టుకోలేక పనివేళలు మార్చుకున్నాం. తెల్లవారుజామునే పొల్లాల్లోకి చేరుకుని పనులు ప్రారంభించి మధ్యాహ్నం 12 గంటలకే ఆపేస్తున్నాం. ఆ తర్వాత ఎండలో పనిచేస్తే వడదెబ్బకు పడిపోవాల్సి వచ్చేలా పరిస్థితి ఉంది. ఆముదం, రావి, కానుగ ఆకులను తలపాగాగా చుట్టుకుని పనిచేస్తున్నాం. మధ్యాహ్నం భోజన సమయంలో తీస్తే ఆకులు రంగుమారిపోతున్నాయి. ఎండ తీవ్రత అధికంగా ఉందనడానికి ఇది నిదర్శనం’ అని గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన కూరపాటి వరప్రసాద్ అన్నారు. కూల్.. కూల్.. వేడి తీవ్రత పెరిగిన నేపథ్యంలో కొబ్బరి బోండాలకు బాగా గిరాకీ పెరిగింది. పండ్ల రసాలు, శీతల పానీయాల దుకాణాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మజ్జిగ విక్రయాలు గతంలో పోల్చితే రెండు రెట్లు పెరిగా>యని తిరుపతి రైల్వేస్టేషన్ సమీపంలోని శీతల పానీయాల దుకాణం యజమాని వెంకటేశ్ ‘సాక్షి’కి తెలిపారు. రహదారులపై శీతల పానీయాలు, నన్నారి, సాల్ట్ సోడా, సుగంధ షర్బత్ అమ్మే దుకాణాలు భారీగా పెరిగాయి. జ్యూస్ కోసం పుచ్చకాయలు, అనాస, చీనీ, ద్రాక్ష, అరటి పండ్లకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు పేర్కొన్నారు. ఎండ పెరిగిన నేపథ్యంలో టోపీలకు కూడా డిమాండ్ పెరిగింది. మహిళలు గొడుగులతో రక్షణ పొందుతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లే మహిళలు, యువతులు స్కార్ప్ చుట్టుకుని కళ్లకు రక్షణ కోసం చలువ అద్దాలు ధరిస్తున్నారు. పురుషులు కూడా తలకు నూలు వస్త్రం చుట్టి హెల్మెట్ ధరించడం ద్వారా కొంతవరకు ఉపశమనం పొందుతున్నారు. కుండనీరే ఉత్తమం వేసవి నేపథ్యంలో రిఫ్రిజిరేటర్లోని నీటి కంటే మట్టి కుండలోని చల్లని నీరు సేవించడం అత్యుత్తమమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘ఎండ వల్ల డీహైడ్రేషన్ (చెమట రూపంలో లవణాలు బయటకు వెళ్లడం) ఎక్కువగా ఉంటుంది. పోయిన లవణాలకు ప్రత్యామ్నాయంగా శరీరానికి అందించేందుకు వీలుగా ఉప్పు కలిపిన మజ్జిగ, ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మకాయ రసం కలిపిన నీరు ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది. వేడివల్ల వృద్ధులు, పిల్లలు ఎక్కువగా బడలికకు గురవుతారు. అందువల్ల కొబ్బరి నీరు, మజ్జిగ వీలైనన్ని ఎక్కువసార్లు తీసుకోవడం ఉత్తమం. ఇళ్లలో కూడా వేడి ఎక్కువగా ఉన్నట్లైతే కిటికీలకు జనపనార గోనె సంచులు, లేదా వట్టి వేళ్ల చాపలు కట్టి చల్లని నీరు చల్లాలి. దీనివల్ల గది వాతావరణం కొంత వరకూ చల్లగా అవుతుంది. ముతక రంగు వస్త్రాలు వేడిని ఆకర్షిస్తాయి. అందువల్ల వదులైన తెల్లని లేదా లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించాలి. సాధ్యమైనంత వరకూ ఎండ సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. వృద్ధులు, గర్భిణులు, గుండె, ఊపిరితిత్తుల సమస్యలున్నవారు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి’ అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగత్రలు రాష్ట్రంలోని అనేక చోట్ల ఆదివారం 46 డిగ్రీల సెల్సియస్‌కు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయిదు జిల్లాల పరిధిలోని 20 ప్రాంతాల్లోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో ఆదివారం 46 డిగ్రీల సెల్సియస్ పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయయిన రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ఆదివారం విజయవాడలో 45.6 , ఒంగోలులో 44.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణ్రోగ్రత నమోదైనట్లు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. ఎండలు భగభగ మండుతున్నాయనడానికి ఈ గణాంకాలే నిదర్శనాలు. వడదెబ్బకు 19 మంది మృతి రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రం విలవిలాడిపోతోంది. ఓవైపు ఎండవేడి మరోవైపు ఉక్కపోత జనాలకు ఊపిరాడనీయకుండా చేస్తోంది. నానాటికీ వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. దీంతో వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు అల్లాడిపోతున్నారు. శని, ఆదివారాల్లోనే రాష్ట్రంలో పందొమ్మిదిమంది మృత్యువాత పడ్డారంటేనే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది. గుంటూరు జిల్లాలో నలుగురు, తూర్పుగోదావరి జిల్లాలో వృద్ధ దంపతులు, అనంతపురం జిల్లాలో ముగ్గురు, చిత్తూరు జిల్లాలో ముగ్గురు, ప్రకాశం జిల్లాలో ముగ్గురు, శ్రీకాకుళం, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వడదెబ్బ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. గుంటూరు జిల్లా కొల్లూరు మండలం ఈపూరుకు చెందిన కొల్లి అంజయ్య (53) తన ఇంటి సమీపంలోని టీ స్టాల్ వద్ద టీ తాగుతూ కుప్పకూలిపోయి ప్రాణాలు కోల్పోయాడు. అలాగే నగరం మండలం వెనిగళ్లవారిపాలేనికి చెందిన కర్రా వెంకట సుబ్బారావు (60) అస్వస్థతకు గురై మృతి చెందాడు. అదే విధంగా దాచేపల్లి మండలం శ్రీనగర్‌కు చెందిన గోళ్ల శేషమ్మ (80), కొల్లూరుకు చెందిన గరికపాటి బసవపూర్ణమ్మ (62) వడదెబ్బకు తాళలేక మృతి చెందారు. వృద్ధ దంపతుల మృతి.. తూర్పు గోదావరి జిల్లాలో భార్య మృతి చెందిన అరగంటలోనే భర్త మృతి చెందడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ పాతకోరంగిలో రత్నాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో నివసిస్తున్న దంపతులు గుబ్బల కామరాజు (75), సుభద్రమ్మ (70) కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం ఎండ ప్రభావం ఎక్కువగా ఉండడంతో వడదెబ్బ బారిన పడ్డారు. రాత్రి నుంచీ అనారోగ్యంగా ఉండడంతో సుభద్రమ్మ ఆదివారం ఉదయం కన్నుమూసింది. భార్య మృతిని జీర్ణించుకోలేని కామరాజు అరగంట గడవకుండానే కుప్పకూలిపోయి మృతి చెందాడు. అనంతలో ముగ్గురు.. అనంతపురం జిల్లా గుత్తిలోని అంబేడ్కర్ కాలనీకి చెందిన తపిల నాగేశ్వరరావు (62), బత్తలపల్లి ప్రభుత్వాస్పత్రి ఉద్యోగి పెద్దన్న (60), కొత్త చెరువుకు చెందిన గోవిందు (43) వడదెబ్బకు మృతి చెందారు. కాగా, చిత్తూరు జిల్లాలో ముగ్గురు మరణించారు. పిచ్చాటూరు మండలంలోని సీరామాపురం ఏఎడబ్ల్యూ గ్రామానికి చెందిన రాంబాబు (49), పిచ్చాటూరుకు చెందిన మణి మొదలియార్ (65), కార్వేటినగరంలో కోటదళితవాడకు చెందిన టి.పురుషోత్తం (60) మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లాలో ముగ్గురు.. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన దర్శనం కోటయ్య (70), గిద్దలూరు అర్బన్ కాలనీలో 55 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి, ఇంకొల్లులో అబ్దుల్ జబ్బార్ (78) మృతి చెందారు. శ్రీకాకుళంలో వృద్ధుడి మృతి.. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని కొరసవాడ గ్రామానికి చెందిన ఈద్దుం కర్రయ్య (88) వడదెబ్బకు గురై మృతి చెందినట్లు ఎస్ఐ ఇ.చిన్నంనాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తామరాపల్లికి చెందిన వృద్ధుడు సారిపల్లి దేవుడు(60) మృతిచెందాడు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం కాకావారిపాళేనికి చెందిన గిరిజనుడు మీరయ్య(62) వీడదెబ్బకు మృత్యువాత పడ్డాడు. వైఎస్సార్ జిల్లాలో యువకుడి మృతి.. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని నడింపల్లె ప్రాంతానికి చెందిన టి.నాగేంద్ర (33) స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో మృతి చెందాడు. -
సీఎస్ మార్గనిర్దేశంతో తగ్గిన ఆస్తి నష్టం
సాక్షి, అమరావతి: ఎలాంటి హడావిడి లేకుండా అధికార యంత్రాంగాన్ని తమ పని తాము చేసుకోనిస్తే అద్భుత ఫలితాలుంటాయనడానికి ‘ఫొని’ తుపాను సందర్భంగా జరిగిన పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. ‘రేయింబవళ్లు సమీక్షలు లేవు.. అది చేయండి.. ఇది చేయండి.. ఇలా కాదు.. అలా కాదు.. అనే సీఎం చంద్రబాబు హడావిడి అసలే లేదు.. మంత్రులు, సీఎం పర్యటనలు లేవు.. తుపాను సన్నద్ధత, బాధితులకు సహాయ కార్యక్రమాలను గాలికొదిలి సీఎం బాబు కోసం నిరీక్షణ అంతకన్నా లేదు.. వెరసి ఉత్తరాంధ్రలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు ఎవరి బాధ్యతలు వారు పక్కాగా నిర్వహించారు. లోతట్టు ప్రాంతాల్లో, పునరావాస ప్రాంతాల్లో ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవాలి? సన్నద్ధత ఎలా ఉండాలి? అనే అంశాలపై వివిధ కీలక హోదాల్లో పని చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్మహ్యణ్యంకు ఉన్న అనుభవం ఇప్పుడు ఫొని తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఉత్తరాంధ్ర అధికార యంత్రాంగానికి బాగా ఉపయోగపడింది. ‘తుపాను ప్రభావం చూపడానికి రెండు మూడు రోజుల ముందే సీనియర్ అధికారులు, ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు. ఎక్కడెక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో స్పష్టంగా వివరించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ముందే తెలిసినందున జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. నిత్యావసర సరుకులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇలా అన్ని అంశాలపై అధికారులకు తన అనుభవంతో ఎల్వీ సుబ్రహ్మణ్యం మార్గనిర్దేశం చేశారు. సంబంధిత అధికారులంతా అంకిత భావంతో పనిచేశారు. దీంతో ఎక్కడా ఎలాంటి సమస్య లేకుండా సహాయ కార్యక్రమాలన్నీ సజావుగా సాగాయి. హడావిడి మాటే లేదు. ఎక్కడెక్కడ ఏయే పనులు చేయాలో అవన్నీ యథా ప్రకారం జరిగిపోయాయి. తుపాను తీరం దాటిన రెండో రోజుకే ప్రభావిత ప్రాంతాల్లో దాదాపుగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేశారు. మార్గనిర్దేశం బాగుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి’ అని క్షేత్ర స్థాయి అధికారులతోపాటు ఐఏఎస్ అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. విపత్తు నియమావళి చెప్పిందదే.. ‘విపత్తులు సంభవించినప్పుడు క్షేత్ర స్థాయి అధికారులను ఎవరి పని వారు చేసుకోనివ్వాలి. వీఐపీలు, ప్రజా ప్రతినిధులు వెళ్లి హడావిడి చేస్తే బాధితులకు సేవలు పక్కన పెట్టి అధికారులు, వీరి వెంట పరుగులు తీయాల్సి వస్తుంది. ఇది సహాయ కార్యక్రమాలకు ప్రతికూలంగా మారుతుంది. అందువల్ల విపత్తులు సంభవించినప్పుడు ప్రజా ప్రతినిధులు, వీఐపీలు సాధ్యమైనంత వరకు ఆ ప్రాంతాల పర్యటనలు పెట్టుకోరాదు’ అని విపత్తు నిర్వహణ నియమావళి స్పష్టంగా చెబుతోంది. సీఎం చంద్రబాబు ప్రచార యావతో దీనికి విరుద్ధంగా వ్యవహరించడం రివాజుగా మారింది. 2014 అక్టోబర్‌లో హుద్ హుద్ తుపాను సందర్భంగా చంద్రబాబు విశాఖలో మకాం వేసి సహాయ కార్యక్రమాలకు అంతరాయం కలిగించారు. గత ఏడాది అక్టోబర్‌లో ‘తిత్లీ’ తుపాను సందర్భంగానూ ఇలాగే హడావిడి చేశారు. అధికారులంతా ఆయన వెంట తిరిగేందుకు ప్రాధాన్యం ఇవ్వక తప్పలేదు. దీంతో వారాల తరబడి నిత్యావసర సరుకులు, తాగునీరు సైతం అందక బాధితులు ధర్నాలకు దిగడం తెలిసిందే. ఐఎండీపై ఐక్యరాజ్యసమితి ప్రశంసల జల్లు ‘ఫొని’ తుపాను ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందనే విషయంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అత్యంత కచ్చితమైన ముందస్తు అంచనాతో భారత ప్రభుత్వం చాలా వరకు నష్టాన్ని తగ్గించగలిగిందని ఐక్యరాజ్య సమితి ప్రశంసించింది. చక్కటి అంచనాలతో ప్రజలను, ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం వల్లే ఆస్తి, ప్రాణ నష్టం బాగా తగ్గిందని ఐక్యరాజ్యసమితికి చెందిన డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆర్గనైజేషన్ ఓ ప్రకటనలో కొనియాడింది. తుపాను.. తీరం ఎక్కడ దాటుతుంది? ఈ సమయంలో ఎంత వేగంతో గాలులు వీస్తాయి? దాని ప్రభావం ఎంత వరకు ఉంటుందనే అంశాలన్నింటినీ చాలా ముందుగా అత్యంత కచ్చితంగా ఐఎండీ అంచనాలు వేసిందని, అందువల్లే ప్రభుత్వం 11 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు చేరవేయగలిగిందని ప్రశంసించింది. ఈ మేరకు ఐఎండీకి లేఖ పంపినట్లు తమకు సమాచారం అందిందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజే రమేష్ ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల్లో హర్షం ఒడిశాను అతలాకుతలం చేసిన ఫొని తుపాన్ వల్ల రాష్ట్రంలో ఎక్కువ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుందని ఉత్తరాంధ్ర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘పెనుగాలులకు స్తంభాలు వంగిపోవడం, వైర్లు తెగిపోవడం లాంటి కారణాలవల్ల 740 గ్రామాలకు విద్యుత్తు సరఫరా ఆగిపోయినా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి శనివారం ఒక్కరోజే అత్యధిక గ్రామాలకు సరఫరాను పునరుద్ధరించారు. గాలుల వేగం ఎలా ఉంటుంది? వర్షం ఏ మోతాదులో కురుస్తుందనే అంశాలపై ఐఎండీ ఇచ్చిన అంచనాల మేరకు సీఎస్ మార్గనిర్దేశం వల్ల పెద్దగా నష్టం చేకూరలేదు. రెండు మూడు రోజుల్లోనే సాధారణ పరిస్థితి ఏర్పడనుంది. పంట నష్టపోయిన వారికి పెట్టుబడి సాయం తర్వాత అందిస్తారు’ అని విపత్తు నిర్వహణపై అపారమైన అనుభవం ఉన్న ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ‘సాక్షి’తో అన్నారు. -
నిప్పుల వాన
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: సూర్యుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. ఓవైపు కణకణ మండుతున్న సూర్యుడు, మరోవైపు భగభగమంటున్న భూతాపంతో వడగాడ్పుల తీవ్రత పెరుగుతోంది. నిప్పులు కక్కే ఎండలతో వడగాడ్పులు వీస్తున్నాయి. సాధారణం కంటే 4–7 డిగ్రీలు అధికంగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతూ జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం ఈ సీజన్లోనే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల 45 డిగ్రీల సెల్సియస్ పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉత్తర, వాయవ్య భారతదేశంలో ఉష్ణతీవ్రత ఎక్కువగా ఉంది. ఫొని తుపాను వాయవ్య, పశ్చిమ గాలులను తన వైపు లాక్కుంటోంది. ఫలితంగా చల్లదనాన్నిచ్చే దక్షిణ గాలులు వీయడం లేదు. ఫొని తుపాను పూర్తిగా బలహీన పడే దాకా గాలులు ఇలాగే కొనసాగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఫొని అల్పపీడనంగా మారాక మరో రెండు మూడు రోజుల వరకు సాధారణ స్థితికి వచ్చే అవకాశం లేదు. అంటే ఈ నెల పదో తేదీ వరకు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత అధికంగా ఉంటోంది. వేడి గాలులను తట్టుకోలేక జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో వేడిగాలులు అగ్నికీలల్లా తగులుతున్నాయి. వ్యవసాయ కూలీలు మధ్యాహ్నం 11–12 గంటల వరకే పనిచేసి, తర్వాత చెట్ల నీడకు వెళుతున్నారు. గర్భిణులు, గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు వేడికి తట్టుకోలేక అవస్థలు పడుతున్నారు. ఇంట్లోనే ఉన్నప్పటికీ భవనం పైకప్పు నుంచి, గోడల నుంచి వస్తున్న వేడి, ఉక్కపోతను తట్టుకోలేపోతున్నామని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రానున్న మూడు రోజులు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో పలుచోట్ల, విశాఖ, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. అంటే విజయనగం, శ్రీకాకుళం మినహా రాష్ట్రంలో అన్ని జిల్లాలకు వడగాడ్పులు తప్పవన్నమాట. వడగాడ్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకూ ఎండ సమయంలో బయటకు వెళ్లకపోవడం ఉత్తమమని ఐఎండీ సూచించింది. 47 డిగ్రీల దాకా నమోదు కానున్న ఉష్ణోగ్రతలు వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం.. ఈ నెల 5న (ఆదివారం) కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నెల 6న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 7న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో 45–47 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. విశాఖపట్నం, ఉభయ గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 42– 45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 8న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 44–45 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నెల 9న కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో 45–46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ప్రజలను చైతన్య పర్చండి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నందున వడగాడ్పులు తీవ్రమవుతాయని భారత వాతావరణ విభాగం హెచ్చరికలు జారీ చేసింది. వడగాడ్పుల బారిన పడకుండా ప్రజలను చైతన్య పరిచేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఆయా జిల్లాల అధికార యంత్రాంగాలను ఆదేశించింది. ఈ మేరకు విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి వరప్రసాద్ కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. వడగాడ్పుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విపత్తు నిర్వహణ శాఖ రూపొందించిన కరపత్రాలను పంపిణీ చేయాలని సూచించారు. జాగ్రత్తలు తప్పనిసరి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ప్రజలు.. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ఎండ సమయంలో సాధ్యమైనంత వరకూ బయటకు వెళ్లకుండా ఇళ్లల్లో గానీ, నీడపట్టున గానీ ఉండాలి. తప్పనిసరై బయటకు వెళ్లాల్సి వస్తే తలకు, ముఖానికి నేరుగా ఎండ తగలకుండా గొడుగు ఉపయోగించాలి. తెలుపు లేదా లేత రంగు నూలు వస్త్రాలు ధరించాలి. నీరు, మజ్జిగ, కొబ్బరినీరు లాంటివి సేవించాలి. డీహైడ్రేషన్ నుంచి రక్షణ కోసం ఉప్పు కలిపిన మజ్జిగ సేవించడం ఉత్తమం. ఇళ్లల్లో కూడా వేడి ఎక్కువగా ఉంటే గది వాతావరణాన్ని తగ్గించుకోవాలి. ఇందుకోసం కిటికీలకు వట్టివేర్ల తెరలను కట్టి నీరు చల్లాలి. ఒకవేళ ఎవరైనా వడదెబ్బకు గురైతే వెంటనే చల్లని ప్రదేశానికి తరలించి, గాలి తగిలేలా చూడాలి. చల్లని నీటిలో తడిపిన వస్త్రంతో శరీరాన్ని తుడవాలి. ఫ్యాన్ కింద ఉంచవచ్చు. అప్పటికీ కోలుకోలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. తగిన వైద్యం అందించాలి’’ అని నిపుణులు చెప్పారు. -
పూరీపై ‘ఫొని’ పంజా!
సాక్షి నెట్వర్క్/భువనేశ్వర్/పూరీ: ఆంధ్రప్రదేశ్‌కు ‘ఫొని’ తుపాను ముప్పు తప్పింది. బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ‘ఫొని’ శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒడిశాలోని పూరీ సమీపంలో ఎట్టకేలకు తీరాన్ని తాకింది. అక్కడే అధిక ప్రభావం చూపించింది. ఆ సమయంలో గంటకు 175–205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. తుపాను ధాటికి ఒడిశాలో ఎనిమిది మంది మరణించారు. తుపాను తీరాన్ని దాటాక అతితీవ్ర తుపానుగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రికి ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు నైరుతిగా 60 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు నైరుతి దిశగా 160 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించనుంది. తర్వాత మరింతగా బలహీనపడుతూ శనివారం నాటికి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి తుపానుగా, వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. పూరీ నగరం ఏరియల్ వ్యూ... పెనుగాలులు.. కుండపోత వర్షాలు.. ఫొని తుపాను ప్రభావంతో ఒడిశాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. పెనుగాలులు, భారీ వర్షాల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. పలు రహదారులు ధ్వంసమయ్యాయి. వేల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ నేపథ్యంలో ఒడిశావ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు సముద్ర తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. పూరీ క్షేత్రానికి వచ్చిన పర్యాటకులు వెంటనే నగరం విడిచి వెళ్లాలని అధికారులు చెప్పారు. తుపాను నేపథ్యంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య ప్రసాద్ పాఢి ఆయా జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే 11 వేల మందికి పైగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అధికారులు తెలిపారు. మొత్తం 900 సహాయ, పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశామన్నారు. రైళ్లు, విమానాలు రద్దు ఒడిశాలో ముందు జాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేశారు. కోల్‌కతా–చెన్నై మార్గంలో ప్రయాణించే 220కి పైగా రైళ్లను శనివారం వరకు రద్దు చేసినట్లు ఈస్టుకోస్టు రైల్వే అధికారులు వెల్లడించారు. భువనేశ్వర్, కోల్‌కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు రైల్వేశాఖ మూడు ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రధాన స్టేషన్లలోని స్టాళ్లలో ఆహార పదార్థాలు, తాగునీటిని సిద్ధంగా ఉంచినట్లు ప్రకటించింది. మరో మూడు రోజుల వరకు ఉద్యోగులు సెలవులు పెట్టొద్దని కోరింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వేస్టేషన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఫొని తుపాను గండం నుంచి బయటపడినా, భారీ వర్షాలు కురవడంతో ఒడిశాలో జన జీవనం స్తంభించిపోయింది. -
ఏపీకి తప్పిన పెను ముప్పు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం/సాక్షి నెట్వర్క్: ఐదారు రోజులుగా ఉత్తరాంధ్ర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ‘ఫొని’ తుపాను ముప్పు తప్పిపోయింది. ఈ తుపాను ప్రభావం వల్ల రాష్ట్రంలో ఎక్కడా పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదు. బంగాళాఖాతంలో దాదాపు పది రోజుల పాటు తుపానుగానే కొనసాగిన ‘ఫొని’ శుక్రవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒడిశాలోని పూరి సమీపంలో ఎట్టకేలకు తీరాన్ని తాకింది. అక్కడే అధిక ప్రభావం చూపించింది. ఆ సమయంలో గంటకు 175–205 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచాయి. తుపాను ధాటికి ఒడిశాలో ఎనిమిది మంది మరణించారు. తుపాను తీరాన్ని దాటాక అతి తీవ్ర తుపానుగా బలహీనపడి ఉత్తర ఈశాన్య దిశగా పయనిస్తోంది. శుక్రవారం రాత్రికి ఇది ఒడిశాలోని బాలాసోర్‌కు నైరుతిగా 60 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్‌కు నైరుతి దిశగా 160 కిలోమీటర్ల దూరంలోనూ కేంద్రీకృతమై ఉంది. ఇది ఉత్తర ఈశాన్య దిశగా కదులుతూ తీవ్ర తుపానుగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించనుంది. తర్వాత మరింతగా బలహీనపడుతూ శనివారం నాటికి బంగ్లాదేశ్‌లోకి ప్రవేశించి తుపానుగా, వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శుక్రవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. తుపాను దిశ ఇలా.. ఊపిరి పీల్చుకున్న ఉత్తరాంధ్ర పెను తుపాను వల్ల ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని కొద్దిరోజులుగా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. హుద్‌హుద్, తిత్లీ తుపానుల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ‘ఫొని’ ఎలాంటి ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుందోనని ఉత్తరాంధ్ర వాసులు క్షణమొక యుగంగా గడిపారు. శ్రీకాకుళం జిల్లా వాసులైతే మరింతగా హడలెత్తిపోయారు. కానీ, ఉత్తరాంధ్రలో పెద్దగా నష్టం లేకుండానే ఫొని తుపాను రాష్ట్రాన్ని దాటిపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలో రూ.38.43 కోట్ల నష్టం తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం జిల్లాలో రూ.38.43 కోట్ల నష్టం వాటిల్లినట్లు శుక్రవారం సాయంత్రానికి అధికారుల ప్రాథమిక అంచనాలో తేలింది. విద్యుత్తు స్తంభాలు ఒరిగిపోవడం, ఫీడర్లు దెబ్బతినడం, వైర్లు తెగిపోవడం వల్ల 733 గ్రామాల్లో కరెంటు సరఫరా ఆగిపోయింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. పెనుగాలులు వీచాయి. తీరానికి ఆనుకుని ఉన్న మండలాల్లో 100 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయడంతో ఉద్యాన పంటలకు ఎక్కువగా నష్టం వాటిల్లింది. అరటి, మామిడి, జీడిమామిడి, బొప్పాయి పంటలు దెబ్బతిన్నాయి. ఉద్ధానం ప్రాంతంలో 7,600 కొబ్బరి చెట్లు కూలిపోయాయి. 187 హెక్టార్లలో వరి పంట దెబ్బతింది. వేరుశనగ, వంగ, పత్తి, జొన్న, మొక్కజొన్న, కొర్ర, రాగి, పొద్దుతిరుగుడు, పొగాకు తదితర పంటలు ధ్వంసమయ్యాయి. 162 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆర్అండ్బీ శాఖ పరిధిలో 141.6 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. తుపాను హెచ్చరికలతో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం ముందుగానే అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సముద్ర తీరం, లోతట్టు గ్రామాల్లోని సుమారు 3,334 కుటుంబాలను 142 పునరావాస కేంద్రాలకు తరలించారు. మరోవైపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాలు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రహదారులపై కూలిపోయిన చెట్లను తొలగించాయి. శ్రీకాకుళం జిల్లాకు తుపాను ముప్పు తప్పిపోయిందని కలెక్టర్ జె.నివాస్ శుక్రవారం ప్రకటించారు. విజయనగరం జిల్లాలో ప్రభావం స్వల్పమే ఫొని తుపాను ప్రభావం విజయనగరం జిల్లాలో స్వల్పంగానే కనిపించింది. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి ఎక్కడా పెద్దగా గాలులు వీయలేదు. పార్వతీపురం డివిజన్లో స్వల్పంగా గాలి వీచినా నష్టం కలిగించలేదు. తీరప్రాంతంలో అలలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఇక ఎలాంటి ముప్పు లేదని గ్రహించిన అధికారులు పునరావాస కేంద్రాల్లో ఉన్న 2 వేల మందిని వారి స్వగ్రామాలకు పంపించారు. నెల్లిమర్లలో ముద్దుర్తి శ్రీను(34) అనే వ్యక్తి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. గురువారం రాత్రి వీచిన ఈదురు గాలులకు మామిడి పంట నేలమట్టమైంది. తెర్లాం, మెరకముడిదాం, చీపురుపల్లి, గరివిడి, గుర్ల, నెల్లిమర్ల, పూసపాటిరేగ, డెంకాడ, భోగాపురం మండలాల్లో వందలాది ఎకరాల్లో మామిడితోటలు ధ్వంసమయ్యాయి. పలు మండలాల్లో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. అరటి చెట్లు కూడా విరిగిపోయాయి. కొన్ని చోట్ల ఇళ్లు కూలిపోయాయి. రహదారులు దెబ్బతిన్నాయి. ఫొని తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో రూ.6.09 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు జిల్లాలో కేవలం 12.1 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. కొనసాగుతున్న రైళ్ల రద్దు తుపాను ప్రభావం వల్ల పలు రైళ్లను శనివారం కూడా రద్దు చేసినట్లు, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు వాల్తేరు డివిజన్ అధికారులు తెలిపారు. రైళ్ల రద్దు గురించి ముందే తెలుసుకున్న ప్రజలు ప్రయాణాలను రద్దు చేసుకోవడమో, వాయిదా వేసుకోవడమే చేశారు. కానీ, అప్పటికే బయల్దేరి రైళ్లలో ఉన్న ప్రయాణికులు శుక్రవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రైల్వే శాఖ పూర్తి టికెట్ రిఫండ్ అందజేసింది. విశాఖపట్నం నుంచి భువనేశ్వర్, హౌరా వెళ్లే ప్రయాణకులు రైల్వేస్టేషన్లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. రైళ్లు ఎప్పుడు నడుస్తాయో తెలియక స్టేషన్లో వేచి చూస్తున్నారు. ఐఎండీ అంచనాలు భేష్ భారత వాతావరణ విభాగం(ఐఎండీ) అంచనాలు మరోసారి నిజమయ్యాయి. ఏప్రిల్ 25న ఏర్పడిన అల్పపీడనం దశల వారీగా ఎలా బలపడుతుంతో ఐఎండీ తెలియజేసింది. తొలుత తుపాను ఉత్తర తమిళనాడు– దక్షిణ కోస్తాంధ్ర తీరం వైపు పయనించి, ఆ తర్వాత ఉత్తర–ఈశాన్య దిశగా పయనిస్తుందని వెల్లడించింది. ఈ తుపాను తీవ్రరూపం దాల్చి పెనుతుపానుగా మారుతుందని పేర్కొంది. తుపాను పెనుతుపానుగానే ఒడిశాలోని పూరి సమీపంలో శుక్రవారం ఉదయం తీరాన్ని దాటుతుందని ఐదు రోజుల క్రితమే ప్రకటించింది. ఐఎండీ అంచనా వేసినట్లు కచ్చితంగా పూరి వద్ద శుక్రవారం తుపాను తీరాన్ని దాటింది. ఐఎండీ శాస్త్రవేత్తల అంచనాలు నిజం కావడంపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పూరి ఏరియల్ వ్యూ చిత్రీకరించిన నౌకాదళం ఫొని తుపాను ప్రభావంతో అతలాకుతలమైన పూరి పరిసర ప్రాంతాల పరిస్థితిని భారత నౌకాదళం సమీక్షించింది. తూర్పు నౌకాదళానికి చెందిన రెండు డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో తుపాను ప్రభావానికి సంబంధించిన ఏరియల్ వ్యూని శుక్రవారం చిత్రీకరించింది. ముంపునకు గురైన ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలు, వీడియోలను సేకరించింది. లక్షల సంఖ్యలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన దృశ్యాలు, వరద ముంపులో ఉన్న రహదారుల ఫోటోలతో పాటు పూరి, చిల్కా సరస్సు మధ్య ప్రాంతాల్లో తుపాను కారణంగా నెలకొన్న విషాద పరిస్థితులకు సంబంధించిన ఫుటేజీని నేవీ బృందాలు ఒడిశా ప్రభుత్వానికి అప్పగించాయి. ఈ ఫుటేజీ ఆధారంగా సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు ఆస్కారం ఉంటుందని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. -
తీరంలో క్షణక్షణం భయం భయం
సాక్షి నెట్వర్క్: ఫొని తుపాను ప్రభావంతో ఉగ్రరూపం దాల్చిన బంగాళాఖాతం గ్రామాలపై విరుచుకు పడుతోంది. ఎప్పుడేం జరుగుతుందో తెలియక తీర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. పలు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పండ్ల తోటలు ధ్వంసమయ్యాయి. గురువారం ఉదయం నుంచి సముద్ర కెరటాల ఉధృతి పెరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ, మాయాపట్నం, సూరాడపేట, పల్లిపేట, సుబ్బంపేట, కోనపాపపేట తదితర గ్రామాల్లో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ గాలుల ధాటికి దాదాపు 30 మత్స్యకారుల గృహాలు ధ్వంసమయ్యాయి. మత్స్యకారులు ఇతర ప్రాంతాల్లో తలదాచుకోడానికి తరలి వెళుతున్నారు. తీరప్రాంతాన్ని ఆనుకుని ఉన్న ఇళ్లు దెబ్బతింటున్నాయి. కాకినాడ లైట్‌హౌస్ నుంచి ఉప్పాడ వరకు ఉన్న బీచ్‌రోడ్డుపై సముద్ర కెరటాలు సుమారు ఐదు మీటర్ల ఎత్తున ఎగసి పడుతున్నాయి. బీచ్‌రోడ్డు కోతకు గురవుతూ ప్రమాదకరంగా మారింది. కొత్తపల్లి మండలం పొన్నాడ శివారులోని కోనపాపపేట కెరటాల ఉధృతికి కొట్టుకుపోతుండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాజోలు నియోజకవర్గంలోని అంతర్వేది బీచ్‌లో సముద్రం 300 మీటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. ఇప్పటికే కోత దశకు చేరుకుంటున్న వరి పంట భారీ వర్షాలు, ఈదురు గాలులకు నేలకొరిగే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లాలో భారీగా ఈదురు గాలులు విజయనగరం జిల్లాలో ఫొని తుపాను ప్రతాపం చూపిస్తోంది. సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. కొన్ని గ్రామాల వద్ద సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. జిల్లాలో గురువారం భారీగా ఈదురుగాలులు వీచాయి. సముద్ర తీర ప్రాంతాలైన పూసపాటిరేగ, భోగాపురంతోపాటు డెంకాడ, నెల్లిమర్ల, విజయనగరం, గుర్ల, చీపురుపల్లి, గరివిడి మండలాల్లో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. సాయంత్రం 5 గంటల నుంచి 70 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో గాలులు బీభత్సం సృష్టించాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జిల్లాలోని చాలా ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. తీర ప్రాంతాల్లో ఉన్న ఆరు గ్రామాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. దాదాపు 2 వేల మందికి భోజనం, వసతి సౌకర్యాలు కల్పించారు. శ్రీకాకుళం జిల్లాలో 126 పునరావాస కేంద్రాలు తిత్లీ తుపాను తాకిడితో అల్లాడిన శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతానికి ‘ఫొని’ రూపంలో మరో ముప్పు ఏర్పడింది. ఈ తుపాను ప్రభావంతో గురువారం మధ్యాహ్నం నుంచి జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. సాయంత్రానికి ఈదురు గాలులు మరింత ఉధృతమయ్యాయి. తుపాను తీరం దాటిన తర్వాత గంటకు 160 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుంచి కలెక్టర్ జె.నివాస్ ఎప్పటికప్పుడు పరిస్థితులను, సహాయక పునరావాస చర్యలను పర్యవేక్షిస్తున్నారు. బాధితుల కోసం జిల్లాలో 126 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వంశధార, నాగావళి, బాహుదా నదులకు వరద ముంపు ప్రమాదం ఉన్నందున పరివాహక గ్రామాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టారు. గురువారం శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా 412 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నందిగాం, టెక్కలి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లో ఎక్కువగా వర్షం కురిసింది. టెక్కలి మండలం భగీరథిపేట గ్రామానికి చెందిన జనపాన ఈశ్వరమ్మ(65) అనే మహిళ భారీ ఈదురు గాలులకు భయపడి గుండె ఆగి మృతి చెందింది. గుంటూరు జిల్లాలో బీభత్సం తుపాను కారణంగా గుంటూరు జిల్లాలో గురువారం రాత్రి ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. మిర్చి, మామిడి, అరటి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రత్తిపాడు ప్రాంతంలో కల్లాల్లో ఉన్న మిర్చి రాశులు తడిసిపోయాయి. రైతులు ముందు జాగ్రత్తగా పట్టాలు కప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈదురుగాలులకు పట్టాలు లేచిపోయి మిర్చి తడిసిపోయింది. యడ్లపాడు మండలంలో మామిడి తోటల్లో కాయలు రాలిపోయాయి. అరటి తోటలు విరిగి పడిపోయాయి. వినుకొండ, ఈపూరు, బొల్లాపల్లి, క్రోసూరు, బెల్లంకొండ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలుల ధాటికి విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి 11 విమానాలు రద్దు విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లాల్సిన 11 విమానాలను తుపాను ప్రభావం వల్ల ఈదురు గాలులు, వాతావరణం అనుకూలించకపోవడంతో రద్దు చేశారు. ఒక విమానాన్ని దారి మళ్లించారు. ప్రయాణికులతో సందడిగా ఉండే విశాఖ విమానాశ్రయం గురువారం బోసిపోయింది. ఇక్కడి నుంచి 28 విమానాలు రాకపోకలు సాగించాల్సి ఉండగా 11 ఇండిగో విమానాలు రద్దయ్యాయని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన సర్వీసులు యథాతథంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షాలు ఫొని తుపాను ప్రభావంతో శుక్రవారం నుంచి ఒడిశాలోని గంజాం, గజపతి, ఖుర్దా, పూరీ, జగత్సింగ్పూర్, కేంద్రపార, భద్రక్, జైపూర్, బాలాసోర్, పశ్చిమ బెంగాల్‌లోని తూర్పు, పశ్చిమ మేదినపూర్, దక్షిణ, ఉత్తర 24 పరగణాలు, హౌరా, హూగ్లీ, ఝార్గ్రామ్, కోల్‌కతా, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం ప్రకటించింది. ఫొని తుపాను వాయువేగంతో ఒడిశా తీరం వైపు దూసుకొచ్చింది. తీర ప్రాంతంలో గురువారం విపరీతంగా ఈదురు గాలులు, కుండపోత వర్షాలు కురిశాయి. ‘ఫొని’పై ప్రధాని మోదీ సమీక్ష సాక్షి, న్యూఢిల్లీ: ఫొని తుపాన్ ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశించారు. ఆయన గురువారం ఢిల్లీలో తుపాను సహాయక చర్యలను సమీక్షించారు. తుపాను గమనాన్ని అధికారులు ప్రధానమంత్రికి వివరించారు. ప్రస్తుతం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు, చేపడుతున్న సన్నాహక చర్యలను తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు తుపాను ప్రభావిత రాష్ట్రాల అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రధాని మోదీ సూచించారు. నష్ట నివారణ చర్యలను తీసుకోవాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వారికి వైద్య సహాయం అందజేయాలని చెప్పారు. విద్యుత్తు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థకు విఘాతం కలిగితే వెంటనే పునరుద్ధరించాలన్నారు. ఫొని తుపానుపై న్యూఢిల్లీలోని తన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ -
ఫొని తుపాను : తిత్లీ కంటే ప్రమాదకరమైనది..!
భువనేశ్వర్ : అతి తీవ్ర తుపానుగా మారిన ఫొని తీరం వైపు దూసుకొస్తోంది. గంటకు 200 కి.మీ వేగంతో శుక్రవారం గోపాల్పూర్-చాంద్‌బలి (ఒడిశా) దగ్గర తీరం దాటే అవకాశం వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. 500 కి.మీ విస్తీర్ణంతో పూరీకి 680 కి.మీ, విశాఖకు 430 కి.మీ దూరంలో ఫొని కేంద్రీకృమై ఉందని ఐఎండీ తెలిపింది. భారీ తుపాను నేపథ్యంలో ఒడిశాలో హై అలర్ట్ ప్రకటించారు. టూరిస్టులందరూ పూరీ విడిచి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక గంటకు 22 కి.మీ వేగంతో కదులుతున్న ఫొని నేటి నుంచి దిశ మార్చుకుని పయనించే అవకాముందని ఐఎండీ అంచనా వేసింది. (చదవండి : ‘ఫొని’ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం) ఫొని ప్రభావంతో బంగాళాఖాతం అల్లకల్లోలంగా మారింది. తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. జాలర్లు చేపట వేటకు వెళ్లరాదని హెచ్చరిక జారీ అయ్యాయి. శ్రీకాకుళం జిల్లా సోంపేట బారువ తీర ప్రాంతం ఉంచి ఎర్రముక్కం వరకు అలల ఉధృతి పెరిగింది. తీరంలో 10 నుంచి 20 మీటర్లు సముద్రం ముందుకొచ్చింది. తుపాను ప్రభావంతో రేపు, ఎల్లుండి శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అతిభారీ వర్షాలు, విశాఖలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఒడిశాలో 20 సెం.మీ కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశముందని, పశ్చిమ బంగలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. బంగాళాఖాతం వేడెక్కడం వల్లే ఈ ఫొని పెనుతుపానుగా మారిందని ఐఎండీ ప్రకటించింది. అప్డేట్స్ : తిత్లీని మించి.. ఫొని తుపాను తిత్లీ తుపాను కంటే ప్రమాదకరమైనదని ప్రాంతీయ వాతావరణ శాఖ డైరెక్టర్ హెచ్ బిశ్వాస్ అభిప్రాయపడ్డారు. గతేడాది ఉత్తరాంధ్ర, ఒడిశాపై తిత్లీ విరుచుకుపడడంతో 60 మందికి పైగా మృతిచెందిన సంగతి తెలిసిందే. ఎంసీసీ ఎత్తివేత : ‘ఫొని’ సహాయక చర్యలకు ఆటంకాలు కలగకుండా ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టింది. ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో ఎన్నికల కోడ్ (ఎంసీసీ)ను ఎత్తేసింది. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష : ఫొని తుపాను సహాయక చర్యలపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గండ్లు పడే చోట పునర్నిర్మాణం చేపట్టాలని సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.శ్రీనివాస్ సమీక్ష : రేపు, ఎల్లుండి జిల్లా వ్యాప్తంగా... భారీ ఉంచి అతిభారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. గంటలకు 100-120 కి.మీ వేంగంతో గాలులు వీచే అవకాశముంది. ‘ఫొని’తో అరటి, కొబ్బరి ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం కలగనుంది. వీలైనంత త్వరగా కోతకోసి పంటలను భద్రపరచుకోవాలి. ఐదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాం. అధికారుల సెలవున్నింటినీ రద్దు చేశాం. 6 వేల ఎలక్ట్రికల్ పోల్స్ సిద్ధంగా ఉంచాం. కమ్యునికేషన్ సిబ్బందిని కూడా అలర్ట్ చేశాం. 48 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశాం. విశాఖ కలెక్టర్ కాటమనేని భాస్కర్ సమీక్ష : ఫొని తుపాన్‌ను ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉంది. రేపటి నుంచి 65 గ్రామాల్లో పునరావసం ఏర్పాటు చేస్తాం. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. -
‘ఫొని’ని ఎదుర్కొనేందుకు అప్రమత్తం
సాక్షి, అమరావతి: ‘ఫొని’ తుపానును ఎదుర్కొనేందుకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల యంత్రాంగాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పారు. ఫొని తుపాను ముప్పు పరిస్థితులపై కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా మంగళవారం ఢిల్లీ నుండి పుదుచ్చేరి, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సమీక్షించారు. తుపాను ప్రభావం మే 2, 3 తేదీల్లో ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై ఎక్కువగా ఉంటుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హా సమీక్ష సమావేశంలో వివరించారు. ఆయా రాష్ట్రాల యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని.. విద్యుత్, టెలికం సేవలకు అంతరాయం కలిగితే వెంటనే పునరుద్ధరించేలా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బందులు కలిగితే తక్షణ నీటి సరఫరా ఏర్పాట్లు చేసేందుకు తగిన స్టాండ్ బై జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. ఆయా రాష్ట్రాల్లో సేవలందించేందుకు ఎన్డీఆర్ఎఫ్, కోస్టుగార్డు, షిప్పింగ్, టెలికం సంస్థలు పూర్తిగా సిద్ధంగా ఉండాలని కేబినెట్ కార్యదర్శి సిన్హా ఆదేశించారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తుపాను ప్రభావం ఉండే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు మెన్ అండ్ మెటీరియల్‌ను తరలించి పూర్తి సన్నద్ధతో ఉన్నామని కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హాకు వివరించారు. తుపాను ప్రభావంతో మే 3, 4 తేదీల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో 13 సెం.మీ.ల వరకూ వర్షపాతం నమోదు అయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదులు వాటి పరివాహక ప్రాంతాల్లోని మైనర్ ఇరిగేషన్ చెరువులకు గండ్లు పడే అవకాశం ఉందని అలాంటి చోట్ల పూర్తి అప్రమత్తతో ఉండాలని ఇప్పటికే జిల్లా కలెక్టర్, పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. అవసరమైన ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే రోడ్ల వెంబడి చెట్లుపడి రవాణాకు అంతరాయం కలిగితే వెంటనే తొలగించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలిగి కొన్ని రైళ్లు నిర్దేశిత స్టేషన్లకు చేరేందుకు చాలా ఆలస్యం కావడం లేదా చిన్న చిన్న స్టేషన్లలో గంటల తరబడి నిలిచిపోవడం జరుగుతుందన్నారు. అలాంటి సమయంలో ప్రయాణికులు తాగునీరు, ఆహారానికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసేలా రైల్వే బోర్డుకు తగిన ఆదేశాలు జారీ చేయాలని సీఎస్ కేబినెట్ కార్యదర్శి పీకే సిన్హాకు సూచించారు. -
దూకుడు పెంచిన ‘ఫొని’
సాక్షి, విశాఖపట్నం: ఫొని తుపాను మరింత దూకుడు పెంచింది. అతి తీవ్ర తుపాను నుంచి పెను తుపానుగా మారి ఒడిశా వైపు దూసుకుపోతోంది. గంటకు 6–12 కిలోమీటర్ల వేగంతో సోమవారం వరకు పయనిం చిన ‘ఫొని’ మంగళవారం రెట్టింపు వేగంతో (22 కి.మీలు) కదులుతోంది. విశాఖకు దక్షిణ, ఆగ్నేయ దిశగా 510 కి.మీ.ల దూరంలో, ఒడిశాలోని పూరీకి దక్షిణ నైరుతి దిశగా 730 కిలోమీటర్ల దూరంలోనూ మంగళవారం రాత్రి కేంద్రీకృతమై ఉంది. ఈ తుపాను ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతోంది. వాయవ్య దిశగా పయనిస్తున్న ఈ పెను తుపాను బుధవారం ఉదయానికి మలుపు (రికర్వ్) తిరిగి ఉత్తర ఈశాన్య దిశ వైపు పయనించనుంది. క్రమంగా అదే దిశలో కదులుతూ ఒడిశాలోని గోపాల్పూర్–చాంద్‌బాలీల మధ్య దక్షిణ పూరీకి సమీపంలో మూడో తేదీ మధ్యాహ్నం పెను తుపానుగానే తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. అనంతరం క్రమంగా పశ్చిమ బెంగాల్ మీదుగా పయనించి బంగ్లాదేశ్‌లో మే 5న వాయుగుండంగా బలహీనపడనుందని వివరించింది. తుపాను తీరాన్ని దాటే సమయంలో గంటకు 205 కిలోమీటర్ల వేగంతో బలమైన పెనుగాలులు వీస్తాయని తెలిపింది. బుధ, గురు, శుక్రవారాల్లో పశ్చిమ మధ్య, నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తర కోస్తాంధ్రల తీరాలకు ఆనుకుని గంటకు 165–195 కిలోమీటర్ల వేగంతో పెనుగాలుల ఉధృతి ఉంటుందని పేర్కొంది. అదే సమయంలో బుధ, గురువారాల్లో ఉత్తర కోస్తాంధ్రలో గంటకు 60, శుక్ర, శనివారాల్లో 85–115 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. రానున్న మూడు రోజులు ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని తీరప్రాంతాల్లో గంటకు 170–200 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు విధ్వంసం సృష్టించనున్నాయి. కాగా, గురువారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో అతిభారీ వర్షాలు (20 సెం.మీలకు పైగా) కురవనున్నాయి. తుపాను గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఇళ్లు కూలిపోయే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. పెను తుపాను ఏకంగా నాలుగు రోజుల పాటు (ఈనెల 3 వరకు) కొనసాగుతుండడంవల్ల నష్ట తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ముప్పు! ఫొని పెను తుపాను ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలపై ప్రభావం చూపనుందని ఐఎండీ తెలిపింది. గురు, శుక్రవారాల్లో ఈ రెండు జిల్లాల్లో పెనుగాలుల ఉధృతితో పాటు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈనెల 4 వరకు తుపాను ప్రభావం ఉత్తరాంధ్రపై ఉంటుందని వివరించింది. అల్లకల్లోలంగా సముద్రం పెను తుపాను ప్రభావంతో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారుతుంది. కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడనున్నాయి. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని, తమ బోట్లను సురక్షితంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలని ఐఎండీ సూచించింది. మరోవైపు.. పెను తుపాను తీవ్రత దృష్ట్యా విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టుల్లో రెండో నంబరు, కాకినాడలో 4, గంగవరం పోర్టులో 5వ నంబరు ప్రమాద హెచ్చరికను జారీచేశారు. -
రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు
సాక్షి, హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌తోపాటు సమీపంలో ఉన్న విదర్భ, తెలంగాణ ప్రాంతాల్లో 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో ఛత్తీస్‌గఢ్ నుంచి కోస్తా కర్ణాటక వరకు తూర్పు విదర్భ, తెలంగాణ, మధ్య కర్ణాటక మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడింది. తద్వారా హిందూ మహాసముద్రం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములు, మెరుపులు, వడగండ్లు, గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలో శుక్రవారం సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. భద్రాచలం, ఖమ్మం, మెదక్ జిల్లాల్లో శుక్రవారం సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలి.. దక్షిణ ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతున్న నేపథ్యంలో రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదేశించారు. మార్కెట్ యార్డుల్లో కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే గోదాములకు తరలించాలని, మార్కెట్‌కు తరలివచ్చిన ధాన్యం తడిసిపోకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రాత్రివేళల్లో మార్కెట్ యార్డుల్లో విద్యుత్ సమస్యను ఎదుర్కొనేందుకు బ్యాటరీ లైట్లు అందుబాటులో పెట్టుకోవాలన్నారు. ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వసతి లోపాలు లేకుండా చూడాలని ఆదేశించారు. అకాల వర్షాల నేపథ్యంలో 2 శాఖల సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు.