
ముంబై: గులాబ్ తుపాను కల్లోలం ముగిసిందో లేదో మరో తుపాను తరుముకొస్తోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను క్రమంగా బలపడుతోంది. ఏడు రాష్ట్రాల్లో ఈ తుపాను తీవ్ర ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. గుజరాత్, బిహార్, పశ్చిమబెంగాల్, సిక్కిం, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
‘ఉత్తర అరేబియా సముద్రంలో ఏర్పడిన షహీన్ తుపాను మధ్య అరేబియా తీర ప్రాంతాలవైపు దూసుకొస్తోంది. ఆ తర్వాత అది తీవ్ర తుపానుగా మారి పాకిస్తాన్‌లో మాక్రన్ తీర ప్రాంతాన్ని తాకుతుంది. ఆ తర్వాత 36 గంటల్లో దిశ మార్చుకొని గల్ఫ్ ప్రాంతాలపై వెళ్లి ఆ తర్వాత బలహీనపడుతుంది’’అని వాతావరణ శాఖ వెల్లడించింది. గులాబ్ తుపాను ప్రభావం కారణంగా ఏర్పడిన షహీన్ తుపానుతో ఏడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment